ఫోక్ సాంగ్ : వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే (2023) సంగీతం: వెంకట్ అజ్మీర సాహిత్యం: అవుడుర్తి లక్ష్మన్ గానం: జోగుల వెంకటేష్, లక్ష్మి నయని నటీనటులు: జోగుల వెంకటేష్, పూజ నాగేశ్వర్ దర్శకత్వం: నిర్మాత: చితకాల తిరుపతి రెడ్డి మ్యూజిక్ లేబుల్: లక్ష్మి జానపదం విడుదల తేది: 14.08.2024
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే పాట సాహిత్యం
ఫోక్ సాంగ్ : వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే (2023) సంగీతం: వెంకట్ అజ్మీర సాహిత్యం: అవుడుర్తి లక్ష్మన్ గానం: జోగుల వెంకటేష్, లక్ష్మి నయని అరే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే నీది మునుము నాది మునుము నేనే కొత్త నిన్నే జూత్త వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర అవ్వజూస్తది అయ్యజూస్తడు అన్నజూసిన నిన్ను దంతడు చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర ఉయ్యాల నడుముదాన ఊరించే కళ్లలదాన అతిపెద్ద గుమ్మడికాయ చిన్నకత్తి కోస్తడె జాన సురకత్తి సూపులవాడ సరసాల వన్నెకాడ ముద్దుగా నీముచ్చట్లు రేపినాలు ప్రేమ అసలు సీరలుదెత్త రైకలుదెత్త గల్ గల్ సప్పుళ్ళ గాజులుదెత్త పిల్లో.. వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర చిలక పలుకులదాన పూస నడకలదాన కోరినావు ఆ నెలవంక తెచ్చి నీ కొప్పునబెడతా ఉంగరాలజుట్టు వాడ పట్టేప బీడ వాడ ఆరడుగుల హైటునుజూసి ఐసోలే కరిగెను మనసు ఈడు జోడు కుదిరెను పోరి అవ్వతోడు నిన్ను ఇడువను నారి చిన్నదాన వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర గల్ గల్లు గాజులువెట్టి కాళ్లకు పట్టీలువెట్టి నీ గాజులు గల్లు గల్లు నా గుండె జల్లు జల్లు పట్టంచు దోతిగట్టి కిర్రు చొప్పులు తొడిగి చిట్టపట్ట నువ్వే పొంగా నాపానం మిట్ట మిట్ట జూడే నారి ఎలక్షన్ పోరి నేతిలో మొలక నా రామ చిలక వన్నేలాడి వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవది పోర చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవది పోర చేతిలో చేత్తిరిబట్టి చెన్నంగి పువ్వులుబెట్టి వయ్యారి నా రసగుల్ల ఆగలేనె మరదలు పిల్ల గట్టెంట పొయ్యేటోడ కత్తెర జుంకాలోడా నీ బిత్తర సూపులకు చిత్తయి పోతిని పోర నువ్వు నేను కూడుకొని కొండగట్టుకు పోదము పిల్ల పిల్లో.. వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే మెచ్చినానురో పిల్లగా కలిసిమెలిసి ఉందము పార మెచ్చినానురో పిల్లగా కలిసిమెలిసి ఉందము పార

No comments
Post a Comment