Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన సారిక, తన్వి రామ్ 
దర్శకత్వం: సుజిత్, సందీప్ 
నిర్మాతలు: చింతల గోపాల కృష్ణారెడ్డి, వినీషా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేది:31.10.2024



Songs List:



World of Vasudev పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: కపిల్ కపిలన్ 

ఏ మొదలు తుదలు లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం

నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
వెన్ను దన్ను అంటు ఏముంది…
ఒంటరి వాడినని అంటారా
నాతో పాటు ఊరుంది…

పచ్చని కొండాకోనల్లో
చిత్రంగ ముస్తాబై వుంది
సాగి ఉన్న రేయిలోన… ఆహా ఏముంది
కాగడాల కాంతిలోన… ఇంకా బాగుంది

ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…

ప్రేమతో ఎన్నో లేఖలూ, ఊ ఊ
రాసేనే చూసే చూపులూ, ఊ ఊ

రేపో ఎల్లుండో… రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా… రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో… తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో… ఒక్కో బంధంలో

చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా, ఆ ఆ

ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…



క మాస్ జాతర పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: దివాకర్, సామ్ సీఎస్ 

క మాస్ జాతర 




బుజ్జమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: శరత్ సంతోష్

కనులకు కానుకలా కనబడినావే
కొడవలి చూపులతో కలబడినావే
తలవగ నీవే కలవరమాయే
కలకలమాయే…

ఓ బుజ్జమ్మాయి… ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలనే

భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామా భామా
అంతా నీ మహిమా

ఆ, వంపు సొంపు లింపుగున్న వయ్యారీ
చెంపలోనే కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారీ, సింగారీ…

ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పొన్నారీ
ముగ్గులోకి దించి నన్ను ముంచావే, కావేరీ…

హే కాపలాగ కాచుకున్న
కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మ
హే చూపురువ్వి చిచ్చురేపే
చందమామవమ్మ

ఓ మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు…

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరాన
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలెనే
భామ భామ

సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
నన్నే వరించుమా


No comments

Most Recent

Default