చిత్రం: శ్రీమంతుడు (1971)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల, జిక్కి (పి.జి.కృష్ణవేణి)
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జమున, బేబీ శ్రీదేవి,
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: జి.రాధా కృష్ణమూర్తి
విడుదల తేది: 16.07.1971
పల్లవి:
చిట్టి పొట్టి బొమ్మలు.. చవ్ిన్నారీ బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి . . .
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
చరణం: 1
కొంగులు ముడి వేసీ కోర్కెలు పెన వేసీ
బుగ్గలపై సిగ్గుతో కన్నులలో వలపుతో..
అడుగులలో మడుగులతో నడిచిపోవు బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
చరణం: 2
మెరిసిపోవు తాళితో మెడలో పూమాలతో మేళాలూ..
తాళాలూ సన్నాయీ.. బాజాలూ
లాలలలాల......లాలలలాల
రాజు వెంట రాణీ కాళ్ళకు పారాణీ
చేయి చేయి కలుపుకొని చిందులేయు బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు
చరణం: 3
పూల పల్లకీలో ఊరేగే వేళలో
కూ.. కోయిలమ్మ పాటతో.. చిలకమ్మల ఆటతో
అంతులేని ఆశలతో గంతులేయు బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి
******** ******** ********
చిత్రం: శ్రీమంతుడు (1971)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
పల్లవి:
బులి బులి ఎర్రని బుగ్గలదాన…
బులి బులి ఎర్రని బుగ్గలదాన…
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా…
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారి పోయవా…
చరణం: 1
చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే
మంచి మాట… నీ నోట వినాలని
ఓహొ రాధా… ఒక మంచి మాట
ఒక మంచి మాట.. నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే… వచ్చానే…
బులి బులి ఎర్రని బుగ్గలదాన.. చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా..
ఆయ్యొ.. మరచి పోయవా నువ్వే మారిపొయవా
చరణం: 2
బొమ్మల పెళ్ళి చేశావే... ఈ బొమ్మకు హారం వేశావే
చచ్చి బ్రతికి.. నీ చెంతకు వస్తే..
ఆయ్యొ రాధా... నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నె కాదని అంటావే... అంటావే
బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారిపొయవా
చరణం: 3
ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే
ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో.. నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో.. చూసుకో
బులి బులి ఎర్రని బుగ్గలదానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ... మరచి పోయవా నువ్వే మారిపొయవా