పాట: విడిపోతే (2024) సంగీతం: సయ్యద్ షహ్నావాజ్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గాయకుడు: రోహిత్ శామ్యూల్ గంట నటినటులు: దీప్తి సునైనా, విజయ్ విక్రాంత్ డైరక్టర్: విజయ్ షణ్ముఖ్ నిర్మాత: ప్రసాద్ కుమార్ చించేటి మ్యూజిక్ లేబుల్: దీప్తి సునైనా విడుదల తేదీ: 18.10.2024
విడిపోతే పాట సాహిత్యం
పాట: విడిపోతే (2024) సంగీతం: సయ్యద్ షహ్నావాజ్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గాయకుడు: రోహిత్ శామ్యూల్ గంట కలలే కనులొదిలి కదిలెనులే పిలవద్దు అని నిజమే అని చెబితే మనసే నమ్మదే… మనసే మనసొదిలి ఎగిరెనులే వెతకొద్దు అని… ఋజువే ఎదురైనా… కనులు నమ్మవే హృదయం అద్దంలా పగిలి నడిచే అడగులకే తగిలే ఐనా నొప్పిని అనిచేసి నవ్వేస్తూ నడిచెనే ఎపుడు తోడుగా వెనకొచ్చే నీడే రానని విడిపోతే దిగులే తొడని అనుకుంటు మౌనంగా మిగిలెనే… ఎవరు చూడగలరు రెప్పచివరన కురిసిన కంటతడి ఎవరు పోల్చగలరు గొంతు పగలగ అరిచిన గుండె సడి కాలమే తన చేయిని విధిలించగా ఇలా హృదయం అద్దంలా పగిలి నడిచే అడగులకే తగిలే ఐనా నొప్పిని అనిచేసి నవ్వేస్తూ నడిచెనే గతమే నెమ్మదిగా చెరిగి బ్రతుకే ఒంటరి అయిపోతే జతగా రమ్మని శూన్యాన్ని సాయాన్నే అడిగేనే

No comments
Post a Comment