-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1962"



చిత్రం: పదండి ముందుకు (1962)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
గానం: ఎ.పి.కోమల,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మహమ్మద్ రఫీ
నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఘట్టమనేని  కృష్ణ, హేమలత
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి
విడుదల తేది: 26.01.1962


ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి.సుశీల, జిక్కీ, పి.బి.శ్రీనివాస్, నాగేంద్ర 
నటీనటులు: కాంతారావు, హరినాథ్, రాజశ్రీ 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జననీ భద్రకరాళ కాళి భగశా పద్యం సాహిత్యం

 

పద్యం: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల

మందారవల్లి:
జననీ భద్రకరాళ కాళి భగశా 
జ్వాలా ముఖీ భైరవీ
తిను నా భావన వాక్కు కర్మల సదా 
నేనమ్మి పూజించితీ
వినవా నా మొర దిక్కు నీవె 
దయతో వీక్షించి రక్షించవా
పెను ఆపత్తున మిత్రుతో బడిన 
నా ప్రాణేశు కాపాడవా



నా కోటి స్వప్నాలు పద్యం సాహిత్యం

 

పద్యం: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

మదనకమరాజు:
నా కోటి స్వప్నాలు నిజముగా చేయగా 
దివినుంచి భువికి ఏతెంచినావె 
వయ్యార మొలికించి వరమాల చూపించి
నారాక కోసమే నిలచినావె 
అరమోడ్పు నేత్రాల ఆనురాగ సుధ జార
నిలువు నిలువున పుల్కలు నింపినావె 
కదలికే లేని నీమధుర అధరాలతో 
మానముగ ఆహ్వాన ముపినావె
వలచి పిలచిన ముద్దార పలుక వేమె 
చెలిమి కోరిన నాపైన అలుక ఏమె 
జాలమాయను చాలనీ వలసినావె 
జాలి చూపించి రావె నన్నేలు కోవే



చిక్కును విప్పవె చినదానా పాట సాహిత్యం

 
పాట: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ, నాగేంద్ర 

తిమ్మరాజు : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవ్ నామైనా

సుందరి : ముక్కు తెలియదూ, మొగం తెలియదూ
చిక్కెదనా చినవాడా

తిమ్మ : నడుం ఒంపుతో నడక సొంపుతో
గుండెలు గుబ గుబలాడా

సుందరి : ఎక్కడోడవో- టక్కరోడనీ
నక్క జిత్తులూ తెలినే

తిమ్మ :ఉండి పోయనే ఉంగరాల
నీ ముంగురు లందున మనిశే
సుందరి ఒల్లను నే

తిమ్మ : వెళ్ళను నే
సుందరి : ఒల్లనోయి పొమ్మన్నా

ఇద్దరు : హా! హు! హే! చ! 

తిమ్మ : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవె నామైనా 

సుందరి : ఒంటిదానితో కొంటి చూపులూ 
తుంటరి తనమూ తగదూ
తిమ్మ : ఒప్పుకుంటివా తప్పకుండ 
నీ కాళ్ళకు గజ్జెలు కడుదూ

సుందరి: కల్లకబురులూ కాని మాటలూ 
కన్నెపిల్ల ఎద టేలా!
తిమ్మ : వల్ల కొదనా-వీలు లేదనా- వల్లకాడె బ్రతుకెల్లా!
సుందరి : తగ్గాలి 
తిమ్మ : సిగ్గేలా 
సుందరి : తగ్గవోయి పోతున్నా!
తిమ్మ :చిక్కును విప్పవె చినదానా చిక్కితి వలపుల వలలో నా
వెక్కుచు వున్నా ఒట్టు పెట్టినా మక్కువ చూపవె నామైనా





ప్రేమతో సరియైనదీ పాట సాహిత్యం

 
పాట: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరియైనదీ 
భూమిలో ఏమున్నదీ 
అనుభవించూ అనుభవించూ 
అమర సౌఖ్యమదీ 
పసిడి పొంగుల ప్రాయములో 
పులకరించే వయ్యారమూ 
తళుకు చూపుల భావములో 
తొలికి పోయే శృంగారమూ 
వలపులోని విలువకోరు 
వన్నెలాడిని—వరు డెవ్వరూ

నీవే! నీ వే! నీవే!

కుమిలి పోవుటే నరకమురా 
కులుకుటే సుఖ స్వర్గమ్మురా 
యినుప సంకెల యింకేలరో 
వలపు గొలుసుల బంధింతురా 
మేరులుమీరా-మనసు తీరా 
మేచ్చినానురా - నను చూడరా-





ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
పాట: 3

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 
హృదయము దోచి మది రగిలించీ దాగి పోతావా

ఓ ప్రియతమా!

పూవులు పూయా- కోయల కూయా 
నీవే మనసున మెరిసేవోయీ

కన్నులలోన- వెన్నెలలోనా 
కాంతి కళలు- నీవై కలచేవూ 
వేదన తీరే దారియె లేదా 
బ్రతుకే బరువాయే   

ఓ ప్రియతమా!

శత జన్మాల జత మనదోయీ 
మది మందిరమున నిలచేవోయీ 
నీపై వలపే నాతలపాయే 
తెలిపే రీతి తెలియగద దాయే 
వేయి కన్నులతో వెదకుచు నీ కై 
వేచి యున్నానోయ్-





నీలి మేఘమాలవో పాట సాహిత్యం

 
పాట: 4

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నీలి మేఘమాలవో 
నీలాల తారవో 
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

||నీలి మేఘమా!||

నీ మోములోన జాబిలీ దోబూచులాడెనే 
నీకురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే 
నిదురించు వలపు మేల్కొలి దాగిపోదువో

||నీలి మేఘమా!||

నీ కెంపు పెదవి తీయనీ కమనీయ కావ్యమే 
నీవలపు తనివి తీరని మధురాల రావమే. 

||నీలి మేఘమా!||

నిలచేవదేల సాపిలుపు ఆలకించవో 
రాదేల జాలి ఓ చెలీ యీమౌనమేలనే 
రాగాల తేలిపోదమే జాగేల చాలు నే
రావే యుగాల ప్రేయసీ సన్నాదరించవో

||నీలి మేఘమా!||




నీలి మేఘమాలవో - డ్యూయెట్ పాట సాహిత్యం

 
పాట: 5

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

మదన : నీలి మేఘమాలవో నీలాల తారవో 
నీసోయగాలతో మదినీ దోచి పోదువో
రత్నావళి : నీలి మేఘమాలనో నీలాల తారనో 
నా సోయగాలతో - మదినీ దోచి పోతినో

మదన: నీరాక కోసమే చెలి నేవేచియుంటినే
రత్నావళి : ఆరాటమేలనో ప్రియా నేచెంత నుంటినే
ఇద్దరు: ఆనంద మధుర గీతములా ఆలపింతమా

||నీలి మేఘ||

రత్నా రళి : చివురించు వలపు తీవెల- విరిపూలు పూయగా
మదన : చిరునవ్వు విరుపులోపల హరివిల్లు విరియగా
ఇద్దరు నెలవంక నావలోన మనమూ కలసి పోదమా

||నీలి మేఘ||

రత్నావళి : మనలోన కలత మాయమై మన ఆశ తీరెగా
మదన : అనురాగ రాగమే యిక మనరాగమాయెగా
ఇద్దరు : మనసార ప్రేమ మాధురులా సాగి పోదమా




తేలిపోదామా-యీహాయిలోనా పాట సాహిత్యం

 
పాట: 6

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

రత్నావళి : తేలిపోదామా-యీహాయిలోనా
మదన : గాలిలో పూవులై
ఇద్దరూ : తేలిపోదామా యీహాయిలోనా
మదన : కన్నులలోని కాటుక నై- నే
కరుగుచు నీలో కలిసెద నే
రత్నావళి : హృదయములోని కదలిక నై- నే ముదమలరించి మురిసేద నే
మదన : కామిత మీడేరే కొనుకగా మారే 
రత్నావళి : కలయె నిజమాయే

||తేలిపోదామా||

రత్నావళి : వెన్నెలలోని ''వెలుగే మీరూ
మదన : వెలుగున దాగే చలువే నీవూ
ఠత్నా : సుందరమా నా స్వప్నమె నీవూ
మదన : స్వప్నములోని స్వర్గమె నీవూ
రత్నా భూమిని మనసాటి
మదన : ప్రేమికులే లేరు
ఇద్దరూ : బ్రతుకే వలపాయే


Palli Balakrishna Monday, May 4, 2026



చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
నటీనటులు: యన్.టి.రామారావు, రాజసులోచన 
దర్శకత్వం: సి.యస్.రావు 
నిర్మాత: వడ్డి శ్రీరాములు, పంతం చిన్నారావు 
విడుదల తేది: 08.03.1962



Songs List:



శ్రీమన్నభీష్ట వరదాఖిల పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల 

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మార్తే
వెంకటా చలపతే తవ సుప్రభాతమ్



పరిత్రాణాయ సాధూనాం !పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల 

పరిత్రాణాయ సాధూనాం !
వినాశాయ చ దుష్క్రుతమ్ |
ధర్మ సంస్థాప నారాయ
సంభ వామి యుగే యుగే!



బాలా నువ్వూ ఎవ్వరే పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: మాధవపెద్ది సత్యం, వైదేహి

బాలా నువ్వూ ఎవ్వరే -
మరుని ములుకోలా నువ్వూ ఎవ్వరే!
ఏల నా జోలి నీకేల?
అందాల బాల నవమోహిని నే-తా మెవ్వరో!
హరుని కొలిచి - ఇంద్రాదుల గెలచిన
వీరుడ భస్మాసురడను
నేనే - తరుణి నీవు నాదానివి - రావే
దరియ వేళ నును సిగ్గులు ఏల నే?

బేలా నన్నూ ఏలుకో-మరునిములు
కోలా-నన్ను ఏలుకో!
ఏలెద వానిని ఎవ్వడునన్ను గెలంచునో
నాట్యాల
ఓహో!! చాలా 
ఓ! ఆయితే నన్ను స్పెయిన్ డాన్సులో నెగ్గు!
నువ్వు మొగ్గు
స్పెయిన్ డ్యాన్సులో జయం నీది లే
చెయ్ వోయ్ ఆటవిక డాన్సు'
సైయ్
విదేశీ నాట్యం విజయంనీదే !
స్వదేశీ నాట్యం చేదాం!
చూద్దాం!




దంపతుల పైన పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: రాఘవులు

దంపతుల పైన దయబూని దైవ మొసగు
వరమె పుత్రుడు వానిని వంగడంబు
జాతి కొనియాడు రీతి గా సాకజాలు
తల్లి దండ్రులె ధన్యులు ధరణిలోన!



చందురుని మీరు చలువలు పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల 

చందురుని మీరు చలువలు
చిందగ చెలువాఱు దాన చెలిమి ఖజానా!
సుందరి తారా పరమా
నందమయి- యిదియె నీకు నా నజరానా!!



మామ నీపైన పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

సాకి:
ఓ...నీల జలదాలు చాటున మెరిసేటి బిజిలీ
కాలమేఘాలగని చిన్డువేయు నెమలీ....
ఆడవే...పాడవే గారాల నెచ్చలి ఆ...

మామ నీపైన
మామ నీపైన నన్నుంచెరా
మగడు నను జూసి చింతించెరా
ఆడలేనోయి మన్నించరా
ఏలుకో చాలు వలదోయి నా రాజా

ప్రీతి దరిజేరి
ప్రీతి దరిజేరి అలరించనా
గీతి మనసార వినిపించనా
భీతి ఇసుమంత లేదేమిరా




నవ భావనలో చివురించిన పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: యస్.జానకి & కోరస్ 

నవ భావనలో చివురించిన 
మా యువసేవనమే హాయి
ఎట కేగిన మధుర గీతమే యుగళగీతమే
ఎటు చూసినా వయసు జంటలే వలపు పంటలే
సొగసైన ఈ ప్రకృతి
మనసైన ఈ ప్రగతి
మనదే సకల జగతి

నవభావనలో - చివురించిన మా
యువ జీవనమే హాయి !

చిఱుగాలి వీచి కురులు ఆడగా
చెవి చెంత జేరి - ఎవరో పాడగా
బ్రతిమాలి చెలిమి కోరి - వేడగా !
మైన్ పులకరించి - మది పరవశించి
స్వప్నాల తేలిపోతే హాయి !

నవభావనలో చివురించిన మా
యువ జీవన మే హాయి!

జవరాలి లేత మనసే ఊయల
మదిలోని తీయ తలపే ఊయల!
భువినుండి దివికిసాగే ఊయల!
ఉలికించు ఊహలూరించు సుఖమే
ఊగించు మది ఊయల




వరూధిని - ప్రవరాఖ్యుడు (నాటకం) సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: యస్.జానకి & కోరస్ 

వరూధిని - ప్రవరాఖ్యుడు (నాటకం)

తరమే బ్రహ్మకునైన - యీనగ మహత్యంబైన నే నియ్యడం
గల చోద్యంబులు రేపు గన్గొనియెదన్ - గాకేమి నేడే గెదన్
ఆహాఁ' పాద లేపనము గరిగి పోయెనే!
ఎక్కడి అరుణాస్పదము '
ఎక్కడి హిమగిరి!
ఇంక నే నింటి కేగుదారి!

హిమనగరీ మధుర ఝరీ
అనురాగ రాగ మంజరీ
భాసిల్లు నే నవరత్నాలతో
నవశోభాలహరి శీతగిరి
యోగీశునైనా-భోగాల వాంఛ
రేగించి రాగాలు పాడించె 

ప్రవరుడు పద్యం:
ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ ఒంటి చరించె దోటలే
కివ్వనభూమి భూసురుడనే ప్రవరాఖ్యుడ
త్రోవతప్పితిన్
గ్రొవ్వున ఇన్న గాగ్రమునకున్ జనుదెంచి పురంబు
గాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబునీక గున్ !

వరూధిని పద్యం: 
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియెగాక నీ వెఱుగ వేమును వచ్చిన త్రోవ చొప్పు, నీ
కింత భయంబు లేకడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్

వచనం : నా పేరు వరూధిని మా ఇంట్లో ఆతిధ్యము తీసుకొని వెళ్లండి!

ప్రవరుడు : ఆ మాటేచాలు నేను మా ఊరు వెళ్లాలి!

వరూధిని పద్యం : 
ఎక్కడి యూరు కాల్ నిలువకింటికి బోయెదనంచు,
బల్కెడీ పక్కట!
నిక్కము దాప నేల ధరణీసుకనందన నీ పయిన్
జిక్కె నామనంబు!

పాట : 
విరిపొదరిళ్ల బిగికౌగిళ్ల తేలి ఏలుతావో!
వియోగాల ముంచి పోదువో!
వ్రతులై మెలిగే వారిని నీవిట కోర న్యాయమౌనా!
దురాచారా భీతి లేదొకో!
యాగము యోగము మాకౌగిలిలో - భోగము కోరే కాదా!
భామరొ కామికి స్వర్గమ్మదియే - బ్రహ్మ జ్ఞానికి కాదుగా!

ప్రాచదువులలో పాఠమేగా
ఆనందో బ్రహ్మ ఎఱుగవకో !
మేనులు మరిచే తుచ్ఛ సుఖాలు
పరమానందము కాదుగా!
వీరి పొదరిళ్లు బిగికౌగిళ్ల తేలి ఏలుతావో
వియోగాల ముంచి పోదువో!




ఉలకక పలకక ఉన్న తెలియక పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల, యస్.జానకి

ఉలకక పలకక ఉన్న తెలియక
మనసు దోచిన వారే- పగటి దొంగలు కారా!
ఉరుకుతూ కులుకుతూ- చేతికంది దొరకక
పారిపోయేవారే- పగటి దొంగలు కారా!
దారిగాచి వీలు జూచి- కొంగు లాగేవారో!
ఆశజూపి మనసు రేపి- మాయచేసే వారో!
తెరచాటు అలవాటు పరిపాటిగా

కనులు పిలిచి కబురులాడి కలత రేపే వారి
తోడులేని ఆడవారి ఉడికిలించేవారో!
నవ్వించి కవ్వించి ఊరించుచు




హాయి హాయి హాయి! పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల, జమునారాణి

హాయి హాయి హాయి!
తీయని వెన్నె రేయి !
ఆడే వేళే ఇదోయ్
పాడేరోజే ఇదోయ్

తికమక యెందుకోయ్
చక చక నాట్యం చెయ్
ఒళ్ళు తెలియకే ఆడితే
ఆడిందంతా డ్యాన్సే నోయ్ | హాయి

ఆశ్శరభ శరభ ఆరెళ్ల భీర
ఆశ్శరభ శరభ - ఆరెళ్ల భీర
ఆడెయ్ రాక్ ఎన్ రోల్
లేదోయ్ - దీనికి రూల్ !
అన్ని మరచుటే దీనిగోల్!
ఆనుభవమైతే వండరఫుల్
రంగు రంగుల కీలుబొమ్మా.రావే
రంగ మెల్లి పోదామే నారాయణమ్మా
ఓ నారాయణమ్మా --ఓ నారాయణమ్మా




ఎన్ని దినాలకు వింటినిరా పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: పి. లీలా

ఎన్ని దినాలకు వింటినిరా
కన్నా కమ్మని నీపాటా!
కన్నీటి గాలివాన వెలసెనురా
కలత మబ్బులన్నీ తొలగెనురా
మనసగు నీమురళీ గీతి
మదివికసించే రీతి
మగ నాలినోము పండే సమయమి
ఆనందాల తేలే తరుణమిదే!
ఈ మహిలో లేనేలేరె
మము ఎడబాపేవారే



చందమామ లోకంలో పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల, జమునారాణి

కామిడీ డ్యూయెట్ : చంద్రలోక యాత్ర పాట

చందమామ లోకంలో - సరదా చేదామే
అందాల జూలీ -మనదే జాలీ

ఇలలేని భోగాల -మనకేలా ఈ గోలా
నినువీడి మనజాల నీ వెంట రాజాల |
లెక్క లేని వింతలూ - చక్కిలి గింతలూ ॥
అక్కడే ఉన్నాయంటా - ఎక్కో ఎక్కో రాకెట్టూ 
గాలో గాలి - ఈదరగాలి.
పోతోంది. నా ప్రాణి తేలి
ఈనాటితో నేను ఖాళీ

జూలీ జూలీ కొంచెం తాళాలి
మన మెంతో దూరం సాగాలి
చోద్యాలు యెన్నో చూడాలి
పాస్పోర్టు మీపాస్పోర్టు యేదేది-?
యేదేది?
లేదే?
పాస్పోర్టు మీ పాసుపోర్టు యేదేది?
ఎందుకూ-?
ప్రేమ జీవులం - పాసుపోర్టులూ - మాకెందుకూ-మీ కెందుకూ !
గేసో - గేసో ! - క్లోజు -క్లోజు





ఆశా దురాశా వినాశానికే పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: ఘంటసాల

ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!

నిరంతరం ధనమ్మని జపింతురే జనం !
విరాఘమే ఎఱుంగక- గడింతురే ధనం !
సమాధియా దినాన- ఈసిరి ప్రయోజనం?
తృణమ్మయిన- నీ వెంట రాదోయి

ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!

చీకటిలో జనుల కనులు మూయగలవుగానీ
నేటికెటో దాగుకొని బయటపడిన గానీ
సర్వసాక్షి సన్నిధి నీ సమాధాన మేమి ?
గర్వపడకు నేరానికి- శిక్ష తప్పదోయి !

ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!

తల్లీ బిడ్డల వేరుచేసే కిరాతకుడా
నువ్వు సాధించే ఘన కార్య మేముందిరా
గుణంలేని తండ్రికీ నీడైనా
మననీయదురా సుతుని సుఖానా
మార్చుకో నీమతం మార్చుకోరా !
మమత మానవత్వం నేర్చుకోరా !
నీ బిడ్డకు నీ బాధ్యత నెరవేర్చుకోరా!
నీతిగా నీబ్రతుకు కడతేర్చు కోరా!

ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!

కాజేసి పరుల సొమ్ము కనలేవు హాయి
కలదోయి ధర్మమందె– నిజమైన హాయి !
చేయుమా ధర్మము- దానమే పెన్నిధానము 
నీ దానమే పెన్నిధానము
వేధించి పరులను కనలేని ! సౌఖ్యము
సాధించు మానవ సేవలో
విలపించువారి కన్నీరు తుడిచిన
వెలిగేను శాంతి నీలో !
పశ్చాత్తాపం- కన్నీరే నీపాపానికి పరిహారము
ఇది నీ జీవిత పరమావధికి
సూటిగ బోయే మార్గము
సాగుమా మును సాగుమా
ఫలమ్మేమి నేడిలా తలబాదుకొని విలపించి
పిల్లల జీవన లత దిద్దే తోటమాలి తల్లే!
చిన్న నాడు చెడుత్రోవల పెంచిన జీవితమింతేలే
కన్నకడుపు చెనువై - ఇల్లాలికి దూరమై !
లోకానికి భారమై చెరలో నశించుటకేలే
వలదురా యీ ఘోర దండవ ఏతల్లికైనా !

ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!





పాహి దయానిధే పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య 
గానం: 

పాహి దయానిధే - పరమ కృపానిధే
పాపిని దయచూడరా దేవా
ప్రజలందుకు ప్రభల శత్రువై
ఆలు పిల్లలకు ఆరని వగయై
అన్నియు నీవని తిరిగే వానికి
ఎన్నటికీ శాంతి లేదా
పుణ్యతీర్ధములు స్నానములాడి
పుణ్యము లెన్నో చేసిన గానీ
పావనమగు నీ సన్నిధినైనా - జీవికి శాంతియె లేదా

Palli Balakrishna Thursday, November 30, 2023



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కాంతారావు,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ
నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జనని బద్రకరాల కాళి పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

జనని బద్రకరాల కాళి



నా కోటి స్వప్నాలు పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నా కోటి స్వప్నాలు 



చిక్కును విప్పవే చినదానా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ , నాగేంద్ర 

చిక్కును విప్పవే చినదానా




ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది 



ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 



నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్,

నీలి మేఘ మాలవో... నీలాల తారవో





నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

పల్లవి:
నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..
నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం: 1
నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో....

చరణం: 2
చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం: 3
మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...





తేలిపోదామా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

తేలిపోదామా 

Palli Balakrishna Sunday, July 17, 2022




చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
నటీనటులు: నాగేశ్వరరావు , సావిత్రి
దర్శకత్వం: పి.పుల్లయ్య 
నిర్మాత: వి. వెంకటేశ్వరులు
విడుదల తేది: 19.09.1962



Songs List:



చిట్టి పొట్టి పాపలు పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. శాంతకుమారి అండ్ బృందం

చిట్టి పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పూవులూ
మీరే మా సిరిసంపదలు  వరాలు ముద్దుల మూటలు
తరతరాల వరాల పంటలూ

[చిట్టి]

పిల్లలు కిల కిల నవ్వాలీ ఇల్లే కళకళ లాడాలీ
ఆడాలీ
బుల్లి బుల్లీ పొడి మాటలతో పుట్టతేనెలే కురవాలి 

[చిట్టి]

గోపాలునికి గోకులమందు పాలు వెన్న తినినంత
కానీ...
యశోద వాని కడుపును జూచీ పెట్టిన బువ్వే బలమంతా
ఆకాశంలో అన్ని తారలకూ ఒకే చంద్రుడు వున్నాడూ
ముద్దులొలుకు యీ ముగ్గురికోసం
వాడే బిరబిర దిగివచ్చాడు
ఎవరు?
బావ !

బావ బావ పన్నీరు  బావను పట్టుక తన్నేరు
తంతే బావ వూర్కోడు తాళికట్టి లాక్కెళ్తాడు




ఎందుకో సిగ్గెందుకో పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, సుశీల

ఎందుకో సిగ్గెందుకో
ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో
ఎందుకో సిగ్గెందుకో
పంతాలె తీరెనని తెలిసినందుకే, మనసులు కలిసినందుకే
అందుకే ... సిగ్గందుకే ...

చిన్న నాటి చిలిపి తలవు ఇన్నాళ్ళ వలపు పిలుపు
చిరునవ్వుల చిన్నారీ, ఇంకా సిగెందుకే

కొనసాగిన కోరికలే, మురిపించేను వేడుక లై
తనివారగ యీ వేళా, ముననే తూగాడెనే
అందుకే ... సిగ్గందుకే ...

నును సిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం, అన్నీ నీ కోసమే
అందుకా - ఊ - సిగ్గందుకా ? - ఆఁ

పంతాలే తీరె పని తెలిసినందుకా?
మనసులు కలిసినందుకే
అందుకా సిగ్గందుకా




ఈ పగలు రేయిగ పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, జానకి

ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ
మారిన దేమి చెలీ... కారణమేమీ చెలీ - ఆఁ...
వింతగాదు నా చెంతనున్నది 
వెండి వెన్నెల జాబిలి
పండు పున్నమి జాబిలి - ఓ...
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీపు
పెదవి కదిపితే మదిలో మెదిలే
మాట తెలియునని మానేవు

వెండి వెన్నెల జాబిలి
పండు పున్నమి జాబిలి

కన్నులు తెలిపే కథల నెందుకు
రెప్పలార్చియేమార్చేవు
చెంపలుపూచె కెంపులు నాతో
నిజము తెలుపునని జడిసేవూ

వెండి వెన్నెల జాబిలి
పండు పున్నమి జాబిలి

అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడ దనుకొని నవ్వేవూ
నల్లని జడలో మల్లె పూవు నీ నవ్వున కద్దము చూపేనూ! 




వేణుగానంబు వినిపించెనే పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, జిక్కి, జానకి

వేణుగానంబు వినిపించెనే 
చిన్ని కృష్ణయ్య కనిపించడే 
వేణుగానంబు వినిపించెనే 
చిన్ని కృష్ణయ్య కనిపించడే 

దోరవయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడుకు వింత కథ లేనటే!
ఏడి? కనబడితే నిల వేసి అడగాలి వానినే

మన్ను తిన్నా వన యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచు లోకాలు చూపాడట
అంత మొనగాడటే?
వట్టి కథ లేనటే !
ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే

దుకుకు క్రిష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ ఘల్లున - వళ్ళు ఝల్ ఝల్లు న
తాను ఫణిరాజు పడగ పై తారంగ మాడేనట




గుడిలో దేవుని గంటలా పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: సుశీల

గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా
కలలుకన్న కన్నె వలపులో గాలిగోపుర దీపాలూ
ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికి మనసులు వున్నా
ఆలకించరా ఆవేదనలూ ఆదరించగా అను రాగాలు

ప్రేమించిన మా పసిహృదయాలను
శాసించెనుగా ముది ద్వేషాలూ
దేవుడు వ్రాసిన వ్రాతలా ఇవి పెద్దలు చేసిన చేతలా 

తొలి ప్రేమను చవి చూపిన తల్లే విధి లేదనుకొని విడదీసినదా
ఈ విషబిందువు చిందిన దెవరో జీవిత మెడారి చేసిన దెవరో



పువ్పునవ్వెను పున్నమి నవ్వెను పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: సుశీల

పువ్పునవ్వెను పున్నమి నవ్వెను పులకరించి ఈ జగము నవ్వెను
కొలను నవ్వెను కోరక నవ్వెను నవ్వలేక నేనున్నాను
వయసు నవ్వెను సొగసూ నవ్వెను
నవ్వురాక యీ మనసే నలిగెను
వలపు నవ్వెను తలపూ నవ్వెను
పగ రగిలీ అవి బలియై పోయెను
కడుపు తీపితో కన్న బిడ్డ కై హితవుకోరి యేగిన తండ్రికి
చేయని నేరం శిక్ష వేసెను మాయని పాపం నా పాలయ్యెను
కలిమీ చెలిమి వెలసిన ఇల్లుర్ వెలుగుమాసి వెలవెలపోయెను
లోకం నవ్వెను శోకం మిగిలెను లోలోపల నా గుండె లవిసెను




వారాని కొక్కటే సన్ డే పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. బి. శ్రీనివాస్, జానకి, రాణి 

వారాని కొక్కటే సన్ డే కుర్రాళ్ళకంత అది
జాలీ డే
హాలిడే - జాలి డే - హాలిడే

స్టూడెంటు లైఫు స్వీటు, ఫ్యూచర్ కు మెయిన్ గేటు
బాధ్యతలున్నా పరీక్షలున్నా బాధలు లేవన్నా

వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్ డేసంతా చదువూ
సన్ డే నాడూ సెల్యూట్ పోడూ సరదాగా ఆడు

మనముందు వుంది గోలు, కొడదాము రేపు బాలు
పాడాలి నేడు హం తుం 
ఆడాలి ఆకు కంకం
పాడాలి నేడు హం తుం
ఆడాలి అట కం కం

అమ్మా నాన్న పైసా ఇస్తే హాయిగ తినితిరిగేం

ఫస్టు వీకులో కేపిటలిస్ట్
నెక్స్ట్ వీకులో సోషలిస్టు
ఆ పై వారం కమ్యూనిస్టు
ఆఖరి వారం టెర్రరిస్టు

హాలిడే జూలీ డే హాలిడే





కొండమ్మో, బంగారపు కొండమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సిరి సంపదలు (1962 )
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత

కొండమ్మో, బంగారపు కొండమ్మా
పిలిచి నపుడు పల్కరు లేవే, అంతు లేని ఆల్కలు లేవే
ఆడవాళ్ళు అంతా ఇంతే లేవే, ఓ రంగుల బొమ్మా 

మారయ్యో ఓ టక్కుల మారయ్యో
పెళ్ళి పెళ్ళి అంటారయ్యా బేరాలకు దిగుతారయ్యా
మగవాళ్ళంతా ఇంతేనయ్యా మాట్లాడకయ్యా

కట్నం నేరుగ బేరం చేసిన వాడనా
కన్నారా చూసిన వాడనా బ్రహ్మ దేవుడే రాసుంటాడు
అమ్మ నాన్న ఔనన్నారు
కిక్కురుమనక తల ఊపేను గదమ్మా, తప్పేమిటమ్మా 

మాటలు చూస్తే కోటలు దాటును జోరుగా
సొరకాయలు బహు కోస్తారుగా
అందంతోటి పని లేదయ్యా, ఆడది అయితే చాలుగదయ్యా
పైసయిస్తే పల్టీకొడతారయ్యా మి మ్మెరుగుదు మయ్యా 

పెళ్ళి పెత్తనం పెద్దల చేతుల్లోనిది, మనబడాయి చెల్లని చోటది
ప్రేమించట మే నా వంతు, ఇక పిల్లల కనడం నీ వంతు
లోకంలోనా జరిగేదే ఈ తంతు ఇది నీకు తెలుసు

పరుల చెప్పినట్లు తైయని
బొమ్మలా - ఆ హా హా బలే దద్దమ్మలా
పప్పుదప్పళం గారండి -- మీతప్పు వొప్పుకున్నారండి
ఇప్పటికైనా కోతలు ఆపాలయ్యా డాబెందుకయ్యా

కొండమ్మో  బంగారపు కొండమ్మా
మారయ్యో - ఓ ఏ కే మారయ్యా

Palli Balakrishna Thursday, July 1, 2021



చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్.టి.రామారావు, యస్.వి.రంగారావు, సావిత్రి, శారద
దర్శకత్వం: పి.యస్.రామకృష్ణా రావు
నిర్మాత: వై. ఆర్.కృష్ణప్రసాద్
విడుదల తేది: 12.12.1962



Songs List:



అనగనగా ఒక రాజు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న 
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

చరణం: 1 
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడా చవటలయ్యారు
ఒఠ్ఠి చవటలయ్యారు     

చరణం: 2
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు 
అయ్యొ ఇంటి దీపమార్పివేయు నెంచెక్కడు
తల్లీ దండ్రులు విషమని తలచెనొక్కడు     
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు... భ్రమసెనొక్కడు...

చరణం: 3
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను    
కంటిపాపకంటె ఎంతో గారవించెను
దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను తానుండసాగెను 

చరణం: 4
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
కూరిమిగలవారంతా కొడుకులేనురా        
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

ఈ బిట్ చిత్రం చివర్లో వస్తుంది:

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలు పోసి పెంపుచేసెను
కొన్నాళ్ళకు ఆ రాజు కన్నుమూసెను
కుక్క చల్లనైన చూపువల్ల ఇల్లు నిలిచెను
నా ఇల్లు నిలిచెను




చదువు రాని వాడవని పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: సుశీల

పల్లవి:
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో..
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం: 1
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను...
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం: 2
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు..
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు




ఎవరో ఏ ఊరో పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

ఎవరో ఏ ఊరో 




చీరగట్టి సింగారించి.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

పల్లవి:
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 1
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా ..
ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 2
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 3
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం..
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్




తీయని ఊహలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, జమునారాణి

తీయని ఊహలు 



మారదు మారదు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల

మారదు మారదు




దక్కెనులే పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.బి.శ్రీనివాస్ , జమునారాణి

దక్కెనులే

Palli Balakrishna Friday, December 8, 2017


చిత్రం:  రక్తసంబంధం (1962)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  అనిసెట్టి
గానం:  ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, సావిత్రి, దేవిక
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: డి.సుందర్లాల్ నహత
విడుదల: 01.11.1962

పల్లవి:
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చరణం: 1
అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా .. కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా

కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసే వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే
విధియె విడదీసే.. వెతలలో ద్రోసే.. మిగిలెనీ శోకమే

చరణం: 2
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా

కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా

దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే..
లాలి పాపయి హాయి పాపాయి.. లాలి పాపాయి జో జో..
లాలి పాపాయి జో జో ..



*******  *******   ********


చిత్రం: రక్తసంబంధం (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: అనిసెట్టి
గానం: సుశీల

బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే


Palli Balakrishna Wednesday, November 22, 2017


చిత్రం: భీష్మ (1962)
సంగీతం: సాలూరి రాజేస్వరరావు
సాహిత్యం: ఆరుద్ర (All)
గానం: యస్.జానకి, పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, శోభన్ బాబు , అంజలీ దేవి, వాణిశ్రీ, గరికపాటి వరలక్ష్మి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: బి.ఎ. సుబ్బారావు
విడుదల తేది: 19.04.1962

ఓ ఓ ఓ ఆ ఆ ఆ

నీ రాధను నేనే ఎడబాయగలేనే
వలచి ఇటు నిలచి నిను తలచితినో లోనే
నీ రాధను నేనే ఎడబాయగలేనే
వలచి ఇటు నిలచి నిను తలచితినో లోనే
మాధవా ఓ దేవా  మాధవా...
మాధవా ఓ దేవా  మాధవా

నీ రాధను నేనే ఎడబాయగలేనే
వలచి ఇటు నిలచి నిను తలచితినో లోనే
మాధవా ఓ దేవా  మాధవా...
మాధవా ఓ దేవా  మాధవా

Palli Balakrishna Wednesday, November 1, 2017



చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు
విడుదల తేది: 05.01.1962



Songs List:



ఉన్నది చెబుతా వింటారా పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి, వసంత 

ఓ...
ఉన్నది చెపుతా వింటారా
నేనన్నది ఔనని అంటారా
తండ్రులకోసం త్యాగం చేసిన
తనయు లెందరో ఉన్నారని నే 

తండ్రిబాస కాపాడి - తనరాచ గద్దె విడనాడి
నారచీరలను దాల్చి కానలకు 
తరలిపోయెనా దశరధరాముడు

తండ్రివలపు చెల్లించి పినతల్లి కోర్కెపాటించి
బ్రతుకు సాంతముగ బ్రహ్మచర్యమును
వ్రతముగ బూనెను భీష్మాచార్యుడు.

తండ్రి ఆశ గమనించి అతని తలంపు మన్నించి
మిసిమి యౌవనము ధారవోసి - తా
ముసలి తనమ్మును గైకొనె పూరుడు




అంబ జగదంబ పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.లీల 

అంబా జగదంబా
నా ఆ రినే ఆలించవా
ఏడి నా కన్నయ్య ఏడీ
జాడనే చూపించవా
నీవె చూపిన కంటి వెలుగును
నీవె మాయము నేతువా
ఏమిటీ అన్యాయమమ్మా
ఎందుకింత పరీక్షలమ్మా

ఎన్నొ నోములు నోచి కొడుకును
కన్న ఫల మేమున్నదీ
అమ్మాయని పిలుచు
నా పాపాయి ఒడిలోలేనిది




కాలిగజ్జే కదలకముందే పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి & కోరస్

కాలిగజ్జె కదలకముందె 
ఖంగారై పోతా రెందుకు
పాచికలను విసరకముందే
పరవశమై పోతారెందుకు

మా గజ్జెలు ఘల్లంటేనే 
మీ గుండెలు ఝల్లంటాయి
మా అందం మా చందం 
మీ అందరికాళ్ళకు బంధం

మీ ఆటలింక సాగవు మాముందు
దొరబాబులంతా బందీలిక ముందు

కుచ్చుల తలపాగా చూసి పచ్చలవిడి దాకును చూసి
వడి తిరిగిన మీసం చూసి జడుసుకునే దానసు కానోయి.

మా చూపే గిలిగింత మా రూపే పులకింత
మా చూపే మా రూపే మీగుండెల చక్కిలిగింత

మీ ఆట సాగు మాముందు
దొరబాబులం బందీలిక ముందు

నిరుపేదల నోళ్ళనుగొట్టి నిలవుంచిన బంగరు మొహరీల్
పడతి పొందుకై ఘల్లనిపిస్తే భ్రమసిపడే దానను కానోయి

పందానికి మేం పిలిచాము పంతానికి మేం నిలిచాము
పందెంలో పంతంలో మిమ్మందరినీ మేం గెలిచాం

మీ ఆటలింక సాగవు మా ముందూ
దొరబాబులంతా బందీలిక ముందు

వెకిలి నవ్వులను ఒలికిస్తూ
వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ
గుడ్లప్పగించి గుటకలు వేనే
మీ గోడు వినే దానను కానోయీ

పందానికి మేం పిలిచాము -
పంతానికి మేం నిలిచాము
పందెంలో పంతంలో
మిమ్మందరినీ మేం గెలిచాం

మీ ఆటలింక సాగవు మా ముందు
దొరబాబులం బందీలిక ముందు



అనురాగ పయోనిధి పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల 

విజయ :
అను రాగ పయోనిధిః ఓ
జననీ నీ పదమె నమ్మి జనకుని కనులన్
గొనిరా నరుగుచు నుంటిని
కనురెప్ప విధాన నన్ను గావవె మాతా !



సలామలేకుం సాహెబు గారు పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల , యస్.జానకి 

సలామలేకుం సాహెబుగారూ
బలే షోకుగా వచ్చారా
బల్ బలే షోకుగా వచ్చారా
సలామాలేకుం అస్సలామాలేకుం
పసందుచూపి నిషా చేసి
దిల్ ఖుషీ చేయగా వచ్చానే
నడుంవంగి గడ్డాము నెరసినా
పడతి మోజు పోలేదా పులుపు తగ్గిపోలేదా
నీ పులుపు తగ్గిపోలేదా సలా మాలేకుం
వయసుతోటి పనియేముందే 
నా మనసుచూడవె బుల్ బుల్
నా హోయలు చూస్తేనే జిల్ జిల్
ఆ త్తరులో మునిగొస్తేనేమి ఆటను గెల్చుటకల్ల పోటీలో నువు ఢిల్లా 
మా పోటీలో నువు ఢిల్లా సలా మాలేకుం
అత్తరు కంటే మత్తునుచూపే సత్తువవుందే పిల్లా
నా చలాకి చక్కెర బిళ్ళా నా చలాకి చంకీ పిల్లా
కన్నెలందరం కాలుదువ్వితే రిమ్మతిరిగి పోతుందోయ్
నీ గుండె పీచుమంటుందోయ్
నీ గుండె పీచుమంటుందోయ్ సలా మాలేకుం
జబ్బ చరచి నే దూకానంటే దెబ్బకు మీరు పరారు
మీ దయ్యం దిగుట ఖరారు అస్సలా మాలేకుం




నన్ను దోచుకుందువటె పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

చరణం: 1
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు 

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని 
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి 

చరణం: 2
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని 
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి 





కలల అలలపై తేలెను పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, జానకి

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై 
ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై 
కలల అలలపై..... 

చరణం: 1 
జలకమాడు జవరాలిని 
చిలిపిగ చూసేవెందుకు (2)
తడిసీ తడియని కొంగున 
ఒడలు దాచుకున్నందుకు (2)
చూపుతోనె హృదయవీణ 
ఝుమ్మనిపించేవెందుకు (2)
విరిసీవిరియని పరువము 
మరులు గొలుపుతున్నందుకు (2)

చరణం: 2 
సడి సవ్వడి వినిపించని 
నడిరాతిరి ఏమన్నది (2)
జవరాలిని చెలికానిని 
జంటగూడి రమ్మన్నది (2)
విరజాజులు పరమళించు 
విరుల పానుపేమన్నది (2)
అగుపించని ఆనందము 
బిగికౌగిట కలదన్నది (2)




ఒంటరినైపోయాను పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ 
ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ 

చరణం: 1 
నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని
నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని 
ఎవరికీ గాక ఏ దరిగానక 
ఎవరికీ గాక ఏ దరిగానక 
చివికి చివికి నే మ్రోడైపోతిని

చరణం: 2 
నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని 
బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ
బండలలో నొక బండనైతిని "ఒంటరి" 

చరణం: 3 
వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి 
వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేస
గుండె ఆవిరైపోవుచుండ 
ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని 





మదన సుందర నాదొరా  పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

మదన సుందర నాదొరా 
ఓ మదన సుందర నాదొరా 
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె 
ఓ మదన సుందర నాదొరా 

చరణం: 1 
చిన్నదానను నేను - వన్నెకాడవు నీవు (2)
నాకూ నీకు జోడు (2)
రాకాచంద్రుల తోడు 

చరణం: 2 
మిసిమి వన్నెలలోన - పసిడి తిన్నెలపైన (2)
రసకేళి తేలి (2)
పరవశమౌదమీవేళ

చరణం:3 
గిలిగింతలిడ యింత పులకింతలేదేమి (2)
ఉడికించకింక (2)
చూడొకమారు నా వంక

చరణం:4 
మరులు సైపగలేను - విరహమోపగలేను (2)
మగరాయడా రార (2)
బిగికౌగిలి చేర 





విన్నావా తత్వం గురుడా పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

అతితెలివి :

విన్నావా తత్వం గురుడా
కను గొన్నావా సత్యం నరుడో నరుణా
విన్నావా తత్వం గురుడా
నువ్వు విన్నావా తత్వం గురుడా'

జుట్టు మట్టమై పోతుందంట
బొట్టు మాయమై పోతుందంట
మిస మిసలాడే కోర మీసాలకు
అసలుకే మోసం వస్తుందంట
కన్న తల్లి విషమౌతుందంట
పెళ్ళామే బెల్ల మౌతుందంట
అత్తల నెత్తికెక్కి కోడళ్ళు
పెత్తనాలు వెలిగిస్తారంట



మాత జగన్మాత పాట సాహిత్యం

 
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

విజయ :

మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా
మీకన్నా లోకంలో నా కింకెవరున్నారు 

మీ చల్లని చూపుంటే మీరే నా దావుంటే
భస్మరాశి ఇపుడే బంగారు జలం కావాలి
వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి

అమ్మ మాట చెల్లించుట ఆపరాధ మ్మయితే
నాన్నకు చూపివ్వడమే నా నేరమ్మైతే
అందుకు నా చూపే పరిహారం
కెందుకు యీ కన్నే బలిహారం
యీ కన్నే బలిహారం


Palli Balakrishna Wednesday, October 4, 2017



చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
నటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు, యస్.వరలక్ష్మి, దేవిక
దర్శకత్వం: కమలాకర్ కామేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పుండరీ కాక్షయ్య 
విడుదల తేది: 26.07.1962



Songs List:



జై జై జై జై (బుర్రకధ) సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల

జై జై జై జై జై - జై జై జై జై జై
వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర పతాకకు జై
ధరణి గావగా దనుజు నడంచిన
వరాహ మూర్తికి జై జై జై
పరి సంధులపై పడగను విప్పిన
ఆఖండ జయ ఖడ్గాహికి జై 

వచనం: 
అయ్యా : ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విద్యా
రణ్య స్వాములవారు నిర్మించిన మహా నగరమిది, దీని
గాధ మహా విచిత్రము వినిన వారెల్లా వీరులు కాగల
రయ్యా! వీరులు కాగలరు.
ఎలాగయ్యా | ఎలా ?

పాట
ఆహ ఇచ్చట పుట్టిన కుందేలే
వేట కుక్కలను తరిమినది
అట్టి మహిమగల గడ్డమీద
మరి విజయమందినది విజయనగరము
తానీ తాని తందనాన తానీ తాని తందనాన

వచనం: 
ఆ నాటినుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని
వెలయించుచూ రాజ్యం చేశారయ్యా: చివరకు తుళువ
నరసరాయలు రాజ్యానికి వచ్చాడు, వారికి నృసింహ
రాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు,
వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగినవాడు
కృష్ణరాయలేనని కనిపెట్టిన వాడై  మహామంత్రి తిమ్మరుసువారు ఏం చేశారయ్యా ఏం చేశారు?

పాట
మహామంత్రి తిమ్మరుసు వారురా - తందానో తాని తందనాన
తన కన్నకుమారుని కన్నమిన్నగా - తందానో అని తందనాన
అన్ని విద్యలను తీర్చి దిద్దుచూ - తందానో కాని తందనాన
కృష్ణరాయలనే ఆదరించిరీ - తందాన తాని తందనాన

వచనం: 
అలా వుండగా నరసరాయలువారు కాలంచేసి వీర
నృసింహరాయలు వారు రాజ్యానికి వస్తూనే జబ్బుపడి
పోయినారు. ఆ అదను కనిపెట్టి కళింగ గజపతి మనపై
దాడులు నడిపాడు. అయితేనేం! మన కృష్ణరాయలు,
వారిని తరిమి తరిమి కొట్టినారు. కాని దానితోనే దేశానికి
కాని రోజులు దాపురించినయ్.
ఏం జరిగింది నాయనా ఏం జరిగింది?

పాట
నృసింహరాయలు ఆస్తమించుచూ
ఏమిదారుణము చేసి పోయెనో
అరి భయంకరుడు ధర్మ రక్షకుడు
కృష్ణరాయలే మాయ మాయెనే

వచనం: 
ఈ ఆరాచక స్థితిలో, గజపతులే కాక, మ్లేచ్ఛులుకూడా।
మన మాన, ధన, ప్రాణాలను దోచుకొన పొంచిఉన్నారు.
ఇక మన మాతృదేశమును మనమే రక్షించు కోవాలి
ఏ విధంగానయ్యా ! ఏ విధంగా ?

పాట 
దేశ దేశముల వీరజాతులకు
ఆంధ్ర పౌరుషమె ఆదర్శముగా
ప్రతి పౌరుడును కృష్ణరాయలై
వీర తోరణమును ధరింపరే॥



జయ వాణీ చరణ కమల పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

జయ వాణీ చరణ కమల
సన్నిధి మన సాధనా
రసిక సభా రంజనగా
రాజిలు మన వాదనా

భావ రాగ గానమునా
సుధా ఝరులు పొంగగా
నవరసాభి నటనమునా
జగము పరవశిల్లగా

ఝణ ఝణ ఝణ
ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ
ఘన నాట్యము సాగే లయ
క్రియ వీణియ పలికేనా

సరస మధుర స్వరవాహిని
రస బిందుల చిందుల వలె
జల జల జల అడుగులలో
కులుకు లెల్ల ఒలికేనా



పద్యం నెం. 1

పాడినది: ఘంటసాల

శ్రీ విద్యాపుర వజ్ర పీఠమున వాసిం గాంచి
వర్థిల్లుమా, నీ వీరత్వము సాళ్వ తిమ్మరుసు
మంత్రిత్వం బమోఘంబుగా, రాయా
ఆంధ్ర భోజుండవై. మా విద్యత్కవిరాజ గోష్టులను
సన్మానంబులన్ గాంచుమా



లీల కృష్ణా నీ లీలలు పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: యస్.వరలక్ష్మి

పల్లవి:
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం: 1
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు...
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం: 2
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేదని....
ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు...

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...





మోహన రాగమహా పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె...
నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..

చరణం: 1
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ...
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
మోహన రాగమహా... మూర్తిమంతమాయె

చరణం: 2
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా...
మోహన రాగమహా... మూర్తిమంతమాయె



తదాస్తు స్వాముల కొలవండీ పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: యస్.వరలక్ష్మి, పి.సుశీల

తదాస్తు స్వాముల కొలవండీ
అస్తీ నాస్తుల తెలియండీ
కనులు తెరిస్తే నేను ఆస్తి
కన్నులు మూస్తే నీవు నాస్తి

ఉన్నది లేదని వాదాలు
లేనిది ఉందని భేదాలు
వాదం భేదం భేదమె కాగా
వేదమె లేదని చెడకండి

గ్రాసం కోసమె వేషాలు
వేషంతోనే మోసాలు
వేషం మోసం దోసమె కాగా
శాస్త్రం తెలుసుకు బ్రతకండి

హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం

ఓంకారంలో ఒంకరలు
ఒంకర బుద్ధికి శంకలు
శంకలతోనే జంకులు
జంకులతోనే బొంకులు



పద్యం నెం. 2

పాడినది : మాధవపెద్ది సత్యం

శ్రీకర కాకా, కికీ కుకూ
కెకే కైకొ కోలు కౌ కం కఃలు
నీ కీర్తిని వర్ణింపగ నాకక్కర
వచ్చెనోయి నయముగ తిప్పా 



తిరుమల తిరుపతి వెంకటేశ్వర పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: యస్.వరలక్ష్మి, పి.సుశీల

పల్లవి:
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ

చరణం: 1
నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా
నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా...
మంజుల వలపుల... మలయానిలముల...
మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా...

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ

చరణం: 2
ఆశారాగమే ఆలాపనగా... 
ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస
గరిగపమగరిస...
మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ
మపద మ గ రి పమరి నినిప ససని నినిస
మగరిగ నిసరి నదమపనిస
నిసరి నిదమపదప
దపదమగరిగనిస...

ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
అభినయ నటనలే ఆరాధనగా...
అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా....

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ..
ఆ...ఆ..ఆ...ఆ...ఆ...
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ





జయ అనరే జయ అనరే పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: పి. లీల

జయ అనరె జయ జయ అనరె
తెలుగు వెలుగులను దిశలనునించే
బాలా కుమార రాయలకు

కన్నడ రాజ్యము ఏలే నన్నా
కళింగ దేశము నాదే నన్నా
వాదుకు వచ్చే తాత ఎవ్వరని
ముద్దులు గురినే బాలునకు

రణ తంత్రమున రాజ్య తంత్రమున
జనకునకే గురుదేవులు కాగా
అసలు తాత మా అప్పాజీ యని
చేతులు జాచే తనయునకు 





ఆంధ్ర దేవా పాట సాహిత్యం

 
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి
గానం: పి. లీల

ఆంధ్ర దేవా వెంకటేశ్వరా విరూపాక్ష స్వామీ
చరిత్ర ఎరుగని మహాపాతకము
మా దేశానికి పట్టినదా

ఉపకారమే ఒక నేరమా
అపకారమే ప్రతి ఫలమా
ఇదే నీ న్యాయ విధానమా
మౌనమె నీ సమాధానమా

నాల్గు పాదముల ధర్మము నడిచే
రోజులు నేటితొ తీరినవా
న్యాయమరయగా జాలక
రాజే అన్యాయానికి పాల్పడైనా

అందరి కన్నూ అప్పాజీ ఆ
మహాత్ము కన్నులె పొడిపించె
ఆంధ్ర జ్యోతియె అరిపోవగా
ఈ విధి రాయలె జేసెనా

Palli Balakrishna Saturday, August 26, 2017



చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్, సావిత్రి, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 07.06.1962



Songs List:



లేచింది నిద్ర లేచింది పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం 
దద్దరిల్లింది పురుష ప్రపంచం 
లేచింది మహిళాలోకం 

చరణం: 1 
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు 
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు 
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా.... 
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా 
విస్సన్న చెప్పిన వేదం కుడా 
లేచింది మహిళాలోకం 

చరణం: 2 
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు 
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు 
అది ఇది ఏమని అన్ని రంగముల... 
అది ఇది ఏమని అన్ని రంగముల 
మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు 
లేచింది మహిళాలోకం 

చరణం: 3 
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి 
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి 
ఢిల్లీ సభలో పీఠం వేసి..ఆ..ఆ..ఆ. 
ఢిల్లీ సభలో పీఠం వేసి 
లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు 

లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం 





సన్నగ వీచే చల్లగాలికి పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే 
తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే 
సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే 
తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే 
అవి తలచిన ఏమో సిగ్గాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే 

చరణం: 1 
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే 
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే 
కలవరపడి నే కనులు తెరవగా కంటిపాపలో నీవాయే 
ఎచట చూచినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే 

చరణం: 2 
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
 మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయవెదకిన హృదయఫలకమున నీవాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవేనాయే 



అలిగిన వేళనే చూడాలి పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

పల్లవి: 
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 
రుసరుసలాడే చూపులలోనే రుసరుసలాడే చూపులలోనే 
ముసిముసి నవ్వుల చందాలు అలిగిన వేళనే చూడాలి 

చరణం: 1 
అల్లన మెల్లన నల్లపిల్లి వలే వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన 
అల్లన మెల్లన నల్లపిల్లి వలే వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన 
తల్లి మేలుకొని దొంగను చూసి... 
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 

చరణం: 2 
మోహనమురళీ గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా 
మోహనమురళీ గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా 
దృష్టి తగులునని జడిసి యశోద... 
దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే 
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 




ఎంత హాయి పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఆ ఆ ఆ 
ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా 
ఆ చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఆ ఆ ఆ 
ఎంత హాయి 

చరణం: 1 
ఆ ఆ ఆ 
ఒకరి చూపులొకరిపైన విరిటూపులు విసరగా 
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా 
విరితావుల పరవడిలొ విరహమతిసయింపగా 
ఆ విరితావుల ఘుమఘుమలొ మేను పరవశింపగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఎంత హాయి 

చరణం: 2 
కానరాని కొయిలలు మనల మెలుకొలుపగా 
కానరాని కొయిలలు మనకు జోలపాడగా 
మధురభావలాహిరిలొ మనము తూలిపోవగా 
మధురభావలాహరిలొ మనము తేలిపోవగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా 
ఎంత హాయి 




ప్రేమయాత్రలకు బృందావనము పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 
ఆహాహా ఆహాహా హా 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో 
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో 
ఆహాహా ఆహాహా హా 
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో 
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో 

చరణం: 1 
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా 
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా 
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా 
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా 
ఆహాహా ఆహాహా హా 
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా 
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో 

చరణం: 2 
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా 
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా 
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా 
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా 
ఆహాహా ఆహాహాహా 
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా 
తీర్ధయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో 
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా 

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 




వేషము మార్చెనూ హొయి పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.లీలా

వేషము మార్చెనూ హొయి 
భాషను మార్చెనూ హొయి 
మోసము నేర్చెనూ అసలు తానే మారెనూ 
అయినా మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు 
మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు 

చరణం: 1 
కౄరమృగమ్ముల కోరలు తీసెను 
ఘోరారణ్యములాక్రమించెను 
కౄరమృగమ్ముల కోరలు తీసెను 
ఘోరారణ్యములాక్రమించెను 
హిమాలయముపై జెండా పాతెను 
హిమాలయముపై జెండా పాతెను 
ఆకాశంలొ షికారు చేసెను 
అయినా మనిషి మారలేదూ 
ఆతని కాంక్ష తీరలేదు 

చరణం: 2 
పిడికిలి మించని హృదయములో 
కడలిని మించిన ఆశలు దాచెను 
పిడికిలి మించని హృదయములో 
కడలిని మించిన ఆశలు దాచెను 
వేదికలెక్కెను వాదము చేసెను 
వేదికలెక్కెను వాదము చేసెను 
త్యాగమె మేలని బోధలు చేసెను 
ఐనా మనిషి మారలేదూ 
ఆతని బాధ తీరలేదు 
వేషము మార్చెను 
భాషను మార్చెను 
మోసము నేర్చెను 
తలలే మార్చెను 
ఐనా మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు




కోలో కోలోయన్న కోలో నా సామి పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 
మేలో మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు 
మేలో మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు 
ఈ ముద్దుగుమ్మలకి చూడాలి జోడు 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 

చరణం: 1 
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల 
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల 
బేలో బేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా 
బేలో బేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా 
 ఈ బేల పలికితే ముత్యాలు రాల 

కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 

చరణం: 2 
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచిదే పాపం 
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచిదే పాపం 
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం 
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం 
జంటుంటే ఎండురానీదు ఏ లోపం 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 





మౌనముగా నీ మనసు పాట సాహిత్యం

 
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే 
నీ మనసు నాదనుకొంటిలే 

చరణం: 1 
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే.. ఆ.... 
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే 
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 

చరణం: 2 
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ.... 
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే 
రుస రుస లాడుతు విసిరిన వాల్ జడ వలపు పాశమని బెదిరితిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే 
నీ మనసు నాదనుకొంటిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 


Palli Balakrishna Friday, August 4, 2017

Most Recent

Default