Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1993"



చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సీతారామశాస్త్రి, జాలాది, భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాసూరావు
నటీనటులు: ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
విడుదల తేది: 30.07.1993



Songs List:



ఏమని చెప్పనులే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: జాలాది 
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఏమని చెప్పనులే 



సందింట్లో సరిగమ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

సందింట్లో సరిగమ




ఆ నింగి పుట్టినరోజే... పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: ఎస్.పి.బాలు 

ఆ నింగి పుట్టినరోజే...




కనరండి కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

కనరండి కళ్యాణం



రా రంభోలా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, వాసూరావు

రా రంభోలా

Palli Balakrishna Saturday, May 16, 2026



చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని
నటీనటులు: హరీష్, సౌందర్య (తొలి పరిచయం)
మాటలు: దివాకర్ బాబు
దర్శకత్వం: పి. యన్. రామచంద్రరావు
నిర్మాత: యం. దశరథ రాజు
విడుదల తేది: 22.01.1993



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు 
గజ్జల ఝాంకారమా ఓసి తస్సాదియ్య 
తుళ్ళి తుళ్ళి తుళ్ళి పడ్డ 
కాసుల వయ్యారమా కోటి కళ్ళు కొయ్య 



చాంగు భళా దేనికిలా పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

చాంగు భళా దేనికిలా 



చంపకు చారెడు పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

చంపకు చారెడు 




కో కో కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

కో కో కోయిల 



కలయో నిజమో పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

కలయో నిజమో 

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సుహాసిని, వినోద్ కుమార్, రవీనా టాండన్
దర్శకత్వం: శరత్
నిర్మాత: బి.బుల్లి సుబ్బారావు
విడుదల తేది: 14.08.1993



Songs List:



అబ్బరే జబ్బరే కొబ్బరే పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
అబ్బరే జబ్బరే కొబ్బరే 
అందని యబ్బ నీ లబ్బరే 
అబ్బిగో సుబ్బిగో నిబ్బరే 
ఆపరో యబ్బ నీ అల్లరే 

జివ్వుమన్న ఎర్ర బుగ్గ సిగ్గులంటుంటే 
యవ్వనాలే ఆగలేక భగ్గు మంటుంటే 
ఏటిలో లోగిలో పైగిలో కౌగిలై

చరణం: 1
రెమ్మలో పూవుకై తుమ్మెద తొందర 
తుమ్మెద రాకడ తెనేకే తీపిరా 
గులాబీ సెంట్ మొగ్గల్లో జిలేబి నందుకుంటాలే 
మజాల మల్లె పంటల్లో భజాన దోచి పెడతాలే 
అందమో చందమో చిందర వందరే 

చరణం: 2
ఆశ ముదిరైనచో ఆడదే ఊపిరి 
ఐనను ఆగునా జాజుల జాతరే 
తగాదాలాడుకుంటూనే సగాల విందు చేసేస్తా 
సరేలే సందెవేళల్లో వసంతాలాడి చూపిస్తా
వలదురో వద్దురో ముట్టుకోవద్దని 




మేఘమా ప్రియ స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం
చదివింది ఈడు చెలి దండకం
తెలిసింది నేడే చలి నాటకం
ఆషాడ మాసాలజల్లు
గుండెల్లో గుచ్చింది ముల్లు రానీ మామూలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం

తడి చీర కొంగు తాళాలన్ని
కోడిగట్టిపోనీ తాపాలైతే
ముడి జారి పోనీ కొణాలన్ని
మురిపాల పూల బాణాలైతే
వానొస్తే ఎం నేనోచ్చాగా వాటేసుకో
ఎంతిస్తున్న కొంతెకాదా ఈ జోరులో
వానలో జడివానలో
జాణవో చలి వీణవో
శృంగారం ముగ్గేసుకున్న
వయ్యారి గొబ్బిల్లకొచ్చే నీతో తంటాలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం

బుడమేటి పొంగు బుగ్గంటిన
బులిపించకుండా బుద్దాగునా
ఎండమ్మ కళ్లు చల్లారినా
యదలోని పొంగే వేడాగునా
ఎరుచ్చిందో ఎమొచ్చిందో ఈ ఈడులో
ముద్దోచ్చింది ముంచెత్తింది నీ తోడులో
పై యెద అటు పై యెద
చూపుకే శ్రుతి మించదా
కార్తిక కౌగిళ్ళు దాటి
వైశాక వేవిళ్ళు కొచ్చే నీలో అందాలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం
చదివింది ఈడు చెలి దండకం
తెలిసింది నేడే చలి నాటకం
ఆషాడ మాసాలజల్లు
గుండెల్లో గుచ్చింది ముల్లు రానీ మామూలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం




నర్మదా నది తీరంలో పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట

ఎగుడు దిగుడు ఎదలోనా
మొగలి పొదలు రగిలేనే
పగలే మసక పడుతుంటే
పెదవి పెదవినడిగేనే

పూయకే మల్లెలా మాయలో, మత్తులా
చేయకు చిట్టిల అందని ఎత్తులా
సొంపుకో సొగసును చూపి
దింపకే దిగులు సఖీ
చెంపకో చెఱుకుల ముద్దు
పంపరా పనస రుచి
ప్రేమలో ఏదేటూ ఏదిటో, ఓఓ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట

చిలిపి చిలిపి కలలెన్నో
నెమలి కనులు నెమరేసే
వదులు వదులు వలదంటే
చిగురు వలపు ముదరేసే

పాడకే కోకిలా… ఈడులో కోడిలా
ఆడితే శోకిలా… వేడిలో వెన్నెలా
సందెకో చలిరుతువొచ్చి
అందమే వణికెనురో
పొద్దుకే పొడుపులు వచ్చి
నిద్దరే చిరిగెనులే
ప్రేమలో ఏమిటో ఏదిటో, ఓ హొ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ



సీతమ్మ చిలికింధి పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

సీతమ్మ చిలికింధి



టప్పు టప్పు టప్పంగుత్తి పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్.పి. బాలు

టప్పు టప్పు  టప్పంగుత్తి

Palli Balakrishna Tuesday, April 28, 2026



చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
నటినటులు: సురేష్ , రంభ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య 
నిర్మాతలు: సి.వి.రెడ్డి, కె.శ్రీదేవి
విడుదల తేది: 25.06.1993



Songs List:



అమ్మో నొప్పి పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: డి.నారాయణ వర్మ 
గానం: మనో, చిత్ర

అమ్మో నొప్పి 




బావ బావ పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

బావ బావ




గోల గోల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు,చిత్ర

గోల గోల 




ఇది రాగమైన అనురాగమే - 1 పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

పల్లవి:
ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే
కన్నులే యద జల్లగా...కాటుకే హరివిల్లుగా 
జత పడిన మనకు శ్రుతి కలిసెనిపుడు 
ప్రియతమా మధురలయే కదా మనుగడ

చరణం:
వేణువులూదేను వేసవి గాలి 
మువ్వలు చిందే కిన్నెరసాని 
మగసిరి మారాజు దొరికేనని 
సొగసిరి అందాలు దొరకేనని 
ఇటు పూలతోట..అటు తేనెపాట 
ప్రియ స్వాగతాలు పాడేసన్నగా
అలివేణిలాగా చలి వీణతీగ
విరి మూగబాసలాడె ముద్దుగా 
యద ఝుమ్మని...దరి రమ్మని 
తొలిఋతువు పలికె పసి పెదవి వణికే
మామ అనే మధుర వసంతమే మనుగడ

చరణం:
నవబృందావని నవ్వుల మాసం 
మమతల కోయిల మధురసరాగం 
మనసున నీ నీడ పోడిగించగా
మనిషిగ నీలోన తలదాచగా
ముసినవ్వు సిగ్గు ముత్యాలముగ్గు 
రస రాజధాని స్వాగతాలుగా
అటు గోకులాన ఇటు గుండెలోన
నవ రాసలీల సాగేలీలగా 
నను రమ్మని...మనసిమ్మని 
ఒక తలపు పిలచె ఒడి తలుపు తెరిచే
కలవరాలొలుకు కధే కదా సరిగమ...




ఇది రాగమైన అనురాగమే - 2 పాట సాహిత్యం

 

చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే

Palli Balakrishna Wednesday, July 6, 2022



చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణ, భానుప్రియ, రమ్యకృష్ణ, మోహన్ బాబు 
దర్శకత్వం: యస్.రామచంద్ర రావు
నిర్మాతలు: జి.రామ్మోహన రావు
విడుదల తేది: 21.09.1993



Songs List:



అక్కడ ఇక్కడ ఎక్కడ పాట సాహిత్యం

 
చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

అక్కడ ఇక్కడ ఎక్కడ 



గువ్వ చూడు పాట సాహిత్యం

 
చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

గువ్వ చూడు 




మల్లెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మల్లెల్లో 




నా ఊపే ఉల్లాసం పాట సాహిత్యం

 
చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

నా ఊపే ఉల్లాసం 



ఉక్కిరి బిక్కిరి పాట సాహిత్యం

 
చిత్రం: కిరాయి గుండా (1993)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఉక్కిరి బిక్కిరి 

Palli Balakrishna Tuesday, August 24, 2021





చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
నటీనటులు: సురేష్ చంద్ర మీనన్ , రేవతి, వినీత్ , రవిచంద్రన్ 
దర్శకత్వం: సురేష్ చంద్ర మీనన్ 
నిర్మాత: 
విడుదల తేది: 28.05.1993



Songs List:



ఇదియే ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: సుజాత 

ఇదియే ప్రేమ 




అందం (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: సుశీల 

అందం 



పుత్తడికి మెరుపందం... పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: యస్.పి. బాలు

పుత్తడికి మెరుపందం... పున్నమికి శశి అందం
నాదాలు శృతికందం... రాగాలు కృతికందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం

కిరణాలు రవికందం... సెలయేరు భువికందం
మగువలకు కురులందం... మమతలకు మనసందం
పుత్తడికి మెరుపందం... పున్నమికి శశి అందం
పుత్తడికి మెరుపందం... పున్నమికి శశి అందం
నాదాలు శృతికందం... రాగాలు కృతికందం

వేకువకు వెలుగందం... రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం... ఆశలకు వలపందం
తలపులే మదికందం... వయసుకే ప్రేమందం
తలపులే మదికందం... వయసుకే ప్రేమందం
పాటకే తెలుగందం... శ్రీమతికి నేనందం





# పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: మనో, అనుపమ 

జూలై మాసం 



ఇదియే బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: యస్.పి. బాలు, సుజాత 

ఇదియే బ్రతుకు 



శంబో శంబో పాట సాహిత్యం

 
చిత్రం:  పద్మవ్యూహం (1993)
సంగీతం:  ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం:  రాజశ్రీ
గానం: మాల్గాడి శుభ , మిని మిని, అనుపమ

శంబో శంబో 


Palli Balakrishna Saturday, July 24, 2021





చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
నటీనటులు: ప్రశాంత్, ఆనంద్, హీరా రాజగోపాల్ , అను అగర్వాల్ 
దర్శకత్వం: మణిరత్నం 
నిర్మాతలు: డి.సుదాకర రాజు, డి. అరుణ 
విడుదల తేది: 13.11.1993



Songs List:



కొత్త బంగారు లోకం పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  మనో , చిత్ర 

కొత్త బంగారు లోకం 





ఆకతాయి ఒక్కడంట పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  జి.వి.ప్రకాష్ కుమార్ 

ఆకతాయి ఒక్కడంట



కొంచం నీరు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  అనుపమ 

కొంచం నీరు 




వీర బొబ్బిలి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  చిత్ర ,  ఉన్ని మీనన్ , మనో  

వీర బొబ్బిలి 



కనులు కనులను పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం:  మనో 

పల్లవి :
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

చరణం : 1
వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం
కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం
ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం
అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

చరణం : 2
పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం
చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం
వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం
ఎగిరితే నువు ఎముకలిరిస్తే
విజయమని దానర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం



యేటిలోన చాపలంట పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  శ్రీనివాస్, సురేష్ పీటర్స్ 

యేటిలోన  చాపలంట




సీతాలు నువ్వే లేక పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం:  షాహుల్ హమ్మీద్

సీతాలు  నువ్వే లేక 




తీ తీ తీయని పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం:  సుజాత మోహన్ 

తీ తీ తీయని 

Palli Balakrishna Thursday, July 22, 2021


చిత్రం: మావారికి పెళ్లి (1993)
సంగీతం: శంకర్ గణేష్
నటీనటులు: ఆనంద్ బాబు, సితార
దర్శకత్వం: రామనారాయణ
నిర్మాతలు: నార్నే శ్రీనివాస రావు, ఎన్. డి. విజయబాబు
విడుదల తేది:26.01.1993



Palli Balakrishna Wednesday, May 12, 2021


చిత్రం: పరువు ప్రతిష్ట (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: సుమన్, సురేష్ , మాలాశ్రీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సి.గుహనాథన్
కో-డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1993

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

ప్రేమసీమ సొంతమాయె చందమామ
జోడు సంబరాల సంగతే పాడవమ్మా
పాడవమ్మా పాడవమ్మా
రంగమంత సిద్ధమాయె చుక్కభామ
వేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మా
చూడవమ్మా చూడవమ్మా
తపించు ప్రాయాలు తరించి పోవాలి
గమ్మత్తు గాయాలతో
రహస్య రాగాలు తెగించి రేగాలి
కౌగిళ్ళ గేయాలతో
వానవిల్లై పెదవులు
ముద్దునాటే పదునులో
బాణమైనా గానమైనా
తేనెకాటే తెలుసుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

మాయదారి సోయగాలు మోయలేక
నీకు లేని పోని యాతనా కన్నెతీగా..
కన్నె తీగా.. కన్నె తీగా..
తీయనైన తాయిలాలు దాయలేక
నీకు పాలు పంచి పెట్టనా తేనెటీగా
తేనెటీగా తేనెటీగా
సయ్యంటు వస్తాను చేయూత నిస్తాను
వెయ్యేళ్ళ వియ్యాలతో
వయ్యారమిస్తాను ఒళ్ళోకి వస్తాను
నెయ్యాల సయ్యాటతో
బంధనాలే సాక్షిగా మంతనాలే చేయగా
మన్మధుణ్ణే మధ్యవర్తై
ఉండమందాం చక్కగా

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే




Palli Balakrishna Saturday, March 2, 2019


చిత్రం: కన్నయ్య కిట్టయ్య (1993)
సంగీతం: వంశీ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన, ఆమని
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: గంగుల ఇందిర
విడుదల తేది: 1993

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా

ఏమీ విరహ గోల ఆగవా
అబ్బ ఏంటీ ప్రణయ లీల ఆపవా
వద్దు చిన్ని కన్న హద్దు దాటకన్నా
నీపై ప్రేమ వెన్న నాలో నిండు సున్న

కృష్ణా నీకు ఇది న్యాయమా
ముద్దు కృష్ణా నీకు ఇది న్యాయమా
సత్యభామను వీడి రుక్మిణి చెలిని వీడి
మాయాలాడిని కూడు మమ్మే మరిచిపోవ
కృష్ణా నీకు ఇది న్యాయమా

ఆపండీ పితలాటకం మీ ఆటా పాటా బూటకం
విశాఖపట్నం కేసనీ తెలిసిందమ్మో ఆల్రెడీ
ఇద్దరు కలిసి పైబడీ చెయ్యొద్దు శీలం దోపిడీ

బుంగమూతిలో దాగె బృందావనం
పెదవుల మాటున దాగె మధురానగరం
ఈ కోమలాంగి కోపమంతా పైపైనే
ఈ శోభనాంగి ఆరాధన నాపైనే

ఆరాధనా ఆలాపనా గోంగూరా
పోజు ఆపరా పొగడబోకురా పోపోరా
నీ విరహ గోలా ఈ మదన జ్వాలా
అంటించకు నాకూ సారీ సారీ ఆపు
ప్రేమించమంటూ పేట్రేగి పోకు
షంటేయకూ నన్నూ సారీ సారీ స్టాపు

ఇంత మాయ చేస్తావా ఓ ప్రాణనాథా
మాకేల నీవలన సంసార బాధా
ద్వారకను వదిలేసి సత్యా రుక్మిణిని
భువికి చేరి కలిసావా ఆ టక్కులాడినీ

అమ్మో బాబో నాకేం తెలీదూ
కుయ్యో మొర్రో ఇది ఏం వెర్రో
ఓ గుమ్మలారా వెంకమ్మలారా
మీ మొగుణ్ణి కానే నేను
నాకింకా పెళ్ళే కాలేదు
వెళ్ళండి తల్లీ వెళ్ళండీ
కోటి దండాలే మీకూ

ముద్దులోన పలికించు మురళీరవం
అమృతం చిలికించు ఆలింగనం
ఈ సుందరాంగి పొందులోని శృంగారం
రతి మదన సామ్రాజ్య పట్టాభిషేకం

నీకోతలూ లాలింపులూ చాలించేయ్
బుజ్జగింపులూ బ్రతిమిలాటలూ మానేసేయ్
నీ చెక్కభజనా ఈ మాయనటనా
నమ్మేందుకు ఇపుడూ ఎవరూ లేరు గురువా
నీ బుట్టలోనా నే పడనులేరా
ఓ చిట్టికన్నా వస్తా ఇకపై శలవా

సుఖపెట్టలేదా నిను ఓ సుందరాంగా
మొహం మొత్తెనా నీకు ఓ మోహనాంగా
పదహారు వేల మంది పసలేని వారమా
ఈ సవితి బాధేల ఓ కోమలాంగా

రంగా లింగా ఒకటే బెంగా
ఏంటీ మాయా యమ ఘోరంగా
లవ్ సెంటిమెంటు ప్లేచేయవద్దు
ఇక చికాకు తెప్పించద్దు
దయచేయండి ఛీపొండి
వచ్చిందపుడే క్లైమాక్స్
తప్పదు మీకు పేథాసు..

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా



Palli Balakrishna Friday, February 22, 2019

చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి, రాజ్-కోటి
నేపథ్య సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి, శోభన
దర్శకత్వం: కోదండ రామిరెడ్డి
నిర్మాత: ఏమ్. వి. శ్రీనివాస్ ప్రసాద్
ప్రొడక్షన్ కంపెని: యువరత్న ఆర్ట్స్
విడుదల తేది: 03.09.1993







చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలు, చిత్ర 


హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా
అబ్బో... సొరగాలే కరగాలే పాప
బామ్మో... తిరనాలే జరగాలో రయ్యా

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)


గొల్లుమని వెల్లడయ్యే నాటు సమాచారం
చాటువిడి పైట పడే సోకు దుకాణం
తుఫానులా తయారయ్యే చూపు సురేకారం
వచ్చిపడే మిర్చిటపా దూకు దుకాణం
జతపడు ఒక్క దఫా మతి చెడి సిగ్గు సఫా
రెప రెప లాడునుగా ఘాటు గలాట
తికమక తిమ్మిరిగా ముదిరిను ముచ్చటగా
గుబ గుబ లాడునుగా గుండె గలాసా
వహవా... ఎగిరావే దీపాళి చువ్వా
వారేవా... దిగిరావే నా పాల గువ్వా

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)

ఎల్లకిల వెల్లువయ్యే పిల్లడిలో తాపం
అల్లుకొనే గిల్లుకొనే కైపు కలాపం
దాపరికం దాటమనే అమ్మడి బండారం
నాటుకునే గోటికొనే దిక్కు దివానం
నిగ నిగ నిప్పు సెగ నిమిరితె అక్కసుగా
తెగ తెగ దుంపతెగ నిగ్గు నిగారం
చిటపట చిత్తడిగా చిర బర వత్తిడిగా
కరగక తప్పదుగా వన్నె వయ్యారం
బామ్మో... వళ్ళంతా గల్లంతే రయ్యో
భామో... గుమ్మెత్తే గమ్మత్తే నమ్మో

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)







చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి, రాజ్-కోటి
నేపథ్య సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలు, చిత్ర (All)

ఓల ఓల ఓలే... 
ఓలలో... ఓలలో... ఓలలో...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా
పుచ్చ పూల పున్నాల సాక్షి
పచ్చనైన మన్నెల సాక్షి
వెచ్చనైన వెన్నెల వేళయ్యా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా

చరణం: 1
యాళ పాల తలపెట్టని యాతర
నేల నింగి మెలిపెట్టర దేవరా
లేలో యాల ఎలుగెత్తిన జాతర
మాను మాకు నిలువెత్తున ఊగెరా
హేయ్ కోలాటాలే తాళం వేస్తే
కైలసాలే తూగాలా
తేనె పట్టు రేగినట్టు పాలపిట్ట పాడినట్టు
కోన చుట్టు సందడి యియాలా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

హేయ్ రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా

చరణం: 2
చిలో పొలో చిరెక్కేరో శివమెత్తిన సత్తువ
శభాష్ గా చూపెట్టెరో మగపుట్టుగ మక్కువ
కురో కురో కిర్రెక్కెరో జొరబంటల కువ కవ
తళ తళ తలుక్కనే కరిమబ్బుల మెళకువ
హో కొండ కోన అందెలు గట్టి తందనాలే రేగాలా
జావుల నిదర చెడ జాబిలి అదిరి పడ
కోడిఈడె కూతలిడే వేలాయే

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

హేయ్ రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా
హో పుచ్చ పూల పున్నాల సాక్షి
పచ్చనైన మన్నెల సాక్షి
వెచ్చనైన వెన్నెల వేళయ్యా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)



Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 09.07.1993



Songs List:



కొండపల్లి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే
త్యాగం ఉన్న గొప్ప జాతి నీది
సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే
జాలిలేని పాడు లోకం మాది తెలుసా బసవన్న
నీకైనా యెందుకు ఇంతటి భేదం
క్షణమే బతుకన్న ఓ బసవన్న
మనిషికి లేదురా పాశం
కాటికెళ్ళినా కాసు వీడడు
సాటివాడిపై జాలి చూపడు
డబ్బును మేసే మనుషులు కన్న
గడ్డిని మేసే నువ్వె మిన్న

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి
కూర్చినాడు మనిషి విమానం
వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి
నేర్చినాడు పడవ ప్రయాణం
దివికి భువికి ముచ్చటగా
నిచ్చెన వేసిన మనిషి
చెలిమి కలిమి నలుగురికి
ఎందుకు పంచడు తెలిసీ
తరిగి పోనిది ప్రేమ ఒక్కటే
తిరిగి రానిది ప్రాణమొక్కటే
ప్రాణం కన్నా స్నేహం మిన్న
స్నేహం లేని బతుకే సున్నా

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా 





గువ్వం గుడుగుడు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , యస్.పి. శైలజ

హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ
పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా
రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ
రెక్కపట్టి రెచ్చకొట్టి చుట్టుముట్టి
ఛీఛీకొట్టి దుడుకు దుడుకు
వయసు ముడుపులడిగిన
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ

చికిచికి చాo చికిచికి చాo చాo
ముద్దబంతి పువ్వు
చికిచికి చాo చికిచికి చాo చాo
ముద్దులాడనివ్వు
లకిచికి చాo లకిచికి చాo చాo
వేడి వేడి లవ్వు
లకిచికి చాo లకిచికి చాo చాo
ఆరగించనివ్వు
కసకస లాడే మిస మిస లన్నిచూసా
పరువపు సరిగమలో
పెదవుల పదనిసలా
పంచుకున్న పోక చక్క
పెంచమంది తీపి తిక్క
అసలు సిసలు మరుల మలుపు తెలియగ
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ

తకధిమితోo తకధిమితోo తోo
వగలమారి పింఛం
తకధిమితోo తకధిమితోo తోo
విప్పుకుంది కొంచెం
దిమికిటతోo దిమికిటతోo తోo
మల్లెపూల మంచo
దిమికిటతోo దిమికిటతోo తోo
అడుగుతోoది లంచం
పదపదమన్న పసి పసి పొంగు చుసేయ్
తనువుల తొణికిసలో
సొగసుల రిమరిమలే
వెచ్చబడ్డ వెన్నెలమ్మ
వెన్ను మీద వాలుతుంటే
కొసరి కొసరి చిలిపి వరములడిగిన
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ
పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా
రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ
రెక్కపట్టి రెచ్చకొట్టి
చుట్టుముట్టి ఛీఛీకొట్టి
దుడుకు దుడుకు వయసు ముడుపులడిగిన
హే హే హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ



దానిమ్మ తోటకు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర

దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు
అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల
కౌగిలింతలొ ఒదిగే ఉంటూ
చిరాకులే సరాగారమై పారాకు లారగించి
పైటంతా పక్కకు దీసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు, కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు

ఎడమ కుడి కన్నుల జంట అదిరింది నీకు
నాకు ఏక మంచ యోగముందని
ఆ పందిరి పట్టె మంచంలో తెలిసింది
వెన్ను వెన్ను ఆనిస్తే వెన్నలేనని
చిలిపి సొగసు చలికి రగిలే
పెదవి చివర ఎదలు పలికే
కూసినా తొలికోడి అనలేదు కోక్కొరుకోక్కో
కోరుకో ఒకసారి సరసాల చెమ్మల చెక్కు
సుఖీభవే సఖిప్రియ తపించి పోవు జంట
తపాలే దీపాలెట్టి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు

గణపవరం సిద్ధాంతి అన్నడు

వలపుల్లో వర్జలే ఉండబోవని
గన్నవరం వేదాంతి చెప్పాడు
కౌగిలింత నోముల్లో కరిగిపోమ్మని
నలక నడుము మెలిక తిరిగి
తొడిమే తగిలి తొనలు అదిరే
చచ్చినా చలిగాలి మరి రాదు వెన్నెలకొడకో
వచ్చినా వడగాలై మరిగేను మల్లెల మొలకో
కదా ఖుషి కమామిషి కామాను అన్న వేళా
కౌగిట్లో చప్పట్లేసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు
అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల
కౌగిలింతలొ ఒదిగే ఉంటూ
చిరాకులే సరాగారమై పారాకు లారగించి
పైటంతా పక్కకు దీసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు






ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు , చిత్ర

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే
ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ
యమ్మహో యమ్మహో యమ్మహా
విందులే అందుకో కమ్మహా
ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తాఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా

కన్ను కొట్టుడు రోజుల్లో కాగే
కౌగిళ్ళల్లో నీ ప్రేమకె సెగనై తగిల
పైటలాగుడు పుటల్లో సాగే సంజట్టల్లో
నీ సిగులే నిరుడే అడిగా
తొణికే పాలే
తొలికొపాలై
తడిరూపాలే
అహహహ ఒడి దీపాలై
అహహహ
గిల్లి గిల్లి కజ్జా లెట్టి
బుల్లి బుల్లి బుజ్జయంటీ ఈడును
లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే
యమ్మహో యమ్మహో యమ్మహా
ఎక్కడో నొప్పిగ వుందాహ

ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా

ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో
నీ వన్నెలో వెన్నెలే చిలికా
తెల్ల వారని పొద్దుల్లో తెరిచే
వాకిళ్ళలో నా నవ్వులే ముగ్గులోకలిపా
మనసే నీవై
తనువేనేనై
శృతిలో ఉంటే
అహహహ పతిగా ఓకే
అహహహ
చిట పట చేమంతుల్లో కట్టు బొట్టు
గల్లంతుల్లో హద్దులు దాటి

అల్లరి చేసి ముద్దే దోస్తుంటే
యమ్మహో యమ్మహో యమ్మహా
ఎప్పుడో ఎక్కడో అమ్మహా
ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే
ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా
ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
విందులే అందుకో కమ్మహా
యమ్మహో

యమ్మహో
యమ్మహా
యమ్మహో
యమ్మహో
యమ్మహా




అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా

కోరస్:
గొల్లవాడే గొల్లపిల్లవాడే
పాలవాడే మీకు ఈడు జోడే

పాలుగారే బుగ్గా మొగ్గా పిండేస్తా
మల్లె పూలల్లోని సోకు నీకు దండేస్తా
పాలే పంచి పక్కంగాను తోడేస్తా
నువ్వు పాలిస్తుంటే పండుచెండు విందిస్తా
రాగాల రాస లీలల్లో రగడ
నీకేర రాతిరేలల్లో మగడా
పాలరాతి మందిరం
పంచదార పంజరం
నా గోల వేసెటి ఈలలుతో  నీ వెన్న జున్ను వేడెక్కిస్తా

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్

మణిక్యాల మెడలోన మారాజ
నీకు అందిస్తున్నా స్త్రీ రోజా
వోణి కొద్ది బోణి కొట్టే పూబోణి
నీకు రాసిస్తాలే మల్లెల్లోని మాగాణి
యుద్దాలు చేసుకుందామా చలిలో
అందాలు పూసుకుంటాలే జతలో
వలపు కోట వాయణం
వయసు కోరు శోభనం
నీతోటి కొలువున్న వేళలలో
ఈ రోజా పూజా రాజా నీకే

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు




సింగరాయకొండకాడా.. పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి,బాలు, మాల్గాడి శుభ 

ఆ.... ఆ....హా...
ఆ.... ఆ....హా...

సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా
ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో...
దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా
తడాఖా..
సింగరాయకొండకాడా..ఆ..ఆడ దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడ సోకుమాడా

ఎగబడి దిగబడి కలబడి పొరబడి పెట్టేసుకో..ఓ
నా లేత ఈడు ఉంగరం ఇక చూసుకోరా సంభరం
గిజగిజ వయసుల గిలగిలసొగసులు వడ్జించుకో..ఓ
అల్లారుముద్దు అగడం అందాల మీది మీగడం
నెరనెర జాననోయ్ తుళి పరువపు వీణనోయ్
వీణవైతే మీటనా జానవైతే దాటనా
ఇది తాగిన జంట ససేమిరా సడేమియా సరోజా
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా

ఆ.... ఆ....హా...

కుతుకుడు ఉతుకుడు వెతుకుడు చెడుగుడు
ఆడేసుకో..చెడుగుడు చెడుగుడు చెడుగుడు
నీ రేవు కోరి వేగిరం నా నావకున్న లంగరం
పిడికెడు నడుముల చిటికెడు తలుకులు
తోడేసుకో..
చెయ్యి జారుతుంది పావురం
పట్టుకో..
బేజారుచేస్తే నిబ్బరం
చిమ చిమ చీకటోయ్ ఇవి చిటపట చిందులోయ్
పెగ్గులాగా జారనా.. అగ్గిలాగే మారనా..
ఇవి కౌగిలి దాడి ఖజూరహో మజాలహో ఖలేజా
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా
ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో...
దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా
తడాఖా..
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా..

Palli Balakrishna Monday, March 19, 2018

చిత్రం: నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: సుమన్ , భనుచందర్, అరుణ్ పాండ్యన్,  ఆమని, రోజా, సిందూజా
దర్శకత్వం: సాగర్
నిర్మాత: టి. ఆర్.తులసి
విడుదల తేది: 1993

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే
పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా

నీలి నింగి నీడలో ఓ రంగారు బంగారు మేడ కట్టేయనా
పాలపుంత జాడలో నును మొత్తంగ ముద్దిచ్చి
నిను చుట్టేయనా
వెచ్చంగా చేరుకున్నాక ఊరుకుంటాన పిల్లాడా
మొత్తంగా ఇచ్చుకున్నాకే పుచ్చుకుంటాలే బుజ్జమ్మా
ముందుగా ముచ్చటే తీరని ఈ పక్కనే నక్కిపోరా

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా

కన్నె జాజి పువ్వులో మకరందాన్ని ఎంచక్కా కొల్లగొట్టేయనా కొంటె చందమామని ఒంటి ఒంపుల్లో పట్టేసి ఆట కట్టేయనా
వద్దంటూ మొండికేస్తుంది విందుకొస్తావేం అమ్మాడి
ఇన్నాళ్లు దాచుకుందంత దోచి ఇవ్వాలా అబ్బాడి
అందుకే వచ్చినా చోకిరి మొదలెట్టనా తందనా ఓ

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే
పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా




Palli Balakrishna Thursday, November 2, 2017


చిత్రం: అమ్మ కొడుకు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్
దర్శకత్వం: క్రాంతి కుమార్
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 1993

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

చరణం: 1
మల్లె జాజుల్లో వాసనే మౌనము       
మత్తెకించే ఆ మౌనమే ప్రాణము
మల్లె జాజుల్లో వాసనే మౌనము       
మత్తెకించే ఆ మౌనమే ప్రాణము
పూలలో తేనెలు గాలికె ఆరవు
నింగిలో తారలు వానకే రాలవు
తొలకరి అనుభవం  - ఆ...ఆఆ..
తొడిమకు పులకరం  - ఓ..ఓఓ...
తొలకరి అనుభవం తొడిమకు పులకరం
తేనెపాలు చిలికిన వయసును

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

చరణం: 2
వెన్నెల్లో వేడి కన్నులే మూయదు
ఏదో ఆరాటం ఎంతకీ తీరదు
వెన్నెల్లో వేడి కన్నులే మూయదు
ఏదో ఆరాటం ఎంతకీ తీరదు
గుండెలో వేసవి చూపుతో ఆరదు
మనసులో ఆకలి మాటతో ఆగదు
పెదవుల పరిచయం  - ఆ..ఆఆ
ఎదలకు పరిణయం  - ఓ..ఓఓ
పెదవుల పరిచయం ఎదలకు పరిణయం
మాఘవేళ మలసిన వయసున

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

Palli Balakrishna Tuesday, October 24, 2017



చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: బాలక్రిష్ణ, రవీణా టండన్, రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 03.09.1993



Songs List:



గుడివాడ గుమ్మరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు , చిత్ర

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

అరే గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి 
చలిమంట వెసేయ్యనా
వరదలే పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసేయ్యనా
అదిరే చలి బంగారు బొమ్మ 
ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చెన్న 
చెడదా మతి ముద్దుల కన్నా
అరే అలటప యవ్వారాలు సాగవే బుల్లెమ్మో
అరే వంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో

హోయ్ గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా

పరువాల పేరంటం హుషారుగ పిల్లోడా 
ఒడిలోన పెట్టేైనా
సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో 
జలసాగ లాగించనా
పనిలో పని అద్దిరబన్నా 
మొదలై మరీ ఒంటరిగున్నా
పదవే అంటు చమ్మక చలో 
పడతా పని తిగర బుల్లో
తయ్యతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట
హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట

హొయ్ హొయ్... 
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
యహ యహ యహ యహ
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
అరే తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా





ఎన్నెట్లో చాపేసి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు , చిత్ర

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఏడురంగుల ఈ వానవిల్లు
చెయ్యి తాకిడికే చెమ్మగిల్లు
చుక్కలేలకు నూ సూదికళ్లు
చూపుకే నడుమే సన్నగిల్లు
పాలలో మీగడెందుకో పైటలో పొంగులందుకే
చల్లలో వెన్నలెందుకో జంటలో వేడి అందుకే
జాజివనం చేరుకుని జానపదం పాడుకుని
ఆడుకునే వయ్యారమే వసంతపు దుకాణమే అంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

భామలందరిలో బంతిపువ్వు
చెంగుకోరని చామంతిపువ్వు
దండయాత్రకు దక్కాలి నువ్వు
కౌగిలింతల కట్నాలు ఇవ్వు
ఇంటిలో గుట్టు పెల్లికి దండగే పూలపల్లకి
సోకుతో శోభనాలకి దీపమే అడ్డు రాత్రికి
కోడెతనం కొంగుకసి ఆడతనం పొంగురుచి
కోరుకునే వయస్సులో ఎడాపెడా ఫలించులే పంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మెుగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట




తధిగినతొం తధిగినతొం బాలయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర, మినీ మినీ

దితొం దితొం
తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

కమ్మంగా కౌగిట్లో కవ్వించేయ్నా
కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించేయ్నా
ఒళ్లోని వైకుంఠం చూపించెయ్నా
అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా
రంభా ఊర్వసులే నా సరి రారురా
రతి నా చెలికత్తె ఇటు రారో
ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ...
నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

చూశా నీ యవ్వారం వన్నెలాడి 
నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి
చాలించే గప్పాలు కుర్ర కేడి
మనతో పందేలు వేశావో చిక్కే బాడి
భరతం పడతాను పదవే పోకిరి
దుమ్ము దులిపేస్తా గయ్యాలి
అరె ఆపు ఆపు తందనాలు చామంతి హొ హొ హో...
నే చూడలేనె కొట్టుకుంటే పూబంతి ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
హోయ్ వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం





వానా వానా వచ్చేనంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

(ఈ పాటను అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు (2021)  సినిమాలో రీమిక్స్ చేశారు దానికి సంగీతం సాయి కార్తిక్ అందించారు, పాడిన వారు ఎల్.వి.రేవంత్, నాధప్రియ  )

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగ



మనసు ఆగదు వయసు తగ్గదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో  జంటగా చిలక వాలదు

చరణం : 1
ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
పొద ఇరుకులు జతలకు చెరుకట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
తొలివలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
సొగసరి ఇటు మగసిరి అటు
కలబడినది కసి కాటు...హా
మనసులు ఇటు కలిసినవటు
మనుగడకిది తొలిమాటు
చూపుకు చూపే చుమ్మా
ఊపిరి వెడేకొమ్మా
ముద్దుకు ముద్దె గుమ్మా ముచ్చట నేడే నమ్మా
వయసు లేడిరో - వలపు తాడుతో 
నిలిపి చూడరో - హా...

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో.... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు

చరణం : 2
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ 
రుచులాడిగెను  పెదవిని పెదవులు 
కోసరడిగెను వలపుల ముడుపులు
ఓ ఓ ఓ ఓ ....ఓ ఓ ఓ ఓ
తనువడిగెను తపనల తనువులు
జతనడిగెను మదనుడి మణువులు
ఓ ఓ ఓ ఓ ....... ఓ ఓ ఓ ఓ 
పులి తగిలిన గిలిరగిలిన శిల 
అడిగెను నీ రూపం  హా....
నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
మెరుపు మెడలో
ఉరిమి చూడరో
కరుకు చూపరో  
ఆ.... - హా.....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా.... - అహ హా


Palli Balakrishna Saturday, October 21, 2017


చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సత్యం, సిరివెన్నెల, శ్రీ
నటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది: 10.06.1993

వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్య రా నీవే రా ముందు డేసు

అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటూ ఫీటూ ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషు నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరు అదర్సూ
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషూ

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికట్లకు కొట్టుకు చస్తారు
బావుంది కానీ ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారీ బాత్ మాను జర గారు తగ్గించు ఖాను
అరె చుప్ హో శకున పక్షి లా తగులుకోకు ముందు


********   ********  ********


చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రి నీకు వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకి
అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్మునే శరనమ్మనే చరనమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగ డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికుల్లెవరికీ
జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా

Palli Balakrishna Monday, October 16, 2017



చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: ప్రశాంత్, దివ్యభారతి, రంభ
దర్శకత్వం: కె.రెడ్డి
నిర్మాత: జి.సి. రెడ్డి
విడుదల తేది: 16.10.1993



Songs List:



ఇది బొంబాయి బుల్లిరో పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు 

ఇది బొంబాయి బుల్లిరో 




తొలిముద్దు తొలిప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , జానకి 

తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు
దాటింది నా గువ్వా నేడు 
మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ ఈడూ
తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు 
దాటింది గోరింకా నేడు 
మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ చూడూ
కౌగిళ్ళ పందిళ్ళు వేయనా
పూలంగీ సేవలు చేయనా
అరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ 

కంటిమీద కాటుకల్లే కొంటెముద్దులీయనా
పాలబుగ్గలందుకునీ పూలముద్దులీయనా 
ముత్యమంతముద్దునిచ్చీ నిన్ను పెనవేయనా 
మోజుపడ్డ అందగాడీ ముచ్చటేదో తీర్చనా 
ఓపలేని తాపమిదీ దాహమింక తీరనీ 
ముద్దులన్నీ మాల కట్టి గుండెమీద వేయనీ 
అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే 
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్ 


ముద్దుకొక ముద్దునిచ్చి నన్ను రాణి చేసుకో
గువ్వపిట్టలాగ నన్ను గుండెలొన దాచుకో 
ముద్దువచ్చు ముద్దునిచ్చి ప్రేమనంత దోచుకో 
అందరాని అంబరాలా అంచులేవో చేరుకో 
చెప్పలేని ఘాటు ఉందీ చీకటింటి ముద్దులో
విప్పలేని కోరికుందీ హత్తుకున్న ముద్దులో
అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే 
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్




మేం ప్రేమికులం పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , జానకి 

మేం ప్రేమికులం 




చిట్టిగుమ్మ పదవే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, జానకి 

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం 
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం 
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ 
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ 

కడలీ అంచుల్లో జలకాలాడీ 
అలలా అంతుపొంతూ చూసొద్దామా 
యమహొ ముందో ముద్దు లాగిద్దామా 
తొణికే వెన్నెల్లో సరసాలాడీ 
వయసు హద్దు పొద్దు తేలుద్దామా 
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా 
తరగని మోహలే వేసాయి వలలూ 
తడి తడి ఒంపుల్లో పిల్లోడా 
అరగని అందాలే పొంగాయి సడిలో 
పెదవుల తాంబూలం అందీయవే 
చనువిచ్చేయమంటొందీ మనసొద్దద్దంటొందీ 
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడిందీ 

చలిలో చిన్నారీ వయ్యారలే 
కసి గా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే 
ఉసిగా తట్టి తట్టీ వేధిస్తుంటే 
వలపుల కౌగిళ్ళ నజరానాలే 
రతిలా మళ్ళి మళ్ళి అందిస్తుంటే 
మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే 
తెలియని ఆవేశం రేగిందే మదిలో 
తలుపులు తీయవేమే బుల్లెమ్మా 
పరువపు ఆరాటం తీరాలీ జడిలో 
తకధిమి సాగించేయ్ బుల్లోడా 
ఇహ అడ్డేముందమ్మా మలి ముద్దిచ్చేయవమ్మో 
మెరుపల్లే బానం సంధిచెయ్యరా వీరా ధీరా




రావా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , జానకి 

రావా ప్రియతమా 




వన్నెలాడి గిన్నెక్కోడి పాట సాహిత్యం

 
చిత్రం: తొలిముద్దు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , జానకి 

వన్నెలాడి గిన్నెక్కోడి 

Palli Balakrishna Wednesday, September 27, 2017


చిత్రం: మహానది (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, ఉమారామనన్, శోభన
నటీనటులు: కమల్ హాసన్, సుకన్య
దర్శకత్వం: సంతాన భారతి
నిర్మాత: యస్.ఎ. రాజ్ కన్ను
విడుదల తేది: 1993

పల్లవి:
శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు
కృష్ణవేణిలో అలల గీతాలు
నీలవేణిలో నీటిముత్యాలు నీరాజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలల గీతాలు క్రిష్ణగీతలే పాడగా

చరణం: 1
క్రిష్ణ తీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శ్రుతిలో
అలలై పొంగెను జీవన గీతం
కలలే పలికించు మధు సంగీతం
చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా
శ్రీ త్యాగరాజ కీర్తనై సాగే తీయని జీవితం

చరణం: 2
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగా ఈ నేల పండించు ఫలము
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్ని పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లాకపటమే కనరాని ఈ పల్లెసీమలో

Palli Balakrishna Saturday, September 23, 2017

Most Recent

Default