చిత్రం: డ్యూడ్ (2025) సంగీతం: సాయి అభ్యంకర్ నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ , మమితా బైజు దర్శకత్వం: కీర్తిశ్వరన్ నిర్మాతలు: నవీన్ యెర్నేని వై. రవిశంకర్ విడుదల తేది: 17.10.2025
Songs List:
బూమ్ బూమ్ పాట సాహిత్యం
చిత్రం: డ్యూడ్ (2025) సంగీతం: సాయి అభ్యంకర్ సాహిత్యం: శనాపతి భరద్వాజ పాత్రుడు గానం: సాయి అభ్యంకర్ , దీప్తి సురేష్, బెభూమిక అలల్లే అలల్లే స్వాగ్ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్ ఎవర్రా ఎవర్రా ఎగబడు కథరా తమరే కదా డ్యూడ్ డ్యూడ్-ఊ నువ్వు టెన్ థౌజండ్ ఆర తో ఉంటూ అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెక్-ఊ ఎప్పటికీ తగ్గదనిదా కిక్-ఊ డ్యూడ్-ఊ నిన్ను మించిన డ్యూడ్ నేడు లేడు, అసలు రాడు, జస్ట్ అనదర్ పర్సన్ కై చూడు, కనపడదే హిస్టరీ లో వాడు బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ, నీ పై నెగ్గే వారే నిల్-ఊ, రాజాధి రాజైన రా వర్షన్ రావణ… బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ, నీ పై నెగ్గే వారే నిల్-ఊ, రాజాధి రాజైన రా వర్షన్ రావణ… అంతు లేని ప్రేమను లోపల దాచుకునే తంతు తెలనిదా!!! గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేననా!! నా మాటున బాధకు మాటల క్యూర్-ఊ వా! కన్ను కన్న కలలకు ఆక్సిజన్-ఊ స్టోర్-ఊ వా! చెరువా చెరువా అవుతున్న స్టార్-ఊ వా, నా జత కాగలవా!! నా జత కాగలవా!! నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా!!! తలపును తడిపిన తొలకరి చినుకువా!! విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా!! బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ, నీ పై నెగ్గే వారే నిల్-ఊ, రాజాధి రాజైన రా వర్షన్ రావణ… రే డమ్మీ పటాసా నా చూర చూరా టెన్ థౌజండ్ వాలా హే పెట్రేగే పప్పెట్‌టా ఓ ఎగరకు చల్ తు కౌన్ హై సాలా ఐ’మ్ జస్ట్ చిల్లిన్ ఆయా కూల్ ఆహ్! ఆయా హూ ప్రాపర్ స్టైల్ లా లేద్రా జాలి, నీ పాత్ర నేతితో క్లోజ్ బేటా, డౌట్-ఆహ్ ఇది యమ పోజ్ అలల్లే అలల్లే బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ, నీ పై నెగ్గే వారే నిల్-ఊ, రాజాధి రాజైన రా వర్షన్ రావణ…
సింగారి పాట సాహిత్యం
చిత్రం: డ్యూడ్ (2025) సంగీతం: సాయి అభ్యంకర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాయి అభ్యంకర్ సింగారి సిన్నదానా నీ ఇంటి దారిలోనా పసోడై పాడుకోనా రింగా రింగా బిరానా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎట్టాగో తట్టుకున్నా లగ్గమే పెట్టుకున్నా ఇంకాపైనా ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్ధుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే గోరుముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దులు పుచ్చుకుంటా రాతిరీ పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదానా నీ ఇంటి దారిలోనా పసోడై పాడుకోనా రింగా రింగా బిరానా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా హే సన్నా సన్నా నడుమున నున్నా నున్నా నునుపున ధిన్నా ధిన్నా ధరువునై తాకనా కంటి రెప్ప వాలే చూపున సిగ్గే నిన్ను ఆపినా కితా కితా కిట్టేయ్యనై దూకనా మాయధారి మనసులోనా మల్లయుద్ధం జరిగెన పిల్ల పొరి పక్కన చేరే అల్లరాసే పెరిగెనే వేసవిలో ఏసీలు కోరే కోరికేదో కలిగెనే చెప్పలేని అల్లజడులే మగాడినై యెట్ట బయటపడనే.. తల కింద ఉండని దిండుతో కాళ్లు రెండూ కబడ్డీ ఆడెనే కొక్కొరొక్కో బాడీలో కోడి వేడెక్కి పాడెనే… సింగారి సిన్నదానా నీ ఇంటి దారిలోనా పసోడై పాడుకోనా రింగా రింగా బిరానా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా నువ్వలా రాసుకునే చందనమై దిద్ధుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే గోరుముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దులు పుచ్చుకుంటా రాతిరీ పగలో నా రాణి నువ్వేలే హే రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా హే రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా తంగా రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా హే రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా తంగా
బాగుండు పో పాట సాహిత్యం
చిత్రం: డ్యూడ్ (2025) సంగీతం: సాయి అభ్యంకర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సంజిత్ హెగ్డే నీ ఇష్టం సర్లే కానీ ఇచ్చేశా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో.. తీరేదే కాదే నా ప్రేమ ఆరిపోని వెన్నెలే మారిపోనే పొదులే నీ ఇష్టం సర్లే కానీ ఇచ్చేశా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో.. ఈ భారం పోయేదే కాదే అయినా చెలీ సెలవంటున్నానే ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో గాయమే కానీవే గుండెలే పెరికేసానే నిన్ను నీకిచ్చేసానే నవ్వుతూనే ఎవ్వరినీ ఏమంటానే నేరమే నాదంటానే శిక్షగా చివరంటానే శూన్యమై మిగిలుంటానే వేరొకరి చేతుల్లో నీ చెయ్యి చూస్తున్నానే బరువుగా నిట్టూర్చా బాధలోనే నిన్న నీ కన్నుల్లోనే కాటుకై ఉన్నది నేనే నా కంటి నీళ్లతో నన్నే నేడిలా చేరిపేసావే ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో ఇంకెవరితోనో నీ జంట నువ్వులేని నాకు ఎదమంట ముక్కలైన నాకు దిక్కు తోచదంట అయినా వెళ్ళిపో నన్ను దాటి పోవే పొమ్మంటా మళ్లీ ఇటు రానే వద్దంటా అంతులేని ప్రేమ అక్షతలు వేసి దీవించలే పో
నీ గుండె లోనా పాట సాహిత్యం
చిత్రం: డ్యూడ్ (2025) సంగీతం: సాయి అభ్యంకర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: జోనితా గాంధీ నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా లేనే లేనా?… నే లేనే లేనా?.. నా నువ్వేనా ఇది నువ్వేనా ప్రేమే లేదా నాపైనా ఏమి కానా ?… నీకేమి కానా ?.. కంటి రెప్ప వాకిలిలో… కాలమంతా వేచి ఉంటా… నువ్వు లేని నీ కలతో… జ్ఞాపకాలు పంచుకుంటా… లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే… లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే… నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా లేనే లేనా?… నే లేనే లేనా?.. ఏ శాపం తగిలిందో.. చేడు చూపై కసిరిందో.. ఎడబాటే రాసిందా కవ్వించే కాలం ఏ రేపు మాపుల్లో నీ మనసే మారేనా!! ఈ చోటే నేనుంటా నా నిన్ను చేరగా కంటి రెప్ప వాకిలిలో… కాలమంతా వేచి ఉంటా… నువ్వు లేని నీ కలతో… జ్ఞాపకాలు పంచుకుంటా… లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే… లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే… జీవితం నీదిలే… నిర్ణయం నీదిలే… పూలు రాలేదని గాలి అల ఆగదులే మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే ఎవ్వరి కలకెవ్వరు హామీ, నా తోడు కనతడు లే ..

No comments
Post a Comment