Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Song: Amma Paata 2024







  
పాట: అమ్మ పాట 2024
సంగీతం: Sisco Disco
రచన: మిట్టపల్లి సురేందర్ 
గానం: Janhavi Yerram
ప్రొడ్యూసర్: Ravi Y & Mittapalli Studio
రికార్డింగ్ లేబుల్: Mittapalli Studio


అమ్మ పాట 2024 సాహిత్యం

 

పాట: అమ్మ పాట 2024
సంగీతం: Sisco Disco
రచన: మిట్టపల్లి సురేందర్ 
గానం: Janhavi Yerram

పల్లవి:    
అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట 
తేనెలూరి పారే ఏరులంట
నిండు జాబిలి చూపించి 
గోటితో బుగ్గను గిల్లేసి 
ఉగ్గును పట్టి ఊయలలూపే 
అమ్మ లాలన 
ఊపిరిపోసే నూరేళ్ల 
నిండు దీవెన 

చరణం: 1   
కురిసే వాన చినుకులకి 
నీలినింగి అమ్మ 
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ 
వీచే చల్లని గాలులకి 
పూలకోమ్మ  అమ్మ 
ప్రకృతిపాడే పాటలకి 
యలకోయిల అమ్మ 
సృష్టికి మూలం అమ్మతనం 
సృష్టికి మూలం అమ్మతనం 
సృష్టించలేనిది అమ్మ గుణం 

చరణం: 2    
నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ 
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ 
చీకటి చెరిపే వెన్నెలకి 
జాబిల్లి అమ్మ 
లోకం చూపే కన్నులకి 
కంటిపాప అమ్మ 
అమ్మంటే అనురాగ జీవని 
అమ్మంటే అనురాగ జీవని 
అమ్మ ప్రేమే సంజీవని

Palli Balakrishna Monday, May 27, 2024

Most Recent

Default