Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hunt (2022)




చిత్రం: HUNT (2022)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజీజ్, మంగ్లీ
నటీనటులు: సుదీర్ బాబు, భారత్ నివాస్, శ్రీకాంత్ 
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్ 
విడుదల తేది: 2022



Songs List:



పాపతో పైలం పాట సాహిత్యం

 
చిత్రం: HUNT (2022)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజీజ్, మంగ్లీ

దాలు తడి దసర పొడి
ఒళ్ళు పట్టా గాలలడీ
గుండుసున్నాలున్న ఆడీ
గుంపులున్న పూలజడీ

రేంజ్ రోవర్ కారు రెడీ
జల్దీ కింద మీద పడి
చెయ్యరాదే దేత్తడి
గుంతలకిడి గుమ్మడి

సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టిపొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే

నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని… పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ అంబులెన్సు ఠక్కరిచ్చినట్టే

హే, ఆ ఊ ఏ ఓ… అడికినకిడి తకిడి తికిడి
ఆ, పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… ముద్దుతో పైలం

నేను పొద్దున్నే ముద్దులెడ్తే
బూస్టు  వేస్టేలే
అద్దరాత్తిరికే హగ్గులిస్తే
పెగ్గే మానాలే

అరె మధ్యాహ్నం మాటల్తో
డైటింగ్ మాకేందే
నిన్ను సప్పర్లో
పెప్పర్లా సప్పారిస్తామే

ఏ, ఒంపు మెడవంపు
మగ దిల్లు దుమారే
ఇంపు కవ్వింపు
మీకు శెక్కర బీమారే

దింపు జర దింపు
కసి చూపుల తల్వారే
శింపు మము సంపు
మేం ఎప్పుడు తయ్యారే

ఆ, పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… ముద్దుతో పైలం

ఒంటివాటాన్నే సైంటిస్టులే
టెస్టే  చేశారే
ఇది అచ్చంగా ఆటమ్
బాంబంటూ తేల్చారే

మత్తుగొలీలే చోళీలో
దాచేసుకున్నావే
అరె హుక్కాలా నీ హుక్కే
గుంజేస్తున్నాదే

వారే పట్వారే
సుట్టు కొల్తా దేకోరే
జారే బేజారే
ఇది లయన్ సఫారే

పోరీ సున్ ప్యారి
నీ సోకు జాగీరే
నారీ సుకుమారి
చెయ్యనియ్యి శిఖారే

సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టిపొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే

నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని… పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ అంబులెన్సు ఠక్కరిచ్చినట్టే

హే, ఆ ఊ ఏ ఓ… అడికినకిడి తకిడి తికిడి
పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… పిల్లతో పైలం

Palli Balakrishna Wednesday, October 19, 2022
Itlu Maredumilli Prajaneekam (2022)




చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
నటీనటులు: అల్లరి నరేష్ , అనంది 
దర్శకత్వం: ఎ. అర్. మోహన్ 
నిర్మాత: రాజేష్ దండు 
విడుదల తేది: 11.11.2022



Songs List:



లచ్చిమి పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (2022)
సంగీతం: సాయి చరణ్ పాకాల 
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలి

నా తెలుగు భాషలో
కొత్త అక్షరం నువ్వు
నా చేతి గీతలో కొత్త రేఖవైనావా 

మట్టి తీగలో దాచి పెట్టిన
చందమామవే నువ్వా
చిట్టి గుండెనె చిన్ని కొంగుకే చుట్టి కెళ్ళినావా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

ఆ గోదారి అందమే దారి తప్పిలా నా దరికొచ్చే
ఈ మందార పువ్వుతో మాటలాడిలా నా మనసుకు మురిసెనే 

అమ్మమ్మో మాటలావి
ఇళయరాజా గారి పాటలా 
నా గుండె తబలానిలా
జాఖిర్ హుస్సేన్ వాయించేలా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

చిటారు కొమ్మవై మిఠాయి పొట్లమే
నా గుండెలో గిటారు మీటెనే
చిరాకు రేగితే ఆ మూతి ముడుపులే పటాకు పేలుడే 

అమ్మమ్మో కుళుకులా అవి
కూచిపూడినే మరిచి పోయేలా
ఓలమ్మో నడకలా అవి
నెమలి నాట్యాన్నే మరిపించేలా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

Palli Balakrishna
Ori Devuda (2022)




చిత్రం: ఓరి దేవుడా (2022)
సంగీతం: లియోన్ జోన్స్ 
నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పల్కార్ , ఆశా భట్, వెంకటేష్ 
డైలాగ్స్: తరుణ్ భాస్కర్ దాస్యం 
దర్శకత్వం: అశ్వత్ మరిముత్తు 
నిర్మాతలు: PVP, దిల్ రాజు 
విడుదల తేది: 21.10.2022



Songs List:



గుండెల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: ఓరి దేవుడా (2022)
సంగీతం: లియోన్ జోన్స్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనిరుద్ రవిచంద్రన్ 

ఏ, ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, మరువనే మరువనే కలల్లోనూ నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

గొడవలే పండనులే నీతో
గొడుగులా టెన్ టు ఫైవ్ నీడౌతానే
అడుగులే వేస్తానమ్మ నీతో
అరచేతుల్లో మోస్తూనే

గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

ఏ, గడవనే గడవదే… నువ్వేలేని రోజే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, ఒడవనే ఒడవదే… నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

నా చిన్ని బుజ్జమ్మా
నా కన్నీ బుజ్జమ్మా

కరిగిన కాలం… తిరిగి తెస్తానే
నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా
మిగిలిన కధనే… కలిపి కాస్తానే
మనకిక దూరం ఉండొద్దే, బుజ్జమ్మా

మనసులో తలచినా చాలే
చిటికిలో నీకే ఎదురౌతానే
కనులతో అడిగి చూడే
ఏదో సంతోషం నింపేస్తానే, ఏ ఏ ఏ

గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

గుండెల్లోనా గుండెల్లోనా
కొత్త రంగే నింపుకున్నా
గుండెల్లోనా గుండెల్లోనా
కొమ్మ నీరే గీసుకున్నా

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా




అవుననవా పాట సాహిత్యం

 
చిత్రం: ఓరి దేవుడా (2022)
సంగీతం: లియోన్ జోన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్

ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా

ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా

హ్మ్మ్ మ్మ్ మ్మ్
ఏమని అనాలని
తోచని క్షణాలివి
ఏ మలుపో ఎదురయ్యే
పయనమీదా

ఆమని నువ్వేనని
నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే
మౌనమిదా

ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
నువ్వే బాదులని రాగలనా నీ దారికి
విడిగా తడిగా విరబూసే కళకి
చెలియా నీ కాంతి నందించవా

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

హ్మ్మ్ మ్మ్ మ్మ్
తెలిసే లోపే నువ్వు తెలిసేలోపే
చెలి చేయి జారిందే ప్రపంచం
కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా
ఎడబాటై రగిలినదే కాలం

కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్న
వెతికానే ఓ తీరాలని
నిజమేదో తెలిసాక ఇపుడంతా ఉన్న
ఎన్నటికీ నువ్వు కావాలని

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

అవుననవా అవుననవా అవుననవా

ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా

ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

Palli Balakrishna Monday, October 17, 2022
Urvasivo Rakshasivo (2022)




చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ 
దర్శకత్వం: రాకేష్ శశి 
నిర్మాత: బన్నీ వాసు 
విడుదల తేది: 04.11.2022



Songs List:



ధీంతనన ధీంతనన పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: సిద్ శ్రీరాం 

అనగా అనగనగ కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా

అరెరే అరెరె మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే

ఆరాటము మెహమాటము
జతగా కలిగే నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో..!

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే (2)

నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతి చోటున
నీ పెదవులు తాకే నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట

కాలం కలిపింది ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే

ఆకాశం తానే చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా

రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో
మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే




మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా

చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఏం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

ఏ ఆకలుండదు నిద్దరుండదు
వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు
ఫ్రెండు అంటరు లవ్వు అంటరు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల కలిసి పోయేది మనం
మనల్నే తిడతారు ఎర్రి జనం
పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా
ఎందూకలా ఎందూకలా ఎందూకలా

వద్దుర పోరిల జోలికి
పోరి దూల తీర్చి పోతది
ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను
వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను
షాపింగ్ మాల్లు లాకైపోను
పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్క పోను
బ్యూటీ పార్లర్లు బందైపోను

కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి
ఉన్న జుట్టు ఊడిపోను
అమ్మాయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగ మారిపోను మారిపోను
పోను పోను పోను పోను



కలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అర్మాన్ మాలిక్ 

కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికి నా మనసే ఇక నీకే

ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా
అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే

ఓ ఓ చెలివే చెలివే
సరిపోదే గుప్పెడు గుండె
చెలివే చెలివే
మరు హృదయం అప్పడిగానే

నను తాకే ఊపిరి
ఓ ఓఓ అలవాటే అయినది
నదిలో అలలా కలిసేపోనీ

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష

వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే
సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే
బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే
మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే

ఓ ఓ సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండి పోవే

సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదే
సమానమై పోదాం రావే
నువ్వుండి పోవే

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష





సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: శ్రీకృష్ణ 

సీతాకోక చిలుక 

Palli Balakrishna
Ginna (2022)




చిత్రం: జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజపుత్
దర్శకత్వం: సూర్యా
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 21.10.2022



Songs List:



ఇది స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అరియాన, వివియాన 

మౌనం కూడా మాటాడదా
కుహు కుహు కోయిల పాటవ్వదా
మనసున సందడి మొదలవ్వదా
ఒక స్నేహం తోడైతే

స సరిగరి సరి రీగమాగరిగ
గామపపగామ రినిస
హరివిల్లుకి రంగుల్లా
చిరుగాలికి అల్లరులా
సెలయేటికి సవ్వడిలా

ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఎహె దోస్తీ
దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్

ఆ దైవం రాడే ప్రతి దానికి
కనుకే లోకం ప్రతివైపుకీ
పంపించాడే మన మంచికి
వరంలాగా ఈ స్నేహమే

లా- ఆ గుండెకి చప్పుడులా
కనుపాపకి రెప్పల్లా 
అరె చేతికి గీతల్లా లాలా లా
పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి పురుగుల్లా
ప్రాణానికి ప్రాణంగా

ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఇది స్నేహం

నువు తలిచేలోగా వచ్చేయడం
అడిగేలోగా ఇచ్చెయ్యడం
బ్రతికేలోగా తెచ్చెయ్యడం
స్నేహంలోనా ఉందే గుణం

లా- నీ ఆశకి నిచ్చెనలా
నీ ఊహకి ఊపిరిలా
నీ దారికి దీపంలా లాలా లా
నీ మాటకి అర్థంలా
నిను చూపే అద్దంలా
ప్రతి పూట పండుగరా

ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఇది స్నేహం
ఇది స్నేహం ఎహె దోస్తీ
దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్




గోలిసోడావే పాట సాహిత్యం

 
చిత్రం: జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: నకాష్ అజీజ్, నూతన్ మోహన్

గోలిసోడావే



నా పేరు జిన్నారా పాట సాహిత్యం

 
చిత్రం: జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: ప్రేమ్
గానం: పృద్వి చంద్ర

నా పేరు జిన్నారా
అందరికి అన్నరా
నకరాలు జేస్తే
కిస్సా ఖల్లాసురా ఆ ఆ

హే, పద్దులు చూడంది డాన్ జిన్నా భాయ్
ఎవ్రీబడీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ది వే
ఫాల్తూగాళ్ళందరూ చుప్ బైటికే
అన్నకి సలాం కొట్టుర్రి బే
కథల్ జేసెటోళ్ళని ఇడిసేదిలే
ఇచ్చి పడేస్తాడు వచ్చిండంటే ఇగ

హే, చూపు అదురు లేదు బెదురు
నాకు ఎదురు లేదురా
ఒకటే గుద్దుతోనే
పుంగి పగిలిపోద్దిరా
వీడి కటౌటే చూస్తే షేపౌటే
నీ బద్దలు భాషింగాలే

అరె, వచ్చిండు చూడు మన జిన్నా భాయ్
తొడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్
ఆట ఆడిండంటే మన జిన్నా భాయ్, ఖేల్ ఖతం




జారు మిఠాయో పాట సాహిత్యం

 
చిత్రం: జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: ఎ. గణేష్ 
గానం: సింహా, నిర్మలా రాథోడ్ 

హెయ్, జారు మిఠాయో
నా జారు మిఠాయ
హే హే, లెట్స్ డూ దిస్

మిఠాయ మిఠాయ
జారు మిఠాయ
మిఠాయ మిఠాయ
జారు మిఠాయ

నువ్వొస్తావని నేను ఓరబ్బయ్య
సిల్కు చీర కట్టుకుంటిని (అబ్బా)
మల్లెపూలు పెట్టుకుంటిని (అబ్బబ్బబ్బా)

మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ
మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ

నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా
సీరనేమో సింపుకుంటినీ
పూలనేమో సికర బకర చేసుకుంటినీ

మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా

పగటేలకొస్తవనీ ఓరబ్బయ్య
జీడిపప్పు వలిచి పెడితిని
పిడత కింద దాచి పెడితిని

పరులేమో చూసిరని ఒరబ్బయ్యా
జీడిపప్పు ఉడతకిస్తిని
పిడతనేమో పగలకొడితిని

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

రాత్రి అయితే చాలు
నాకు నువ్వే గుర్తుకువస్తావు
అబ్బయో, అబ్బాయా
నీకోసం నేను దాచిందంతా
ఆరు బయట పెడతాను
అబ్బాయ, అబ్బాయ… అబ్బాయా

మాటేలకొస్తవని ఓరబ్బయా
తమలపాకు కడిగిపెడితిని
వక్క కోసం ఎదురు చూస్తినీ

పరులేమో నవ్విరని ఒరబ్బయ్యా
ఆకునేమో మడిచిపెడితినీ
వక్క లేక బిక్కుమంటినీ

మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

కోరస్:
యో, గాలి నాగేశ్వర్ రావు
ఈ యమ్మి లెక్క సూడు

నీ జీడిపప్పు కొరికేస్తా
ఆకుపైన వక్కేస్తా
చిలక మిఠాయ్ చిదిమేస్తా
నీ చీర చాటు… నీ చీర చాటు
అందమంతా దోచేసుకుంటా
జమ్కులకిడి జారు మిఠాయ

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

హే, జారు జారు… జారు జారు
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
జమ్కులకిడి జారు మిఠాయ

Palli Balakrishna
Aa Ammayi Gurinchi Meeku Cheppali (2022)




చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
నటీనటులు: సుదీర్ బాబు, కృతి శెట్టి 
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల తేది: 16.09.2022



Songs List:



కొత్త కొత్తగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చైత్ర అంబడిపూడి, అభయ్ జోద్పుర్కర్

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

ఆ, అనగనగా మనవి విను
ముసిముసి ముక్తసరి నవ్వుతో
నిలకడగా అవును అను
తెరలు విడే… పలుకు సిరితో

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే… ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా… నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే… ఏం చెప్పాలో

హో ఆ, తలపు దాకా వచ్చాలే
తగని సిగ్గు చాల్లే
తగిన ఖాళీ పూరిస్తాలే
హా, చనువు కొంచం పెంచాలే
మొదటికన్నా మేలే
కుదిరినంతా కులాసాలే

హా నిను కననీ
నిను కననీ కదలికకు తెలవారదే
హో, నిదురవనీ ప్రతి కలలో
నీ ఊసే తారాడుతోందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే
తమరి మాయేగా ఇదంతా
ఓ ఓ, పయనమెల్లా పండిందో
మరపురానే రాదే
మధురమాయే సంగతంతా

ఆ ఆ, ఎద గదిలో ఓ ఓ
ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే
ఇరువురిలో చలనమిలా
ప్రేమన్న పేరందుకున్నదే


హా, కొత్త కొత్తగా ఉన్నా… కొంచెం బావుందే
ఆ ఆ, పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
హో, చెలిమి కల చెరిసగమే
చిటికెన వేలి చివరంచులో
సఖిలదళ విడివడని
ముడిపడవే ప్రియతమ ముడితో




మీరే హీరోలా ఉన్నారు పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్

మీరే హీరోలా ఉన్నారు
మరి తెర్రంగేట్రం ఎప్పుడు చేస్తారు
హహ, ఆ పని మనకెందుకు మాష్టారు
మైటీ హీరోలే మన మాటింటారు

ఆ, ఫుల్ టూ సక్సెస్ లో ఉన్నారు
ఓ, అది నా బలహీనత అంటుంటారు
బడ్జెట్ భారీగా ఎక్కిస్తారే మీరు
బదులుగా రెట్టింపు లెక్కిస్తారు వారు

పాన్ ఇండియాకు… వెళుతున్నారా మీరు
ఏ, ఆల్ ఇండియాలో మనకు ఫ్యాన్స్ ఉన్నారు
మనమే ట్రెండు రా, బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే గోల్డెన్ హ్యాండురా

ఏమా జాతకం నంబర్ వన్ను రాకం
సిల్వర్ స్క్రీన్ పై మీదే నవశకం

ఏ, పుట్టుకతో నేనింతే
బద్దలు కొడతానంతే
బొమ్మలు తీశానంతే
దిమ్మలు తిరగాలంతే

నా ఫైరింగ్ వల్లేగా
చల్లంగుంది ఇండస్ట్రీ
మనమే ట్రెండురా
బ్రాండు రా లెజెండురా
హా హ, బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హ్యాండురా

మీకు యాటిట్యూడ్ అంటారే
మాతో బాగానే ఉంటారే
రెండు మీవాళ్ళే రాస్తారే
గాసిప్ గల్లాట చేస్తారే

ప్రతి సినిమాకు కత్తర్లే
అయినా అనుకుందే తీస్తాలే
సోషల్ మెసేజ్ స్క్రిప్ట్ ముట్టుకోరెం
అయ్యో రామ మనమాగొడవెట్టుకోమే

చాలనే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్
ఏంటి బ్రదర్ నేనేంటో నాకు తెలుసు
నో కామెంట్స్ 

మనమే ట్రెండు రా
బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హండురా

గడియారంతో పరిగెడతా
పాత రికార్డులు పడగొడతా
భల భీభత్సంగా ఆడిస్తా ఆట

ఇక చాల్లే ఇంకెన్నని చెబుతా
తతీమా ఎమున్నా కబురెడుతా
మల్లి ప్రెస్‌మీట్‌లో కనబడతా
టాటా టాటా టాటా




ఆ మెరుపేమిటో పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి 

ఆ మెరుపేమిటో
కనుపాపతో ఏమన్నదో
ఆ చిరునవ్వులో
తెరచాటుగా ఏమున్నదో

నమ్మలేని మర్మమేదో దాగి ఉందా
ఎవ్వరూ రాయని కవితలా
రమ్యమైన రాగమేదో లాగుతూ ఉందా
మౌనమే మువ్వలా పలకగా

ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా
ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా

ఈ శిల్పంలో గల ఈ కల
ఏ ఉలి ఊహలో 
ఏ శిలా ఈ చెలి రూపమై నడయాడెనో

నేల చూపులు దీపాలై
వెలగవా మరీ 
ఎక్కడో ఏ హృదయమో
తన కోసమే కల్లలై ఉన్నది

ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా
ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా




అందమైన సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: స్పందన్ భట్టాచార్య

సక్కంగ సాగే కథనే
అడ్డంగ తిప్పిండే
భద్రంగ దాసిన బతుకే
సిత్రంగ సింపిడే

సక్కంగా సాగే కథనే
అడ్డంగ తిప్పిండే
భద్రంగా దాసిన బతుకే
చిత్రంగా సింపిడే

గిల్లేసి పాడే జోలపాటా ఆ ఆ
పైవాడికెంత ఏడుకంటా
ఈ సల్లనైన ఎన్నెల పూట
నిప్పు లేని మంటలు ఎట్టిండంట

ఓ, అందమైన సుందరి జిందగిలో
ఆ ఆ, సిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని సిందరవందరలో
ఆ ఆ, సింతలన్ని ఎప్పుడు తీరునురో

ఓ ఓ, నీటి మీద రాతల
బంధాలే కలిపేసి
అంటనట్టు ఉంటడే
అరె సిన్నిగుండె గోడపై
ముందే బొమ్మేసి, ఆటలాడుతుంటడే

సీకటిలో రంగు కలలే సూపి
తెలవారి మాయ చేసి పోతడే
అరె, అల్లరి పిల్లడి గారడే

అందమైన సుందరి జిందగిలో
ఆ ఆ, సిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని సిందరవందరలో
ఆ ఆ, సింతలన్ని ఎప్పుడు తీరునురో



ఆటోమేటిక్ దర్వాజా పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి 

ఆటోమేటిక్ దర్వాజా

Palli Balakrishna Sunday, October 16, 2022
The Ghost (2022)




చిత్రం: The Ghost (2022)
సంగీతం: భరత్-సౌరభ్
నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: సునీల్ నరాంగ్ , పుష్కర్ రామ్మోహాన్ రావు,శరత్ మరార్ 
విడుదల తేది: 05.10.2022



Songs List:



వేగ (నీలి నీలి సంద్రం) పాట సాహిత్యం

 
చిత్రం: The Ghost (2022)
సంగీతం: భరత్-సౌరభ్
సాహిత్యం: కృష్ణ మదినేని 
గానం: కపిల్ కపిలన్, రమ్యా బెహ్రా 

నీలి నీలి సంద్రం
నింగిలోని మేఘం
నిన్ను చేరమంది
అంతులేని వేగం

నిన్ను దాటి పోదే
కంటిపాప చూపే
నీ నీలి కళ్ళు
నాకే గాలం వేసే

మధురం నా కథ
నీతో ఉండగా
నువ్వే నేనుగా
కథలే మారగా

ఎవరు లేని నన్నే చేరి
ఏం మాయ చేసావో, - ఓ ఓ ఓ

కదలక కదిలే కాలం ఆగే
ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా,  - హో ఓ ఓ

వదలక వదిలే ప్రాయం కోరే
ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

నీలో నేనుండిపోనా
నీ వల్లనే నేనంటే నాకు తెలిసే
నీలా నే మారిపోనా
నీ ప్రేమలే నా పైన మంత్రం వేసే

నీతో పయనము సాగే దూరము
నువ్వే స్నేహము నువ్వే ప్రాణము
ఎవరు ఎవరికీ ఏమౌతామో
రాసుంది ఏ రోజో

కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా  - హో ఓ ఓ

వదలక వదిలే ప్రాయం
కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

నీలో నే సగమైపోనా
నా గుండెల్లోనా నిన్నే నేను దాచని
నన్నే నీకివ్వరానా నీ చేరువలోనే
నా పరువం ఇల్లా కరగని

మనసే ఆగదు వయసే ఓడదు
రోజే మారినా ఇష్టం తీరదు
మనమే మనకిలా తోడవుతాములే
నువ్వంటే నేనేగా

కదలక కదిలే కాలం ఆగే
ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా, - హో ఓ ఓ

వదలక వదిలే ప్రాయం కోరే
ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా




ఫ్రీడమ్ పాట సాహిత్యం

 
చిత్రం: The Ghost (2022)
సంగీతం: భరత్-సౌరభ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: నిఖితా గాంధీ 

ఫ్రీడమ్



దూరాలైన తీరాలైనా పాట సాహిత్యం

 
చిత్రం: The Ghost (2022)
సంగీతం: మార్క్ కె. రాబిన్
సాహిత్యం: కృష్ణ మదినేని , మనోజ్ కుమార్ జూలూరి
గానం: మార్క్ కె. రాబిన్, రోల్ రైడ, అనురాగ్ కులకర్ణి

దూరాలైన తీరాలైనా




ఉరిమితే మేఘాలే పాట సాహిత్యం

 
చిత్రం: The Ghost (2022)
సంగీతం: మార్క్ కె. రాబిన్
సాహిత్యం: కృష్ణ మదినేని 
గానం: మార్క్ కె. రాబిన్, హరిణి ఇవటూరి

ఉరిమితే మేఘాలే

Palli Balakrishna Friday, October 14, 2022
Nenu Meeku Baaga Kavalsinavaadini (2022)




చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ 
రచన: కిరణ్ అబ్బవరం
దర్శకత్వం: శ్రీధర్ గాదె 
నిర్మాత: కోడి దివ్య దీప్తి 
విడుదల తేది: 16.09.2022



Songs List:



లాయర్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రామ్ మిరియాల 

లాయర్ పాప 



నచ్చావ్ అబ్బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ్, లిప్సిక

నచ్చావ్ అబ్బాయ్ 



మనసొక మాటే పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి

మనసొక మాటే 




అట్టాంటి ఇట్టాంటి పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కీర్హన శర్మ, సాకేత్ 

అట్టాంటి ఇట్టాంటి 



చాలా బాగుందే ఈ ప్రయాణం పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఆదిత్య అయ్యంగార్ 

చాలా బాగుందే ఈ ప్రయాణం
నాతో వస్తోందే నా సంతోషం
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నిజంగా నిజంగా ఏంటో ఇదంతా
కలేమో అన్నట్టు ఉంది కదంతా
అందంగా మారిందే వెళ్లే దారంతా
కళ్ళారా చూస్తున్న నాలో కేరింతా

ప్రేమా ప్రేమా నేనే స్వయానా
పడిపోతున్నా పరాకులోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నవ్వుల్లో ముంచావే నన్నే అమాంతం
నాకంటూ ఏముంది నువ్వే సమస్తం
నాతోటి నువ్వుంటే ఏదో ప్రశాంతం
దూరంగా వెళ్ళావో అదే యుగాంతం

నీతో గడిపే క్షణాలకోసం
కాలం కాళ్ళే పటేసుకోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ



మనసే (Family Song) పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ, రమ్యా బెహ్రా

మనసే (Family Song)

Palli Balakrishna Thursday, October 13, 2022
God Father (2022)

a:hover { color: red; } pre { white-space: pre-wrap; white-space: -moz-pre-wrap; white-space: -pre-wrap; white-space: -o-pre-wrap; word-wrap: break-word; }



చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నాయన తార, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: రాంచరణ్, ఆర్.బి.చౌదరి, యన్.వి.ప్రసాద్ 
విడుదల తేది: 05.10.2022



Songs List:



తార్ మార్ తక్కర్ మార్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా ఘోషాల్

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే
ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే
వీళ్ళిద్దరిట్టా వస్తే  భూం దద్దరిల్లాలంతే
ఏ, టాలీవుడ్ ని  బాలీవుడ్ ని తారు మారేంగే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు
చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు
రేపట్నెలా శాషిస్తారు

ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే
హే నిఘాలకే నిఘా పెట్టే  మహా ముదుర్లే
హే, దిల్లే దిమాకులే హే, దిమాక్ కూడా దిల్లే
హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జూంబరే జూంబరే

తార్ మార్ తక్కరు మార్



నజబజ జజర పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , పృద్వి చంద్ర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం

ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తల మీదికంతెత్తున దూకితే నెత్తురే మొత్తం 

గుద్దు గుద్దితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బయి
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాదబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెండాడు గండర గాడుడుర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 

కొండ దేవర కోన దేవర 
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడిటే కథకళిరా 

చొక్కా మడతపెట్టి వచ్చాడంటే
టేకుదుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పాడంటే
మద్దిచెక్క మీద రంపమవుతాడు

నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే 
నడ్డి విరిచెడు చేవచూసి అబ్బలు గుర్తొస్తారొయ్ 
అడ్డు వచ్చినోన్ని అడ్డ దిడ్డముగా 
తొక్కేసి పోతాడురా 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర




గాడ్ ఫాదర్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయిచరణ్ భాస్కరుని, అర్జున్ విజయ్, రితేష్ జి.రావు, చైతు సత్సంగి, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీ కృష్ణ , అద్వితీయ, శ్రుతిక, ప్రణతి, ప్రత్యూష పల్లపోతు, రచిత, వైష్ణవి, హారికా నారాయణ్, శృతి రంజిని, సాహితి చాగంటి 

ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి¹
అంతేలేని ఆధిపత్య శౌరి
దండించే దండకారి

శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం

కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క  చెడును వేటలాడు సామి

ఎక్కడుంటేనేమి
మంచికితను హామీ
ఒక్క మాటలోన
సర్వాంతర్యామి

గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్

ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం

వీడో  ధ్యేయం
వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం

అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల
చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే

మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని
తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని
మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే




బ్లాస్ట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధామిని భట్ల, బ్లేజ్

హో...  హో...
Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది Don’t Say No

లిప్పు మీనో హిప్పు మీనో
గుచ్చి గుచ్చి Kiss Me Know
తప్పు లేదు గిప్పు లేదు
హగ్గు లిచ్చి Crush Me Know

ధూమ్ ధమాకా ఫుల్ థడాకా 
Yehi Mouka Aajaare
ఇంతదాకా వచ్చినాక
Bun Ke Thoofa Cha Jaare
Tere Jaisaa Aur Kohi
Naahi Dhoojaare

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby… Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు 
Feast Baby… Feast Baby

Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది  Don’t Say No

(Rap)

పటాస్ మాస్ యాక్షన్ హీరో
మజిల్స్ తో విజిల్ ఎయ్యరో 
Kick Ass Moods… Darker Shades
బయటికి తియ్యరో 

Is Raath Kaa.. Subahaa Nahee
Thu Share Shaa Laa దూకరో
నీ ఫైర్ లో పవరేమిటో స్టాంప్ వేసేయ్ రో...

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro… Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు
Feast Baby… Feast Baby



పదరా సైనికా పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరామచంద్ర

అడవి చెట్లకు అన్నలం
కొండా గుట్టల తమ్ములం
బందూకులకు బంధువులం
నిప్పు కనికలం

మందుపాతర తొక్కిన అడుగులం
గుండెలోతుల కన్నీటి మడుగులం
ఆకుపచ్చని దారులకంటిన
చిక్కటి నెత్తుటి మరకలం

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

చరితను రాసిన ఎర్ర సిరా
ఎందరో వీరుల త్యాగమురా
ఆ ఒరవడిలో ఉద్యమమై
ఉమ్మడిగా అడుగేద్దాం

తోవ పొడవునా అగ్ని మడుగులు
ఎన్ని ఎదురై  రాని
గుండె తడబడు నింగి పిడుగులు
దండుగా పడిపోని
విశ్రమించని హోరుగా
రగిలించరా కాలాన్ని

మన నేటి చలనమే
నేటి కధనమే భావితరమున
స్వేచ్ఛా పవనమురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

రేపో మరునాడో
నిజమవదా సమన్యాయం
ఓర్పు సహనంగా
సాగాలి సమయం

పుటకతో కూర్చిన ఆశయంరా ఇది
మరణమైనా సరే కిరణమై ఉంటది
ఒకనాటి ఉదయము వేగు చుక్కగా
వేల కళలకు వెలుగులు దిద్దునురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా



అన్నయ్య పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వైష్ణవి కొవ్వూరి

నీరై కరిగిందా నీ యదలో నలుపు
ఏరై కదిలిందా అనుభందం వైపు
అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు
రక్షా బంధముగా నీ తోడై నడుపు
కౌరవులెందరు ఎదురైనామరి 
ఒకడే చాలడా గిరిదారి
అదిగో అతడే అతడే హితుడు భాందవుడు
అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకిపుడు 
 





Palli Balakrishna

Most Recent

Default