చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లన్ దర్శకత్వం: విశ్వ కరుణ్ నిర్మాణ సంస్థలు: శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం విడుదల తేది: 14.03.2025
Songs List:
అగ్గిపుల్లే అలా గీసినట్టు పాట సాహిత్యం
చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ సాహిత్యం: భాస్కర్ బట్ల గానం: అనురాగ్ కులకర్ణి అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు నీవే అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు పొరపాటుగా ఓ మాటని నేనే జారానులే సరేలే అని వదిలేయక రోజు ఎందుకీ గొడవలే హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నీక్కూడా నాతో వచ్చేంత ప్రేమ అంతంత దూరం ఎంతెంత నేరం ఓ చిన్న నవ్వు నవ్వవే నీ అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు హో ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగమూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగమూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం చంపొద్దే చంపొద్దే కారాలు నూరి నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి కన్నుల్లో నిండావే కన్యాకుమారి కన్నెత్తి చూడు ఒక్కసారి నీ అగ్గిపుల్లే అలా కోపంగా చూడకే గాలి దుమారమే ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు పొరపాటుగా అన్నాలే సర్లే అని వదిలేయ్‍వే చంపొద్దే చంపొద్దే నీవే
హేయ్ జింగిలీ పాట సాహిత్యం
చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: సామ్ సి.ఎస్ హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా జిందగీ నిండుగా జల్లావు రంగులే హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే లబ్ డబ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే మొదలయింది లోపలేదో యుద్ధమే ఓ హో ఓడిపోత నేను నీకోసమే ఓ ఓ మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే నీ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి మైకుసెట్టులో ఓ ఓ ఓల్డ్ సాంగులా ఓ ఓ లాగినావే నా రాకుమారీ మారీ నిప్పు పెట్టిన తేనే పట్టులా రేపినావే ఆశలొక్కసారి ఆశలొక్కసారి నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ మెల్లగా మాయమైంది కంటిచెమ్మ ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా ప్రతీ క్షణం ఈ హాయిలో ఈ హాయిలో ఇలా ఇలా ఉంటాను తడిచి తడిచి తడిచి నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా జిందగీ నిండుగా జల్లావు రంగులే జింగిలీ హేయ్ జింగిలీ నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ ఓ ఓ ఓ
కన్నా నీ ప్రేమ సంద్రమే పాట సాహిత్యం
చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ సాహిత్యం: విశ్వ కరుణ్, భాస్కరభట్ల రవికుమార్ గానం: సత్యప్రకాష్ , మాళవిక సుందర్ కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే అలలుగా తాకగానే కరిగిపోనా నీలో ప్రళయమై తాండవిస్తే అలజడే నాలో ఓ ఓ ఓ ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరి చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమకథా ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమకథా ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా మనసా మనసా అలసిపోకే కలగా కలగా కరిగిపోయే తననే తననే మరచిపోవే మనసా ఆ ఆ ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే ఏ ఏ నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే
KCPD పాట సాహిత్యం
చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ సాహిత్యం: విశ్వ కరుణ్ గానం: సAbhishek AR KCPD
మధురం పాట సాహిత్యం
చిత్రం: దిల్ రూబా (2025) సంగీతం: సామ్ సి.ఎస్ సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు గానం: శరత్ సంతోష్ మధురం

No comments
Post a Comment