చిత్రం: శ్రీ చిదంబరం గారు (2026) సంగీతం: చంద్ర శేఖర్, రవి చెరుకూరి నటీనటులు: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట దర్శకత్వం: వినయ్ రత్నం నిర్మాతలు: చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి విడుదల తేది: 06.02.2026
Songs List:
వెళ్లే దారిలోన పాట సాహిత్యం
చిత్రం: శ్రీ చిదంబరం గారు (2026) సంగీతం: చంద్ర శేఖర్, రవి చెరుకూరి సాహిత్యం: చంద్ర శేఖర్ గానం: యం. యం. కీరవాణి వెళ్లే దారిలోన ముళ్లే రావు అంటే ఎలా మరీ ఎలా మరీ నిన్నే దాటుకుంటు నువ్వే సాగిపోతు పదా మరీ అదే దరీ జవాబు లేని ప్రశ్నే ఉంటుందా మనస్సుతోటి అడిగే మనసుంటే ఇవాళ నువ్వు నీకై నిలబడితే రేపన్న రోజు గెలుపె దిగిరాదా ఒక నవ్యుతో మొదలెడదాం రోజునీ ఆ హాయిలో మరిచేద్దాం బాధనీ ఒక నవ్యుతో మొదలెడదాం రోజునీ ఆ హాయిలో మరిచేద్దాం బాధనీ చమత్కారమిది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము చుట్టూ లోకమె చెప్పే మాటవిని నీ మనసే అలిసిందా చమత్కారమిది చిన్ని జీవితము భలెవోడివోయ్ చిదంబరం చింతె లేదు పద రాజాలాగ నువ్వు నవ్వేస్తు బ్రతికేసెయ్ తంమదరందం తరరర తంమదరందం తరరర తంమదరందం తరరరరర రర రా తర తర తర తర తంమదరందం తరరర తంమదరందం తరరర తంమదరందం తరరరరర రర రా ఆగిన చోటె నేలని అడుగు వీచె గాలితొ జాయిగ కదులు తడబడుతూ పడుతూ పడి లేస్తు చీకటి తెరలను వెలుగుతొ తోస్తు గమ్యం చేరేవరకూ పయనం ఆపకు ఎపుడూ మేఘం దాచిన వానైన శిఖరం చేరిన మంచైన ఏరున పారె నీరైన సంద్రం చేరాలి ఆ సంద్రమె చేరాలి సంద్రం చేరాలి ఆ సంద్రమె చేరాలి నీ రాత నువ్వే రాసుకుంటు పదవోయ్ అడుగెయ్ ఒక నవ్యుతో మొదలెడదాం రోజునీ ఆ హాయిలో మరిచేద్దాం బాధనీ ఒక నవ్యుతో మొదలెడదాం రోజునీ ఆ హాయిలో మరిచేద్దాం బాధనీ వెళ్లే దారిలోన ముళ్లే రావు అంటే ఎలా మరీ ఎలా మరీ నిన్నే దాటుకుంటు నువ్వే సాగిపోతు పదా మరీ అదే దరీ చమత్కారమిది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము చుట్టూ లోకమె చెప్పే మాటవిని నీ మనసే అలిసిందా చమత్కారమిది చిన్ని జీవితము భలెవోడివోయ్ చిదంబరం చింతె లేదు పద రాజాలాగ నువ్వు నవ్వేస్తు బ్రతికేసెయ్

No comments
Post a Comment