చిత్రం: కన్నప్ప (2025) సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ నటీనటులు: విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్ నిర్మాత: మోహన్ బాబు విడుదల తేది: 27.06.2025
Songs List:
Love Song సాహిత్యం
చిత్రం: కన్నప్ప (2025) సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సాహిత్యం: శ్రీమణి గానం: LV రేవంత్, సాహితి చాగంటి సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితె ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా నీతో బ్రతకాలనీ సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను నీతో ఉంటె కలికాలమే చంపుతోంది చలికాలమై వెచ్చనైన చలిమంటే నీ ఊపిరంటా జారేటి జలపాతాల వీధిలో జంట స్నానాలు చేద్దామా స్వర్గాల దుర్గాల కోటలే మరి పరిపాలిద్దామా మరుజన్మలలో కాలాన్నే దోచేసెయ్ నా ఈ జన్మే అందించనా తాలలేని విరహాలతో ఊపిరాగిపోదా మరి రెప్పపాటు సమయం నువు నన్నే వీడావో రంగుల మల్లెలు జల్లేనే హరివిల్లులు మనకోసం వెన్నెల పందిరి అల్లెనే రాతిరేళల ఆకాశం కలగనడం ఆలస్యం నిజమైపోతుందే ఈ భాగ్యం మనదేనా సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం మెలితిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితె ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా నీతో బ్రతకాలనీ
శివా శివా శంకర పాట సాహిత్యం
చిత్రం: కన్నప్ప (2025) సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ ప్రకాష్ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తియ్యా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగామయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తియ్యా మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి నన్నింకొక నందిగా ముడెయ్యి నీ గాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారెంటా కొమ్మలు శివ శూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే యాడ చూడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్ల గాలులే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా ఆ ఆ శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా ఓ ఓ కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా అడివిమల్లె పూలదండ అలంకరించనా నా ఇంటీ చంటి బిడ్డవు నువ్వు ముపొద్దూనీతో నవ్వుల కొలువు దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా ఓయ్ శివయ్య ఇప్ప తేనే ఉంది విందు చేయనా నిను సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా ఆ ఆ ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మంచుకు విలవిల ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య ఆస్తిపాస్తులన్నీ నీయి కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయంగుందా ఈ పైనా నిన్ను వదిలేదుందా ఎట్టగట్టనో తల తిరిగి పొగసిన తాపమంతా కరిగి శివయ్య అని సిగముడిలో సెక్కుకుంటిరా పొమ్మని ఇదిలించినా కసురుతూ కరిగించినా శూలముతో పొడిచినా పాములు కరిపించినా నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధర హరహర హరహర హరహర హరహర హరనే శివనే హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర శంకరా ఆ ఆ ఆ శివా శంకరా ఆ ఆ ఆ ఆ శివా ఆ ఆ శివా ఆ ఆ ఆ

No comments
Post a Comment