Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Most Recent

Search Box

Chaduvukunna Ammayilu (1963)చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, క్రిష్ణ కుమారి, శోభన్ బాబు, హేమలత
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు 
విడుదల తేది: 10.04.1963Songs List:ఒకటే హృదయం కోసము పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం: 1
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం: 2
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూకిలకిల నవ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 1
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
అణువణువున బృందావని తోచె 
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 

చరణం: 2
నీవున్న వేరే సింగారములేల 
నీవున్న వేరే సింగారములేల 
నీ పాదధూళి సింధూరము కాదా 
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే 

కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 3
నీ కురులే నన్ను సోకిన వేళ 
నీ కురులే నన్ను సోకిన వేళ 
హాయిగ రగిలేను తీయని జ్వాల 
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కిలకిల నవ్వులు చిలికినా
ఏమండోయ్.. నిదుర లేవండోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్

చరణం: 1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 2
యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 3
నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది అర్ధమున్నదీ 
మొదటి రోజు కోపం అదో రకం శాపం 
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం 
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు 
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు 

చరణం: 1
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 
పడుచువానీ .. ఒహో... 
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు 
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు 

చరణం: 2
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం 
వెంటపడిన వీపు విమానం 

చరణం: 3
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 
చిలిపికన్నె.. ఉహూ... 
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ 
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి
నీకో తోడు కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం: 1
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం: 2
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం: 3
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి

నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను
ఓహొ చక్కని చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 1
వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం: 2
పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు

చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 3
మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ

ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఏమిటి ఈ అవతారం?  పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత

పల్లవి: 
ఆ...ఏమిటే... 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
పాత రోజులు గుర్తొస్తున్నవి 
ఉన్నది ఏదో వ్యవహారం 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 1
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
తట్టెడు పూలు తలను పెట్టుకుని 
తయారైతివా చిట్టి వర్ధనం 

చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 2
ఆ...ఆ...ఓ...ఓ.... 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వరుసకాన్పులై వన్నె తగ్గినా 
అందానికి నే తీసిపోదునా 
ఏమిటి నా అపరాధం 
ఎందుకు ఈ అవతారం 


చరణం: 3
దేవకన్య ఇటు ఓహో... 
దేవకన్య ఇటు దిగివచ్చిందని 
భ్రమసి పోదునా కలనైనా 
మహంకాళి నా పక్కనున్నదని 
మరచిపోదునా ఎపుడైనా 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నిఖారుసైనది నా మనసు 
ఊరూవాడకు ఇది తెలుసు 
ఏమిటి ఈ అవతారం? 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం

వినిపించని రాగాలే పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 1
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 2
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే...

చరణం: 3
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే


Palli Balakrishna Sunday, August 14, 2022
Allude Menalludu (1970)చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, కృష్ణం రాజు 
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: 
విడుదల తేది: 05.11.1970Songs List:వానలు కురవాలి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

వానలు కురవాలి జాబిల్లి వచ్చాడే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల

జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే
ఎదురుచూస్తున్నాడే పిల్లా

ఎన్నెల్లు విరబూసే పున్నమీ నడిరేయి
వయసూ ఉరకలు వేసే సొగసైనా చినదానా
ఎంతో చక్కని వాడే చెంతకు రమ్మన్నాడే

జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే
ఎదురుచూస్తున్నాడే పిల్లా
రేకురేకున నువ్వు సోకు సేసు కున్నావే
ముద్దు మొగమూ సూసి మురిసిపోతున్నావే
కలహంస నడకలతో కదలిరావే పిల్లా

జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే
ఎదురుచూస్తున్నాడే పిల్లా

సిగ్గె  నీ చెంపలకు నిగ్గాయే లేవే
నవ్వె నీ కన్నులకు వెలుగాయె లేవే
వయ్యారి ఓ పిల్లా సయ్యాట లాడాలా

జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే
ఎదురుచూస్తున్నాడే పిల్లాసుక్కు సుక్కు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి 

సుక్కు సుక్కు 
నీవని నేనని పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
కెరటాలై కిరణాలై  
ఓ... కెరటాలై కిరణాలై
పరుగిడ పరుగిడ పరువాలు

పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము
పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము
పులకరించు పెదవులతో వలపు పంచుకుందాము
వలపు పంచుకుందాము
ఒకరికొకరు పందిరిగా ఊహలల్లుకుందాము
ఊహలల్లుకుందాము
ఆ....

నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు

చరణం: 1
నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు

నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు

కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
ఆ....

నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
 బడా జోరు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

బడా జోరు పిల్ల పెళ్లి కుదిరింది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970)
సంగీతం: బి.శంకర్ రావు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

పెళ్లి కుదిరింది 

Palli Balakrishna
Nammaka Drohulu (1971)చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ , చంద్రకళ 
మాటలు: సముద్రాల జూనియర్ 
దర్శకత్వం: కె.వి.యస్.కుటుంబరావు
నిర్మాతలు: వి. సుబ్బారావు, వి. మనోహర బాబు 
విడుదల తేది: 08.07.1971Songs List:తుంటరి గాలి సోకింది పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

తుంటరి గాలి సోకింది కవ్విస్తా రావోయి కవ్విస్తా పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

కవ్విస్తా రావోయి కవ్విస్తా నీ కళ్ళలోన నీలి అందం ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

నీ కళ్ళలోన నీలి అందం ఉంది ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఏమా కోపమా నేను వేచింది నీకోసమే తెలిసిందిలే నీ మనసు పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

తెలిసిందిలే నీ మనసు ఊడల మర్రిపై పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మక ద్రోహులు (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఊడల మర్రిపై 

Palli Balakrishna
Pattukunte Laksha (1971)చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: కృష్ణ , విజయలలిత, ఉదయ చంద్రిక 
దర్శకత్వం: బి.హరినారాయణ 
నిర్మాతలు: బి. వి. క్రిష్ణమూర్తి, వి. కృష్ణంరాజు 
విడుదల తేది: 08.05.1971Songs List:రెడీ రెడీ ఎందుకైనా మంచిది పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: విజయరత్నం గోన 
గానం: ఘంటసాల, యస్. జానకి 

రెడీ రెడీ ఎందుకైనా మంచిదిపట్టుకుంటే లక్ష పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: తిరుపతి రాఘవులు, యస్. జానకి 

పట్టుకుంటే లక్ష వచ్చింది చుసుకో లక్ష ఓ స్వీటీ మై బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల 

ఓ స్వీటీ మై బ్యూటీ కొండ తిరిగి కోనతిరిగి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ప్రయాగ 
గానం: తిరుపతి రాఘవులు, జె. గిరిజ 

కొండ తిరిగి కోనతిరిగి ఉలికి పడతావేళ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి 

ఉలికి పడతావేళ అందరికీ ఈ చిలక అందదులే పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుకుంటే లక్ష (1971)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి 

అందరికీ ఈ చిలక అందదులే 

Palli Balakrishna
Dongala Vetagadu (1985)చిత్రం: దొంగల వేటగాడు (1985)
సంగీతం: ఇళయరాజా
మాటలు, పాటలు: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ, ఎమ్.రామారావు 
నటీనటులు: కమల్ హసన్ , మేజర్ సుందర రాజన్
దర్శకత్వం: మేజర్ సుందర రాజన్
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 1985

Palli Balakrishna Friday, August 12, 2022
Bhargava (2008)చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
నటీనటులు: భరత్, కాజల్ అగర్వాల్ 
దర్శకత్వం: పేరరసు 
నిర్మాతలు: జి. భరత్, ముత్యాల రాందాస్ 
విడుదల తేది: 08.03.2008Songs List:లోకల్ లోకల్ పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, సునంద

లోకల్ లోకల్ 
ఇంకొక పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: సాహితి 
గానం: రంజిత్, రోషిణి 

ఇంకొక దేవా దేవా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: కండికొండ 
గానం: టిప్పు & కోరస్ 

దేవా దేవా దేవుడా 
ఏయ్ అంటుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: రంజిత్, అనురాధ శ్రీరామ్ 

ఏయ్ అంటుకుంది తల్లి హృదయమే పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: శ్రీరామ్ 

తల్లి హృదయమే 

Palli Balakrishna
Pralaya Rudrudu (1982)చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: కృష్ణం రాజు, 
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి 
నిర్మాత: జి.ఆర్.కె.రాజు 
విడుదల తేది: 1982Songs List:బుగ్గన చుక్కపెట్టనా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

బుగ్గన చుక్కపెట్టనానడిరేయి నెలరాజ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు, యస్. జానకి 

నడిరేయి నెలరాజటింగు టింగు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

టింగు టింగు 
ప్రతి ఉదయం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

ప్రతి ఉదయం 
నీకోసంకోటి కుంకుమార్చన ముక్కోటి దేవతార్చన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి
గానం: పి. సుశీల

కోటి కుంకుమార్చన ముక్కోటి దేవతార్చన 

Palli Balakrishna
Taxi Driver (1981)చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణం రాజు, జయప్రద, మోహన్ బాబు 
దర్శకత్వం: యస్.పి.చిట్టి బాబు 
నిర్మాతలు: నరసింహ రాజు, నగేష్, పద్మనాభం, గోకిన రామారావు 
విడుదల తేది: 1981Songs List:హాట్ హాట్ అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

హాట్ హాట్ అందగాడాయదలో ఎన్ని కథలో పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

యదలో ఎన్ని కథలో నా ప్రేయసి ఊహలో ఊర్వశి పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

నా ప్రేయసి ఊహలో ఊర్వశి 
తెలుసునా నీసరి లేరుగా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

సా... రీ... గా...
నినిసా తెలుసునా 
సరి సరి నీ సరి 
రిరిగా లేరుగా గామపా ప్రియతమా 
నా వెన్న మనసు కన్నె వయసు నీవి కావా

తెలుసునా నీసరి లేరుగా ప్రియతమా
నా వెన్న మనసు కన్నె వయసు నీవి కావా

ఏకాంతం ఏదో లంచం అడుగుతు ఉంటే
సాయంత్రం చలి చలి మాత్రం పెడుతూ ఉంటే
ఏకాంతం ఏదో లంచం అడుగుతు ఉంటే
సాయంత్రం చలి చలి మాత్రం పెడుతూ ఉంటే
రసికుల రాజా రవికుల తేజా
యువతి మనోజా నీ రతి నేను కాదా
నీ కంటిలోన కాపురాలు చాలులేరా

తెలుసునా నీసరి లేరుగా ప్రియతమా
నా వెన్న మనసు కన్నె వయసు నీవి కావా

రా చిలకలు రమ్మని కబురులు పంపుతు ఉంటే
పులకింతలు కమ్మని వలపులు తెలుపుతు ఉంటే
రా చిలకలు రమ్మని కబురులు పంపుతు ఉంటే
పులకింతలు కమ్మని వలపులు తెలుపుతు ఉంటే

మనసుకు రేడా వయసుకు తోడా
మమతల మేడా నా మల్లెలు నీడా
నా పూజలెంత ఆకలెంత చూడవేరా 

నినిసా - తెలుసునా 
సరి సరి - నీ సరి 
రిరిగా - లేరుగా 
గామపా - ప్రియతమా 
నా వెన్న మనసు కన్నె వయసు నీవి కావా
చలి జ్వరం జ్వరం జ్వరం పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

చలి జ్వరం జ్వరం జ్వరం
అణు క్షణం క్షణం క్షణం
చెయ్యాలి విందు వెయ్యాలి చిందు
ఇవ్వాలి మందు ముందు

Palli Balakrishna
Andadu Aagadu (1979)చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, లతా సేతుపతి, మోహన్ బాబు, కవిత, విజయ లలిత, రంగనాథ్ 
దర్శకత్వం: యస్.డి.లాల్ 
నిర్మాత: శ్రీకాంత్ నాహతా 
విడుదల తేది: 30.03.1979Songs List:ఈ కోడె వయసు నా ఆడ మనసు పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి 

ఈ కోడె వయసు నా ఆడ మనసు ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది చిక్కడ పల్లి చినదాన చిత్రమైన దాన పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి. సుశీల 

చిక్కడ పల్లి చినదాన చిత్రమైన దానఓ చిట్టికి ఎంత ముద్దుగున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఓ చిట్టికి ఎంత ముద్దుగున్నావే
ఓ పట్టికి ఏమి తియ్యగున్నావే
ఈ సంతలో ఒక చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

ఈ సంతలో ఒక చిన్నది నిలుచున్నది కొనువారెవ్వరో...

Palli Balakrishna
Bangaru Kutumbam (1971)చిత్రం: బంగారు కుటుంభం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ 
నిర్మాతలు: కె.దాశరధ రామనాయుడు, కె.ప్రభాకర నాయుడు 
విడుదల తేది: 13.08.1971

Palli Balakrishna
Samrat Ashoka (1992)చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, వాణీ విశ్వనాథ్ 
నిర్మాత, దర్శకత్వం: యన్.టి.రామారావు 
విడుదల తేది: 28.05.1992Songs List:ఓ రామో రామా పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

ఓ రామో రామా
కించిత్ కించిత్ పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

కించిత్ కించిత్ అనురాగినిగా పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

అనురాగినిగా 

Palli Balakrishna
Kokilamma (1983)చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, పి. బి. శ్రీనివాస్ 
నటీనటులు: రాజీవ్ (నూతన పరిచయం) , సరిత, స్వప్న
కథ, స్క్రీన్ ప్లే; దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ఆర్.ఎస్.రాజు
విడుదల తేది: 07.05.1983Songs List:ఎవ్వరో పాడారు భూపాల రాగంపాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

పల్లవి:
ఆ....ఆ...
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం

చరణం: 1
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై

చరణం: 2
వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
కొమ్మమీద కోకిలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయు
గానం: పి.సుశీల

పల్లవి:
కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నది... ఓహో అన్నది

చరణం: 1
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శ్రుతిచేసి లయకూర్చునో
అని తల్లి అన్నది అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది కలలు కన్నది

చరణం: 2
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండుమనసే
నేను పాడే ది నీ పాటనే
అని ఎవరు అన్నది అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నది
నీలో వలపుల సుగంధం పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా
 
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా....ఆ....ఆ
కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ...ఆ
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
వయసుకే.... మనసుగా
మనసుకే...... సొగసుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా
 
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వేలా
మదిలో నీవుండగా...ఆ ఆ ఆ ...
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వెలా
మదిలో నీవుండగా...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా...ఆ....ఆ...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా
నేనుగా... నేనుగా
వేరుగా... లేముగా

నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా

పల్లవించవా నా గొంతులో పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి. బి. శ్రీనివాస్

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి 

మధురం మధురం నాదం 
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం మధ్యమదూతం 
త్రైకాల సంచారం
శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి 
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం
శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
హాహాహా ఆఆఆహాహాహా ఆఆఆ

ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ…ఆ….ఆ…ఆ…ఆపోనీ పోతే పోనీ పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయు
గానం: పి.సుశీల

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 
మనసు మారిపోని మమత మాసిపోని 
గురుతు చెరిగిపోని గుండె రగిలి పోనీ

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 

ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు
అది జీవితానికి తుది మొదలు కాదు
ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు
అది జీవితానికి తుది మొదలు కాదు
ప్రేమించ గలనిండు మనసున్న చాలు
అది పంచి ఇచ్చేందుకెందరో గలరు
ప్రేమించ గలనిండు మనసున్న చాలు
అది పంచి ఇచ్చేందుకెందరో గలరు

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 
మనసు మారిపోని మమత మాసిపోని 
గురుతు చెరిగిపోని గుండె రగిలి పోనీ


Palli Balakrishna Thursday, August 11, 2022
Ramdev (2010)చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
నటీనటులు: అబ్బాస్, ఆకాష్ , సాయి కిరణ్, గ్రేసీ సింగ్, అర్చన 
దర్శకత్వం: యస్. కె. బషీద్ 
నిర్మాత: యస్. కె. కరిమున్నిసా 
విడుదల తేది: 20.08.2010Songs List:లవ్ యు పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాకేత్, యం.యం.శ్రీలేఖ

లవ్ యుఏమని చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: పావని 
గానం: సాకేత్, గంగ 

ఏమని చెప్పను ఓ సాంబారే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: గాంధీ 
గానం: రంజిత్, యం.యం.శ్రీలేఖ

ఓ సాంబారే 
ఆ ఖుషీ నే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: హేమచంద్ర, శ్రావణ భార్గవి 

ఆ ఖుషీ నే రబ్బా మేరి పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: పావని 
గానం: రీటా 

రబ్బా మేరి
రామ సక్కని పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: జయసూర్య 
గానం: టిప్పు, మాళవిక 

రామ సక్కని 

Palli Balakrishna

Most Recent

Default