చిత్రం: Mr. ఇడియట్ (2026) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: మాధవ్ భూపతి రాజు, సిమ్రాన్ శర్మ దర్శకత్వం: గౌరి రోణంకి నిర్మాత: రవి చాంద్ విడుదల తేది: 15.05.2026
Songs List:
కావాలయ్యా పాట సాహిత్యం
చిత్రం: Mr. ఇడియట్ (2024) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: మంగ్లీ కళ్ళల్లోకి కళ్ళేపెట్టి… అదోలా చూసావయ్యా మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా తస్సాదియ్యా… ఓయ్ ఓయ్ తస్సాదియ్యా ఓయ్, పచ్చి పచ్చిగా చెప్పాలంటే పిచ్చిగా ఫిదా అయ్యా పువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా చూస్కోవయ్యా… తీస్కోవయ్యా హా, నేనే లవ్ లో పడ్డం అంటే ఆషామాషి కాదయ్యా ఏ జన్మలో ఏ పుణ్యమో నువ్వే చేసుంటావయ్యా నిజంగా… అరెరెరే నిజంగా చేతిలో చెయ్యేవేసి చెప్పేస్తున్నాగా, ఆ ఆ ఆ కావాలయ్యా, ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా ఓ, షాపింగులు తిప్పొద్దు వెయిటింగులు చెయ్యొద్దు నా కోసం నీ పనులేమి మానొద్దు హే, జాబులే చెయ్యొద్దు అంత కష్ట పడొద్దు నువ్వు తప్ప వేరేదేది నాకొద్దూ అన్నీ నేనే ఇస్తా నిన్ను బాగా చూస్తా అమ్మయుంటుందా ఇలా ఇలా నాలాగా కావాలయ్యా, ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా కళ్ళల్లోకి కళ్ళేపెట్టి… అదోలా చూసావయ్యా మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా తస్సాదియ్యా ఐ వనా బీ విత్ యూ ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్! ప్లీజ్ ప్లీజ్… యాక్సప్ట్ మై లవ్ కారణాలు చూపొద్దు… కాదని చెప్పొద్దు నీకు నచ్చకున్నా మరేం పర్లేదు ఆ, ఇంతలాగా ఏనాడు ఎవ్వడెంట పల్లేదు ఒప్పుకోకపోతే అస్సలు బాగోదు… కొంచెం కోపం నీకు, ఏయ్ అదే అందం నీకు, ఓకే ఇలా అందర్లో చెప్పెయ్యనా ఐ లవ్ యూ…? రియల్లీ… వావ్ నచ్చవయ్యా, వా వా వా నచ్ఛావయ్యా కావాలయ్యా, (అయ్యా అయ్యా) నువ్వే కావాలయ్యా, కావలయ్యా ఓ ఓ ఓ… కావాలయ్యా
కాంతార కాంతార పాట సాహిత్యం
చిత్రం: Mr. ఇడియట్ (2024) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్మ్ గానం: రాహుల్ సిప్లిగంజ్ ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే? మా లెక్కనే నీకు రెండు కాళ్ళు చేతులు ముక్కుమూతి ఉన్నయి గాదే..! అరె ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే? మా లెక్కనే నీకు రెండు కాళ్ళు చేతులు ముక్కుమూతి ఉన్నయి గాదే..! బలుపు నీకు ట్విన్ బ్రదరా ఇగో నెత్తి మీద పెదరా మనుషులంటే నీకు పడరా నువ్వేమన్న అవతారా..? ఏమి చూసుకుని నీకు ఇంత టెక్కు? దిష్టి బొమ్మకైన పనికిరాదు నీ పిక్కు..! కాంతార కాంతార కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా కాంతార కాంతార కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా నీ కళ్లలోనా కాక్టస్ పొద మా చిట్టి హార్టులో గుచ్చుకుపోదా? హా వెయ్ ఆహా… వెయ్ ఏసుకో మాకేమన్న కరోనా ఉందా? పక్కకొస్తే నీకంటుకుంటుందా? నీ హెడ్డుకంతా వేయిట్ ఏందే జర నవ్వితే నీ ముల్లేంపోదే నీకింద నౌకరోల్లం కాదే మాకేమి నువ్వు జీతమిస్తలేదే సింగల్ హ్యాండుతోటి క్లాప్స్ కొట్టలేవే సింగిల్ గుండి ఏం పీకలే వే వే వే వే ఇగ నేలమీద నువ్వు నడవరాదే జర కు కూ… కుకుడు కూ కాంతార కాంతార కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా కాంతార కాంతార కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా నాంపల్లి, గోలుకొండ కొత్తపల్లి, అంబర్ పేట ఎయ్ ఆహా ఎయ్ ఏసుకో నీ అయ్య సొమ్ము ఇయ్యమంటలేదే కలిసి మెలిసి నువ్వు కూలు గుండరాదే ఉన్న బ్రైను ఏమి చిన్నగయ్యిపోదే తెలివి పంచుకుంటే పెరుగుతుంటాదే ఒక్కసారి మార్చి చూడు నువ్వు ఎల్లే రూటే మస్తుగుంటాదే మనసు ఒద్దు నీకు డౌటే పొగరు ఫిగరు కులుకు లులుకులిక చెల్లవే…! నీకు నువ్వు ఓ తోపు తురుము అనుకోకే నన న నన న న కాంత కాంత కాంత కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా కాంత కాంత కాంత కాంతార నిన్నసలెవరైన దేక్తర కాంతార కాంతార కాంతార సుక్కల నుండి నిన్ను దించుతారా
# పాట సాహిత్యం
చిత్రం: Mr. ఇడియట్ (2024) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: శివశక్తి దత్తా గానం: శ్రీరామచంద్ర వస్సాహి

No comments
Post a Comment