చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ దర్శకత్వం: పరసురం నిర్మాత: రాజు, శిరీష్ విడుదల తేది: 05.04.2024
Songs List:
నందనందనా పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చకా ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా చిత్రంగా చెక్కింది దేనికో ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో నందనందనా నందనందనా నందనందనా అడిగి అడగకా అడుగుతున్నదే, ఆ ఆ అడిగి అడగకా అడుగుతున్నదే అలిగి అలగకా తొలగుతున్నదే కలత నిదురలు కుదుటపడనిదే కలలనొదలక వెనకపడతదే కమ్ముతున్నాదే మాయలా కమ్ముతున్నాదే, టాం టాం టాం…. ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకివతల నడిచి మురిసెనే ఇంతకన్నానా జన్మకీ ఇంతకన్నానా ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో
కళ్యాణి వచ్చా వచ్చా పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తిక్, మంగ్లీ కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన డుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అదరగొట్టెయ్ కచేరీ చిటికెలు వేస్తోంది కునుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారీ ఎన్నో పొదలెరకా ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన హెయ్ హెయ్ హెయ్ హెయ్ సువ్వీ కస్తూరి రంగ సూపియ్‍కావీధి వంక సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరాంటాలు అంతా కలిసి పసుపు దంచారే సాహో సమస్తము ఏలుకొనేలా సర్వం ఇవ్వాలని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చెయ్‍రా కలబడిపోతూ గెలిపిస్తా నీ పడుచు కలనీ బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ అలసటలోను వదిలెయ్‍కుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ ఆ ఆ తగువుల కధా ఆ ఆ ఆ ముగిసెను కదా ఆ ఆ ఆ బిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా
మధురము కదా ప పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: శ్రేయా ఘోషల్ పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా ఉసురేమో నాదైనా నడిపేదే నీవుగా కసురైన విసురైన విసుగైన రాదుగా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమె హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాల్లో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సవ్వడి విని టక్కుమని తిరిగాలే నువ్వని మెరుపులా నువ్వొస్తున్నావని ఉరుకులో జారె ప్రాణమే నీపేరే పలికినదో ఏ మగువైన తగువేనా నా గాలే తాకినదో చిరుగాలైన చంపెయ్ నా హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా వెన్నెలను నిన్ను వదలమని వైరం ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీపైనా మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం