చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ దర్శకత్వం: AM జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి నిర్మాత: మెగా సూర్యా ప్రొడక్షన్స్ విడుదల తేది: 24.07.2025
Songs List:
మాట వినాలి పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: పెంచల్ దాస్ గానం: Pawan Kalyan, Hymath Mohammed, Lokeshwar Edara, Maman Kumar వినాలి.. వీర మల్లు మాట చెప్తే వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి గురుడా మంచి మాట వినాలి… ఉత్తధి గాదు మాత తత్తరపాదక… చిత్తములోనా చిన్న ఒడ్డికుండలి… మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి గురుడా మంచి మాట వినాలి… ఈతమాను ఇల్లు గాదు… తాటిమాను తావుగాదు… (2) తగిలినోడు మొగుడుగాడు తగరము బంగారుగాదు… అందుకే… మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి గురుడా మంచి మాట వినాలి… ఆకు లేని అడివిలోనా…. అరెరే… మేకలన్నీ మేయవచ్చు… సద్దు లేని కొనలోనా… కొండా చారియ కూలవచ్చు… మాట ధాటి పోతే మర్మము తెలియకపోతె (2) పొగరుబోతు తాగురూ పోయి కొండను తాకినట్టు… అందుకే… మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి గురుడా మంచి మాట వినాలి… (2)
కొల్లగొట్టినాదిరో.. పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రాహుల్ సిప్లిగంజ్ , మంగ్లీ , రమ్య బెహరా , యామిని ఘంటసాల కోర కోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెణుకులతో.. కొలిమిలాంటి మగటిమితో.. సరసర వచ్చినాడు.. చిచ్చరపిడుగట్టివాడు ఏదో ఏదో తలచినాడు.. ఎవ్వరినో వెతికినాడు.. ఎవరంట.. ఎవరంట.. ఎవరెవరెవరెవరెవంట.. ఎవరెంట.. ఎవరంట.. ఎవరెవరెవరెవరెవంట.. కొండపల్లి ఎండి బొమ్మ కోలాకళ్లతో చూసిందమ్మా తీయాతీయని తేనెలబొమ్మా.. తీయని తెరలే తీసిందమ్మా.. వజ్రాల జిలుగులున్నా.. రతనాల ఎలుగులున్నా.. కెంపుల్ల ఒంపులున్నా.. మొహరీల మెరుపులున్నా.. నా పైడి గుండెలోన ఏడి పుట్టించి.. మరిగించి.. మరిగించి.. కరిగించి.. కరిగించి.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. అయ్యయ్యయో.. అయ్యయ్యయో.. ఆ చిన్నదీ.. ఇంకేమీ చేసిందయ్యో.. అయ్యయ్యయో.. అయ్యయ్యయో.. ఆ కుర్రదీ.. ఏమంత్రమేసిందయ్యో.. కన్నులలోని కాటుక మేఘం.. చీకటి నాపై చిలికిందే.. మాటలతోనే మెలికేసిందే.. మర్మం ఏదో దాసిందే.. ఆడవాళ్ల మనసు అడవిలాంటిదని.. ఎరగని సంటోడివా.. అంత అమాయకుడివా.. పడుసు పిల్లతీరు పట్టుచిక్కదని పసిగట్టలేనోడివా.. ఒట్టి సొంఠి కొమ్మువా.. లేత ఎన్నపూసవా.. అరే మీసాల రోషాల మొనగాన్ని పట్టేసి పసివాన్ని చేసేసి.. పసరేదో పూసేసి.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ఊపిరలోనీ.. ఆవిరి పవనాలే.. విరివిగ లేఖలే.. విసిరేనే.. ఉప్పెనలాగా.. పొంగే పౌరుషమే.. సొగసుకు సంకెలు వేసేనే.. చీకూచింతా లేనివాడి.. చిత్తం దోచావే.. పారాహుషార్ పోరాగాణ్ని.. పాగల్ జేశావే.. దారేదైనా దవ్వేదైనా.. నీడై ఉంటానే.. పేరేదైనా తీరేదైనా.. పెనివిటి అంటానే.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో..
అసుర హసనం పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: రాంబాబు గోసాల గానం: Airaa Udupi, Kaala Bhairava, Sai Charan Bhaskaruni, Lokeshwar Edara, Hymath Mohammed వజ్రదేహాయ రౌద్ర రాధేయ బదృ రూపాయ భద్రకాలీయ దక్ష దీక్షాయ ఉగ్ర వ్యాగ్రాయ త్రిపురనాశకాయ క్షిప్ర దగ్ధాయ ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం గగనమైనా భువనమైనా ధధరిల్లు రౌరవం నిశినీ చీల్చు క్షిధ్రుడల్లే ఉద్భవించు ఆయుధం రక్షకైనా శిక్షకైనా చొచ్చుకెల్లు రణధ్వనం ధిమిత ధిమిత ధిమిత యోధ ధిమిత ధిమిత ధిమిత క్రోధ ధిమిత ధిమిత ధిమిత శోధ ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి సమర శంఖారవమల్లే ఘీన్కరించు ఆగ్రహం వైరమైన శౌర్యమైనా మ్రోగు మరణ మృదంగం జూలు దుళుపు సింహమల్లే హుంకరించు పౌరుషం వ్యూహమైన యుద్ధమైన ఎగురు విజయ పతాకం ధిమిత ధిమిత ధిమిత మహిత ధిమిత ధిమిత ధిమిత అవిత ధిమిత ధిమిత ధిమిత అజిత ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ఘోర క్రూర మృగముమల్లే వెంబడించు ఆక్రోశం శత్రువైనా మృత్యూవైనా మోకరిల్లు ప్రతాపం వీర ధీర శూరుడల్లే విజ్రుంబించు మహోగ్రం మంధనైనా మంధినైనా కుమ్ముకెల్లు మహోక్షం రారా అసురులే ముసురుకోగా రారా బుసలానే విసిరివే రా రారా అహితులే కసురుకోగా రారా శిరస్సులే తురిమివే రా ధిమిత ధిమిత ధిమిత ఘాత ధిమిత ధిమిత ధిమిత ఖ్యాత ధిమిత ధిమిత ధిమిత దాత ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి నివురునొడిలే నిప్పురవ్వర కధము తొక్కే ఖడ్గధారిరా బరిలో దూకే కర్కశుందురా ధిక్కులన్ని బిక్కటిల్లురా పొగరు విడని మధగజం బేధిరి అడిరే ముజ్జగం పదునుగున్న అంకుశం గురిని గెలుచు అంబకం భారతమాత నుడుతిరాత మార్చు ధీమసం
తార తార పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: శ్రీ హర్ష ఈమని గానం: లిప్సిక భాష్యం , ఆదిత్య అయ్యంగర్ పోతుంటే నువ్వలా అలా బజార్ మొత్తం గోలే గోలా కోపంగా నువ్వు చూడొద్దలా పెలబోయే ఫిరంగిలా…! ఏం కావాలోయ్ పిల్లా మెరుస్తున్నావ్ తల తల..! ఎంతో చెప్పు తమరి వేల మోహరీలా? వరహాలా? తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు…! తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు…! చెమట చుక్క పడితే వజ్రమనుకుంటారు…! వద్దకు వచ్చి నిలబడితే తడబడతారు…! బల్లెం బాణం కంటే నడుము పడునైందోయి.. కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి…! పెదవి కోసం పదవులు నాభికి నాలుగు ఊళ్ళు అర్పిస్తామంటున్నారు ఈ నవాబులు…! తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు…! కంటి చూపులొని నిఘా పంటి కింద పెదవి సేగ సొగసుల సిరులు భాగ రమ్మని చెప్పక చెబుతుండగా కాటు వేయి ఒక్కోటిగా రెగుతోంది వయసు తెగ ఘాటుగా ఉన్నది పొగ రగులుతోంది భగ భగ…! కళ్ళు ఒళ్ళు కాదబ్బా మోహబ్బత్ కా చేసెబ్బ వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా…! ఆశా మాషీ కాదబ్బా ఈ కన్నే శోభా… వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా…! కళ్ళు ఒళ్ళు కాదబ్బా మోహబ్బత్ కా చేసెబ్బ వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా…! ఆశా మాషీ కాదబ్బా ఈ కన్నే శోభా… వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా…!
ఎవరది ఎవరది పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: Sai Charan Bhaskaruni, Hymath Mohammed, Lokeshwar Edara, P V N S Rohit ఎవరది ఎవరది
పులి మేక గేమ్ పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: హారిక నారాయణ్ పులి మేక గేమ్
సలసల మరిగే పాట సాహిత్యం
చిత్రం: హరిహర వీరమల్లు (2025) సంగీతం: యం. యం. కీరవాణి సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: Sai Charan Bhaskaruni, Lokeshwar Edara, Hymath Mohammed, P V N S Rohit, Lipsika Bhashyam, Harini Ivaturi, Nayana Nair, Harika Narayan, Gomathi Iyer సలసల మరిగే

No comments
Post a Comment