నాగురించి:
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పల్లి బాలకృష్ణ, నేను విజయవాడలో ఉంటున్నాను. నేను డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో PA (Plant Attendant) గా పనిచేస్తున్నాను.
నేను సినిమా పాటలు ఎక్కువగా వింటాను. అంటే ఏదో వినటం కాదు, దాని సాహిత్యాన్ని చూస్తూ పాట వినటం నాకిష్టం. అప్పుడు ఆ పాట యొక్క భావం మనసుకు చేరుతుంది. ఇలా వినడం వలన సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించగలం అనేది నా అభిప్రాయం.
అందుకోసం నేను ఈ "తెలుగు లిరిక్స్ వరల్డ్" అనే వెబ్‌సైట్‌ను మీకు పరిచయం చేస్తున్నాను.
ఈ తెలుగు లిరిక్స్ వరల్డ్‌లో సుమారు 3000 పైగా చిత్రాలను, మరియు సుమారుగా 13500కు పైగా పాటలు ఉన్నాయి. సినిమా పాటలు, జానపదాలు (Folk songs), Devotional Songs ఏవి కావాలన్నా ఈ సైట్‌లో ఉన్నాయి. ఒకవేళ లేకపోతే, మీకు కావలసిన పాట లిరిక్స్‌ను రిక్వెస్ట్ చేస్తే నేను వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తాను.
ఈ సైట్‌లో Contact Form ద్వారా మీకు కావలసినది పంపగలరు. లేదా pallibalakrishna1981@gmail.com కు మీ రిక్వెస్ట్ పంపగలరు. నేను తప్పకుండా స్పందిస్తాను.