చిత్రం: Kantara Chapter 1(2025) సంగీతం: బి అజనీష్ లోక్నాథ్ నటీనటులు: రిషబ్ శెట్టి , రుక్మిణి వసంత్ దర్శకత్వం: రిషబ్ శెట్టి నిర్మాత: విజయ్ కిరగందూర్, చలువే గౌడ విడుదల తేది: 02.10.2025
Songs List:
బ్రహ్మకలశ పాట సాహిత్యం
చిత్రం: కాంతార చాప్టర్ 1(2025) సంగీతం: బి అజనీష్ లోక్నాథ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: ఏబీ వి (Abby V) తెలీదు శివుడా.. భక్తి మార్గము తెలీదు శివుడా.. భక్తి మార్గము గుండెల నిండాను దైవ రూపము గుండెల నిండాను దైవ రూపము కన్నరా నిన్ను గొలవడమే తెలుసంటా నిన్ను నమ్మడమే నీవే.. కాపు తెలీదు శివుడా.. భక్తి మార్గము అంతా మడినికట్టి చేతులెత్తి నిలువమ్మా గంగా నదిన మునిగి ఆత్మశుద్ధి చేయమ్మా సర్వేజన హితం ప్రాణం స్థాపితం ఒకటిగా కలిపి ఆ శివశక్తిలా మంత్ర గోషాలే పాడే భక్తిగా దేహశుద్ది రణేన భూయాత్ మనఃశాంతి రణేన భూయాత్.. ఆ ఆ దేహాలయమే దేవాలయము లోకాను గ్రహమే దైవాను గ్రహము ప్రణవ స్వరూపం తేజోమయము పుణ్య సంచయమే పరమ సుఖము యత్ర శ్రద్ధాచ భక్తిమ్ తత్ర లభతే జయన్తం దైవా చిత్తమ్ తెలీదు శివుడా.. భక్తి మార్గము ఓం సచ్చిదానంద భైరవాయ మహారూఢ భైరవాయ మహాచండ భైరవాయ కాల భైరవాయ ఉన్మత్త భైరవాయ కపాలా భైరవాయ భీషణ భైరవాయ సంహార భైరవాయ మహాకాల భైరవాయ మహాకాల రుద్రాయ నమో నమః ఓం!
రావే ఇక ప్రియ భామిని పాట సాహిత్యం
చిత్రం: Kantara Chapter 1(2025) సంగీతం: బి అజనీష్ లోక్నాథ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: అనురాగ్ కులకర్ణి , చిన్మయి శ్రీపాద రావే ఇక ప్రియ భామిని కథె వినే నీవే నయనమే చూడని అందానివే.. నీవు కోలనులో కలువలా హృదిని దోచావుగా మరి నేను శశివలే వెతిక అసలు చేరేదెలా దిగినావో ఎద పైన వాలగా అరె ఓ తార నేవెనులే హా సమరం సాగే వేళల్లో హృదయం కరగ సాగెనుగా నిదురే చెదిరే క్షణనా కలలే కుదిపే నన్నెనా రావే ఇక ప్రియ భామిని కథె వినే నీవే నయనమే చూడని అందానివే తగిన జోడీ అని తెలిసేలే తన పోరే చూసి కలిసాలే తనువు చనువు మరి తిరిగేలే తర్వాతే నేను కరిగాలే హే గుండెలో నా అంతేలేని మోహమే తన కనులతో కలిగిన వైనమే హ కోటలైనా కొల్లగొట్టే తేజమే అరె చురుకుగా కదిలేది వేగమే అరె నేడే ప్రణయాల వేడుకే నా ప్రాణాలూ నీమీదనే … హోయ్! సమరం సాగే వేళల్లో హృదయం కరగ సాగెనుగా నిదురే చెదిరే క్షణనా కలలే కుదిపే నన్నెనా

No comments
Post a Comment