చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: సుకుమార్, వై. రవిశంకర్, వై. నవీన్
విడుదల తేది: 12.02.2021
Songs List:
నీ కన్ను నీలి సముద్రం పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ
ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నల్లనైన ముంగురులే - ముంగురులే
అల్లరేదో రేపాయిలే - రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే - నీ గాజులే
ఝల్లుమంది నా ప్రాణమే - నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే...
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
కోరస్: నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
చరణం: 1
చిన్ని ఇసుకగూడు కట్టినా... నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా...
ఆ గోరువంక పక్కన...రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కనా.....
అప్పు అడిగానే... కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే...భూమి పైన భాషలన్నీ...
చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ...
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం
కోరస్: నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
కోరస్: నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
చరణం: 2
నీ అందమంత ఉప్పెన... నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా..
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా....నీ సవ్వడేదో చెప్పనా
ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా...
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని...
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని...
నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపనీ....
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై
ధక్.. ధక్.. ధక్.. పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శరత్ సంతోష్, హరిప్రియ
నువ్వు నేను ఎదురైతే ధక్.. ధక్.. ధక్..
మనసు మనసు దగ్గరయితే ధక్.. ధక్.. ధక్
ఆశలు అలలై పొంగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్
చూపుల పిలుపులు మోగుతుంటే ధక్.. ధక్.. ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే ధక్.. ధక్.. ధక్
గుండెకు చెమటలు పడుతుంటే ధక్.. ధక్.. ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్
చీటికి మాటికి గురుతోస్తే...
మిగతావన్నీ మరుపోస్తే...
కాలానికి ఇక పరుగోస్తే....
ఆలోచనలకు బరువస్తే...
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాసిన్ నిజార్, హరిప్రియ
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటి చూపు చేరలేని
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్క రౌదాం
ఏక్షణం విడివిడిగా లేమందాం
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
మన ఊసుమోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలనుపాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి
లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం
సాక్ష్యంగా సంద్రాలు ఉంటే
దిగుడు బావిలో దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం
చేయని ఈ చిన్నపాటి మోసం
నేరమేంకాదే ఇది మన కోసం
రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్దమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే బయటపడిపోతా
పాలలో ఉన్న నీటి బొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
జల జల జలపాతం నువ్వు పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
హే మన జంట వైపు
జాబిలమ్మ తొంగి చూసెనే
హే ఇటు చూడకంటు
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే హా...
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళ హా
నడి ఎడారిలాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమే సొంతం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
ఈశ్వరా పరమేశ్వరా పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవిశ్రీ ప్రసాద్
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను
నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
దారి ఏదో, తీరమేదో
గమనమేదో, గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో
లేని కన్నుతో చూడరా
చీకటేదో, వెలుతురేదో
మంచు ఏదో, మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని
లోని కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
నువ్వు రాసిన రాతలిచ్చట
మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ
నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
మసకబారిన కంటిపాపకి
ముసుగు తీసే వెలుగులాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి
బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
సంద్రంలోన నీరంతా పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: సీన్ రోల్డెన్
సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
గాలిలో నీ మాటే అలలపై నీ పాటే
ఎంత గాలిస్తున్న నువ్వు లేవే
అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే
ప్రేమ కోరే ఆకలున్న నువ్వు రావే
ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానే వాటికేమీ చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళి నేనే ఎపుడు చూసేది
నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే
ఎన్నడు నాతో ఉంటానని అబద్దం చెప్పావే
సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
నిన్నే నా నిన్నే పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సమీరా భరద్వాజ్
నిన్నే నా నిన్నే
వెతికినే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే
వస్తూ పొతున్నాడు
ప్రతిరోజు సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాటా
సడి చేసే ప్రతి పాటా
నీ ఊసేమోనని వింటున్నా
నిన్నే నా నిన్నే
వెతికిందే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే
యే సిలక సిలక గోరింకా పాట సాహిత్యం
చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కైలాష్ ఖేర్
యే సిలక సిలక గోరింకా
ఎగిరే ఎగిరే ఎందాక
దారి లేని నీ ఉరక
ఈ దరికా మరి ఆ దరికా
హే సినుకా సినుకా జారింక
మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాకా
నీదారో ఎదో నీదింకా
సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళే దారిలో
చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో
ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో
ఎం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో
హే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్క విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా
యే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా
సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం
దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం
యే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా
హే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా
యేలే లమ్మయే హా
2021
,
Buchi Babu Sana
,
Devi Sri Prasad
,
Krithi Shetty
,
Naveen Yerneni
,
Panja Vaisshnav Tej
,
Uppena
,
Vijay Sethupathi
,
Y. Ravi Shankar
Uppena (2021)
Palli Balakrishna
Sunday, November 1, 2020