-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: ముసురు ముసురుబట్టి మురిపంగా (2024)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: కొమ్ము నరసింహ 
గానం: రోహిణి 
నటీనటులు: నాగ దుర్గ 
దర్శకత్వం: నాగ దుర్గ 
నిర్మాతలు: నవీన్ కొండ , నితీష్ 
మ్యూజిక్ లేబుల్: కొండ్ర మ్యూజిక్
విడుదల తేది: 08.08.2024



వాన పాట సాహిత్యం

 
చిత్రం: ముసురు ముసురుబట్టి మురిపంగా (2024)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: కొమ్ము నరసింహ 
గానం: రోహిణి 

ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన

పరుపు బండలమీద పారాణివైనావు
సేను సెలక మీద పరుపై సేరావూ
వాగు వంకలల్లే వడి వడిగా పారావు
చెరువమ్మా కడుపాన సల్లంగా వదిగావూ
అలుగులువారుతూ కనువిందు చేసేవూ..
అలుగులువారుతూ కనువిందు చేసేవు
పాల నురగలు చిలికి పైపైకి తేలేవూ..

ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన

నెర్రవారిన నల్లరేగళ్లు ముద్దాడి నాగళ్లకు కొత్త నడకను నేర్పావూ
తొలకరిజల్లువై చిటపటరాలావు రైతుల కంఠాన ఊపిరి పోసేవూ
ఆ నీలినింగిలోన నిగ నిగ మెరిసేవూ..
ఆ నీలినింగిలోన నిగ నిగ మెరిసేవు
నల్లమబ్బులుకమ్మి నేలపై కురిసేవూ..

ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన

అడవితల్లికి పట్టువస్త్రాలే కట్టినవు
జీవాల అందాల నిలయమై వెలిసినవూ
మూగజీవులనేమో మురిసేలా జేసినవు
నేలమ్మా నుదుటన సింధూరమైనావూ
కోటిజీవరాసులకల్లా జీవాన్ని పోసినావూ..
కోటిజీవరాసులకల్లా జీవాన్ని పోసినావు
అన్నిగత్తులు తడిపి గంగమ్మవైనావూ..

ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన

ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన

No comments

Most Recent

Default