Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Collector Gari Abbai (1987)



చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, రజిని, శారద
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 08.04.1987

అందమా అంటుకోనీవే
ముద్దుగా ముట్టుకోనీవే
పలుకుతున్నవి నీలో పదుచురాగాలెన్నో
వయ్యరి అందాలు వల్లోకి చేరాలి లే

పరువమా పట్టుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే
కరుగుతున్నవి నాలో కన్నెబిడియాలేన్నొ
కవ్వింతలీనాడు కౌగిల్లు చేరాలిలే

మల్లెపూలు ఇస్తాను తల కట్టుకీ
తెల్ల చీర ఇస్తాను నడి కట్టుకీ
నేను చేరుకుంటాను నీ చాటుకీ
నన్ను చేసుకో పూల పొద చాటుకీ
మైకమే లోకమై
మెత్తగా యేకమై
మాపటేల దాహాలు
మాయదారి ఆ కల్ల మత్తులోనె పడ్డానులే
ప్రేమించు ఏడెడు జన్మాల కసి తీరగా

అందమా అంటుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే

సంద్య కాటుకిస్తాను నీ కల్లకీ
చందమామ నిస్తాను చెక్కిల్లకీ
నన్ను చేరుకోనివ్వు అత్తిల్లకీ
అంతదాక అమ్మగారి పొత్తిల్లకీ
ప్రేమ ఓ తాపము
పెట్టనీ దీపమూ
చెప్పలేని బావాల విమ్మలేని మోహాల
హాయిలోన పడ్డములే
ప్రేమించు ఆకాశమే హద్దుగా ముద్దుగా

అందమా అంటుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే
కరుగుతున్నవి నాలో కన్నెబిడియాలేన్నొ
కవ్వింతలీనాడు కౌగిల్లు చేరాలిలే
పరువమా పట్టుకోనీవే
ముద్దుగా ముట్టుకోనీవే


*******  *******  *******

చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో

మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో

గుచ్చుకు పోయిన చూపులలో
కుర్ర తనానికి బుగ్గెదురూ
విచ్చుకు పోయిన బుగ్గలలో
యెర్రతనానికి ముద్దెదురూ
కల్లకి వచ్చిన కొత్త కసీ
పెదవులు కోరిన కొంటె రుచి
యెంత తీరిన తీరనిదై
అంతకంతకూ తీయనిదై
అంతకంతకూ తీయనిదై

మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో

పెంచుకు పోయిన ప్రేమలలో
వెచ్చదనానికి ఎదురెవరూ
పంచుకు పోయిన బ్రతుకులలో
చల్లదనానికి మనసెదురూ
జంటలు కలిపినదేమిటదీ
తుంటరి మంటల కొంటె చలి
వెలు నీడలా తానొకటై
చీకటింటిలో తనువుకటై
చీకటింటిలో తనువుకటై

మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో


*******  *******  *******


చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
జాజుల పక్క జల్లెడ పట్టీ తెచ్చానమ్మో
మోజుల చుక్క బుగ్గన పెట్టి వచ్చానయ్యో
అందం పెట్టి తీర్చాలమ్మో నా ఆకలీ
సందె చూసి ఇచ్చెస్తాలే నా జాబిలీ

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ

కసి కోరిక నను కవ్వించగా
నిన్ను కౌగిల్లొ కరిగించనా
చలి చాటుగా ఒక చిరు ముద్దునే
చెక్కిల్ల కందించనా
పగలే జబిల్లి పుట్టాలా
సిగలో సిరి మల్లి పెట్టాలా
తడుముతుంటే నడుములోన
నడకే పట్టాల వుడుకుకే పట్టాలిలే

మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో

కన్నెంగిలి ఇది కాకెంగిలి
తడి ఆరేది కాదే ఇదీ
కొత్తాటలే ఇది కోకాటలే
అది కోరేది తొలి కౌగిలీ
పిట్టలా రివ్వంది పిట్టమ్మ
అందుకే జారింది పైతమ్మ
అలకపెంచి పులకరించే
తనువే తాకాల తపనే చూడాలిలే

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
జాజుల పక్క జల్లెడ పట్టీ తెచ్చానమ్మో
మోజుల చుక్క బుగ్గన పెట్టి వచ్చానయ్యో
అందం పెట్టి తీర్చాలమ్మో నా ఆకలీ
సందె చూసి ఇచ్చెస్తాలే నా జాబిలీ


*******  ******  *******


చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, సుశీల, యస్.పి.శైలజ

సన్నాయి వాయించు బావా
జోడు సన్నాయి వాయించు బావా
అక్క చెల్లెల్లు నీ పక్క వాయిద్యాలు కాగ
సన్నాయి వాయించు బావా

ముద్దుల గుమ్మల ముచ్చటతో
నాలో రేగెను పైత్యాలూ
అక్క అందం తలకెక్కి పోగా
చెల్లి అందం మొలకెత్తి రాగా
ఎదలో రేగెను చిమ చిమలూ
నీ మెడ చుట్టు చిన్న చిన్న డోల్లు
నీ నడుమంత బుల్లి బుల్లి సన్నాయిలూ
ఎక్కడివీ వాద్యాలూ
భజన పురిలో డజను కొన్నన్ను
ఆపబోకుమ సన్నయి కచేరి
నిలబడి పాలూ తాగేసి

అహో ఇంద్ర బోజా
మల్లెల మన్మధ రాజా
whole town town holl down down అయినా
ఓ sound రాజా
ఈ కచేరితో చిరంజీవివైనావయా

హెయ్ నేను కట్టెకే రంద్రాలు పెట్టినాను
కట్టెకే రంద్రాలు పెట్టినాను
మనవల్ల చెవులకే నా సుత్తి కొట్టినాను
వేలెత్తి సుత్తి వేలయ్యినానూ

డొలు సన్నయీ ముద్దదు కున్నయిలే
కాలు మోకాలు పోట్లాడుకున్నయిలే
మద్దెలనే మంచంగా
ముగ్గురమూ పంచుకొనీ
రోజు రోజంతా ముద్దడుకుందాములే

పాలెట్టుకొచ్చానూ పెద్ద బావా
బుల్లి పండెత్తుకొచ్చాను ప్రేమ గీనా
పూలెట్టుకొచ్చాను చిన్న బావా
వేడి food అట్టుకొచ్చాను నల్ల బావ
పూలందుకో పాలందుకో
ఫూడ్ అందుకో పండందుకో

బాబు వినరా అక్క చెల్లెలా గొడవొకటీ
ఎడా పెడా వాయించే రబసొకటీ

మతిపోయిందా శ్రుతి ముదిరిందా
గుట్టుక చేసుకోండి సన్నయి కాపురం

వెల్లండి....అలాగే

గుట్టుగ సాగిద్దం సన్నాయి కాపురం
గుట్టుగ సాగిద్దం సన్నాయి కాపురం


Most Recent

Default