Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1961"



చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం  శ్రీ శ్రీ , కొసరాజు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, రాజ సులోచన (అతిధి పాత్రలో) 
మాటలు: ఆచార్య ఆత్రేయ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి. మధుసూధన రావు 
విడుదల తేది: 01.01.1961



Songs List:



హాయి హాయిగా జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో




పాడవోయి భారతీయుడా పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా...

నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ ఓ ఓ

పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా

ఓ ఓఓ ఓఓ ఓఓ…
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి

ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా

ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
అవినీతి, బంధుప్రీతి… చీకటి బజారూ
అలముకున్న నీ దేశమెటు దిగజారూ

కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి

పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే ఏ ఏ ఏ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే

స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం...
స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయక...
స్వార్థమే అనర్థకారణం

సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం

ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం

లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం




చల్లని వెన్నెల సోనలు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జిక్కీ, పి. సుశీల 

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు

పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ
రేకులు పిడికిలి
మూసిన చేతులు లేత గులాబీ రేకులు పిడికిలి
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు 

ఇంటను వెలసిన దైవము - కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము 

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగ అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిధిగా
నూరేళ్ళాయువు పొందుమా





ఓ రంగయో పూలరంగయో పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో



కల కానిది విలువైనది పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల 

కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం  
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు




సరిగంచు చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల, పి.సుశీల

సరిగంచు చీరకట్టి 





భలే భలే పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , మాధవపెద్ది సత్యం

భలే భలే 





చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: పి. సుశీల , స్వర్ణలత 

చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు






శివ గోవింద గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ 

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

తమ బాగు కోసమై తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారయా
పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
శ్రీమద్రమారమణ గోవిందో

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

కలిమి లేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు
కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయ కష్ట జీవుల పని
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఆ నాడి శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఈనాడు కొడసరి వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద


Palli Balakrishna Thursday, June 16, 2022




చిత్రం: భార్యా భర్తలు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు:  అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
నిర్మాత: ఏ.వి. సుబ్బారావు
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 31.03.1961



Songs List:



జోరుగా హుషారుగా షికారు పోదామా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల

జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా

ఓ ...బాల నీ వయ్యార మెంచి మరులుకొంటి నే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే

 ||జోరుగా॥

నీ ... వన్నె చిన్నె లన్ని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే

 ||జోరుగా॥

నా ...కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనులు తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించువాడనే




ఓ..సుకుమారా పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఓ..సుకుమారా నను చేరా రావోయి ఇటు రావోయి
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే

ఓ..జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే

చరణం: 1
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళా
వెన్నెల కాంతి వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా

నిలువగ లేని వలపులరాణి 
నీ కొరకే తపించునులే

చరణం: 2
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ వలపులలోనే
కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా

తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం 

చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ

 ||మధురం||

కరగిపోయె పెను చీకటి పొరలు
కరగిపోయె పెను చీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు

పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవసము

|| మధురం...||

సఫల మాయెనే మన తియ్యని కలలు
సఫల మాయెనే మన తియ్యని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు

పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగ 

||మధురం... !!



ఏమని పాదేదనో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం:  సుశీల

ఏమని పాదేదనో ఈ వేళ
మానస వీణ మౌనముగా
నిదురించిన వేళ
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుకా నిను రాణిని చేసే
పసిడితీగల పంజరమిదిగో
పలుక వేమని పిలిచే వేళ



రంగ రంగేళీ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  సుశీల

రంగ రంగేళీ సుఖాలను తేలి
రావోయి మధుర మీరేయి
రంగ రంగేళీ

నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
మనసులోని మమత లేవో
మనసులోని మమత లేవో
తెలుపునే మెరిసే కనులు
పరాకేలనోయి ప్రియా

భరింపజాల ఈ విరహ జ్వాల
వహవ్వా
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలచి చేరితి నే కోరితినే చిరునగవు
తొలగిపోయెదవు చాలునులే యీ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు 



చూచి చూచి కళ్లు కాయలే కాచాయి పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల, జిక్కీ

జో జో జో జోజో
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి
గా నీ తండ్రి ఊడి పడ్డాడూ
చక్కనీ నా బాబు జోజో
చల్లనీ నా తండ్రి జోజో

రెక్కలూ గట్టుకొని రివ్వునా వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిశాను
మురిపాల మొలకవూ జోజో
ముద్దులూరించేవు జోజో

|| చూచి చూచి||

కాకితో ఒక సారి కబురంపినావని
కాకితో ఒక సారి కబురంపినావని
కలలోన నిను చాల కలవరించాను
కాశీకి పోయినా గంగలో మునిగినా
నిను మరువ కున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో

|| చూచి చూచి||

ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో 
ఇది మంచి సమయము జోజో




కనకమా ! చిట్టి కనకమా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

కనకమా ! చిట్టి కనకమా!
ముద్దు కనకమా ! నామాట వినుమా !
మనము కలసి మెలిసుంటే అప్పీలు లేదుసుమా !
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా
కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా


కల్లకపటం లేని నా కన్న తండ్రిని
వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా !
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు

ఆనందముగ మనము అనుభవించాలంటే
ఆనందముగ మనము అనుభవించాలంటే
అడుగడుగునా మనకు గుదిబండ అయినాడు

కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

అల్లారు ముద్దుగా నా కోరికలు తీర్చి
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల

ఉల్లాసముగ నన్ను ఓదార్చ వేల
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను

ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇంతకన్నా మంచి ఏమి చేస్తాను

Palli Balakrishna Tuesday, May 18, 2021



చిత్రం: ఇంద్రజిత్ (సతీ సులోచన) (1961)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్.టి.రామరావు, అంజలీ దేవి
పాటలు, మాటలు: సముద్రాల రాఘవాచార్య 
స్క్రీన్ ప్లే: డి.వి.నరసరాజు
దర్శకత్వం: ఎస్.రజినీకాంత్
నిర్మాతలు: ఎస్.రజినీకాంత్, డి.వి.సుబ్బారావు, కంచర్ల మాధవరావు 
విడుదల తేది: 05.05.1961



Songs List:



నమో నమో నారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. బి. శ్రీనివాస్ 

నమో నమో నారాయణ



ఆడవె వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. బి. శ్రీనివాస్, కె రాణి 

ఆడవె వయ్యారి 



కనరా రాజ చేకొనరా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: యస్. జానకి 

కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల




పలుకవే తీయగా పాడవే హాయిగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. సుశీల 

పలుకవే తీయగా పాడవే హాయిగా ముల్లోకాలకు సుఖసంజీవమే



ఓ ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ ప్రియతమా 



కరుణాపయోనిధే శరణంటిరా విభో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: ఏ. పి. కోమల 

కరుణాపయోనిధే శరణంటిరా విభో కరుణించుమా ప్రభో యేల ఈ పరిశోధన 



రామాయణం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: ఘంటసాల 

రామాయణం 



హే దీనబందు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. సుశీల 

హే దీనబందు 




జై జై జై మేఘనాధా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. సుశీల 

జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ



ప్రభూ హే ప్రభూ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. సుశీల 

ప్రభూ హే ప్రభూ 



ఓ హృదయేశా కానగ రారా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రజిత్ (1961)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: పి. సుశీల 

ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా

Palli Balakrishna Tuesday, March 5, 2019




చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: శారద, సంజీవ్ కుమార్
దర్శకత్వం: కె. బాపయ్య
నిర్మాత: పి.రాఘవరావు
విడుదల తేది: 20.12.1974



Songs List:



ప్రతి అందం జంటకోసం పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, వాణీజయరాం 

పల్లవి:
ప్రతి అందం జంటకోసం
పలవరించి పోతుంది
జతగూడే బ్రతుకులోనే
ప్రతి రాగం పలుకుతుంది
అనురాగం పండుతుంది

చరణం: 1
కొండ కోరుకుంటుంది.
కలికి మబ్బు జంటను
కడలి కోరుకుంటుంది
కన్నె వాగు జంటను
కన్నెదాని పరువం కోరుకుంటుంది
చిన్నవాని జంటను
చినవాని జంటను-
పెదవి కోరుకుంటుంది
మరో పెదవి జంటను
మేను కోరుకుంటుంది
మరో మేని జంటను
వలచిన హృదయం కొరుకుంటుంది
తొలి వలపు పంటను
తొలి వలపు పంటను

చరణం: 2
రాధా కృష్ణుల జంట
రస జగతికి తొలివెలుగు
సీతా రాముల జంట...ఆ
వెలుగుకే కనువెలుగు
ఆ వెలుగే మన జీవనపధమై
సాగి పోదాములే
సాగి పోదాములే 




ఎవరు వింటారు పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
ఎవరు వింటారు
మూగ కన్నీట  కరిగే నా పాట

చరణం: 1
అన్ని వన్నెలు, ఆ దేవుని కల్పనలే 
ఉభయ సంధ్యలు - తెలుపు నలుపుల
కలయికలే
మరి తెలుపంటే ఎందుకు మోహం
నలుపంటే ఎందుకు ద్వేషం  

చరణం: 2
నల్లని కనుపాప లేనిదే చల్లని చూపే లేదు
నల్లని రాతిరి లేనిదే ఎర్రని ఉదయం లేదు
మరి! వెలుగంటే ఎందుకు మోహం!
చీకటంటే ఎందుకు ద్వేషం  

చరణం: 3
కురిసే కన్నీరు - వెలిసే ఆ రోజు వస్తుందా?
కొలిచిన దైవం కోరిన వరమే యిస్తుందా?
తోడు లేక నీడ లేక వసివాడివున్న 
నా మోడు బ్రతుకులో కళ్యాణ గీతం పలికేనా?




అందని ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
ఆందని ఆకాశం అందుకున్నానులే !
పొందని అనురాగం పొందగలిగానులే!
ఇది తొలి పొద్దులే నా అందానికి
ఇక తుది లేదులే నా ఆనందానికి !

చరమం: 1
కలలే ఎరుగని నా కళ్ళకు ఒక
కమ్మని రూపం దొరికింది
ఇన్నాళ్ళ కన్నీళ్ళలో పున్నమి
వెన్నెల విరులై సిరులై విరిసింది
నింగిని పొడిచే రంగుల హరివిల్లు
ముంగిట తానే నిలిచింది. నా
ముంగిట తానే నిలిచింది

చరణం: 2
తీగ తెగిన బ్రతుకు వీలుపై
రాగ మాలిక పలికింది !
ఏగాలి ఎదిరించినా నా
జీవన నావకు కోరిన తీరం దొరికింది
వేకువ లేని చీకటి గుడిలో
దైవమే దీపమై వెలిగింది నా
దైవమే దీపమై వెలిగింది





వయసే ఊరుకోదురా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి 

పల్లవి:
వయసే ఊరుకోదురా !
మనసే నిలువనీదురా !

అనుపల్లవి:
కన్నులనిండా కైపెక్కుతుంటే
వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే
ఒంటరి తనం కాల్చేస్తుంటే

చరణం: 1
రోజు రోజుకొక కొత్త కోరిక రాజుకుంటుంది
రేయి రేయికొక వింత కోరిక రివ్వుమంటుంది
రుచులెరిగిన ఫిచ్చి పరువం రెచ్చిపోతుంది
ఆ రుచులే కావాలని పదేపదే కోరుకుంటుంది

చరణం: 2
లేత నడుము ని పిడికిట కూతవేసింది
దోర సొగసు తననుతానే ఆరవేసుకుంది
తడిగాలికి పురివిప్పిన తనువూగిందీ
ఊగి ఊగి నీ కౌగిట ఒదిగి ఒదిగిపోతూవుంది




పంచరంగుల చిలకల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశి (1974)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: కె.చక్రవర్తి, సావిత్రి, గాయత్రి, స్వర్ణ

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ పాట రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి)


పల్లవి :
పంచరంగుల చిలకల్లారా !
పరువాల మొలకల్లారా !
నే మెచ్చే వారే రావాలి!
మనసిచ్చే వారే కావాలి!

అందం చందం చూసుకో
బాగా ఎన్నిక చేసుకో !
అన్నీ కుదిరితే
అప్పుడే పెళ్ళి చేసుకో

దేశంలోని దరిద్రమంతా
మీ దుస్తుల్లో నే కనిపిస్తోంది
సిగ్గూ ఎగ్గూ లేని ఆడదాన్ని
చూస్తేనే పాపం వస్తుంది
ఆహాఁ అయినా అమ్మాయి
వంటా వార్పూ వచ్చునా....?
పిల్లల పోషణ తెలుసునా...?
ఐ హేట్ చిల్డ్రన్
సంసారాన్ని బాగా నడిపే
ఓర్పు, నేర్పూ మీకుందా...?
ఐయామ్ సారీ

ఆడా మగా తేడా లేదు
ఆనందానికి హద్దే లేదు
సుఖించడం మా సిద్ధాంతం
రా-రా-రా-ఎందుకు రాద్ధాంతం
హరి-హరె-హరె రామా-
హరే హరే హరె కృష్ణా

ఆడామగా తేడా తెలియని
ఆడది నాకొద్దండీ!
ఆదివాసుల వారసులారా !
అడవులలోకే వెళ్ళండి!
మృగాల వలెనే బ్రతకండి

గుంటూరు గోంగూర తినిపిస్తాను
తియ్యనైన ఎంకి పాట వినిపిస్తాను
గుట్టుగా కాపురం చేస్తాను
పండులాంటి కొడుకునే యిస్తాను.
గుమ్మడి పండులాంటి కొడుకునే యిస్తా

రావే బంగరు బొమ్మా
నా రమణి ముద్దులగుమ్మ!!

Palli Balakrishna Monday, March 4, 2019



చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
నటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణకుమారి
అసోసియేట్ డైరెక్టర్: కె.రాఘవేంద్రరావు
దర్శకత్వం: ఆచార్య ఆత్రేయ
నిర్మాతలు: కె.సత్యనారాయణ, డి.శ్రీరామ మూర్తి
విడుదల తేది: 05.10.1961

( ప్రముఖ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు, అలాగే ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు)



Songs List:



తప్పెట్లోయ్ తాళాలోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: నార్ల చిరంజీవి 
గానం: యస్.జానకి, సరోజిని 

తప్పెట్లోయ్ తాళాలోయ్- దేవుఁనిగుళ్ళో బాజాలోయ్
చప్పట్లోయ్ సరదాలోయ్ - పిల్లలె బళ్ళో రాజాలోయ్
బడికీ గుడికి తేడాలేదోయ్ భక్తీశ్రద్దా ఒక టేనోయ్
పలకా బలపం అక్కడికి
పళ్ళూ పూలూ ఇక్కడికి

ఎం. బి. బి. ఎస్. డాకర్,
అబ్బో - రంగునీళ్ళతో డబ్బు గుంజకు
డోకా లేని వకీలునౌతా
ఆఁ తప్పుడు కేసుకు వత్తాసీయకు
మన కే గొప్పలు వద్దోయ్
మంచివాళ్ళమైతే చాలోయ్ 

మేటి చదువులు మెదడుకు బలము
ఆటలు పాటలు వంటికి బలము
రెండూ వుండే దండి మనుష్యులే
నిండుదనం మన జన్మభూమికి

మనసులు కలసిన స్నేహాలు
మిల మిల మెరిసే దీపాలు
వేరైతేనేం దేహాలు
ఒక టేగా మన ప్రాణాలు



కాశీ పట్నం చూడర బాబూ పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి.సుశీల , ఘంటసాల 

ఓహెూ ! నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి
బీదవాడ
మనిషిగా బ్రతికేందుకు కనీసావసరాలైనా
లేనివాడా – అయ్యయ్యో
కాశీ పట్నం చూడర బాబూ, కల్లాకపటం లేని గరీబూ
అల్లోలక్ష్మణ అని అల్లాడే, పల్లెలదుస్థితికేమి జవాబు?
నిరాశతోను నిస్పృహలోను తెరువేరుగని నిరుపేదలు
మురికిగుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటిపేటలు
పాడురోగాలు మోసుకు తిరిగి ప్రజలను చంపే ఈగలు
కరువూ బరువూ పరితాపాలు, కలసి వెరసి మన పల్లెలు
శరీరాలో అర చటాకైనా రక్తంలేని దరిద్రులనే
పీల్చుకుతింటాడు – దోమరాక్షసుడు
వాడి దుంపతెగ - మేడల్లో మిద్దెలలో నివసించేవారి
జోలికైనా పోడుగదా... అయ్యయ్యో
పోడుగదా--అయ్యయ్యో

వైద్యసహాయం అసలేలేదు - వున్నా దొరకవు మందులు
డాక్టరుకోసం వెతికేలోగా, రోగులు గుటుక్కు మందురు
నెత్తురు పీల్చే వృత్తిపరులె-మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లెజనాలను - పంచుకు నంచుకు తిందురు 

ప్రజలతో సమానంగా కష్టసుఖాలను, పంచుకుంటామంటారు - మన వినాయకులు
అవునవును సుఖాలన్నీ తమకు దక్కించుకొని
కష్టాలన్నీ మనకు వదిలేస్తారు - అయ్యయ్యో
ఎవరోవచ్చి సాయం చేస్తారను వకోడమే పొరబాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బదానాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు - అ దేకదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిననాడు- ఎదుటివాడి కది
తలపోటు 




నగజాతనయం (Harikatha) పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల 

రామదాసు :
నగజాతనయం సహృదయం చింతయామి సదయం
త్రిజగమహోదయం శ్రీ నగజాతనయం॥

శ్రీరామభక్తులారా ! ఇది సీతాకల్యాణ సత్కథ. నలభై రోజులనుంచి చెప్పిన కథ. చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్రసౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా ! కాస్త పాలు, మిరియాలు ఏమన్నా?

చిత్తం – సిద్ధం.

భక్తులారా ! సీతామహా దేవి స్వయంవరానికి ముల్లో కాలనుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి ... ఆహా ! అతడెవరయ్యా అంటే 

రఘురాముడు రమణీయ వినీలఘనశ్యాముడు వాడు
నెలరేడు సరిజోడు మొనగాడు వాని కనులు మగమీల
నేలురా వాని నగవు రతనాల జాలురా 
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు 
మరోమరుడు, మనోహరుడు, రఘురాముడు

శబాష్ శబాష్ 
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో

ఎంత సొగసుగాడే, మన సింతలోనె దోచినాడే
మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే 

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా అక్కడ
స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి, అనియె నిట్లు -

ఓ యనఘులారా ! నా అనుగుపుత్రి సీత
వినయాదిక సద్గుణవ్రాత, ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి విఁటి నెక్కిడజాలిన యెక్కటి జోదును నేడు
మక్కువమిూరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు. 

అని యీ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే, సభలోనివారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట.
మహావీరుడైన రావణాసురుడు కూడా 'హా' ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము' అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున

ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరపువలె నిల్చి 
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సరమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత 
మదనవిరోధి శరాసనమును తన శరమును బూనినయంత 
ఫెళ్లుమనె విల్లు - గంటలు ఘల్లుమనె - గుభిల్లుమనె గుండె నృపులకు, 
ఝల్లుమనియె జానకి దేహము ఒక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర
శ్రీమద్రమారమణ గోవిందో హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్లుగా వుంది.
మరొక్కసారి - జై  శ్రీమద్రమారమణ గోవిందో హారి

భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు.
అంతట
భూతలనాధుడు - రాముడు
ప్రీతుండై - పెండ్లియాడె, పుధుగుణమణి
సంఘాతన్ – భాగ్యో పేతన్ సీతన్
భూతలనాధుడు - రాముడు
ప్రీతుండై - పెండ్లియాడె..
శ్రీమద్రమారమణ గోవిందో హారి 




వన్నె చిన్నె లన్నీ వున్న పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల 

వన్నె చిన్నె లన్నీ వున్న చిన్నదానివే అన్నీ వున్న దానివే
ఎన్ని వున్నా జోడు లేక లేనిదానివే - ఏమీ లేనిదానివే-
ఉత్త ఆడదానివే

తిరిగే చక్రాలున్నా - పై పైకెగరే  గుఱ్ఱాలున్నా
కళ్లెం పట్టి కళ్లనుగట్టి నడిపే మొనగాడుండాలి
అందని దైనాగానీ నరులందరు కోరుదురందాన్ని
తూకం వేసి పాకంచూసి, డెందం ఒకరికే ఇవ్వాలి
అందం డెందం కలిపి ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు, అన్నీ వున్నవనుకోవాలి




వెలుగు చూపవయ్యా మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, ఘంటసాల 

రామదాసు :
పాహిరామప్రభో ! వరదా, శుభదా, పాహి దీనపాలా
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా
విజయ :
మహాత్ములైనా దురాత్ములైనా, మనుజుల పేరనె మసలేరయ్యా
అందరికి నీ అభయం కలదని, అనుకోమందువ దేవా
నేరక చేసిన కారణమున మా నేరము నేరము కాకపోవునా?
కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా
కల రూపేదో కలవో లేవో ఎదవున్నది యీ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా 




నా కంటి పాపలో నిలిచిపోరా పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...

చరణం: 1
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే...

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

చరణం: 2
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో...
మేఘాలలో వలపు రాగాలలో....
దూర దూరాల స్వర్గాల చేరుదమా....

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

చరణం: 3
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అహ..హా..ఆ..
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను...
అందాలనూ తీపి బంధాలను...
అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...





మా కిట్టయ పుట్టినదినము పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పిఠాపురం, వసంత & కోరస్

మా కిట్టయ పుట్టినదినము తానీ తానారే తానీ
కిలకిలాని నవ్వెను జగము తానీ తావారే తాని
పిల్లనగ్రోవి వినుము తానీ తానారే తానీ
నల్లని సామిని కనుము తానీ తానా రే తానీ
మన పల్లే బృందావనము, మన మనసే దేవాలయము

నందారె దేవ నందారె. నందాకుమారా నందారె
కోరస్ : నందారె దేవ నందారె, నందాకుమారా నందా రె
ఆందారె దేవ నందారె, నందాకుమారా నందారె
కోరస్: నందారె దేవ నందా రె, నందాకుమారా నందారె
చల్లను అమ్మే పిల్లను చేరి..
కోరస్ : చల్లను అమ్మే పిల్లను చేరి
అల్లరిచేసి చల్లను తాగి
కోరస్ : అలరి చేసి చలను తాగి

పులుపెక్కె పిల్లా వలపింత కలుపని
పులుపెక్కె పిల్లా వలపింత కలుపని
గొల్లున నవ్వేవు కిట్టయ్యా, కొంటికిట్టయ్యా
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా
నల్లనయ్య ఏ యిల్లు దూరినా
నల్లనయ్య ఏ యిల్లు దూరినా
వెన్నముద్దకని వెతికి చూ సేము
వెన్నముద్దకని వెతికి చూసేము
వెన్నతోపాటు ఏ కన్నె మనసో
వెన్నతో పాటు ఏ కన్నె మనసో
కాజేసి పోతావు, కిట్టయ్య దొంగ కిట్టయ్య,
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా
చీరెలు దోచి చెట్టెక్కినావు
చీ రెలు దోచి చెట్టెక్కినావు
సిగున భామలు మొగలెనారు.
సిగ్గున భామలు మొగ్గలైనారు
పుట్టేది గిట్టేది బట్ట' లేకని

కోరస్: పుట్టేది గిట్టేది బట్ట లేకనీ
బురిడీలు కొట్టేవు కిట్టయ్య చిలిపి కిట్టయ్య,
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా




బంగరునావ బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

బంగరునావ బ్రతుకు
బంగరునావ దాన్ని
నడిపించు నలుగురికి మేలైన త్రోవ
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్డగించినా
కదిలిపోవు కాలచక్ర మాగిపోవునా
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ

అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్నీ త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ

కనులున్నది కన్నీటికి కొలను లౌటకా
వలపన్నది విఫలమై విలపించుటకా?
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ బంగరునావ


Palli Balakrishna Friday, February 8, 2019



చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.ఆర్, బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి
దర్శకత్వం: కదిరి వెంకటారెడ్డి
నిర్మాత: కదిరి వెంకటారెడ్డి
విడుదల తేది: 09.08.1961



Songs List:



జయ జయ జయ జగదీక ప్రతాప పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

జయ జయ జయ జగదేక ప్రతాపా! జగదానందకరా
విక్రమ సాహస శౌర్య విధానా! విమలాశయమణి కిరీటధారీ!
వీర ధీర గంభీర సుందరా ! విజయఖడ్గ ధారీ !
మూర్తిమంత నవమోహన రూపా ! - కీర్తి కామినీ మానసచోరా
దివిజలోక సురరాజ సమానా ! - దివ్యగాన నిపుణా !




జలకాలాటలలో  పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా, పి.సుశీల

పల్లవి: 
జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా
జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా

చరణం: 1 
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో 
సన్న వలపు విరిసే 
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో 
సన్న వలపు విరిసే 

జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా

చరణం: 2 
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే 
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే 
అది వరుని కొరకు పిలుపే 

జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా



ఓ సఖీ ఓహో చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
ఓ దివ్య రమణులారా... 
నేటికి కనికరించినారా 
కలకాదు కదా సఖులారా 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖి

చరణం: 1 
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో...
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కనులవిందు చేశారే...
కనుల విందు చేశారిక ధన్యుడనైతిని నేనహా

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 

చరణం: 2 
నయగారము లొలికించి 
ప్రియరాగము పలికించి 
నయగారము లొలికించి 
ప్రియరాగము పలికించి 
హాయి నొసగు ప్రియలేలే 
హాయి నొసగు ప్రియలే మరి 
మాయలు సిగ్గులు ఏలనె 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 

చరణం: 3 
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు 
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు 
ఆటలహో తెలిసేనులే 
ఆటలహో తెలిసెను 
చెలగాటమయ నా కడ చెల్లునె 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 
ఓ సఖీ





నను దయగనరా పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా

నను దయ గనవా, నా మొర వినవా మది నమ్మితి
నిన్నేమాతా ఇక శరణము నీవే మాతా
అపశకునంబయే నమ్మా సుతుడే - ఆపదపాలాయెనో
ఎటు చూచెదవో, ఎటు బ్రోచెదవో నా - తనయుని భారము నీదే
ఆశాదీపము ఆరిపోవునా చేసిన పూజలు విఫలము లవునా
నీవు వినా ఇక రక్షకు లెవరే కానగ రావా! ఓ మాతా! ఓ మాతా!



వరించి వచ్చిన మానవ వీరుడు పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

పల్లవి: 
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 1 
నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే 
అహ నవ మన్మధుడే ఆయెనే 
ఓ హో...మన్మధుడై నిన్నావేశించి మైమరపించేనే హలా 
నిను మైమరపించేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 2 
అలిగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే 
అహా మలయానిలుడే ఆయెనే 
ఓహో మలయానిలుడై చల్లగ చెలిపై వలుపులు విసిరినే హలా 
అహ వలుపులు విసిరేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 3
చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే 
అహ లలిత వసంతుడె ఆయెనే 
వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా 
తన చెంతకు పిలిచేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 





కొప్పు నిండా పువ్వులేమో పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత 

కొప్పునిండా పూవులేమే కోడల కోడల
నీ కెవరూ ముడిచీనారే కోడల కోడల
ఎదురింటి మల్లెచెట్టు మామయ్య మామయ్య !
నీళ్లుపోసి పెంచానయ్యో మామయ్య మామయ్య !
ఆ ! ఆహాఁ! అట్టాగే మరిగైతే
చెంపంతా గాట్లేమే కోడల, కోడల- నిన్నెవరు కొరికినారే
కోడల
ఎదురింటి రామచిలుక మామయ్య మామయ్య
ముద్దు పెడితే కొరికిందయ్యో మామయ్య మామయ్య




ఐనదేమో ఐనదిపాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఐనదేమో ఐనదీ ప్రియ 
గానమేదే ప్రేయసీ 
ఐనదేమో ఐనదీ ప్రియ 
గానమేదే ప్రేయసీ 

ప్రేమ గానము సాగ గానే 
భూమి స్వర్గమె ఐనది 
భూమి స్వర్గమె ఐనది 

ఐనదేమో ఐనది

చరణం: 1 
ఏమి మంత్రము వేసినావో 
ఏమి మత్తును చల్లినావో 
ఏమి మంత్రము వేసినావో 
ఏమి మత్తును చల్లినావో 
నిన్ను చూసిన నిమషమందె 
మనసు నీ వశమైనదీ
మనసు నీ వశమైనదీ

ఐనదేమో ఐనది

చరణం: 2 
కులుకులొలికే హోయలు చూసి 
వలపు చిలికే లయలు చూసి
కులుకులొలికే హోయలు చూసి 
వలపు చిలికే లయలు చూసి
తలపు లేవో రేగి నాలో 
చాలా కలవరమైనదీ 
చాలా కలవరమైనదీ

ఐనదేమో ఐనదీ ప్రియా 
గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనదీ 





ఆశా ఏకాశా నీ నీడను పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా
ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా
చింతలో రెండు చింతలొ 
నా చెంత కాదు నీ తంతులు...ఓయ్... చింతలో 
ఓ...ఓ...ఓ...ఓయ్... చింతలో 

చరణం: 1 
వద్దంటే కాదె ముద్దుల బాలా 
ప్రేమ పరగణా రాసేశా ఒద్దంటె 
నిన్ను రాణిగా... నిను రాణిగా చేసేశా 
చేతులు జోడించి మ్రొక్కేశా... ఆశా

చరణం: 2 
ఓ...ఓ...ఓ...ఓయ్.... 
కోశావు లేవోయి కోతలు 
చాలా చూశానులే నీ చేతలు
కోశావు లేవోయి కోతలు 
చాలా చూశానులే నీ చేతలు
రాజు ఉన్నాడూ - రాజు ఉన్నాడు 
మంత్రి ఉన్నాడు సాగవు సాగవు 
నీ గంతులు... చింతలూ

చరణం: 3
రాజా... మంత్రా... ఎవరూ? ఎక్కడా? 
తా తరికిట తా తరికిట తళాంగు తక భా 
రాజు గారి బూజు దులిపేస్తా 
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
రాజు గారి బూజు దులిపేస్తా 
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
కోటలో పాగా... కోటలో పాగా వేసేస్తా 
గట్టిగ నీ చెయ్యి పట్టేస్తా ... ఆశా...





మనోహరముగ మధుర మధురముగ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

చరణం: 1 
ఇది చంద్రుని మహిమేలే 
అందంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఇది చంద్రుని మహిమేలే 
అందంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఆ మంచిది యైనా కొంచెమైనా 
వంచన నీదేలే అయినా  మంచిదిలే 

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

చరణం:2 
ఇది మోహన మంత్రమెలే 
అదంతేలే సరేలే మనకిది మేలేలే 
ఇది మోహన మంత్రమెలే 
అదంతేలే సరేలే మనకిది మేలేలే 
మేలే అయినా మాలిమైనా
జాలము నీదేలే  అయినా మేలేలే

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 





ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా, పి.సుశీల

పల్లవి: 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా...

చరణం: 1 
కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు 
తొలి మేము చేసిన పుణ్యమున గాక 
ఆ మందార మాలతీ పారిజాతాలతో 
అందముగ ముడివేసి అలరజేసేము

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 

చరణం: 2 
మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి 
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము 
ఆ పారాణి వెలయించి పాదపూజను చేసే 
కోరికలు తీరునని పొంగిపోయేము 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా...




రారా కనరారా పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా 
రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా 

చరణం: 1 
నాలో నాలుగు ప్రాణములనగా 
నాలో నాలుగు దీపములనగా 
నాలో నాలుగు ప్రాణములనగా 
నాలో నాలుగు దీపములనగా 
కలిసి మెలసి అలరించిన చెలులే 
కలిసి మెలసి అలరించిన చెలులే 
నను విడనాడెదరా 

రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా...రారా 

చరణం: 2 
మీ ప్రేమలతో మీ స్నేహముతో 
మీ ప్రేమలతో మీ స్నేహముతో 
అమరజీవిగా నను చేసితిరే 
మీరు లేని నా బ్రతుకేలా 
మీరు లేని నా బ్రతుకేలా 
మరణమె శరణముగా 

రారా కనరా 
కరుణ మానినారా ప్రియతమలారా





శివశంకరీ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

శివశంకరీ
శివశంకరీ శివానందలహరి 
శివశంకరీ శివానందలహరి 
శివశంకరీ 
శివానందలహరి శివశంకరీ 

చరణం:1 
చంద్రకళాధరి ఈశ్వరీ... 
ఆ...చంద్రకళాధరి ఈశ్వరీ... 
కరుణామృతమును కురియుజేయుమా 
మనసు కరుగదా మహిమ జూపవా 
దీనపాలనము చేయవే 

శివశంకరీ 
శివానంద లహరి శివశంకరీ 
శివశంకరీ శివానందలహరి 
శివానందలహరి శివశంకరీ 
శివశంకరీ శివానందలహరి
శివశంకరీ శివానందలహరి
శివశంకరీ

చంద్రకళాధరి ఈశ్వరీ..
రిరి సనిదనిస మపదనిస 
దనిస దనిస దనిస

చంద్ర కళాధరి ఈశ్వరీ 
రిరి సని పమగ రిసగ
రి రి రిరిస రిమ పదా
మప నిరి నిస దప 

చంద్రకళాధరి ఈశ్వరీ 
దనిస మపదనిస 
సరి మగరి మపని దనిస
మపనిరి సరి నిసదనిప
మపనిసరీసని సరిగా రిస రిరి సని 
సనిపనిపమ పమ గమరిసనిస 
సరిమపనిదానిస 
సరిమపనిదానిస 
సరిమపనిదానిస 
చంద్రకళాధరి ఈశ్వరీ 
చంద్రకళాధరి ఈశ్వరీ 
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

శివశంకరీ... ఆ...ఆ...
శివశంకరీ... 

తోం తోం తోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
దిర్ ద్రి యానా దరితోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
తోం తోం 
దిరిదిరి దిరిదిరి దిరిదిరి 
నాదిరి దిరిదిరి దిరి దిరి దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం 
నినినిని నినినిని దనిని దనినినిని దప 
రిమరి సరిసనిసని పనిప మపమరిగా 
సరి సస మపమమ సరిసస సససస 
సరిసస పనిపప సరిసస సససస 
మపమమ పనిదద 
మపమ పనిదద 
మపమ పనిద మపమ పనిద 
పదపప సరిసస 
పదప సరిస పదప సరిస 
మమమ పపప దదద నినిని 
ససస రిరిరి గరిసనిసరిపా 

శివశంకరీ

Palli Balakrishna Tuesday, July 25, 2017


చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 29.12.1961

హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు
నాటికి నేటికీ మీకు అలవాటే...

హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
మనసులో మమతలూ పైకి వేషాలూ...
ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి

లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు గెలుపు కోసం పగవారు
కాళ్ళబేరాలాడకపోరు


హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై



********   ********   ********



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: మాదవపెద్ది సత్యం

శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఓ రామా నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా

పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా
శ్రీరామ... ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా

చరణం: 1
తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు...
యమ దండన పొందుంట మా వంతు
తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు...
పాపం చేయుట మాంతు దయ చూపించటమే నీ వంతు

శ్రీరామ... ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
శ్రీమద్రమారమణ గోవిందో హారి!

చరణం: 2
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి
మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా "రాతినే"

శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా

శ్రీరామా... శ్రీరామా
హే శ్రీరామా... శ్రీరామా
జై ఓ రామా... శ్రీరామా
శ్రీరామా... శ్రీరామా
హే శ్రీరామా... శ్రీరామా
జై ఓ రామా... శ్రీరామా
జై ఓ రామా... శ్రీరామా

శ్రీమద్రమారమణ గోవిందో హారి!



********   ********   ********



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల

ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అని కోయిలా  "2"
వసంతవేళలా పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా  "ఓహొ . ..."

చరణం: 1
అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే  "2"
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే "ఓహొ"

చరణం: 2
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో తేలిపో హాయి హాయిగా "2"
ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా
నివాళి అందుకో ఈవేళ పండుగా
సదా సుధా తరంగాల తేలిపోదమా
ఓహొ ఓహొ నిన్నే కోరితి
కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . .



********   ********   ********


చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి.సుశీల

ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా
ఓ... మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా
నింగి దాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనులవాడా

చరణం: 1
ఓ... ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో
ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో
హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ...
నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ...
మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే
మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే నిషా కనులవాడా

చరణం: 2
ఓ... ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందుమా నేడే
నీలినీలి మేఘాల రథముపై తేలిపోదుమీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమవుదమా తీయగా
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే హమేషా మజాగా



********   ********   ********


చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .

చరణం: 1
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు "2"
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా "2"
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము  "చక్కని . . . "

చరణం: 2
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే "2"
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా "2"
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే  "చక్కని . . . "

చరణం: 3
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము "2"
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు "2"
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా "2"
చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము "2" "టక్కరి . . ." "చక్కని . . . "



********   ********   ********


చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుసగుస లాడినవి ఏమిటో

విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ఈ ముసిముసినవ్వుల విరిసిన పువ్వులు
గుసగుసలాడినవి ఏమిటో

చరణం: 1
పొదరింటను ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది
మనసే తెలిసి తన ప్రేయసికై
మగపావురమే దరిచేరింది

చరణం: 2
నీ కురులను రేపిన చిరుగాలి
నా మదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి

చరణం: 3
నదిలో మెరసి కదిలే కాంతి  "2"
నా మోమున తళతళలాడింది


********   ********   ********


చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి :
 ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
 పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2)
 ॥పాడవేల॥

 చరణం: 1
 ఈ వసంత యామినిలో... ఓ...
 ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
 ఈ వసంత యామినిలో... ఓ...
 ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
 జీవితమే పులకించగ...
 జీవితమే పులకించగ నీ వీణను సవరించి
 పాడవేల రాధికా...

 చరణం: 2
 గోపాలుడు నినువలచి నీ పాటను మది తలచి (2)
 ఏ మూలనో పొంచి పొంచి...
 ఏ మూలనో పొంచి పొంచి వినుచున్నాడని యెంచి
 పాడవేల రాధికా...

 చరణం: 3
 వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ (2)
 ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ
 ॥పాడవేల॥

Palli Balakrishna

Most Recent

Default