చిత్రం: కల్కి (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ నటీనటులు: ప్రభాష్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, ప్రియాంకా చోప్రా దర్శకత్వం: నాగ్ అశ్విన్ నిర్మాత: అశ్వినీదత్ విడుదల తేది: 10.07.2024
Songs List:
Bhairava Anthem పాట సాహిత్యం
చిత్రం: కల్కి (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: Deepak Blue, Diljit Dosanjh ఒక నేనే… నాకు చుట్టు నేనే ఒకటైనా ఒంటరోన్ని కానే… ధీరుడినే, హ యోధుడినే, హ భూమి నేనే… సూర్యుడైనా నేనే నన్ను నేనే చుట్టి తిరుగుతానే స్వార్ధము నేనే… పరమార్ధము నేనే నా రెండు కళ్ళతో లోకమే చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట గెలుపు జెండాలే నా దారంతా. మనసు ఉన్నాగాని లేదంట మెదడు మాటే నే వింట మాయదారి లోకంలో ఇంతే ఇంతే నేనంటా, ఆయ్… నాకు నేనే కర్త కర్మ క్రియా ఒక నేనే వేల సైన్యమయ్యా… నా గమనం నిత్య రణం కణకణ కణం, అనుచరగణం… సాహస మంత్రమే నా జవజీవము సమయము చూడని సమరమిది సాయుధ యంత్రమే లోహపు దేహము నా కథయే విధి గెలవనిది.
Krishna పాట సాహిత్యం
చిత్రం: కల్కి (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కాలభైరవ అధర్మాన్ని అనిచెయ్యగ యుగ యుగాన జగములోన పరి పరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే… స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే… మీనమై, పిదప కూర్మమై తను వరాహమై, మనకు సాయమై బాణమై, కరకు ఖడ్గమై చురుకు ఘాతమై మనకు ఊతమై… నిశి తొలిచాడు దీపమై నిధనం తన ధ్యేయమై వాయువే వేగమై కలియుగా స్థితిలయలే కలబోసే కల్కి ఇతడే… స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే… ప్రార్థనో, మధుర కీర్తనో హృదయ వేదనో మన నివేదనం అందితే మనవి తక్షణం మనకు సంభవం అతడి వైభవం… అధర్మాన్ని అనిచెయ్యగ యుగ యుగాన జగములోన పరి పరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే… స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే…
ట టక్కర పాట సాహిత్యం
చిత్రం: కల్కి (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సంజిత్ హెడ్గే, ధీ సృష్టికే అస్సలంతు చిక్కని అందాలనందుకున్న ఆహా, ఆశ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్న ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయెలా ఆ ఆ ఆ ఆ ఆ స్వర్గమే నన్ను స్వాగతించెనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటెనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా ఆ ఆ ఆ ఆ ఆ అబ్బబ్బ తీరిపోయే ఇన్నాళ్లు కన్న కలా ఆ: ఊ ఊ ఊ ఊ ఊ ఊఊ ఊ ఊ ఊ

No comments
Post a Comment