Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Roberrt (2021)


 

చిత్రం: రాబర్ట్ (2021)
సంగీతం: అర్జున్ జన్య
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ
నటీనటులు: దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశా భట్, జగపతి బాబు
దర్శకత్వం: తరుణ్ కిషోర్ సుదీర్
నిర్మాత: ఉమాపతి శ్రీనివాస గౌడ
విడుదల తేది: 11.03.2021







కన్నే అదిరింది... పైటే చెదిరింది
కాలే నిలవదు పిలగా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది

మీఠా కిల్లీలా నిన్నే కొరకాలా
నోరే ఎర్రగ పండా

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది

పాణం ఎళ్ళిపోయే నువ్వే గురుతొస్తే
నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంటా ఫిఫ్టీ నీకంటా
ఓ ఫిఫ్టీ నాకంటా
జరా అర్జెంటుగ నువు డేటు జూస్తే జంపేనంట

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా
చోరీ చేసెయ్ నువ్వు ముద్దుగ సుకుమార
కదలివస్తా చలిగాలి నేనై
కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది

సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా చలో కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టెయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే
నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే, మల్లెల గదులే సూడర ఎల్లీ

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది (2)


Palli Balakrishna Thursday, March 25, 2021
Back Door (2021)



చిత్రం: బ్యాక్ డోర్ (2021)
సంగీతం ప్రణవ్
సాహిత్యం: జావేలి
గానం: అభిజిత్, ప్రియాంక
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రవిశంకర్
రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ
నిర్మాత: బి. శ్రీనివాస్ రెడ్డి
కో-ప్రొడ్యుసర్: వూటా శ్రీను
విడుదల తేది: 2021







రా రా నను పట్టేసి కోని చుట్టేసుకోర
రాసలీలల్లో రాణి వాసాలనే ఏలుకోరా
బిగువైనా పరువాలన్ని అందిస్తా నీ చేతులకీ
దులిపేయ్ రా అందాలన్ని
సుఖించ వచ్చిన రహస్య ప్రియుడా

నడుమా ఇది ఉగే తీగై కవిస్తూ ఉంది
పెదవా ఇది తేనెల ఊటై ఊరిస్తూ ఉంది
నీతో పని చాలా ఉంది
ఈ సమయం సరిపోనంది
తపించె నీకు సుఖాలు చూపెడుతా నమ్మవే ప్రే
ప్రేయసి

చరణం:
రావే మృదు వదనా ఒదిగీ ఒకటవనా
సరిగమ శృతి చేయనా కోరిక తీర్చేయనా
రా రా నా ప్రియ సఖుడా సమయం ఇది నీదేరా
శ్రమించి సుఖపెట్టేయ్
తరించ జతకట్టేయ్
నీతో పని చాలా ఉంది
ఈ సమయం సరిపోనంది
తపించె నీకు సుఖాలు చూపెడుతా నమ్మవే ప్రేయసి

మన్మధుడే నను పూనాకా స్వర్గాలే ఇటు దిగి రావా
జోకొట్టేయవా రుచి చూసి
నీ కౌగిలి పానుపు చేసి
 

Palli Balakrishna Wednesday, March 24, 2021
FCUK (2021)





చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: జగపతిబాబు, అమ్ము అభిరామి, రామ్‌ కార్తీక్, బేబీ సహస్రిత, కల్యాణీ నటరాజన్, భరత్, బ్రహ్మాజీ
దర్శకత్వం: విద్యాసాగర్‌ రాజు
నిర్మాత:  కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్
విడుదల తేది: 12.02.2021



Songs List:



సెల్ఫీ లేలో పాట సాహిత్యం

 
చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: నకాష్ అజీజ్, దివ్య భట్

రాములోరి మీద పడి ఏడ్చింది
కన్న బిడ్డకి నువు కావాలంది
కైక హిస్టరీకి విలనైంది
జలజి జిందగి కే డేంజర్
జలజి జిందగి కే డేంజర్

అమ్మ వీడి జిమ్మడా జెలస్సుగాడో
లైఫులోకి ఎంటరైతే డేంజరేరో
లవ్వుతోటి ఒక్క స్మైలు ఇచ్చుకోరో

ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో

అంత పాలపుంతలోన భూమి సైజు ఎంతనో
ఇంత నేల మీద నువ్వు ఇసుక రేణువంతనో
ఉన్న చిన్న జిందగీ అసూయ నింపి వేస్ట్ చేయకురో 

ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో

అందమైన నవ్వు పేసు వెనక
ఎందుకే అసూయ రంగు మరక
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
తిప్పుతున్న మీసకట్టు వెనక
తెలెనే జెలస్సు చూడు సరిగా
హే... ఎర్రని ఎర్రని పెదాల మాటలో
మూతి ముడుపులన్ని ఎందుకమ్మడో
హే... చాలులే చాలులే మగాడి బుద్ధిలో
ఆడపిల్ల మీద అంతలాగ ఏడుపెందుకో...

ముజ్ సే, ముజ్  ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో



పువ్వల్లే మేలుకున్నది పాట సాహిత్యం

 
చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో
గానం: భీమ్స్ సిసిరోలియో

పువ్వల్లే మేలుకున్నది
గువ్వల్లే తేలుతున్నది
చినుకల్లే ఆడుతున్నది
చేపల్లే తుళ్లుతున్నది

జోల పాటల్లే అల్లుకున్నది
నా గుండె ఉయ్యాలై ఊపుతున్నది
గారాల పట్టి
నా గుండె తట్టి
నను చుట్టూ ముట్టిందిలే

నా చెయ్యి పట్టి
తన అల్లరి తోటి
నను పసివాడ్ని చేసిందిలే
గారాల పట్టి
నా గుండె తట్టి
నను చుట్టూ ముట్టిందిలే
నా చెయ్యే పట్టి
తన అల్లరి తోటి
నను పసివాడ్ని చేసిందిలే

పువ్వల్లే మేలుకున్నది




# పాట సాహిత్యం

 
చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: షాహిద్ మల్ల్య 

హే హుడియా




మనసు కథ పాట సాహిత్యం

 
చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: బాల ఆదిత్య 
గానం: భీమ్స్ సిసిరోలియో, షాల్మాలి ఖోల్గాడే 

మనసు కథ 



నేనేం చెయ్య పాట సాహిత్యం

 
చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: బాల ఆదిత్య 
గానం: నకాష్ అజీజ్ 

నేనేం చెయ్య 

Palli Balakrishna Sunday, March 21, 2021
Chakra (2021)

చిత్రం: చక్ర (2021)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిన్మయి శ్రీపాద, ప్రార్థన ఇంద్రజిత్
నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: యం. యస్. ఆనందన్
నిర్మాత: విశాల్
విడుదల తేది: 19.02.2021







అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంట
నీలో కనిపించేది నా రూపేనమ్మా

నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్ లేకుండా ఉండలేనే నేను క్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే

చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఓఓ


Palli Balakrishna
Kshana Kshanam (2021)



చిత్రం: క్షణ క్షణం (2021)
సంగీతం: రోషన్ సాలూరి
సాహిత్యం: విపిన్ సూర్య
గానం: సూరన్న
నటీనటులు: ఉదయ్ శంకర్, జియా శర్మ, కోటి, రఘు కుంచె
దర్శకత్వం: కార్తిక్ మేడికొండ
నిర్మాతలు: మన్నం చంద్ర మౌళి, డా. వార్లు
విడుదల తేది: 26.02.2021







ఎరుక నెరుగర నరుడా ఎరుకనెరుగర నరుడా
నీ ఎరుక నీవెరిగి ఎరుకనెరుగర నరుడా
క్షణక్షణమున హాయిరా క్షణక్షణములో పోయెరా
క్షణక్షణము మారేటి ఈ కథని సూడరా

నీ ముందు నేనంటా నా ముందు కడలిరా
ఆ కడలి నాలోన ఆశలే రేపెరా
సుట్టూరు చాపలు నా కలలా కాసులూ
పోగేసి దాసినా ఆ ఎండు చాపలు
పడవలై తేలేవి మన జీవితాలు
తీరాలు చేరితే తెచ్చేది సొమ్ములు

ఎరుక నెరుగర నరుడా ఎరుకనెరుగర నరుడా
నీ ఎరుక నీవెరిగి ఎరుక నెరుగర నరుడా

ఆ కాడా ఈ కాడా బలిసిన దొరకాడా
ఒల్లోంచి తలదించి హీరోలు ఉంటారా
గాలిలో ఇసిరిన పైసల గాలము
జాలితో రాసిస్తున్న నీకు సముద్రము

ఎరుక నెరుగర నరుడా ఎరుకనెరుగర నరుడా
నీ ఎరుక నీవెరిగి ఎరుక నెరుగర నరుడా
ఎరుక నెరుగర నరుడా ఎరుకనెరుగర నరుడా
నీ ఎరుక నీవెరిగి ఎరుక నెరుగర నరుడా




Palli Balakrishna Saturday, March 20, 2021
Ee Kathalo Paathralu Kalpitam (2021)



చిత్రం: ఈ కథలో పాత్రలు కల్పితం (2021)
సంగీతం: కార్తిక్ కొడకండ్ల
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: దీపు, నూతన్ మోహన్
నటీనటులు: పవన్ తేజ్ కొణిదెల, మేఘన
దర్శకత్వం: అభిరామ్. యమ్
నిర్మాత: రాజేష్ నాయుడు
విడుదల తేది: 19.03.2021







ఏమిటో ఏమిటో ఇంతగా ఏమిటో
మనసుకింత అలజడేమిటో
తూలుతూ తేలుతూ నవ్వులెన్నో రువ్వుతూ
రేగుతున్న ఊహాలేమిటో
ఓ చినుకులా చిలుకలా చిలిపి చిలిపి ఊసులా
చిగురుతొడుగు ఆశలేమిటో
తలపులా తరగలా తరుముతున్న తపనలా
తెగువ చూపు తనము ఏమిటో

ఏమిటో ఏమిటో ఇంతలా ఏమిటో
మనసుకింత అలజడేమిటో
తూలుతూ తేలుతూ నవ్వులెన్నో రువ్వుతూ
రేగుతున్న ఊహాలేమిటో

నీ మాటలన్నీ ఓ ఊటలాగా
నా గుండె లోతుల్లో ఉప్పొంగగా
నా శ్వాసలోని ఈ వేగమేదో
నిను కలుసుకొమ్మంటు బ్రతిమాలగా

మాటలు కలిపే క్షణములకై వెతికే
కారణమేదో తెలిసే మదికే
ఈ మౌన భాష్యాల భావాలు తెలిసే కన్నులకే

ఏం చేస్తు ఉన్నా నీ ధ్యాస నన్నే
వెంటాడి ముద్దాడు చొరవేమిటో
ఈ కాస్తలోనే ఇంకాస్త అంటూ
నీ చెలిమినే కోరు చనువేమిటో

అడుగులు కదిపే ఎద లోపలి వలపే
మెలికలు తిప్పే మనలో మననే
ఓ మత్తు గమ్మత్తు కలలెన్నో కలవరపెడుతుంటే

నచ్చిన వాళ్ళు పక్కనుంటే
ఇంత ధైర్యంగా ఉంటుందని
నాకు ఇప్పుడు తెలిసింది


Palli Balakrishna
Vakeel Saab (2021)


 


చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అంజలి, నివేత థామస్, అనన్య నగళ్ళ,  ప్రకాష్ రాజ్
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు, బోనీ కపూర్
విడుదల తేది: 09.04.2021


Songs List:




మగువా మగువా మేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్





మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

చరణం:
నీ కాటుక కనులు విప్పారకపోతే 
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే 
ఏమనుగడ కొనసాగదుగా

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా




సత్యమేవ జయతే పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్
ర్యాప్: పృధ్వీ చంద్ర





జన జనజన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే

జనజన జన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

గుండెతో స్పందిస్తాడు
అండగా చెయ్యందిస్తాడు

ఇలా చెంప జారెడి ఆఖరి అశ్రువునాపెడివరకు
అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం

వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు

ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
నోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవజయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే





కంటిపాప కంటిపాప పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్, దీపు, థమన్, గీతా మాధురి, సాహితి, శృతి రంజని, హారిక నారాయణ్, శ్రీనిధి, యమ్. ఎల్. గాయత్రి, నారాయణ నయ్యర్, శృతి యమ్. ఎల్





కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వ కాలి మువ్వ సవ్వడైన లేదే
నువ్విన్నిన్నాల్లుగా వెంట తిరుగుతున్నా

నీ రాక ఏరువాక నీ చూపే ప్రేమ లేఖ
నీలో నువ్వాగిపొక కలిశావే కాంతి రేఖ
అంతులేని ప్రేమనువ్వై ఇంత దూరం వచ్చినాక
అందమైన భారమంత నాకు పంచినాక

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

సాప మాప మాప మాగ సామగారిస (2)

సుధతి సుమలోచని సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిని కరుణగుణ బాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయ్యవే చెలి నువ్వు పొందిన ప్రేమని
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాప మాప మాప మాగ సామగారిస (2)

ఎదలో ఏకాంతము ఏమైందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా నీకు స్నేహితున్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాశా
ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండ ప్రేమే మన కోట గోడ
నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండ
గురుతు లెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు





కదులు కదులు పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శ్రీకృష్ణ , వేదాల హేమచంద్ర





కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులిని నేను ఆడదాన్ననుకున్నా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్ 
రంగులు పెట్టే గోళ్ళునే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని
నరకం పరిచయం చెయ్

నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం 
సైన్యం సైన్యం

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు





మగువా మగువా ఫీమేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహన భోగరాజు





మగువా మగువా 
నీ మనసుకు లేదా ఏ విలువా

ఆకాశం తాకే నీ ఆక్రదనాలు
మనసారా వినువారేవారు
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
సవరించే మనవారేవారు
కళా మారుతున్న జీవితం కలతలోకి జారేన
కలలుగన్న కనులకు నీటిచెమ్మ తగిలేనా
వెళుతురైన ప్రతిదినం చుపుతోంద వేదన
అందమైన బతుకున అలజడి చెలరేగెనా

ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందే చిటికలోనే
తీరదు నీ శోకం మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా

మగువా మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వు
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టవు

మగువ మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

Palli Balakrishna Thursday, March 18, 2021
Ippudu Kaka Inkeppudu (2021)



చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
నటీనటులు: హస్వంత్ వంగ, నమ్రతా దారేకర్, కటలిన్ గౌడ
దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి (గోపి)
విడుదల తేది: 2021







చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
సాహిత్యం: సాహిత్య సాగర్
గానం: నాధప్రియ లోకేష్ , హైమత్, శ్రీజ, కళ్యాణి ఇమంది, ఐశ్వర్య బిజనవేములాస్, శ్రీ కావ్య చందన, అపర్ణ, అరుణ్ కౌండిన్య, నరేష్

స్టీల్ ప్లాంట్ దిగువ నుండి మల్కాపురము మలుపు దాటి షీలా నగరు సందు దాటి ఎన్ ఏ డీ చర్చ్ దాటి కంచెరపాలెం బ్రిడ్జి దాటి జ్ఞానాపురము టేషను దాకా

భోగాపురము రోడ్డు నుండి అవంతి కాలేజీ జంక్షన్ దాటి తగరపువలస బ్రిడ్జి దాటి మధురవాడ మలుపు దాటి హనుమతువాక మద్దెలపాలెం తెలుగు తల్లి వంతెన దాటి

దాటి దాటి అలసిపోనావ్ గానీ ఎక్కడికొచ్చాం సెప్పు మాయ్యా

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు

సరే సరే ఎక్కిద్దుర్లే కానీ ఎవర్నేక్కించాలి, ఎందుకెక్కించాలి

సింధియా కుర్రాడు వీడు బుద్ధిమంతుడు
నాన్నారి మాటలు అస్సలు జవ దాటడు
ఆహా..! రిషికొండ అమ్మాయి పద్దతిగల పాపాయి
తన తల్లి గీసిన గీతను దాటాలనుకోదు

ఆరిలోవ ముడసల్లోవా వదిలేసి ఎలిపో బావ
హైటెక్ సిటీకి తోవ చూపిస్తాం దా
ఆసిల్ మెట్ట, మారాని పేట చుట్టాలకు చెప్పెయ్ టాటా
ప్యాకేజీ భలేగా ఉంటే నొప్పా సొలుపా

ఉద్యోగం వచ్చింది వారెవా వారెవా
ఈ విషయం ఊరంతా విడ్డూరం చేద్దాం దా
లగేజ్ సర్దేయ్ లజ్జనక
నువ్వు లగెత్తుకెళ్ళిపో లచ్చెనకా

తర్జన భర్జన దేనికి గబుక్కు గబుక్కు గబుక్కు
గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కునా

ఏం మీ నాన్న పంపుతాడా..?
అంటే... పంపిచరనుకో, కనకే

కనకమాలక్ష్మమ్మకి, సింహాద్రి అప్పన్నకి
సంపత్తు వినాయకుడికి , రాస్ హిల్స్ యేసయ్యకి
అనకాపల్లి నూకాలమ్మకి, హజరత్ బాబా దర్గాకి

ఓర్ మాయ్యా మొక్కులకి లొంగే రకమా మీ బాబు
ఎలగేస్, మారుపేరు మీద టికెట్ తీద్దాం గోదారి ఎక్కిచ్చేద్దాం, కరిసే, పచ్చ జెండా ఊపండి మరి

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూచుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూచుకు చుకు

దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం దాటి
అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు, నూజివీడు, విజయవాడ
కంగారైపోకు విజయవాడ జంక్షన్ మరి

గుంటూరు, సత్తెనపల్లి,పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట... 
నల్గొండ, రామన్నపేట, సికింద్రాబాద్ వచ్చావురా బేటా...

అయ్ బాబోయ్ నేనెళ్ళాల్సింది హైదరాబాద్ కదా
జంట నగరాలు అంటారు చిన్నప్పుడు సదువుకోలేదా

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు







చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
సాహిత్యం: సురేశ్ బనిశెట్టి
గానం: విజయ్ యేసుదాస్, శ్రీ కావ్య చందన

తరికిట తత్తోమ్ తగిలిందే తుళ్ళింతా
ధిమికిట దిత్తోమ్ మొదలైందే గిలిగింతా
కసిరిందే వయసంతా...
కసిరిందే వయసంతా విసిరిందే నీ చెంత

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

తరికిట తత్తోమ్ తగిలిందే తుళ్ళింతా
ధిమికిట దిత్తోమ్ మొదలైందే గిలిగింతా

పెదవే వణికే తనువే తొణికే
సరికొత్తగ చుంబన మంత్రం కోరెను గనుకే
మనసే ఉరికే మనసై వెనకే
సుతిమెత్తని తుంటరి గాయం అడిగెను గనుకే

నడు ఒంపులు వీణలా కవ్విస్తుంటే
తెలవారులు తాపమే మీటేస్తోందే
మెడవంపున పంటితో కాటేస్తుంటే
తల్లడిల్లిన మైకమే నచ్చేస్తుందే
కసికసి కనులే రసికపు మణులే
వయసడిగిన దండయాత్రలో
అసలు సిసలు మొదటి అడుగు ఇవ్వాలే

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

హద్దులు జరిగే నిద్దర చెరిగే
శృతిమించిన ఆనందంలో సొత్తులు కరిగే
ఆశలు పెరిగే మాటలు తరిగే
పడగెత్తిన పరువాలన్నీ రుచినే మరిగే

అల్లరల్లరి ఊహలే ఉసిగొలిపెనులే
మళ్ళి మళ్ళీ ఈ జాతరే వయసడిగెనులే
అల్లిబిల్లి సరదాలలో మది మునిగెనులే
గిల్లిగిల్లి సరసాలలో కధ ముదిరెనులే

ముడిపడు యెదలే సరిగమ పదలే
బిగి కౌగిలి ఉక్కపోతలో చెమట చుక్కలెన్నో
లెక్కపెట్టాలే

తరికిట తత్తోమ్, ధిమికిట దిత్తోమ్

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

Palli Balakrishna Tuesday, March 16, 2021
Gaali Sampath (2021)


చిత్రం: గాలి సంపత్ (2021)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ (ఆశ్య), రాజేంద్ర ప్రసాద్
దర్శకత్వం: అనీష్ కృష్ణ
నిర్మాతలు: ఎస్. కృష్ణ , హరీష్ పెద్ది, సాహు గారపాటి
విడుదల తేది: 11.03.2021






చిత్రం: గాలి సంపత్ (2021)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాజేంద్ర ప్రసాద్, రాహూల్ నంబియార్, శ్రీకృష్ణ విష్ణుబొట్ల, అచ్చు రాజమణి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
ఫిఫీఫీ ఫిఫీఫీ 

రాజా రాజా శ్రీ గాలి సంపత్ గారు
మై డియర్ డాడీ బాబండి
మా బాబు గారు చేసే డైలీ విన్యాసాలు
ఊహాతీతం సుమండీ

అరే కొక్కొరొక్కో తెల్లారిందా ఎదో ఒక ప్రాబ్లెమ్
ఇంటిమీదకి తీసుకురానిదే నిదరొడండి
అరే తిట్టికొట్టి మంచి చెడ్డ చెప్పే వయసు కాదే
ఈయన గారితో ఎట్టా వేగాలండి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ డాడీ... ఫిఫీఫీ 
ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ క్రేజీ క్రేజీ డాడీ ఫిఫీఫీ 

హే తుస్సు బుస్సు చాటర్ బాక్సు
యుజ్లెస్ గ్యాంగ్ కు బాసూ
ఏడాది మొత్తం పేలే లక్ష్మి టపాసు
కాస్త చూసుకో వయ్య అట్టే ఈ మాస్టర్ ని
ఊరి మీదకు వదలమాకయ్య
హే ఊసుపోని మేకప్ రంగు
ఊడిపోయ్యే మీసాల కింగు
బాహుబలినంటాడు ఈ డ్రామా బిగ్ బాసు
జర జాగ్రత్త భయ్యా పొద్దునలేస్తే
ఇంట్లో ఈయనతో ఉండేది నువ్వేనయ్యా
అరె ఒంట్లో ఉండే ఎనర్జీ లు చాలా ఓవరుడోసు
పని పాత లేని పల్లకి సిలబస్సు

రాజా రాజా శ్రీ గాలి సంపత్ గారు
మై డియర్ డాడీ బాబండి
మా బాబు గారు చేసే డైలీ విన్యాసాలు
ఊహాతీతం సుమండీ

అరే కొక్కొరొక్కో
తెల్లారిందా ఎదో ఒక ప్రాబ్లెమ్
ఇంటిమీదకి తీసుకురానిదే నిదరొడండి
అరే తిట్టికొట్టి మంచి చెడ్డ చెప్పే వయసు కాదే
ఈయన గారితో ఎట్టా వేగాలండి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ డాడీ... ఫిఫీఫీ 
ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ క్రేజీ క్రేజీ డాడీ ఫిఫీఫీ 


Palli Balakrishna
Sashi (2021)




చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి, రాశి సింగ్
దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు నడికట్ల
నిర్మాతలు: ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతల పూడి శ్రీనివాస్
విడుదల తేది: 19.03.2021



Songs List:



ఒకే ఒక లోకం నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...

నిన్నా మొన్నా గుర్తె రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే...
ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా





దింతానా దింతాన పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హరిచరణ్

దింతానా దింతాన 
ఇది మనసుపండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

పాలసంద్రంలా పొంగిపోతున్న
పాలపుంతల్లో తేలిపోతున్న
విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్న
కురిసే తారాలన్నీ దోసిళ్లల్లో నింపేస్తున్న

చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న
కొత్త జన్మేదో అందుకుంటున్న
రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి
దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్న
నింగి అంచు మీద రంగు రంగు చేపలుగా
గెంతుతున్న ఓ...

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

ఇంత కాలంగా ఎక్కడున్నావే
ఉన్నఫళంగా ఊడి పడ్డావే
తెలిసీ తెలియనట్టు నా మనసునే లాలించేశావే
అసలేం ఎరగ నట్టు నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూశాకే ప్రాణ మొచ్చిందే
వింతలోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి
నా చెంప గిల్లుతుంటే 
అంతకన్న హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కన్ను ఇంక
నన్ను కూడ చూడనందే

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా




విధినే విడిచే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: వెంగి
గానం: యం. యం. కీరవాణి

విధినే విడిచే నీ ప్రాణమే
విడిగా మిగిలే ఈ మౌనమే
కొనసాగి ఆగేనా నీ స్నేహమే
నువు లేక సాగేనా ఈ కాలమే
పలికే పేరు లేదే పెదవే ఉరుకోదే
సెలవే కోరలేదే కల అయినా రాదె




ఎవరికోగాని పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నరేష్ అయ్యర్, నారాయణ్ అయ్యర్

ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే
జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే
నేడు వదిలేసిందా చివరన
ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా

నిలువునా నిన్ను నిలుపుకున్నాక
వదలన వదలన కుదురున
కనులలో నిన్ను కలుపుకున్నాక
మరవన మరవనా జరుగునా
అయినా గాని వదిలేస్తున్న మనసును అణుచుకోని
మరి నీకోసం మరిచేస్తున్న
మరొక బతుకుతోని మలుపున

ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే
జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే
నేడు వదిలేసిందా చివరన




ప్రేమ ఇది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: బోల్ట్, ఇషాక్ వాలి

ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా

నాలో ధ్యాసే నీవా నీవా
లోలో ఊసే నీవా... ఓ ఓ ఓ
పాడే కన్నె నీవా నీవా
ఆడే మిన్నే నీవా... ఓ ఓ ఓ

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ

భూగోళమంతా నీవల్లే నీవల్లే
నగిషీలు పూసే నీవల్లేనే
ఈ పాలపుంత నా వల్లే నా వల్లే
నగుమోము చేరే నీ వల్లనే

పంచే ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమ
భాషే ఏదైనా భావం ఇంతే రామ
పెంచే ప్రేమ ఎద ముంచేనమ్మా
ఎదురేమైనా నివురైపోదమ్మ

ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా

జారే కన్నే నీవా నీనా
మీరే మిన్నే నీవా... ఓ ఓ ఓ
తార తీరం నీవా నీవా
కారాగారం నీవా... ఓ ఓ ఓ

ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
దూరం భారం నీవా నీవా
దారి దాపు నీవా... ఓ ఓ ఓ
వేగం వేదం నీవా నీవా
ఆది అంతం నీవా... ఓ ఓ ఓ

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ




రానే రాదే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: వెంగి
గానం: చౌరస్తా మ్యూజిక్, అదితి భావరజ్

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే
హద్దు లేనివంట అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ్ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్

నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే

పల్లవించే కొంటె అల పడిలేస్తే అందం హో
పంచుకుంటే నవ్వు నీలా మనదే అనుబంధం
తుళ్ళిపడే కుర్రతనం తీరమెక్కడో చూద్దాం హో
తెల్లవారే తూరుపింట తొలి వెలుగవుదాం

నిన్న మొన్న గడిచెను వదిలెయ్
పాత రోజులన్నీ గతమేగా
నువ్వు నేను అన్న స్వార్ధం విడిచెయ్
చిన్ని చేతులన్నీ హితమేగా
స్వర్గమన్నదింక ఎక్కడో లేదోయ్
స్వప్నమై ఉంది స్వతహాగా
సాహసాలు చేసే సత్తువ ఉంటే
మనకు సొంతమేగా

దారే లేదని తుది వరకు
దరి లేనే లేదని తడబడకు
తీరే మారదు అని అనకు
నీ తీరం దూరం చేరువరకు

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట
అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్

నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే


Palli Balakrishna
Tuck Jagadish (2021)




చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్, గోపి సుందర్ 
నటీనటులు: నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ 
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 23.04.2021



Songs List:



ఇంకోసారి ఇంకోసారి పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: శ్రేయా ఘోషల్ , కాల భైరవ

ఇంకోసారి  ఇంకోసారి 
నీ పిలుపే నా ఎదలో చేరి
మల్లోసారి మల్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి

మనసుకే మొదలిదే మొదటి మాటల్లో
వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో
తగదని తెలిసిన చివరి హద్దుల్లో

నా రహదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో
పున్నాగలా పూశావేమో

ఎగరేసే ఊహల్నే చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసే ఊహల్నే - ఎగరేసే ఊహల్నే
చెరిపేసే హద్దుల్నే - చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే - దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే - చూసేద్దాం చుక్కల్నే

కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో
గుండె అల్లాడేలా 
నవ్విస్తావు నీవు నీ కొంటె కోనాలతో 
చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది
కంటి పాపలో నిన్నే దాచింది
నిన్న లేని ఇబ్బంది బాగుంది
నిన్ను కోరి రమ్మంటోంది

నా రహదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో
పున్నాగలా పుశావేమో

ఎగరేసే ఊహల్నే చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసే ఊహల్నే - ఎగరేసే ఊహల్నే
చెరిపేసే హద్దుల్నే - చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే - దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే - చూసేద్దాం చుక్కల్నే

ఇంకోసారి  ఇంకోసారి 
నీ పిలుపే నా ఎదలో చేరి
మల్లోసారి మల్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి





కోలో కోలన్న పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్మాన్ మాలిక్, హరిణి ఇవటూరి, శ్రీ కృష్ణ

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏముంది,
చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీ వెంట కడదాకా నేనుంటా
రాళ్ళైనా, ముళ్ళైనా మన అడుగులు పడితే
పూలై పొంగాలా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

చినచిన్న ఆనందాలు చినబోని అనుబంధాలు
అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా
కలతా కన్నీళ్లు లేని చిననాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా

కదిలొస్తూ ఉంది చూడు కన్నులవిందుగా
ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా
హా... నలుగురితో చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా, తడిసేనా
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే,
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది
అంతా అయినోళ్లేగాని పరులెవ్వరూ
మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పదిమందికి ఆనందం పంచకపోదుగా

ఆ ఆ తగిన వరసైన తారక
తెరలు విడి ధరికి చేరగా
ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా
కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
ఓ ఓ... నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి




నీటి నీటి సుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీశ్ (2021)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: మోహన భోగరాజు

నీటి నీటి సుక్కా నీలాల సుక్కా
నిలబాడి కురవాలి నీరెండయేలా

వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే
పూటుగా పండితే పుటమేసి నేను
పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు

కొరకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే
గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే

కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా
ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకి
నడుము వంచి వేసేటి నారు వల్లంకి





టక్ పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శివ నిర్వాణ
గానం:  శివ నిర్వాణ

టక్  




యేటికొక్క పూట పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: మోహన్ భోగరాజ్ 

యేటికొక్క పూట యానాది పాట
నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట

ముద్ద పసుపై కురిసే ముచ్చటైన బంధం
పద్దు రాయలేనిదంటా అమ్మ ముద్దు పాశం
కన్నపేగు పంచుకున్న అన్నగారు తోడు
అక్కసెల్లెలి సెలబా సెమ్మగిల్లనీడు
అంగిసుట్టు మడతేసి మంచిసెడు వడబోసి
సుట్టుముట్టుకుంటాడే సుట్టమల్లే కాపేసి

ఎర్రలెరువుగ మేసి ఎర్రబడ్డ భూదేవి
కుర్ర గాలి తగిలాక కళ్ళు తెర్సుకున్నాది
నిన్ను జూసి నికరంగా రొమ్ము ఇడ్సుకున్నాది



నీది నాదంటూ పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: శ్రీకృష్ణ 

నీది నాదంటూ 

Palli Balakrishna
Shaadi Mubarak (2021)


 


చిత్రం: షాది ముబారక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: సాగర్ ఆర్. కె. నాయుడు, ద్రిష్యా రఘునాథ్
దర్శకత్వం: పద్మశ్రీ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 05.93.2021







చిత్రం: షాది ముబారక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: వనమాలి
గానం: వేదాల హేమచంద్ర, శ్రావణ భార్గవి

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా, కలగా
అనుకోని ఈ కథ, ఓ చిత్రమే కదా
మొదలవ్వదా ఇది, జతగా

మన దూరమే పెరిగిందనీ
మనసిక ఉన్న చోటే ఆగిపోతుందా
నన్నెంతగా వెలివేయనీ
నా అడుగు చూపుతున్న దారి నీదేగా

ఎందుకో కోపమాగదు ఎంతకీ ఆశ చావదు
మనసు వినదు మారిపోదు మరపురాదు
నేనుండగలనా దూరంగా అడుగేస్తుంటే నువ్వే సాయంగా
పూటలో ఎన్ని మలుపులో అనుభూతులో ఎదలో

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా కలగా

బంధమే వేరు కాదని పంతమే కొంతసేపని
తెలుసుకోవా మాటవినవా తిరిగిరావా
నాతోనే ఉండే నీ గురుతే నువు లేకుంటే మనసేం బాగోదే
వీడకే చెయ్ జారకే వెలివేయకే...

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా కలగా
అనుకోని ఈ కథ, ఓ చిత్రమే కదా
మొదలవ్వదా ఇది జతగా

మన దూరమే పెరిగిందనీ
మనసిక ఉన్నచోటే ఆగిపోతుందా
నన్నెంతగా వెలివేయనీ
నా అడుగు చూపుతున్న దారి నీదేగా



Palli Balakrishna
Kapatadhaari (2021)




చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
నటీనటులు: సుమంత్, నాజర్, శ్వేత నందిత
దర్శకత్వం: ప్రదీప్ కృష్ణ మూర్తి
నిర్మాతలు: జి. ధనుంజయన్, లలిత ధనుంజయన్
విడుదల తేది: 26.02.2021



Songs List:



కపటదారి పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: నిరంజ్ సురేష్ 

కపటదారి



కలలో కనుపాపే పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: వనమాలి
గానం: ప్రదీప్ కుమార్

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ నాతో నీడై సాగేలే

నిలపద నా ఆకాశం నీ నవ్వుల నక్షత్రం, ఎదుటే ఎపుడూ
వెనకటి నా ఆనందం మరలద ఇక నా కోసం, జతగా ఇపుడూ
నా నిజం కలగా ఈనాడిలా కథగా
మార్చేస్తుంటే మౌనంగానే నమ్మే తీరాలా ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే

నడిచిన నా ప్రతి అడుగు వెతికెనులే నీ కొరకు, నిదురే మరిచి
నిను విడువక నీ ఒడిలో గడిపిన నా ప్రతి నిమిషం రాదా తిరిగి
ఆయువే అలసి నా ఆశలే ముగిసి

నీవేలేని నా లోకంలో నేనేమౌతానో ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ, నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ, నాతో నీడై సాగేలే




హే హయక్కి హయక్కి పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: వనమాలి
గానం: సన మోయిదుట్టి

చెలరేగే చీకటిలో నను కాల్చే వ్యధ
తీర్చే జత నీవే కదా
మరల మరల తనువు కోరే సరదా

Hop up in this club with some models… models
Sit in VIP poppin bottles… bottles
We aint slow in down
We full throttle we just do it
Big homie we just so colossal
You just break it now
Baby girl you know to work it
Bounce it to the sides and i love the way you twerk it
Shake it now break it exoyic like teriyaki
Spin it disc jockey I’m dance in with this hayakki

హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హాయక్కి హాయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు

నా పోగరెంతో నువ్ పసిగట్టు
నీ దెయ్యం వదిలలిస్తా
ఈ పరువాన్నే ఓ పని పట్టు
నా దేహం అరువిస్తా

I love it the way you shake it around
Girl you make me psycho
Keep what you do in dont ever stop it babe
Make my mind blow cant make my mind blow
Cant get you out cant cant cant
Get you out of my mind when the night is done
Let me take control
Inni inni hayakki
Inni inni hayakki

 
హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హాయక్కి హాయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు

Hayaki on the floor
Yalla yalla
Inni inni hayakki
Valla haabee bee Valla haabee bee 
Valla haabee bee
Inni inni hayakki

ఓ నా ఒళ్లోకొచ్చి మన్మధుడే పొనంటున్నాడే
ఆ ఇంద్రుడేమో శ్వర్గమంటే చీ కొట్టేశాడే
నా అందాలన్నీ కొల్లగొట్టి వెళ్ళాలని
గుమిగూడి గుమిగూడి పోదా లోకమే
నా శిల్పం చెక్కి చూడు సరదాగా
ఆ బ్రహ్మే నీకు సలాం చేస్తాడే
నా బొమ్మే గీసి చూడు అలవోకగ
పికాసో పుట్టాడ నీ కళ్లే పట్టాడ

హయక్కి బేబీ  హయక్కి బేబీ 
నా సొగసుకు దాసోహం ఎందరెందరో
హయక్కి బేబీ  హయక్కి బేబీ 
నే ఓరకంట చూసాన చిత్తు చిత్తురో
ఎట్టా సోకిందే నీ గాలిట్టా
బెట్టే ఏందంట వొళ్ళో వాలిట్టా
కూసే ఓ పిట్టా ఇచ్చేయ్యిట్టా మా వాటా
పరిచే నీ పైట 

ఇన్ని ఇన్ని హైకి

ఓ యః

హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు



Theme of Kapatadhaari పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: సైమన్ కె.కింగ్ 
గానం: సైమన్ కె.కింగ్ 

Theme of Kapatadhaari



# పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: 
గానం: 

శబ్దమే 

Palli Balakrishna Monday, March 15, 2021
Tellavarite Guruvaram (2021)


చిత్రం: తెల్లవారితే గురువారం (2021)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, చిత్ర చుక్లా
దర్శకత్వం: మణికంఠ గెల్లి
నిర్మాతలు: రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
విడుదల తేది: 27.03.2021


(గమనిక: ఇందులో హీరో మరియు మ్యూజిక్ డైరెక్టర్ ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్.ఏమ్. కీరవాణి కొడుకులు)








చిత్రం: తెల్లవారితే గురువారం (2021)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: కాల భైరవ

అరె ఏమయ్యిందో ఏమో
అరె ఏమయ్యిందో ఏమో
అరె ఎవరే ఎవరే పిల్లా
నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సె పెరిగే ఏల్లా హో హో ఓ

మజ్ను లేని లైలా మనసంత మొదలైంది గోల
ఓ మందే ఇస్తే పోలా ఓ..
ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న
రోజు...
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే 
నా పై..

అరె ఏమయ్యిందో ఏమో
నీ చూపు తాకిన ఈ నిమిషం
అరె ఏమయ్యిందో ఏమో
తలకిందులైనదే నా లోకం
అరె ఏమయ్యిందో ఏమో
ఇన్నాళ్లు తెలియదేఈ మైకం
అరె ఏమయ్యిందో ఏమో
అరె చెంత వాలేనే స్వర్గం

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్న
రోజు...
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే
నా పై...

నాతో నువ్వుంటే గడియారమే పరుగే పెడుతున్నదే
ఓ నీతో నే లేని నిమిషాలకే నడకే రాకున్నాదే

అరె ఏమయ్యిందో ఏమో
పొగడాలి అంటే నీ అందాన్ని
అరె ఏమయ్యిందో ఏమో
వెతకాలి కొత్తగా పోలికని
అరె ఏమయ్యిందో ఏవో
దారాన్ని కట్టి మేఘాన్ని
అరె ఏమయ్యిందో ఏమో
నీ పైన కురిపిస్తా ఆ వర్షాన్ని


ఏవో కలలే కన్నా నీతో నిజం అనుకున్న
రోజు...
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే
నా పై...
ఓ మందే ఇస్తే పోలా ఓ..
అరె ఎవరే ఎవరే పిల్లా 
నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సె పెరిగే ఏల్లా హో హో ఓ
మజ్ను లేని లైలా మనసంత మొదలైంది గోల

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్న
రోజు...
మాటే తడబడుతుంటే భాషే పగ పడుతుంటే
నా పై...







చిత్రం: తెల్లవారితే గురువారం (2021)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కృష్ణ వల్లేపు
గానం: అచ్చు, పృధ్వీ చంద్ర, కాల భైరవ

మనసుకు హానికరం అమ్మాయే
తెలిసిన తప్పుకోడు అబ్బాయే
వదలలేం ఉండలేం కదలలేం ఆగలేం
వదలలేం ఉండలేం కదలలేం ఆగలేం

సరే సరే అన్నామో రాదారే
నహి నహి అన్నామో గోదారే
ఆడాళ్ళంత అంతేరా మామ
అర్ధం కాని ఫజిలేరా మామ
చేసేదంతా చేస్తూనే మామ
చూపిస్తారు సినిమాను మామ

వదలలేం ఉండలేం కదలలేం ఆగలేం (4)

తెలివిగా పులిహోరే కలిపేస్తాం
చివరకి కరేపాకులైపోతాం
కక్కలేం మింగలేం... చెప్పలేం దాచలేం
కక్కలేం మింగలేం... చెప్పలేం దాచలేం
విడుదల ఉండని ఖైదీలం
మగువల చేతిలో బంధీలం


మీరే మీరే ప్రాణం అంటారే
రోజూ రోజు ప్రాణం తింటారే
అంతా నువ్వే అంటూ ఉంటారే
అంతే చూసి చంపే పోతారే

కక్కలేం మింగలేం చెప్పలేం దాచలేం
కక్కలేం మింగలేం చెప్పలేం దాచలేం


తగువుకి కత్తులన్ని దూస్తారే
తప్పులన్ని మాపైనే తోస్తారే

మింగలేం కక్కలేం బ్రతకలేం చావలేం (2)

లేనిపోని డౌటే రాజేస్తారే
నిజమని ఫైటే చేసేస్తారే
ఎట్టా ఉన్నా తంటాలే కాకా
అడేస్తారు మనతోటి పేక

ఆర్గ్యూ చేసే వీలంటు లేక
మూగై పోతే బతుకంతా కేక

నెగ్గలేం తగ్గలేం బ్రతకలేం చావలేం (4)

Palli Balakrishna Saturday, March 13, 2021
Zombie Reddy (2021)




చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
నటీనటులు: తేజ సజ్జా, ఆనంది, దక్ష నగర్కార్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర్ వర్మ
విడుదల తేది: 05.02.2021



Songs List:



గో కరోనా పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: అనుదీప్, శ్రీ కృష్ణ, నమ సింగ్

ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా
రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటమా
ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా
మా వీపు పగిలే వరకు మానుకుంటమా
హే వడియాలు ఆరబెట్టి వాడలంత ఉంటాం
మా బ్రాండు ఉప్పు కోసం ఊర్లు తిరుగుతుంటాం
మా చింత చెట్టు కింద పేకలాడుకుంటాం
ఇవన్ని చేసి కూడా పాట పాడుకుంటాం

గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో (2)

ఏ రోగం అయితే ఎందీ
మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్
ఈ వైరస్ పీకేదేంది
మా జేబు నిండ పారాసిట్మల్
మా రాష్ట్ర బడ్జెట్ అంతా వైన్ షాపులుంది
కాబట్టే మందు కొరకు రోడ్డు నిండ మంది
ఏది ఏమైనా కాని మత్తు వదలమంది
లాక్ డౌన్ పెడితే ఏది ఉచ్చ ఆగదండి

ఆన్ లైన్ లో పాటాలంటాం
బ్యాక్ గ్రౌండ్ లో పాటలు వింటాం
సిక్సు ప్యాకు కలలే కంటు
ఏప్పుడు చూసినా తింటాం పంటాం

సరికొత్త వంటలు చూస్తాం
మంటెట్టి పెంటే చేస్తాం
ఇన్స్టాంటు నూడుల్ చేసి
ఇన్స్టాలోన బిల్డప్ ఇస్తాం
మ్యాచింగు మాస్కులు వేస్తాం
మరు నిమిషం జేబులో దాస్తాం
దగ్గొచ్చినా తుమ్మే వచ్చినా
పూలతో డాక్టర్ పూజలు చేస్తాం

సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం
సానిటైజర్ స్నానం చేస్తాం
సీక్రెటుగా పార్టీ పెట్టి 
హత్తుకు పోతాం హత్తుకు పోతాం

ఎత్తుకు పోతాం ఎత్తుకు పోతాం (3)


హే చప్పట్లు కొట్టామంటే పీఎం
హే పళ్ళెంతో చావు డబ్బులేద్దాం
హే చీకట్ల పెట్టామంటే దీపం
హే అడ్వాన్స్ దీపావళి చేద్దాం

ఇల్లే హెల్ అయిపాయే... ఐపాయ్
ఒల్లే గుల్లైపాయే... ఐపాయ్
పెళ్ళే లొల్లై పాయే... ఐపాయ్,
పిల్లే తల్లై పాయే


గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో (4)




Zombie Reddy Theme పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: అనుదీప్ దేవ్, పి. వి. యన్. ఎస్. రోహిత్, రఘురాం ద్రోణవజ్జల , మార్క్ కె.రాబిన్

కళ్ళు ఎర్రగా గోళ్ళు నల్లగా
వళ్ళు చల్లగా చావు మెల్లగా
ఆకలాగక ఊగే నాలుక
తనివి తీరగా నిన్ను కొరుకుతా

కొరుకు కొరుకు కొరుకు కొరుకు
నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికే వరకు ఉరుకుతా (2)

మనిషి కరిచెనే  మెదడు దొబ్బెనే
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
దొరికే దేహమే రక్త దాహమే
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
వావి వరుస లేనే లేదు
వాసనొస్తే వల్లకాడు
రాత్రి పగలు తేడా లేదు
ఊరు వాడ వల్లకాడు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

నన్ను పొడిచినా నొప్పి లేదులే
కాలు నరికినా అడుగు ఆగదే
పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా
నరుల జాతినే రూపు మాపుతా

కొరుకు కొరుకు కొరుకు కొరుకు
కొరుకు కొరుకు కొరుకు కొరుకు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

తొడలు కొట్టే వీరులైన 
మెదడు కొరుకుతాను నేను
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
కలికాలమందు యముడు నేను
కాలయముడు మొగుడు నేను
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి



బర్న్ డౌన్ పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: హారికా నారాయణ్ 
గానం: హారికా నారాయణ్ 

బర్న్ డౌన్




గేమ్ అఫ్ లైఫ్ పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: తరుణ్ జైన్ , మన్మోహన్ రాజ్, మార్క్ కె. రాబిన్ 

గేమ్ అఫ్ లైఫ్ 



నాటుకోడి పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: నాగేంద్ర
గానం: మార్క్ కె రాబిన్

పెద్దాపులి
బోనులోకి
నాటుకోడి
దుమికే చూడు హా
పులి ఆకలికి 
అది ఏటే ఐతదా
లెక్కే తప్పి 
కోడి కోటే దాటేనా

ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్... 
ఆయ్యో... ఆయ్యో...
కోడి దాటేను 
కోడి దాటేను 
కోడి దాటే...
దాటే... దాటే...




ఓం త్రయంబకం పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: శివ శక్తి దత్తా
గానం: కాలభైరవ

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ

పురంధర 
హరోం హర హర హర హర హర హర
హరోం హర హర 
హరోం హర హర హర హర హర హర
పురంధర
హరోం హర హర 
హరోం హర హర హర హర హర హర
హరోం హర హర 

ప్రళయ భయంకర, విష విలయంకర
విధి వికృత విన్యాసం
మారణహోమ విషానల కీలల
మరణమృదంగ ధ్వానం
ఒక మహమ్మారి లయ తాండవం
కాలాగ్ని దగ్గ జన కాండవం
ఆయంభయంకర సంతుల
విధ్వంసంకర సంకట సమయం
సంఘమరణవినివారణ తరుణం
శంకరా త్వమేవ శరణ్
అభయంకరా త్వమేవ శరణ్

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ

సహస్ర, సహస్ర సంఖ్యా నియమం
తంత్ర పిశాచ సమూహం
త్రినేత్ర జగత్రయేశ్వర సహయుస్వీయంత్రాహం
దుష్ట సమూహం ప్రతిఘటన
శక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ
ప్రజా ప్రాణ రక్షణ దక్ష
యుక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ

త్రిపురంజయ సమరంజయ
అసురంజయ మృత్యుంజయ
త్రిపురంజయ సమరంజయ
అసురంజయ మృత్యుంజయ
పురంజయ

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ


Palli Balakrishna Wednesday, March 10, 2021
Power Play (2021)



చిత్రం: పవర్ ప్లే (2021)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాజ్ తరుణ్, హెంల్ ప్రిన్స్, పూర్ణా, పూజా రామచంద్రన్, అజయ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: మహిధర్, దేవేష్
విడుదల తేది: 05.03.2021


Palli Balakrishna Tuesday, March 9, 2021
Naandhi (2021)




చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
నటీనటులు: అల్లరి నరేష్ , వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి , ప్రవీణ్, నవమి
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సతీశ్ వేగేశ్న
విడుదల తేది: 19.02.2021

గమనిక: డైరెక్టర్ సతీశ్ వేగేశ్న , నిర్మాత సతీశ్ వేగేశ్న వేరువేరు ఇద్దరు ఒకటి కాదు 
వీళ్లిద్దరి ఫొటో కోసం ఇక్కడ క్లిక్చేయండి



Songs List:



చెలీ... చెలీ... పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: శ్రీమణి
గానం: యన్. సి. కారుణ్య , హరిప్రియ మరన్గంటి

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే
ఊహించనిదే నా ఊపిరికెదురై
సంతోషమిలా వరదై ముంచినదే

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...

కాబోయేవాడే ప్రేమిస్తే ఆనందం ఆగేనా
మనువాడే వాడే మనసిస్తే ఆ బంధం తొణికేనా
నీవే పంచు ఈ ప్రేమకి కాలం చాలునా
వందే ఏళ్ళు ఈ గుండెకి వేలే కోరనా...

నా నువ్వుంటే నా వెంటే చాలంటున్నా
ఏ జనమ్మెనా నీ జంటై అడుగే వేసే
భాగ్యం నాకే కావాలంటున్న...

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...




ఇదే నాంది...పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: విజయ్ ప్రకాష్

ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా
దౌర్జన్యాల జ్వాలా...
న్యాయం కోసం ధర్మం కోసం
సాగాలమ్మా మీలా....

నిరాశలా నిశీధులే 
నిరంతరం ఆవరించినా...
ప్రభాతమై ప్రకాశమై
ప్రశాంతమై సాగుమా...

ఇదే నాంది...
ఘాతుకాన్ని గోతిలోన పాతడానికీ
ఇదే నాంది...
నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ
ఇదే నాంది...
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది...
రాక్షసాన్ని కూల్చడానికి

భయపడితే భవిత లేనే లేదు
పిడికిలినే వీడరాదు
సమరములో సాహసాలే తోడు
వెనకడుగే వేయరాదు
సవాలుకెదురుపడు సయ్యంటూ తిరగబడు
సహించి నిలబడితే మార్పే రాదు
దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ
జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడు

ఇదే నాంది...
కంటి నీరు మంట లాగ మారడానికీ
ఇదే నాంది...
రక్తమోడ్చి కొత్త బాట వేయడానికీ
ఇదే నాంది...
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది...
కోరుకున్న కొత్త చరిత రాయడానికీ



దేవతలంతా ఉలిక్కిపడేలా పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా

చూపుల బాణం వేసి కన్నులతో లాగే 
కొంటె పనే చెయ్యకే బాలా
హాయ్ గుండెలలోన కుడికాలు పెట్టేసావే నువ్వెవరే మల్లెలమాల
అరె కోవెలలో దీపములే చిన్నబోయెనే
నువ్వే కనులతో నవ్విన వేళా
గుడి గంటలుగా నా మనసే మోత మోగెనే
కథే తారుమారుగా చేసి వెల్లకే

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా

సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు
నీ కోసమే వెతుకుతు ఉసూరంటుంటే
హఠాత్తుగా ఎదురుగ ఇలా వస్తే నువ్వు
హడావిడే పడి మది హుషారయ్యిందే

రానే రాదు కదా నిద్దర నా వైపు
నువ్వే పగటికలై రాతిరొస్తుంటే
పోనేపోవు కదా ఊహలు ఆ లోపు
నిన్నే నా ఎదలో దాచుకుంటుంటే

మళ్ళీ ఏ నిమిషం దూరంగా వెళ్ళిపోనని
నువ్వే సంతకమే పెట్టావే పిల్లా
ఇలా నా ఎదుటే దగ్గరగా ఉండిపొమ్మని
నాపై ఒట్టు పెట్టి బెట్టు చెయ్యనా

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా
జాబిలి చెల్లా...




గుండెలోనా మండుతోందా పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కరిముల్లా

గుండెలోనా మండుతోందా మందు లేని గాయం
ముందరంతా ఉన్నదంతా అంతు లేని శూన్యం
కరిగెరా కరిగెరా బంధాలన్నీ కలగా
కదలదీ హృదయమే బండబారె శిలగా

నడిచే... ఎదవు నీవు కదా
గృహమే... శిథిలమాయెనుగా

మురిసిపోయిన జ్ఞాపకాలే
ముసురుకున్నవి నేడిలా
చిగురువేసిన రోజులన్నీ 
చెదలు బూజులే ఆయెగా

తిరిగెలే ఇచటనే అమ్మానాన్నలుగా
మిగిలెలే ఇపుడిలా పటము బొమ్మలుగా
బతుకులే చితుకులై మండాయి ఓ చితిగా
వెలుగునే నిలువునా మార్చాయి చీకటిగా

ఆఆ...మనసే...పగిలిపోయెనుగా
దిగులే... పొగిలి ఏడ్చెనుగా
కలలే... రగిలిపోయెనుగా
బతుకే...మిగిలే బూడిదగా

Palli Balakrishna Monday, March 8, 2021
Seetimaarr (2021)


 
చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
విడుదల తేది: 02.04.2021







చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి
పొద్దు తిరుగుడు పువ్వా
మా పాపికొండల నడుమ
రెండు జెల్లేసిన చందమామ నువ్వా
మలుపు మలుపూలోన
గలగల పారేటి గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు
పచ్చా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా

సీటిమార్ సీటిమార్
సీటిమార్ మార్ మార్

కొట్టు కొట్టూ ఈలే కొట్టు ఈలే కొట్టు - ఈలే కొట్టు
ప్రపంచమే వినేటట్టు వినేటట్టు - వినేటట్టు
దించితేనే అది గులు ఈ నేల గుండెపై
ఎదుగుతావు చిగురులా ఎత్తితేనే నీ తల
ఆకాశం అందుతూ ఎగురుతావు జెండాలా
గెలుపే నడిపే బలమే గెలుపే

కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డి

సీటిమార్ సీటిమార్ 
సీటిమార్ సీటిమార్

అలా పట్టుపావడాలు 
నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా
చలో ముగ్గులేసె చెయ్యి
నేడు బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్నసోట ఉండిపోక అలాగ
చిన్నదైనా రెక్క విప్పే తూనీగ
లోకమంత చుట్టు గిరగిరా

కబడ్డీ కబడ్డీ కబడ్డి
కబడ్డీ కబడ్డీ కబడ్డ

సీటిమార్ సీటిమార్
సీటిమార్ సీటిమార్ 

కబడ్డి కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దున
పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్
చెడుగుడు చెడుగుడు
చెడుగుడు చెడుగుడు

సదా ధైర్యమే నీ ఊపిరైతే
చిమ్మచీకటైనా వెన్నెలేగా
పదా లోకమేసే రాళ్ళనైనా
మెట్లు చేసి నువ్వు పైకి రాగా

జంకు లేక జింకలన్నీ ఇవ్వాలే
చిరుతనైనా తరుముతుంటే సవాలే
చెమట చుక్క చరిత మార్చదా

కబడ్డీ కబడ్డీ కబడ్డి
కబడ్డీ కబడ్డీ కబడ్డి

సీటిమార్ సీటిమార్
సీటిమార్ సీటిమార్ 

Palli Balakrishna Sunday, March 7, 2021
Love Story (2021)





చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: నారాయణ దాస్ నారంగ్. పి. రామ్మోహన రావు
విడుదల తేది: 2021



Songs List:





ఏయ్ పిల్లా పరుగున పోదామా పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హరి చరణ్




ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు
ఆ.. రంగుల విల్లుని తీసి..
ఈ వైపు వంతెన వేసి.. రావా..

ఎన్నో తలపులు, ఏవో కలతలు
బతుకే పొరవుతున్నా..
గాల్లో పతంగిమల్లె.. ఎగిరే కలలే నావి..
ఆశనిరాశల ఉయ్యాలాటలు,
పొద్దుమాపుల మధ్యే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే...

నీతో ఇలా.. ఏ బెరుకు లేకుండా
నివ్వే ఇగ.. నా బతుకు అంటున్నా...

నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే
తలగడగా..
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా
మిలమిల చూడే....

వచ్చే మలుపులు, రస్తా వెలుగులు..
జారే చినుకుల జల్లే..
పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే..
పొద్దే తెలియక, గల్లీ పొడుగున...
ఆడే పిల్లల హోరే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..

ఏయ్ పిల్లా పరుగున పోదామా...
ఏవైపో జంటగ ఉందామా...

పారే నదైనా కలలు ఉన్నాయే
చేరే దరే ఓ వెదుకుతున్నాయే...
నా గుండె ఓలి చేసి, ఆచి తూచి అందించా
జాతరలా..
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం
మెరుపుల జాడే...

నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి..
నేలన కనిపిస్తుందే...
మారే నీడలు గీసే.. తేలే బొమ్మలు చూడే..
పట్నం చేరిన పాలపుంతలు.. పల్లెల సంతలు
బారే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే...




నీ చిత్రం చూసి పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: అనురాగ్ కులకర్ణి




నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో...
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో...

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో...
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో...

నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో

ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళి మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నే
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటోంది ప్రేమా

ఆఆ ఆ ఆఆ... ఆ ఆఆ ఆఆ రరా ఆఆ ఆఆ

ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాలన్ని పల్లకీగా మలిచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలనీ

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా



సారంగ దరియా పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మంగ్లీ, సిందూరి విశాల్, సుస్మితా నరసింహన్




దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

కాళ్ళకు ఎండీ గజ్జెల్
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లె దండల్
లేకున్నా చెక్కిలి గిల్ గిల్

నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమల పాకుల్

మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిర మన దిల్

చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

రంగే లేని నా అంగి 
జడ తాకితే అయితది నల్లంగి
మాటలు ఘాటు లవంగి
మర్ల పడితే అది శివంగి

తీగలు లేని సారంగి
వాయించ బోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని చెంపల్ ఎన్నెల్ కురియ
దాని చెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళు దునియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా




ఏవో ఏవో కలలే పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: జొనిత గాంధీ, నకుల్ అభయంకర్




ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే
అన్ని దాటి మనసే హే ఎగిరింది
నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే
పాదాలకే అదుపే హేహే, లేదంది

రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... ఎదలో 
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... కథలో

ఏంటో.. కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు
ఏంటో.. గగనంలో తిరిగా
ఏంటో.. కొత్త కొత్త ఊపిరందినట్టు
ఏంటో.. తమకంలో మునిగా
ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల
గుండె సడి పాడింది కిలకిల
పూలాతడి మెరిసింది మిలమిల
కంటితడి నవ్వింది గలగల

ఊహించలేదసలే ఊగిందిలే మనసే
పరాకులో ఇపుడే హే హే పడుతోందే
అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే
సంతోషమే చినుకై దూకిందే

రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... ఎదలో 
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... కథలో

ఏంటో.. కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు
ఏంటో.. అసలెప్పుడు కనలే
ఏంటో... గుండెచాటు ఇన్ని సిత్తరాలు
ఏంటో.. ఎదురెప్పుడు అవలే
నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని దాచెయ్యన
ఒక్కొక్క వరమని
నీతో ఇలా ఒక్కొక్క వరముని పోగెయ్యనా
ఒక్కొక్క గురుతుని

ఇటువైపో అటువైపో ఎటువైపో
మనకే తెలియని వైపు
కాసేపు విహరిద్దాం చల్ రే... హో హో

ఏంటో మౌనమంత మూత విప్పినట్టు
ఏంటో సరిగమలే పాడే
ఏంటో వానవిల్లు గజ్జ కట్టినట్టు
ఏంటో కథకళినే ఆడే
గాల్లోకిలా విసరాలి గొడుగులు
మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు
సరిహద్దులే దాటాలి అడుగులు
మన జోరుకి అదరాలి పిడుగులు

ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు
ఏంటో మన మధ్యన జరిగే
ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు
ఏంటో వెయ్యింతలు పెరిగే
ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు
ఏంటో ముందెప్పుడు లేదే
ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు
ఏంటో గమ్మత్తుగా ఉండే



Palli Balakrishna

Most Recent

Default