Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swag (2024)




చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
నటినటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ 
రచన మరియు దర్శకత్వం: హసిత్ గోలి 
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ 
విడుదల తేది: 04.10.2024



Songs List:



సింగరో సింగ పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: నీక్లేష్ సుంకోజి
గానం: బాబా సెహగల్ , వైకోమ్ విజయలక్ష్మి

సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
హోయ్ సింగరో సింగ
అబ్బో సింగరో సింగ

ఖామోష్ కూసోర్రి
కండ్లార్పకుర్రి కంటెంటుతోని
అస్తాండు సింగరో సింగ…
పక్కక్ జరుగుర్రి…
దండల్ గుచ్చుర్రి…
దండాలు గిండాలు పెట్టుర్రి
అస్తాండు… (సింగరో సింగ)

జర నువు సైడ్ పోరా లంగా
హెయ్, సింగరో సింగ
అరె సింగరో సింగ…

మ్ మ్…టిప్పు టాపు తోపు
ఊపే మా సింగ…
ఆల్వేస్ ట్రెండింగు కింగా
అరె టిక్కు టాకుల ఏలు వెట్టిండంటే
బ్యాంగేరా నా సామి రంగ…

టిప్పు టాపు తోపు
ఊపే మా సింగ…
ఆల్వేస్ ట్రెండింగు కింగా
అరె టిక్కు టాకుల ఏలు వెట్టిండంటే
బోలేతు నా సామి రంగ, రంగా…

ఫైరు మీద ఉండే ఇంస్టా హ్యాండిలు
క్రేజు సూడు తమ్మి జస్టు మెంటలు
నోరు ఎల్లబెట్టి లెక్కవెట్టరో బాబు
లైకులు షేర్లు సబ్స్క్రైబులు…యో

సింగ పేరు మీద లక్ష ఫేకు పేజీలు
చిచ్చు రేపుతున్న నిత్య ఫ్యాను వారులు
ఏది ముట్టు వైరలు, ముడ్డి సుట్టు పాపలు
సింగన్న సిత్రాల లీలలు…

సింగన్నే సేసిండో ఆ సిటారు కొమ్మన ఓ రీలే
అఫ్సోసై సూస్తాయే కొండమీద కోతులే
కంటెంటే వదిలిండో… ఇక ఇంటర్నెట్టే బెదరాలే
హైపు తెచ్చి మీన కుమ్మాలే… లైకుల చుమ్మాలే

సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
వన్ మోర్ టైం…
సింగరో సింగ
అబ్బో సింగరో సింగ, ఆహ

టిప్పు టాపు తోపు
ఊపే మా సింగ…
ఆల్వేస్ ట్రెండింగు కింగా
అరె టిక్కు టాకుల ఏలు వెట్టిండంటే
బ్యాంగేరా నా సామిరంగ…

టిప్పు టాపు తోపు
ఊపే మా సింగ…
ఆల్వేస్ ట్రెండింగు కింగా
అరె టిక్కు టాకుల ఏలు వెట్టిండంటే
బోలేతు నా సామి రంగ, రంగా…

క్యా బాత్ హే సింగ
యూ అండ్ మీ సింగ
షీ అండ్ హీ సింగ
ఏవ్రీబడీ సింగ ||2||
సింగరో సింగ… నా సామిరంగ




గువ్వ గూటిలో పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: భువనచంద్ర  
గానం: మనో, గీతామాధురి , స్నిగ్ధ శర్మ 

టుర్ర్, దినకదిన్…
పపరపర ప్… పపరపర ప్

హే, గువ్వ గూటిలో రవ్వలసాని
మువ్వ మోజులో జోరుజవాణి
ఘుస్ కే లగాలే ఇష్క్ నిషాని రాణి

హే, రెమ్మ చాటున ఉంది రుమాని
తొంగి చూసుకో అంది దివానీ
కొల్లగొట్టరో కొత్త మజానీ… జానీ

సునో కాదంబరీ… ఛలో నీలాంబరీ
సుకుమారి, అతి ప్యారీ… దరికొచ్చేయ్ మరి
ఛలో హేరంబుడా… సరి సారంగుడా
నినుకోరే దరిచేర… అరె కొట్టేయ్ సోడా

నీ జాడపట్టి వచ్చానే
ఖుషీగా వచ్చానే
చలోరే అంజానే….
మహా మెచ్చుకున్న మింసారే
మజాగా ఆజారే…
ఆడ తట్టి… ఈడ తట్టి
ఆడ పట్టి… ఈడ పట్టి
కరో కరో కరో… కరోకరోకరో
గడబిడ గడబిడలే

లక్స్ సోపు లాంటి లేడీ
రెచ్చి రేగినాది బాడీ
హే, కొక్కో అంటు కూసే కోడి
హ, పంబరేపు ఆడి పాడి…

గువ్వ గూటిలో రవ్వలసాని
మువ్వ మోజులో జోరు జవాణి
ఘుస్ కే లగాలే ఇష్క్ నిషాని రాణి

హే, రెమ్మ చాటున ఉంది రుమాని
తొంగి చూసుకో అంది దివానీ
కొల్లగొట్టరో కొత్త మజానీ జానీ

హ ఆ, అగ్గిపుల్ల అంటుకుంటే మంటా
ఆడపిల్ల కన్ను కుట్టేనంటే తంటా
జీన్సు లోని బౌన్స్ చూడమంటా, హ హ
రొమాన్స్ లోనే స్వర్గమున్నడంటా
హే, మత్తుకళ్ళ ఓ లచ్చిమి
హగ్గులిస్తా కిచ్చిమి
హగ్గులిస్తే రాజా… నే సిగ్గులిస్తా లేజా

ధీంతనక్కు ధిన్నాలే
మురబ్బా ఇస్తాలే.. సవాలే చేస్తాలే
చాం చమక్కు చుమ్మాలే
అజంతా అధరాలే
వీలు చూసి… చాలు చూసి
డాలు పట్టి… డోలు కొట్టి
కరో కరో కరో… కరోకరోకరో
గడబిడ గడబిడలే

లక్స్ సోపు లాంటి లేడీ
రెచ్చి రేగినాది బాడీ
హే, కొక్కో అంటు కూసే కోడి
హ, పంబరేపు ఆడి పాడి…



ఇంగ్లండ్ రాణి పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: స్వరూప్ గోలి 
గానం: కైలాష్ ఖేర్

ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
సోదాలే సీసేనే

ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
సోదాలే సీసేనే
కయ్యాల నారి ఆ మీసగాన్ని
కారంగా సూసేనే

కయ్యాల నారి ఆ మీసగాన్ని
కారంగా సూసేనే
ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
బాణాలే వేసేనే

కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి ఆగేనే
రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే

ఆహా రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే
అరె రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే

ఆడే ఆటంతా నీదే కావాలి
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే

సక్కాని రాణి సిక్కలతో నీ సిట్టాలు తేలేనే
బొమ్మైన రాణి రాకున్న పోని నెగ్గేది నీవేలే

ఆరి తేరినాది తీరే మారినాది
తీరా యేమిటని సూసాకే
ఇంతి పంతం ఎంతో ఉన్న గాధే
ఇంతే ఇంతేనంటే సరి గాదె
ఓ… దమ్మున్న పోరి అల్లంత భారి
స్టోరీ లూ నీవేలే

కయ్యాలా నారీ ఓ రాకుమారి
ఉండాలి నీ రూలే
ఆహా ఉండాలి నీ రూలే

ఆహా.. రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే
అరె ఆడే ఆటంతా నీదే కావాలి
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే

సక్కాని రాణి సిక్కలతో నీ సిట్టాలు తేలేనే
బొమ్మైన రాణి రాకున్న పోని నెగ్గేది నీవేలే
సుత్తూర నీరే సుక్కాని నావే సక్కంగ పోతాదే
పోటెది గాని పూటేది గాని పాటింక నీదెలే
సుత్తూర నీరే సుక్కాని నావే సక్కంగ పోతాదే
పోటెది గాని పూటేది గాని పాటింక నీదెలే





నీలో నాలో కదలాడు భావమీరాగం పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్యా

నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

నీలో నాలో… కదలాడు భావమీరాగం
లోలో ఎదలో… వినిపించ సాగే ఓ తాళం

తమకపు తీరాలలో
పెదవుల సయ్యాటలో
తరగని శృంగారమే
తెరిచిన సౌధాలలో

రేపటి కలనే చెలియా కందామా..?
కమ్మని కబురే జతగా విందామా..?

నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం…

కలల జడి నేను… కావేరి నువ్వు
ఓ ప్రణయ తీరం సాకారమే
కువకువల గువ్వ గోరింక లాగా
మనము ఒకటైతే… నవ లోకమే

వేకువై నేనుంటా… నీవెంట ప్రేమ
వెన్నెలై నను చేరి అలరించరావా!
గాలులను ఎదిరించె… కొండవలే నేనుంట
ఒదిగిపో వెచ్చగా
గుండెలో.. (గుండెలో, గుండెలో)

నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

తనదైన తీరం… పెను దూరమైతే
సుడిలోని నావా సాగేదెలా? ఆ ఆ
వలచి వలపించే ప్రియమైన గీతం
ఎదకు ఎడమైతే నిలిచేదెలా?

వెన్నెలను మింగేసే… మేఘాల మొహం
వేకువను కప్పేసే… మోహాల దాహం
ఉల్కలే ఉప్పెనగా… రాలేటి గగనాన
నవ్వులే పువ్వులై విరియునా
(విరియునా, విరియునా విరియునా)




చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రిత్విక్ యస్. చాంద్ 

చందమామ 



తాండవ రూపం పాట సాహిత్యం

 
చిత్రం: స్వాగ్ (2024)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: కల్పనా రాఘవేందర్ 

తాండవ రూపం 

No comments

Most Recent

Default