Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

President Peramma (1979)




చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాసం గోపాలకృష్ణ 
గానం: పి.సుశీల,యస్.పి.బాలు
నటీనటులు: కవిత, నూతన్ ప్రసాద్, రాజబాబు, రమాప్రభ 
కథ, మాటలు: దాసం గోపాలకృష్ణ 
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 12.04.1979



Songs List:



తెల్లారి కలగన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తెల్లారి కలగన్న - పెళ్ళాడినట్టు
గదిలోకి రాగానే - గడియేసినట్లు
గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు
బంజారా బంజారా బంజారా బంజారా

తెల్లారి కలగన్నా - నీ తెలివి తెల్లారినట్లు
గడిలోకి రాగానే - నే గరిటె తిరిగేసినటు
తిరగేసి మరగేసి నీ దుమ్ము దులిపేసినటు
తెల్లారినట్టు తిరగేసినట్టు దులిపేసినట్లు
బంజారా బంజారా బంజారా బంజారా

నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి
సరిగంగ తానాలు నేనాడినట్టు
మనసుల్లో మడిగట్టి - వయస్సుల్లో జతకట్టి
ముడుపుల్నీ, మొక్కుల్నీ చెల్లించినట్టు

ఓం తడియారకుండా మడికట్టుకోనిమ్యహం
మడిఒట్టతో నే ముడి పెట్టుకోనిమ్యహం
ముడివూడకుండా మ్యాహం
గుడిమెట్ల క్రింద మ్యహం
ఇద్దరూ మ్యాహం
ముద్దుగా ముద్దు ముద్దుగా
మూడు నిదర్లు చేస్తే - మ్యహం - మ్యహం - మ్యహం
బంజారా - బంజారా బంజారా

నునులేత నీ బుగ్గ - కొనగోట నే నొక్క
సీకట్లో నెలవంక - సిగురించినట్టు
ముప్పేట ముడికాస్తా - మూడేళ్ళ కొడుకయ్యి
మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు
చెల్లాయి కావాలి చెల్లాయి - ఇవ్వనంటే నీకు జిల్లాయి
చెల్లాయి - జిల్లాయి

సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా
తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా
బంజారా బంజారా బంజారా

గదిలోకి రాగానే - నే గరిటె తిరగేసినట్టు
గడియ గడియకే నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు - గడియేసినట్టు - ముద్దాడిననట్టు - ముద్దాడినట్టు
బంజారా - బంజారా - బంజారా
బంజారా బంజారా
బంజారా - బంజారా




ఏమంత తొందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఏమంత తొందర
కాసింత ఆగరా
కడసందె కాలేదు కాలేదురా
పడకిల్లు సరిచేసి రాలేదురా
పెదవికి గిలిగింత కలగనీ -
పయ్యెదకున్న ఓపిక తొలగనీ
మరులేమొ మరికొంత పొంగనీ
మనవేమొ మరునికి లొంగనీ
అందాకా అందాకా ఆగరా...

పరువపు పన్నీరు చిలకనీ
సరసపు సిరిగంధ మలదనీ
వలవుల దండ వేయనీ
వలపులకై దండవేయనీ
తలపుల తాంబూల మీయనీ
అందాకా - ఆందాకా ఆగరా



పంచమినాడే పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్

పంచమినాడే పెళ్ళంట పంచలచాపు నేయించు
దశమీ రేతిరి... అంట
ఏటంట ?
తెలవదు తెలవదు నాకంట
తెల్లచీర తెప్పించు-మల్లెపూలు రప్పించు
అబ్బా. ఇయ్యాల నన్నిట్టా పట్టుకున్నావేంటే?
పట్టుకున్నవాడే - పట్టుగొమ్మంట
పట్టుగొమ్మ నీడే పడకటిల్లంట
పడకటింటిలోనే పట్టు తేనంట

పట్టుతేనె విందూ - పగలూ రేయంట
పగలూ రేయీ ఒకటే... ఆంట
ఏటంట...?
తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలు రప్పించు
ఏయ్ ఒక్కటి కొంటానంటేనా...?
కొట్టేచెయ్యీ కోరే మనసూ ఒకటేలెమ్మంట
ఒకటీ ఒకటి కలిసే ముచ్చట మూడౌతుందంట
మూడు రాత్రుల పున్నమి
ఏడు జన్మల పున్నెమంట
పున్నెమెంత సేసినా ఈ పులకరింత దొరకదంట 
దొరికిందంతా ఇపుడే... అంట
ఏటంట...?

తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలూ రప్పించు




అందరాని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అంధేరేమె తూ దియాహై మేరే సనమ్మ
మిల్కర్ రహేంగే పియా హర్ జనమ్

అందరాని చందమామ నాకెందుకూ
అదంలాంటి నా మామ చాలు నాకూ
అందరాని చందమామ నీకెందుకూ...?
నే అద్దంలా వున్నాను నువ్వు సూసేందుకు
ఏటిలోని నురగల్లాగ - పైటకొంగు పొంగుతుంటే
లేతగాలి ఇసురుల్లో పూత వయసు వూగుతుంటే
ఇసకా తిన్నెలు గుసగుసమంటే మసకా కోరిక
బుసకొడుతుంటే
సూడాలి అప్పుడు - ఈ జోడుగుండె చప్పుడు

సూడాలి అప్పుడు— ఈ జోడుగుండెల చప్పుడు ॥ఆంధేరేమె॥

నీరెండి సీరకట్టీ - నీలినీడ రైక తొడిగీ
పొదుపొడుపు తిలకం దిద్ది 
పొన్నపూల నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా నువ్వొస్తుంటే
ఊరూ నాడూ పడిచస్తుంటే 
సూడాలి అప్పుడు
నన్నేలినోడి దూకుడు....




కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి.బాలు

కూత్ కూత్ కూత్ కూత్
కుక్కపిల్లలు
రొట్టెముక్క చూపి సే
లొట్టలేసాయి
కావు కావు కావు కావు కాకి మూకలు
చుట్టముక్క చూపిసే చుట్టు చేరాయి
కుక్కపిల్లలూ - కాకి మూకలూ
జంతర మంతర ధాం లాంతర లాంతర లాంతర తోం తనంతర ధాం

ఎత్తమంటే సెయ్యి ఎత్తేవోళ్లు ఏ ఎండకాగొడుగు పట్టేవోళ్లు 
ఎంగిలి మెతుకులు కతికేవోళ్లు ఏబరాసి బతుకులు బతికేవోళ్ళు
కలిసికట్టు లేనోళ్ళు నాయాళ్ళు - గొలుసుకట్టు మతలబోళ్ళు నాయాళ్ళు
ఈళ్ళంతా - మనవూరు ఏలేవాళ్ళు
కుక్కపిల్లలూ - కాకిమూకలూ
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం

నెగ్గిందాక మాట ఇచ్చేవోళ్ళు - నెగ్గినాక ప్లేటు మార్చేవోళ్ళు
పొట్టలు కొట్టే గొటంగాళ్ళు పొదుగులు కోసే కసాయివోళ్ళ
గోడమీద పిడకలు నాయాళ్లు గోతికాడ నక్కలు నాయాళ్ళు
ఈళ్ళంత మన ఊరు ఏలేవోళ్లు - కుక్కపిల్లలూ - కాకిమూకలు
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం 



పానకాలస్వామిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

శ్రీశైల మల్లమ్మ - అలివేలు మంగమ్మ
బెజవాడ కనకదురగమ్మో
పానకాల స్వామిని నేను పూవకం మీదున్నాను
శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగ -
సింహాద్రి అప్పన్న సింగమై దూకంగ
పోతరాజో పోలేరమ్మా

పోలేరమ్మో దాటి పోలేరమ్మా
బండరాయి పగలగొట్టు - బావురు కప్పను పట్టు
ఆశ్శరభ శరథ అల్లల్ల భీర

నాపరాయీ పగలగొట్టు - నల్లనీటి ఊటబట్టు
ఆశ్శరభ శరభ అల్లల్ల భీర
కంచె చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ
బురిడీలు కొట్టకమ్మో - మరిడీ మాలచ్చమ్మా
పోతరాజో పోలేరమ్మా 
పోలేరమ్మో దాటి పోలేరమ్మా
తలపైన తట్టుంది శరభా - తట్టలో బుట్టుంది శరభా
బుట్టలో గుట్టుంది పట్టుకో శరభా
అశ్శరభ శరభ అల్లల్ల భీర

తట్టాబుట్టా సర్ధి శరభా - తైతక్కలాడుకుంటూ శరభా
తలవాకిటున్నాది తందనాల బొమ్మ
అశ్శరభ శరభ అల్లల్ల భీర

పాపనాశనం కోసం తానమాడ బోతేను
వంశనాశనం కోసం మొసలెత్తు కెళ్ళింది
కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మం రాయడమ్మో
పోతరాజో పోలేరమ్మో -
పోలేరమ్మో దాటి పోలేరమ్మో


Palli Balakrishna Monday, October 30, 2023
Oka Challani Rathri (1979)




చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: చంద్రమోహన్, మాధవి, రామకృష్ణ , హలం 
దర్శకత్వం: పి.వాసు 
నిర్మాత: పి.రామమోహనరావు
విడుదల తేది: 18.05.1979



Songs List:



ఈ రాతిరిలో నీ జాతకమే పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పల్లవి:
ఈ రాతిరితో నీ జాతకమే మార్చేస్తాను
నా పాత కథే కొత్తగా నీచేతే రాయిస్తాను

చరణం: 1 
నువ్వే హీరో నా కథలో
కానీ జీరో నాజతలో
ఒకటి పక్కన వుంటేనే సున్న పది అవుతుంది.
నా పక్కన వుంటేనే నీకొక కథవుంటుంది

చరణం: 2
నువ్వూ నేను ఒక్కటైతే
నేనే చివరకు వుండేది
ఒకటి ఒకటి గుణిస్తే
అది ఒకటవుతుంది
ఆ ఒకటి కాస్త తీసేస్తే సున్న మిగులుతుంది 




అమ్మమ్మ ఈనాడు శనివారం పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అమ్మమ్మా ఈనాడు శనివారం 
ఆ ఏడుకొండల స్వామివారం
ఉండాలి ఉపవాసం లేకుంటే అపచారం
యాయ్యా యాయ్యా యాయ్యా
అమ్మమ్మా ఈనాడు శనివారం
అర్ధరాత్రి దాటితే ఆదివారం
ఆపైన ఉపవాసం అన్యాయం అన్యాయం
యాయ్యా యాయ్యా యాయ్యా

చరణం: 1
శనివారమైనా చేస్తారు ఫలహారం
అది ఆచారం కాదపచారం
అసలును మించిన వడ్డీవ్యాపారం
నీ ఫలహారం వ్యవహారం
ఎందుకు ఇంకా గందర గోళం
తిప్పేద్దాము గడియారం

చరణం: 2
బెలూన్ బెలూన్ ఇది ప్రేమ బెలూన్
కమాన్ కమాన్ చేరుదాం చందమామను
చంద్రుడిలో ఏముంది కొండలు బండలు
మరెందుకు పోల్చుతావు నా మోమును
తప్పు తప్పు ఇంకెప్పుడు అనను
ఒప్పుకుంటే చాలదు దింపుకో నన్ను




అధి ఒక చల్లని రాత్రి పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
అది ఒక చల్లని రాత్రి
మరుమల్లెలు చల్లిన రాత్రి
ఇక ప్రతి రాత్రి అదేరాత్రి
వలపుల జల్లుల రాత్రి

చరణం: 1
మనసుకు మనసు మంగళసూత్రం కట్టిన శుభరాత్రి
సొగసును వయసు బిగికౌగిలిలో పొదిగిన తొలిరాత్రి
శివుడు పార్వతికి తనసగమిచ్చిన పవిత్ర శివరాత్రి
యువతీ యువకులు నవశిల్పాలై కొలువగు నవరాత్రి

చరణం: 2
పూర్వజన్మల పుణ్యం ఏదో పండినదా రాత్రి
ముందు జన్మల అనుబంధం ముడివేసినదీ రాత్రి
పరువం ప్రణయం పరవశించి మైమరచినదా రాత్రి
ముద్దూ ముచ్చట మూటలు విప్పి మురిసేదీ రాత్రి

చరణం: 3
అంతులేని ఆనందం చిగురించినదా రాత్రి
అనురాగాళా తీగలల్లీ పెనవేసినదీ రాత్రి
చిన్ననాటి నేస్తం మొగ్గలు తొడిగినదా రాత్రి
జీవితానికి పువ్వుల బాటను పరిచినదీ రాత్రి.




దుక్ఖమంటే యేమిటని పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

పల్లవి:
దుఃఖమంటే ఏమిటని దేవుడ్ని అడిగాను
ఒకసారి ప్రేమించి చూడరా అన్నాడు
ఆమాట నమ్మాను ప్రేమించినాను
దుఃఖమే నేనుగా మారాను నేడు

చరణం: 1
ప్రేమే బొమ్మయితే దుఃఖమే బొరుసు
ఈ చేదు నిజము ఎందరికి తెలుసు
తెలియక మునుపాబొమ్మను వలచాను
తెలిసిన పిదపే చేదును మింగాను

చరణం: 2
దుఃఖమే నేటిది సుఖమేమొ నిన్నది
ఈ రెండూ కానిది నే వెతుకుతున్నది
కన్నీటి ఏటిని దాటాలి దానికి
ఎన్నాళ్ళకో చేరేది ఆ చోటికి




నువ్వెవరో నాకు తెలుసును పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, మోహన్

నువ్వెవరో నాకు తెలుసును
క్యా.... క్యా....
హా..... హా....
నేనెవరో నీకు తెలుసును
తెలిసినట్టు నీకు నాకు తెలియక పోవచ్చును
ఏకై సా హోతా
హోతా హోతా
ఏ అనుబంధమో తెచ్చింది నిన్ను
ఏ అనురాగమో కలిపింది నన్ను
అచ్చా అచ్చా
ఈ రుణం నేటితో తీరదులే
నా గుణం యిప్పుడే తెలియదులే
ఠీక్ హై... ఠీక్ హై....

వేషమేదై తేనేం భాష రాకుంటేనేం
లోపలున్నదేదో తెలుసుకుంటే చాలును
వేషం నిముషంలో మార్చుతాను

భాషంతా కళ్ళతోటి నేర్పుతాను
నీ రసికతకు దాసిని నేను
నా సొగసులకు బానిస నీవు
ఆప్ కి కసమ్
నేను నీ వశం
అనుమానం యింకా నీ కెందుకు
పెన వేసి రారా నా ముందుకు
॥నువ్వెవరో ॥




అధి ఒక చల్లని రాత్రి (విచారం) పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అది ఒక చల్లని రాత్రి
విషబీజం చల్లిన రాత్రి
యిక ప్రతి రాత్రి నల్లని రాత్రి
కన్నీటి జల్లుల రాత్రి 

చరణం: 1
మనసే సాక్ష్యం నిలిచిన రాత్రి
మమత లగ్నమై కలిపిన రాత్రి
తనువును పూజాపుష్పం చేసిన రాత్రి
నా తలరాతే మార్చిన రాత్రి

చరణం: 2
ఆవేశం పెనవేసిన రాత్రి
ఆనందం చవిచూసిన రాత్రి
వయసు మత్తులో హద్దులు మరచిన రాత్రి
వెన్నెల చాటున చీకటి పెరిగిన రాత్రి 

చరణం: 3
అన్నెం పున్నెం ఎరుగనిదా రాత్రి
అంతా చేదై చెదిరినదీ రాత్రి
కన్నుల నిండా నువ్వున్నది ఆరాత్రి
కన్నీళ్ళే మిగిలించినదీ రాత్రి

Palli Balakrishna
Maa Voollo Mahashivudu (1979)




చిత్రం: మావూళ్లో మహాశివుడు (1979)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
నటీనటులు: మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, సుభాషిని
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 01.01.1979



Songs List:



మహాదేవా పరమేశ్వరా పాట సాహిత్యం

 
చిత్రం: మావూళ్లో మహాశివుడు (1979)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

మహాదేవ పరమేశ్వరా పాహి
మాంపాహి - జగదీశ్వరా
నీ నామస్మరణం - భవతాపహరణం
గళమున నిలిపేవు - గరళ మహాజ్వాల
శిరమున ముడిచేవు - తరుణేందు సుమమాల
అగణితమీలీల - అగజేశ్వరా  ॥మహా॥

రజతగిరీంద్రనివాసా - ఈశా భుజగకపాల విభూషా
డమరుథ్వాన భ్రమరస్వాన భ్రమిత దిగ్గలజ హాసా
స్మరహర పురహర భవహర సురగంగాధరా
నిగమైకవేద్యా- నిఖిలేశ్వరా  ॥మహా॥



నయనాలు మాటాడెనా పాట సాహిత్యం

 
చిత్రం: మావూళ్లో మహాశివుడు (1979)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నయనాలు - మాటడెనా - నీ
ప్రియ భావనలు తెలుప
పెదవులు తడబడగ
నయనాలు మాటడెనా
 
చరణం: 1 
కోవెలలోని దేవత తానే
ఈపనిలోనే సాగెనా
పున్నమినాటి - వెన్నెల తానే
కన్నె పడుచుగా మారెనా
చిత్రములోని - చెలువము తానే
కమల వదనయై – కదలాడెనా ॥

చరణం: 2
దేవుడు యెదురై నిలిచిన వేళ
మనసు మాలికగా మారునులే
మోహన మురళి పిలిచిన వేళ
యమున రమణియై పొంగునులె
రవికిరణాలే సోకిన వేళ
కమల హృదయమే విరియునులె 

నయనాలు - మాటడెనా నీ
ప్రియభావనలు తెలుప
పెదవులు తడబడగ
నయనాలు మాటడెనా 




పెద్దాపురం అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: మావూళ్లో మహాశివుడు (1979)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: వీటూరి
గానం: యస్.జానకి

పెద్దాపురం అమ్మాయీ ఓరయ్యో పైచేసింది
సామర్లకోట రైలుబండీ ఓరబ్బీ సైటయ్యింది
ఆ ఊపూ ఆ జోరూ! ఏం సెప్పేది....?
ఆ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ -ఎట్టా సెప్పేది....? ॥ పెద్దాపురం॥

ఆసంటరేవుకాడ ఆ ఆ లు రాసింది
పాలకొల్లు తోటలోన బంతులాట ఆడింది
కొనసీమగట్టు పైన కోలాట మేసింది
కూతపట్టింది – అహ ఈత నేర్పింది
కోడెగాడు కన్నుగొడితే—కొంగు దులిపి పోయింది! ॥ పెద్దాపురం ॥

ఇంతింతవయసప్పుడే-ఈతకాయ లమ్మింది
నిగనిగలురాగానే.. నిమ్మకాయ అమ్మింది!
జబ్బల జాకెట్ తొడగ్గానే దబ్బకాయ లమ్మింది,
వరస కలిపింది ఆశ చూపింది
మాటల్తో తెల్లార్చి మాయజేసి పోయింది,




స్వర్గం నరకం చేరే దెవరో పాట సాహిత్యం

 
చిత్రం: మావూళ్లో మహాశివుడు (1979)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు

స్వర్గం నరకం చేరే దెవరో 
చెప్పడమెందుకురా
నోచిన పుణ్యం చేసిన పాపం
స్వర్గమొ - నరకమొ తేల్చునురా

పట్టు పరుపుపై పుట్టినవాడు మట్టిలో కలియునురా
మట్టినేలపై పుట్టినవాడు గిట్టక మానడురా
ఉన్నన్నాళ్ళు కట్టిన మూటలు లెక్కకు రావురా
పోయేనాడు నీ వాళ్ళెవరో లెక్కకు వచ్చునురా  ॥స్వర్గం ॥

పరుల మేలుకై బ్రతికిన వాడే పరమ పావనుడురా
ఆ పుణ్య పురుషుడే కీర్తిశేషుడై తరలి వెళ్ళుతుంటే
ఎంతమంది తమకంటినీటితో తర్పణ మిస్తారో
అంతటి పుణ్యం ఆ జీవుడికి స్వర్గం యిచ్చునురా ॥స్వర్గం॥

నలుగురి కడుపులు కొట్టే పాపికి ఈడ్చే దిక్కే వుండదురా
ఏడ్చే కన్నే మిగలదురా నరక కూపమే ఖాయమురా
ఊరికి చివర వుత్తిరమందున వుంది రుద్రభూమి
మంచి మిగిల్చి కాటికి చేరిన మరణం కాదు సుమీ
అదియే జీవన్ ముక్తి సుమీ ॥స్వర్గం॥

Palli Balakrishna
Lakshmi Pooja (1979)




చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వీటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, బి.వసంత, బెంగుళూర్ లత
నటీనటులు: నరసింహరాజు, త్యాగరాజు, చంద్రకళ, జయమాలిని, బేబీ రోహిణి, బేబీ తులసి 
దర్శకత్వం: కొమ్మినేని  శేషగిరిరావు 
నిర్మాత: పింజల ఆనందరావు 
విడుదల తేది: 16.11.1979



Songs List:



శ్రీ లక్ష్మి జయ లక్ష్మి పాట సాహిత్యం

 
శ్రీలక్ష్మీ  జయలక్ష్మీ 
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ 
కరుణించ రావే మహాలక్ష్మీ, మము - కరుణించ రావే మహాలక్ష్మీ
పాలకడలిలో ప్రభవించినావు - మురిపాల మాధవుని వరియించినావు
శ్రీపతి హృదయాన కొలువైతివమ్మా
నాపతి పాదాల నను నిలుపవమ్మా |

అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా 
పాడిపంటలను ప్రసాదించు నవధాన్యలక్ష్మివమ్మా !
భీరులనైనా వీరులచేసే ధైర్యలక్ష్మివమ్మా !
జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మా !
వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా |
కార్యములన్నీ సఫలముచేసే విజయలక్ష్మివమ్మా !
జనులకు విద్యాబుద్ధులు నేర్పే విద్యాలక్ష్మివి నీవమ్మా |
సర్వసౌభాగ్య సంపదలిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా ।



నాధమయమే జగము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల 

నాదమయమె జగము - అనురాగమయమె వయ్యారి హృదయము
మధువులు పొంగే మరుమల్లె పువ్వే - తుమ్మెదనే కోరదా  ఆ  ఆ 
పరుగులు తీసే పరువాలవాగు సాగరునే చేరదా నీ గమకాల ఊయెలలూగి
తెలుపలేని నిలుపరాని విరహమె - పడగవిప్పి బుసలుకొట్టి ఆడవా

సరసాలు పలికే సన్నాయి నేనై 
పెదవులు చుంబించనా ఆ ఆ
నీ రాగములో స్వరమును నేనై మోహము పలికించనా
నీ నాదానికి ఊపిరి నేనై
వలపులోన విరులవాన కురియగ హొయలు కులికి లయలు పలికి పాడనా?

స: నీపై కలిగెను లాలస
రి: దిగివచ్చితి నిను కోరి
గ: నీ రాగాలాపన వినగా
మ: మది దోచెనురా స్వరమధురిమా
ప: పరువాలు పులకరింప 
ద: దరిచేరి ఏలరాదా
నీ: నీ మగసిరిగని, నాసరి దొరవని - తమి దీర్చెదవని పిలిచితినీ
సా: సారస సుమశర - కేశీసంగమ మదసామజస-మమధుహాసా 





రాజా నీదనారా వాడివాడి పరుగుది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: బి.వసంత

రాజా నీదానరా - వడివడి పరుగిడి నాఒడి చేరరా
కనులందు నీరూపే తొణికింది రారా
ప్రతి మువ్వ నీపేరే పలికిందిలేరా
ఈ మదనదాహం నీ పొందుకోసం
మనసుతెలిసి మరులుకురిసి పోరా

కలలోన నినుచూసి పులకించినాను 
గంధర్వలోకాలు దిగివచ్చినాను
ఏకాంత వేళ ఎదలోన జోల 
కళలుచిలికి రుచులు తెలిపి పోరా రాజా





నిన్నే రమ్మంటిని పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

నిన్నే రమ్మంటిని లేలే లెమ్మంటిని
నువ్వేదిమ్మన్నా నేనేమన్నా లేదంటినా
నీ కౌగిలిలో పడివుండాలన్నా కాదంటినా

చినదాని ఒళ్ళు విరజాజి విల్లు - చేపట్టి చూడరా
మరుడైన యక్ష వరుడైన నిన్ను మతిపోయి చూడగా
నా చురచురలాడే పరువం నా చురచురలాడే పరువం నీసొమ్మంటిని

తొలిచూపులోనె మనసైన నిన్నె - వలచింది నాగినీ
పగలైన రేయి సెగలైన నిన్నె తలచే వియోగినీ
నా కువకువలాడే అందం..నా కువకువలాడేఅందం ఏలుకొమ్మంటినీ




మురిపాలే చూపి మొహాలే రేపి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల, బెంగుళూర్ లత

ఎ హేయ్.............. మురిపాలే చూపి - మోహాలే రేపి
ముదులో ముంచి ముంచి - మోజు పెంచరా

డుర్రుచ్చి డుర్రుచ్చి డీడీకి నువ్వొచ్చి
మనసిచ్చి ననుగిచ్చి నాకచ్చితీర్చాలిరా రా రా రా |

పాలు కొనండి - నా పాట వినండీ మీ
పాపలకీ పాలిచ్చీ మురిపాలే తీర్చుకొండి

రండీ కొనరండీ - రండీ కొనరండీ
గోమాతా మాలక్ష్మీ కురిపించిన పాలూ
తనివితీరు ఒకసారి తాగితేనే చాలు

నే పాలనమ్ముతున్నది మా నాన్నకోసమే
ఒక మంచిపనికి చేయండి మీ సహాయమే

నా తనుపూ సరసాల కామధేనువు
నా వలపూ నా బులుపూ ఏల తీర్చవూ
పెదవుల్లో అమృతమే నిండివున్నది
నా కౌగిలిలో స్వర్గమే కాచుకున్నది
డుర్రుచ్చి డుర్రుచ్చి డీడీకి నువ్వొచ్చి
మనసిచ్చి ననుగిచ్చి నాకచ్చి తీర్చాలిరా




నిరతము అమ్మా (పద్యం) పాట సాహిత్యం

 

చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి
గానం: బి.వసంత

నిరతము "అమ్మ" నీ చరణనీరజముల్ నెరనమ్మెనేని
ఈ ధరణిని మేముచేసిన వ్రతమ్ములు పూజలు సత్యమేని
సత్ సరణిని పంచభూతములు సవ్యముగా చరియించునేని
నీ శరణముకోరి వేడితిని సత్వరమీ అనలమ్ము నార్పి
నీ కరుణ జూపి దీనులను కావవె
ఓ మహంక్ష్మి దేవతా। - ఓ మహలక్ష్మి దేవతా |
జలధరా జలధరా జలజలా సాగిరా !
ఉరుముతో అందాలు మెరుపుతో పూజల్లు కురియగా
కమలాలు విరియగా - దిగిరా దిగి వానదేవా .
దేవా రావా దేవా రావా - దేవా రావా





నీవే నాలో పొంగే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, బి.వసంత

నీవే నాలో పొంగే తరంగానివి
నీవేలే నన్నేలే వసంతానివి
చల్లని వలపుల మల్లెలలో అల్లరి తలపుల జల్లులలో
తొలకరి సొగసుల తోటలలో
తుంటరి తుమ్మెద పాటలలో
తాకింది కోడెగాలి, తనువెల్ల రాసకేళి
ఆది నీ మహిమేనా। అభినవ వనమాలీ

నవ్వుల మంత్రం వేసే। నామది వేణువుచేసే
కళలేవో పలికించే సరాగానివి

ఊగింది లేత నడుము కాదంటె తీగ నడుగు
వేసెను ఆదినాలో వెన్నెల పిడుగు
మల్లి యలా సను మలచీ - తేనియలన్నీ దోచీ
మరులేవేవో కవ్వించే భ్రమరానివి





అమ్మా శ్రీ లక్ష్మీ దయలేదా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పూజ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి 

అమ్మా శ్రీలక్ష్మీ దయలేదా। నా - ఆర్తిని వినవేమి మరియాదా ॥ అమ్మా॥
పద్మపీఠిపై కొలుపున్నావా - పతియెదపై నే పవళించేవా

రూపు తరిగిన ప్రతి ఒకవైపు - చూపు తొలగిన సుతు డొకవైపు
పడమట సూర్యుడు వాలిన నిమిషం
నిలువదు తల్లీ నా మాంగల్యం ॥ అమ్మా॥

సేవించెదనన్న చేతులులేవే - వినుతించెదనన్న వేనోళ్ళు లేవే
పది దినములు నీ వ్రత మొనరించగ - పతితపావనీ సమయంలేదే

ఈ తొలి కుసుమం వందనం - ఈ మలి కుసుమం కీర్తనం
ఇది ధూపం - ఇది దీపం - ఇది పాద్యం - నైవేద్యం
ఈ ప్రతి కుసుమం ఆత్మ నివేదనం
ఉండి ఉండి ఈ రాతి గుడిని నీ గుండె బండయైతే
నీ బంగరు చెవులను నా ఆర్తధ్వని గింగురు మనకుంటే
అలవైకుంఠ పురాధి వరుడు నీ ఆత్మవిభుడు లేదా 
కైలాసాచల లీలా తాండవ కరుడు హరుడు లేడా
చతుర్దశ భువన చయ వినిర్మాణ చణుడు అజుడు లేదా
త్రిసంధ్యలే లేవా। చతుర్వేదములు లేవా
పంచభూతములు లేవా। సప్తమరత్తులు లేవా
అష్టదిక్పతులు లేరా। ఏకాదశరుద్రులు లేరా
లేరా | లేరా | నా ఆక్రందన వినలేరా !
దైవశక్తి కరువైతే - నా తాళి నేలపాలైతే
పాతివ్రత్య మహాగ్ని జ్వాలా
పటలిలోన ఒక చిటికిలోన

భస్మమైపోనా। నీ భస్మమైపోనా!
అమ్మా! శ్రీ లక్ష్మీ దయామయీ |
నా ఆర్తిని నిన్నావా మాంపాహి। మాంపాహి 

Palli Balakrishna
Kamalamma Kamatham (1979)




చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి కొసరాజు, జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జానకి, విజయలక్ష్మి శర్మ 
నటీనటులు: కృష్ణం రాజు, జయంతి, పల్లవి, విజయ లలిత, రామకృష్ణ 
దర్శకత్వం: ప్రత్యగాత్మ 
నిర్మాత: ఏ.వి.సుబ్బారావు 
విడుదల తేది: 01.03.1979



Songs List:



ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఏమౌతుంది.... యిప్పు డేమౌతుంది
ఇటా ఇట్టిట్టా యిది ఎందాకా పోతుంది
అహ .... నాకు తెలీక అడుగుతాను
పిల్లగాడి రిమరిమలు
పులిహోర ఘమఘమలు.... పిల్లగాడి ....
పిల్లదాని చెక్కిళ్ళు
నా చెక్కర పొంగళ్ళూ.... పిల్లదాని....
ఆకేసి వడ్డిస్తా
అవుపోసన పడతావా.... ఆ కేసి....
అవుపోసన ఆనక చూద్దాం
ఆరగింపు మొదలెడతా
ఆరగింపు మొదలెడతా.... అవుపోసన....
గోవిందా గోవిందా
ఏందయ్యా ఆచార్లూ ఏం జరిగింది
అబ్బా చెయ్యి కడిగేశాడండీ
ఎట్టా యిప్పుడేమౌతుందయ్య
రావే అరకు రాణీ
నీకు చేస్తానే వలపు బోణీ
రారా నా రాజ నిమ్మలపండు
నిన్ను రమ్మంది నా తల్లో మల్లెచెండు రారా ....
పట్టా రాసిస్తావా కమలమ్మా నీ కమతం పట్టా...
అడగాలా రామయ్య నువ్వు అడగాలా
నన్ను అడగాలా
యీ కొండ్రంతా నీ సొంతం
ఈ కొండ్రంతా నీకే సొంతం
పోయిందయ్యో పోయింది
ఏంటా గోల
కమ్మలమ్మా పోయింది కమతమూ పోయిందీ

అహ యిప్పుడే మౌతుంది
మేడెత్తు ఎదిగావు కోడెగాడా
నీకే ఓటిచ్చుకుంటాను అందగాడా

వయ్యారి కమలమ్మా
వలపుల్లో గెలిపిస్తే
నిన్నేలు కుంటానే కుతితీరా

ఎన్నికలలో ఎందరెన్ని కలలోకన్నా ఎన్నికలలో :
ఏనాటికీ నువ్వే ప్రెసిడెంటువి
నా ప్రెసిడెంటువి.




అత్తకూతురా చిట్టి మరదలా పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హోయ్ హోయ్-హోయ్.
అత్తకూతురా చిట్టిమరదలా

కొత్త చీరలో నిన్ను చూస్తుంటే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
హోయ్ మేనత్త కొడకా మీసాల బావా
కోడె గిత్తలా కుమ్ముకొస్తుంటే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
నీ చిలిపి కౌగిళ్ళే నా చలువ పందిళ్లు

నీ గుండె లోగిళ్ళే నా నూరేళ్ళ సిరులూ
నా వయసులోని బిగువు నీ అడుగులోని బరువు
చూసి చూసి కళ్ళు రెండు సోలి పోతున్నాయ్

కళ్ళంటే కళ్ళా అవికలువ పువ్వుల్లా -
కళ్ళంటే.....
వొళ్ళంటే వొళ్ళా అది దొంతు మల్లెల్లా
హాయ్.... హాయ్ - హాయ్

ఆ నడక చూస్తుంటే - నీ నడుము వూగుతుంటే
ఆ నడక ....
తిమ్మిరి తిమ్మిరి జింగిరి బింగిరి అవుతోందే పిల్లా
హేయ్ అత్తకూతురా !
కల్ల బొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అయ్య బాబోయ్
అల్లరి చేశావంటే పుట్టి నింటికె ఎల్లిపోతా
ఎల్లిపో
కల్లబొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అల్లరి చేశావంటే పుట్టినింటికె ఎల్లిపోతా
తాళికట్టి నెత్తిమీద తలంబ్రాలు పోస్తా తాళికట్టి....
పల్లకీలో నీ పక్కన వూరేగుతు వస్తా
తిక్క రేగిందంటే 
ఏంటా పోర్సు
బుగమేట్లో దూకేస్తా
నిన్ను దాటి యేరుదాటి
దాటి దాటి
ఏం చేస్తావ్
నీకు సవితిని తెచ్చేస్తా
ఎట్టా - ఎట్టా
నిన్ను దాటి యేరు దాటి నీకు సవితిని తెచ్చేస్తా
నిన్ను దాటి....
నీకు సవితిని తెచ్చేస్తా
నీకు సవితిని తెచ్చేస్తా



ఇంటి ముందు ఈత చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: విజయలక్ష్మి శర్మ , యస్.పి.బాలు

ఇంటి ముందూ యీత సెట్టూ
ఇంటి ఎనకా తాడి సెట్టూ
ఇంటిముందూ ....

యీత పెట్టూ యిల్లు కాదూ
తాడి సెటూ తల్లి కాదూ
తగులు కోనోడే మొగుడౌతాడా
ఆచారీ — ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ - గుళ్ళో పూజారీ
అట్టాగా అట్టయితే యిదికూడా ఇనుమరి
ఆ....వూరి ముందర వుల్లితోట
వూరిబైట మల్లితోట
వుల్లి తల్లి అవుతుందా మల్లె
మందు కొస్తుందా....
మూడు ముళ్ళస్తేనే మొగుడౌతాడా!
చుక్కా ... చుక్కా .... చుక్కా
చల్లని గంధపు చెక్కా....ముద్దుల ముద్దుల
చుక్కా .... చుక్కా .... చుక్కా
తీయని కొబ్బరిముక్కాముక్కముక్కముక్క
హద్దు యిడిసిన ఆడదానికి పద్దులు రాసి
పెట్టడానికి .... హద్దు

మొగుడో మొద్దులో ఎవడో ఒకడుండాలి.
నాలాంటి వాడెవడో అండగా నిలవాలి
అయితే ఒక పని చేత్తా
ఏంటీ
పగటిపూట నా పక్కన బజారెంట వస్తావా ఆచారీ
కొంపలంటుకు పోతాయమ్మో --
ఆచారీ పూజారీ వూరి ముందర వుల్లితోట వూరి...
ఉల్లి తల్లి అవుతుందా మల్లె మందుకొస్తుందా
మూడు ముళ్ళేస్తేనే మొగుడౌతాడా.. చుక్కా - చుక్కా- చుక్కా
చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దుల చుక్కా
తీయని కొబ్బరి ముక్కా
సల్ల సల్లగా పక్కన చేరి సరిగమలే -
వాయించుకుంటే అయ్యబాబోయ్
సల్ల సల్లగా పక్కన చేరి, సరిగమలే -
వాయించుతుంటే
పరువు మర్యాదా పందిరెక్కి కూచుందా
నడి బజారులో మాత్రం నామోషీ వచ్చిందా
అమ్మమ్మమ్మమ్మో తప్పు అంత మాటనకే
చుక్కా-చుక్కా-చుక్కా చల్లని గంధపు చెక్కా
ముద్దుల ముద్దల అబ్బ చుక్క
తీయని కొబ్బరి ముక్కా - - ఇంటిముందు

ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి వెనకా-
తాడి సెట్టూ
ఈత సెట్లూ ఇల్లుకాదూ తాడి సెట్టూ తల్లి కాదూ
తగులు కొన్నోడే మొగుడౌతాడా ఆచారీ - ఓ ఆచారీ
ముద్దుల ఆచారీ - - గుళ్ళో పూజారీ --

ఊరు పేరూ ఉన్నవాణ్ణి ప్రెసిడెంటుకి కుడిభుజాన్ని
హోయ్ : ఊరూ పేరూ....
కొండమీద కోతినైనా తెప్పించే గొప్పోణ్ణి
గుడిలో దేముడికే నామం పెట్టేవోణ్ణి...
కొండమీద
ఆ యింకా చెప్పనా మన గొప్ప....
పేరు గొప్ప ఊరు దిబ్బ ఆపవయ్య సొంతడబ్బా -
ఆశారీ... ఓ ఆశారీ .... ముద్దుల ఆచారీ ....
ఆశారీ.... ఆశారీ - పూజారీ 

యింటి ముందూ ఈత సెట్టూ
యింటి వెనకా తాడి సెటూ
ఈత సెట్టూ ఇల్లు కాదూ తాడి సెట్టూ తల్లికాదు
తగులుకున్నోడే మొగుడౌతాడా ఆచారీ ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ....గుళ్ళో పూజారీ




నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.జానకి

నిమ్మచెట్టుకు నిచ్చేనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే
నిమ్మముళ్లు రోమ్మునాటెనురా. హాయ్ హాయ్ హాయ్ హాయ్

నిమ్మముళ్ళు రొమ్ము నాటెనురా ఓ రందగాడా
సన్న రైక సగం చిరెగెనురా
రెకెందుకు చిరిగిందని
కొప్పెందుకు చెదిరిందని రై కెందుకూ........
అత్తముందూ అంద రడిగితే
ఆ - అడిగితే ఏమైందట 
ఆ - చెప్పడాని కేముందిరా
ఆ - చెప్పడానికేముందిరా
ఓరందగాడా - సిగ్గు ముంచుకొస్తుందిరోయ్.. నిమ్మచెట్టుకు..

చెలమయ్యా చేనుకాడ నిన్ను తలచుకుంటూ కూచునుండే
చెలమయ్యా చేను ....
ఈల వేసి.... నన్ను పిలిచి చెంగుపట్టి లాగావనీ
వూరు నోరు.... వూరు నోరూ చేసుకొందిరా
వూరు నోరు చేసుకొందిరా ఓ రందగాడా
తూరుపార పట్టిందిరా హాయ్ .... హాయ్..... నిమ్మచెట్టుకు...
మావ కొడకా వస్తావని
మంచమేసి కాసుకుంటే మావకొడకా....

ఇంటిపక్క ఎంకటేసు
చెమ్మ చెక్కలాడి ఆడి ఆడి ఆడి
అబ్బా ఎవరితోటి చెప్పుకుందురా ఎవరితోటి
ఓ రండగాడ యీది పాలు చేశావురో నిమ్మచెట్టుకు



తొలిసారి మొగ్గేసింది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తొలిసారి మొగేసింది సిగ్గూ -పాడుసిగ్గు తొలిసారి..
ఆ సిగ్గే మొగై పిండై కాయై సండై అమ్మో
కోకకొత్త బరువేసింది రైక కాస్త బిగు వేసింది
కోకకొత్త ....
ఆ సూపే సిటుకూ సిటుకూ గుండెలో దరువేసింది

నాకు సిగ్గేసింది.... తొలిసారి మొగ్గేసింది .......

కొత్తగా చూసిందేముంది సరికొత్తగా చూడని
దేముంది కొత్తగా

చూపూ చూపూ కలిసింది. అది చుట్టరికం —
కలిపేసింది. చూపూ చూపూ....
నీ చూపుల రాపిడిలో సిగ్గుకే సిగ్గేసింది..
సిగ్గే మొగ్గేసింది.....
తొలిసారి మొగ్గేసింది సిగ్గుః పాడు సిగ్గుః ....

దాచినా దోచని దేముంది
నువ్వు దోచితే దొరకని దేముంది, దాచినా
గువ్వకు గువ్వే దొరికింది
తన గుండె గూడుగా మలచింది
తొలిరాతిరి తెలారగానే

నెలవంక కనిపించింది.
నెల యింక తప్పిస్తుంది..
తొలిసారి మొగ్గేసింది
ఎనక జన్మ ఒక పులకింత
అది తలుచుకుంటే గిలి ఒళ్ళంత.... ఎనక జన్మ....
ముందు జన్మ తెలియని వింత
అది వుందో లేదో తేలన చింత ముందుజన్మ....
ఈ జన్మల వూసులు వింటే ఎందుకో నవొచ్చింది
తొలిసారి మొగ్గేసింది సిగ్గూ.... పాడు సిగూ....

Palli Balakrishna
Korikale Gurralaithe (1979)




చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి,  కొసరాజు, దాసం గోపాలకృష్ణ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, వసంత 
నటీనటులు: మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కాంతారావు, ప్రభ, జయలక్ష్మి, రమాప్రభ 
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్ 
విడుదల తేది: 12.01.1979



Songs List:



కోరికలే గుర్రాలైతే (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
అదుపేలేని మనసునకు - అందని స్వర్గం ఏముంది

తన యింట సిరితోట పూచేనని - తనదారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యన్ని పాటేనని - తాగన్న కలలన్ని పండేనని

సరదాలన్నీ చని చూడాలని సంబర పడుతుంది.
సంపదలన్నీ తనకే గలవని పండుగ చేస్తుంది.
జాబిల్లి తనకున్న విడిదిల్లని వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని నిచ్చెన వేస్తుంది 
ఈ లోకాలన్ని గెలిచేయాలని ముచ్చటపడుతుంది



రే రే రేక్కాయలో పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.జానకి

రే రే రేక్కాయలో - ఆ రే రే రేక్కాయలో
సందకాడ సిన్నోడు సందుకాశాడే
సంతసేసి వస్తావుంటే సరసమాడాడే 
బటానీల కోకమీద సిన్న సిటిక వేశాడే
సింతపువ్వ రైకమీద సెయ్యేశాడే.

తల్లోకి మల్లెపూల దండంపాడే
మెళ్ళోకి సెంద్రహారం గొలుసంపాడే
పట్టెమంచం పై కెమొ పరుపంపాడే
గదిలోకి అగరొత్తుల కట్టంపాడే

వంటకెమొ సన్నబియ్యం సంచులంపాడే
కూరకేమొ కొర్రమీను సేపలంపాడే
మంగళగిరి తిరణాళ్ళకి నన్ను తీసికెళ్ళాడే
రంగులరాట్నం ఎక్కించి రంగు సేశాడే




మనసే మన ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

మనసే మన ఆకాశం - మనమే రవి చంద్రులం
ఇటు రేయి అటు పగలు - ఒకటై వెలిగే ప్రేమికులం
చందమామ నువ్వంట - వెన్నెల్లే నువ్వంట
సూరేడి వెచ్చనీ నీరెండె నువ్వంట
నీ మాట అనుకుంటె మాటలే రావంట
మాటల కందని మనిషివి నువ్వంట
మనుషుల కందని మమతే నువ్వంట
నీకు నీ వారుంటె నా కోసం నువ్వంట
ఏ ఏటి ఒడునా ఇల్లేల మనకంట
ఈ ఒంటివానికి నీ జంట ఇల్లంట 
ఆ యింట గోరంత దీపమై నేనుంట
గోరంత దీపానికి ఇల్లంత వెలుగంట
కొండంత దేవుడికి కోవేలే నేనంట





సలామలేకుం రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సలాం లేకుం రాణి | నీ
గులాము నౌతాను 
ముత్యాల పల్లకిలోన నిను
మోసు కెళుతాను

సలాం లేకుం రాజా ! నీ
గులాము నౌతానునువు
మోసుకెళితే నిన్నే : ఎగ
రేసు కెళుతాను !
మరుమల్లె లెందుకులే - నీ
చిరునవ్వులే వుంటే
కరిమబ్బు లెందుకులే - నీ
కురుల నీడలే వుంటె
నీ - జడలోన ఒదిగున్న విరజాజిని
ఓ - జవరాలా నీ ప్రేమ పూజారిని

బృందావనినే వలవుల
ముంగిట నాటాలనీ 
స్వర్గ సుఖాలన్ని ప్రియుని
సందిట చూడాలని
నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా
ఆవి కనుగొంటి ఈనాడు నీ తోడుగా




ఏమి వేషం ఏమి రూపం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు,  వసంత 

ఏమి వేషం - ఏమి రూపం
ఆహా కథానాయకీ
సావిత్రీ ఐ లవ్వూ !
నచ్చినానా - మెచ్చినావా
ఓహో ఆశదీర్చలేవా
ధర్మరాజా ! ఐ లవ్వూ

నిన్నటి నాటుపిల్ల 
యీ-నాడు బలే రసగుల్లా 
ఒక్క ఛాన్సు యిచ్చిచూడూ
దులిపేస్తా నీతోడూ
సరి సరి - నాకు తెలుసు

నీలో వున్న సరుకు
యిక - పెరుగులే మార్కెట్టు
సావిత్రీ  ఐ లవ్యూ 
ఒకసారి పై కిదెస్తే 
జన్మంతా రుణపడి వుంటా
రేయి పగలు కృషి చేస్తా
ఒకదారి నీకు చూపిస్తా
చూడు చూడు కోతి మూకల్ని
నవ్వు తుండే ఆ వెధవల్ని
ఏవరెటు చస్తే మనకేమీ
లవ్యూ - సావిత్రి ఒహో





కోరికలే గుర్రాలైతే (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

కోరికలే గుర్రాలయితే
ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతిపోతుంది
బ్రతుకే శృతి తప్పుతుంది

నేలవిడిచి సాము చేస్తే
మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తి కొచ్చాయంటే
కాళ్ళు కొట్టు కుంటాయి
గాలి కోటలు కట్టాపు
అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టు పైకెక్కావు
చచ్చినట్టు దిగమన్నాయి

పులినిచూచి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడోచూసి మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పుకూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పె అందం ఆడదానికి

Palli Balakrishna
Andaman Ammayi (1979)




చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రమోహన్, బేబీ వరలక్ష్మి 
దర్శకత్వం: వి.మధుసూదనరావు 
నిర్మాతలు: టి.గోవింద రాజన్, టి.యం.కిట్టు 
విడుదల తేది: 15.06.1979



Songs List:



హేయ్ లల్లీ పప్పీ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

హేయ్ లల్లీ పప్పీ లల్లీ మళ్లీ రారండీ
పువ్వులు ఉన్నవి పూజకు కావు -
లవ్వూ గివ్వూ అనకండీ
తేనె తేనెకూ తేడా ఏమిటో - తేనెటీగకు తెలుసు -
ఈ తేనెటీగకు తెలుసు
తేటికి వుంది వయసూ
తేనెకు వుంది సొగసూ
తెరవకండి మనసూ ....
మనసు గినసు అంటే నాకు అసలే అలుసు

రోజు రోజుకో రోజా పువ్వుతో - మోజు తీర్చుకోవాలి
నీ మోజు తీరిపోవాలి
నిన్న అనుభవం నిన్నే
రేపటి సంగతి రేపే
మరచిపొండి నేడే - రేపటికంఠా మీరూ నేనూ
వేరే వేరే  ॥హేయ్॥

అందమన్నది బంధంకారాదు అనుబంధం కారాదు
అది ఎవ్వరి సొంతం కాదు
కొత్తదన్నది నేడే — పాతై పోతే రోతే
ఎందుకింక సొంతం – రోజూమారే దేవునిసృష్టే
నాకూ యిష్టం ॥హేయ్॥




చిత్రా చిత్రాల బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిత్రా చిత్రాల బొమ్మా - పుత్తడీ పోతబొమ్మా
మొత్తా మొత్తంగ వచ్చి_చిత్తాన్నే దోచెనమ్మా
పైలా పచ్చీసు బొమ్మా - పరదేశీ ఆటబొమ్మా
ముచ్చల్లే వచ్చి వచ్చి - మచ్చేదో చల్లెనమ్మా
॥చిత్రా॥

టేకు మానల్లే చక్కంగా వుంటాడు
ఆకు తేలల్లె చల్లంగా వస్తాడు
సోకంతా సూపుల్లో సూపుతాడు. ఆ
సూపులతో ఒళ్ళంతా పాకుతాడు

పువ్వు తీగల్లే నాజూగా వుంటుంది
బొండు మల్లల్లె నిండుగా నవ్వుతుంది
నవ్వుల్లో చాణాలు రువ్వుకుంది అబ్బ
రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది

వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో
లేడి పిలలై గెంతుతుంది ఇంతలో....
దీపమల్లె వెలుగుతుంది దీవిలో
తెర చాపలాగ ఎగురుతుంది నావలో

అలలు అలలుగా వూగుతాడు మనసులో
కలలు కలలుగా వస్తాడు కళ్ళలో
కడలిలా వుంటాడు లోతులో
చలమలాగ వూరుతాడు చెలిమిలో




వేస్తాను పొడుపు కధ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

వేస్తాను పొడుపు కధ వేస్తాను
చూస్తాను విప్పుకో చూస్తాను.
మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి
వచ్చాక వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు.
వెళ్ళి మల్లి వచ్చారు. మళ్ళీ వెళ్తే వస్తారా....?
ఎవరు వారు...?
ఎవరు వారు.
తెలియలా .... ?
ఊహుఁ....

పళ్ళు
పగడాల చక్రాలపచ్చనీ తేరునెక్కి
సూర్యుడంటి వీరుడొస్తే దారంతా నెత్తురంట.
ఏమిటంట....?
ఏమిటబ్బా....
తెలీలా....?
తెలియలా....?
ఆకు వక్క సున్నం 

పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనది
పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నది
కాయైనా పండై నా తీయనై నది
గాయమైనా మందైనా తానై నది

ఏమిటది...?
తెలీలా...?
తెలీలా ....
ప్రేమ....

నేలమీద నిలిచేవి రెండుకాళ్ళు
నింగిలోన నిలిచేవి రెండు కాళ్లు 
మధ్యలో నడిచేవి ఎన్నోకాళ్లు
ఏమిటది ....?
ఏంటది....?
ఇది తెలీలా ...
తెలీలా....
నాకు తెలియదు.





ఎందుదాగినావురా పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

ఎందుదాగినావురా నందకిశోరా నవనీతచోరా
ఎందెందు వెదుకుదురా ఎటులా కనుగొందురా

మన్ను తినాబోయావో పొన్న చెట్టు నెక్కావో
వెన్న దొంగిలించి ఏ వెలది యింట పొంచావో
ఆ రాధ నిన్ను ఎక్కడ దాచిందో
పెట్టెలో పెట్టిందో బుట్టలో దాచిందో
పైటకొంగులో నిన్ను ముడివేసుకున్నదో
ఎక్కడని వెతికేది
ఇక్కడ — అక్కడ
ఎక్కడ — మరెక్కడ ....

భామా, సత్యభామా చెప్పమ్మా
నేను రుక్మిణిని కాను రాధను కాను
గోపికను కాను నీ భర్త నెత్తుకుపోను
నీడగా దొరికినా — లీలగా మెరిసినా
కనబడితే చాలు నాకు కనక వర్షాలు
ఎక్కడని వెతికేది
ఇక్కడ — అక్కడ
ఎక్కడ - మరెక్కడ




ఈ కోవెల నీకై వెలిసిందీ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఈ కోవెల నీకై వెలిసిందీ -
ఈ వాకిలి నీకై తెరిచుందీ
రా దేవి తరలిరా - నా దేవి తరలిరా ....
ఈ కోవెల నీకై వెలిసిందీ
ఈ వాకిలి నీకై తెరిచుందీ
రా స్వామి తరలిరా - నా స్వామీ తరలిరా
దేవతల గుడిలో లేకున్నా -
దీపం పెడుతూ వున్నాను
తిరునాళ్ళెపుడో రాక తప్పదని -
తేరును సిద్ధం చేశాను

దేవుడు వస్తాడని రోజూ—పువ్వులు ఏరితెస్తున్నాను
రేపటికోసం చీకటి మూసిన తూరుపులాగా వున్నాను

॥ఈ కోవెల॥

మాసినవెచ్చని కన్నీరు -
వేసెను చెంపల ముగ్గులను
మాయని తీయని మక్కువల చూసెను
ఎనిమిది దిక్కులను

దిక్కులన్నీ ఏకమై నా కొక్కదిక్కై నిలిచినవి
మక్కువలన్నీ ముడుపులు కట్టి మొక్కులుగానే మిగిలినవి ॥ఈ కోవెల ॥

నీరువచ్చె - ఏరువచ్చె ఎరుదాటి ఓడవచ్చె
ఓడ నడిపే తోడు దొరికె వడ్డుచేరే రోజువచ్చె
ఓడచేరే రేవు వచ్చె... నీడచూపే దేవుడొచ్చె
రేవులోకి చేరేలోగా_దేవుడే అడ్డువేసే....

Palli Balakrishna Sunday, October 29, 2023
Srungara Ramudu (1979)




చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం
నటీనటులు: యన్.టి.రామారావు, శరత్ బాబు, లత, జయమాలిని 
దర్శకత్వం: కె.శంకర్ 
నిర్మాత: రామమూర్తి 
విడుదల తేది: 22.11.1979



Songs List:



ఈ రోజు ఈ రోజే పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

ఈ రోజు ఈ రోజే - ఇది నిన్నా కాదు - రేపూ కాదు... అదే దీని మోజు
ప్రతి మనిషి తనకే తెలియక పుడతాడొకరోజు
తానొకడే పుట్టినట్టు - చేస్తాడు పుట్టినరోజు
రోజులు తెలియని పుట్టుకలున్నాయ్ పుట్టుకలేని రోజే లేదోయ్
పుట్టటమే ఒక గొప్పకాదు - పుట్టి గొప్పకావాలి-

ఈరోజే నా రోజని అనుకుంటే - ప్రతిరోజు ఒక పండగే
రేపూ రేపని వూరుకుంటే - ఈ రోజూ ఒక దండగే
ఇరవైనాలుగు గంటలు కాదోయి - ఈ క్షణమొకటే నీకొక రోజోయి
అనుభవించు వున్న క్షణాన్ని అందినంత ఆనందాన్ని




హౌ ఆర్ యు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

హౌ ఆర్ యు ... హవ్ డూయూడు అని అడగాలి
ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి - రివరల్లే వురకాలి

హాపీ టు మీట్.. యు సర్ - వెరీ వెరీ హాపీ - టు సర్వ్ యు సర్
ఎప్పుడేమి కావాలో ఎలా ఎలా చెయ్యాలో
మీ రుచులు ఏమిటో అభిరుచులు ఏమిటో చెబితే చేసేందుకున్నాను
ఒకసారి చేశాక చెప్పకనే చేసేస్తానని చెప్పాలి.
కష్టపడి వచ్చారు కాసేపు పడుకోండి
నీరసంగ వున్నారు ఈ పళ్ళరసం తాగండి
వేడి తగ్గిపోతుంది స్నానం చెయ్యండి
పడుకోబోయే ముందు పాలు తాగండి
వూరుగాని వూరొచ్చిన మీకు వుపచారాలు చెయ్యాలి
అ తారింటో అలుడిలా అడిగిందంతా యివ్వాలి - మీరడిగిందంతా యివ్వాలి
ఐ లైక్ యు, డూ యు లైక్ మి - ఇఫ్ ఐ లవ్ యు విల్ యు లవ్ మి 
అందాక వచ్చాక అడగకనే నేనడిగేలా చెయ్యాలి.




నందమూరి అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

నందమూరి అందగాడా నేనందుకున్న చందురూడా
కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖుల్లా
ఇద్దరం కలిశాము యీ వేళా.…ఎండలో కాస్తుంది పండువెన్నెలా....
మంచితనం చక్కదనం ఒక్కటైన చోటా
పూస్తుంది దానిమ్మ తోట పూతోట
పడుచుతనం గడుసుదనం పాడేది పాట
పలుకుతుంది ప్రతి పిట్ట నోట
మంచుమీది ఆట మనకు ముచ్చట
మనమంటే మంచుకే ఎంతో ముద్దు
మంచుకొండమీద శివుడు నాట్యమాడినాడు
పార్వతికి తనలోని సగమిచ్చినాడు.
అదే మంచుమీద కలిసి ఆడాము నేడు
ఆది దంపతులం మనం ఏనాడూ
పుటినిలు మెట్టినిలు యీ పడవలోనే
మొదటి రాత్రి పడకటిల్లు కొలనులోనే
ఆకాశం కడుతుంది తారల జలతారు
గులాబీలు చల్లుతాయి పన్నీరు
నీకు నాకు సాటిలేరు ఎవ్వరు
నువ్వూ నేనే ప్రేమకు మారు పేరు ....





చీటికి ప్రాణం చేవ్రాలు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: వాణిజయరాం

చీటికి ప్రాణం చేవ్రాలు -ఆ చీటీలన్నవి రెండు రకాలు
చిరిగి ముక్కలై పోయేవి చెరగక మక్కువ దోచేవి
నా వయసొక చీటీ నా సొగసోక చీటీ
వాటికి ప్రాణం పోయి నీ చేవ్రాలతోటి
నీ భాషొకటి నా భాషొకటి- ఇద్దరి కళ్ళకు లిపి వొకటి
అది చేసే భాసలు శతకోటి
ఈ పెదవులు చూడు - ఆ మధువులు చూడు
రెంటికి యిచ్చేయ్ ఓ ముదులు చీటీ
నీ కలశొకటి ఇద్దరమాడే ఆటొకటి
ఇది నీకూ నాకూ తొలి పోటీ....



ఆడేదే ఆడది పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

ఆడేదే ఆడది ఆడించే చెయ్యెవరిది .....?
నీది నాదీ కానిది ఏమిటది....?
ఎవ్వరి పాటో పాడుతున్నాను ఏ తాళానికో ఆడుతున్నాను
పెదవికి మధువును అందిస్తూ- వయసుకు సొగసును చూపిస్తూ
నాలో నేను ఏమవుతున్నది - మీలో ఎవరికి చెప్పను.

కన్నెసొగసులో కైపులున్నాయి కన్నుల గిన్నెల నింపుతున్నాయి.
గబ గబ గడ గడ తాగండి అడుగులు తడబడి తూలండి
తెల్లారాక తెలివొచ్చాక - ఏమవుతుందో చెప్పను




వస్తానన్నావు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

వస్తానన్నావు - వస్తే చూస్తానన్నాను
పిచ్చిదాన్ని వచ్చుంటావని నేనే ముందుగ వచ్చాను
వస్తానన్నాను - వ స్తే చూస్తానన్నావు
పిచ్చిదాని కంగారంతా - ముందే వచ్చి చూశాను
మగాడు ముందే రావాలి - ఆడది వచ్చి చేరాలి.
అప్పుడే ఈడూ జోడూ కలవాలి

జన్మలుంటాయి - మన జంట కలిసేందుకు
కాలముంటుంది - మన వెంట నడిచేందుకు
దేవుడుంటాడు రాసిందే రాసేందుకు
ఎవరిచేతవును మన రాత మార్చేందుకు
పవిత్ర ప్రేమకు యిన్నేళ్ళు చరిత్ర రాసిన కన్నీళ్ళు
నిజాలు కావు మనకు - ఆ విషాద గీతాలు
గంగా పొల్లాతో కలవాలి - మన ప్రేమతో
తూర్పు పడమరలు చేరాలి ఒక రంగులో

ముంతాజ్ పుట్టింది - షాజహాను వలచేందుకు
షాజహాను బ్రతికాడు – తాజ్ మహల్ కట్టేందుకు
నీ మనసే నాకు మహలై వుంటే - మరణ మెక్కడిది...
మరణం లేని మమతలకెందుకు మహల్లు కట్టేది
యుగాలు ముందు వున్నాము ముందు యుగాలు వుంటాము
ప్రేమకు వేరే వేరే పేర్లు పెడతామా....

ప్రేమ ఏలాలి దేశాల రాజ్యాంగము
పేద మహారాజు ఎక్కాలి ఒక పీఠము
ప్రపంచమంతా ప్రతిరోజూ వసంత రుతువై పూస్తుంది
అనంతమైన ఆనందం నిరంతరంగా వుంటుంది.

Palli Balakrishna
Bomma Boruse Jeevitham (1979)




చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి , వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: చంద్రమోహన్, మాధవి, జయమాలిని 
మాటలు: జంధ్యాల 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
సహాయ దర్శకుడు: వంశీ 
నిర్మాత: USR మోహనరావు 
విడుదల తేది: 21.06.1979

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:



అందాల సృష్టికి మూలం పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: పి.సుశీల 

అందాల సృష్టికి మూలం ఆనాటి ఏడమ్
ఆనందం సృష్టిస్తోంది - ఈనాడీ మేడమ్
గరీబుకైనా  బికారికైనా |
అవసరమొకటి 
నిషాగా ఖుషీగా  సుఖాల చరించడం 
పక్కింటి రాముడుకోసం - పంకజాక్షి విరహం
ఎదురింటి రాజాపైనా అబుల్లా మొహం
ఎల్లమ్మ తోటలోనా - ఎంకినాయుళ్ళు సరసం :
శాంతమ్మ సంతకెళ్ళినా
గోవిందు గోడ దూకినా 
ఎందుకోసం ? పొందుకోసం ? జగమంతా
ప్రేమ విలాసం 

కన్నెపిల్ల కనిపించిందా కన్ను గీటే కాలేజీ బాయ్
హయ్ .... హయ్
చిన్నపిల్ల బుగ్గ నిమిరీ ఇకిలించే తాతాయీ
కొంగుచూసి రంగైపోయే దొంగచూపు పూజారీ
పార్కుల్లో ఊసులాటలూ
తిరునాళ్ళ తిప్పలాటలూ
ఏమిగోలా  ప్రేమగోలా ? జగమంతా ॥అందాలా॥




వింటే భారతం వినాలీ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హిహిహిహి ....
మన్మధలీలా 

వింటే భారతం వినాలీ
తింటే గారెలే తినాలీ
పడితే గొప్పోణీ పట్టాలి
కొడితే జాక్ పాట్ కొట్టాలీ
మీరంతా ఈలలు వెయ్యాలీ
మా జేబులు బాగా నిండాలి
భారతానికి మూలకారణం

ద్రౌపది వస్త్రాపహరణం
ప్రజలకు నచ్చే సన్ని వేశమూ
పసందైన శృంగార దృశ్యమూ

నేనే కురునాదూడా - నాదూడా
అపక్ర విక్రమ పరాక్రముండ
సుయోధనా సార్వబౌముండ - ఘనుండ
నే కురు నాయకుండ

హల్లో బ్రదర్ దుశ్శాసనా
రేపింగ్ కళా ప్రవీణా
ఎక్కడ ఆ FIVE STARS పతివ్రతా
గుమ్మడి పండులాంటి ఉమ్మపతి - ద్రౌపతీ
పాలమీగడలాంటి వయ్యారీ
చెఱుకు గడలావున్న చిన్నారీ
పొడుముకాయలాంటి నడుమూపీ జడవూపీ
తొడపైన కూర్చోవే ఒకసారి
నా తొడపైన కూర్చోవే ఒకసారి

ఏయ్ ...
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యనూ
అఫ్కోర్స్
దమర్మము లేరుగని కోర్టుల కెక్కని
ఘనుడు ధర్మరాజూ
గదతో రొమ్ముల దుమ్మును దులిపే
బలుడు భీమరాజూ
షూటింగ్లో ఫైటింగ్ హీరో అర్జునుడూ
హర్స్ రేసులో అగ్రగణ్యుడు నకిలీలేని నకులుడూ
పేరు పొందిన పశువుల డాక్టరు తిరుగులేని
సహదేవుడూ
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యను

ఏయ్ ---
చాలించవే నీ గొప్పలు
ఇక చూసుకోవే నీ తిప్పలు

నిన్ను నాకు నాజూదంలో ఓడినారె నీ భర్తలు
Don't you know it ?

Is it ?
తన్నోడి నన్నోడినా నారాజు
నన్నోడి తన్నోడెనా
తనుముందు ఓడితే నన్నోడ హక్కేది
ఈ జూదమాడగా లైసెన్సు నీకేది

పాయింటు పట్టిందిరో - లా
పాయింటు పట్టిందిరో -
హైకోర్టు కెళ్ళినా అప్పీలు లేదురా
పాయింటు పట్టిందిరో - లా పాయింటు పట్టిందిరో
ఏయ్ -- విప్పరా
తప్పురా..
విప్పరా
తప్పురా..... కృష్ణా.....

కృష్ణా - కృష్ణా కృష్ణా కృష్ణా
పోలీస్ పోలీస్ పోలీస్



లుక్ చుక్ లుక్ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సాయిబాబా 

లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం
గప్ చిప్ గప్ చిప్ మనబేరం
బొమ్మా బొరసే జీవితం -
ఆడే బొమ్మల నాటకం

బొమ్మలు: 
Twinkle Twinkle Little Master
How We wonder you are here !
మనిషి చేసిన బొమ్మలు మీరు
మనసే ఉండడూ వయసే పండదూ
దేవుడు చేసిన బొమ్మలు మేము -
బుద్దులు మారే మనుషులమూ
పొదువాలితే పోతాము -
గుడిలో బొమ్మను అర్చిస్తాం 
అంగడిలో బొమ్మను అమ్మేస్తాం 

బొమ్మలు: 
బొమ్మల పాలిట బ్రహ్మలు మీరట
పేరు గొప్పట ఊరు దిబ్బట -
అయ్యోపాపం : అయ్యోపాపం..కీలుబొమ్మలు 
ఆ బ్రహ్మదేవుడే కీలుబొమ్మ శ్రీ విష్ణువు చేతులలో
ఆ వైష్ణవ మాయలలో…
ఈ తోలు బొమ్మలూ కీలుబొమ్మలే ఈకలికాలంలో
ఆకలికాలంలో -
ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో
పేదజీవులం మేముపావులం
కసాయి సాలకు పోతున్నా గరికెలు మేసే గోవులం
ఇది గండు పిల్లల చెలగాటంలో
నిండు బ్రతుకుల ప్రాణ సంకటం





అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా
జన్మ జన్మ కదే నిత్యవెలుగు బాటరా
ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట
తనపిల్లల క్షేమమే పల్లపైన పాట
మధుర మధుర మధురమైన మాటరా : అమ్మా

కాలు మోపితే అమ్మ అవతరించె కాశీ
తానమాడితే అమ్మ తరించింది గంగ
మెరిసె లక్ష్మణరేఖ నడిచే భగవద్గీత
తొలి పలుకులు దిద్దుకుంది తెలుగుపాప ఆమ్మతో
తొలివెలుగులు దిద్దుకుంది తూర్పు అమ్మ చూపుతో
దేవుడైన చెప్పలేడు ఆ దేవత ఎంత గొప్పదో
అమ్మా - ॥అమ్మ॥

అనగనగా ఓ రాజకుమారి
వన్నెచిన్నెల వయ్యారి - నాట్యంలో మయూరి
యెందరెందరో రాకుమారులు, ప్రేమ బిక్షకై 
అర్ధించారు నిరాశ చెందారు 

డైలాగ్: ఇలా వుండగా ఓనాడు -
పెన్నిధి తనతల్లి అయిన పేదయువకుడొకడు
ఆ రంభలాంటి చిన్న చూచాడు
అందానికి కన్ను చెదిరి  ఆ క్షణాన వళ్ళు మరిచి
ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్ళిచేసుకో మన్నాడు!

డైలాగ్ : అప్పుడా సుందరి ఏమడిగిందో తెలుసా ?
కానుకగా కన్నతల్లి గుండె కోరెనా చిన్నది
తేలికగా తెస్తా లెమ్మన్నాడు - ప్రేమ ఎంతగుడ్డిది
ఆ కామమెంత చెడ్డది

కన్నుల కడవెలుగు దాచి  కన్న కడుపునే తలచి
తలవాకిట నిలచినదా తల్లి కన్నతల్లి
వచ్చిన బిడ్డనుచూచి వెచ్చని మమతలుపోసి
వండిన అన్నము పెట్టెను - నిండుగుండెతో
ఆ తల్లి బిడ్డకడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ
ఇటు కన్నతల్లి మమకారము 
అటు కన్నెపిల్ల శృంగారమూ
ఇటు తల్లిగుండె గుడిగంటలూ 
అటు కన్నె కంటి చలిమంటలూ
ఇటు నెత్తురు - అటు అత్తరు
ఇటు త్యాగము - అటు భోగము
ఉన్మత్తుడై, చలచిత్తుడై, కామాంధుడై, పాపాత్ముడై
పుత్రరూపమున శత్రువై, మాతృ హత్యనే చేశాడు
జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు
కన్నుమిన్ను కానక, కన్నతల్లి గుండె కానుక
కన్నెపిల్ల కే ఇవ్వగా !

కన్నుకానక పరుగులెత్తగా - కాలుజారి పడిపోయాడూ
చావు దెబ్బతిని అమ్మా అమ్మా అమ్మా అంటూ
గావు బొబ్బలే పెట్టాడు

డైలాగ్ : అప్పుడు ఆ తల్లి గుండె యెమన్నదో తెలుసా?
నాయనా దెబ్బతగిలిందా ? జాగ్రత్త నాయనా
నా ఆయుష్షు పోసుకొని నూరేళ్ళు చల్లగా
వర్ధిల్లు నాయనా -

అమ్మ కోరేదీ ఒకే ఒక్క మాటరా 
అయిదూ ప్రాణాలుపోసి  నవమాసాలు మోసిన
తనకు అప్పు పడ్డందుకు
తలకు కొరివి పెట్టమనీ
తన ఋణమును తీర్చమనీ
ఎన్ని జన్మలెత్తినా తనబిడ్డయి పుట్టమనీ
అమ్మా అని పిలవమనీ -
మాతృదేవోభవా ! మాతృదేవోభవా !
మాతృదేవోభవా |

Palli Balakrishna
Bottu Katuka (1979)




చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి, జాలాది, ఉత్పల, ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 
నటీనటులు: మురళీమహన్, నూతన్ ప్రసాద్,  శ్రీధర్, హరిబాబు, జయంతి, మాధవి, నిర్మల 
దర్శకత్వం: విజయబాపినీడు 
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి 
విడుదల తేది: 21.12.1979



Songs List:



స్వాగతం - స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఉత్పల
గానం: పి.సుశీల, యస్.పి.శైలజ

స్వాగతం - స్వాగతం సుస్వాగతం
సీతమ్మ చరితమే రామాయణం -
మా అమ్మ కథ మాకు పారాయణం

పిన్నలు పెద్దలు విచ్చేసి - మా కన్నుల పండుగ చేశారు
పూలూ పండ్లూ తాంబూలాలు - పుచ్చుకొనండి.
అమ్మ నుదుట యీ కుంకుమ పెట్టి - అక్షింతలు చల్లండి 
మీ ఆశీస్సులు పలకండి దీర్ఘ సుమంగళీభవ

ఇంటికి దీపం ఎంతో వెలుగు - ఆ వెలుగుల జిలుగే మా అమ్మ
వెన్నలోని మెత్తదనం వెన్నెలలో చల్లదనం -
కలబోసిన బొమ్మే మా అమ్మ
అమ్మంటేనే త్యాగం - అమ్మంటే ఒక యోగం
అమ్మలోని అనురాగం - పొందడమే వైభోగం
తల్లిని తలచి తల్లిని కొలిచి  తల్లయి నిలిచే భాగ్యమే సౌభాగ్యం
నా భాగ్యం దీర్ఘ సుమంగళీభవ




తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు
నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నావారేమైపోతారు ?
నా గుండెల్లో బరువు దింపుకోవాలని 
నా గోడంతా నీకు చెప్పుకోవాలని 
గుడికొచ్చాను నీ గుడికొచ్చాను
గుప్పటిలో రగులుతున్న నిప్పుల కుంపటిని 
ఎలా దాచుకోనూ నే నెలా తటుకోను... హా మైగాడ్ 

వెన్నవంటి మనస్సున, కన్నతల్లి నిచ్చావు
కనుసన్నల మెసిలే సతినే ఇల్లాలిని చేశావు 

పసిపాపల మురిపాలతో బ్రతుకు తీపి చూపించావు 
వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే ఆ మాటలు వింటుంటే
కన్నీరు ఆగదాయె నా హృదయం నిలువదాయె.... హా మైగాడ్
తనకంటే ముందుగ నేనే తనువును చాలిసుంటే
తన బొట్లూ కాటుకలే పోతున్నాయని వింటే 
కన్న తండ్రి కరువై పోతే చిరుగుండెలు చెరువై పోతే
ఆ పరిణామం తలచుకుంటే ఆ దృశ్యం ఊహించుకుంటే
గుండె పగిలిపోతుంది - బ్రతకాలనిపిస్తోంది - హా మైగాడ్




చాటపర్రు చిన్నోడమ్మో. పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి, జాలాది, ఉత్పల, ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 

చాటపర్రు చిన్నోడమ్మో. యీడు చావతేరి వున్నోడమ్మో
కోడెగిత్త యీడుంది - కోడిపుంజు పొగరుంది
జోడుకట్టి ఆడుకుంటే - జాంచెట్టు నీడుంది
ధధిన్నక్క ధధినక్క - దధినక్క - ధా

జొన్నపాడు చిన్నదాన్నిరో- నేను జున్ను ముక్కలాంటిదాన్ని రో
కందిరీగ నడుముంది మల్లెతీగ నడకుంది
అల్లిబిల్లి ఆడుకుంటే - వొళ్లు ఝల్లు మంటాది
ధదిన్నక్క, ధధినక్క - ధధినక్క - ధా

వెర్రి యెంగళ్ళప్పా - యేమిటయ్యా నీ గొప్పా.... ?
మేకలాగ కేక లెయ్యమాకూ అదుపే లేదే నీకు....
వంగ పండురైక చిన్నదీ - అది దొండపండు కన్నా - ఎర్రదీ
మంచు కురిసి చేను పండదూ - నీ మాటతోటి - మనసే నిండదూ
గంగలాగ పొంగుతున్న గంతులేసి ఆడుతున్న
బొంగరాల బుగ్గమీద బొమ్మరిల్లు కడతానే

ధధినక్క, ధధినక్క - దధినక్క - ధా

యెర్రి యెంగళప్పా - మేమిటయ్యా నీ గొప్పా
మేకలాగ కేక లెయ్యమాకు ఆదుపే లేదే నీకు
చారెడేసి కళ్ళు వున్నాది - అది చేపలాగ యెగురుతు వున్నాదీ

ముసురుకుంటే ముద్దే తీరదూ నిన్నూ తలుసుకుంటే తనివే తీరదూ
డోలు సన్నాయిపాటా - తానా తందాన ఆటా
తాళిబొట్టు కడతానే తకతై తకతై ఆడతానే
ధధినక్క, ధధిన్నక్క అధిన్నక్క కధిన్నక్క





అల్లిబిల్లి గారడీ పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అల్లిబిల్లి గారడీ - అల్లరిచూపులు చిన్నది
కమ్మని కాగినీ ఇమ్మన్నదీ
అల్లిబిల్లి గారడీ - అల్లరిచూపులు టక్కరి
కళ్లల్లో వున్నదీ కాదంబరీ లబధిక లబధిక లాపాప

వరాలు ఇచ్చే దేవతలాగ కనబడతావు నువ్వు
అందం చందం ఆరాధిస్తా ఆశలు తీర్చవే నువ్వు
నీ నవ్వే వెన్నల పువ్వు - అబదిక, లబధిక లాపాప -
ఏదో ఇవ్వమంటావు - అబ్బా ఆగనంటావు
మురిపించే తొలిరేయి రావాలిగా
కమ్మని కౌగిలీ ఇమ్మన్నదీ హ హ హ
మగాడి కున్న తహతహలన్నీ పడుచుపిల్లకీ వున్నా
వురకలువేసే ఉబలాటానికి - పగ్గం వేయమంటుంది
శుభలేఖను రాయమంటుంది - లబదిక, లబదిక లాపాప
ఇప్పుడే లగ్న మంటాను, ఇదిగో తాళి కడతాను
తీరాలి ముచ్చట తీరాలి




ఏమయ్యా మావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 

ఏమయ్యా మావయ్యా - కాబోయే చావయ్యా
చక్కని అక్కయ్య దక్కాలంటే చుక్కల పల్లకి ఎక్కాలంటే
మరదలు షరతులు వింటేనే - ఆ ముచ్చటలన్నీ తీరేది
మా అక్కకు అసలే వంటా వార్పులు రావు 
కంటికి రెప్పగా - కాచామందే మేము

అదే మున్నది. హోటలు వున్నది 
కేరేజితోనేనే కాలం గడిపేస్తాను
పరాయి పిల్లతో - సరాగ మాడారంటే 
కరాటి దెబ్బకు నరాలు తొలిగేనండీ
రంభంటిది యిల్లా లుండగా - మరోదానికో పని యేమున్నదీ
ఏమమ్మా కోడలా కాబోయే మరదలా....?
ఏవయ్యా మామయ్యా కాబోయే బావయ్యా

కోరిన వెంటనే - పుట్టింటికి పంపాలి
తర్వగా రమ్మని - తొందర పెట్టక వుండాలి
గురుతొచ్చినా గుబులెత్తినా మరదలుపిల్లా నిన్నే పిలిపించుకుంటానూ

పిల్లా జల్లా కని పెంచాలనిలేదు
మా అక్కకు అసలా మాటంటేనే గిట్టదూ...
ఆ బరువెందుకూ యీ గొడవెందుకూ
కావాలంటే - నేనే పిల్లలు కూడా కంటాను
అన్నిటికీ తలవూపే ముద్దుల బావయ్యా
గంగిరెద్దే - నీకన్నా మేలయ్యా

లల్ల లలాలా లల్లలలాలా లాలాలా
లల్ల లలాలా లల్లలలాలా లాలాలా




ఒరేయ్ అసలే కొత్త పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు & కోరస్ 

ఒరేయ్ అసలే కొత్త గట్టిగా పట్టుకోండ్రోయ్
పట్టుకున్నాంగాని నువ్వు కానీవోయ్
వచ్చి దాని యవ్వారం కదా తప్పకోమని చెప్పండిరా
తప్పుకో.... తప్పుకో .... తప్పుకో.... తప్పుకో.... తప్పుకో ....
బెల్లూ బ్రేకుల్లేవు నారాయణ ఇది - పరమ కంత్రీ బండి నారాయణ
రైటూ లెఫ్ట్ లేదు  సైడ్ నెంబరు లేదూ

అడ్డు తగిలారంటే నడ్డి నిరుగుద్దండి
సైడో సైడో అహఁ సైదో సైడో.... అహహం
తప్పుకో ....తప్పుకో .... తప్పుకో..... తప్పుకో.....
అమ్మోయ్ నాయనోయ్ దేవుడోయ్ చచ్చాన్రా మీ జిమ్మడ
మీకు కళ్ళున్నాయా? లేవా ? ఏమీ లేవురా....?
బెల్లూ బ్రేకుల్లేవు నారాయణా - ఇది పరమ కంత్రీ బండి నారాయణ
అమ్మా యీరకంగా పదారుసార్లు చెప్పాం ఎన్నిసార్లు పదారుసార్లు
నువ్వు అడ్డంవచ్చి సైకిల కిందపడి మమ్మల్ని అంటే ఎలాగ?
తప్పుకో ....తప్పుకో .... తప్పుకో .... తప్పుకో.... తప్పుకో .... తప్పుకో....
గాడి తప్పితే బండి తిరగబడతది ఆ  తిరగబడతది ....
గడపదాటితే ఆడది పరువు చెడతదీ - ఆ పరవు చెడతదీ

ఓర్పువున్న ఆడదీ యిల్లాలయ్యో యిల్లాలు యిల్లాలయ్యో ఇల్లాలు
ఓటి బండిలాటిది - గయ్యాళయ్యో గయ్యాళి - గయ్యాళయ్యో గయ్యాళి
పెద్దయ్య సుద్దులు కావు - మా బద్రమ్మ చెప్పిన సూత్రాలు
అడ్డు తగిలారంటే నడ్డి విరుగుద్దండి -  సైడో సైడో సైడో
తప్పుకో, తప్పుకో, తప్పుకో, తప్పుకో, తప్పుకో

ఒరేయ్ వరేయ్ వెధవనాయాల్లారా మీకు బుద్దుందా లేదా
నీకు బుద్దుందా నీకు బుద్దుందా
నీకు బుద్దుందా - నీకు బుద్దుందా
మరి నీకో ఓరి నీయవ్వ 

బెల్లు బ్రేకుల్లేవు నారాయణ - పరమ కంత్రీబండి నారాయణ
ముసలిడొక్కు సైకిళ్ళకు ముడుపు పెట్టకు

ఆఁ మదుపు పెట్టకు నక్కజిత్తు నాయాళ్ళను విడిచి పెట్టకు - ఆఁ విడిచిపెట్టకు
బుద్ధి గడ్డితిన్నవాడిని - తన్నాలయ్యో తన్నాలి - తన్నాలయ్యో తన్నాలి..
పక్షిగాడి వాహనాన్ని తుక్కు తుక్కు చేయాలి - తుక్కు తుక్కు చేయాలి
సిద్దయ్యా సుద్దులు కావు మా బద్రమ్మ చెప్పిన సూత్రాలు
అడ్డు తగిలారించే నడ్డి విరుగుద్దండీ - సైడో సైడో 
బెల్లు బ్రేకుల్లేవు నారాయణ - యిది పరమ కంత్రీ బండి నారాయణో

Palli Balakrishna
Cheyyethi Jai Kottu (1979)




చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే.వి.రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, గీత, పల్లవి, జయమాలిని, జ్యోతిలక్ష్మి 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
నిర్మాత: కె. రామచంద్ర రావు 
విడుదల తేది: 10.08.1979


(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )




Songs List:



యాలో యాలా ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

యాలో యాలా ఉయ్యాలా
గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా
ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా
ఈ పులకరింతలే పూలు పుయ్యాలా
ఆ పలకరింతకే పైట జారాల ....

వున్న ఈడులేని తోడు - ఈసులాడుకున్న ఈ వేళ
మల్లెపువ్వు పిల్ల నవ్వు - మాటలాడుకున్న ఈ వేళ
ఏ ఈడులో ఆ వేడుక జరగాలనే చలికోరిక
కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా
కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల
ఈ కలవరింతలే కలిసిరావాల
ఆ కోగిలింతలో కలిసిపోవాల....

వానపువ్వు తేనెటీగ - ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ
కన్నెసోకు కన్నుసోకి మొగ్గలిచ్చుకున్న ఈ వేళ
ఈ గుండెలో గూడున్నది - ఏ గువ్వకో చోటున్నది
కొత్తబరుపు నాకోకబిగువు కాజేసిందియ్యాలా
పైటదరువు నా పరువుతీసి ఆరేసిందియ్యాలా
ఈ జలదరింత నేనేడ దాయాలా
ఈ తొలకరింత నేనెవరికియ్యాలా ....




కోడెవయసూ కుమ్మేస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల , యస్.పి.బాలు

కోడెవయసూ కుమ్మేస్తుంటే - కొంటె మనసూ దొలిచేస్తుంటే
తిమ్మిరెక్కి నాఒళ్లు తుళ్లి తుళ్లి పడుతుంటే...ఏం చెయ్యాలి...అమ్మో
ఎటు పోవాలి?
ఆరు బైట జారు పైట రెపరెపమంటే నా గుండెలోన రేగింది
సన్నని చలిమంట
నీ చూపు నా వైపు ఎగాదిగా చూస్తే నా వెన్నులాగ సాగింది
వెచ్చని పులకింత
పట్ట బోతే పావురాయి - కొట్ట బోతే కొక్కిరాయి
అందకుంటే సూదంటురాయి అందకుంటే ఆకురాయి
కలిసివుంటె హాయి - కలపవేమె చేయి - 
ఒ రాలుగాయి గడుగ్గాయి అమ్మాయి
ఏం చెయ్యాలి - ఎటుపోవాలి
జత కలపాలి - కధ నడపాలి ॥కోడెవయసూ॥

బుగ్గమీద ముగ్గులేసి అలా అలా రాస్తే
సింగారం చిలికింది సిగ్గుల సిరిమొగ్గ
కూత కూసి లేతనడుము అటూయిటూ వూగితె
వలపు వయసు గోదారికి వచ్చింది వరద
ముట్టుకుంటే మునగకొమ్మ - పట్టుకుంటే వదలడమ్మ
మచ్చికైతే పూలరెమ్మ - నచ్చకుంటే మంచుబొమ్మ

పెళ్లయితే కీలుబొమ్మ - అందాక ముళ్ళకొమ్మ
ఆ పైనే నీముచ్చుట తీరేనమ్మా
ఏంచెయ్యాలి ఎటుపోవాలి - జతకలవాలి కధనడపాలి




మాఘమాసం మాపటేల పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

మాఘమాసం మాపటేల - మనక ఎన్నెట్లో
గోరింట పొదరింట కోరిన కౌగిట్లో
ఎన్ని ముద్దుముచ్చట్లో - ఎన్నో వున్నై గుప్పెట్లో
ఎట్టా సెప్పను యిప్పట్లో - సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం||

పులకింతలే బుసకొట్టగా - గిలిగింతలే నసపెట్టగా
ఆ కళ్ళే గిల్లి గిల్లీ - నా ఒళ్ళే తుళ్ళి మళ్ళి
నాగమల్లి తోటకాడ చంద్రవంక వాగులోన
నిండా మునగకుండానే నీల్లాడబోకుంటే
చలి చలి చలి అన్నానే, చెలి చెలి చెలి అన్నాడే
ఆడేమన్నాడో నేనేం యిన్నానో
ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం॥

పడుచందమే కడవెత్తగా - తడికొంగులే పడగెత్తగా
నీళ్ళే తొణికి తొణికి - నా ఒళ్ళే ఒణికి ఒణికి
నీలికొండ చాటుచూసి నీటిఎండ కాపుకాసి
ఆరీ ఆరకుండానే చీర కట్టుకొస్తుంటే
చుర చుర చుర చూశాడే - విర విర విర లాడానే
కంటే చూశాడో - కాటే వేశాడో.

ఎట్టా సెప్పను యిప్పట్లో
సెబుతా పెళ్ళిపందిట్లో.... ॥మాఘమాసం॥





చీరులోయ్ చీరులు పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు, యస్. జానకి

చీరులోయ్ చీరులు - చీరులోయ్ చీరులు
చుక్కచుక్క జారుల్లో - నిషా హుషారుల్లో
ఆనంద నిలయం - అందాల వలయం  
ఈ చుక్క సరసం - అందుకుంటె సార్గం.....॥చీరులోయ్ ||

పాలకుండ ఎన్నెలంటరో ఎన్నెట్లో నీలికొండ జారుబండరో
బండమీద కొక్కిరాయిరో - నన్ను నిక్కినిక్కి చూస్తుందిరో

అయితే యిదే మన తక్షణ కర్తవ్యం

నీటూ గోటూ దుశ్శశనా
సరసకురారా సుయోధనా
దానంచేసే ఓ కర్ణా - పాచికలాడే ఓ శకునీ
బొమ్మలాట నువ్వు ఆడకురా .. దుమ్ము దులపరా దొరమావా

మరి పొజిసన్ మార్చహే 

మార్చుకున్నా చల్లార్చుకున్నా - దీపాలయాల కాదురో
చీకట్లో చిందువేయరో 

అయితే ఒత్తినొక్కి దీపమార్పెయ్....
భారతకథలో రారాజైనా భామకు లోబడిపోలేదా
మందు పొందూ మరిగినవాడే - ఇంద్రుడిగా నిలబడలేదా
నేలకు నాలుగు దిశలంటా ఈ మనిషికి నాలుగు దశలంటా
దశలూ దిశలూ మారితే ఈ చతుష్టయం గతి ఏమంటా
రంభా ఊర్వశి  నేను మీ రంగులు తేల్చేస్తాను 
కామిని యామిని నేను మీ కధలే మార్చుతాను

Palli Balakrishna
Adikeshava (2023)




చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల 
దర్శకత్వం: శ్రీకాంత్ N. రెడ్డి 
నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య 
విడుదల తేది: 2023



Songs List:



సిత్తరాల సిత్రావతీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్ర 

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా
రోజు ఓ కొంచం చదివెయ్ కధలా
పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రప్పిస్తా

కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే




హే బుజ్జి బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల 

ఆ ఆ ఆ మగసనిస
ఆ ఆ ఆ నిసదానిస

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

నీ మౌనరాగాలే నాతో ఏమన్నా
ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా
ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా
నా దారి మారిందే నీ దయ వలనా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

అనగనగా కథలోని
రాజకుమారి నువ్వేలే
కలివిడిగా నను కోరి
దివి దిగి వచ్చావే

కలగనని కన్నులకు
వెలుగుల దీవాళీ నువ్వే
ఎదసడిగా జతచేరి
నా విలువను పెంచావే

ఓ అమ్మాయో నీదేం మాయో
ప్రేమాకాశం అందించావే
ఆ జన్మనా నీ రోమియో
నేనేనేమో అనిపించావే

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

ఇన్నేళ్ళు ఇంతిదిగా
సందడిగా లేనే
భూమ్మీద ఉంటూనే
మెరుపులు తాకానే

నీ మనసు లోతుల్లో
నా పేరే చూసానే
లవ్ స్టోరీ రాస్తానే
మన కథనే

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా




లీలమ్మో లీలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: నకాష్ అజీజ్ 

బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా
బళ్లారి తోవల్లో బొమ్మనాదేస్తావా
సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై
సిగ్గు సీమంతం జేస్తావా, వా వా వా

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూత్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

లగో లగోరే లగ్గం పెట్టిస్తా
బాసింగాలు కట్టించాకా బంతులాడిస్తా
హే గజ్జల్ పట్టీల్తో హే గడప దాటేస్తా
మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా

అమ్మి యమ ఉన్నావే కిరాక్కు
సోనామసూరి లాంటి నీ సోకు
రెడ్డి నీ మీసాలే కసక్కు
నేనిచ్చే చాన్సే హే ఇచ్చాయి పాసు

పొద్దు పొద్దున్నే ముద్దు ఫలహారం
మధ్యాహ్నంకే మడత నడుం నీకే గుడారం
ఏ సందే దూకిందా సైగా అలారం
కోక పుంజు కూసేదాక దుమ్ము ధుమారం

అమ్మీ నీ కులుకేమో గోకాకు
దొమ్మీ అయిపోద్దే నువ్ నవ్వాకు
రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు
హే వడ్డి ఇస్తా లెక్కే తెల్సాకు

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

Palli Balakrishna Friday, October 27, 2023

Most Recent

Default