Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Naa Peru Surya (2018)
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
నటీనటులు: అల్లు అర్జున్, అనుఇమాన్యుయేల్ , అర్జున్ సార్జా
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాతలు: శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు, కె.నాగబాబు
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
విడుదల తేది: 27.04.2018Songs List:ఓ సైనిక పాట సాహిత్యం

 
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విశాల్ దద్లాని

సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటినిండుగా
నిదురపోదురా నిదురపోదురా
నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే
జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవక ఓ సైనిక
పనిలో పరుగే తీరిక ఓ సైనిక
ప్రాణం అంత తేలిక ఓ సైనిక
పోరాటం నీకో వేడుక ఓ సైనిక

దేహంతో వెలిపోదే కథ
దేశంలా మిగులుతుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనిక
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనే
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది
నీ శక్తిని నమ్మింది

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనిక
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బ్రతుకే వందేమాతరం ఓ సైనిక
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక
i am lover also fighter also పాట సాహిత్యం

 
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శేఖర్ రవ్జియాని

అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే

గురిపెడుతూ చూపులతోనా నువు పేల్చకె బొమ్మ తుపాకీ
సరిహద్దులు తెంచుకురానా నే నీ జిందగీలోకీ
i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
నొ సెప్పి కూర్చున్న నీ హార్టు బుక్కు పై
love story మల్లి రాసె writer also
i am lover also fighter also

ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చేశావని వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చలో చెరో సగం తప్పుగా
మరో కతై కలుద్దామ కొత్తగా
flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో
patchup అవదానికెంత చాన్సో
i am lover also fighter also

ఆ ఇను ఇనవే హేయ్ హేయ్ మాట వినవే మంచి పిల్లవే
సిన్న గొడవే హేయ్ హేయ్ సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగదెంపులుగా ఎల్లిపోకే break up లోకీ
గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ

i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
సీకట్లొ దాక్కున్న నీలోని ప్రేమని
పట్టుబట్టి బయటపెట్టె lighter also
i am lover also fighterబ్యూటిఫుల్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం:‌ నాపేరు సూర్య (2018)
‌సం‌గీతం:‌ విశాల్ శేఖర్
సాహిత్యం:‌ సిరివెన్నెల
‌గానం:‌ అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి
‌
పెదవులు దాటని పదం పదంలో
కనులలొ దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికె స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ
ఏం జరగనుందో ఏమో ఈపైనా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్

నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో
నా తలపె వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మాయ మాయ పాట సాహిత్యం

 
మాయ మాయ ఎన్నియల్లో ఎన్నియల్లో పాట సాహిత్యం

 
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్ని నాళ్ళకి ఇరగ ఇరగ పాట సాహిత్యం

 
ఇరగ ఇరగ

Palli Balakrishna Wednesday, January 31, 2018
Inttelligent (2018)

చిత్రం: ఇంటిలిజెంట్ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: సాయిధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠి
కథ: ఆకుల శివ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: సి.కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: సి.కె. ఎంటర్ టైన్మెంట్
విడుదల తేది: 09.02.2018Songs List:Let's Do పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిలిజెంట్ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: సాకేత్, శ్రీకృష్ణ 

పింగ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ
పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ

కాసేపు జంపింగ్ కాసేపు తంపింగ్
కాసేపె తింకింగ్ ఈడ ఆడ హ్యంకింగ్
Signals Sending ఏ టైం అయినా ట్రెండింగ్
ఉండాలంటె లైఫ్ కి పర్ఫెక్త్ మీనింగ్
Let's Do Let's Do Let's Do it now
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్

కాసేపు తింకింగ్ కాసేపు దుంపింగ్
ఉండాలంటె లైఫ్ కి పర్ఫెక్త్ మీనింగ్

పింగ పింగ పింగ పింగ పింగ పింగ పింగా
పింగ పింగ పింగ పింగ పింగ పింగ పింగా
మొన్నట్లాగే ఈటింగ్ నిన్నట్లాగే స్లీపింగ్
ఎప్పట్లాగే రోమింగ్ ఎంతో ఎంతో బోరింగ్
తిప్పెయ్యాలి స్టీరింగ్ చూపించాలి చేరింగ్
చేసెయ్యాలి షేరింగ్ స్టాపే లేని స్టారింగ్
హ్యాండుని హ్యాందుతో చేసెయ్యాలి బొండింగ్
హార్టుని హార్టుతొ చేసెయ్ హగ్గింగ్

Let's Do
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

చూపుల్లోన రోకింగ్ నవ్వుల్లోన హ్యాకింగ్
మాటల్లోన ఫైరింగ్ చేతల్లోన చీరింగ్
నిన్నె నువ్వు మేకింగ్ నీకై నువ్వు ట్రాకింగ్
నీతో నువ్వు బ్లోకింగ్ అందరితో నువు బ్యాకింగ్
గాలి వర్షం ఫ్రీగ ఇంకమింగ్
సేవా బావన చేసెయ్ అవుట్ గోయింగ్

Let's Do
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్
పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్
సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్
అరె చమ్మక్కు చమ్మక్కు చాం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిలిజెంట్ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి.బి.చరణ్ , హరిణి ఇవటూరి

(ఈ పాటని చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా నుండి తీసుకొని రీమిక్స్ చేశారు. పాడినవారు: బాలు, చిత్ర. సంగీతం: ఇళయరాజా )

అరె చమ్మక్కు చమ్మక్కు చాం 
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం

అరె చమ్మక్కు చమ్మక్కు చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా

నాగ స్వరములా లాగిందయ్యా 
తీగ సొగసు చూడయ్యా
తాగు పొగరుతో రేగిందయ్యా 
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అందే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా కరారుగ 
కథ ముదరగ

ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
అరె చమ్మక్కు చమ్మక్కు చాం 
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా

చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం

అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా
ఈతముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీ కొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఓళ్ళో 
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా 
పదపదమని

అరె చమ్మక్కు చమ్మక్కు చాం 
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా 
హొయ్ అయ్యారే తస్సాదియ్యా

చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం
అరె చమ్మక్కు చక్కచాం చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యాఓ సెల్ ఫోనా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిలిజెంట్ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: మనీషా ఈరబత్తిని, జస్ప్రీత్ జాస్జ్

ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా
ఓ రింగ్ టోనా మేర దీవానా
నేనుంటున్నా నీ ఊహలలోనా

తల తల మెరిసే షేపే తడుముతు మత్తెక్కి పోనా
తకదిమి నడకల తచ్ స్క్రీన్ కిస్స్ లో లాక్ ఐపోనా
ట్రింగ్ టింగ్ కబురులలోనా ఎదలో కుదుపవనా
టిటి టింగ్ సౌండులలోనా అది ఇది పంచుకోనా

ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా

ఫేస్ బుక్ లో స్వీట్ నతింగ్స్ షేరింగ్
ట్విట్టర్ లొ టీ కాఫి సంతింగ్
ట్వంటి మెఘపిక్సల్ లొ స్టైలింగ్
ఊరించి ఉడికించి టీసింగ్
thirty second time లో నా heart teaser పంపనా
వెంటనే కొడితె రిప్లై 4G లొ వాలిపోనా
టెన్షన్ పెడితే నేనే 2G buffer అవనా

Viber లొ every time busy
we chat లొ every where కుషీ
line లోన lovely lovely meeting
whatsapp లొ naughty naughty fighting
Skype లొ స్వీటు స్వీటు మాటల్తొ పలకరించనా
తలుకుల బెలుకుల ఫీలింగ్ చూపుతొ పట్టుకోనా
కదలక కదలను చూపే ఎదలో పెట్టుకోనా

ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా
ఓ రింగ్ టోనా మేర దీవానా
నేనుంటున్నా నీ ఊహలలోనా
ఓ సెల్ ఫోనా
కల కల కళామందిర్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిలిజెంట్ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి, నకాష్ అజీజ్

కల కల కళామందిర్ చీర కట్టీ
కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ
ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి
రావె నట్టింట్లో కుడి కాలెట్టీ

కల కల కళామందిర్ చీర కట్టీ
కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ
ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి
రావె నట్టింట్లో కుడి కాలెట్టీ

నా చెక్కిలి పట్టి పట్టి పట్టి
ఇలా తొందర పెట్టి పెట్టి పెట్టి
నువ్ రమ్మన్నాకా నే రానంటానా
ఆహా నా ఒంటికి నలుగే పెట్టె
మైండ్ బ్లోయింగ్  మైండ్ బ్లోయింగ్ 
మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే
మైండ్ బ్లోయింగ్  మైండ్ బ్లోయింగ్ 
మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే

కల కల కళామందిర్ చీర కట్టీ
కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ
ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి
రావె నట్టింట్లో కుడి కాలెట్టీ

పాపిట్లొ పెడతా కుంకాన్నీ
పాదాల కవుతా పారానీ
నీ మనసుకవుతా యువ రాణీ
నీకిచ్చుకుంటా హృదయాన్ని
నీకు తాలిబొట్టు కదతా
నీకు కాలి మెట్టెలెడతా
నీ చీరంచుకు తలొంచుతు తరించి పోతా
పరువాన్ని మూటగడతా
నీకిచ్చి కట్టబెడతా
అరె ఆ పైన చూద్దాం మిగతా

మైండ్ బ్లోయింగ్  మైండ్ బ్లోయింగ్ 
మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే
మైండ్ బ్లోయింగ్  మైండ్ బ్లోయింగ్ 
మైండ్ బ్లోయింగ్ కులుకు చూస్తే

కల కల కళామందిర్ చీర కట్టీ
కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ
ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి
రావె నట్టింట్లో కుడి కాలెట్టీ

Palli Balakrishna
Achari America Yatra (2018)చిత్రం: ఆచారి అమెరికా యాత్ర  (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: మంచు విష్ణువర్ధన్ , ప్రాగ్యా జైస్వాల్
కథ, మాటలు ( డైలాగ్స్ ): డార్లింగ్ స్వామి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు , వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రఫీ: ఆర్.సిద్దార్ధ్
ఎడిటర్:
బ్యానర్:
విడుదల తేది: 16.03.2018

ఏడు కొండల స్వామి నువ్విట్ట చేసావేమి
నీ దేశం కాని దేఅం లోనా మాకీ కస్టాలేమీ
అర్చన చేసె మాపై నీ కక్షలు కట్టడమేమి
నెత్తిన ఒక్కటి ముట్టక పోతే నిద్దర పట్టద స్వామి
మా లైఫుకి చిల్లు మరి నీకేమొ త్రిల్లు
పగబట్టి పట్ట పగలు చుక్కలు చూపించావ్
డాలర్స్ యే నిల్లు మండుతోంది ఒల్లు
తలరాతలు తలకిందులు ఎందుకు చేసెశావూ
ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

come to me baby.. get to me Truly..
lets get little higher
you mine so truly..
ఓ లైల.. లైల..
ఓ లైల.. లైల..
ఓ లైల.. లైల..లైలా

మైయామి బీచుల్లొ..
మేం.. హాటూ పాపలతో..
మేము ఇంగ్లిష్ ముద్దులు కుప్పలు తెప్పలు expecత్ చెసాము
మీ ప్తతీ స్టాచ్యు తో ఓ సెల్ఫీ దిగేసి
మా facebook-లొ పెట్టెద్దాం అని కలలు కన్నాం రో…
అరె ఆ దేవుడు గ్రేటు యహ మార్చును మన ఫేటూ
వాడెవరికెప్పుడు ఏం చేస్తాడొ అంతా సీక్రెట్టూ
అరె వేస్తాడు వేటు పొడిచాడు పోటు
శని లాడేస్తుందె శని గ్రహం పనేం లేదట్టు

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం:

అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

ఊపిరిది ఉన్నది నీకోసం
దేహమిది ఉన్నది నీకోసం
సాక్షమదిగో నీలాకాశం
జన్మలెన్నైనా నీకోసం
కొవెలై నిలిచే అవకాశం
దేవతై ఇవ్వవె నా కోసం

నీలో నువ్వే నాలో నువ్వే
అనువనువునా పొంగే ప్రేమయ్యావే
ఒక్క చూపుతో చంపేస్తావే
చిరునవ్వుతో మరలా బ్రతికిస్తావే
అరెరె ఏమందమే ఎంతందమే
ఈ భూమికే నువ్వందమే
వందనాలు నిను చేసిన ఆ చేతులకీ
ఓ నా ప్రేమకు రూపం నువ్వే
నా కోసం పుట్టవే వరమల్లే వచ్చాశావే నన్నే వెతికీ

చెలియా చెలియా....
అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

ఊపిరిది ఉన్నది నీకోసం
దేహమిది ఉన్నది నీకోసం
సాక్షమదిగో నీలాకాశం
జన్మలెన్నైనా నీకోసం
కొవెలై నిలిచే అవకాశం
దేవతై ఇవ్వవె నా కోసం


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:

ఓ సిరి సిల్లా చీరకట్టినా
ఓ రేణుకా సిరి సిల్ల చీర కట్టిన రేణుకా
చుడరాదే చిట్టి పొట్టి చిట్టి పొట్టి చిలక లాంటి రేణుకా
నువ్వే నా మేనకా....ఓయె రేణుకా
ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి
రావా నా వెంటా రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా
వస్తావా నా వెంట రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా

కోటప్ప కొండకు వస్తావా రేణుకా
కొబరెల్లి జాతరకు పోదామే రేణుకా
బోనాల పండక్కి వైపెల్లె ఎల్లె రేణుకా
సమ్మక్క జాతరకు పోదామే రేణుకా
కమ్మన బైకెక్కి నువ్వొస్తే రేణుకో
హేయ్ రేణుకా వినవే...
నీకు పక్క పిన్ను కొనిపెడతా రేణుకో
నీకు బొట్టు బిల్ల కొనిపెడతా రేణుకా
నీకు వడ్డి కాసులేయిస్తా రేణుకో
నీకు జడ గంటలు జడ గంటలు కొనిప్ర్డతా రేణుకా
రేణుకా రేణుకా రేణుకా

సిరి సిల్లా
అబబ్బబ్బా సిరి సిల్లా
అరె అరె సిరి సిల్లా
అమ్మా సిరి సిల్లా

ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
సిరి సిల్లా
సిరి సిల్లా

పక్క పిన్నులిస్తననీ ...పక్కకు రమ్మంటావో
బొట్టు బిల్ల పెడతననీ...బుగ్గను గిల్లేస్తావో
గాజులు తొడుగుననై పిల్లడో
నను గాబర పెట్టెస్తవుగా పోరడా
జద గంటలు పెడతవనీ పిల్లడో
నువు నడుముని తదిమేస్తుంటవు పిల్లడా
పిల్లగో ఓ పిల్లగా పిల్లగో రేయ్ జరగరా జరా

సిరి సిల్లా
సిరి సిల్లా

బొద్దు బుగ్గలా పిల్ల నీ కోసం పడి చస్తే
నాకోసం నువ్వేమో ఇంతనన్న చెయ్యవాయె
గిట్లా గిట్లా రమ్మంటె రేణుకో
నువ్ గట్ల గట్ల పోతవేందె రేణుకా
నా సగబాగం ఇస్తనంటె రేణుకో
నువ్వు సతాయించి చంపుతావె రేణుకా
హేయ్ గుస్స గాకు ఓ పిల్లగా జల్దినా బైలెల్లి వస్తా
ఏడికైన నీతోనె దూము దాముగా వస్తా

కరీం నగరు
అరెరె కరీం నగరు
అరెరె కరీం నగరు
కరీం నగరు సెంటరులో పిల్లడో
నన్ను కళ్యానం చేసుకోర పిల్లడా
అరే లాయి లాయి లగ్గమాడి పిల్లడో
నన్ను గాయి గాయి చేసుకోర పోరడా
పిల్లడో ఓ పిల్లడా
పోరడొ దిల్ దడ దడా
దడ దడా

ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి
రావా నా వెంటా రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:


స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

ఏడు కొండలెక్కి కుర్చున్న దేవ దేవుడు
నా మాసులోని మాటలెప్పుడు వింటాడు
తన చల్లనైన చూపుతోటి దీవించేది ఎప్పుడో
అరె భక్తి తోటి మొక్కినోడ్ని మర్చిపోడు
వాడు కచ్చితంగ గుర్తుపెట్టు కుంటాడు
తన అంతులేని ప్రేమని కురిపిస్తాడు అమ్మడూ

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

కోలొ కోలన్న కోలు కోలాటం
ఏలొ ఎంకన్న స్వామి కళ్యానం
కళ్యానమేమొ కమనీయం
చూసె కన్నులకెంతొ రమనీయం
బుగ్గ చుక్క పెట్టుకుంది...అలువేలు మంగమ్మ
సిగ్గు మొగ్గలవుతుందీ...పధ్మావతమ్మా
అంగరంగ వైభవంగా అంతులేని సంభరంగా
జరుగున్న పెళ్ళీకి శ్రీరస్తు శుభమస్తు అభిగ్నమస్తూ

కోలొ కోలన్న కోలు
కోలొ కోలన్న కోలు

నీకల్లనేమొ కలువలుగా
పూఇంచి పూజలు జరిపాకా
పరవసించి అడిగిన వన్నీ ప్రసాదించడా
ప్రదక్షనాలను చేసాకా
నీకు ప్రసన్న మవకుండ ఉంటాడా
సాష్టాంగమే పడిపోతున్నా చలనముండదే
పొర్లు దండాలెట్టెస్తున్నా కనికరించడే
హేయ్ పైకి చూస్తె రాయిలాగ ఉంటాడు
కాని వాడి మనసు బండరాయి కానె కాదు
నిన్ను గుండెలోన పెట్టుకొని దాచుకుంటాడు దేవుడూ

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

Palli Balakrishna Tuesday, January 30, 2018
Yevade Subramanyam (2015)చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం: రధన్ ,  ఇళయరాజా
నటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: స్వప్న సినిమా
విడుదల తేది: 21.03.2015


చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సెంథిల్ , రిహిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా లేదుకదా
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటొ లాగుతుందా
పదనీ తప్పించుకోలేనని తోచెట్టు చేస్తుందా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ
తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా
దారులు సరి అయినా వేరె తీరం చేరేనా
నడకలు నావేనా నడిచేది నేనేనా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఇంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో
అయినా ఏమైనా ఎద నా చెయి జారేనే
ఇపుడు ఏ నాడు ప్రేమె నేరం కానందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటుంటె

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా


*******   ******   *******


చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , రామి

అద్దంలో నిను చూసుకో
నిన్నే నువ్ ప్రశ్నించుకో
నువ్వెవరో తెలుసుకో
who are you
sun of శివ కైలాసం
my name is సుబ్రహ్మణ్యం
బిసినెస్ హా మేరా కాం
all around నాదే దూం దాం
వేగం నా వేదాంతం
గెలవడమే నా సిద్దాంతం
now you know who i am

no no no no no no no నువ్వు నువ్వు కాదు
వెనక్నే ఏ జవాబు రాదు
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు
కంపడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ

మల్టి క్రోర్ కంపెనీకి ఒక్క ఓనర్ నీ
నాకీ అర్దం లేని క్వస్చిన్స్ యెందుకనీ
ఆల్వేస్ నేనె నంబర్ వన్ అవ్వాలనీ
డే అండ్ నైట్ పరుగే పరుగు నా పనీ
అయ్యో రామ బ్రేకె లేని నీ జర్నీ
రయ్యంటుందీ హార్టే లేదనీ
ఏదో చోట కట్టెయ్యండె గుర్రాన్ని
నీకే నువ్వు తెలిసేదెప్పుడనీ
నా రూట్ ఏంటొ వేటేంటొ చేరేటి హైటేంటొ
అన్ని తెలిసిన సూపర్ సుబ్బునీ

ఎవ్రీ టైం నన్నే నేరు ఓడిస్తూ ఉంటా
పై పై ఎత్తుల్లోకి ఎదిగిపోతుంటా
రైటొ రాంగొ నాకు అర్దం అక్కర్లేదంటా
కోరుకుంది పొందటం నా బర్తు రైటంటా
ఆకాశంలో జంద పాతె తొందర్లో
పేరు మూలం మిస్స్ అయితే ఎట్టా
నక్షత్రాల్ని బేరం చేసె సందట్లో
గాల్లో మేడలు కట్ట ఓ తంటా
నేణేచోట ఉన్నన్నో ఆ చోటె నాకిష్టం
ఎక్కడినుచి వస్తే ఏంటంటా

నొ నొ నొ నొ నొ నొ నొ నువ్వు నువ్వు కాదు
వెనక్నే ఏ జవాబు రాదు
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు
కంపడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ


*******   ******   *******


చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: వశిష్ట
గానం: నిఖిత శర్మ

జంతర్ మంతర్ జాదులన్ని చేసెయ్ నా నీ పైనా
సారో గీరో జీరో గారంటే మార్చేనా
సండే మండే రోజేదైనా తమాషా కరోనా
లైఫ్ ఈస్ ఫుల్ల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజోయ్ చేయ్ అంటున్నా
చిన్ని లైఫు లోన గోలు మాలు గోల లన్ని ఎందుకో ఎందుకో
చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసి నువ్వు అందుకో అందుకో
పుట్టె ముందు లేవు టెన్షన్సే
లైట్ తీసుకుంటె అన్ని బిందాసే
పల్ పల్కుషీని నువ్ పంచుకుంటె
ఎవ్రిడే కాద కల్లముందు కలర్ఫుల్ డే

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా

నచ్చినట్టుంటె నువ్వే చుట్టు ఉండే ఈ లోకం
ఒక్కటె నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే
చెయ్యి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం
నీకు తోడవుతూ నీడగా ఉంటూ వీడిపోదంతే
ఏక్ దోన్ తీన్ చాల్
పుల్ బుస్ హె యార్
life is too short so think with your heart
పంచేస్తు ప్యార్ సాగోయ్ దిల్ దార్
ఓ చెరిగి పోని ఘాపకానివోయ్ మిగలాలిగా

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా*******   ******   *******


చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిణి

ఓ కలా ఓ కలా చూడకే అలా
హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా
మరో ప్రపంచమే అలా వరించగా
పరుగులు తీసే నా ఎదకీ నిలకద నేర్పేదెలా
కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా

కనులె వెతికే వెలుతురు నీదనీ
ఇపుడే ఇపుడే తెలిసినదీ
తననే పిలిచే పిలుపులు నీవనీ
వయసిపుడే తేల్చుకున్నదీ
నిదురకి చేరితే జోల నువే
మెలుకువ వచ్చినా ఎదుట నువే
ఇక నిను వీడటం ఏలా అదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా

ఎడమ కుడిలో ఎవరూ లేరనీ
ఒనికే పెదవే పలికినదీ
నిజమే పలికే చొరవని ఇచ్చేయ్మనీ
నసిగినదీ నాంచకన్నదీ
మనసుకి చేరువా ప్రతి ఒకరూ
మనకిన దూరమే అని బెదురూ
మరి నిను చేరడం ఎలా అదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా


*******   ******   *******


చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహిత్ చౌహన్

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం

Palli Balakrishna
Pratheekaaram (1992)


చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, యస్.పి.శైలజ, జి. ఆనంద్
నటీనటులు: శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, శారద, విజయశాంతి, శ్రీగంగ (తెరపరిచయం)
మాటలు ( డైలాగ్స్ ): మోహన్ దాస్
మూలకథ: కొచ్చిన్ అనిఫా
స్క్రిప్ట్: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: ఆలపాటి రంగారావు
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే
ఎడిటర్: వి.అంకిరెడ్డి
బ్యానర్: శ్రీనాథ్ మూవీస్
విడుదల తేది: 1992

(శోభన్ బాబు ద్విపాత్రాభినయనం)Songs List:నింగి నీలాల సాక్షి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా 
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి 
నేనంటే నీవని మరచి 

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 

చరణం: 1
వయసు వచ్చి వేసింది 
సొగసు పందిరి నీకోసం 
వయసు వచ్చి వేసింది 
సొగసు పందిరి నీకోసం 
 మనసు నీకే కట్టింది 
మమత అన్న మాంగళ్యం
కాళ్ళు కడిగే సెలయేళ్ళు
విందు చేసే మావిళ్ళు
చాటు ముద్దుల సాక్షిగా
అవి పాత గురుతుల సాక్షిగా

చరణం: 2
ఇంద్రధనస్సే పంపింది 
పెళ్లినాటికి మధుపర్కం 
ఇంద్రధనస్సే పంపింది 
పెళ్లినాటికి మధుపర్కం 
 రామచిలకే పలికింది 
ప్రేమ పలుకుల శుభమంత్రం
ఎన్నికలలకు కావిళ్ళు
ఎన్ని తపనల కౌగిళ్ళు
రేపు మాపుల సాక్షిగా 
అవి రేపు ఆశల సాక్షిగా

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా 
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి 
నేనంటే నీవని మరచి 

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 

తూనీగా నీ నడుమ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

తూనీగా నీ నడుము ఆకాశంలో చుక్కల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

ఆకాశంలో చుక్కల్లారా 
కసాయి కాల నాగు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

కసాయి కాల నాగు అంబూ చిందరవందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

అంబూ చిందరవందర గందరగోళంలో 
అంబూ చిచ్చరపిడుగుల తప్పుడు తాళంలో
నీ జాతకం నే రాయన నా నాటకం నేనాడన

Palli Balakrishna Monday, January 29, 2018
Andala Raasi (1980)చిత్రం: అందాల రాశి (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: రాజ్ కుమార్ , రతి అగ్నిహోత్రి (నూతన తారలు)
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.వి.భక్త
నిర్మాత: కె.ఆర్.వి.భక్త
సినిమాటోగ్రఫీ: కె.ఆర్.వి.భక్త
ఎడిటర్:
బ్యానర్: బిన్నీ ఇంటర్ నేషనల్
విడుదల తేది: 1980

పల్లవి:
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

చరణం: 1
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..§ ≥
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...

పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

చరణం: 2
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...

కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...

హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ....

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు.

Palli Balakrishna
Veerabhadra (2006)


చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ , తనుశ్రీదత్తా, సదా
మాటలు ( డైలాగ్స్ ): మధురూరి రాజా
కథ, స్క్రీన్ ప్లే, ఆంజనేయ పుస్పానంద్
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాతలు: అంబిక కృష్ణ , అంబిక రామాంజనేయులు
సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్
ఎడిటర్: గౌతంరాజు
బ్యానర్: అంబికా ప్రొడక్షన్స్
విడుదల తేది: 29.04.2006

పల్లవి:
అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 1
నీ ఒంటి వంపుల్లో ఏమిటుందో
నాకంటి చూపులతొ కొలిచా ఓ..
నీ కొంటి ఊహల్లో చేరుకుంటూ
పడకింటి తలుపుల్ని తెరిచా ఓ..
బాగున్నదే మరి మన్మధ మాసం వడ్డించుకో వడిగా
గుచ్చేయదా తమ అల్లరి మీసం నా బుగ్గపై అలా ఇలా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 2
కొంగేమొ కంగారుపడుతోంది
ఎన్నాళ్ళు దాచేది విరహం ఓ..
ఓయబ్బో నా గుండె లాగుతోంది
నీ పొంగాలు బంగారు పరువం ఓ..
నాయుడు బావో నా ఉబలాటం తగ్గించవా త్వరగా
మరదలు పిల్లా నా సహకారం అందించుతా పరా పరా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా హ హ హ
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు హ హ హా..
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

Palli Balakrishna Wednesday, January 24, 2018
Parama Veera Chakra (2011)


చిత్రం: పరమవీరచక్ర (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యస్.పి.బాలు, సునీత
నటీనటులు: బాలకృష్ణ , అమేషా పటేల్, షీలా, నేహా ధూపియా
కథ, మాటలు ( డైలాగ్స్ ), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: సి.కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: రమణ రాజు
ఎడిటర్: గౌతంరాజు
బ్యానర్: తేజా సినిమా
విడుదల తేది: 12.01.2011
పల్లవి:
మిత్ర మిత్రా విశ్వామిత్రా
మిత్ర మిత్రా విశ్వామిత్రా
పుత్ర పుత్రా క్షత్రియ పుత్రా
నేనేరా అప్సర గోత్ర
నా అందం ఒక అక్షయ పాత్ర
ఘన మర్యాదలందుకోర ఘంబిర గాత్ర
మంత్ర మంత్రా జంతర్ మంత్రా
తంత్ర తంత్రా తుంటరి తంత్రా
అంతిదిగా ఎందుకు ఆత్ర
నేనందిస్తా మన్మధ మాత్ర
అధరపు చక్రాలతోనె చేస్తా అంగాంగ యాత్ర

చరణం: 1
వత్సాయన సూత్ర వల్లించటం కాదు ఉగ్రనేత్ర
వచ్చి వాటేసి నిరూపించాలి నిత్యాగ్ని హోత్ర
నీ సొంపుల క్షేత్ర సుతిమెత్తగుంటుంది ఓ సుచిత్ర
సూరుడే అయినా స్తుతించాలి శృంగార స్తోత్ర
వలపు కొమ్మని పలకరించించి క్షేత్ర
మగువ జంటలో వేయరా మన్మధ పాత్ర
రతివై వచ్చాక రాత్రికి పున్నాగ యాత్ర

మిత్ర మిత్రా విశ్వామిత్రా
తంత్ర తంత్రా తుంటరి తంత్రా

చరణం: 2
ఓ చుంబన యంత్ర నీ ధాటికే నేను గత్ర గత్ర
పట్టు పడుతుంటే భలే గుందయ్య నీ పౌరుష పాత్ర
కాబోవు కళత్ర తళుకుల్లో దాచావు తాళపత్ర
ప్రతులు చదివాక ప్రయోగంలేని జన్మే ఓ మోస్త్ర
బిడియమొద్దంది ఇపుడు నా సోకు శాస్త్ర
సొగసునే తడిమి నేర్పరా కామసూత్ర
ఇక ఏమైనా కాచుకో సంధించా బ్రహ్మాస్త్ర


Palli Balakrishna
Ramudu Bheemudu (1988)చిత్రం: రాముడు భీముడు (1988)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: బాలకృష్ణ , రాధ సుహాసిని
కథ: వి.సి.గుహనాథన్
మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: సి. హెచ్. వి.వి.సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: సత్యం సినీ ఎంటర్ ప్రైజస్
విడుదల తేది: 17.11.1988

అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
నువ్వే నా బజ్జి నేనే నీ బుజ్జి
రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా
రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా

అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
నేనే రాంపండు నువ్వే జాంపండు
ఇంటా బయట ప్రేమించాక రోడ్డే ఎక్కాల
ఫోజే చూసి పోలీసొళ్ళు బోల్తా కొట్టాలా


చరణం: 1
పేచీ లేని ప్రేమ ఎహె పూచీ నాదే భామ
సోకుల అబ్బాడి సొమ్మా  నా కిత్తడి లేదే భామా
అరె నేనేం కాదన్నాన లేదు పొమ్మన్నానా
సొగసే నచ్చాక మనసే ఇచ్చాలే
వరసే గిచ్చాక వలపై వచ్చాలే
పదవే పొదరింటికే రాత్రి తెల్లార్లు రగడే లెమ్మంటా
రాస లీలల్లో పగలే లేదంటా

అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో
నేనే రాంపండు నువ్వే జాంపండు
రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా
రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా

చరణం: 2
అమ్మా నాన్న ఆట అహ నేడే ఆడాలంటా
బిల్లంగోడు పాట ఓయ్ నాతో పాడాలంటా
అరె నేనేం వద్దన్నాన ఇస్తే కాదన్నాన
అసలే చలికాలం మతులే పోతుంటే
కసిగా నా గాళం నీకే వేస్తుంటే
పదరా సొద ఏటికి మూడు నిద్దర్లు నీతో తీస్తాలే
రేయి రాత్రుళ్ళు నీతో

Palli Balakrishna
Bharatamlo Bala Chandrudu (1988)చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ, జయసుధ
కథ: వియత్నాం వీడు సుందరం
మాటలు ( డైలాగ్స్ ): గణేష్ పాత్రో
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
సమర్పణ: మురళీమోహన్ మాగంటి
నిర్మాత: దుగ్గిరాల కిషోర్
సినిమాటోగ్రఫీ: కె.యస్.హరి
ఎడిటర్: సురేష్ టాటా
బ్యానర్: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.10.1988

పల్లవి:
చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో

చరణం: 1
చెయ్యేస్తే వణికే రెక్క దాని సోకంత పైసూరెక్క
ఎక్కింది తలకే తిక్క మల్లె మంచాన కోరింది పక్క
మారాకు చీరెట్టి పూరేకు రైకెట్టి మర్యాద చేస్తానులే
కొంగిట్లో ముద్దెట్టి  కౌగిట్లో కన్నెట్టి కవ్వించు కుంటానులే
నీ చెయ్యే కలిసిన చెలిమికి పండుగ ముందే ఉందిలే

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో

చరణం: 2
ఎన్నెన్ని నేర్చావబ్బా నిన్ను కన్నోడు ఎవడోయబ్బా
ఈడేరి పుట్టావమ్మా నిన్ను ఏ తల్లి కందోయమ్మా
లేతాకు నాజూకు నీరల్ల తీసేసి తాంబూలమిస్తానులే
నీ కుర్రబుగ్గల్లో నా ఎర్ర ముద్దిచ్చి రోజాలు కోస్తానులే
నా తల్లో చండును తాకే ముచ్చట ముందే ఉందిలే

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో

Palli Balakrishna
Bhargava Ramudu (1987)
చిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి, మందాకిని
కథ: కొమ్మనపల్లి గణపతి రావు
మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యస్.జయరామారావు
సినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: జయ ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.01.1987

ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకురా పైకిక యాతన తపోధన
అద్వైతం బ్రహ్మ అహమేవ బ్రహ్మ
నా జీవిత యజ్ఞంలో చేయను దుష్కర్మ
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ

చరణం: 1
ఇంతలు కన్నులు పుంతలు చూడగనేల
చూడని వింతల లోకం వింతలనే చూడనీరా
ధారాణ జపమంత్రాలకిది వేళా
మార్గము చూపవె మా గృహ సీమకు ఓ మందయాన
అంగాంగాలను అలుముకొనే ఆనంద యజ్ఞపు అగ్ని ఇది
తనువులు దనములిచ్చుకొనే మనువులు కోరే మార్గామిది
ఆ శ్రీహరి ఓ నారి మరునారి మాంపాహి
వీడగదె ఈ సంసారిని విలాసిని

ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ

చరణం: 2
మిన్నులనంటిన వెన్నెల పుట్టిన చోట
వలచి తనంతట వచ్చిన కాంతను వారించనేల
పుచ్చాలి క్షణ సౌఖ్యల పడనేల
వంచన చెల్లదు చంచల చిత్తుడనే కాను బాల
వైరాగ్యానికి నిచ్చెనలు పాండిత్యాలను మెచ్చితిలే
వారిజ నేత్రల కౌగిలికి వాహిజి భవులే మెచ్చిరిలే
చి పొగదే సుకుమారి సురనారి నీ దారి
చూపగదే ఇంటికి దారిని వరూధిని

ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ
చిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

అరె ఒయ్యారమా నీయెవ్వారమేమి 
దానంతు చూడాలి నేను
ఒయ్యారమా నీయెవ్వారమేమి 
దానంతు చూడాలి నేను
అందనీ అందమూ పొందనీ అనుభవం
చీరల పైట సిగ్గులపైట చిలిపిగ లాగేసేయ్

శృంగారమా నీ సయ్యాటలేమి
వాటేసి చూడాలి నేను
శృంగారమా నీ సయ్యాటలేమి
వాటేసి చూడాలి నేను
అందుకో అందము అందులో గంధము
మల్లెలవేల తెల్లని చీర మదువులు లాగేసేయ్

ముందున్న ఆ ముంతమామిళ్ళ తోట
రాసివ్వనా నీకు రసకేళిలో
యెనకున్న అలపాటి దిబ్బల్లతోపు
చేసేయెనసాగు చెలి పేరుతో

ఒప్పించు నన్ను మెప్పించు
ఉన్న వాటలెన్నో మళ్లీ మళ్లీ నాకూ చూపించూ
చాలవే ముడుపులు చూసుకో ఒడుపులు
రాతలు మాని చేతలకొస్తే రావే చినదాన

హేయ్ శృంగారమా నీ సయ్యాటలేమి 
వాటేసి చూడాలి నేను
అరెరె ఒయ్యారమా నీయెవ్వారమేమి
దానంతు చూడాలి నేను

మొటిమంటుకుంటున్న లోహాల సోకు
తడిమేయనకోడె తాపాలతో
చిగురేసుకుంటున్న మొగిలాకుముళ్లు
కసితీర్చన కన్నె అందాలతో

కవ్వించు కాస్త నవ్వించు
లేత అంటింతల్లో హాయెంతుందో 
నాకూ చూపించూ
చాలదీ పిలుపులు సందెలో వలపులు
ఆటలు మాని అక్కరకొస్తే రారమొనగాడ

అరె ఒయ్యారమా నీయెవ్వారమేమి 
దానంతు చూడాలి నేను
అందుకో అందము అందులో గంధము
అరె చీరల ఫైట సిగ్గుల ఫైట చిలిపిగ లాగేసేయ్

శృంగారమా నీ సయ్యాటలేమి 
వాటేసి చూడాలి నేనుచిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

దంతరికిట దింతరికిట దింతరికిటత
దింతరికిట దింతరికిట దింతరికిటత

మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
మామపక్క భామ చేర మంచం యేలగోలచేసే తుమ్మెద ఓ తుమ్మెద
అది చాటుమాటంట చెప్పేది కాదంట
తుమ్మెద ఓ తుమ్మెద మన్మథ ఓ మన్మథ

మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచే మన్మథ ఓ మన్మథ

తకథిమితోం తకథిమితోం తందాన తాన
తకథిమితోం తకథిమితోం తందాన తాన

పువ్వెట్టి కొటొద్దు ఓ మన్మథ 
పులకింత పుట్టుద్ది ఓ మన్మథ
ఆ బక్క నడుమట్ట తైతక్కమంటుంటే 
నా తిక్క రేగినాదిరో
నా కొంగు ముట్టోద్దు ఓ తుమ్మెద 
నా తేనే లాగొద్దు ఓ తుమ్మెద
తొలి ముద్దు పెడుతుంటే నా ముద్దబంతుల్లో గిలిగింత పుట్టినాదిరో
రెక్క విడిచిన పువ్వ రేగుతుందది గువ్వ
హైలో హైలెస్స పైలో పచ్చిస 
కసిగాలి వీస్తుంటే కౌగిల్లే దిక్కంట 
తుమ్మెద ఓ తుమ్మెద మన్మథ ఓ మన్మథ

మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగారి యేలవీచె మన్మథ ఓ మన్మథ

కోరస్: హోయ్ తందాన హోయ్ తందాన

నన్నవొడిసి పట్టాక ఓ మన్మథ 
సిగ్గిసిపెట్టాను ఓ మన్మథ
నా లేత చెక్కిళ్లు నీ చేత పడుతుంటే 
ఆ చుక్క పొడిచినాదిరో
నీ సొగసు ముట్టాక ఓ తుమ్మెద
నా వయసు పుట్టింది. ఓ తుమ్మెద
నీ గుట్టు గుమ్మాలు నేదాటిపోయాక 
గుబులెంతో తెలిసినాదిరో
మబ్బు విడిచిన ఎండ మల్లె పూవుల దండ
హైలో హైలెస్స చెయరా కులాస
పొలిమేర దాటాక పొదరిల్లె దిక్కంట 
మన్మథ ఓ మన్మథ
తుమ్మెద ఓ తుమ్మెద

మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
మామపక్క భామ చేర మంచం యేలగోలచేసే తుమ్మెద ఓ తుమ్మెద
అదిచాటుమాటంట చెప్పేది కాడంట
తుమ్మెద ఓ తుమ్మెద అ మన్మథ ఓ మన్మథచిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

కాల చక్రమున సూర్యగమనమిది 
కరిగిపోని నాట్యం
ఆగిపోనిదిది ఆపలేనిదిది 
ఆరమైన నాట్యం

ఆ... ఆ...
కాలమేతాళమై శీలమే ప్రాణమై
భార్గవ రాముని ఆగమనానికి
స్వాగతమిచ్చే నాట్యం
పాపపు భారం పెరిగినవేల 
పడతి పుడమి నాట్యం

ఉరుములా ఉరికి రా
పిడుగులా కదలిరా
ఉరుములా ఉరికి రా
పిడుగులా కదలిరా

వంచన చేసిన అసురులనే
ప్రతివంచన చేసిన మోహిని విలాసం
శక్తి శూల ఆ సంఘమానికే
నాంది పలికేనే నీ నాట్యం

పంచభూతములు ప్రకటించిన
ప్రకృతి మాపరాట్యం
చేసే నాట్యం తీసే రాగం 
అందుకో నీ ఆహ్వానమే
అందాలన్నీ నీ ముందుంచి 
అందిచమా ఓ క్షణం

ఉరుములా ఉరికి రా
పిడుగులా కదలిరా

రంభలు చూపని భంగిమలే
ప్రతి అంగము లోపల రేపిన వినోదం
మందహాసముల మల్లెమాలికల
నీడలో నాగ బంధం

జన్మజన్మలకు శాపకారణం
ఆడదాని శోకం
ఆగని నాట్యం అంతిమ గీతం 
వేచుంది పైకాలమే
ఒళ్లో కొంత ఉయ్యాలూపి 
చూపించమా స్వర్గమే

ఉరుములా ఉరికిరా
పిడుగులా కదలిరా

అఅఆ... అఅఆ...

సగరిగ సగరిగ సగరిగ సగరిగ
గపమప గపమప గపమప గపమప
మపద మపద మపద మపద
దనిస దనిస దనిస దనిస ఆ.. ఆ..చిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

అల్లుకోరా అందగాడా
అల్లుడల్లే అందమంతా
ఈడుతో ఈలగా ఆడుకో లీలగా
జంట ఉయ్యాలగా

అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ

అల్లరైతే ఎలాగమ్మా?
చల్లబడితే మంచిదమ్మా
కొత్తలో వింతగా కొంగు కౌవ్వింతగా
కమ్ముకో మెత్తగా...

అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ

చం ఛమ చం చం - నీటి మడుగుల్లో
చం ఛమ చం చం - చాటు అడుగుల్లో
చం ఛమ చం చం - ప్రేమ చినుకుల్లో
చం ఛమ చం చం - తేనె వలపుల్లో
తడి తాళం వేశేసుకోరా....

చం ఛమ చం చం - సోపు నురగల్లో
చం ఛమ చం చం - సోకు వరదల్లో
చం ఛమ చం చం - వేడి తరగల్లో
చం ఛమ చం చం - ఈడు బుడగల్లో
చలిరాగమే పాడుకోవే....

తీసుకో జంటగా ఈడుతో కొంటెగా
జోడుగా జోరుగా...

అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ

అల్లరైతే ఎలాగమ్మా?
అల్లుకోరా అందగాడా

లలలలా..లా..
లలలలా..లా..
లలలలాల

చం ఛమ చం చం - కొత్త చొరవక్లో
చం ఛమ చం చం - కోటి గొడవల్లో
చం ఛమ చం చం - తీపి చనువుల్లో
చం ఛమ చం చం - జంట దరువుల్లో
పెన వేసుకుంటాను నిన్నే....

చం ఛమ చం చం - చెంప ఎరుపుల్లో
చంఛమ చం చం - చెంగు విడుపుల్లో
అరె చం ఛమ చం చం - చేతి ఒడుపుల్లో
చం ఛమ చం చం - సిగ్గు పిలుపుల్లో
పదవిచ్చుకుంటాను నీకే....

రెచ్చిపో... రేగిపో...
నచ్చితే ఓడిపో...
పక్కలో దిండులా...

అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ

అల్లుకోరా అందగాడా
అల్లరైతే ఎలాగమ్మా?
ఈడుతో ఈలగా ఆడుకో లీలగా
కమ్ముకో మెత్తగా.....

అబ్బ - అబ్బ , అమ్మ - అమ్మ
అబ్బ - అబ్బ , అమ్మ - అమ్మచిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం
పిలిచే సన్నాయిలా వలపే అమ్మాయిలా
నీ కొమ్మకే కోయిలై చేరనా

మన్మథనామ సంవత్సరం
నా మనసే పాడెను నాగ స్వరం
విరిసే ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా
నీ రెమ్మకే తుమ్మెదై చేరనా

అందం చందం గంధాలుగా చల్లనా
నాలో వయ్యారపు లేత ఉయ్యాలలను
నీ కోసమే ఊపనా

మోహం తాళం నీ ముద్దుతో పెంచనా
జారే నీ కొంగున యేరై ఉప్పొంగిన 
పరువాలలో తేలనా

చెక్కిళి కవితలు రాశేయి
కౌగిలి తలుపులు తీసేయి
నా తీగలో పువ్వులే రాలగా

మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం

క్షేమం లాభం కౌగిల్లలో పొందనా
నీ మేని వొంపుల నీలోని సొంపుల 
కవ్వింపులో కాగనా

దేహం ప్రాణం నీ పేర రాసివ్వనా
నీవంటుకోనిది నీవంతుకానిది 
నే ఒంటికంటించనా

చెప్పకు చప్పున చేసేయి
తప్పని మాటకు మనసియ్యి
నా గాలి నీ ఊపిరై ఆడగా

మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం
విరిసే ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా
నీ కొమ్మకే కోయిలై ఉండనా


Palli Balakrishna
Kick 2 (2015)చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: బాంబే బోలే
గానం: బాంబే బోలే
నటీనటులు: రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.08.2015

మమ్మీ కడుపులలో నాకు కంఫర్ట్ లేదాని
లిజన్ టు మై వర్డ్స్ డ్యూడ్
నేను ఏడూ నెల్లకే బయటకు తన్నుకువచ్చాను
దిస్ ఈజ్ మై ఆటిట్యూడ్

మమ్మీ కడుపులలో నాకు కంఫర్ట్ లేదాని
లిజన్ టు మై వర్డ్స్ డ్యూడ్
నేను ఏడూ నెల్లకే బయటకు తన్నుకువచ్చాను
దిస్ ఈజ్ మై ఆటిట్యూడ్

నన్ను ఢిల్లీ కి రాజుని చేసి కిరీటం పెట్టినా
నా దిల్లోని కంఫర్ట్కె దాసోహం నేనే డ్యూడ్
అరె కంఫర్ట్ టె రా నా కిక్ అది ఉన్నోడేరా యమ లక్
ఎవరికి వారే కంఫర్ట్ గుంటే ఉండదు ఏ చిక్కు

అరె అల్లో నేరేడల్లో నా కంఫర్ట్ కే జై బోలో
మేరే అందనామే డాన్స్ ఎయ్యారా నాతో డ్యూడ్
మై నేమ్ ఈజ్ రాబిన్ హుడ్ నను గెలికితే ఉండదు ఫుడ్
కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్

మమ్మీ కడుపులలో నాకు
మై మమ్మీ కడుపులలో నాకు
మమ్మీ కడుపులలో నాకు కంఫర్ట్ లేదాని
లిజన్ టు మై వర్డ్స్ డ్యూడ్
నేను ఏడూ నెల్లకే బయటకు తన్నుకువచ్చాను
దిస్ ఈజ్ మై ఆటిట్యూడ్

ఓ పక్కోడి మీద నీకు థింకింగ్ స్టార్ట్ అయ్యిందంటే
నీ సెల్ఫ్ కంఫర్ట్ లోన కిక్ దొబ్బినట్టే

ఓ నీది నువ్వు చూసుకుంటే లోకం పర్ఫెక్ట్ ఉన్నట్టే
కంఫర్ట్ కాదని వెళితే కొంప మునిగినట్టే
ఓ సీతమ్మ గీత దాటితే రామాయణం ఏమైంది
కంఫర్ట్ కె కంచి దాటితే కార్మాయణం స్టార్ట్ అయ్యిద్ది
నీ కంఫర్ట్ లో నువ్వుంటే పక్కోడికి ప్రాబ్లెమ్ లేదు డ్యూడ్

అరె అల్లో నేరేడల్లో నా కంఫర్ట్ కే జై బోలో
మేరే అందనామే డాన్స్ ఎయ్యారా నాతో డ్యూడ్
మై నేమ్ ఈజ్ రాబిన్ హుడ్ నను గెలికితే ఉండదు ఫుడ్
కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్

మమ్మీ కడుపులలో నాకు
మై మమ్మీ కడుపులలో నాకు
మమ్మీ కడుపులలో నాకు కంఫర్ట్ లేదాని
లిజన్ టు మి వర్డ్స్ డ్యూడ్
నేను ఏడూ నెల్లకే బయటకు తన్నుకువచ్చాను
దట్ ఈజ్ మై ఆటిట్యూడ్


Palli Balakrishna Monday, January 22, 2018
Touch Chesi Chudu (2018)చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: JAM 8 (Apprentice band of Pritam)
నటీనటులు: రవితేజ , రాశిఖన్నా ,సీరత్ కపూర్
కథ: వక్కంతం వంశీ
మాటలు ( డైలాగ్స్ ): శ్రీనివాస రెడ్డి, రవిరెడ్డి, కేశవ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీమోహన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్ , చోటా. కె.నాయుడు
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేది: 02.02.2018


చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: రెహ్మాన్
గానం: బెన్నీ దయాల్ , నీతి మోహన్

మనసా మనసా విన్నా నీ పదనిస
తెలుసా తెలుసా నువ్వే నా తొలి నిషా
నీ పెదవి దాటి నా ఎదను మీటి
నన్నల్లుకుంది నవ్వేలే
నీ కలలు కోటి నా కనులనంటి
నా లోకమంత నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నేనుకూడా నువ్వేలే

చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా

మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్య

హో రంగుల్లో పొంగుల్లో తారంగం అడింది నా ఊపిరి
నీవైపు వస్తూనే సారంగి మోగింది లోలో మరి
ఓ ఓ ఓ...
నీ ఒంపుల్లోని ఎన్నో మెరుపుల్ని
నే చూస్తున్నానే కల్లే మూయలేక
నీ కన్నుల్లోని ఎన్నో మాటల్ని
నే వింటున్నానే బల్లో పాఠం లాగ
ఇకపై ఏమీ చెయ్యాలో నేర్పించవే సరిగా


చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా

మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్య

నా చిన్ని ప్రాణంలో నిప్పేదో రేగింది ఆర్పేదెలా
నీ కొంటె కోణంలో ముప్పేదో దాగుంది ఆపేదెలా

ఓ ఓ ఓ..
ఆకాశమంత అందం నీకుందే
భూకంపమై నన్ను ఊపేస్తు వున్నాదే
దూరాన్ని దూరం తోసేస్తూ ఉన్నాదే
సూదంటు లా నన్ను లాగేస్తు ఉన్నాదే
ఇపుడేంచేయమంటావు చెప్పెయ్యవే త్వరగా

చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా
మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్యటచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: రెహ్మాన్
గానం: నకాష్ అజీజ్ , 

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...

ఓయ్ పుష్పా నువ్వేమో క‌న్నె బంగారం
తాకావో దుమ్ము దుమారం.
హా పంతం ప‌ట్టేసి.. పైపై కొకచ్చేసి త‌ప్పిస్తున్నావే ఆచారం.. ..
అప‌చారం..నాపై నీకేంటి అధికారం..

హాయ్ హాయ్ హాయ్
ఓయ్ పుష్పా అయిపోయా నీకే దాసోహం
పెంచొద్ధే ఇంకా వ్యామోహం
కవ్వించే నారి, కన్నె గోదారి
ముంచేలా ఉందే యవ్వారం, నీ భారం
నాపై  నీకేంటి అధికారం

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...

ఇటు సూడే  నీ చెయ్యి తగిలితే 
లోలోన పెరిగెను హాయ్ హాయే
అరె హాయే అరె హాయే 
జర ఆగే ఈ హాయే ముదిరితే
ఆపేటి వీలే లేదు  మాయే మాయే 
పెను మాయే పెను మాయే
నీ గాలి సోకిందంటే ఉయ్యాలూగే ప్రాణం
పొనంది నిన్నే వీడి పోరి
నన్నిట్ఠా లాగేస్తుంటే ముద్దొచ్చే నీ రూపం
ఆగేది ఎట్టాగే వయ్యారి

ఓయ్ పుష్ప, నీ సైగే మేఘ సందేశం
వచ్చేస్తా ధాటి ఆకాశం
హ్మ్మ్ ఓహ్, ఓ కైట్ లాగ
రాకెట్  లాగ అయ్యావే నువ్వే ఆధారం
ఓ దారం, నాపై నీకేంటి  అధికారం

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...


2018 , Nallamalupu Bujji , Rashi Khanna , Ravi Teja , Seerat Kapoor , Touch Chesi Chudu , Vakkantham Vamsi (As a Writer) , Vallabhaneni Vamshi Mohan , Vikram Sirikonda

Palli Balakrishna
Tholi Prema (2018)


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్ , యస్.యస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్ , రాశిఖన్నా
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: 
ఎడిటర్: 
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర 
విడుదల తేది: 09.02.2018

నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే

నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే

నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

తొలి తొలి ప్రేమ దాచేయికల
చిరు చిరు నవ్వే ఆపేయకీలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)


*******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరన్

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్ ఫ్లై చేసా 
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా 
కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా 
ఆకాసాన్నే దాటేశా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా 
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా 
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా 
మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే

నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే 
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే 
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే 
నీ మెలుకువ కోసం వెలుతురులే పరిచాలే 

నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా 
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా 
నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా 
కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే*******  *******   *******చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ నంబియర్

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 
నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా 
సునైనా నీతో రానా 

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 

ఈ ఏజే పోతె మళ్ళీ రాదె నువ్వేం చేసినా 
ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా 
ఓ లవ్లి లేడి నువ్వే ఎంత బెట్టే చేసినా 
మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా 
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా 
ఆతో పాటుగ నాతో పాటగ మారవ నువ్ పాడవా 

నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండరవ్వనా 
సునైనా నీతో రానా *******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రఘు దీక్షిత్

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

సోడియ రేడియ రోడియ హీలియం బేరియం తోరియం ఉంది ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
మన పాటల్లొ లిరిక్స్ మాటల్లొ ఎతిక్స్ గుండెల్లొ ఫ్రీడంకి లేదు ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
క్షణాల జిందగీలో no compromise అనేలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

మోహన మురలిని వలచిన వాడూ 
తియ్య రాధని పిలిచిన వాడూ 
కమ్మని వేలల కురిసిన ఆడు 
పరిమల వనమున ప్రియమగు వాడు 

చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 
చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 

హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 

క్లాసు రూంలో బెంచీకే అతుక్కు పోకురా 
రెక్కలే విప్పి చూడరా 
ఓ ర్యాంకు కోసం పోటినే కాసేపు ఆపరా 
రొమాన్సుకీ స్పేసు ఇవ్వరా 
తీయ్ పరదా...చేయ్ సరదా 
వెలిగి పోదా కలల పరదా 

ఆ ఫైరుకి లైఫుకి నీరుకి జోరుకి 
స్పీడుకి ఉందొక ఫార్ములా 
మనలో తెగువ పొగరు జిగురు వగరు లేదంట ఫార్ములా 
యుగాల యువతరంలో సరైన హిష్టరీలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లాPalli Balakrishna
Chikkadu Dorakadu (1967)చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, కృష్ణకుమారి
మాటలు ( డైలాగ్స్ ): వీటూరి
స్క్రీన్ ప్లే : బి.విఠలాచార్య ,  సి.నారాయణరెడ్డి,   వేటూరి
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాతలు: పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి సీతారామ స్వామి
సినిమాటోగ్రఫీ: హెచ్. యస్.వేణు
ఎడిటర్: యస్.గోవింద స్వామి
బ్యానర్: శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 1967

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు. అలాగే ఈ సినిమాలో వీటూరి గారు కన్నెపిల్ల అనగానే అందరికీ అలుసే అనే పాట కూడా రాశారు )


చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం:  సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో
కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ

వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో
ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో


*******   *******   ********

చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
విరిసిన ఇంద్ర చాపమో...
భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో...
మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ...
వర సరసీరుహానన ..విరాన.. వరించి.. తరింప చేయవే...ఏ ఏ ఏ ఏ...

పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది

కానరాని మన్మథుడేమో కనిపించెను
ఏడీ?.. ఏడీ?
ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి

చరణం: 1
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ సిగలోనే ఉన్నాయి

పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ ఓర చూపులేనోయి

పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది

చరణం: 2
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఏమో?.. ఏమో?

ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో...

ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో


******   ******   ******


చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం ...దాచలేనే ఈ విరహం

చరణం: 1
పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన
నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన

మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం... దాచలేనే ఈ విరహం

చరణం: 2
మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి
మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి

నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది

దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు
దోచుకో ఇక నా పరువం... దాచుటెందుకు నీ విరహంPalli Balakrishna Saturday, January 20, 2018
‹‹ Newer Posts Older Posts ››

Most Recent

Default