చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్
నిర్మాత: Sony Pictures International Productions & Sandeep Mudda
విడుదల తేది: 16.02.2024
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్
గగనాల తేలాను నీ ప్రేమలోనా
దిగిరాను ఎన్నేసి జన్మలైనా
తెగిపోయే బంధాలు లోకాలతోనా
నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా
వేళలేని వెన్నెలా
జాలువారింది నీ కన్నులా
దాహామే తీరనీ దారలా, ఓ ఓ…
దేవిలా… నువ్విలా, ఆ ఆ
చేరగా, ఆ ఆ
కోవెలాయే నా కలా
గగనాల తేలాను నీ ప్రేమలోనా
దిగిరాను ఎన్నేసి జన్మలైనా
తెగిపోయే బంధాలు లోకాలతోనా
నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా
నీవే నలువైపులా
చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా
ఏదో రాధా కృష్ణ లీలా
నిన్ను నన్నీవేళ వరించిందే బాలా
తరగని చీకటైపోనా
చెరగని కాటుకైపోనా
జగమున కాంతినంతా
నీదు కన్నుల కానుకే చేసి
రంగుల విల్లునైపోనా
నీ పెదవంచుపై రానా
ఋతువులు మారని
చిరునవ్వునే చిత్రాలుగా గీసి
చెరిసగమై నీ సగమై
పూర్తైపోయా నీవల్ల ప్రియురాలా
దేవిలా… నువ్విలా, ఆ ఆ
చేరగా, ఆ ఆ
కోవెలాయే నా కలా, ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్, శ్రేయా ఘోషాల్
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నానా హైరానా... ప్రియమైన హైరానా
మొదలాయే నాలోనా... లలనా నీ వలనా
నానా హైరానా… అరుదైన హైరానా
నెమలీకల పులకింతై... నా చెంపలు నిమిరేనా
దానాదీనా ఈవేళ నీలోన నాలోన
కనివినని కలవరమే సుమశరమా
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే
కోరస్: నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
ఎపుడు లేనే లేని వింతలు
ఇపుడే చూస్తున్నా…
గగనాలన్ని పూలగొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా
రోమాలన్ని నేడు
మన ప్రేమకు జెండాలాయే
ఏమ్మాయో మరి ఏమో
నరనరము నైలు నదాయే
తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలి కథగా
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే...
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే
కోరస్:
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
ధోప్ ధోప్ పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: థమన్, రోషిణి JKV, పృద్వీ, శ్రుతి రంజిని మోదుముడి
ధోప్ ధోప్... ధోప్ ధోప్
వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్
లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్
ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగెర్ ధోప్
ఎంతలాంటి స్ట్రెస్సుకు
ఇన్స్టాంట్ సొల్యూషన్ ధోప్…
డోంట్ వర్రీ… డోంట్ వర్రీ
ఎనఫ్ ఆఫ్ ఇంజూరీ
నెగటివ్ వైబ్ కి చెప్పెయ్ ధోప్
బేకరీ బేకరీ… అయ్యయ్యో కెలొరీ
టెడ్డి బేర్ టమ్మీకి చెప్పెయ్ ధోప్
చాటరీ బ్రౌసరి టైం అంతా రాబరీ
చేసే సెల్ ఫోన్ కు చెప్పెయ్ ధోప్
డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ
ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్
If You’re Coming You’re Coming
Everybody Dhop
When You’re With Me You’re With Me
Everything Is Dhop
If You Look At Me Look At Me
Stress Anthaa Dhop
When You Smile At Me Myself-eh Dhop
మన మీటింగుకు మన మీటింగుకు… Interval Dhop
మన టచింగ్ కు మన టచింగ్ కు… Hesitation Dhop
మన లిప్పుకు లిప్పుకు… Distance-u Dhop
నా విలన్ నీ డ్రెస్సుకు Dhop
లా ల ల ధోప్...
వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్
అలికి పూసిన అరుగు మీన పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, రోషిణి JKV
అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా..?
సిలక ముక్కు సిన్నీ నా దొరా
ఎతికి చూస్తే ఏడూళ్ళైనా
నీలాంటోడు ఇక దొరికేనా..?
ఎందుకింత ఉలుకూ ఓ దొరా
ఎండి బంగారాల నా దొరా
సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
సిన్నబోయి వచ్చావేంది..?
నీలో ఉన్న మచ్చను తలచి
కొండ నిండ వెలుగే నీదిరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా
అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా
సిలక ముక్కు సిన్నీ నా దొరా
గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ
నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ
ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలల్లో సుట్టుకోవా
సింతపూలా ఒంటి నిండా
సిటికెడంత పసుపు గుండా
సిన్నదాని సెంపల నిండా
ఎర్ర ఎర్ర కారంగుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా…
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా
కొండ దేవరా...పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, శ్రావణ భార్గవి
నెత్తురంత ఉడుకుతున్న
ఊరువాడ జాతర...
వాడు మీద పడ్డడంటే
ఊచ ఊచకోతర...
కొండ దేవర… కొండ దేవర
ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు
ఉప్పు పాతర…
తన్ని తన్ని దుండగుల్ని
తరుముదాము పొలిమేర
కొండ దేవర... కొండ దేవర
కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది
కొండ దేవరా... నీరు నిప్పు మాది
కొండ దేవరా... కొండ కోన మాది
ఎర్ర ఎర్ర సూర్యున్నేమో
బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకునా
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఊయలూపినావు జోలనా...
హే, మా నిన్న మొన్న
మనమంటే, నువ్వే
వేయి కన్నులున్న... బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా... ఇయ్యాల, రేపు
మా వెన్నుదన్ను మార్గం చూపే
హే, పాడు కళ్ళు సూడు
తల్లి గుండె తప్ప ఈడకొచ్చినాయిరా
హే, ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటు దూకదా..?
కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది
కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా
కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా