Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

F2 – Fun and Frustration (2019)చిత్రం: F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: డేవిడ్ సైమన్
నటీనటులు: వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ ఫిర్జదా
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12. 01. 2019

హే క్రికెట్ ఆడే బంతికి
రెస్టే దొరికినట్టు ఉందిరో
1947 ఆగస్ట్ 15 ని
నేడే చూసినట్టు ఉందిరో

దంచి దంచి ఉన్న రోలుకి
గేపే చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని
చూసి ఎన్నాళ్ళయిందిరో

ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి
ఫ్రీడమ్ చేతికందిందిరో
పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు
స్వర్గమే సొంతమయ్యిందిరో

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)

హల్లో అంటు గంట గంటకి
సెల్లె మోగు మాటి మాటికి
నువ్వు ఎక్కడున్నవంటు
నీ పక్కనెవ్వరంటు
చస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి

కాజ్ ఎ చెప్పాలి లేటుకి
కాళ్ళే పట్టాలి నైట్ కి
గుచ్చేటి చూపురో సెర్చింగ్ ఆప్ రో
పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి

లేసర్ స్కానర్ ఎక్స్-రే ఒక్కటయ్యి
అలి గా పుట్టింది చూడరో
చీటికి మాటికి సూటిగా అలుగుతారు
అంతకన్న ఆయుధాలు వాడరు

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్

బై బై ఇంట్లో వంటకి
టేస్టే చూపుదాం నోటికి
ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి
థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి
ఆర్గ్యు చేసి ఉన్న గొంతుని
పెగ్గే వేసి చల్ల బడని
తేలేటి ఒల్లుని పేలేటి కళ్ళని
దేఖో కంటబడ్డ ఫిగర్ ని

క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే
బండికి స్పీడునే పెంచరో
పెళ్ళమో గొళ్ళెమో లేని ఓ ధీవిలో
కాలు మీద కాలు వేసి బతకరో

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)*****  *****  *****


చిత్రం : F2 (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్

స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

కళ్ళు కళ్ళూ కలుపుకుంటూ
కలలు కలలూ పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోనీ
రాతిరంటె కమ్మనైన
కౌగిలింత పిలుపనీ
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటె తియ్యనైన
ముద్దు మేలుకొలుపనీ
దొంగలాగ నిద్రపోవడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

రోజుకొక్క బొట్టుబిళ్ళే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోందే
బైటికెళ్ళే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్ళె వేళ అంటు
మల్లెపూల పరిమళం
మత్తుజల్లి గుర్తుచేయడం
ఇంటి బయిట చిన్నదాని
ఎదురుచూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్


Palli Balakrishna Friday, December 28, 2018
Mr. Majnu (2019)
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 25.01.2019

ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

చుక్కలే మాయమైన నింగి లాగ
చుక్కలే కురవలేని మబ్బు లాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో

ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

వివరమంటు లేని వింత వేధనా
ఎవరితోటి చెప్పలేని యాతనా
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నువ్వెలాగ వేడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
ఓ నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్ధమవదు నాకు ఇంతగా మారెనా
కాలమే కదలనన్న క్షణము లాగ
ఎన్నడూ తిరగరాని నిన్నలాగ

ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటోచిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రమ్యా NSK, ఎస్. ఎస్.థమన్

దేవదాసు మనువడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
పెర్‌ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవ్వనుడు
కన్నే కళ్లలో కలలేవి వదలడు

హార్మోన్స్‌లోన
సెగలు రేపు పొగలు
షార్ట్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్
వీడి ముద్దు పేరు...

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను 

దేవదాసు మనువడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
పెర్‌ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవ్వనుడు
కన్నే కళ్లలో కలలేవి వదలడు

హార్మోన్స్‌లోన
సెగలు రేపు పొగలు
షార్ట్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్
వీడి ముద్దు పేరు...

నిన్నలోనే ఉండడే
రేపు మనకే దొరకడే
ఈరోజంతా మనదే దందా
గ్రాండ్‌ సాంగుడే

ఉన్నచోటే ఉండడే
వన్నెచాటు కృష్ణుడే
గుండెల్లోన బాణమల్లె వీడు
ఎన్నాళ్లున్నా నొప్పి తెలియనీడు...

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను
మిస్టర్ మజ్నుచిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: కాల భైరవ, శ్రేయా ఘోషల్

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా

నాకే సాధ్యమా నిన్నే మరువడం
నాదే నేరమా నిన్నే కలువడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళ్తున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలేనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనక నీరే నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం ఉందని తెలుపక

నువ్వని ఎవరిని తెలియని గురుతుగా
పరిచయం జరగనే లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక

మరిచే వీలు లేనంతా పంచేసావు ప్రేమంతా
తెంచెయ్‌మంటే సులువేం కాదుగా

మనసులే కలవడం వరమా శాపమా
చివరికి విడువడం ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నాPalli Balakrishna
Vinaya Vidheya Rama (2019)

చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రాంచరణ్, కియార అద్వానీ
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: డి. వి. వి.దానయ్య
విడుదల తేది: 10.01.2019Songs List:తందానే తందానే పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: MLR కార్తికేయన్

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఏ తియ్యదనం మనసుపై రాసిందో
ఎంతో అందంగా ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఈ ఇంట్లిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడు అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే

విడి విడిగా వీళ్ళు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా

విడివిడిగా వీళ్ళు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే

ఒకటే కలగంటాయంట వీళ్ళందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జాజ్, ఎమ్. ఎమ్. మానసి

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

ఓ య్యా..ఓ య్యా..ఓ య్యా

రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు
ఉంటాదంటా మన జట్టు
వాళ్ల కథలో క్లైమ్యాక్స్ పాసిటివ్ గా రాసినట్టు
మన లవ్ స్టోరీ హిట్టు
షా జహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు
ఉంటామంతా మనం ఒట్టు
రీ-ప్లాన్ చేసి నువ్వు ఈ సారైనా
తాజ్ మహల్ ముందే కట్టు

యూ ఆర్ మై గర్ల్ యూ ఆర్ మై గర్ల్!
మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు

యూ ఆర్ మై వర్ల్డ్! యూ ఆర్ మై వర్ల్డ్!
వేడి వేడి లావా స్వీట్ పాల కోవ ఒకటైతే నువ్వు

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

డోనట్ లాంటి కళ్ళు తిప్పి
చాక్లేట్ లిప్స్ రెండు విప్పి
ఐస్ ఫ్రూట్ మాటలేవో చెప్పి
నను పిచ్చెకించినావే

రెడ్ బుల్ లాంటి నవ్వు తొట్టి
డమ్‌బెల్ లాంటి కండ చూపి
లవ్ సింబల్ లా గుండె లోకి
నువు ఎంట్రీ ఇచ్చినావే

క్రీమ్ ఏ నువ్వు స్టోనెయ్ నేను
ఒకటై పోదాం క్రీమ్ స్టోన్ లా
బ్రెడ్ ఏ నువ్వు జాం ఏ నేను
మిక్స్ అయ్యీ పోదాం బ్రెడ్ జాం లా

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

చందమామ మీద కాలు పెట్టి
ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు
నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి
నేను కూడా పొంగిపోనా

న్యూటన్ మైండ్ నే లాగి
ఆ ఆపిల్ మురిసిపోయినట్టు
నా హగ్గు లోకి నిన్నే లాగి
నేను కూడా మురిసిపోనా

వైరల్ అయిన వీడియో లా వెలిగిపోదా
నువ్వుంటే నా చిట్టి జిందగీ
ట్రెండ్ సెట్ చేసిన టీజర్ అంటూ పేరు రాదా
మన వందేళ్ళ ఇష్క్ బొమ్మ కి

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
ఏక్ బార్ ఏక్ బార్ పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:  దేవి శ్రీ ప్రసాద్, రానైన రెడ్డి

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

హేయ్ రావే నా అలీషా
చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా హమేశ
నాలోని కళాకర్ నీలోని అలంకర్
మిక్స్ ఐతే డిస్కొ బార్ ఫుల్ హుషార్
ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్

ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్
ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ ఫ్లైట్ లాగా తాకే ఆఫ్
ఏ రయ్య్ మందిలే
నీ నడక చూసి
నా బుల్లి హార్ట్

హై టార్చ్ కైట్ అల్లే ఎగురుతుందిలే
నీ రాకతోటి నా హార్ట్ బీట్

ఓ మినీ ఓ మినీ నా సోకులా సొగామిణి
తినిపిస్తా బిరియానీ

చూపిస్తా నా దునియాని

ఓ హనీ ఓ హనీ
ఇక నువ్వే నా కహాని
నా వయ్యరాల గని
నువ్ ఏం చేస్తావో గాని

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

హేయ్ సున్నా కున్నా విలువేన్టో
తెలిసినాదిలే
నీ సన్నాయంటి
నడుము చూసినాక

హేయ్ రెంట్ లేని కరెంట్ అంటే
తెలిసినాదిలే

నీ కొంటె చూపు షాక్ కొట్టినాక
రాణి ఓ రాణి
నన్ను నీతో పాటే రాణి
నీ సోలో సొగసులన్నీ

ఫ్లో లో ఎత్తుకుపోనీ
ఆజ రాజా జానీ
నీ జానూ నేనే పోనీ
ఈ సూపర్ సౌండ్ కి బాణీ
అరె సూపర్ హిట్ ఐపోనీ

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

రామ లవ్స్ సీత పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:  సింహా, ప్రియ హిమేష్ 

హేయ్ రబ్ నే బనా ది జోడీ
అన్నది నిన్నే చూశాక నా దిల్లే
ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి
ఇచ్చెయ్ నీ మనసు ఇవ్వాలే
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి
లోకం అనాలి లే
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

దిల్ మే పతంగ్
మదిలో మృదంగ్
మెదిలే తతంగమదిరిందే
కులికే గులాబీ
పలికే హనీ బీ
జోడీ భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంతా
ఊరు వాడంతా
కోడై కూసిందిలె

సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత

రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్ సీత

నువ్వు నేను జంటై కలిసి
చేసే లంచ్ డిన్నర్ చూసి
నేబర్హుడ్ ఏ ఫుడ్ వదిలేసి
ఏమందో తెలుసా

నువ్వు నేను టికెట్ తీసి
చూసే సినిమా ఆరా తీసి
దునియ మొత్తం ఫీలై జెలసీ
ఏమందో తెలుసా

బ్రేకింగ్ న్యూస్ ఏ లేక
న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక
ఈ స్టేట్ ఏ ఊసుపోక
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి
నువ్వే పంపిన సెల్ఫి చూసి
నా బుగ్గల్లో సిగ్గే మెరిసి
ఏమందో తెలుసా

నువ్వే నాకై ఆర్డర్ చేసిన
రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి
లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి
ఏమందో తెలుసా

హో జోశ్యం చెప్పే చిలక
మన ఇద్దరిని చూశాక
ఆలస్యం దేనికింకా
అని ఢోల్ ఏ కొట్టి ఢంకా
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
అమ్మా నాన్న లేని పసివాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  కాల భైరవ 

అమ్మా నాన్న లేని పసివాళ్ళు
ఐనా అన్నీ ఉన్నోళ్ళు
నింగి నేల వీరి నేస్తాలు
కొమ్మా రెమ్మా చుట్టాలు

ఈ ఆడి పాడే పాండవులు
కలతే లేని మహారాజులు
ఏ బంధం లేని బంధువులు
కలిసుంటారంతా ఎనలేని రోజులు

లాలి జో లాలి జో
లాలి జో లాలి జో

కదిలే దేహాలే ఐదైనా
ప్రాణం మాత్రం ఒకటేగా
వేరు మూలాలన్ని వేరైనా
వెళ్లే మార్గం ఒకటేగా

ఒక రక్తం కానే కాకున్నా
అంత కన్నా మిన్నై కలిసారుగా
ఈ బంధం పేరే వివరంగా
వివరించే మాటే జన్మించలేదుగా

లాలి జో లాలి జో
లాలి జో లాలి జో

Palli Balakrishna
Padi Padi Leche Manasu (2018)చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్ , శ్రీనిధి
నటీనటులు: శర్వానంద్, సాయిపల్లవి
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 21.12.2018

పద పద పద పదమని
పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల
మది వలదని వారిస్తే
పెరుగుతుందే మదికాయాసం
పెదవడుగుతుందే చెలి సావాసం
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగ
ప్రాణం పోయినట్టే పోయి వస్తే

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే  మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..

చిత్రంగా ఉందే చెలీ
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటే సరి
చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే
నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటే నడిచి
వసంతమొచ్చేనె
విసిరావలా మాటే వలలా కదిలానిలా...

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే  మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనురాగ్ కులకర్ణి

కల్లోలమెంటేసుకొచ్చే పిల్ల గాలే
నను చూస్తూనే కమ్మెసెనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కే రైలే
విహరించెనా భూలోకమే

గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిధిగా నువ్వొచ్చావనే

కలిసేందుకు తొందర లేదులే
కల తీరక ముందుకు పోనులే


కదిలేది అది
కరిగేది అది
మరి కాలమే కంటికి కనపడదే

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా
రెప్పలే పడనంత పండగ
గుండెకే ఇబ్బందీలా టక్కునా ఆగెంతలా
ముంచినా అందాల ఉప్పెనా…

గొడుగన్చున ఆగిన తూఫానే
ఎద పంచన లావా నీవేనే
కనపడని నది అది పొంగినది
నిను కలవగా కడలై పోయినదే

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్

నువు నడిచే ఈ నేల పైనే నడిచానా ఇన్నాళ్లుగా నే
ఈ క్షణమే ఆపాలనున్నధి ఈ భూభ్రమణమే !
నీ చెలిమి వద్దంటూ గతమే బంధీగా చేసిందీ నన్నే
తక్షణమే చేయాలనున్నధి తనతో యుద్ధమే
ఇవ్వాలే తెగించా ఇదేనేమో స్వేఛ్చ
తెలికే తెంచావే నా ఇన్నాళ్ళ సంకెళ్లనే

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇదివరకేపుడు నా ఉనికినెరగని దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..


ఏకాంతమంత అంతం అయేంత
ఓ చూపు చూడే చాలికా
మరు జన్మ సైతం రాసేసి ఇస్తా
నా రాజ్యమంతా ఏలికా.
నీ మౌనంలో దాగున్న ఆ గరళమే
దాచేసి అవుతున్నా నేనచ్చంగా ముక్కంటినే..

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇధివరకేపుడు నా ఉనికీనెరగని

దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిందూరి విశాల్

నంద గోపాలా ఏమిటి ఈ లీల
కంటపడవేమి రా

ఎంత విన్నారా వేచి ఉన్నారా
మాయా విడవేమిరా

రాక్షశుల విరిచి దాగి నను గెలిచి
ఆటలాడేవు రా
ఆ..ఆఆ…
కానరావేమి రా

ఓ మై లవ్లీ లలన.. ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన.. ఇంతే నే వింటే
ఓ మై లవ్లీ లలన.. నీలో బాధ కంటే
ఓ మై లవ్లీ లలన.. ఎలా ధానివంటే
ఓ మై లవ్లీ లలన.. కొంటె గాలి నిన్నంటే
ఓ మై లవ్…

ఆ..ఆ…ఆ…

యధో భూషణా… సూరా పూతనా… వధే చేసేనా.
కాళింది లోతునా… కాలేవు ననచినా..

మహా శౌనకీ… ముక్తే పంచినా…
దివ్యా రూపమే గనే కాంక్ష రా..
నిన్నే కాంచగా కన్నారా కన్నారా
ప్రియ గొంతిలా ముకుందా కృష్ణా
ఓ మై లవ్లీ లలన

ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన
కొంటె గాలే నిన్నంటే

ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన...


*****  *****  *****

చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..

నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

నిను వీడి పోనందీ నా ప్రాణమే..
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..
పోనే.. లేనే.. నిన్నుదిలే...

ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే..
నేలేని చోటే నీ హృదయమే..
నువ్ లేని కల కూడా రానే రాదే..
కలలాగ నువ్ మారకే..
మరణాన్ని ఆపేటీ వరమే నీవే..
విరాహాల విషమీయకే..

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ శిల్పిగంజ్, యమ్ యమ్ మానసి


ఉరికే చెలి చిలకా…
గొడవే ఇక పడకా…
నల్లా జోడు కళ్ళాకెట్టి
చూపే మరిచావా…
ఎత్తు జోడు కాళ్ళకేసి
నేలే విడిచావా…

ఎంత దూరమైనా పోవే
ఎంటపడి నే రానే
ఎండె పోతే ఎనక్కి నువు రావా..
కొంటె నీ గుండె పరిచావా…

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయ్ కే
గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగే తీయ్ కే
ఉంగరాన్ని తొడుగే వేలీయే…
బంగారంలా ఏలూకుంటానే…

ఎర్రని కోకే చూసి వెంట నువు రాకో
ఎవరని అనుకున్నావేమో  ఏంటసలూ
ఏటిలో సేపను కాను వలకు  దొరికేనూ
పొగరుకే అత్తరు పూస్తే అది నేను

వేషమేసారు  ఏంది సారు
ఏలుడంత కొయబంగారు పుట్టిస్తా కంగారు
అంత వీజీ కాదు నన్ను నచ్చుకోవడం
హాయ్..కల్లుకొచ్చి ఎందుకంట ముంత దాచడం
పొగడామాకు అసలు పడిపోనూ…

పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే

Palli Balakrishna Monday, December 24, 2018
Taxiwaala (2018)


చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: శ్రీనివాస్ కుమార్ నాయుడు
విడుదల తేది: 16.11.2018

మాటే వినదుగ మాటే వినదుగ
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపే బ్రతుకులలో తీరే
ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే

మాటే వినదుగా వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం (2)

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయణమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపే బ్రతుకులలో తీరే
ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే
కొన్నిఅందులోను పంచవ మిగిలుంటే హో.. హో..
నీదనే స్నేహమే నీ మనసు చూపురా
నీడలా వీడక సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రాని జేబే కాలీ కానీ
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోని
వీడకులే శ్రమ విడవకులే

తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వానా

మాటే వినదుగ వినదుగ  వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
దిగదుగ వేగం వేగం వేగం (2)

మాటే వినదుగ మాటే వినదుగ

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయణమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో పరిచయం అంతలా పరవశం
రంగు చినుకులే గుండెపై రాయనా

Palli Balakrishna Monday, December 3, 2018
Hello Guru Prema Kosame (2018)చిత్రం: హలో గురు ప్రేమకోసమే (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజన్ నిజర్
నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 18.10.2018

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!

చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే
పుట్టలోన వేలు పెడితే చీమ కుట్టినట్టు
నన్ను పట్టి కుట్టాయిలే

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

చరణం: 1
ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే
తెలుగులోని ఛందస్సు చదవలేదే
హిందీలో షాయిరి మనకు రాదే
నాలో ఈ కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న
వేటూరి చిలిపిదనం మెచ్చుకున్నా
ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పాడుతున్నా
పాతికకేళ్లకొచ్చాక నడక నేర్పినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

చరణం: 2
భూకంపమంటే భూమి ఊగిపోవడం
సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం
ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంట్లోన వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికిపాటు పేరు కలవరం
ఈరెంటికన్నా చాలా వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే పలవరించడం
ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్లు కుందిలే

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!


Palli Balakrishna Saturday, December 1, 2018
Devadas (2018)చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య
నటీనటులు: నాగార్జున, నాని, రష్మీక మండన్న, ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వనీదత్
విడుదల తేది: 27.09.2018

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకుని
ఏ మాట పైకి రాక
మనసేమో ఊరుకోక
అయినా ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేక
ఏదేదో అయిపోతున్నా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా

జాలైనా కలగలేదా
కాస్తైనా కరగరాదా
నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తడుముతున్నా
పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా
తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతన
ఎందుకంటె తెలుసునా
ఇది అనేది అంతు తేలునా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

ఆడ పిల్లో అగ్గిపుల్లో
నిప్పురవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్బుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్ట దిక్కుల - ఇలా వలేసి ఉంచినావే
వచ్చి వాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా - ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్లకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

Palli Balakrishna
Chi La Sow (2018)చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: ప్రశాంత్ ఆర్. విహారి
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: శుశాంత్, రుషాని శర్మ
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాత: నాగార్జున, జస్వంత్ నడిపల్లి
విడుదల తేది: 03.08.2018

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెడవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

అదేదో జరిగిందే  మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

ఏవయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి
పో పొమ్మంటు ఇటు తరిమినదా
నాలో ఏవో ఇదివరకెపుడెరగని తలుపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమీ..

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

Palli Balakrishna
Aravinda Sametha Veera Raghava (2018)చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: మోహన భోగరాజ్
నటీనటులు: జూ. ఎన్టీఆర్, పూజా హెగ్డే , ఇషా రెబ్బ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
విడుదల తేది: 11.10.2018

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ

నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి..
గుండెలవిసి పోయె గదమ్మా

సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి...
సింధూరం బొట్టు పెట్టమ్మా

కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కొలిసీ నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి...
కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా

నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
నల్లాగుడిలొ కోడి కూచే

మేడాలోనా నిదుర లేచే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా


******  ******  ******


చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్

పల్లవి:

చీకటిలాంటి పగటి పూట కత్తులాంటి పూలతోట
జరిన్గిందోక్క వింతవేట పులి పై పడిన లేడి కధ వింటారా
జాబిలీ రాని రాతిరంతా జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంత గుండెల్లోకి దూరి అది చూస్తారా

చుట్టూ ఎవ్వరు లెరూ... సాయం ఎవ్వరు రారూ...
చుట్టూ ఎవ్వరు లెరూ సాయం ఎవ్వరు రారూ 
నా పై నేనే ప్రకటిస్తున్న ఇదేమి పోరూరు

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే  అటుచూస్తే కర్రలు అసలేమైపోతారు అన్యాయం కదా ఇది అనరు ఎవ్వరు.....(3)

ఏ... ప్రతినిమిషం తన వెంట పడిగాపులే పడుతుంటా ఒకసారి కూడా చూడకుందే క్రీగంతా...
ఏమున్నదో తన చెంత ఇంకెవరికి లేనంత ఐస్కాంతమల్లె లాగుతుంది నన్ను చూస్తూనే ఆకాంత

తను ఎంత  చేరువనున్న... అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా
అంత మాయల ఉంది అయినా హాయిగా  ఉంది 

బ్రమల ఉన్న బానే ఉండే ఇదేమి తీరు

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే  అటుచూస్తే కర్రలు అసలేమైపోతారు అన్యాయం కదా ఇది అనరు ఎవ్వరు.....(8)

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...

Palli Balakrishna
Love Birds (1996)


చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: ప్రభుదేవా, నగ్మా
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: శ్రీమతి వి. నిర్మల రాజు 
విడుదల తేది: 1996Songs List:Come On Come On పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

Come On Come On
మనసున మనసుగా పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , చిత్ర

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా 

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే 
కన్నుల్లో నీవే రావా...
రేపే లోకం పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్ , సుజాత మోహన్ 

రేపే లోకం 
నో ప్రాబ్లం పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అపాచి ఇండియన్, ఏ. ఆర్. రెహమాన్

నో ప్రాబ్లం 
సాంబ సాంబ పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అస్లాం ముస్తఫా

సాంబ సాంబ 

Palli Balakrishna
Sharada (1973)చిత్రం: శారద (1973)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: వి.రామకృష్ణ
నటీనటులు: శారద , శోభన బాబు, జయంతి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
నిర్మాత: పి. రాఘవరావు
విడుదల తేది: 1973

పల్లవి:
శారదా నను చేరగా
శారదా నను చేరగా

ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ....ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 1
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...!

ఏమి కులుకు సెలయేటి పిలుపు
అది ఏమి అడుగు కలహంస నడుగు
హోయ్...ఏమి ఆ లయలు..!

కలగా కదిలే ఆ అందం
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం
కావాలన్నది నా హృదయం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 2
నీలి కళ్ళలో  నా నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
నీలి కళ్ళలో  నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
పరిమళించేనా...!

చెండువోలేవిరిదండవోలే..
నిను గుండె కద్దుకొని నిండు ముద్దు గొని
పరవశించేనా..!

అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

ఓ... శ్రావణ నీరదా శారదా

అహా... ఒహో... అహా...


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  వి.రామకృష్ణ, పి.సుశీల 

పల్లవి:
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
చల్లగాలి యెందుకు?.. చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?.. మంచి గంథ మెందుకు?
ఎందుకు? .... ఇంకెందుకు?

శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే  చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 1
ఓ చందమామా  ఓ చల్లగాలీ
ఓ చందమామా  ఓ చల్లగాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ

లలలలలా.. హహహా..

బెట్టు చేసే అమ్మగారిని
బెట్టు చేసే అమ్మగారిని
గుట్టుగా నా చెంత చేర్చాలి
మీరే చెంత చేర్చాలి

శ్రీమతిగారికి తీరని వేళ  శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 2
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఆఆ.. ఉం..ఉమ్మ్..

అలకలోనే అలసి పోతే
అలకలోనే అలసి పోతే
ఇంత రేయి నవ్విపోయేను
ఎంతో చిన్న బోయెను...

శ్రీమతిగారికి తీరిన వేళా..
శ్రీవారి చెంతకు చేరిన వేళా
చల్లగాలి యెందుకు?
చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?
మంచి గంథమెందుకు?

ఎందుకు? ఇంకెందుకు?


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  పి.సుశీల 

పల్లవి:
రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
దాని ఫలితమా నాకీ ఆవేదనా

రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

చరణం: 1
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

మనసులు పెనవేసి.. మమతలు ముడివేసి
మగువకు పతి మనసే.. కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?
ఆ కోవెల తలుపులు మూశావా?
నువు హాయిగ కులుకుతు చూస్తున్నావా?

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి

చరణం: 2
నీ గుడిలో గంటలు మోగాలంటే...
నీ మెడలో మాలలు నిలవాలంటే...
నీ సన్నిధి దీపం వెలగాలంటే...
నే నమ్మిన దైవం నీవే అయితే...
నా గుండెల మంటలు ఆర్పాలి...
నా స్వామి చెంతకు చేర్చాలి...

రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా.. గోపాలా.. గోపాలా.. గోపాలా..


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  సుశీల

పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ..

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వనమెల్ల వేచేనురా.....

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా...

రావేలా...  రావేలా

చరణం: 1
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని...

కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని

ఆ...... ఆ....... ఆ.....  ఆ..
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది...

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా

చరణం: 2
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని

నా నీడ తానన్నదీ రాడు రాడేమని

ఆ......  ఆ......  ఆ.....  ఆ.....

రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల...  చిరుజల్లుగా

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. ఈనాడే తొలిసారి

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

చరణం: 1
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని
అల్లరి చూపులతోనే  నను అల్లుకు పోయేవెందుకని
అల్లరి చూపులతోనే. నను అల్లుకు పోయేవెందుకని
ఆ..ఆ.. అల్లికలోనే తీయని  విడదీయని బంధం ఉన్నదని

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

చరణం: 2
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
విడివిడిగా ఉండలేక
విడివిడిగా ఉండలేక  పెదవులు రెండూ...
అందుకని..
ఎదురు చూసే పూల పానుపు  ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని
ఇద్దరిని తన కౌగిలో  ముద్దు ముద్దుగా..
అందుకని..

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

Palli Balakrishna Wednesday, November 28, 2018
Jabilamma Pelli (1996)


చిత్రం: జాబిలమ్మ పెళ్లి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, మహేశ్వరి, ఋతిక
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: బాబు ఎస్. ఎస్. బురుగపల్లి
విడుదల తేది: 1996

ఓహొ హో హో చుక్కలూరి చందమామ
ఓహొ హో హో... సిగ్గులూరి సంధ్యభామ
ముద్ధిస్తావా... మురిపిస్తావా...
లాలిస్తాలే... పాలిస్తాలే
మాటిచ్చి మరువకుమా...

చరణం: 1
పువ్వై విరిసి నా జడలోనే కొలువుండిపో
నవ్వై మెరిసి నా మదిలోనే నువు నిండిపో
మనసిదిగో వయసిదిగో  సొగసిదిగో అందుకో
వలపిదిగో పిలుపిదిగో జత చిలకా చేరుకో
నిన్నే నమ్ముకుంటున్నా కమ్ముకుంటున్నా
అన్ని అందుకుంటున్న ముందుకొస్తున్న
ప్రియా ఇటున్నా ఇలారా  సరదా రెడీ దొర

ఓహొ హో హో సిగ్గులూరి సంధ్యభామ
ఓహొ హో హో

చరణం: 2
లోకం మరచి నా ఒడిలోనే నిలిచుండిపో
మైకం ముదిరి నా జతలోనే శృతి మించిపో
పెదవిదిగో మదువిదిగో మదనుడివై  ఏలుకో
పసి చిలక రస గుళికా సుఖ పెడతా చూసుకో
త్వరగా గుర్రమెక్కించెయ్ జోరుచూపించెయ్
ఇంకేం వెంటనే వచ్చేయ్. సంపదే ఇచ్చేయ్
అయితే ఇదంతా కలేనా
ఇది నీ దయా ప్రియా

ఓహొ హో హో చుక్కలూరి చందమామ
ఓహొ హో హో సిగ్గులూరి సంధ్యభామ
ముద్ధిస్తావా... మురిపిస్తావా...
లాలిస్తాలే... పాలిస్తాలే
మాటిచ్చి మరువకుమా...

ఓహొ హో హో...

Palli Balakrishna Monday, October 15, 2018
Thali (1997)చిత్రం: తాళి (1997)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , శ్వేతా, స్నేహ, స్వాతి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణ
మాటలు: పోసాని కృష్ణమురళి
నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 24.01.1997

ఓసోసి కన్నె శశీ  ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి  ఊగించే చిలిపి ఖుషి
దిక్కులతో నును సిగ్గులతో నీ బుగ్గలు ఇటు రాని
మక్కువతో చలి ఎక్కువతో నీ దగ్గర జతకాని

ఓసోసి కన్నె శశీ  ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి  ఊగించే చిలిపి ఖుషి

చరణం: 1
సరిగా గురిగా దరిగా జరిగా
అడిగా మనసడిగా
గుండెలోని ప్రేమ నా సాక్షిగా
చెలిగా మెలిగా గిలిగా నలిగా
ఉడిగా జతపడగా అల్లరల్లుకున్న  నీ తోడుగా
జారె స్వాతిచినుకా చీర చాటు చిలకా
చీర సిగ్గుపడకా వేసా మల్లె పడక
తియ్యని కోరికా తీరుతున్న తీరిక

ఓసోసి కన్నె శశీ  ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి  ఊగించే చిలిపి ఖుషి

చరణం: 2
దొరికే ఉరికే దొరికె దొరికి చిలకే ఎదవణికె
వచ్చి చేరుకుంది నీ దారికి
ఉలికే పలికే కులుకె చిలికి కలికి కలలోలికె
నచ్చి వచ్చి ఇచ్చె ఈనాటికే
కంగారరేమిలేని  శృంగారాలు కాని
సింగారాలు చెదిరే చిత్రాలెన్నో కానీ
ఊపిరే ధూపమై వెచ్చనైన తాకిడి

ఓసోసి కన్నె శశీ  ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి  ఊగించే చిలిపి ఖుషి
దిక్కులతో నును సిగ్గులతో నీ బుగ్గలు ఇటు రాని
మక్కువతో చలి ఎక్కువతో నీ దగ్గర జతకాని

Palli Balakrishna
Geetha Govindam (2018)

చిత్రం: గీత గోవింద (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రస్మిక మండన్న
దర్శకుడు: పరశురాం
నిర్మాత: బన్నీ వాసు
విడుదల తేది: 15.08.2018

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

పల్లవి:
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

చరణం: 1
ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశ

నీ యెదుట నిలబడు చనువే వీసా
అందుకొని గగణపు కొనలే చూసా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే...
ఇకపై తిరణాల్లే

చరణం: 2
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువ
జరిగినదడగవా

నా కధని తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవ
చెలిమిగ మెలగవ

నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరణాల్లే

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తధరిన
తద్దింధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం******  ******  ******
చిత్రం: గీత గోవింద (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
ఆ దేవ దేవుడే పంపగ
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్లలో కాంతులే
మా అమ్మలా మా కోసం మళ్లీ లాలీ పాడేనంట

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ
హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లో నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా...

సాంప్రదాయణి శుద్ధపద్మిణి
ప్రేమ శ్రావణి సర్వాణి (2)

చరణం: 1
యద చప్పుడు కదిలే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయ్యనా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా
కళలన్నీ కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలే నంగనాచి కూన
ముళ్ళోకాలు మింగే మూతి ముడుపుదాన
ఇంద్ర ధనుస్సు దాచి రెండు కళ్ళలోన
నిద్ర చెరిపేస్తావే అర్ధ రాతీరైనా
ఏ రాకాసి రాశో నీది
ఏ గడియల్లో పుట్టావే అయినా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ
నా ఉహల్లోన ఉరేగేది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

చరణం: 2
ఏకాంతలన్ని ఏకాంతం లేక
ఎకరువే పెట్టాయి ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగ లేక
కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక
కన్నీరొంటరాయె నిలువ నీడ లేక
ఎంత అదృష్టం నాదే నంటూ
పగ పట్టిందే నాపై జగమంతా...

నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ
నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా
మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటన కుంకుమమ్మ
ఓ వెయ్యేళ్ల ఆయుష్ అంటూ దివించండమ్మ

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలాPalli Balakrishna Sunday, July 15, 2018
Rx 100 (2018)

చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
నటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
విడుదల తేది: 13.07.2018Songs List:నిప్పై రగిలే పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య వర్మ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

నిప్పై రగిలే 
రెప్పలనిండా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిచరణ్ 

రెప్పలనిండా కలగనకుండా
వెన్నెల్ల వాన అనుకోకుండా
పెదవలనిండా మాటలవాన
అలలు యెగసెనులె
ఈ మట్టిలోన పూసె రోజ పూలె
రాగాలు కురిసె వెదురులె
ఇన్నాళ్ళుగ ఇన్నెళ్ళుగ
నాలొ లేవి మహిమలే

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులెఏ

పట్టు గుబురు దాటె సీతకోక చిలుకలా
మిట్ట కలలు దాటె అందమైన నిజముల
పట్టి లాగెనె పట్టు తీగ నన్నిల
యెమయ్యిందో నాకేమయ్యిందో

వద్దంటున్న నీ ముద్దె నన్ను
రమ్మంటుందె నను చంపేసిందే
రై రై రంగులువై ఎన్నాడు చూడనిదై
గుండెలో బొమ్మల్లె పూసె

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే

చంటి పాపలాగ చిందులేవొ వేస్తున్న
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న
వెండి వెన్నలై యెండలోనె కాస్తు వున్న
యేమయ్యిందో నాకెమయ్యిందో

రోజు చూసె నా దారులు కూడ
నేనె ఎవరొ మరి మరిచేసాయే
ఎన్నొ ఎన్నెన్నొ వింతలు నాలోన
యెన్నడు ఊహించనివేగా

కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండ మందారాలే
పడవలనిండ పట్టు తెరలే
అడుగులనిండ ఆకశాలె వాలేనులే
అదిరే హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: కార్తీక్ 

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత
ముదిరే ప్రణయం ముసిరే ప్రణయం
కరిగే పరువం నీ కౌగిట

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అందాల ఆడ సింహమా
చందనాల శిల్పమా
కోడె నాగు వేగమా
నన్నెచేరే నీవుగా
నీతో ఆడే ఆటలే
ముద్దుల సాగే వేటలే
పక్కని వీడి స్వర్గాలు దాటే ఎలా
మహా మహా ఆగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

చల్లరిపోతే మొహామ
మంటలాగా రేగుమ
కంట నీరై జారుమ
నరాల్లో నినదమ
నువ్వే నాతో లేనిదే
నాలోన ఏకం కానిదే
ఈలోకమంతా నా కంటికె సూన్యమే….
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనమే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా

అదిరే హృదయం అదిరే అదరం
మధురం మధురం నీతో జత

నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడ తెరనా
ప్రియ ప్రియా సఖి ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమాపిల్లా రా పాట సాహిత్యం

 
చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాగ్ కులకర్ణి

పల్లవి:
మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే

చేపకళ్ల రూపసివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలీ చెలీ రా..

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా

ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే...

మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా 
దాగినావుగా

అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా 
చంపడానికా!

చరణం: 1
చిన్నాదాన ఓసి అందాల మైన
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగెనే
నీ పేరే పలికెనే నీలాగే కులికెనే
నిన్ను చేరగా

ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా

ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా..

చరణం: 2
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరుపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో

ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా
చూస్తూనే ఉన్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించన రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా

ఎలా విడిచి బతకనే పిల్లా రా 
నువ్వే కనబడవా...
రుధిరం మరిగి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : సిరశ్రీ 
గానం : దీప్తి పార్ధసారధి , సాయి చరణ్ 


రుధిరం మరిగి 
మనసుని పట్టి పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : హరిచరణ్, ఉమానేహ

యే ఎవరె ఎవరె మనసుని పట్టి
దారం కట్టి ఎగరేసారె గాలిపటంలా
యే ఎవరె ఎవరె అడుగును పట్టి
చక్రం కట్టి నడిపించారె పూల రధంలా
ఎవరెవరొ కాదది నీ లోపల
దాక్కుండె టక్కరి నేనేగా
ఎక్కడని చూస్తావె నీ పక్కనె ఉన్నానుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

విన్నావ మైన గుండెల్లోనా హైన రాగలెన్నో
ఎగిరె టూన చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో
నీలొ రెగిన వేగం కల చెరిపె గాలుల రాగం
అలజడిలొ గువ్వల గొడవె నే మరిచేస
చూశావ మబ్బుల ఒల్లె రుద్దె
మెరుపుల సబ్బులు ఎన్నొ
ఎర్రని సూర్యుని తిలకం దిద్దె
సాయంకాలం కన్ను
ఎమైనా... ఇంతందం చెక్కిందెవరొ
చెబుతార తమరు
ఎవరెవరొ కాదది
నీలోపల తన్నుకు వచ్చె సంతోషం ఉలిగా
చక్కగ చెక్కెందుకు నె చెలిగా నేనున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

సెలయేరుకు పల్లం వైపె మల్లె
నడకలు నేర్పిందెవరు
నేలకు పచ్చని రంగే అద్ది
స్వచ్చత పంచిందెవరు
ఎందుకు మనకా గొడవ నీ మటైనా నువు వినవా
నా తియ్యని పెదవె తినవా ఓ అరనిమిషం
ఈ ప్రేమకు పేరె పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపె తీసిందెవరు
తొలి ముద్దిచ్చిందెవరు
ఎమైనా... నాలొ ఈ హైరానా తగ్గించెదెవరు
ఎవరెవరొ కాదది
నీలొపల హద్దులు దాటిన అల్లరినె త్వరగా
దారిలొ పెట్టెందుకు తోడల్లె నేన్నున్ననుగా
అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్
అమ్రుతంల వింటానె వందల సార్లైనా
నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట
తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర
దినకు దిన పాట సాహిత్యం

 
చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : చైతన్య వర్మ 
గానం : వరం 

దినకు దిన 

Palli Balakrishna
Tej I Love U (2018)


చిత్రం: తేజ్  I Love You (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరన్, చిన్మయి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 2018

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా

పరుగిడు ఈ కాలాన
అడుగులు దరికాలేక
మనమెవరో ఏమో ఎందాక
పరవశమే ప్రతి రాక
చూపి ఓ శుభలేఖ
మన మధిలో ప్రేమే కలిగాక
మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా
నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో
అలలెగసే ఆసే ప్రేమంటా
మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా
పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Palli Balakrishna Wednesday, July 11, 2018
Srinivasa Kalyanam (2018)
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: నితిన్, రాశిఖన్నా
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 2018

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం


Palli Balakrishna
Velugu Needalu (1999)

చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
నటీనటులు: వెంకట్, మీనా, జయసుధ, తేజెస్వి
కథ: గోవింద భాయ్ పటేల్
మాటలు: గణేష్ పాత్రో
దర్శకత్వం: మౌర్యా
నిర్మాత: యమ్.ఎస్. రెడ్డి
సినిమాటోగ్రఫీ: సి. విజయ్ కుమార్
విడుదల తేది: 20.02.1999Songs List:విశ్వమంత నిండి వున్న పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: మనో & కోరస్

విశ్వమంత నిండి వున్న
వెలుగునీడలు ..... అవి
అనాదిగా మంచిచెడుల
అడుగుజాడలు ......
పగలు వెంటె రాతిరని
సుఖం వెంటె దుఃఖమని
గంట కొట్టినట్లు చెప్పు
జంట గురువులు :....

||విశ్వ ||

కోటికి పడగెత్తినట్టి
గొప్పగొప్ప వాళ్ళనైన
కూటికింత నోచుకోని
కూలినాలి జనులనైన
తరతమబేధాలు లేక
క్షణమైన విడిచిపోక
వెన్నంటే వుంటాయి వెలుగునీడలు ....
ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు ..
ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు ...

||విశ్వ ||

ఊగవే ఊగవే ఉయ్యాలా ... పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: శ్రీలేఖ & కోరస్

ఊగవే ఊగవే ఉయ్యాలా ...
ఊరువాడా మెచ్చ జంపాలా
వెలుగునీడల నడుమ వెలిగిపోతూవున్న
చిలిపి నవ్వుల రాధ అలసిపోయేదాక ...

|| ఊగవే ||

ఇంతలోనె ఏవిటీ వింత ... ?
ఈడొచ్చి కూకుంది మనకంత ...!
ఈడొస్తే సరిపోదు ఉయ్యాలా ... మంచి
జోడూ కుదరాలమ్మా జంపాలా !!

మందార మొగ్గంటి అందాలరాశివి
నీకేమి తక్కువే ఉయ్యాలా !
మొగలిరేకూలాంటి మగసిరీ గలవాడు
నిన్నెగరేసుకెళతాడె జంపాలా ! 
అక్క పెళ్ళికి ముందు ఉయ్యాలా !
ఆ పప్పు ఉడకదే జంపాలా !!
అల్లీ బిల్లీ ఆటలతో పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్

అల్లీ బిల్లీ ఆటలతో
అర్థం తెలియని మాటలతో
చదువుల బడిలో... దేవుడి గుడిలో
ఒకరికొకరుగా పెరిగాము ! 
ఇపుడిద్దరమొకటై నిలిచాము !!

రేకులు విరిసిన వేకువ నువ్వు!
ఆకులు రాలని ఆమని నువ్వు !
నందకిశోరుని మోవి చివురుపై
నర్తించే దరహాసం నువ్వు !!

అలు పెరుగుని మగసిరినీ
అగుపించని గడసరిని
వరముగ బడసిన
హిమగిరి నువ్వు!!

పడగెత్తిన పరువం నువ్వు!
పాలకడలి తరంగం నువ్వు !
పార్వతి యెదలో తాండవమాడే
పరమశివుని ప్రతిరూపం నువ్వు!

సరిగమలే ఒరవడిగా
పదనిసలే నడవడిగా
అడుగులిడెడు కలహంసవు నువ్వు!!
ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు 
నా పాలిటి మాధవుడు
ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు
నా పాలిటి మాధవుడు
లేడని ఎందరు నమ్మపలికినా
లేశమైన నే నిరాశ చందక
లేడని ఎందరు నమ్మపలికినా
లేశమైన నే నిరాశ చందక
ఎదురుతెన్నెలు చూసిన ఫలితం
ఎదురుగ వరమై నిలిచిందమ్మా

ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు
నా పాలిటి మాధవుడు

కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము
చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము
కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము
చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము
నింగి నేల సాక్షిగా నిర్మల ప్రేమే దీక్షగా 
ఒకరు పాదమై ఒకరు నాధమై 
కమ్మని పాటకు శృతిలయలౌదాము
కాలం పరుగుకు కళ్లెం వేద్దామూ

ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు
నా పాలిటి మాధవుడు

ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము
ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము
ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము
ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము
ముద్దుముచ్చట తోడుగా ఇద్దరమూ సరిజోడుగా
ఒకరు సత్యమై ఒకరు నిత్యమై 
బంగరు భవితకు బాటలు వేద్దాము
బృందావనికే గంధం పూద్దామూ

ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు
నా పాలిటి మాధవుడు
లేడని ఎందరు నమ్మపలికినా
లేశమైన నే నిరాశ చందక
లేడని ఎందరు నమ్మపలికినా
లేశమైన నే నిరాశ చందక
ఎదురుతెన్నెలు చూసిన ఫలితం
ఎదురుగ వరమై నిలిచిందమ్మా

ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు
నా పాలిటి మాధవుడు

పెళ్ళికి ముందే సిగ్గంతా పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం:  శ్రీలేఖ, శ్వేతనాగ  & కోరస్

పల్లవి : పెళ్ళికి ముందే సిగ్గంతా
నువ్వొలక బోయకమ్మా !
శోభనరాత్రికి అంతో ఇంతో
దాచుకోవమ్మా.... కాస్త
తల పైకెత్తమ్మా.......... !

పాలగ్లాసుతో పడకటింటిలో
కాలు మోపగానే.....
పూల పానుపు రారమ్మంటూ
మేలమాడునమ్మా..... అప్పుడు...
మురిపెం బిడియం కలబోసి....
ముసిముసి నవ్వులు జతచేసి...
నులివెచ్చని చూపు విసిరావంటే... ఆచూపే
ఆ చూపే దీపాలారు పునమ్మా!...

|| పెళ్ళికి ||

రాధా రాధా... వియ్యాలవారొచ్చేశారు
అయితే పదండి పదండి!....
రండి రండి వియ్యాలవారు !
మీ రాకకు మా జోహారు !
అలసిపోయినట్లున్నారు !
చిలకరించమా? పన్నీరు !

ఆలస్యంగా వస్తేనేమి?
అందగాడు కాకుంటేనేమి?
ఒక్కమాటలో చెప్పాలంటే
అక్కమొగుడు బంగారం... మా
అక్కమొగుడు బంగారం !...

ఉఁ గడుసుదానివే

పొట్లకాయలా వుంటేనేమి...?
బుగ్గలు బూరెలు అయితేనేమి....?
చక్కదనంలో పెళ్ళికూతురు
చెల్లెలికన్నా నయం నయం... ఈ
చెల్లెలికన్నా శానా నయం.... !!

పెళ్ళికుమారుడి వెంట తోకలా...
పెంచుకున్న ఓ కంచి మేకలా....
వచ్చాడమ్మా తోడు పెళ్ళికొడుకు!
వేసే వుంచాం కుర్చీ నీ కొరకు!

ఏంటి? అలా బిత్తరపోయి
చూస్తున్నావ్... రా.... వచ్చి కూర్చో !

ఇది దివిలో కుదిరిన కళ్యాణం !
భువిలో జరిగే వైభోగం !
మంగళకరమీ అనుబంధం !
గంగాయమునల సంబంధం !
పచ్చని చేలే పల్లెకు అందం !
పదుగురి రాకే పెళ్ళికి అందం !
పిన్నలు పెద్దలు అందరు రండి !
పెద్ద మనసుతో దీవించండి... !
అత్తవారంట పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: మనో

అత్తవారంట సకల భాగ్యములున్న
అచ్చమా రామచంద్రుడే అల్లుడైన !
ఆడకూతురు అత్తింటి కరుగునపుడు
కంట తడిబెట్టు పుట్టింటి గడపకూడ !!
గోపాలుడలనాడు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: చిత్ర, శ్వేతనాగ 

గోపాలుడలనాడు మురళి వాయించితే
గోవులన్నీ మోరలెత్తి విన్నాయంట !
కన్నయ్య కరిమబ్బు తునక...!
అతని ప్రతిమాట మరువంపు మొలక...!!

పెరుగు చిలికే రాధ తరుణ సౌందర్యాన్ని
కళ్ళతోనే మురళి జుర్రుకున్నాడంట...!
నా రాధ బంగారు చిలక !
ఆమె ప్రతిమాట కలకండ తునక... !

రాధికా కృష్ణుల రసరమ్యకేళిని...
యమునా తరంగిణే ఆగిచూసిందంట...!
అరుదైన ఆనాటి జంట... ఈనాడు
మా ఇంట వెలిసినాదంట.... !
ఒక్క క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: మనో, శ్రీలేఖ

ఒక్క క్షణం...... ఒక్క క్షణం !
ఆగు ప్రియా... ఒక్క క్షణం !
జారిపోతె... ఈ క్షణం...
తిరిగిరాదు మరుక్షణం... !!

|| ఒక్క క్షణంII

రెపరెపలాడే నీ కళ్ళల్లో
రేపటి సుఖములు ఎన్నో చూశాను !
రేపటిదాకా... ఆగలేకా...
చూపులతో వలవేశాను... ను
వ్వందిస్తే చాలు చేయి !
మోగుతుంది సన్నాయి !
మోగుతుంది సన్నాయి !!

|| ఒక్కక్షణంII

పుత్తడి బొమ్మకు ప్రాణం పోసి...
పున్నమి వెన్నెల మేనికి పూసి...
దేవుడు నిన్నీరూపంలో... నా
వద్దకు పంపాడు !
మాటలకందని ఆనందం... నా
మదిలో నింపాడు... !... నే
నందిస్తున్నా చేయి ! ఇక
జీవితమంతా హాయి !!....

మమత లెరుగని కాలమా... పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్

మమత లెరుగని కాలమా... !
మంచితనమే నేరమా... !
కపటమెరుగని కన్నెబ్రతుకును
కాటువేయుట న్యాయమా.....?
కాటువేయుట న్యాయమా...?

ఏమి పాపం చేసినామని
వేసినావీ కఠిన శిక్ష....?
కాపుకాచే రెప్ప ఉరిమితే
కంటిపాపకు ఎవరు రక్ష...?
రాతికైనా గుండె పగిలే
ఘాతుకం తల పెట్టినావే..... !!

|| మమత ||

బ్రహ్మరాసిన రాత చెరిపి...
కాలకూట విషాన్ని చిలికి....
మార్చి రాసిన రాత తుదకే
మలుపు తిరుగునో చెప్పగలవా....?
చెప్పకుంటే మానవత్వం
శేష ప్రశ్నగ మిగిలిపోదా... !

|| మమత ||

ఎగురుతున్న ఎండి మబ్బుకు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్

ఎగురుతున్న ఎండి మబ్బుకు 

ఇది అదీ అంతం లేని కధ పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: మనో

ఇది....
ఇది అదీ అంతం లేని కధ !!
ఆడజన్మ కన్నీటి కధ !
వేదమంత్రములు
వేసిన బంధం
వెక్కిరింత పాలైన కధ !....

|| ఇది||

కోరలు సాచిన నవనాగరికత
కొరివి దెయ్యమైనట్టి కధ !
ఆశలన్ని అడియాశలైన... ఒక
ఆడబడుచు విషాద కథ!
వేదమంత్రములు వేసిన బంధం
వెక్కిరింత పాలైన కధ.... 

|| ఇది ||
భవ్యచరితగ పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగు నీడలు (1999)
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: మల్లెమాల
గానం: శ్రీలేఖ & కోరస్

భవ్యచరితగ వన్నెకెక్కిన
భరతమాతకు వందనం !!
ఆమె హృదయం రేకువాడని
ఆకురాలని నందనం ! 

II భవ్య ||

అట్టి సుందర నందనంలో
పుట్టి పెరిగిన లతలు పూసిన
పూవులం మనమందరం !! 

|| భవ్య ||

Palli Balakrishna Thursday, May 31, 2018
Mahanati (2018)చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కీర్తి సురేష్ , దూల్కర్ సాల్మన్, సమంత, విజయ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వినీ దత్, ప్రియాంకా దత్
విడుదల తేది: 2018

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ దేవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిబాగునం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కనుకే అంకితం ని కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కలను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శికరాగ్రానివై గాగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత ఉపద్రష్ట

అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కథలు
అపుడో ఇప్పుడో దరి చేరునుగా
కడలై ఓడై కడతేరునుగా
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మత్రమే కదా...

చివరకు మిగిలేది చివరకు మిగిలేది
చివరకు మిగిలేది చివరకు మిగిలేది

ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
లేదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే...

చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేలే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది

మహానటి మహానటి మహానటి మహానటి
మహానటి మహానటి మహానటి మహానటి*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయఘోషల్

మూగ మనసులు మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటె చైత్రమా కుహూ కుహూ కుహూ
స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల

మూగ మనసులు మూగ మనసులు

ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమ పూల పరాగమా
నా గత జన్మల ఋణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరి వేగం పెంచే మైకం
మననిల తరమని తారతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని

మూగ మనసులు మూగ మనసులు


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చారులత మణి

సదా నన్ను నడిపే నీ చెలిమే పూ దారై నిలిచే...
ప్రతి మలుపు ఇక పై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తించద నీతో జతై
కాలం స్మృతించదా నీకోసమై
కాలం నటించదా నీతో జతై

నదికి వరదల్లె మదికి పరవల్లై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పేరిగిందో
తలుపు తొలి జల్లై తనువు హరివిల్లై
వయస్సు ఎపుడు కడిలిందో
సొగసు ఎపుడు మేరిసిందో
గమనించే లోగా గమకించే రాగానా
ఏదో ఇలా లోన మోగెనా
కాలం నర్తించద నీతో జతై
ప్రాణం సుమించదా! నీ కోసమై
కాలం నటించదా నీతో జతై


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకు మా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా

ఓ... ఓ...ఓ...ఓ...

వూరికే పని లేక తీరికస్సలులేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంత పొడుగెదిగాక తెలుసుకోలేనింక
సులువుగ ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారమల్లే రేపటి మెడ్లో వెయ్యవే
నీ పిలుపె  తంగి నలు వైపుల నుండి
అర చేతులు వాలలేయ్ నీ మధి కోరిన కానుకలన్ని

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమాPalli Balakrishna Thursday, May 10, 2018

Most Recent

Default