Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yatra 2 (2024)




చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: ముమ్మట్టి, జీవ,  కేతకీ నారాయణ్, Suzanne Bernert
దర్శకత్వం: మహి. వి. రాఘవ్
నిర్మాత: శివ మేక
విడుదల తేది: 08.02.2024



Songs List:



ప్రజా సంకల్ప యాత్ర పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కపిల్ కపిలన్ 

ప్రజా సంకల్ప యాత్ర 




భగ భగ మండే పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దీపక్ బ్లూ

భగ భగ మండే 



తొలి సమరం పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: గౌతం భరద్వాజ్ 

ధమ్మే ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం
ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం… తలపడదాం

ధమ్మే… ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం భయపడం
ఎలుగెత్తిన భాస్వర స్వరమే మనం
(ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం)
ఇది భళ్ళున పెళ్లున పేలిన మౌనం

ఓ ఓ, ఎదురన్నది ఎవరైనా
ఎదిరిద్దాం తలవంచేదే
లేదని చెబుదాం
సయ్యంటు బరిలో దిగుదాం
తొలి గెలుపు జెండా ఎగురేద్దాం

జంకేదే లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చు మీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం

హే, అనివార్యం ధిక్కారం
అవసరమే ఈ సమరం

ఇది సూన్యం పెను సూన్యం
పరీక్షించెనే సమయం
తడబడకన్నది మనోనిశ్చయం
కొనసాగాలి సేవాకార్యం
ఆగిపోరాదుగా ఆశయం
జనమే ధైర్యం, జనమే సైన్యం

ఇక అంతరాయమే లేని
గమనమే గమ్యం

అనుమతులు పరిమితులు ఇక చెల్లే
ఏదైతే కాని పయనం కదిలే
సందేహమే లేదు అసలే
మన విజయం ఇక్కడి నుండి మొదలే

జంకేది లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చుమీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం





చూడు నాన్న పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: విజయ్ నారాయణ్ 

చూడు నాన్న
చూస్తున్నావా నాన్నా
నీడ లేని నేనా వీళ్ళ ధీమా
ఏమిటీ ఇంతటి ప్రేమా

నా దారెటో తోచకుంటే
నీ వెంబడే మేము అంటూ
కదిలారు ఏంటో ఆ నమ్మకం
నేనెలా ఒడ్డుకి చేరడం
వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం

ఇంటి పెద్దా కన్నుమూస్తే
అయినవాళ్ళు అనాధలే కదా
నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు
అనాధ అవ్వడం ఏందయ్యా
ఇది ఏనాడు జరిగుండదయ్యా
ఓ పెద్దయ్యా

ఇందరి కన్నులు
చిమ్మే కన్నీటినంతా
తుడవాలనుంది కొడుకుగా
అందుకు అవసరమయ్యే
కొండంత ధైర్యం నాకు ఇవ్వవా

నేనెలా బాధని మింగడం
వీళ్ళనెలా నే ఓదార్చడం

ఎంతలా అభిమానమే
కురిపిస్తున్నారో ఈ జనం
అందుకే ఈ జన్మలో
తీర్చేసుకుంటా ఈ రుణం
గడపకి ప్రతి గడపకి
నేనవుతా రక్షా తోరణం
మాటపై ఉంటానని
చేస్తున్నా తొలి సంతకం

చూడు నాన్న (x8)

Palli Balakrishna Sunday, August 11, 2024
Gaami (2024)




చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్
నటీనటులు: విశ్వక్‌సేన్‌, చాందిని చౌదరి,
అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద
దర్శకత్వం:విద్యాధర్‌ కాగిత
నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌
సహ నిర్మాత: శ్వేతా మొరవనేని
విడుదల తేది: 08.03.2024



Songs List:



గమ్యాన్నే చేధించే పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: అనురాగ్ కులకర్ణి,  స్వీకర్ అగస్తి, సుగుణమ్మ 

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపద

కాలకూటమైన ఈ తీపి స్పర్శ
అమృతంగా మారే దారుందా ఈషా
తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా
జీవమున్న చావు పొందిందా శ్వాస

బేతాళ ప్రశ్నేదో వాలిందంటే
బదులిచ్చి తీరాలి కాదా
లోనున్న భయమంటూ పోవాలంటే
దాగున్న సత్యాన్ని వెతకాలంటా

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే ఛేదించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం
చూసి చూడనట్టే ఉంటుంది లోకం
జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం
నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం

కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా
ఎదురీది చేరాలి ఒడ్డు
దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా
ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా



శివం పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ 

నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు కదా

హే మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివమ్
శివమ్ శివమ్ శివం

నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

నీతో నిను వెతికేది
నీలో నిను కలిపేది
అన్వేషణ నీ కొరకను
సంఘర్షణ ఆది ఇది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహనానికే అది తీర్చే
చుక్కాని దొరికిందిరా

నీ నిన్నల్లోని గాయాలే
నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న
మరణాన్ని చెరిపెయ్యరా

జీవం నీలోనే ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెళ్ళి
మోక్షాగామివవ్వరా

చావైనా సిద్ధం శివమ్
ప్రాణంకై యుద్ధం శివమ్
నీలానికి సంకెల శివమ్
శివమ్ శివమ్ శివం

బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో
ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో

లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి
మోక్షగామివవ్వరా

హే మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువుకే రక్షే శివం శివం
శివమ్ శివమ్ శివం

హరహర హరహరా
హరహర హరహరా




అరిరారో పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక 
గానం: హరిణి ఇవటూరి 

అరిరారో 


Palli Balakrishna
Bhimaa (2024)




చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
నటీనటులు: గోపీచంద్, ప్రియ భవాని శంకర్, మాళవిక శర్మ
దర్శకత్వం: ఏ. హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్‌
విడుదల తేది: 08.03.2024



Songs List:



హర హర శంబో పాట సాహిత్యం

 
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: కళ్యాణ్ చక్రవర్తి, రవి బస్రుర్, విజయ్ ప్రకాష్ 

హర హర శంబో




The Rage of Bhimaa పాట సాహిత్యం

 
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: రవి బస్రుర్, సంతోష్ వెంకీ

The Rage of Bhimaa




గల్లీ సౌండుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: భీమా (2024)
సంగీతం: Ravi Basrur
సాహిత్యం: సంతోష్ వెంకీ, రవి బస్రుర్
గానం: సంతోష్ వెంకీ 

గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా

ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా

సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు

బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా

మాన్స్టర్ వీడు
ఫుల్ లోడెడ్ మిషన్ గన్ ఈడు
సైలెంట్గా ఉన్న
యమరాక్షషుడు

రేయిర్ ఈ బ్రీడు
హై వోల్టాగేజు
షార్ట్ టెంపెర్రు
ట్రెండ్ ఇక వీడు
వ వ వ సూపర్

ఎదురంతా డేంజర్ గా వున్నా
అది ఢీకొడతాడు ఈ చిన్న
ఆ దేవుడి గుణమే వున్నా
ఎంతో కరుణామయుడు డు డు డు

సిద్ధాంతాలెన్నో ఉన్న
వేదాంతలెన్నో విన్నా
ఏ పంథాలొద్దని అన్న
మాటవినాడు ఈ మొండోడు

గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా

ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా

సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు

బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా




ఏదో ఏదో మాయా పాట సాహిత్యం

 
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా

అందం కావాలంటే
అడగాలేమో నీ ఛాయా
నిను చెప్పాలంటే
భాషల్లోనా పోలికలున్నాయా

ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ

ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా ఆ ఆ

నిజమా నీతో ఇలా ఉన్నాను
నమ్మలేని ఇది వరమా
అహమా రాకే ఇలా
కాసేపు ఇంకా చాలు అనగలమా

క్షణాలపై ఈ జ్ఞాపకం
నూరెళ్లపై నీ సంతకం
మోమాటమే ఓ పాటగా
మార్చేసిన నీదే దయా

ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ

ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా

ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ

Palli Balakrishna
Double ISMART (2024)




చిత్రం: డబుల్ ఇస్మార్ట్ (2024)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్యా థాపర్ 
దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ 
విడుదల తేది: 15.08.2024



Songs List:



స్టెప్పమార్ పాట సాహిత్యం

 
చిత్రం: డబుల్ ఇస్మార్ట్ (2024)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి 

స్టెప్పమార్



మార్ ముంత చోడ్ చింత పాట సాహిత్యం

 
చిత్రం: డబుల్ ఇస్మార్ట్ (2024)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ, ధనుంజయ్ సీపాన


కలకత్తా मीटा पान లెక్క
मस्तू గున్నవ్ గాని పోరీ
నే బగరుకత్తా బాబా जरदा
తట్టుకుంటవా चोरी
అమ్మ నీ యమ్మ
బోరాన్ బోరానుందిరా పోరి
అరే మనమే అనుకున్నా
ఇది గూడ brand-eh రా भाई
నాగ నాగ నాగ
నాగపూరి సత్రా
నలిపేస్తా రాయే
నా తప్పా చౌబుత్రా
నాగ నాగ నాగ
నాగపూరి సత్రా
ఆగ ఆగమయ్యి
పడతలేదు నిద్ర

నువ్ గంత గింత కాదు
అసలే double e-smart-u
నీ జోరు చూస్తే
గూడ్సు రైలు గుద్దుకున్నట్టు
నువ్వు పూల పూల
అంగి ఏసి ఇ-style గొట్టు
Old city ఊగిపోదా
Old funk తాగినట్టు

సైసాబాద్ పూసలేసుకున్న పిల్లా
పూసుకుంట నిన్ను చార్మినారు సెంటులా
సీస లెక్క ఉన్న shape చూస్త మల్లా
పిస్స పిస్స అయితాందే నా दिल-uలా
ఏం జేద్దమంటవ్ మరి
मार ముంతా छोड़ చింతా
(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)
(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)
Yo boys సీసా మూత తీసి
Glassలో మందు పోసెయ్
గటా గటా తాగించ్
Enjoy పండుగో
Enjoy పండుగో
ఓ प्यारी తోటాపరి
బొమ్మల నడుమ బొట్టు ఏదే
ధార్కారీ నా శంకరీ
నీ గుండెల పైన అంటుకుందే
నడిమిట్లున్న నడుమట్ల తిప్పకే
మునుపట్ల శెక్కరొచ్చిందే
షం షేర్ అంటూ నడిసొస్తాంటే
Center లా టక్కరయ్యిందే
ఎర్ర ఎర్ర ఎర్రగున్న సెంపలల్లా
సిర్ర గోనే ఆడమంది సిగ్గుబిళ్ల
సుర్ర సుర్ర సుర్రుమంటూ సూడు పిల్లా
ఉండుండి కాలుతాందే కాకరపుల్లా
ఏం జేద్దమంటవ్ మరి
ఇగ చెప్తా చూడు
मार ముంతా छोड़ చింతా
(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)
(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)
Yo boys సీసా మూత తీసి
Glassలో మందు పోసెయ్
గటా గటా తాగించ్
Enjoy పండుగో

(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)
(मार मार मार मार मारो ముంతా)
(छोड़ छोड़ छोड़ छोड़ छोडो చింతా)



క్యా లఫ్దా పాట సాహిత్యం

 
చిత్రం: డబుల్ ఇస్మార్ట్ (2024)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
గానం: ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాసన్

క్యా లఫ్దా




బిగ్ బుల్ పాట సాహిత్యం

 
చిత్రం: డబుల్ ఇస్మార్ట్ (2024)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: పృద్వీ చంద్ర, సంజన కల్మన్జీ

బిగ్ బుల్

Palli Balakrishna
Mr. Bachchan (2024)




చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: రవితేజా, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు 
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్ 
విడుదల తేది: 15.08.2024



Songs List:



సితార్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: సాహితి 
గానం: కొమండూరి సమీరా, శ్రీరామ్ భరద్వాజ్ 

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా

నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే

నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా

పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల
మేఘాలన్నీ తాకెయ్‍నా

ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా

గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా హే హే

సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా

వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా

నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన

నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే




రెప్పల్ డప్పుల్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ 

ఓ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఉస్కో అని అంటే చాలు
డిస్కోల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే

తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్‌ బందీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా
ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా

నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
చాప దిండు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఆ సీరాకొంగు అంచు సివర
నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా

సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా

ఆ నడి ఎండల్లోనా
వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా

వేడి సల్లగుండా
మోయగా వరంగా
హత్తుకోని ఎత్తుకోవే
ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ



జిక్కి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, రమ్యా బెహ్రా 

అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

ఆ నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ

చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే

తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో

వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం

సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా

సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే

నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ తీరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా

నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా దూరంగా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే 

Palli Balakrishna
Manamey (2024)




చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య 
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల తేది: 07.06.2024



Songs List:



ఇక నా మాటే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

ఇక నా మాటే



ఓ మనమే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, గీతామాధురి

ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం
రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన

తెలిసేలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight

Youre My Rise
Youre My Shining Heart
In The Dream

అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా

అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా




టప్పా టప్పా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్

టప్పా టప్పా




భూం భూం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, శీరత్ కపూర్

భూం భూం




నీ స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేశం అబ్దుల్ వహాబ్

నీ స్నేహం 



జానీ జానీ యస్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: విజయ్ ప్రకాష్ 

జానీ జానీ యస్ పాప




చిన్న బాబు పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్

చిన్న బాబు 



ఓ మహియా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: హారిక నారాయణ్ , హేశం అబ్దుల్ వహాబ్

ఓ మహియా 



అతిలోక కోమలాంగి పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: అరవింద్ వేణుగోపాల్, హేశం అబ్దుల్ వహాబ్

అతిలోక కోమలాంగి 




సమ్మోహన పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్, హేశం అబ్దుల్ వహాబ్

సమ్మోహన  




చేరువైనా నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

చేరువైనా నీవే 



World of Manamey పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్
గానం: రోల్ రైడ, సాహితి చాగంటి 

World of Manamey

Palli Balakrishna Saturday, August 10, 2024
Pushpa 2: The Rule (2024)




చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ 
విడుదల తేది: 06.12.2024



Songs List:



పుష్ప పుష్ప పాట సాహిత్యం

 
చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజీజ్, దీపక్ బ్లూ

పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
దేశం దద్దరిల్లే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
భూమే బద్దలయ్యే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
నువ్వు నిలవాలంటే ఆకాశం
ఎత్తే పెంచాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
లోతే తవ్వాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు వుంటే నీదే తప్పవదా
పెద్ద గద్దలాగమబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి
కాళ్ళ కింద కురిసెయ్‍దా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంటా
వణుకే రాదు ఓటమి రాదు
వెనకడుగు ఆగడము
అస్సలు రానే రాదు
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం కొన్ని లేవంటా
భయమే లేదు బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు

ఎయ్ దండమెడితే దేవుడికే
సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా
తల దించినావా బానిసవి
ఎత్తినావా బాద్‍షావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా
ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే

హే వాడు నీకు గొప్పే కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
నీ పేరే నీ బ్రాండు
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
అస్సలు తగ్గేదెలే



సూసేకి అగ్గిరవ్వ మాదిరే పాట సాహిత్యం

 
చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా ఘోషాల్

వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు

వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు

ఓ ఓ మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి

హో ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు

కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు

అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి

హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు

బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ

Palli Balakrishna Monday, August 5, 2024
Devara: Part 1 (2024)




చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
నటీనటులు: యన్.టి.ఆర్, జాన్వి కపూర్
దర్శకత్వం: కొరటాలశివ 
నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ 
విడుదల తేది:27.09.2024



Songs List:



Fear Song సాహిత్యం

 
చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనిరుద్ రవిచందర్

అగ్గంటుకుంది సంద్రం
ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
ఏహా
చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా

దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ




చుట్టమల్లే చుట్టేస్తాంది.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శిల్పా రావు

చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు...
అస్తమానం నీలోకమే నా మైమరపు..
చేతనైతే నువ్వే నన్నాపు...
రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా..
నీ కోసం వయసు వాకిలి కాశా..
రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా..
నీ రాకకు రంగం సిద్దం చేశా..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..

చరణం 1
మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి..
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి..
ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి..
చెయ్యరా ముద్దుల దాడి.. ఇష్టమే నీ సందడి..
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి..
రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే..
నీ కౌగిలితో నన్ను సింగారించు..
రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే..
నా తిప్పలు కొంచెం ఆలోచించు..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..

Palli Balakrishna
Saripodhaa Sanivaaram (2024)

Image Source Link



చిత్రం: సరిపోదా శనివారం (2024)
సంగీతం: జాక్స్ బిజోయ్ 
నటీనటులు: నాని, ప్రియాంక మోహన్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ 
నిర్మాత: డి.వి.వి.దానయ్య 
విడుదల తేది: 29.08.2024



Songs List:



గరం గరం పాట సాహిత్యం

 
చిత్రం: సరిపోదా శనివారం (2024)
సంగీతం: జాక్స్ బిజోయ్ 
సాహిత్యం: శానాపతి భరద్వాజ పాత్రుడు
గానం: విషాల్ దల్దాని

గరం గరం 



ఉల్లాసం ఉరికే ఎదలో పాట సాహిత్యం

 
చిత్రం: సరిపోదా శనివారం (2024)
సంగీతం: జాక్స్ బిజోయ్ 
సాహిత్యం: సనారే
గానం: సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల 

అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా గుండెల్లో ఏదో వాలే వాలే
వేషాలే మార్చే నాలో ఆవేశాలే
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ మైకంలో ప్రాణం తేలే తేలే
ఏమిటో తెలియదు ఎందుకో
మనసు నిన్నలా నేడు లేదే
కారణం తెలుసుకోవడానికని
పిలిచినా పలకదే

ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో
మౌనాలే మన ఊసులలో
మాటే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో

అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా గుండెల్లో ఏదో వాలే వాలే
కల్లోలం కమ్మేసే అంతా నీవలనే
కల్లారా నువ్వే నవ్విన క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి
కలతలే చెయ్యి విడిచెలే
హే కలలకే వేల తలుకుకే
నువ్వు కనబడే దాక కలలే
ఇరువురి చేతిలోని రేఖలన్నీ
ముడిపడే రాత బలపడే
విడి విడి దారులేమో వీడిపోని
జంటై కదిలే

ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో
ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో

మౌనాలే మన ఊసులలో
మాటే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో

ఉల్లాసం ఉరికే ఎదలో
మనకే మనమే ఎవరో

Palli Balakrishna
Coolanna (1999)




చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: మురళీ మధు 
గానం: యస్.పి.బాలు 
నటీనటులు: ఆర్. నారాయణమూర్తి 
నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి 
విడుదల తేది: 09.04.1999



Songs List:



మముగన్న మాయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: గోరేటి వెంకన్న  
గానం: యస్.పి.బాలు 

మముగన్న మాయమ్మ 



పెళ్ళామా ఓ పెళ్ళామా పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: గోరేటి వెంకన్న  
గానం: వరంగల్ శంకర్, శైలజా & కోరస్

పెళ్ళామా ఓ పెళ్ళామా



కొడుకా కోటిలింగేషా పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: గుడా అంజయ్య, దయా నర్శింగ్  
గానం: యస్. జానకి 

కొడుకా కోటిలింగేషా




రావయ్యో మల్లయ్య పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: వేల్పుల నారాయణ 
గానం: కొమరయ్య & కోరస్

రావయ్యో మల్లయ్య 




కొడుకో గజ్జల రాజా పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా  
గానం: మనో  & కోరస్

కొడుకో గజ్జల రాజా 



తెగిపడ్డ నింగి చుక్కనా పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: మురళీ మధు 
గానం: యస్.పి.బాలు 
నటీనటులు: ఆర్. నారాయణమూర్తి 
నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి 
విడుదల తేది: 09.04.1999

పల్లవి:
తెగిపడ్డ నింగి చుక్కనా 
చెత్తకుండీ కాడి కుక్కనా (2)
ఏ తల్లి కన్న బిడ్డనో 
నేను యే అయ్య కన్న కొడుకునో

చరణం: 1
కన్నె తల్లులుగన్న కర్ణులీలోకాన 
కుప్ప తొట్టేలకాడ కుక్కలపాలైరి 
నమ్మించి నా అయ్య గొంతెట్ట కోసిండో
పదినెలలు నా తల్లి నన్నెట్టా మోసిందో 
ఆ నాటి ఆ కుంతీ కర్ణున్ని కనలేదా...
ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా 

చరణం: 2
సొంతకొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ 
చంపినా బాగున్ను కళ్ళు తెరవకముందే
ఓ తల్లి నన్నడుగ నోరెట్ట వచ్చిందే 
నా చావు కోరుటకు మనసెట్ట వొప్పిందే 
మూడుతలల బ్రహ్మ రాతెట్టా రాసిండో
నీతిలేని మనిషి గీతెట్టా గీసిండో

చరణం: 3
కాలుజారిన తల్లి ఎవ్వర్తో 
కండ కావరమెక్కిన తండ్రి ఎవ్వడో
తప్పు చేసినవారు తప్పించుకున్నారు
తలవంపుతో నేను తలదించు కున్నాను
కరుణలేని ఓ తల్లి దండ్రులారా...
నాలాగ ఎవ్వర్ని పారేయకండి 





మల్లోచ్చిండురో పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: శక్తి 
గానం: వరంగల్ శంకర్ & కోరస్

మల్లోచ్చిండురో





ఎర్రజెండేరా తమ్ముడా పాట సాహిత్యం

 
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా  
గానం: కొమరయ్య & కోరస్

ఎర్రజెండేరా తమ్ముడా 


Palli Balakrishna

Most Recent

Default