Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swayamkrushi (1987)





చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుమలత
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 03.09.1987



Songs List:



సిన్ని సిన్ని కోరికలడగ పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.జానకి

పల్లవి: 
సిన్ని సిన్ని కోరికలడగ
సీనివాసుడు నన్నడగ 
అన్నులమిన్న అలవేల్మంగై
ఆతని సన్నిధి కొలువుంటా

చరణం: 1 
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే

ఎవరికి తెలియని కధలివిలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరో చెప్పగా ఇక ఏలే

సిన్ని సిన్ని కోరికలడగ
సీనివాసుడు నన్నడగ 
అన్నులమిన్న అలవేల్మంగై
ఆతని సన్నిధి కొలువుంటా

చరణం: 2 
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు

సందిట నేసిన చెలువములే 
సందిట నేసిన చెలువములే
సుందర మూర్తికి చేలములు 

సిన్ని సిన్ని కోరికలడగ
సీనివాసుడు నన్నడగ 
అన్నులమిన్న అలవేల్మంగై
ఆతని సన్నిధి కొలువుంటా

చరణం: 3 
కలల ఒరుపులే కస్తూరిగా
వలపు వందనపు తిలకాలు 
వలపు వందనపు తిలకాలు 
అంకము జేరిన పొంకాలే
అంకము జేరిన పొంకాలే 
శ్రీ వెంకట పతికిక వేడుకలు 

సిన్ని సిన్ని కోరికలడగ
సీనివాసుడు నన్నడగ 
అన్నులమిన్న అలవేల్మంగై
ఆతని సన్నిధి కొలువుంటా



హాల్లో హాల్లో డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

హాల్లో హాల్లో డార్లింగ్




పారాహుషార్ పారాహుషార్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

లాలాలలా హాహాహహా
పారాహుషార్ పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
తూరుపమ్మ దక్షినమ్మ
పదమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షినమ్మ 
పదమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్

అంభారి ఏనుగునెక్కి
అందాల మా యువరాజు
అంభారి ఏనుగునెక్కి
అందాల మా యువరాజు
ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్

పారాహుషార్ పారాహుషార్

తుంటరి కన్నయ్య వీడు
ఆగడాల అల్లరి చూడు
తూరుపమ్మా పారాహుషార్
దుందుడుకు దుండగీడు
దిక్కు తోచనియ్యడు చూదు
దక్షినమ్మ పారాహుషార్
పాలు పెరుగు ఉండనీడు
పోకిరి గోపయ్య చూడు
పడమరమ్మ పారాహుషార్
జిత్తులెన్నో వేస్తాడమ్మ
జిత్తులెన్నొ వేస్తాడమ్మ
దుత్తలు పడదోస్తాడమ్మ
ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్

పారాహుషార్ పారాహుషార్

రేయి రంగు మేలి వాడు
వేయి నామాల వాడు
తూరుపమ్మా పారాహుషార్
ఏ మూలన నక్కినాడొ
ఆనమాలు చిక్కనీడు
దక్షినమ్మ పారాహుషార్

ఓ... నోరార రా రా రారా అన్నా
మొరాయించుతున్నాడమ్మా
పడమరమ్మ పారాహుషార్
ముక్కు తాడు కోసెయ్యాలి
ముట్టె పొగరు తీసెయ్యాలి
ముక్కు తాడు కోసెయ్యాలి
ముట్టె పొగరు తీసెయ్యాలి
ఉత్తరమ్మ పారాహుషార్

పారాహుషార్ పారాహుషార్

నీలాటి రేవు కాడ
నీల మేఘ శ్యాముడు చూడ
అమ్మో ఓయమ్మో
నీలాటి రేవు కాడ
నీల మేఘ శ్యాముడు చూడ
చల్లనైన ఏటి నీరు
సల సలమని మరిగిందమ్మ
అమ్మొ ఓయమ్మో

సెట్టు దిగని సిన్నోడమ్మ
బెట్టు వదలకున్నాడమ్మ
సెట్టు దిగని సిన్నోడమ్మ
బెట్టు వదలకున్నాడమ్మ
అమ్మమ్మో ఓయమ్మో
జట్టూ కట్ట రమ్మంటుంటే
పట్టూ దొరక కున్నాడమ్మ
అమ్మో ఓయమ్మో
అమ్మమ్మో ఓయమ్మో...

తూరుపమ్మ దక్షినమ్మ
పదమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షినమ్మ
పదమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్



సిగ్గు పూబంతి పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ, యస్.జానకి

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి 
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా 

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి

చరణం: 1 
విరజాజి పూల బంతి 
అర చేత మోయలేని 
విరజాజి పూల బంతి 
అర చేత మోయలేని 
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా

ఔరా అని రామయ కన్నులు
మేలమాడి నవ్విన సిన్నెలు
ఔరా అని రామయ కన్నులు
మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి
సూసి అలకలొచ్చిన కలికి
ఏసినది కులుకుల మెలికి 

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి 
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి

చరణం: 2 
సిరసొంచి కూరుసున్న
గురిసూసి సేరుతున్న
సిరసొంచి కూరుసున్న
గురిసూసి సేరుతున్న
సిలకమ్మ కొన సూపు సౌరు
బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ్య రూపు
సేరే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ్య రూపు
మెరిసే నల్ల మబ్బైనాది
మెరిసే నల్ల మబ్బైనాది
వలపు జల్లు వరదైనాది 

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి 
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా 

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి



కాముడు కాముడు పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి


కాముడు కాముడు



మంచి వెన్నెల ఇపుడు పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: మహాకవి క్షేత్రయ్య
గానం: యస్.పి.శైలజ

మంచి వెన్నెల ఇపుడు

Palli Balakrishna Thursday, August 31, 2017
Chakravarthy (1987)



చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 05.06.1987



Songs List:



ఊపిరి నిండ సాహసమే పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఊపిరి నిండ సాహసమే
ఉప్పెనకైన స్వాగతమే
జడివానలో సుడిగాలినై
ఈ వడిలో పిడుగై రేగనా

ఏ దేశమేగినా
నేనెందు కాలిడినా
ఏ వేషమేసిన
ఏ తీరు కనపడినా
నన్ను నే మరువను
నీతినే విడువను
ఈ జన్మకి ఓటమే ఉండదూ

ఏ ఆటలాడినా
ఏ జంట జతపడినా
ఏ మాటరేగిన
ఏ బంధమేర్పడిన
మారని మనిషిని
మాయని మమతని
నా పాటకి పల్లవే మారదు

ఊపిరి నిండ సాహసమే
ఉప్పెనకైన స్వాగతమే
జడివానలో సుడిగాలినై
ఈ వడిలో పిడుగై రేగనా




వన్నెలరాణి కిన్నెర సాని పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

వన్నెలరాణి కిన్నెర సాని
నీ జంటనె నేను
వెన్నెలరాజ ఓ నెల రాజ
నా వెంట రావేరా
జంట నువ్వుంటె నీ వెంట నేనుంట
హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి

గాజులు పాడె మోజులు పాటె
కమ్మగ రమ్మను వేలా
కైపుగ తూగే నీ కను సైగే
గుమ్ముగ కమ్మిన గోల
అల్లె ఈ మల్లె గాలి
చల్లె ఈ ముల్ల వాడి
ఎల్ల తప్పించుకోను ఈ అల్లరి
తుల్లి పరవల్ల వాన
వల్లె వడగల్ల వేడి
ఎల్ల నే తట్టుకోను ఈ ఆరడి
నను నీ వడిలో దాగుండనీ
కోరే ఈడుని ఓడించని
హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి

వన్నెలరాణి కిన్నెర సాని
నీ జంటనె నేను
వెన్నెలరాజ ఓ నెల రాజ
నా వెంట రావేరా

వెన్నెల ఏరై గలగల పారే
పొంగిన వలపుల కల
వెచ్చని ఊహల తీరం కోరె
తియ్యని తలపుల అల
కొగిల్ల పందిరెక్కి పాకె ప్రాయాల తీగ
పూసె గిలిగింత పూల గందాలతో
సాగె సయ్యటలోన ఊగె వయ్యారి ఊహ
తాకె నీలాల నింగి ఈ వేలలో
తారలు సిగలో కురమాలని
తీరని తపనలు తరమాలని
హద్దులు లేని ముద్దుల కేలికి రా రాజ

వన్నెలరాణి కిన్నెర సాని
నీ జంటనె నేను
వెన్నెలరాజ ఓ నెల రాజ
నా వెంట రావేరా
జంట నువ్వుంటె నీ వెంట నేనుంట
హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి



సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుశీల

సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి
పందిట్లో ఏనాడమ్మా మా పెళ్లి
ఇల్లెక్కి కూసేటి ఈ పుంజుకి
కిర్రెక్కి చూసేటి నా పెట్టకి
ఏనాడో ఆ భోగి ఏనాడో సంక్రాంతి
పూబంతితో బంతులాడేది ఏనాటికో

ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు
కౌగిట్లో కొస్తేగాని ముద్దీడు
గోడెక్కి దూకేటి నా కోడికి
వేడెక్కి పోయేటి నా ఈడుకి
ఎన్నాళ్ళో శివరాత్రి ఏనాడో తొలిరాత్రి
పులకింతలే పంటకొచ్చేది ఏనాటికో

సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి
ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు

కన్నుకొడతా - ఆ కొట్టి చూడు
కొట్టాక నీ ఈడు కోక దాటు
అ చెయ్యి పడతా - హ పట్టి చూడు
పట్టుకుంటే పాలపొంగు గోదారిరో
శృతిమించి పోతుంది నీ ఆగడం
ఇది ఆగడం కాదు చెలరేగడం
అమ్మమ్మ కొమ్మారెమ్మ పూతకొస్తే
ఎట్టమ్మ కొంటె పిట్ట మేతకొస్తే
హె అబ్బబ్బా దోరపండు దాచుకుంటే
ఓయబ్బా దోపిడింక సాగినట్టే
ఆగాలి ఈగాలి చూడింక తగ్గాలిరో

సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి
ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు

ముద్దు పెడతా - అ పెట్టి చూడు
నా ముద్దులే నువ్వు మూటగట్టు
అ పట్టుబడతా - అరె పట్టి చూడు
కన్నెపట్టు కన్నెతేనే పట్టేనిరో
ఈ పల్లె రేపల్లెకే చెల్లెలు
సాగించు నూరేళ్లు నీ లీలలు
ఓ యబ్బ సబ్బు సానామాడబోతే
అబ్బబ్బా చీర కాస్త దోచుకుంటా
అరెరే ఓయమ్మ కన్నెవెన్న దాచబోతే
అమ్మమ్మ దుత్తలన్ని మాయమంటా
పడకిళ్ళు పాలించి పాపల్లె లాలించన

ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు
కౌగిట్లో కొస్తేగాని ముద్దీడు
ఇల్లెక్కి కూసేటి ఈ పుంజుకి
కిర్రెక్కి చూసేటి నా పెట్టకి
ఏనాడో ఆ భోగి ఏనాడో సంక్రాంతి
పులకింతలే పంటకొచ్చేది ఏనాటికో

సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి
ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు



మొక్కజొన్న తోట పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి / సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు,  జానకి


మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా
మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా
పాలకంకి మీద పైట జారనేలా
పడుచుపిట్ట అందులో చిక్కనేలా
కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా
మొన్నటేళా నిన్నటేళా

మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా

తట్టుకో తట్టుకో నా తాకిడి
గుట్టూగా విప్పుకో నా గుప్పిడి
సందు చూసి కోసుకో నా గుమ్మడి
సంతలో తిప్పుకో నీ కావడి
ఎర్రగుండ నల్లగుండ
ఏటవాలు కోనగుండ
కన్ను సోక కుండ దోచుకోనా
పాలకుంద నీరుకుండ
పక్కనున్న ఏరు గుండ
చేపకైన తెలియకుంద నిన్ను చేరుకోనా
పచ్చని పల్లెలో విచ్చిన మల్లెలే
ఇచ్చుకోరా ఇచ్చుకోరా
వాలు జల్లో గుచ్చుకోరా

మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా
మొక్కజొన్న తోట కాడ మొన్నటెళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా
పాలకంకి మీద పైట జారనేలా
పడుచుపిట్ట అందులో చిక్కనేలా
కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా
మొన్నటేళా నిన్నటేళా

మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా

వానలే తాకని నా వంటినీ
గాలిలా అంటుకో తుల్లింతకీ
వెన్నెలే సోకనీ నీ సోకునీ
నీడలా చూడని రేయంతకీ
తాటికొండ ఈతకొండ
కిందపాలు తాగకుండ
పద్దులెవరు పండకుండ లేచిరాన
కోరుకొండ గోలుకోండ
మీద దెబ్బ తీయకుండ
సాలిబంద దారి గుండ రేగిపోనా
దొండలా పండినా దోర నా పెదవులే
అద్దుకోనా అంటుకోనా
ముద్దు బల్లో దిద్దుకోనా

మొక్కజొన్న తోట కాడ మొన్నటేళ
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ
మొక్కజొన్న తోట కాడ మొన్నటేళ
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ
పాలకంకి మీద పైట జారనేలా
పడుచుపిట్ట అందులో చిక్కనేలా
కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా
మొన్నటేళా నిన్నటేళా

మొక్కజొన్న తోట కాడ మొన్నటెళ
రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ




ఏరు జోల పాడేనయ్య సామి పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఏరు జోల పాడేనయ్య సామి
ఊరు ఊయలయ్యేనయ్య సామి
ఎండి మబ్బు పక్కలో సామి
నిండు సందమామల్లే సామి
నేను లాలి పాదాలా
నువ్వు నిద్దరోవాలా
ఎన్నెలంటి మనసున్న సామి

ఏరు జోల పాడేనయ్య సామి
ఊరు ఊయలయ్యేనయ్య సామి

మనిషి రెచ్చిపోత ఉంటె సామి
మంచి సచ్చిపోతున్నాది సామి
దిక్కులేని పిల్ల పాప సామి
చెరపలేని సేవ్రాలయ్య సామి
చేతులంటి ని కళ్ళే
సీకటైన మా గుండెల్లొ ఎన్నెల్లు
రాములోరి పాదాలే
రాతికైన జీవాలిచ్చే భాగ్యాలు
పట్టని నీ పాదాలూ
అంజనేయుడల్లె సామి

ఏరు జోల పాడేనయ్య సామి
ఊరు ఊయలయ్యేనయ్య సామి

చెడ్డ పెరిగి పోత ఉంది సామి
గడ్డు రోజులొచ్చేనయ్య సామి
సుద్దులన్నె చెప్పలయ్య సామి
బుద్ది మాకు గరపాలయ్య సామి
నావకున్న రేవల్లే
మమ్ముదాచుకోవలయ్య నీ ఒల్లో
పువ్వు కోరు పూజల్లే
నీవు రాయిపోవలయ్య నీ గుల్లో
కదగని నీ పాదాలు
అంజి గాడి చేతి కన్నీల్లు

ఏరు జోల పాడేనయ్య సామి
ఊరు ఊయలయ్యేనయ్య సామి



మబ్బులు విడివడి పోయే పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుశీల

మబ్బులు విడివడి పోయే
మన మనసులు ముడిబడి పోయే
మబ్బులు విడివడి పోయే
మన మనసులు ముడిబడి పోయే
సాయంకాలం సందట్లో
సంధ్యారగం పందిట్లో
పెదవుల పెళ్ళికి
ముద్దుల మద్దెల తాళం వేస్తుంటే

వెన్నెల చినుకులు రాలే
మది వేసవి ఉడుకులు తీరే
వెన్నెల చినుకులు రాలే
మది వేసవి ఉడుకులు తీరే
సీతకాలం కౌగిట్లో
సిగ్గులు రగిలే కుంపట్లో
కొంగుల ముళ్లకి
కొమ్మల కోయిల మేళం పడుతుంటే

కిల్లాడి ని లేడి సోకులు చూస్తూనే
అల్లాడి మల్లాడి ఆకులు మెస్తున్నా
వసంతలాడుతున్న పూల బంతి చెండునిస్తావా
పిల్లాడ నీ ఓడి చూపులు పడుతుంటే
నేనోడి నీ వేడి చేతులు పడుతున్నా
వరించే జోదు నువ్వే
తోడు నువ్వై దిండు వేస్తావా
మందార పొద్దుల్లొ ముద్దాడుకుంటాలే
శ్రుంగార వీధుల్లో ఊరేగి వస్తాలే
చీకటి వాకిట సిగ్గుల ముగ్గుల తొగ్గుల తొలకరిలో

మబ్బులు విడివడి పోయే
మన మనసులు ముడిబడి పోయే
వెన్నెల చినుకులు రాలే
మది వేసవి ఉడుకులు తీరే

కుర్రాడ నీ నీడ దగ్గరకొస్తుంటె
వెర్రెక్కి చుర్రెక్కి వెన్నెల మేస్తున్నా
కులస రేగుతున్న రేతిరంత రెచ్చి పోతావా
అమ్మాడి గుమ్మాడి అక్కరకొస్తుంటే
గుమ్మెక్కి గుమ్మాల కావలి కాస్తున్నా
మజాల ఊపుకొచ్చె ఊయలింక ఊగిచూస్తావా
కస్తురి గంధాలు కౌగిల్ల కిస్తాలే
ని కన్నె అందాలు ప్రాయలకిస్తాలే
చిక్కిన చెక్కిలి నొక్కిన చక్కిలి గింతల తాకిడిలో

మబ్బులు విడివడి పోయే
మన మనసులు ముడిబడి పోయే
మబ్బులు విడివడి పోయే
మన మనసులు ముడిబడి పోయే
సాయంకాలం సందట్లో
సంధ్యారగం పందిట్లో
పెదవుల పెళ్ళికి
ముద్దుల మద్దెల తాళం వేస్తుంటే

వెన్నెల చినుకులు రాలే
మది వేసవి ఉడుకులు తీరే
వెన్నెల చినుకులు రాలే
మది వేసవి ఉడుకులు తీరే
సీతకాలం కౌగిట్లో
సిగ్గులు రగిలే కుంపట్లో
కొంగుల ముళ్లకి
కొమ్మల కోయిల మేళం పడుతుంటే

Palli Balakrishna
Manchi Donga (1988)





చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుహాసిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 14.01.1988



Songs List:



బెడ్ లైటు తగ్గించన పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి

బెడ్ లైటు తగ్గించన
రెడ్ లైటు వెలిగించన
నీ వొంటి మూన్ లైటూ
నన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరనా
మిడ్నైటు గుడ్నైటు చేసేయనా

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించుకో
నా వొంటి మూన్ లైటూ
నిన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరుకో
మిడ్నైటు గుడ్నైటు చేప్పెసుకో

పండించ్వే ఈ పళ్ళతో
నా ప్రేమ నీ కౌగిల్లలో
సరసాల దొరసానివై
పాలించరా ఈ పాలతో
ఈ రాణినీ మురిపాలతో
రాగాల రా రాజువై
తలవూపి తలుపేసి వలవేసుకో
పురివిప్పి మురిపాల కథ చెప్పుకో
నూరేళ్ళ తిరునాల సాగించుకో

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించనా

కొనగోల్లతో చెక్కిల్లపై
రతిమన్మధ చిత్రాలు వెయ్
నడిరేయి రవివర్మవై
గిలింతతో నా గుండెపై
కిలకిలలతో నాట్యాలు చెయ్
శింగారి సిరిమల్లెవై
విరబూయు విరహాలు వివరించుకో
అరుదైన గంధాలు పూయించుకో
అందాలు అడపోత పోయించుకో

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించుకో
నీ వొంటి మూన్ లైటూ
నన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరుకో
మిడ్నైటు గుడ్నైటు చేప్పెసుకో



కడుపులోని బాబుకి పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి


కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా

చలివేల నన్నె వెలివేయబోతె
ముద్దాడుతు నీవె బిగి కౌగిటా
బిగి కౌగిలైన గిలిగింతలైనా
పదవంత నా వొంటికిక మీదటా
ఒకసారి దరిచేరి దయ చూడవే
ఏడాది పైమాట ఇపుడెందుకు
ఇపుడె ఇలాగె ఒకటై హహాహ
చేరమని తీర్చమని నన్ను కోరకు
చేరుకొని చేతలతొ శ్రుతి మించకు విసిగించకు

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో

నీ పానుపు నీదై నా పానుపు నాదై
నేనేమి కావాలి ఊహించవే
ఇన్నాళ్ళు నన్ను పెనవేసినావు
కొన్నాళ్ళు విశ్రాంతి ఇవ్వాలికా
నీ చెంత ఈ శిక్ష నాకెందుకే
ప్రతి రేయి నా మాట వినందుకే
వద్దు అనొద్దు లాలాలలలల
సరి సరిలె తెలిసెనులే నీ కోరికా
లేదు మరి నాకు ఇక ఆ ఓపిక కవ్వించకా

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో
లాలలాలలాలలా లాలలాలలా
లాలలాలలాలలా లాలలాలలా



కన్ను కొట్టె వాడె పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

కన్ను కొట్టె వాడె కన్నె మొగుడు
కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెళ్ళె వాడె దొంగ మొగుడు
పొద్దు మరచినోడె చిలిపి మొగుడు
అందాలన్ని దోచె అందగాడు
వయ్యరాలె పెంచె వన్నె కాడు
నా సామిరంగ నా తోడు దొంగ
ముడిపెత్తుకుంట ముద్దె తీరంగ
మొగుడంటె వాడెనమ్మో

ముద్దులెన్ని పెట్టిన ముందుకొస్తవమ్మ
అసలు దార పోసిన కొసరు ఎక్కువమ్మ
చీరల్లొ చిగురులేసి పైటల్లొ పరిగలేరు
మగవాడు వీడెనమ్మ
దువ్వి జూదమేసిన దూకుడెక్కువమ్మ
చేత చెయ్యి వేసిన చెంగు వదలడమ్మ
పందిట్లొ మేలమెత్తి పందిట్లొ తాలమెయ్యు
వరుడంటె వాడెనమ్మ
ఎంతో మగధీరుడొ అంత ఘనచోరుడు
నాతొ తొలి ప్రేమలొ దొరికె ఈ కాముడు
వాడు సరి వాడెనమ్మా

కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెల్లె వాడె దొంగ మొగుడు

సిగ్గులడ్డమొచ్చిన సిక్ష తప్పదమ్మ
చేతుల చరసాలలొ ఖైదు తప్పదమ్మ
బుగ్గల్లొ చిటికడెసి మొగ్గల్నె చిదుము చేయు
మొగుడొస్తె ఇంతేనమ్మా
మనసుదోచుకెళ్ళిన మాటతప్పదమ్మ
చాటు తప్పు చేసిన సాక్ష్యముండదమ్మ
చూపుల్తొ మత్తు జల్లు చేతులతొ మాయ జేయు
మొగుదంటె వీడెనమ్మ
ఏమి మొహమాటమో ప్రేమొ పిలపాటమో
కొట్ట ఇరకాటమో కొంగు చలగాటమొ
తొలిసారి తెలిసిందమ్మా

కన్ను కొట్టె వాడె కన్నె మొగుడు
కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెళ్ళె వాడె దొంగ మొగుడు
పొద్దు మరచినోడె చిలిపి మొగుడు



ముద్దు పెట్టమంటావ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి

ఎలగెలగెలగెలగెలగెలగెలగా....
ఇలగిలగిలగిలగిలగిలగిలగే....

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
ఆహా వయ్యారంగా రావే నా జట్టు
ఏ జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాంఫట్
పదనిస నిసనిద ని ద ప

హే మీది మీది కొస్తే ఇలాగ
చాటుమాటు సరసం ఎలాగ
గుట్టుగా బాగా చుట్టుకోరా మెల్ల మెల్లంగా
హో ఒక్కటవ్వమంటే అలాగ
వెక్కిరించ బోకే ఇలాగ
పక్కకే రావే ఒప్పుకోవే పట్టు పట్టంగా
ఏవేవో అడగొద్దు అప్పనంగ
ఇమ్మంటే పోబోకే దూరంగా
ఇవ్వాలన్నా ఇవ్వలేను నీలాగ
పదనిస నిసనిద ని ద ప

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా

బుగ్గగిళ్ళ బోతే ఇలాగ బుంగమూతి పెడితే ఎలాగ
రంభలా రావే రాసుకోవే నన్ను ఇలాగ
గుచ్చి గుచ్చి చూస్తే ఇలాగ గువ్వలాగ వచ్చేదెలాగ
కొంటెగా రారా కోరుకోరా ఒక్కటవ్వంగా
బింకాలు చూపొద్దు బిడియంగా
తాపాలు రేపొద్దు సారంగా
నువ్వునేను అవ్వాలింక ఏకంగా
పదనిస నిసనిద ని ద ప

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
ఆహా వయ్యారంగా రావే నా జట్టు
ఏ జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాంఫట్
పదనిస నిసనిద ని ద ప



నా రెండు కళ్ళకీ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, సుశీల

నా రెండు కళ్ళకీ
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ
నా రెండు చేతులకీ భజనల పిచ్చ
నా వయసు దూకుడుకీ సోకుల పిచ్చ
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ
వలపుల పిచ్చీ

నా సోకు వంటికీ
నా సోకు వంటికీ చీరల పిచ్చీ
నా ఒంపు సొంపులకీ రైకల పిచ్చీ
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ
ముద్దంటే నీ కన్నా నాకే పిచ్చీ
నాకే పిచ్చీ

నా చీరా కుచ్చిళ్ళూ
చలిగాలీ సంకెళ్ళూ
నా చీరా కుచ్చిళ్ళూ
చలిగాలీ సంకెళ్ళూ
తగిలించనా నీకు వెనకనుంచీ
కౌగిళ్ళా చిట్టాలూ
పడకింటి చట్టాలూ
అరే.కౌగిళ్ళా చిట్టాలూ
పడకింటి చట్టాలూ
నీ ఒళ్ళో చదివించు బుజ్జగించీ
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో ఒప్పించీ
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో ఒప్పించీ
సొగసు మీద పన్ను వేసి తీసుకో మెప్పించీ
రాగాలే తీయించరా
రాజ్యాలే దక్కించవే

నా సోకు వంటికీ చీరల పిచ్చీ
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ

ఆర్రెర్రెరెరెర్రెరే... నడిరేయి కష్టాలూ
నా కెంతో ఇష్టాలూ
నడిరేయి కష్టాలూ నా కెంతో ఇష్టాలూ
తప్పించుకోబోకే పక్కనుంచీ
సరసాల చెడుగుడులూ
పట్టాలా తొడిగుడులూ
అహా.. సరసాల చెడుగుడులూ
పట్టాలా తొడిగుడులూ
కులికించీ పలికించూ పులకరించీ

అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ
అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ
పాలపుంత అందనంత ఏలుకో ఇకనుంచీ
తేనె వాన కురిపించవే
ప్రేమలోన కరిగించరా

నా రెండు కళ్ళకీ
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్చీ
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ
వలపుల పిచ్చీ



రే చుక్కల అందం చూస్తా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా
రొమాంటిక్ హీరోని
జైజాంటిక్ డ్యాన్సర్ ని
శివతాండవం ఆడగలను
ఇలను తాళరాగ చెవులు రేగిపోగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

టిక్కు టక్కు కదిలి
చక్కనమ్మ నడుమె
తక్కిట తకదిమి
చక్కిలి గింతల తగిలి రగిలె వలపే
వయ్యారంలో వాట నాకే
యవ్వారంలో లాభం నీకే
ఈడు కూడి రుచి ఇట్ట చూస్త
జోడి లేడి వడికిట్ట వస్త
చెలికత్తెల మెత్తనైన సొగసు
వలిసి వంపు సొంపు ముద్దు లిడగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

బ్రేకు డ్యన్సు బెడుకో
షేకు డ్యాన్సు చెడుకో
చీకటి కదకళి
మాయల మణిపురి కిటుకు తెలిసె పదర
శ్రుంగారంలో వాట నాదే
బంగారంలో వాట నీదే
కన్నుకొట్టుకొని కౌగిలిస్త
చాటు చూసుకొని సంకెళ్ళెస్తా
నవమన్మధ నాట్యమాదగలను
ఇలను మతులు శ్రుతులు మించిపోగా

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా
రొమాంటిక్ హీరోని
జైజాంటిక్ డ్యాన్సర్ ని
శివతాండవం ఆడగలను
ఇలను తాళరాగ చెవులు రేగిపోగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

Palli Balakrishna
Big Boss (1995)




చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
నటీనటులు: చిరంజీవి , రోజా
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1995



Songs List:



మావ మావ మావా పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

మావోయ్...
మావ మావ మావా మావ మావ మావా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
రైటు కొట్టి లైట్ తీద్దామా...

మావ మావ మావా... మావ మావ మావా

ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు
ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు
చారుతాగి చెక్కేయ్ భామా

మావా... మావ మావ మావా
ఏమే ఏమే భామా
మావ మావ మావా
ఏమే ఏమే భామా

చిలక రంగు పలక మారుతున్నది
పిల్లో కులుకు చూసి గుబులు తీర్చమన్నది
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కోరికొచ్చి కోకమీద పడ్డది
గురుడా కొంగుపట్టి కస్సు చూడమన్నది
యస్ పాప మిస్ పాప కుట్టినదే కొంటె చేప
పెట్టేయనా కుచ్చుల టోపా

మావ మావ మావా
ఏమే ఏమే భామా
మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ

అ - అః
ఏయ్ - ఓయ్
ఓ - ఊ
ఉ...
బెండకాయ బ్రహ్మచారి ముదిరితే
మగడా పనికిరావు ముందుచూపు చూసుకో
ఓ ఓ ఓయ్ ఆ...
సామెతల్ని పొగుచెయ్కె సుందరి
అ పడక పంచుకుంటే మంచిదంట జాంగిరి
యస్ బాసు కిస్ బాసు
అదర గొట్టెయ్ బిగ్ బాసు
ఇచ్చేస్కో వలపుల డోసు

మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేసి
రొయ్య పొట్టు చారు చేసి
రైటు కొట్టి లైట్ తీద్దామా...

ఓయ్ మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ
మావ మావ మావోయ్...
అరె దామ్మ దామ్మ భామోయ్...





అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, రేణుక

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ
జఫరు జాగా చూసుకో పాగా వేసుకో
జాగా చూసుకో పాగా వేసుకో
కొండెక్కి పోవాలా కోక ఏడీ
కొండెక్కి పోవాలా కోక ఏడీ

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ

లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా
లాగేస్తాందీ వయసు నాయనో
హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ
యమా కుదిపేస్తాందీ కాక దేవుడో
లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా
లాగేస్తాందీ వయసు నాయనో
హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ
యమా కుదిపేస్తాందీ కాక దేవుడో
అందుకో మూటా దోసుకో ముల్లే దోచుకో
మూటా దోసుకో ముల్లే దోచుకో
కూతంతా జాగరతా తీసుకోనీ
కూతంతా జాగరతా తీసుకోనీ

అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ
అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ

కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే
పడ గొట్టెస్తాందే కసి జంగిడీ
ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ
అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ
కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే
పడ గొట్టెస్తాందే కసి జంగిడీ
ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ
అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ
అమ్మిడి దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో
దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో
పట్టిందె నా బుల్లి పైట పిచ్చి
పట్టిందే నా బుల్లో పైట పిచ్చీ

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ




ఉరుమొచ్చేసిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ

ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా
మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా
చలి గాలి తదతంటె ఏటెయ్యాలంటా

కోనంగి చినుకుల వానా కొట్టేస్తుంటే
ఒల్లంతా ఏదో గిలి గిలి పుట్టెయ్యదా
సుట్టోటి ముట్టించేసి ఇచ్చేయనా
కుంపట్ని ఎలిగించేసి చలి గాద్దునా
అడి యబ్బా ఏందబ్బా ఏదోలా ఉందబ్బా
అరె వచ్చే వచ్చేయ్ తొంగుందామే ఎచ్చెచ్చగా

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా
మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా

జతకొచ్చి జంతిక ముక్కలు కొరికించినా
అనకాపల్లి బెల్లం కాజా తినిపించినా
గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే
ముచ్చట పడకా జంతికలెడితే ఏమందావోయ్
ఎట్టెట్టా వల్కోయే నా సత్తా చూస్కోయే
నీ కేటియ్యాలో తెలిసేసింది రాయే బుల్లే

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ
ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ




నీలాటి రేవుకాడ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా

వెన్నెలేమో వరదలాయే ఆశ నన్ను విడవదాయే
వయసు పెట్టే వింత బాదా ఆపలేనయ్యో...మావయ్యో
హద్దులన్నీ పక్కనెట్టీ ముద్దు బాణం ఎక్కు పెట్టి
కాక రేపే కోక దుమ్ము దులుపుతానమ్మో
కొట్టడే కన్ను చందమామా
పెట్టరే జున్ను సత్యభామా

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా

చిలి ఊహా పుట్టినాకా చిలక కూతా పెట్టినాకా
గందమంటీ అందమంతా అరగదియ్యలే ఓ చిలకా
మోజులన్నే మూట కట్టీ మంచులాగా కమ్ముకుంటే
మల్లె మొగ్గా నలిగిపోతే ఎట్త మావయ్యో
పెట్టింది కేక పావురాయీ
సయ్యంది రయ్యొ సోకు రాయీ

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా




నంబర్ వన్ నంబర్ టు పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు

నంబర్ వన్ నంబర్ టు




సూదికి దారం ఎక్కిద్దామని పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర

సూదికి దారం ఎక్కిద్దామని టక్కున వచ్చేశా
చెత్తిన సూది కనపదకుంటే చేతులు ఎత్తేశా
పోయిందోయ్ సూది సూది
వెతికించా వీది వీది
చెప్పించా సోదీ సోదీ
ఇస్తావా నీదీ నీదీ..ఇవ్వవా

తాడుని ఎక్కి తువ్వాయ్ కోసం కట్టిని కోశావా
చాపని పట్టాలనుకొని పిలా చేలో వెతికావా
ఏడుందోయ్ సూది సూది ఆడుందా సూది సూది
ఇడుందా సూది సూది ఇచ్చెయ్నా పోనీ నాదీ..ఇవ్వనా

నీకు నాకు పెళ్ళవుతుందని రాతిరినే కలగన్నా
నీకో లుంగీ నాకో లంగా కుట్టెయ్యాలనుకున్నా
ఆదికోసం వస్తే సూదే పోయేరా కన్నా

రావే నా బందరు లడ్డు ఆదికి నా తూనా బొడ్డు
చేరేద్దం అవతలి ఒడ్డు లేదంటా మనకే అడ్డు
అయ్యొ బాబో అట్ట వస్తే అలుసైపోనమ్మా
పెళ్ళికి ముందే టింగ్ టింగ్ అంటే సిగ్గేస్తుందమ్మా

పోయిందా సూది సూది సు సు సు సూది సూది
ఇస్తావా పోనీ నీది...ఇవ్వవా

సూదికి దారం పిల్లకి మారం ఉండాలే ఓ పిల్లా
ఓసారైనా వాడని సూది ఉండాలే రసగుల్లా
దారమిస్తే సూదెక్కిస్తా ఇచ్చుకో మల్లా

వారెవ్వా హీరో హీరో బేషుగ్గా ఉందోయ్ యారో
కిస్స్ ఇస్తా రారో రారో కౌగిట్లో మారో మారో
ఊసి నీ వేషాలన్ని ఇందాకే చూశా
ముక్కు పట్టి ఆదిద్దాం అని ఓ ట్రై ఏ ఏశా

నువ్వే నా చికెన్ మసాలా నువ్వే నా పెప్సి కోలా
రావే న పెసరట్ ఉప్మా నువ్వే నా మతన్ సమోసా
లేటెందుకు రాజా రాజా లైనేద్దం ఆజా ఆజా
రావే నా మసాల దోసా తీరుస్తా తియ్యని ఆశా


Palli Balakrishna
Dhairyavanthudu (1986)




చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సితార
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాతలు: యాక్స్ స్వామి, రాందీపక్
విడుదల తేది: 27.11.1986



Songs List:



రుసరుస పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: యస్.పి.బాలు

రుసరుస




టముకు టముకు టమారం పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

టముకు టముకు టమారం



కౌగిలి మన ఇల్లైతే పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ

పల్లవి:
కౌగిలి మన ఇల్లైతే
ముద్దే మన పొద్దైతే
ఆనందానికి హద్దేముంది
ఆకాశం మనకడ్డేముంది
ఆకాశం మనకడ్డేముంది

కౌగిలి మన ఇల్లైతే
ముద్దే మన పొద్దైతే
ఆనందానికి హద్దేముంది
ఆకాశం మనకడ్డేముందీ
ఆకాశం మనకడ్డేముందీ

చరణం: 1
మేడేసుకో తోడేవుంటే
నా పక్కన నువ్వుంటే
వెలుగేందుకు నువ్వుంటే
నీ చక్కని నవ్వుంటే
సాగాలి చేతులు కలిసి
నూరేళ్ళ దూరం - నూరేళ్ళ దూరం
చేరాలి చేరిసాగమౌతూ
ఆశలతీరం - ఆశలతీరం

కౌగిలి మన ఇల్లైతే
ముద్దే మన పొద్దైతే
ఆనందానికి హద్దేముంది
ఆకాశం మనకడ్డేముందీ
ఆకాశం మనకడ్డేముందీ

చరణం: 2
వెన్నెళ్లలో సొగసంతా
నీ సొగసే కొండంత
నీ జులలో మెరుపంతా
నీ చూపే మెరుపంతా
పాడాలి ఒకటే రాగం
ఆనంద రాగం - ఆనంద రాగం
చేరాలి ఒకటే లోకం
శృంగార లోకం - శృంగార లోకం

కౌగిలి మన ఇల్లైతే
ముద్దే మన పొద్దైతే
ఆనందానికి హద్దేముంది
ఆకాశం మనకడ్డేముందీ
ఆకాశం మనకడ్డేముందీ





అమ్మా వరలక్ష్మీ పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: పి.సుశీల

అమ్మా వరలక్ష్మీ




నేను గొంతెత్తి పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: యస్.పి.బాలు

నేను గొంతెత్తి



అటు ముసిరే పాట సాహిత్యం

 
చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి
గానం: యస్.పి.బాలు

అటు ముసిరే

Palli Balakrishna
Magadheerudu (1986)





చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , జయసుధ
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 07.03.1986



Songs List:



జతకలిసే ఇద్దరం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం

జతకలిసే ఇద్దరం 
ప్రతిరేయి శోభనం, శోభనం

పాతనేది కొత్తగా కొత్తనేది వింతగా
కొంగుచాటు కవ్వింతగా 
ముద్దుమీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా
ఇల్లే ఈ కౌగిలింతగా
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
చుప్పనాతి నోళ్ళకి చూడలేని కళ్ళకి
కలుసుంటే ఇద్దరం కన్నీళ్ల కలవరం
ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం
జ్వరం జ్వరం జ్వరం జ్వరం 

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం

మొన్నకన్న మోజుగా నిన్నకన్న రంజుగా
రోజురోజుకీ లబ్జుగా
పగలు కూడ రాత్రిగా రతుల మొదటి రాత్రిగా
సిగ్గుతాకితే చిచ్చుగా
వెలుగు వెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
వెలుగు వెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
చప్పరాని వాళ్ళకి చెప్పుకింద కీళ్ళకి
ఒకటైతే ఇద్దరం అల్లరే ఆగడం
అసూయ ఆగ్రహం ఆపైన చలి జ్వరం
స్వయంవరం ప్రియంవరం

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం - సుఖం, సుఖం - సుఖం



ఇంటి పేరు అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, విశ్వనాథ్, లలితా సాగరి, వాణీ జయరాం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

వెలుగు నీడలైనా కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె
వెలుగు నీడలైనా కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె

ఎదిరించని జానకీ నిదురించని ఊర్మిలా
తోడి కోడల్లుగా  ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా రామలక్ష్మనులుగా
కొండంత అన్నలు అండగా ఉండగా

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా
వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా

అమ్మగా నాన్నగా బిడ్డగా పాపగా
యే దేవకి కనా యే యసోద పెంచినా
గోకులాన వెలిసాడో గొపాల కృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం



అటు దహనం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు

అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం
అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం

ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు
ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు

నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు
నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు
నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు
నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు
సత్యం నీవని నమ్మి ధర్మం నీవని నమ్మి
హరిచంద్రుడేమైనాడు...
గూటికి పేదైపోయి కాటి కాపరైనాడు
జీవచవమై నాలా స్మశానాలో చేరాడు

సత్యం వధ, ధర్మం చర
సత్యమేవ జయతే

అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం

ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు
ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు

నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను
నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను

అన్నపూర్ణ భయపడకు
బాధపడకు అన్నపూర్ణ
ఏదో సుముహూర్తంలో నువ్విటు వస్తావు
చితిమంటల వెలుగులో నన్ను కలుసుకుంటావు
సర్వసమానత్వానికి వేదిక ఈ స్మశానం
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం
అన్నపూర్ణ
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం



ఇచ్చోటనే పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె

ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికల్ అంతరించే

ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె

ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న  చిత్రలేఖకుని  కుంచె నశించె

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణమౌ దృుష్టులొలయ అవనిపాలించు భస్మ సింహాసనంబు...

అ.... ఆ....భస్మ సింహాసనంబు


దళమౌ పై ఎదలో నడంగియు
సముజ్వల కాంతులీవెండలన్
మలయింపన్ దిశలన్
వదీయ కడసీమన్
బాల సూర్యప్రబాకలితంబై 
వెలుగొందు చున్నయదీ
అది మంగల్యంబు కాబోలు
అది మంగల్యంబు కాబోలు
దానిని ఏ వెలకైనన్ తెగనమ్మి
నీ సుతునికై వెచ్చించి నన్
చెల్లదే.......  అ....ఆ... 



మన జీవితాలు పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో

ఆ... ఆ...
శభాష్

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

పడుతోంది ఇరవైఒకటో శతాబ్దాల నీడ
పడుచమ్మ మార్చాలమ్మ పాడు పాత పాట
జెట్ మీద వెళ్ళే కాలం నీ జట్కాలింకామానుకో
నీ చిట్కాలింకా మార్చుకో

ఇన్హిలగోనె  ఇన్హిలగోనె
ఇన్హిలగోనె  ఇన్హిలగోనె
లేలో దుపట్టా మేరా
హాయ్ దుపట్టా మేరా

తెలుగే సరిగా రాదు మళ్ళీ హిందీ ఒకటి
తెలుగులో పాడుతల్లి

మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా
మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా

ఎన్నాళ్లీ ఇడ్లీ సాంబార్ కొత్త రుచులు చూడరా
ఎన్నాళ్లీ కాశీ మజిలీ కొత్త కథలు చెప్పరా
వీడియోలు చూసే కాలం నీ సినిమా హాల్లే దండగ
ఈ చిన్నింట్లోనే పండగ

యమునను నడిరేయి దాటితివంట
వెలచితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయేనంటా

నా తండ్రే ఇంకొకళ్ళ పాటెందుకు
నీ సొంత పాట పాడమ్మా

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో

ఆ... ఆ...
Once more
ఆ... ఆ...
Please once again
I say Shut up



మంచిని పంచిన పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు

మంచిని పంచిన నీవు బాబు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

అనురాగం మమకారం
అరదండాలై ఖైదీ అయ్యావు

మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

తలపై మోసావు ఈ నేరము
త్యాగం గుర్తించదీలోకము
నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము
నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము
ఈ ఆస్తి పాస్తులనేలి కావయ్య శాశ్వతం
ఈ అన్నాదమ్ములగాదే అలనాటి భారతం

బాబు వంచన పాలైనావు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

ధనమే ఓ కక్షగా రగిలెను
మనసే ఓ శిక్షగా మిగెలెను
న్యాయం గాయం చేసి గుండెల్లో మూల్గెను
కల్లా కపటం కలిసి నిను రచ్చ కీడ్చెను
ఈ నెత్తురు మెత్తని కత్తై నీ వెన్నే పొడిచెను
అది రుజువే లేని నిజమై నీతోనే నదిచెను

బాబు వంచన పాలైనావు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు



మన జీవితాల ు(Sad Song) పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

మన జీవితాలు నవ నాటకాలు
తెలుసుకొనర నాన్న 
మన జాతకాల చిరు సంతకాలు
సరి చూసుకోనర తండ్రి 

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో


మన జీవితాలు నవ నాటకాలు
తెలుసుకొనర నాన్న 


ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం

Palli Balakrishna
Kirathakudu (1986)




చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, సిల్క్ స్మిత
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: లింగరాజు
విడుదల తేది: 10.01.1986



Songs List:



నన్నీ లోకం రమ్మనలేదు పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

నన్నీ లోకం రమ్మనలేదు 
నేనీ జన్మను ఇమ్మనలేదు 
సరదాగా నే వచ్చేసాను 
జత కోసం గాలించేసాను 
అయ్యాను ఖయ్యాం నేను 

మనిషి మనుగడే పరమ బోర్ 
మనసుతో ఒకే తగవులు 
ఎవడు కోరును పరుల మేలు 
ఎదటి వాడికే నీతులు 
ఎవడికానందముంది ఎక్కడుంది 
ఎవడికనుబంధముంది ఎంత ఉంది 
బ్రతుకులోనే పగులు ఉంది 
పగులుకేదో అతుకు ఉంది 
విశ్రాంతి ఉందే ఉంది 

కళలు లేనిదే కనులు లేవు 
కరిగి చెదిరినా మరువవు 
మరువలేనిదే బ్రతుకలేవు 
గురుతులెన్నడూ మిగలవు 
మమతలన్నారు ఏవి మచ్చుకేవి 
మనిషి ఏకాకి జీవి మధుర జీవి 
సుఖము నిన్నే వెతికి రాదు 
వెతుకులాట ముగిసిపోదు 
విశ్రాంతి లేనే లేదు 



నీ పేరే ప్రణయమా పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీ పేరే ప్రణయమా ప్రణయమా 
నీ రూపే హృదయమా హృదయమా 
నీ ప్రేమ గీతిలో సుమించే సుధా కుసుమమై 
నీ చెంత చేరనా వరించే తోలి ప్రణయమై 
సాగే రాసలీల సంధ్యా రాగ హేల 

మనసున కురిసెను సొగసుల మధువులు ప్రియా ప్రియా 
పెదవులు కలిపెను పరువపు ఋతులు ప్రియా ప్రియా 
కౌగిలింత కావే ప్రేమ దేవత 
కంటి చూపుతోనే హారతివ్వనా 
నడుమును మరచిన పుడమిని వెలిసిన పడతివి నీవేలే 

వలపుల వలలకు వయసులు తగిలెను ప్రియా ప్రియా 
మదనుని శరముల సరిగమ తెలిసెను ప్రియా ప్రియా 
చైత్ర వీణ నాలో పూలు పూయగా 
కోకిలమ్మ నాలో వేణువూదగా 
కలతల మరుగున మమతలు పొదిగిన ప్రియుడవు నీవేలే 



సంపెంగ ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

సంపెంగ ముద్దు నా చెంపకద్దు హా... 
ఏ ముద్దులో ఏమున్నదో ఏ పొద్దులో ఏమవుతదో 
ఏమో ఏమో... 
అందాల బుగ్గ మందార మొగ్గ హా... 
ఏ ముద్దుకి ఏమిస్తవో ఏ పొద్దులో ఏం చేస్తవో 
ఏమో ఏమో... 

పెదవుల్లో నీ ప్రేమ తాకితే ఝుమ్మంది వయ్యారం 
ఎద మీద ఎద పెట్టి వాలితే పొంగింది నీ అందం 
పైర గాలి సోకితే పైట కాస్త జారగా 
నవ్వగానే తుమ్మెద మోవి మీద వాలగా 
ముద్దుల్లో ముప్పూట తేలించి లాలించి 
వద్దన్నా వలపుల్ల వాకిళ్ళు తెరిపించే 
శృంగారాల సంధ్యారాగాలెన్నో పలికే 

రైకల్లో జాబిల్లి దాగితే నవ్వింది కార్తీకం 
కౌగిట్లో దోపిళ్ళు సాగితే కవ్వించే సాయంత్రం 
చూడలేని అందము చూపు దొంగిలించగా 
తేలి రాని వెన్నెల తెల్లవారి కాయగా 
పొదరిళ్ళ వాకిళ్ళ సొగసంతా ముగ్గేసి 
ముంగిళ్ళు ముద్దుల్తో ఎంగిళ్ళు చేసేసి 
సౌందర్యాల దీపాలెన్నో నాలో నింపే 



ఒక ముద్దు చాలు పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఒక ముద్దు చాలు ఒక పొద్దు చాలు నాకు 
ఆ ముద్దు లేక పొద్దెక్కదమ్మ నీకు 
చూపే దాహం మాటే మైకం 
నీలో తాపం నాకే సొంతం 
తీయని నీ నోటి పలుకు 
ఓ స్వాతి చినుకు కానీ 
నీ వేడి పిలుపు నా మేలుకొలుపు కానీ 
చూపే దాహం మాటే మైకం 
నీలో తాపం నాకే సొంతం 
తీయని ఒక ముద్దు చాలు...... 

ఈడే ఈనాడు కోడై కూసె 
నేనే నీ తీపి తోడే కోరే 
తడి చూపు ఇచ్చింది తాంబూలము 
నా పెదవింటి గడపల్లో పేరంటము 
ముత్యాల వానల్లే వచ్చావులే 
ఒక పగడాల హరివిల్లు తెచ్చావులే 
వాగల్లె నీ జోరు రేగాలి ఈ చోట 
తీరాలి నీతోనే నా ముచ్చట నేడే..... 

పువ్వై పూసింది నువ్వే నాలో 
రవ్వై ఎగిసింది నవ్వే నీలో 
పరువాలు నా పేర రాయించుకో 
తొలి పన్నీటి స్నానాలు చేయించుకో 
మురిపాలు సగపాలు పంచేసుకో 
నీ పొదరింట సరదాలు పండించుకో 
సందేళలో వచ్చి అందాలు నాకిచ్చి 
ఎద తట్టి నను నీవు ఆకట్టుకో నేడే... 




వనమయూరి కులికే పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

వనమయూరి కులికే 




నీ మూగ వీణై మోగేనా పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.జానకి

నీ మూగ వీణై మోగేనా 
నీ రాగ మాలై పాడేనా 
అనురాగం రాగంగా 
అభిమానం గీతంగా 
నే పాడేనా 

శిలవంటి నీ హృదయంలో 
శృతి నేను కానా 
ఓదార్చి నిను లాలించే 
ఒడి నేను కానా 
తనకంటూ ఒక మనిషంటూ 
ఉంటేనే బ్రతుకు 
నిదురించే నీ హృదయంలో 
కదలాడే కలనై 
నీ కంటిలో కన్నీటినై 
ఉంటాను ఓదార్పునై 

అలిగావు నీవలిసావు 
అనురాగం కరువై 
రగిలావు సెగలెగిసావు 
బ్రతుకంతా బరువై 
మేఘాన్నై అనురాగాన్నై 
చినికాను చినుకై 
పులకించి నువ్వు చిగురించి 
పెరగాలి మనసై 
నీ నవ్వులో నే పువ్వునై 
పూస్తాను నీ కోసమై 





భూమి ఆకాశం కలిసే పాట సాహిత్యం

 
చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.జానకి

భూమి ఆకాశం కలిసే 


Palli Balakrishna
Maga Maharaju (1983)




చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, తులసి, రోహిణి
కథ: ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
మాటలు: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1983



Songs List:



నీ దారి పూలదారి పోవోయి బాటసారి పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ

నీ దారి పూలదారి పోవోయి బాటసారి



అన్నలో అన్న పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

అన్నలో అన్న



సీతే రాముడి కట్నం పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం


సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం





నెలలు నిండే పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.జానకి 

నెలలు నిండే



మా అమ్మ చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

మా అమ్మ చింతామణి

Palli Balakrishna
Sangharshana (1983)




చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నళిని
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 29.12.1983



Songs List:



చక్కని చుక్కకు పాట సాహిత్యం

 
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

చక్కని చుక్కకు 



కట్టు జారి పోతా ఉందీ.. పాట సాహిత్యం

 
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కట్టు జారి పోతా ఉందీ.. చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్..
బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్
ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ..
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ...

అరే...కట్టు జారి పోతా ఉందా... హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా.. హా
బొట్టు కారి పోతా ఉందా... హోయ్
చుక్క బొట్టు కారి పొతా ఉందా... హా
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా...

కట్టు జారి పోతా ఉందీ...  చీర కట్టు జారి పోతా ఉందీ

చరణం: 1
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ
పరువంతా తీసిందమ్మా...

సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా..ఆ... ఆ
కలలెన్నో రేపిందమ్మా...

చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు

బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..

చరణం: 2
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా
ముద్దెట్టుకోమందమ్మా...

సిగ్గమ్మ వచ్చింది.. శెలవంటు వెళ్ళింది ..
సిగ్గమ్మ వచ్చింది ...శెలవంటు వెళ్ళింది
ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా... ఒదిగొదిగి పొమ్మందమ్మా...

పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు...
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు

అరే...కట్టు జారి పోతా ఉందా...హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా..హ హా

బొట్టు కారి పోతా ఉందీ..
చుక్క బొట్టు కారి పోతా ఉందీ..

ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హ హ హ హ హా
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ...

కట్టు జారి పోతా ఉందీ... చీర కట్టు జారి పోతా ఉందీ




నిద్దురపోరా ఓ వయసా.. పాట సాహిత్యం

 
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
లలలలలలా.. లలలలలలా

నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఊపను ఉయ్యాల
ఏమని పాడను ముద్దుల జోలా...

జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ

నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను వెచ్చని జోలా..

జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ

చరణం: 1
మసకైనా పడనీవూ.. మల్లె విచ్చుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..
మాటు మణిగిపోనీవూ.. చాటు చూసుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..

వేళాపాళా లేదాయే.. పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే.. చెప్పకపోతే గొడవాయే
బజ్జోమంటే తంటాలా.. ఎప్పుడు పడితే అపుడేనా

జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ

చరణం: 2
మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా..
లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా..

వెండీ గిన్నె తేవాయే...  వెన్నెలబువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే...  వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా... ఆనక అంటే అల్లరేనా

జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ

నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ

ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను ముద్దుల జోలా...

జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ





సంబరాలో సంబరాలు పాట సాహిత్యం

 
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల,

సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
పేదోళ్ళ పాకల్లో సంబరాలు
గొప్పోళ్ల గుండెల్లో గింగిరాలు

సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు

పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు
పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు
వాడైనా వీడైనా జాతికి మానవుడు
నీతికి వారసుడే ఒకడికి ఒకడూ సోదరుడే
అరెరెరె గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో
అరె జమ్కుజమా జమాలకిడి సంబరాలో
గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో
జమ్కుజమా జమాలకిడి సంబరాలో
కలిసికట్టుగున్నాము
గుమ్కు గుమా గుమాలకిడి
గెలుపు తెచ్చుకున్నాము
జమ్కు జమా జమాలకిడి
కలిసికట్టుగున్నాము
గెలుపు తెచ్చుకున్నాము
కాపాడుకుందాము రేపటికి

ఈ దీపాలు ఇలాగే వెలగడానికి
చదువు సంధ్యలేదు మన పిల్లోళ్ళకి
సక్కంగా పంపుదాము బళ్ళోనికి
కొల్లబోయు గుల్లైనా జీవితాలకీ
కొత్త ప్రాణం పోసుకుందాం రోజు రోజుకీ

సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు

మనసు పెంచుకుందాము
గుమ్కు గుమా గుమాలకిడి
మమత పంచుకుందాము
జమ్కు జమా జమాలకిడి
మనసు పెంచుకుందాము
మమత పంచుకుందాము
మనుషులల్లె ఉందాము ఎప్పటికీ
మన మంచి సెడు తెలుసుకుని పెరగడానికి
చిచ్చుబుడ్డి పెట్టేద్దాం మత్సరానికి
కాకరొత్తి చాలు చేయి కలపడానికి
రేపు మాపు రాబోయే వెన్నెలకీ
పాడుకుందాం స్వాగతాలు ఈ రాత్రికి

సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు




సన్నజాజి పందిరి కింద పాట సాహిత్యం

 
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి..
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి..
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

చరణం: 1
ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ..
కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ..
ఒప్పుకోవమ్మా.. తప్పుకోకమ్మా..

పైట లాగకుంటే పల్లె తిట్టుకుంటదీ.. హా హా హహా
గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్..
అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా

చీకటి పిచ్చి ముదిరిందంటే.. వెన్నెల పెళ్ళి కుదిరిందంటే..
కొత్తలవాటు కొంపకు చేటూ... అయినా తప్పదు ఆటుపోటూ..
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా..
అరె.. దూరి దూరి పోయావంటే పాములుంటాయ్..

చరణం: 2
గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ..
ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ..
బెట్టు చాలయ్యా.. నన్నంటుకోవయ్యా
తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ.. హా హా హహా
అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్..
వాముల పాటు పాముల కాటూ.. వయసుల వాటు ప్రేమల కాటూ..
పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో.. రెప్పలగంట కొట్టిందంటే.. జంటకు గంట గడవాలంటే..
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి... తోకా ఎత్తి నిలబడిపోయి...
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి... తోకా ఎత్తి నిలబడిపోయి...
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..

Palli Balakrishna Wednesday, August 30, 2017
Palletoori Monagadu (1983)




చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, శ్రీమతి రోహిణి చక్రవర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజా, యన్.రాజేశ్వర రావు
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: యస్.ఎ. చంద్రశేఖర్
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 05.02.1983

(గమనిక: ఇందులో ఒక పాట సి. నారాయణ రెడ్డి రాశారు అది ఏ పాట? )



Songs List:



అక్కుం బక్కుం పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అక్కుం బక్కుం



ఎవ్వరోయ్ పెద్దోళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

ఎవ్వరోయ్ పెద్దోళ్ళు ఎవ్వరోయ్ ఉన్నోల్లు



గుండె గది ఖాళీ పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: శ్రీమతి రోహిణి చక్రవర్తి 
గానం: యస్.పి.శైలజా, నందమూరి రాజా 

గుండె గది ఖాళీ 




జడలోని బంతిపువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: అత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే

జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే

చరణం: 1
పువ్వులు పూచే కొమ్మలు వీచే చల్లని గాలుల్లో
ఉయ్యాలో జంపాలో 
వెన్నెలతాకే కన్నులు తాకే అల్లరి చూపుల్లో
ఉయ్యాలో కయ్యాలో
వెచ్చదనం చల్లదనం కలుపుకొనే కౌగిట్లో 
నీ ఎదలో నా ఎదలో వినిపించే చప్పుడులు
కలగన్న స్వర్గం కదలాడెనే
నిలవున్న కాలం పరుగాయెనే
నిలవున్న కాలం పరుగాయెనే

జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే

చరణం: 2
గువ్వల పెళ్లికి తీగలు అల్లే ఆకుల పందిట్లో
మేళాలో తాళాలో
చుక్కలు వచ్చి పక్కలు వేసే తియ్యని వేళల్లో
ఏలాలో ఏలెలో
ఎర్రదనం కమ్మదనం చిగురేసే పెదవుల్లో 
నీవెవరో నేనెవరో మురిపించే ముద్దుల్లో
మనసైన జంట మనువాడెనే
అనురాగ దైవం దీవించెనే
అనురాగ దైవం దీవించెనే

జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే




పలుకే బంగారమాయెనా పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: అత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పలుకే బంగారమాయెనా

Palli Balakrishna
Mosagadu (1980)



చిత్రం: మోసగాడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, శోభన్ బాబు, శ్రీదేవి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.05.1980

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఎర్రంగ కుర్రదాని నోరు పండితే...
ఎర్ర ఎర్రాని మొగుడు నీకు వస్తడంట
నేనమ్మో ఆడు నేనమ్మో

ఆకుంది ఒక చోట - పోకుంది ఒక చోట

చూపుల్లో  చాపుంది కూరొండుకో
చంపల్లో చామంతి పువ్వు పట్టుకో
జింకళ్ళే గంతేసే నడుముందిరో...
ఆ జింకళ్ళే గంతేసే నడుముందిరో
వలవేసుకో దాన్ని వాటేసుకో
ఏమైన చేసేసుకో
ఏడబట్టినా నీలో ఎన్నెలుండగా
చికటింటిలో నిన్ను చిదపకుంటనా
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట

అందాల విందువుంది అందిపుచ్చుకో
అందిట్లో తోపువుంటె మళ్ళి వచ్చిపో
అందాల విందువుంది అందిపుచ్చుకో
అందిట్లో తోపువుంటె మళ్ళి వచ్చిపో
జాబిల్లి నన్నుగిల్లి చంపుతుందిరో
గురిచూసుకో అది చేసుకో
ఏమైన చేసేసుకో...
ఏడ తాకినా నీలో తళుకు లుండగా
తళుకు చాటున కుళుకు చూడకుంటన

చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఎర్రంగ కుర్రదాని నోరు పండితే...
ఎర్ర ఎర్రాని మొగుడు నాకొస్తడంట
నేనమ్మో ఆడు నేనమ్మో





Palli Balakrishna
Prema Tarangalu (1980)




చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సుజాత
దర్శకత్వం: యస్.పి. చిట్టిబాబు
నిర్మాత: యమ్.వి.హెహ్. రాయపరాజు
విడుదల తేది: 24.10.1980



Songs List:



కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

కల అయినా, నిజమైనా
కాదన్నా, లేదన్నా
చెబుతున్నా ప్రియతమా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను పూజించనా, నిన్ను సేవించనా
సర్వమర్పించనా, నిన్ను మెప్పించనా
నీ గుడిలో దీపముగా నా బ్రతుకే వెలిగించి, 
కొడిగట్టి నేనారిపోనా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను లాలించనా, నిన్ను పాలించనా, 
జగతి మరిపించనా, స్వర్గమనిపించనా
నా యెదలో దేవతగా  నీ రూపే నిలుపుకొని, 
నీ ప్రేమ పూజారి కానా
నువ్వంటే నాకు ప్రేమ

కలిసి జీవించినా, కలలు పండించినా, 
వలచి విలపించినా, కడకు మరణించినా
నీ జతలో జరగాలి, నీ కధలో నాయికగా 
మిగలాలి మరుజన్మకైనా
నువ్వంటే నాకు ప్రేమ




మనసు ఒక మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఉ..హు..ఆ.. ఆ.. ఆ..
లా..లాలాలా..

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం

చరణం: 1
ఈ తోటలో... ఏ తేటిదో
తొలి పాటగా వినిపించెను 
ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా?
వికసింతువా వసంతమా?

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

చరణం: 2
ఈ చీకటి.. నా లోకము
నీ రాకతో మారాలిరా 
కథ మారాలిరా
ఆ మార్పులో.. నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?
వికసింతువా  వసంతమా?

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

ఆహా..హా.. ఆ... ఆ...ఉమ్మ్..ఉమ్మ్




మనసు ఒక మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:యస్.పి. శైలజ 

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిపుకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఈ తోటతో ఏ తేటిదో
తొలి పాటగా వినిపించెను
ఎద కదిలించెను
ఆ పాటనే నీకోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా
వికసింతువా వసంతమా

ఈ చీకటి నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా 
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
వికసింతువా వసంతమా




నా హృదయం తెల్ల కాగితం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం
బేషరతుగ ఇచ్చేశా ప్రేమ పత్రము
ఏమైనా రాసుకో – నీ ఇష్టము

మెరుపై మెరిసావు - చినుకై కురిసావు
చిగురులు వేశావు నాతో
చల్లగ వచ్చావు వెచ్చగ మారావు
పచ్చగ మిగిలావు నాలో
అలచిన్నారి - ఇక వయ్యారివి
ఆనెయ్యానివి - ఇక వియ్యానివి

కలుసుకున్నాము నేడు
కథ రాసుకుందాము రేపు

పూచిన జాబిల్లి - పున్నమి సిరిమల్లి
నాకిక నెచ్చెలివి నీవే
పొంగే గోదారి - పువ్వులరాదారి
నాకిక సహచారివి నీవే
నా కలవాణివి - ఇక కళ్యాణివి
అల నెలరాజువి - ఇక నా రాజువి
కలిసిపోయాము మనము ఇక
కలబోసుకుందాము సుఖము




నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

నవ్వెందుకే ఈ జీవితం, 
నవ్వొక్కటేరా శాశ్వతం
దేవుడిచ్చిన జీవితాన్ని, 
చివరిదాకా మాసిపోని 
నవ్వుతో నింపేయరా

కానరాని కాటుచీకటి బాటలో పయనించినా
లోకమంతా ఎకమై నిను వేరుచేసి చూసినా
జాలిలేని కాలమే నిను కాలరాచి వెళ్ళినా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని 
నవ్వుతో గడిపేయరా

కళ్ళుమూసి వెళ్ళిపోయే జీవితం ఒక రాక్షసి 
వెంటవుండి తీసుకెళ్ళే మృత్యువే నీ ప్రేయసి 
నువ్వు వెళ్ళుతూ ఉన్నవాళ్ళకు పూలబాటలు చూపరా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని 
నవ్వుతో సాగించరా





ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

కమాన్
జాయిన్ అవర్స్ హెవెన్ 
హే గే డోంట్ బి షై
కమాన్ - హే 

ప్రేమతరంగాలు సంజీవన రాగాలు
ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా
ఎంతగ పలికే అనుభవాలు
గిలిగింతగ పలికే అనుభవాలు

విరిసే తొలిపువ్వు ప్రేమ
మెరిసే చెలినవ్వు ప్రేమ
పొడిచే తొలిపొద్దు ప్రేమ
పిలిచే చెలిముద్దు ప్రేమ
ప్రేమే జీవం 
ప్రేమే దైవం
ప్రేమే సర్వం కాదా
ప్రేమే అందుకుంటే స్వర్గం
ప్రేమే అందకుంటే నరకం
ప్రేమే పెరిగిపోతే మమత
ప్రేమే విరిగిపోతే కలత
ఎన్నడు మరపని
ఎప్పుడు చెరగని
ప్రేమే మనదికాదా





ఇదే పరువం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

ఇదే పరువం ప్రతీ సమయం
ఇలా ఆడీ ఘల్ ఘల్ ఘల్ గజ్జె ఘల్లుమన్నది
బలేగీతం బలేనాదం
ఇలా వింటే ఝల్ ఝత్ ఝల్ గుండె ఝల్లుమన్నది
వింత చెలికాడు చెంతనున్నాడు
గుండెలో నేడు చెండు విసిరాడు
మాట కలిసింది మనసు తెలిసింది
మంటలో నేడే మల్లే విరిసింది
దాగివున్న మూగఆశ తీగై సాగిపోతుంది
వసంతాలు పూచె మయూరాలు లేచె
వలచిన అందాలన్ని నీవై ఆడ
జిల్ జిల్ జిల్ ఒళ్లు జిల్లు జిల్లుమన్నది

నేల పూగింది వేళ బాగుంది
మేనిలో ఏదో మెరుపు మెరిసింది
పదం పలికింది మధువు తొలికింది
పెదవిపై ఏదో పిలుపు పిలిచింది
నేటిరేయి చేయిసాచి, నీకై వేచివుంటుంది
హుషారింక చాలు నిషా వుంటే మేలు
కనులను ఏవో ఏవో కలలే కమ్మగా
చల్ చల్ చల్ మనసే చల్ చలమన్నది.

Palli Balakrishna

Most Recent

Default