Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Geetha Govindam (2018)

చిత్రం: గీత గోవింద (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రస్మిక మండన్న
దర్శకుడు: పరశురాం
నిర్మాత: బన్నీ వాసు
విడుదల తేది: 15.08.2018

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

పల్లవి:
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

చరణం: 1
ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశ

నీ యెదుట నిలబడు చనువే వీసా
అందుకొని గగణపు కొనలే చూసా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే...
ఇకపై తిరణాల్లే

చరణం: 2
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువ
జరిగినదడగవా

నా కధని తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవ
చెలిమిగ మెలగవ

నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం******  ******  ******
చిత్రం: గీత గోవింద (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
ఆ దేవ దేవుడే పంపగ
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్లలో కాంతులే
మా అమ్మలా మా కోసం మళ్లీ లాలీ పాడేనంట

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ
హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లో నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా...

సాంప్రదాయణి శుద్ధపద్మిణి
ప్రేమ శ్రావణి సర్వాణి (2)

చరణం: 1
యద చప్పుడు కదిలే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయ్యనా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా
కళలన్నీ కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలే నంగనాచి కూన
ముళ్ళోకాలు మింగే మూతి ముడుపుదాన
ఇంద్ర ధనుస్సు దాచి రెండు కళ్ళలోన
నిద్ర చెరిపేస్తావే అర్ధ రాతీరైనా
ఏ రాకాసి రాశో నీది
ఏ గడియల్లో పుట్టావే అయినా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ
నా ఉహల్లోన ఉరేగేది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

చరణం: 2
ఏకాంతలన్ని ఏకాంతం లేక
ఎకరువే పెట్టాయి ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగ లేక
కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక
కన్నీరొంటరాయె నిలువ నీడ లేక
ఎంత అదృష్టం నాదే నంటూ
పగ పట్టిందే నాపై జగమంతా...

నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ
నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా
మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటన కుంకుమమ్మ
ఓ వెయ్యేళ్ల ఆయుష్ అంటూ దివించండమ్మ

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలాPalli Balakrishna Sunday, July 15, 2018
Rx 100 (2018)

చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
నటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
విడుదల తేది: 13.07.2018Songs List:నిప్పై రగిలే పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య వర్మ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

నిప్పై రగిలే 
రెప్పలనిండా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిచరణ్ 

రెప్పలనిండా కలగనకుండా
వెన్నెల్ల వాన అనుకోకుండా
పెదవలనిండా మాటలవాన
అలలు యెగసెనులె
ఈ మట్టిలోన పూసె రోజ పూలె
రాగాలు కురిసె వెదురులె
ఇన్నాళ్ళుగ ఇన్నెళ్ళుగ
నాలొ లేవి మహిమలే

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులెఏ

పట్టు గుబురు దాటె సీతకోక చిలుకలా
మిట్ట కలలు దాటె అందమైన నిజముల
పట్టి లాగెనె పట్టు తీగ నన్నిల
యెమయ్యిందో నాకేమయ్యిందో

వద్దంటున్న నీ ముద్దె నన్ను
రమ్మంటుందె నను చంపేసిందే
రై రై రంగులువై ఎన్నాడు చూడనిదై
గుండెలో బొమ్మల్లె పూసె

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే

చంటి పాపలాగ చిందులేవొ వేస్తున్న
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న
వెండి వెన్నలై యెండలోనె కాస్తు వున్న
యేమయ్యిందో నాకెమయ్యిందో

రోజు చూసె నా దారులు కూడ
నేనె ఎవరొ మరి మరిచేసాయే
ఎన్నొ ఎన్నెన్నొ వింతలు నాలోన
యెన్నడు ఊహించనివేగా

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే
అదిరే హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: కార్తీక్ 

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత
ముదిరే ప్రణయం ముసిరే ప్రణయం
కరిగే పరువం నీ కౌగిట

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అందాల ఆడ సింహమా
చందనాల శిల్పమా
కోడె నాగు వేగమా
నన్నెచేరే నీవుగా
నీతో ఆడే ఆటలే
ముద్దుల సాగే వేటలే
పక్కని వీడి స్వర్గాలు దాటే ఎలా
మహా మహా ఆగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

చల్లరిపోతే మొహామ
మంటలాగా రేగుమ
కంట నీరై జారుమ
నరాల్లో నినదమ
నువ్వే నాతో లేనిదే
నాలోన ఏకం కానిదే
ఈలోకమంతా నా కంటికె సూన్యమే….
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనమే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమాపిల్లా రా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాగ్ కులకర్ణి

పల్లవి:
మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే

చేపకళ్ల రూపసివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలీ చెలీ రా..

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే...

మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా 
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

చరణం: 1
చిన్నాదాన ఓసి అందాల మైన
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగెనే
నీ పేరే పలికెనే నీలాగే కులికెనే
నిన్ను చేరగా

ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా

ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా..

చరణం: 2
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరుపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో

ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా
చూస్తూనే ఉన్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించన రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా

ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా...
రుధిరం మరిగి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : సిరశ్రీ 
గానం : దీప్తి పార్ధసారధి , సాయి చరణ్ 


రుధిరం మరిగి 
మనసుని పట్టి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : హరిచరణ్, ఉమానేహ

యే ఎవరె ఎవరె మనసుని పట్టి
దారం కట్టి ఎగరేసారె గాలిపటంలా
యే ఎవరె ఎవరె అడుగును పట్టి
చక్రం కట్టి నడిపించారె పూల రధంలా
ఎవరెవరొ కాదది నీ లోపల
దాక్కుండె టక్కరి నేనేగా
ఎక్కడని చూస్తావె నీ పక్కనె ఉన్నానుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

విన్నావ మైన గుండెల్లోనా హైన రాగలెన్నో
ఎగిరె టూన చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో
నీలొ రెగిన వేగం కల చెరిపె గాలుల రాగం
అలజడిలొ గువ్వల గొడవె నే మరిచేస
చూశావ మబ్బుల ఒల్లె రుద్దె
మెరుపుల సబ్బులు ఎన్నొ
ఎర్రని సూర్యుని తిలకం దిద్దె
సాయంకాలం కన్ను
ఎమైనా... ఇంతందం చెక్కిందెవరొ
చెబుతార తమరు
ఎవరెవరొ కాదది
నీలోపల తన్నుకు వచ్చె సంతోషం ఉలిగా
చక్కగ చెక్కెందుకు నె చెలిగా నేనున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

సెలయేరుకు పల్లం వైపె మల్లె
నడకలు నేర్పిందెవరు
నేలకు పచ్చని రంగే అద్ది
స్వచ్చత పంచిందెవరు
ఎందుకు మనకా గొడవ నీ మటైనా నువు వినవా
నా తియ్యని పెదవె తినవా ఓ అరనిమిషం
ఈ ప్రేమకు పేరె పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపె తీసిందెవరు
తొలి ముద్దిచ్చిందెవరు
ఎమైనా... నాలొ ఈ హైరానా తగ్గించెదెవరు
ఎవరెవరొ కాదది
నీలొపల హద్దులు దాటిన అల్లరినె త్వరగా
దారిలొ పెట్టెందుకు తోడల్లె నేన్నున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర
దినకు దిన పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : చైతన్య వర్మ 
గానం : వరం 

దినకు దిన 

Palli Balakrishna
Tej I Love U (2018)


చిత్రం: తేజ్  I Love You (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరన్, చిన్మయి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 2018

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా

పరుగిడు ఈ కాలాన
అడుగులు దరికాలేక
మనమెవరో ఏమో ఎందాక
పరవశమే ప్రతి రాక
చూపి ఓ శుభలేఖ
మన మధిలో ప్రేమే కలిగాక
మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా
నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో
అలలెగసే ఆసే ప్రేమంటా
మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా
పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Palli Balakrishna Wednesday, July 11, 2018
Srinivasa Kalyanam (2018)
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: నితిన్, రాశిఖన్నా
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 2018

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం


Palli Balakrishna

Most Recent

Default