Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manmadhudu 2 (2019)చిత్రం: మన్మధుడు 2 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, దీప్తి పార్థ సారథి, చిన్మయి
నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున, పి. కిరణ్
విడుదల తేది: 09.08.2019

మా చక్కని పెళ్ళంటా ముచ్చటైన జంట
కన్నులకే వైభోగమే కమనీయమాయెనే
కళ్యాణం, కళ్యాణం
వస్తే ఆపే వీలుందా కళ్యాణం ఎపుడో 
అన్నారండి లోకం మొత్తం బొమ్మే అయిన నాటకం ఇది

ముందే రసేసుంటాడ స్వర్గంలో నిజమే నమ్మాలండి అర్ధం పర్థం లేనేలేని జీవితం ఇది
ఊరు పేరు చూసి అన్నీ ఆరా తీసి
కన్యాదానం చేసి దారే చూడాలా 
హడావిడేలా

సరి జోడు కడుతున్నారు సరదా మొదలే
పెళ్ళి లగ్గం కుదిరే వేళలో 
వేచి చూడాలంట పరదా జరిపే తుళ్ళిపడుతున్నారు గోలలో

ఏ ఖర్చుకు వెనకాడోద్దు ఏ ముచ్చట కరువవ్వద్దు
అని ప్రతి చిన్న పనిలోన డాబులకే పోయే గొలంత చూడాలా
ఊ అంటే బందువుకొచ్చే తీరని అనుమానం
వెటకారం మమకారం తెలుగింటి పెళ్ళిలో హుషారు పొంగే

సరదా - హేయ్,  మొదలే - హేయ్
పెళ్ళి లగ్గం కుదిరే వేళలో 
వేచి చూడాలంట 
పరదా - హేయ్ జరిపే - హేయ్ తుళ్ళిపడుతున్నారు గోలలో

కల పందిరి వేయించాలా శుభలేఖలు పంచివ్వాలా
కునుకంటూ పడకుండా అన్నిటికీ జోరే పెంచాల ఈ వేళ
చామంతి బగ్గలదాన సిగ్గులు దాచాలా
మొహమాటం పడకుండా తెగ ఎడిపించడం తెగ పనేగా ఈ వేళ
Palli Balakrishna Sunday, July 21, 2019
Gangleader (2019)


చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నాని, కార్తికేయ రెడ్డి, ప్రియాంక అరుల్ మోహన్
దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి. వి. మోహన్
విడుదలతేది: 2019

కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోకముందు 
అపుడే ఇదేమి తలపో

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే

అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతుందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో

అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే

మెదడుకు పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే

తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు
అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా

ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా

వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో..చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఇన్నో జంగా, అనిరుద్ రవిచంద్రన్

వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా

పలికే పాల గువ్వతో
కులికే  పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover
I think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో
ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి  రెండో భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమా

గుండెలోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా
కలిసే కానుకవ్వనా
పెదవుల్లోయినా నింపైనా
చిరుదరహాసం

ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా…

వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా

Palli Balakrishna
Ranarangam (2019)చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
నటీనటులు: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిన్
దర్శకత్వం: సుదీర్ వర్మ
నిర్మాత: సూర్య దేవర నాగ వంశీ
విడుదల తేది: 02.08.2019
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: ప్రీతి పిళ్ళై

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

అడుగై నడిచేదెవ్వరో
ఓ వెలుగై నవ్వింది ఎవ్వరో
కాలం మనదే అలా
కారణమే ఉందలా
ఏకాంతమో నిశ్చాబ్ధమో
ఈ వేళలో ఎవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పదములుగా అడుగే వేసిందెవరో
పరుగులుగా ఆ గధి లేఖల ఎవరో
నును వెచ్చని వెన్నెలలో
చనువిచ్చిన చెలిమమెవరో
తొలి వేకువ జాములను
నీకై మరి మెరిసిందెవరో
వెలుగెవరో వేధంలా రా నిలిచేదెవరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో Palli Balakrishna Saturday, July 13, 2019
Saaho (2019)చిత్రం: సాహో (2019)
సంగీతం: శంకర్-ఇషాన్-లోయ్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీబ్రాన్
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్
దర్శకత్వం: సుజీత్
నిర్మాతలు: వి.వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల తేది: 30.08.2019చిత్రం: సాహో (2019)
సంగీతం: శంకర్-ఇషాన్-లోయ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శంకర్ మహదేవన్, శ్వేతా మోహన్, సిద్దార్థ్ మహదేవన్


కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే
నిలిచుందా నాకోసమే

కరిగిందా ఆ దూరమే
వదిలెళ్ళా నా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

నీకంటూ సరిపోనని
అనుకున్నా రావద్దనీ
అటుపైనే తెలిసిందిలే
నేనుందే నీలో అనీ

విడదీసే సందేహమే
వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే
కోపాలే కాలాయిలే

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

ఇంతింత దూరాలే చేరి
పంతాలు వీడాలి మనసే
నిజమేమిటో
తెలియదా అదే క్షణం

నిద్దరలో లేకున్నా కల
నేడొచ్చి నీ కళ్ళు చేరేలా
చూపించనా
ఆనాటి గురుతులే

నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేనూ కన్నాలే
నీ చేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చి
నీ కళ్ళముందుంది చూడవా

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)చిత్రం: సాహో (2019)
సంగీతం: గురు రందవ (బ్యాక్గ్రౌండ్ స్కోర్: జీబ్రాన్)
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హరిచరణ్, తులసి కుమార్

ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే నాకేమైన బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలో దాచేశా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

ఇన్నాళ్ల నా మౌనం వీడాలి నీకోసం 
కలిసొచ్చేనీ కాలం దొరికింది  నీ స్నేహం
నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం
రాదింకా ఏ దూరం నాకుంటే నీ సాయం

నన్నిలా నీలోనే దాచేసా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలేPalli Balakrishna
Raj Dooth (2019)చిత్రం: రాజ్ దూత్ (2019)
సంగీతం: వరుణ్ సునీల్
సాహిత్యం:
గానం:
నటీనటులు: మేఘాంశ్, నక్షత్ర
దర్శకులు: అర్జున్, కార్తిక్
నిర్మాత: సత్తిబాబు
విడుదల తేది: 12.07.2019


Palli Balakrishna
Voter (2019)చిత్రం: ఓటర్ (2019)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: విష్ణు మంచు, సురభి
దర్శకత్వం: జి. ఎస్. కార్తిక్
నిర్మాత: జాన్ సుధీర్ పూదోట
విడుదల తేది: 21.06.2019


Palli Balakrishna
Vinta Dongalu (1989)చిత్రం: వింత దొంగలు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి.బాలు, ఎస్.జానకి, లలితా సాగరి
నటీనటులు: రాజశేఖర్, నదియా
మాటలు: తనికెళ్ళ భరణి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్. అంబరీష్
విడుదల తేది: 01.01.1989


Palli Balakrishna
Bhakta Prahlada (1967)

చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్ )
గానం: పి.సుశీల
నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, బేబి రోజారమని
దర్శకత్వం: చిత్రపు నారాయణ రావు
నిర్మాణం: ఏ.వి.ఎమ్. ప్రొడక్షన్స్
విడుదల తేది: 12.01.1967

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
నా భారము నీవే కదా!

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!

నిన్నేగానీ పరుల నెఱుంగా రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!

హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా.. కమలలోచనా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా!

లక్ష్మీ వల్లభా ....  లక్ష్మీ వల్లభా!


Palli Balakrishna Monday, July 1, 2019
Ninu Veedani Needanu Nene (2019)


Palli Balakrishna
Vajra Kavachadhara Govinda (2019)చిత్రం: వజ్రకవచదర గోవింద (2019)
సంగీతం: విజయ్ బుల్గానిన్
నటీనటులు: సప్తగిరి, వైభవీ జోషి , అర్చన శాస్త్రి
దర్శకత్వం: అరుణ్ పవర్, రోయల్ విష్ణు
నిర్మాతలు: ఈదల నరేంద్ర , GVN రెడ్డి
విడుదల తేది: 14.06.2019
చిత్రం: వజ్రకవచదర గోవింద (2019)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ బుల్గానిన్

కీచురాయి కీచురాయి 
కంచుగొంతు కీచురాయి 
నింగిదాక ఖంగుమందె నీ సన్నాయి

లంగా వోణి రాలుగాయి 
చాలు చాలు నీ బడాయి 
మచ్చుకైన కానరాదె నీలో అమ్మాయి

మరీ అలా మగాడిలా పోటెత్తమాకే
గందరగోళాలకీ 
పూరేకులా నాజుకులు నేర్పించుకోవే
అందచందాలకీ 

హేయ్ నా మాట వినీ 
హేయ్ నీ పద్దతినీ 
హేయ్ జర మార్చుకుని 
ప్రేమలో పడవే 

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

అచ్చతెలుగు అందం నీలో ఎంతో దాగుందే 
గుర్తుపట్టు దాన్ని ఓ కొంచెం 
రౌడీ పిల్లలాగా తిరుగుతుంటే బాలేదే 
మారిపోవే పిల్లా నా కోసం

తవలా పాకంటీ లేత చేతుల్తో 
తగువులాటేలా ఒంపుల వయ్యారీ
కలలే తారాడే కాటుక కన్నుల్లో 
కోప తాపాలు వద్దే సుకుమారీ

ఛూ మంత్రాలే వేసి 
నిను మార్చుకుంటాలే

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

కీచురాయి కీచురాయి 
కోయిలల్లె మారవోయి 
ప్రేమ పాట పాడవోయి నా జోడీగా

చేరుకోవె దాయి దాయి 
కలుపుకోవే చేయి చేయి 
మనసు మనసు మార్చుకుందాం
రా సరదాగా

తొలిచూపుకే నిన్నెందుకో మెచ్చింది కన్ను
సొగసరి గోదావరి 
మలి చూపులో ప్రాణాలనే ఇచ్చేసినాను 
ఊపిరి నీదే మరి

హే యువరాణివనీ 
హే పరువాలగనీ
నా కలలో నిజమై 
కదలి రమ్మన్నా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా


Palli Balakrishna
I Love You (2019)


Palli Balakrishna
Hippi (2019)


Palli Balakrishna
Thanks (2006)చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం:
గానం:
నటీనటులు: శ్రీనాథ్, వినీత్, రేష్మి
మాటలు: మధురూరి రాజా
దర్శకత్వం: మన్ రాజ్
నిర్మాత: ముల్లేటి నాగేశ్వరరావు
విడుదల తేది: 2006

త్వరలో

Palli Balakrishna
Dorasani (2019)
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: చిన్మయి శ్రీపాద
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్
దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని
విడుదల తేది: 12.07.2019

కళ్లలో కలవరమై కలవరమై
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమో వరమే అవగా
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమై  కలిగే కోరిక

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా
ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల వడిలో ఆడుతూ ప్రాణమే
ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో
ఉడికిస్తూ చంపుతుంటే
ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే

ఏమో ఏమో ఏమో అసలే మెల్లగా
ఎదపై తీపి మధువే చెల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా
మైమరపించు మాయే చెయ్యగా
అణువణువు అలజడి రేగి
తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసేPalli Balakrishna
Kalki (2019)చిత్రం: కల్కి (2019)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: లలిత కావ్య
నటీనటులు: రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేతా
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: సి.కళ్యాణ్, శివాని, శివాత్మిక
విడుదల తేది: 28.06.2019

నీలోడు బండి ఆపేయ్ రా
వేడి మీద ఇంజినుంది దించేయ్ రా
ఈ రోడ్ నా అడ్డా రా
సల్ల తాగి సల్లగై పోవేరా
తెచ్చారా తాటి కల్లు
ఎక్కిస్తా కిక్కు ఫుల్
ఓ పట్టు పట్టవేమి రా
వళ్లే నే వంచుతుంటే కళ్ళే నువు తిప్పవేరా
కిర్రెక్కి ఊగిపోకూర

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఆ నాటు కోడి తేవాలా
నా నోటి ఘాటు కావాలా
ఈ బోటి కూర వండాల
నాతోటి గుండె నిండాల

నీకళ్ల ముందు ఎర్ర కోక సోకులుండగా
ఆ నల్లమందు దండగా
నా బుగ్గ రైక మీద పైట జరుగుతుండగా
ఏ మత్తు ఎక్కుతుందిరా

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఈ పక్కకొస్తే ఓ లెక్క
ఆ పక్కకొస్తే నా లెక్క
తాగి పన్నావంటే ఒక రేటు
హోస్  లున్నవంటే సెపరేట్

ఈ సీకు ముక్కలాగ సోకు సొత్తులున్నాయ్
నువ్వు జుర్రుకోరా
లేత బుగ్గలన్నీ జోలీ పౌడరద్ది
నీకు దాచినారా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (8)


Palli Balakrishna
Oh Baby (2019)చిత్రం: ఓ బేబీ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మోహన బోగరాజు
నటీనటులు: సమంత అక్కినేని, నాగ శౌర్య, లక్ష్మీ, తేజ
దర్శకత్వం: బి.వి.నందిని
నిర్మాతలు: సురేష్ బాబు, తాతి సునీత, టి.జి.విశ్వప్రసాద్, హ్యూనో థామస్ కిమ్
విడుదల తేది: 05.07.2019

నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా
నాలో నాకే ఏదో తడబాటే! హా...

పాతపూల గాలే పాడుతుంటే లాలే
కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే

చందమామ జారి చెలిమిలాగ మారి
గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే...

నన్ను గారం చేసే బాటసారై ఎవరివోయి?
నేను మారాం చేస్తే నవ్వుతావు ఎందుకోయి?
నా స్వరం నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం
ఇలా ఈ క్షణం శిలై మారితే, లిఖించాలి ఈ జ్ఞాపకం!

నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోందే
నెమలిఫించమల్లే నన్ను తాకుతోందే

తేలికైన భారం, దగ్గరైన దూరం
సాగినంత కాలం సాగనీ ప్రయాణం...

దాచిపెట్టే నవ్వే కళ్ళలోనే తొంగి చూసే...
సిగ్గు మొగ్గైపోయే గుండెలోనే పూలు పూసే...
Palli Balakrishna
BurraKatha (2019)చిత్రం: బుర్రకథ (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర
నటీనటులు: ఆది, మిస్తీ చక్రవర్తి, నైరా షా
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ దీపాల
విడుదల తేది: 05.07.2019

హే అందానికే నువ్వు అందానివే
ఆ బ్రహ్మ చదవని గ్రంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగెలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే

ముద్దు బేబీ, లవ్లీ జిలేబి

నీ పేరు వింటే పరధ్యానమే
సిరివెన్నెల రాదా మధ్యాహ్నమే
హే పిచ్చి పిచ్చిగా ఇట్టా నచ్చేస్తూ ఉంటే
ఈడు గోడమీద కోడిలాగ కూసెయ్ దా పిల్లా
నడిచే ఓ చందమామ కులికే ఓ సత్యభామ
ఇంకా నీకర్ధం కాదా నా ప్రేమ
ఉన్నావే నువ్వు తబలా జాజల్లే
నే బీటే వేస్తా జాకీర్ హుస్సేనల్లే

హే అందానికే నువు అందానివే
ఆ బ్రహ్మ చదవని గంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగేలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే


Palli Balakrishna
Brochevarevarura (2019)
చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: హసిత్ గోలి
గానం: వివేక్ సాగర్, బాలాజీ దాకే, రామ్ మిరియాల, మనీషా ఈరబత్తిని
నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, నివేత పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత:
విడుదల తేది: 2019

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
పొద్దెక్కి నాదిక పలుకులాపమని
అంటావేంటే వయ్యారి
సురుక్కు మంటూ కుర్రమూకతో ఏంటో ఈ రంగేళి

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ

హే  హల హల
హే  హల హల

ససస సరికొత్తైన తమాషా
చవి చూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా కవి శారదా

ఆ అంతో ఇంతో గురుందా
అంతేలేని కల ఉందా
సింగారించేయ్ సమంగా ఓ నారద హల

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి

మీరంతా గుంపు కట్టి
వెంటనే సూటిగొచ్చి పోయిన
రానురా నేను రానురా
హే పాత లెక్కలన్ని ఇప్పి చూపే పనిలే
నాకంత ఓపీకింక లేదురా

హే పలికినాదిలే చిలక జోశ్యమే
పనికిరామని మేమే
తెలిసి పిలిసే చిలకవు నువ్వే
కాస్త అలుసిక ఇవ్వే
అరె అప్పనంగా మోగే జాతరే
నువు ఒప్పుకుంటే వెలుగే ఊరే
అది సరికాదంటే వెనక్కి రాదే
మత్తెక్కి జారిన నోరే

వగలాడి  వగలాడి (8)

కలుపు తోటలా తోటమాలినే
కులుకులాపిటు చూడే
ఈ కవితలన్ని కలిపి పాడితే
కనుక పటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి కచ్చితంగా అది నీకేలే
నువు జతకానంటే మరొక్కమారే
వెనక్కి రాధిక పోవే

వగలాడి  వగలాడి
వగలా... డి

వేటకెళ్లి సేతుపతిను
తప్పిపోతే అధోగతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి (2)

వగలాడి  వగలాడి
వగలా... డిచిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వందన శ్రీనివాసన్

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
హో తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నా
ఎందుకో ఏమో తెలియని మౌనం
తేల్చుకోలేనే సమాధానం

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా

రోజంతా అదే ధ్యానం తన పేరే అనేలా
చూస్తూనే మరోలాగా మారాలెలా
భూగోళం చేరేలా ఆకాశం దిగాలా
సందేహం సదా నాకు లోలోపలా
ముడిపడినా సరిపడునా
ఇరువురి సహవాసం జతపడునా
జగము ఇదేంటీ అనదు కదా
అయోమయం లో ఉన్నా అదో మాయగా 

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
హా తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నాPalli Balakrishna

Most Recent

Default