Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

The Family Star (2024)
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్  
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
దర్శకత్వం: పరసురం 
నిర్మాత: రాజు, శిరీష్ 
విడుదల తేది: 05.04.2024Songs List:నందనందనా పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

నందనందనా
నందనందనా
నందనందనా

అడిగి అడగకా అడుగుతున్నదే, ఆ ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే, టాం టాం టాం….

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే

ఇంతకన్నానా జన్మకీ
ఇంతకన్నానా

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

Palli Balakrishna Tuesday, February 13, 2024
Ambajipeta Marriage Band (2024)
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: సుహాష్, శివాని నగరం 
దర్శకత్వం: దుష్యంత్ కటికనేని 
నిర్మాత: ధీరజ్ మొగిలినేని 
విడుదల తేది: 02.02.2024Songs List:గుమ్మా గుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: శేఖర్ చంద్ర 

గుమ్మా గుమ్మా మా ఊరు అంబాజీపేటా పాట సాహిత్యం

 
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: కాల భైరవ 

రారోయ్ మా ఊరి సిత్రాన్ని సూద్దాం
(అరెరే సూద్దాం)
ఇటు రారోయ్ ఈ బతుకు పాటను ఇందాం
(అరెరే ఇందాం)

ఈ సన్నాయి నొక్కుల్లోనా
ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్
ఈ డప్పుల చప్పుడులోన
ఊగించే గుండె లయలు ఉన్నాయి

సేతుల్లో సేతల్లో కలలెన్నో ఉన్నోళ్ళు
ముత్తాతల వృత్తులనే సేసేటోల్లు
బంధాలు బాధ్యతలు మోస్తున్నా
మొనగాళ్ళు మా ఊరి విద్వాంసులు

మా ఊరు అంబాజీపేటా ఆ ఆ
మా ఊరు అంబాజీపేట
మా బతుకే సరికొత్త బాట
మా ఊరు అంబాజీపేట
కొట్టర కొట్టు
ఊరంతా మురిసి ఆడాలంటా

కష్టాలు కన్నీళ్ళు వద్దన్నా వదులునా
ఉసూరుమన్నావో నీ బండి కదులునా
కష్టాలు కన్నీళ్ళు వద్దన్నా వదులునా
ఉసూరుమన్నావో నీ బండి కదులునా

తీపైనా సేదైనా రుచి చూడక తప్పునా
కాదంటే బతుకంతా తీరాని ఓ యాతన
తీరాని ఓ యాతన, తీరాని ఓ యాతన

లోకం అంటేనే సంత కాదా సోదరా
మంచేదో సెడ్డేదో కళ్ళే తెరిచి సూడరా
కాలం అంటేనే మాయ కదా నాయనా
నిన్న నేడు రేపు ఒకేలాగ ఉండేలా

రా ఇలా, ఇలా పుట్టిన రోజును చేద్దాం
రా అలా, అలా పాడెను ఎత్తుకు పోదాం
రా ఇలా, ఇలా మధ్యలో మనుషులౌదాం
ప్రతి కధకి మనమే సాక్షాలౌదాం

మా ఊరు అంబాజీపేటా ఆ ఆ
మా ఊరు అంబాజీపేట
మా బతుకే సరికొత్త బాట
మా ఊరు అంబాజీపేట
కొట్టరా కొట్టు
ఊరంతా మురిసి ఆడాలంటా

రారోయ్ మా ఊరి సిత్రాన్ని సూద్దాం
(అరెరే సూద్దాం)
మనసారా ఈ బతుకు పాటను విందాం
(అరెరే ఇందాం)చీకటి వేకువగా పాట సాహిత్యం

 
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: శేఖర్ చంద్ర, మోహన భోగరాజ్

చీకటి వేకువగా 
గుండెగాని మండిందంటే పాట సాహిత్యం

 
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: 
గానం: శేఖర్ చంద్ర, కాల భైరవ 

గుండెగాని మండిందంటే

Palli Balakrishna
GOAT (2024)
చిత్రం: G.O.A.T (2024)
సంగీతం: లియోన్ జోన్స్ 
నటీనటులు: సుదీర్, ఆనంద్ బాయన, దివ్య భారతి 
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నిర్మాత: మోగుల్ల చంద్రశేఖర్ రెడ్డి 
విడుదల తేది: 16.02.2024Songs List:అయ్యో పాపం సారు పాట సాహిత్యం

 
చిత్రం: G.O.A.T (2024)
సంగీతం: లియోన్ జోన్స్ 
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: సీన్ రోల్దేన్ 

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరిందే
దురదృష్టం దుషమన్ లా
దుంపంత తెంచిందే

అయ్యో పాపం సారు
ఎట్టా బుక్కయ్యారు
లారీ గుద్దిన ఆటోలా
దెబ్బై పోయారు
అయ్యో పాపం సారు
ఇట్టా లాకయ్యారు
3డీ లో చూస్తున్నారు
హారర్ పిక్చరు

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరిందే
దురదృష్టం దుషమన్లా
దుంపంత తెంచిందే

వయోలెంటుగా ఉండేటి సారు
సైలెంటుగా వయోలినే వాయిస్తున్నారు
వాల్కోనోలా రోజు బ్లాస్ట్ అయ్యే వారు
బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు

సుకుమారీ కళ్ళల్లోకే చూస్తూ
చేతుల్లో చెయ్యేస్తు స్మైలే ఇస్తున్నారు
తొలిసారీ గుండెకి తలుపే తీస్తూ
వెల్కమ్ బోర్డే రాస్తూ
కం కం అంటున్నారు

అయ్యో పాపం సారు
పుట్టేసిందా ప్యారు
ఇస్రో ఇసిరిన రాకెట్లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడమ్ గారు
నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాలా
మెరుస్తు ఉన్నారు

తేదీలన్నీ మరిచి నీ మైకంలోనా
ఖైదీలా కూర్చోడం చాలా బాగుంది
నా లోకాన్ని విడిచి ఈ లోకంలోనా
మా లోకాన్ని అయిపోవడం ఇంకా బాగుంది

నా మనసే నీ ఊహల్లో నుంచి
ఎగిరి పోతున్న క్లిప్పే పెట్టేసావే
నా కలనే ఎప్పుడు చూడనని
రంగుల్లోన ముంచి, రెక్కలు తెప్పించావే

అయ్యో పాపం సారు
ఊర మాసుగుండేవారు
అంద్ధంలో ఫస్ట్ టైమ్
క్లాసిగా కనిపిస్తున్నారు

లుంగీ కట్టే వారు, కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం పెట్టేసి
గుడ్ బాయ్ అయ్యారు

ఏ సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

Palli Balakrishna
Naa Saami Ranga (2024)
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ 
దర్శకత్వం: విజయ్ బిన్నీ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 14.01.2024Songs List:ఎత్తుకెళ్ళి పోతావా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రామ్ మిరియాల 

ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా

రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా

బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బైటకడుగు పెట్టనంటవ భామా

రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా

(ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా
ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా)

బెల్లం సెరుకు సూపుల దాన
అల్లం మిరప మాటలదాన
బొండుమల్లి నడుము దాన
బండెడు సోకుల ఓ నెరజాన

నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ
నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ

ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి
నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి
ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే

నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి
మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే
నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి
చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే

ఎంత ఎంత, ఎంత ముద్దుగున్నావంటే
ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే
చందమామకే పిల్లలు పుడితే
హే, చందమామకే పిల్లలు పుడితే
నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే
(మరి అట్టా ఉంటె ఏం చేస్తాం)

ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

నా గుండెకోటలో రాణివి నువ్వంట
నా రెండు కాళ్ల పల్లకిలోనా
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి
పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందేనా సామిరంగా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ 

మా జోలికొస్తే మాకడ్డువస్తే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)
ఈ గీత తొక్కితే, మా సేత సిక్కితే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)

ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
ఒక్కరు అంటే… ఊరందరు
మా ఊరంటే… ఒక్కొక్కడు

మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

ఈ గాలిలో పౌరుషముంది
ఈ మట్టిలో పంథం ఉంది
ఈ నీటిలో ప్రేమా ఉంది

ఈ నీటిని తాగి, మట్టిని తాకి
గాలిని పీల్చి, ఎదిగిన ఈ దేహంలో

శ్వాస ఉన్నంత వరకు
విశ్వాసం ఉంటాది
ప్రాణమున్నంత వరకు
అభిమానం ఉంటాది

మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే

సామిరంగా… నా సామిరంగా
అరె సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగాదేవుడే తన చేతితో పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: యం.యం.కీరవాణి  
గానం: శాండిల్య పీసపాటి 

దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక బంధం

చిరునవ్వులు పూసే స్నేహం
చిరుగాలికి ఈల నా పాఠం
కడతేరని ఆనందంలో
కడదాకా సాగే పయనం

దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
ఏరా, ఒరే అనేటి ప్రాణమిత్రులు
పరాచకాలతోటి ఆటపాటలు

అన్నయ్య ఉంటే చాలుగా
ప్రాణాలు పంచే తీరుగా
కలిసింది పాలు తేనెలా
కలిపింది కాలం ప్రేమ పొంగేలా

దేవుడే తన చేతితో
రాసిన కమ్మని ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక అనుబంధం
దుమ్ము దుకాణం పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: సాహితి చాగంటి, కరిముల్ల, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ 

ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి

వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా
ముందుకు వచ్చిన వాళ్ళు
బంధుమిత్రులు అన్నదమ్ములు
పిల్లాపాపలు కుర్రమూకలు పెద్దొళ్ళు చిన్నోళ్ళు
ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసిన సందడి పేరే

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం

ఈలలు వేస్తారు
కొందరు గోలలు చేస్తారు
కేకలు పెడతారు
కొందరు అరుపులు అరిచేరు
ఈ అరుపులకన్నా కేకలకన్నా
అల్లరికన్నా గడబిడకన్నా

అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకులే
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకు మోతలే

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం

పనిస గరిగమగమపమగరిగమప
నిరినిస నిదమగరి గనిసమమగరి
మమగరి మమగరినిస
మమప నిసగమపనిస

చెట్టూ ఊగింది, ఆటకు చేనూ ఊగింది
పిట్టా ఊగింది, కోడిపెట్టా ఊగింది
ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప
తలుపు కిటికీ అన్నీ ఊగి…..

పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక
పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక

పాకింది చూడు, పాకింది చూడు
పాకింది చూడు

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణంఇంకా ఇంకా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: యం.యం.కీరవాణి 
గానం: సత్యయమిని, మమన్ కుమార్ 

ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే

తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే

నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ

ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే

తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే

నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీసీసా మూత ఇప్పు పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రేవంత్, మల్లికార్జున్, సచిన్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండిన్య 

పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే
ప్రేమ బండి చలో అంటే
రైస్ మిల్లు నెల జీతం
రై రైమని పెరిగిందంటే

ఫెవరేట్ హీరో బొమ్మ
హౌస్ ఫుల్లు పడిందంటే
ఇండియా కప్పు కొట్టుకొస్తే
ఇల్లాలే రాజీకొస్తే
పక్కింటోడికి లాసొస్తే
హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే

ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు

బోరు కొడితే బీరు కొట్టు
బాధ పడితే బ్రాందీ కొట్టు
ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు
మూడంతా పాడైపోతే
పై మూడు కలిపి కొట్టు

కట్టుకుందాన్తో కల్లే కొట్టు
అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు
సోదర సోదర అన్నోల్తో
సోడా కలిపి కొట్టు
రా రా పోరా అన్నోల్తో
రా గానే కొట్టు
మనకన్నా పెద్దోల్లొస్తే
మస్కా కొట్టు… సాటుగ మందే కొట్టు

మొదటి పెగ్గు ఎయ్యగానే
మత్తు కమ్ముకొస్తాది
రెండో పెగ్గు పడగానే ఒళ్ళు తేలిపోతాది
మూడు నాలుగైదు పెగ్గులు
గొంతులోకి దిగగానే…
నా సామిరంగ…
సిత్రాలే సిత్రాలు
నా సామిరంగ…

పెరటిలోని పిల్లి కూన బౌ బౌ అంటాది
నూతిలోని సేపపిల్ల సుట్ట కాల్చుతాది
సేతిలోని ఇసనకర్ర
సికెను ముక్కై పోతాది

మూలకున్న ఇసుర్రాయి
ఎండి కంచమే అది
తొంబై రూపాయల నోటు
జేబులోంచి జారుతాది
తొడుక్కున్న గల్ల లుంగీ
సొక్కా అయిపోతది

ఆ ముంగటేడు పోయిన
మా ముసలి తాత ఎదరకొచ్చి
ఏరా అబ్బీ..! తినలేదా, ఏమి తాగట్లేదా
బక్క సిక్కి పోయావు..! ఏందిరా ఇదీ?
అని పలకరిస్తాడు,
ప్రేమగ హెచ్చరిస్తాడు…

ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
అరెరెరె మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
ఆడి కంటికి ముక్కుకి సెవులకి
కాళ్ళకి మూతికి సేతులకి
దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి

ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు

ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు


Palli Balakrishna
Eagle (2024)
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత: T.G.విశ్వప్రసాద్
విడుదల తేది:09.02.2024Songs List:ఆడు మచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని
ఒకే చరుపు గప్ చుప్
ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా

ఏ పిడికిలెత్తి పిడుగులన్ని
కొట్టే దుముకు తీన్ మార్
కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా

అబ్బా మన సామిని కూడా
డాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం
వీడు జడల గడుల జగడం
తెగిన తగన హగణం
గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే
ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే

యో కొంచం బీటు పెంచురోయ్

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడోగల్లంతే గల్లంతే పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, లిన్ (Lynn)

ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే
తడబడే అలజడే

కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు
పలికిన వేగమా
వధువుకి వరునికి శుభమని
తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు
వెలిగిన హోమమా
విడి విడి మనసులు కలుపుతు
ఒకటవు ప్రాణమా

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా నిల్చుండి పోయే
బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులేEagle On His Way పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: Georgina Matthew
గానం: Georgina Matthew

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye
Its Your Goodbye

Yeah Yeah
Breathe Your Last Breath
Your Screams On My Mind
Time To Die You Be Alone
Time To Die

Cry to Mama
Save My Life
This Eagle On His Way

Cry To Mama
Breathe Your Last
This Eagle Wants His Prey

Cry To Mama Cry Goodbye
This Eagle On His Way
Cry To Mama Breed And Die
This Eagle Kills His Prey

He Is A Goddamn Shooter
Ya Ya Ya
Time To Die
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You
గరుడం పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: చైతన్య కృష్ణ 
గానం: శ్రీ కృష్ణ 

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

Palli Balakrishna
Saindhav (2024)
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: వెంకటేష్, ఆర్య, శ్రద్ధా శ్రీనాద్, రుహని శర్మ, అండ్రియ జర్మియా
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి 
విడుదల తేది: 13.01.2024Songs List:బుజ్జికొండవే పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యస్.పి.చరణ్

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే, నీ సంతోషమే
నను నడిపించే బలమే.

చిట్టి తల్లి నీవే పుట్టుకంటె నీదే,
దేవతల్లే నన్నే చేరుకుంటివే,
గుండెపట్టనంత ప్రాణమంటే నీవే,
నాన్న లాగా నన్నే ఎంచుకుంటివే,

ఓ చంటిపాపనై
నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే
నా ఆయువంత నువ్వు అందిపుచ్చుకుని
చిందులాడవే

బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే…

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే…

ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవే

లోకాన పూసే ప్రతి నవ్వు తీసి
పువ్వుల దండ చేసి నీకందించనా
నీకై కన్నకలలా ఉంది జీవితం
ప్రతి ఋతువు నీకై తేవాలి వసంతం

నా ఆనందాలకి అద్దం పట్టిన
కంటి చెమ్మవే
నా అదృష్టాలన్నీ భూమికి దించిన
బుట్ట బొమ్మవే
నా గుండెపైన చిందులాడ వచ్చిన
జాబిలమ్మవే.

బుజ్జికొండవే… నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే

(ప్లీజ్ నవ్వు నాన్న)
ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవేసింపుల్ జెంటిల్ పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కార్తీక్ మనివాసగం 
గానం: కార్తీక్ మనివాసగం 

సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ
గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ

సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ
గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ
లెక్క మారుద్దిరా పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: పృద్వి చంద్ర

రగిలే క్రోధము, నడిచే యుద్ధము
జననం భస్మం నుండేలే
అరె ఎవరాసిద్ధము, మరణము తథ్యము
అతడే మృత్యువులే

పగ పగ సెగ సెగ పోరే నీదా
ధగ ధగ యుగాలుగా తీరే పోదా

చెడునిక ఆపెయ్
నరకము చూపే… నవ సైంధవుడే
నవ సైంధవుడు, నవ సైంధవుడూ

ఆట మొదలయే వేట మొదలయే
రక్త మడులు పారే
జాత మొదలయే, కోత మొదలయే
కొత్త పదునుతోనే

పగ పగ సెగ సెగ పోరే నీదా
ధగ ధగ యుగాలుగా తీరే పోదా
చెడునిక ఆపెయ్
నరకము చూపే కలి సైంధవుడే

కొంచెం బెదరడే
లక్ష్యం విడువడే
అష్టం కొలవడే
మంత్రం అలవడే

పడి పడి ఎగబడి
కలబడి ముట్టడి
వదలడులే ఇకా
అరె కుదరదు కట్టడి
బతకరు తలబడి
నిలబడిపోకా

మరి ఎదురుగ నిలబడి
సిగబడె సత్తువిది మిగలదులేమ్మా
అరె చెదిరిన లెక్కను
కుదురుగ మార్చెడి కుదుమిది దెబ్బా
లెక్క మారుద్దిరా నా కొడకల్లారా..!

ధగ ధగ యుగాలుగా తీరే పోదా
సరదా సరదా పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి

శ్రద్ధ: ఏం చేసావ్ ఈరోజంతా?
వెంకీ: మధ్యాహ్నం మోడీ గారితో మీటింగ్ అయింది. దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చి వచ్చా,ఊ..! లేకపోతే నేనేం చేస్తాను. హహహ.
శ్రద్ధ: ఆపకు, మాట్లాడుతునే ఉండు. బావుంటది, నువ్ మాట్లాడితే.
వెంకీ: నా వయసెంతో తెలుసా..?
శ్రద్ధ: ష్… ఇదా నేను మాట్లాడమంది..!
బేబీ సారా: నాన్న
వెంకీ: హే, నిద్రపోలేదా బంగారం. ఊ, దా దా
బేబీ సారా: ఆంటీ, నువ్వు మాతోనే ఇక్కడ ఉండిపోవచ్చు కదా..! రోజు మీ ఇంటికి ఎందుకు వెళ్తావ్.
వెంకీ: మను ఆంటీ కొన్ని రోజుల తర్వాత మనతోనే ఉంటుంది. ఏమంటావ్ మను ఆంటీ?
శ్రద్ధ: అంతే..!
వెంకీ: అంతే. ఊ, అంతే

ఎగిరే స్వప్నాలే మనం
మనదే కాదా గగనం
సిరివెన్నెలలో తడిసే గువ్వలం
చిరునవ్వులలో చననం

ఇది చాల్లే… ఇంతే చాల్లే
ఇదిలా నిత్యం ఉంటే చాల్లే
ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా
ఊపిరిలో సుమగంధాలే

సరదా సరదా
సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

కలలా ఉందేంటీ నిజం
నిజమేనందీ నయనం
మనకే సొంతం అవునా ఈ వరం
విరబూసింది హృదయం

అందాల పూల వందనాలు
చేసే రాదారులే
తల నిమురుతున్న
పలకరింపులాయె చిరుగాలులే

ఈ ఉల్లాసమే మనకో విలాసమై
మనసంతా చిందాడిందే

సరదా సరదా
సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

ఆనందమే అరచేతులా
వాలిందిలా పసిపాపలా
ఒక గుండెలో
ఈ మురిపెమంతా బంధించేదేలే
కరిగి ఆ వానవిల్లే ఇలా
రంగుల్లో ముంచెత్తగా
ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల

సరదా సరదా
సరదాగా సాగిందీ సమయం
మనసు మనసూ దూరాలే మటుమాయం
మనకు మనకూ పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధంరాంగు యూసేజూ పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజీజ్

రేయ్, అరె బాధలలోనే
తెగ ఏడుపులోనే
నువు తాగుతున్నావ్ రా
రేయ్ దిల్ కుషీ కుషీలోనే
భల్ చిందులతోనే
నువ్వు తాగి చూడరా

ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
కుషీనే డబల్ చేస్తావా
లేక బాధనే డబల్ చేస్తావా, హా
ఏడుపే డబల్ చేస్తావా
ఏసే చిందునే డబల్ చేస్తావా, ఆ ఆ ఆవ్

చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
మందుని చెయ్యద్దురా రాంగు యూసేజ్
రాంగ్ యూసేజ్, రాంగ్

దునియాలో అందరికీ
దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని
సివరికి నీకు నువ్వు దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్లే నీకు జైలు సెల్లయిందే

రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు

పైసలనే నువ్వు వాడుకోవాలే
బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే
మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే
కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే, హ

చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు ||2||

నీలో తెలివే… నీకు బానిసవ్వాలే
ఆ తెలివే తెలివి మీరి
అతి తెలివిగ అది మారి
నీ బానిసకే నవ్వు బానిసయ్యావే

రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు

చెడు అన్నది నేడు మంచి ఫ్యాషనయిందే
మంచి మాసెడ్డగ బోరు కొట్టిందే, ఏ ఏ ఏయ్
మంచి టైమ్ తీరిపోయి
చెడు వైపే జారిపోయి
లైఫులోన లైటన్నది ఆరిపోయిందే

రేయ్, రాంగు రాంగు రాంగు రాంగు
చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు
అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యకు చెయ్యకు చెయ్యకు
చెయ్యకు రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు లైఫుని
చెయ్యకు రాంగు యుసేజు

Palli Balakrishna
Gadasari Atta Sogasari Kodalu (1981)
చిత్రం: గడసరి అత్త సొగసరి కోడలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, భానుమతి 
మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు
విడుదల తేది:04.08.1981

Palli Balakrishna Friday, February 9, 2024
Hare Krishna Hello Radha (1980)
చిత్రం: హరే కృష్ణ హల్లో రాధ (1980)
సంగీతం: విజయభాస్కర్
నటీనటులు: కృష్ణ, శ్రీప్రియ, రతీ అగ్నిహోత్రి
దర్శకత్వం: C.V. శ్రీధర్
నిర్మాత: బి.భరణి రెడ్డి
విడుదల తేది:16.10.1980

Palli Balakrishna
Ragile Hrudayalu (1980)
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి
నటీనటులు: కృష్ణ, జయప్రద, మోహన్‌బాబు
దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
నిర్మాతలు: సనత్ కుమార్, నారాయణబాబు
విడుదల తేది: 29.08.1980Songs List:అల్లిబిల్లి అల్లుకున్న వయసులో పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి
ఈ వేళా ఏదో కసి పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  వేటూరి
గానం: యస్. జానకి

ఈ వేళా ఏదో కసి నాలోనే వింత ఖుషి కళ్ళలో మాటేసి ఒళ్ళంతాఏం పట్టు ఏందా పట్టు పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి
దామ దా భౌ భౌ అనకే పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లిమొటిమ పుట్టుకొచ్చిందోయి పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననేకొల్లెట్లో పడ్డాక కొరమీను పట్టాక పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే హృదయాలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొల్లెట్లో పడ్డాక కొరమీను పట్టాక

Palli Balakrishna Tuesday, February 6, 2024
Sirimalle Navvindi (1980)
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ
నటీనటులు: కృష్ణ, చంద్రమోహన్, సుజాత, మోహన్ బాబు
దర్శకత్వం: విజయ నిర్మల 
నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎం.ఎస్.భాస్కర్
విడుదల తేది: 07.07.1980Songs List:చూస్తున్నానని నువ్వు చూస్తావని పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

చూస్తున్నానని నువ్వు చూస్తావని
ఎగిరొచ్చినా కో చిలకమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

ఎగిరొచ్చినా కో చిలకమ్మఒక పువ్వు పూచింది పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

ఒక పువ్వు పూచింది
గూడొదిలి వచ్చావే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

గూడొదిలి వచ్చావే గువ్వాయే అమ్మ కూతురో పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

యే అమ్మ కూతురోఈడొస్తే ఇంతే నమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ

ఈడొస్తే ఇంతే నమ్మో

Palli Balakrishna
Adrushtavanthudu (1980)
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: జి.సి.శేఖర్ 
నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్ 
విడుదల తేది:19.05.1980Songs List:అమ్మదొంగా నా సామిరంగ పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అమ్మదొంగా నా సామిరంగ దొరికాడురా దొంగఇది విస్కీ ఇది బ్రాంది పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

ఇది విస్కీ ఇది బ్రాంది అది సారా మనసారా కలిపికొట్టరా కావేటి రంగాచినుకు చినుకు పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది 
చుర చుర చూపుల సుబ్బమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

చుర చుర చూపుల సుబ్బమ్మ చిరుబురులాడకె చుక్కమ్మ నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, బృందం

నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగ వస్తావో అప్పలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యం. రమేష్, పి.సుశీల, కె.చక్రవర్తి 

వస్తావో అప్పలమ్మో చెక్కేదాము చెన్నెపట్నం

Palli Balakrishna
Devudichina Koduku (1980)
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు 
విడుదల తేది: 14.02.1980Songs List:కొండపల్లి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

కొండపల్లి బొమ్మనీ మనసులో ఏమున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

నీ మనసులో ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగానిమరుమల్లె తోడుంది పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మరుమల్లె తోడుంది 
బొట్టుపెట్టిన కాటుకెట్టిన పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన మళ్ళి 
రావిచెట్టెక్కావు రాగాలు తీశావు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

రావిచెట్టెక్కావు రాగాలు తీశావు మా మంచి చెల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు నవ్వమ్మా 

Palli Balakrishna
Simha Garjana (1978)
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, లత, గిరిబాబు, మోహన్ బాబు, శరత్ బాబు
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
నిర్మాతలు: మాగంటి వెంకటేశ్వర రావు, యర్రా శేషగిరిరావు
సమర్పణ: గిరిబాబు
విడుదల తేది: 26.08.1978Songs List:అమ్మా రావే తల్లీ రావే పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు

అమ్మా రావే తల్లీ రావే కొండపల్లి బొమ్మా రావే తొలకరి సొగసులు పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే కత్తులు కలిసిన సుభాసమయంలో పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: చంద్రశేఖర్, జి. ఆనంద్, కౌసల్య, యస్.పి.బాలు, విజయలక్ష్మీ శర్మ 

కత్తులు కలిసిన సుభాసమయంలో 
సాహసమే మా జీవమురా పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: జి. ఆనంద్,  యస్.పి.బాలు

సాహసమే మా జీవమురా సాహసమే మా వేధమురాఅమ్మా దుర్గా మాత పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: పి.సుశీల 

అమ్మా దుర్గా మాతఓహో గులాబీలు నాకై పూచెరా పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఓహో గులాబీలు నాకై పూచెరా

Palli Balakrishna Saturday, February 3, 2024
Cheppindi Chestha (1978)
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
మాటలు, పాటలు: రాజశ్రీ
నటీనటులు: కృష్ణ, జయచిత్ర, నరసింహరాజు, కవిత
దర్శకత్వం: యస్. యస్. గోపీనాథ్ 
నిర్మాతలు: Dr. A.V.కృష్ణారెడ్డి, Dr. T.V.మోహనరంగా రెడ్డి, Dr. S.D.అహ్మద్, Dr. C.నటేషన్, M.A. అజీజ్
నిర్మాణ సంస్థ: సరోజినీ ఆర్ట్స్
విడుదల తేది: 21.09.1978Songs List:హ్యాపీ బర్త్‌డేపాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

హ్యాపీ బర్త్‌డే చిన్నదాని పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ

చిన్నదాని కోటి ఊహల పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కోటి ఊహల 
ఆడాలా పాడాలా పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి.సుశీల, విజయలక్ష్మి శర్మ 

ఆడాలా పాడాలా ఒకానొక్క కన్నె పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

ఒకానొక్క కన్నెకన్నె పిల్లల్లం పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ

కన్నె పిల్లల్లం 

Palli Balakrishna
Dongala Veta (1978)
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ దాశరథి, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, మైలవరపు గోపి 
గానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.బాలు 
నటీనటులు: కృష్ణ, జయప్రద 
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ 
నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు 
విడుదల తేది: 14.07.1978Songs List:వెళ్లాయమ్మ పదహారు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల 

వెళ్లాయమ్మ పదహారు 
హాయ్ ముందుంటే కుమ్మింది కోపం పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

హాయ్ ముందుంటే కుమ్మింది కోపం నా కనులే నీ కనులై పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నా కనులే నీ కనులై 
గోపాల పలుకే బంగారమా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల 

గోపాల పలుకే బంగారమా ఓహో కాలసర్పం నేనే పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.జానకి 

ఓహో కాలసర్పం నేనే మహిమలు చూపే మాయాలమారికి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల వేట (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: యస్.జానకి 

మహిమలు చూపే మాయాలమారికి

Palli Balakrishna Thursday, January 25, 2024
Dongala Dopidi (1978)
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీశ్రీ, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ, యస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి, జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్, వసంత
నటీనటులు: కృష్ణ, మురళీమోహన్,  శ్రీధర్, మోహన్‌బాబు, గిరిబాబు,  శ్రీప్రియ, కాంచన, ప్రభ, కె.వి.చలం, రాజబాబు, రమాప్రభ
దర్శకత్వం: యం. మల్లికార్జున రావు 
నిర్మాత: యు. సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 12.05.1978Songs List:ఆ కొండ గుండెల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జి. ఆనంద్, 

ఆ కొండ గుండెల్లోన ఓహో ఆగమేఘాల మీద పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, జి. ఆనంద్

ఓహో ఆగమేఘాల మీద స్నేహమే వెలుగు బాట ఓలోలె ఎమాయనే ఇది పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి

(ఈ పాటని  శ్రీప్రియ, కాంచన పై చిత్రీకరించారు)

ఓలోలె ఎమాయనే ఇది ఉండుండి మొదలాయేనే
రాసుకో పూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

రాసుకో పూసుకో తబలా దరువే మోతరా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: యస్.జానకి, రాజబాబు

తబలా దరువే మోతరాతప్పెట్లే మోగాయి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ, జి. ఆనంద్, వసంత

తప్పెట్లే మోగాయి
తందానా అందామా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ

తందానా అందామా 
తాళం కప్ప పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి, మాధవపెద్ది రమేష్

తాళం కప్ప
కొండైన బండైన పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల దోపిడి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జి. ఆనంద్

కొండైన బండైన 

Palli Balakrishna
Manassakshi (1977)
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: కృష్ణ, భారతి, గిరిబాబు ఉమారాణి, జగయ్య, షావుకారు జానకి, కాంతారావు, త్యాగరాజు, మిక్కిలినేని, నగేష్, జ్యోతిలక్ష్మి   
దర్శకత్వం: పి. సాంబశివరావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు
నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్
విడుదల తేది: 02.12.1977Songs List:నిర్ణయం విధి నిర్ణయం పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరధి
గానం: జె.వి.రాఘవులు 

నిర్ణయం విధి నిర్ణయం నువ్వు నవ్వితే ఈ తోటంతా పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నువ్వు నవ్వితే ఈ తోటంతా కోటి పూలతో నవ్వుతుందిలేకళ్ళల్లో ఎన్నెన్ని కలలో పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

(ఈ పాటని  "గిరిబాబు, ఉమారాణి" పైన చిత్రీకరించారు)

కళ్ళల్లో ఎన్నెన్ని కథలో
నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు వచ్చానని వయసేమో కబురంపింది పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల

అరెరె వచ్చానని వయసేమో కబురంపింది

Palli Balakrishna
Savasagallu (1977)
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి.రఘవులు
నటీనటులు: కృష్ణ, జయచిత్ర, ప్రభ 
దర్శకత్వం: బోయిన సుబ్బారావు 
నిర్మాత: డి.రామానాయుడు 
విడుదల తేది: 16.02.1977Songs List:అండపిండ బ్రహ్మాండముల (పద్యం) సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు 

అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం)
ఆనంద ఆనందమాయే పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే ఈ లోకం ఒక నాటకరంగం పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు 

ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం 
కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు జాగేల ఏలారా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కోవెల శాంత, జె.వి.రాఘవులు

జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో తోక్కుడుబండి ఓ లబ్బారుబండి పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల బృందం

తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు
బంగారు తల్లివి నీవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల,మాధవపెద్ది, పిఠాపురం

బంగారు తల్లివి నీవమ్మా
శివా శివా భవా భవ పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు

శివా శివా భవా భవ యువా నన్ను కావరా 
అమ్మల్లారా అక్కల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: మోదుకూరి జాన్సన్
గానం: పి.సుశీల బృందం

అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు

Palli Balakrishna Sunday, January 21, 2024

Most Recent

Default