Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tayaramma Bangarayya (1979)




చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, షావుకారు జానకి, చంద్రమోహన్, మాధవి, రంగనాథ్, యమ్.జి.ఆర్.సంగీత , చిరంజీవి (అతిధి పాత్రలో)
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
నిర్మాతలు: ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు
విడుదల తేది: 18.11.1979



Songs List:



ఆనాడు ఈనాడు ఏనాడు పాట సాహిత్యం

 
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: జి. ఆనంద్, సుశీల

పల్లవి:
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు
అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

చరణం: 1
ఒకడు ఆమ్ముకుపోయాడు... ఒకడు అడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు
మగవాడే...  మన పగవాడు
మగవాడే...  మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

NO... 
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు
ప్రేమించాడు దేవత నీవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు
 ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు

చరణం: 2
నెత్తిన కూర్చుంది ఒకతి
నెత్తిన తన్నింది ఒకతి
ఒకతేమో శపథం చేసి యుద్ధం చేర్చింది
నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు

ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు

చరణం: 3 
సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు
సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు
యుగయుగాల మీ బానిసే ఆడది
యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది




ఒరే ఒరే ఊరు కోరా పాట సాహిత్యం

 
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

ఒరే ఒరే ఊరు కోరా



గుడిసె పీకి పాట సాహిత్యం

 
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

గుడిసె పీకి మేడమీద వెయ్యాలి 




మై నేమ్ ఈజ్ బంగారయ్య పాట సాహిత్యం

 
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మై నేమ్ ఈజ్ బంగారయ్య

Palli Balakrishna Monday, January 28, 2019
Kukka Katuku Cheppu Debba (1979)




చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవి
దర్శకత్వం: ఈరంకి శర్మ
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 01.03.1979



Songs List:



ఏమండీ ఏమనుకోకండి పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల 

ఎమండీ యేమనుకోకండీ
ఆకుచాటు మొగ్గనూ రేకు విడని పువ్వునూ
అనుభవం లేనిదాననూ ఏంచేయను ఏంచేయను ॥ఏమండీ॥

గుండె దడదడమంటోందీ గొంతు కెండుకు పోతోంది
చేతులాడ కున్నవీ చెమటలు పోస్తున్నవీ
జీవితంలో ఏమీ యెరగను కాగితంలో యేం రాయనూ
మహారాజ రాజశ్రీ సత్యం....
కాబోయే శ్రీవారూ కావాలని కోరారూ
మబ్బునే బతిమాలనా హంసను వెతుకాడనా
రాయబారులు యెవరూ లేరు సాహస మన్నది అసలేలేదు
ఏం చేయనూ ఏం చేయనూ ॥ ఏమండీ॥

ఎంత సొగసరి మావారూ ఇంతగా ననువలచారూ
మిధిల కొచ్చిన రాముడై మధుర కొచ్చిన కృష్ణుడై
నేడు వాకిట వేంచేశాడే హారతైనా యివ్వలేదే
ఎం చేయనూ ఎం చేయనూ ॥ ఏమండీ॥



హే బేబీ కానీ కానీ కైపులోన పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రమోల 

హేబేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి ఆడనీ
కాని కాని కాని కాని
ఇలాంటి రేయిరాదు హాయిరాదు రాదనీ
తెలారు ఆడి అలవనీ కాని కాని కాని కాని

ఉన్నవయసూ... - ఊఁ 
ఊరుకోదు..........- నిజమా
ఊరుకుంటే ఉండిపోదు.... - అబ్బా 
మరీ
మనసు మనసు అనకు - వలపులోన పడకు
హద్దు గీసుకోకు ఆశ అణచుకోకు
అనుభవించు ఉన్నదానిని కాని కాని కానీ.
మిగుల నీకు రేపు ఉందని కాని కాని కానీ

పగలూ రేయీ - ఆఁ
తలపులేదు - ఓహో
మొదలు తుదీ అసలులేదు - ఆఁ లేదు
నీది నాది లేదు నీతి జాతి లేదు
వెనక చూపులేదు ముందు ఆపులేదు
మనిషి పశువు కాడు కాడనీ కాని కాని కానీ
గతము నెమరు వేయరాదనీ కాని కాని కానీ




ఇంత మంచివాడివైతే పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్ 

యింత మంచోడివైతే బావా బావా బావా
పనికిరావు దేనికీ యింతో అంతో గడుసుదనం వుండాలి
పురుషుడికి మగపురుషుడికీ
యింతో అంతో గడుసుదనం వుండాలి

అల్లరంటే నీ కసలు నచ్చదేమి
ఆడపిల్లకది శానా యిష్టం కిస్మీ కిస్మి
NOT NOW
మరి when?
పెళ్ళి కావాలీ పెదవి కలవాలి
అంతవరకు దూరంగా వుండాలి
అయ్యయ్యయ్య
కన్నెపిల్ల పక్కనున్నా కన్నెత్తి చూడవు
తప్పు తప్పు తప్పు
పైటకొంగు జారేస్తే పక్క కెళ్ళి పోతావు
అదే వొప్పు చొప్పు
కాలుకాస్త తగిలిస్తే సారి సారి అంటావు
కన్ను కోడితే నలకేదో పడ్డదంటావు
పోనీ ఊదమని దగ్గరొస్తే వణికి వణికి పోతావు
లేక వొడిసి పట్టుకోనా ?
అబ్బో ఆమాత్రం కూడానా 
నా వయసు వన్ నైన్ నీ వయసు టూవన్నూ
కాదు నైంటీన్, ట్వంటీవన్
యస్సూ మన ఈడు మనజోడు నీతోడు ఫైను
అందుకనీ
అందుకనే
నన్ను చేసుకో వైఫు యింక చూసుకో లైఫు
జాగుచేస్తే నా వయసు అవుతుంది నైనువన్నూ
పోనీ అప్పుడైన వోపికుంటే నేను నిన్ను కాదన్నూ
నువ్వు కాదన్నా నేను వదలనూ
నువ్వు వదిలావా నేను బతకనూ




అందాల రాముడు పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం 

అందాలరాముడు సీతను కౌగిట పొదిగిన శుభదిన మీనాడు
అందాల సీతను రాముడు కౌగిట పొదిగిన శుభదిన మీనాడూ

శ్రీ శ్రీరాము డేలిందీ అయోధ్యనైతే
మా శ్రీవారు యేలేది నా జీవితం
ఆ సీత కదిపింది శివధనుస్సు నయితే
నా ఈ సీత కదిపింది నా మనసునే

వాల్మీకి రాసింది తొలి కావ్యమయితే
మన వలపే దాని తొలి భాష్యమూ
లేదు వనవాసం మనది సహవాసం
ప్రతిరోజు పట్టాభి షేకం
ప్రతిరోజు పట్టాభిషేకం

రాజ్యాలు భోగాలు వలదని ఆ సీతా
ఈ పార్వతె పుట్టింది నా కోసమే
తెల్లని మంచంటి చల్లని స్వామికై
నే తపస్సునే చేశాను ఈ జన్మలో
ఆ శివుడు మన్మధుని మసి చేసినాడు
నీ ప్రియుడు నేడు బ్రతికించుతాడు
నువ్వే నా వరము - నేనే నీ సగము
మనజీవితాలే ఆదర్శమూ
మన జీవితాలే ఆదర్శమూ




కన్నువంటిది ఆడది పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

కన్నువంటిది ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ
తనువున యెక్కడ దెబ్బతగిలినా కన్నే యేడ్చేది
మనలో యెవ్వరు తప్పు చేసినా
స్త్రీకే శిక్ష పడేది - స్త్రీకే శిక్ష పడేది

తప్పటడుగులు మాన్పించీ తప్పువొప్పులు నేర్పించారూ 
తలుపుచాటూ తల్లిచాటూ దాటకుండా పెంచారూ
కనురెప్పలుగా కాపాడారు కంటిని ముల్లు కాటేస్తే
ముల్లుకే కంటిని అర్పిస్తారా
ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం

సీతా అహల్యలున్నారూ ఈ కలికాలంలోనూ
తాము చేయని నేరములకు శిక్షలింకా పడుతున్నారు
రాముడు యేడీ అహల్యకు భూదేవేదీ సీతమ్మకు
కన్నతల్లివున్నా మరలా కడుపులోకి వెళ్ళేదెలా 

Palli Balakrishna
Sri Rama Bantu (1979)




చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి, పూర్ణచంద్రరావు
నటీనటులు: చిరంజీవి, హరిప్రసాద్, గీత, సత్యకళ, అనిత, జయవాణి, మోహన్ బాబు
మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: ఐ. యన్. మూర్తి
నిర్మాత: యారగుడిపాటి. వరదా రావు (వై.వి.రావు)
విడుదల తేది: 03.08.1979



Songs List:



కొడుకో నా మేనత్త కొడుకో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

పల్లవి :
కొడకో, నా మేనత్త కొడకో
వగలే సొంతం అనుకో దిగులే లేదు ఇనుకో
ఎల్లుండే కాశి పొద్దున చేసుకో పెళ్లి చేసుకో

చరణం: 1
సూపు కలిసిన సుబలగ్గంలో సురుకు మందిర నామనస-
సేయి కలిపిన సాయంత్రంలో పేరుకు తీపి 4/8 c
అందాలన్నీ—నేచందాలిస్తా
ఈడోజోడో -- తాడో పేడో
ఈడోజోడో తాడో పేడో తేల్చేసుకో

చరణం: 2
పుట్టిననాడే పదహారేళ్లు
రానే రాదుర పదిహేడు
బావలు మామలే నాకున్నోళ్లు వరసకు చెల్లీ అనలేరు
అందాలన్నీ నేపందెం వేస్తా-
వయసో మనసో—వరసో తెలిసీ
వయసో మనసో వరసో తెలిసీ వాటేసుకో




సీతమ్మ సిగ్గు పడింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పల్లవి:
సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది.
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళ

చరణం: 1
కౌగిలినే కోవెల చేసి
మమతలనే మాలలు వేసి
అందాలన్నీ హారతులిచ్చి 
పులకింతలతో పూజలు చేసి 
ఏ వరాలు అడిగిందో ఆ జవరాలు
ఎవరికి తెలుసమ్మా ఆ వివరాలు

చరణం: 2
మల్లెలతో మంతనమాడి
జాబిలితో జాబులు పంపి
సిగ్గుల ముంగిట ముగ్గులు దాటి
వెచ్చని ఊపిరి వేణువులూది 
ఏ శృతిలో పాడిందో ఈ అనురాగం
ఎవరికి తెలుస్మూ ఆ రామాయణం




పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి: 
పూతరేకులాంటి పిట్టరో  
దాని పులకరింత పంచుకుంటరో
దీని పులకరింత అందుకుంటారో 
పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా 
అహ పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా

కోర వయసు కోడి పుంజురో
ఆడు కుర్రకారు దోర గింజరో
ఈడి ముద్దు ముదురుతున్న ముంజరో
పరువాల గిత్తా దీన్ని పట్టేది ఎట్టా ?

చరణం 1
సన్నగ చిన్నది నవ్విందంటే సన్నజాజి పూసే
కుర్రది వర్రగ నడిచిందంటే కూచిపూడి వెలిసే
ఆమాట నువ్వంటే నీ మనసు నేవింటే
చలి పెరిగి రమ్మంటే మెలి తిరిగి పోతుంటే
అన్నట్టు వున్నట్టు నీ నడుమే
ఉలికి ఉలికి పడుతుంటే కూతవిద

చరణం: 2
చూసిన కన్నుల కాసిన వెన్నెల - ఎండకన్న ఉడుకు
జాజులు వాడిన ఆశలు రేగిన మోజులెంత దుడుకు
నెలవంక నాకోసం ఇలవంక దిగివస్తే
నేలేత ఎన్నెళ్లే నన్నల్లుకుంటుంటే
నాముద్దు నీముద్దు ఇద్దరికీ నిద్దర చెదరగొడుతుంటే



సీతమ్మ సిగ్గు పడింది (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళ



రామబంటు నేనేరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు 

రామబంటు నేనేరా 
శ్రీరామ బంటు నేనేరా
రక్కసి మూకల ఉక్కడగించి 
రామకార్యమున తీర్చగ వచ్చిన 

రాం రాం రాం రాం 
జై  రాం రాం రాం రాం 

పదితలులున్న పతితులెరుగరు 
మగువకు మానమే ప్రాణమురా...
అరె కుంక బుద్దులు లంకకు చేటని 
అంబ పలికి నీ పంబ అదరగా 

కళ్ళు  నెత్తినెక్కి నందుకు 
కన్నె పిల్లల్ని చెరబట్టి నందుకు 
కన్నె కొంపల్నెన్నో కాల్చినందుకు 
పల్లె పంటల్నెన్నో దోచినందుకు 
కొట్టు ఎద్దు తోకకు ఎన్నుపోటు పొడిచి 
నిండు ప్రాణాలెన్నో తీసినందుకు 

రాం రాం రాం రాం 
శ్రీ  రాం రాం రాం రాం 

నీ పుటకే బారం నివు బ్రతికుండడమే నేరం 
శీలాపహరణం చేసినందుకు చేస్తా చూడర వస్త్రాపహరణం
వళ్లు బలిసి ఉన్నందుకు కుళ్ళు బుద్ది పుట్టినందుకు 
సంపు కల్లుతాగి తూలినందుకు  నిప్పుతోటి పేలినందుకు 
చెప్పు అడ్డమైన గడ్డి గొడ్డులాగా గతికి వడ్డూ పొడవు పెరిగినందుకు 
కొడతా తిడతా భరతం పడతా 



రామరామ రఘురామ పరాత్పర పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు & కోరన్

వచనం : 
అప్పుడు హనుమంతుడు తన స్వామి శ్రీరామచంద్రుని వుంగరాన్ని సీతాదేవికి భక్తితో సమర్పించి 
"నీ కష్టాలు తీరే సమయం సమీపించింది. త్వరలో రామచంద్రమూర్తి రావణాసురుని జయించి నిన్ను గ్రహిస్తాడు తల్లీ" అన్నాడు. 
అసలు ఎవరయ్యా హనుమంతుడు ? రామకార్య దురంధురుడు, శ్రీరామ పాదసేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న పుణ్యమూర్తి, నాటికీ, నేటికీ, చిరంజీవి. 
మరి ఎక్కడ వుంటాడా హనుమంతుడు...?

శ్లోకం :
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్ప వారి పరి పూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

వచనం : 
ఎక్కడెక్కడ తన స్వామి శ్రీరామచంద్రుని నామసంకీర్తనం జరుగుతుందో
అక్కడ, రెండు చేతులూ జోడించి ఆనంద భాష్పాలు రాలుస్తూ కూర్చుని
వుంటాడుట ఆ భక్త శిఖామణి. అణు క్షణం ఆ మారుతి జపించే తారకమంత్రం ఏమిటయ్యా....?

రామదాసు:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రధాంగ ధరఘన, పతంగ వాహన
రమారమణ నారాయణా

చారుశీల సురలోల నిరంజన
సత్వపరాయణ సువిధామా
జానకి రమణా ధనుజవిరమణా
మారుతి పూజీత శుభచరణా

కోరస్:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రామదాసు :
రధాంగ ధరఘన పతంగ వాహన
రమారమణ నారాయణా...
రామ రామ రామ సీతా - రామ రామ రాం

కోరస్ :
రామ రామ రామ సీతా రామ రామ రాం


Palli Balakrishna
Kothala Raayudu (1979)




చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వీటూరి, జాలాది, కె. చక్రవర్తి
గానం: యస్.పి. బాలు, జానకి, శైలజ
నటీనటులు: చిరంజీవి, మాధవి, మంజు భార్గవి, బేబీ తులసి 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: వి.కె.తమ్మారెడ్డి 
విడుదల తేది: 15.09.1979



Songs List:



పువ్వులోయ్ పువ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

పువ్వులోయ్ పువ్వులు




ఎండా వాన పెళ్లాడే పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి
గానం: యస్.పి. బాలు, శైలజ

(వీటూరి సుందరరామ మూర్తి, వేటూరి సుందరరామ మూర్తి. ఇద్దరు  గేయరచయితలు ఉన్నారు, ఇద్దరూ వేరు వేరు. ఈ పాట రాసింది వీటూరి సుందరరామ మూర్తి)

ఎండా వాన పెళ్లాడే



గో గో గో మిస్టర్ పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: కె. చక్రవర్తి 
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

గో గో గో మిస్టర్



ఒక నెలవంక పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు

ఒక నెలవంక

Palli Balakrishna
Agni Samskaram (1980)




చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
నటీనటులు: చిరంజీవి, కవిత, సుభాషిణి
దర్శకత్వం: జి.వి.ప్రభాకర్
నిర్మాతలు: పి. రమాదేవి, జి వసుమతీ దేవి 
విడుదల తేది: 21.02.1980



Songs List:



మంచున తడిసిన మల్లికవో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

మంచున తడిసిన మల్లికవో 



శివ శివ శంకర పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.జానకి 

శివ శివ శంకర 



కొండమీద కాపురం ఉన్న పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: రమోల, శ్రీనివాస్ 

కొండమీద కాపురం ఉన్న 




మనిషై మతములు వెలయించాడు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: వి. రామకృష్ణ 

మనిషై మతములు వెలయించాడు మతమే మనిషిని

Palli Balakrishna
Aarani Mantalu (1980)




చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, కవిత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపరమల్లు వెంకటేశ్వరులు
విడుదల తేది: 15.03.1980



Songs List:



నీ చూపు నా చూపు కలిశాక పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

నీ చూపు నా చూపు కలిశాక



కమ్మని నా పాట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

కమ్మని నా పాట 




ఓ అమ్మో టక్కరి గుంట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఓ అమ్మో టక్కరి గుంట 





అన్నయ్య దీవెన పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

అన్నయ్య దీవెన 




నలుగురి కోసం వెతుకుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నలుగురి కోసం వెతుకుతున్నది

Palli Balakrishna
Nakili Manishi (1980)




చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి, బాజీరావు, యల్. ఆర్. అంజలి
నటీనటులు: చిరంజీవి, సంగీత
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాత: యారగుడిపాటి వరధారావు
విడుదల తేది: 01.08.1980



Songs List:



ఇటు మూగ ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి, బాజీరావు

ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష



తమలపాకులాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యల్. ఆర్. అంజలి

తమలపాకులాంటి దాన్ని 




బొమ్మా బొరుసా రావా పురుషా పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

బొమ్మా బొరుసా రావా పురుషా 




భలే భలే భలే భలే నరసింహస్వామినిరా పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు

భలే భలే భలే భలే నరసింహస్వామినిరా 

Palli Balakrishna
Kaali (1980)




చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి (All)
నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, సీమా, ఫటా ఫట్ జయలక్ష్మి, శుభ
దర్శకత్వం: ఐ.వి.శశి
నిర్మాత: హేమ నాగ్
విడుదల తేది: 03.07.1980

( గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ చిత్రంలో పాటలు రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి )





Songs List:



గుడిలోన దీపాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు

పల్లవి: 
గుడిలోని దీపాలు
ఆనందరూపాలు
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు

చరణం: 1
కనులే మురిసే కమనీయ శిల్పాలు
ఎదలో విరిసే చిరునవ్వులు
అనురాగ బంధాలు నానా ఆశయ సౌధాలు
ఈ పిల్లలే నా జీవితం, నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు

చరణం: 2
దైవం పలికే అపురూప రాగాలు
కాలం పూచే సిరిమల్లెలు
మీ ఆటపాటలలో
తీరేను వేదనలు
ఈ పిల్లలే నా జీవితం, నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికి ప్రతిబింబాలు

వంశం నిలిపే వారసులు
మన భావి నాయకులు మన జాతి సారథులు
ఈ పిల్లలే నా జీవితం నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికి ప్రతిబింబాలు

గుడిలోని దీపాలు
ఆనందరూపాలు




అనగనగా పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: పి. సుశీల

పల్లవి:
అనగనగా పిలగాడు
అందరిలో మొనగాడు
అమ్మాయి మనసొకటే
అయ్యయ్యో కనలేడు

చరణం: 1
మాటలతో గారడిచెయ్యి
ఆపై నన్ను వలలో వెయ్యి
నా వయసే గులాబిపువ్వు
విసిరేస్తా ఎందుకు నువ్వు
నీ ఎదుట చెలివుంది
చొరవుంటే నీదవుతుంది

చరణం: 2
గోదారీ పొంగుతుంది
కుర్రాడికి దాహంకాదా
నా పరువం కవ్విస్తుంది.
గుండెల్లో మోహంలేదా
రమ్మంటే రావేమీ
నీ మూతికి మీసం వుందా..?
చూచేవుంటే మాటేవింటే
నీ సొమ్ము పోతుందా ?

అనగనగా పిలగాడు
అన్నిటిలో మొనగాడు
అమ్మాయి మనసొకటే
అయ్యయ్యో కనలేడు




న్యాయమైన దారిలోన పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు

న్యాయమైన దారిలోన
సాగిపోదాం పదరా నాన్న
మంచి చేయాలి పదిమంది మెచ్చాలి
మంచి చేయాలి పదిమంది మెచ్చాలి.
పుణ్యంచే స్తే ఎప్పటికై నా
ఫలితం వుందిరా
పాపంచేస్తే నీడగ నిన్నే వెంటాడేనురా

చరణం: 1
కాలం అనుకూలమైననాడు మంచి జరుగును
విధి ఎదురైన ఎవరైన పాడవునురా లే బాగావుండాలి
ఏ శుక్రుడో, ఏ రాహుచో, శనిదేవుడో
ధర్మం కావగా హరిదాల్చే అవతారం
న్యాయం కాచుట మాకిక వ్యాపారం
చేద్దాం జాతికి వుపకారం
ఏనాటికి, ముమ్మాటికి, మన ధాటికి
రావణులు, కీచకులు గడగడలాడ

చరణం: 2
ఎన్నో జన్మల అనుబంధం మా స్నేహం
ఇలలో ఎన్నడు విడిపోని సంబంధం
వరమేకాదు మా స్నేహం
కష్టాలలో, నష్టాలలో, సౌఖ్యాలలో
ఇద్దరమూ ఒక్కటిగా సర్దుకుపోవాలి




భద్రకాళి చందన శీలి పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్. జానకి 

పల్లవి: 
భద్రకాళీ ఛండనశీలి - భీకర భయదకరాశీ
నీ మానసవీ నెలవాడు
ఉగ్ర తాండవమాడు

చరణం: 1
లోకములు గాచుటకై అవతరించి..
రాక్షసుల నెందరినో పరిహరించారంట
ఏదీ తల్లీ ఆ తేజం, నువ్వెక్కండవు వుత్తేజం
లోకములు గాచుటకై అవతరించావంట
రాక్షసుల నెందరినో సంహరించావంట
నమ్ముకున్నవారం - మేమంతా నీవారం
నీదయ రానివ్వు నీ శక్తి మాకివ్వు
తల్లి కాళీ కాళీ ....

నీ మవునమ్ వీడు
ఉగ్ర తాండవమాడు
వంచన రాజ్యం చేస్తుంటే
మంచికి గోరీ కడతుంటే 
దేశాన్ని దోచుకునే ద్రోహులే వున్నారు
దీనులను ఘోరంగా హింసపెడుతున్నారు.
ఊరుకుంటేకాదు చూసుంటే సరిపోదు 
వూరుకుంటే కాదు చూసుంటే సరిపోదు

నీచుల్ని పట్టాలి - చీల్చి చండాడాలి.
పీడించు వాడెవడూ ప్రాణంతో మసలేడా
పేదాడు ఎగబడితే వీరభద్రుడు కాకపోడు
నింగిని నేలకు తెప్పిస్తాడు
కక్షను అంతే చూసారు
గాయపడ్డ సర్పం
చూపించు దాని దర్పం
నా భక్తి నా శక్తి నా నీతి నా కత్తి
నీ మవునమే వీడు
వుగ్ర తాండవమాడు




బేబీ షేక్ ఇట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

బేబీ షేక్ ఇట్ బేబీ 

Palli Balakrishna
Thathayya Premaleelalu (1980)






చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: నూతన్ ప్రసాద్, చిరంజీవి
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: ఎమ్. ఎస్. రెడ్డి
విడుదల తేది: 19.09.1980



Songs List:



వెన్నెల్లో విన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  ఎస్.పి.బాలు, ఎస్.జానకి 

పల్లవి:
వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం
నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...

వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం

చరణం: 1
ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...
ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...

కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా..
కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా..

విరజాజిలో నిను చూసితి... చూసి చేయ్ సాచి  దరి చేరితి..
చేరి నిలువెల్ల ముద్దాడితి...

కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం...
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...
కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం...

చరణం: 2
ఆహా.. లలలలలాలా..
లలలలలాలా.. అహా...
లలలలలాలా... లలలలలాలా.. అహా..  లలలలలాలా...

సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..
సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..

వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా...
వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా...

చిరుగాలినై దరి చేరితి.. చేరి మనసారా నిను తాకితి
తాకి పులకించి తరియించితి...

వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం.. నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...

లలాలా.. అహా..హా.... లలాలా..  ఉ..ఉ....




చిక్కావులే చక్కర బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

చిక్కావులే చక్కర బొమ్మ 



నా పేరు నాగమల్లి పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

నా పేరు నాగమల్లి 




బాగున్నది భలే పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

బాగున్నది భలే 

Palli Balakrishna
Rakta Bandham (1980)




చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి,  జాలాది 
గానం: పి.సుశీల, యస్.పి. బాలు, ఎస్.జానకి, జి.ఆనంద్, యస్.పి. శైలజా, రాజేష్, లతారాణి, వినోద్ (నూతన గాయకుడు)
నటీనటులు: చిరంజీవి, ప్రసాద్ బాబు, నూతన్ ప్రసాద్, కవితా, సువర్ణ , సుమిత్ర , రోజారమణి
మాటలు: మోదుకూరి జాన్సన్ 
కథ, దర్శకత్వం: ఆలూరి రవి
నిర్మాతలు: ఎస్. విజయలక్ష్మి, పి.ఎస్. కృష్ణ
విడుదల తేది: 13.12.1980



Songs List:



అడిగింది అమ్మనన్ను పాట సాహిత్యం

 
చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి

అడిగింది అమ్మనన్ను 




చం చం చం చండిక పాట సాహిత్యం

 
చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం:  జాలాది 
గానం: పి.సుశీల, వినోద్ 

 చం చం చం చండిక



కాకమ్మ కాకి కాలువల్ల కాకి పాట సాహిత్యం

 

చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం:   జాలాది 
గానం: పి.సుశీల, జానకి, యస్.పి. శైలజా,  జి.ఆనంద్,

కాకమ్మ కాకి కాలువల్ల కాకి 




తల్లీ చలవకు చెల్లి ప్రేమకు ( Sad song ) పాట సాహిత్యం

 


చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం:   
గానం: జి.ఆనంద్, పి.సుశీల

తల్లీ చలవకు చెల్లి ప్రేమకు విలువ చెప్పింది 



Thank you very Much పాట సాహిత్యం

 
చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం:   డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, ఎస్.జానకి,

Thank you very Much

Palli Balakrishna
Aadavaallu Meeku Joharlu (1981)




చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, సరిత, భానుచందర్ , ప్రత్యేక పాత్రలో చిరంజీవి
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: టి.విశ్వేశ్వరరావు
విడుదల తేది: 15.01.1981

(చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన మూడవ సినిమా)



Songs List:



ఆడవాళ్లు మీకు జోహార్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

ఆడవాళ్లు మీకు జోహార్లు



సగం కాలిపోయాను పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల

సగం కాలిపోయాను సగం కాలనున్నాను 




ఒకసారికి ఒకసారే పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. జానకి 

ఒకసారే ఒకసారే
ఒకసారికి ఒకసారే మళ్ళీ మళ్ళి అడగొద్దు 





రేపు మాపు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
యస్.పి.బాలు, పి. సుశీల

రేపు మాపు




# పాట సాహిత్యం

 
Song Details




ముందు చూపుగా నే పోతుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల

ముందు చూపుగా నే పోతుంటే
వెనుక ఊపుగా నువ్వొస్తుంటే 
అందరు గుస గుస లాడెనురో సైరో నా రాజా
కిల కిల నవ్వూ చూసి నీ నడక చూసి 

Palli Balakrishna
Prema Natakam (1981)






చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మురళీమోహన్, శారద, శరత్ బాబు, సంగీత, పుష్ప కుమారి
ప్రత్యేక పాత్రలో (Friendly Appearance)  చిరంజీవి, కవిత
కథ, మాటలు: కాశీవిశ్వనాధ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: ఎమ్. శంకరయ్య, నందకుమార్, స్వామి, బాలనాగయ్య
విడుదల తేది: 18.04.1981



Songs List:



ఓ ఊర్వశి ప్రేయసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. పి.బాలు, పి.సుశీల

ఓ ఊర్వశి ప్రేయసి 





ప్రేమించు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

ప్రేమించు 



నిన్నటి నా గతి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

నిన్నటి నా గతి 




వస గొంతున కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

వస గొంతున కోయిల 



ప్రేమ నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు

ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం 



కూనలమ్మ కులికిందంటే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు, ఎస్.జానకి

(చిరంజీవి, కవిత సాంగ్)

కూనలమ్మ కులికిందంటే 

Palli Balakrishna
Parvati Parameshwarulu (1981)




చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, రమోలా
నటీనటులు: చంద్రమోహన్, చిరంజీవి, ప్రభ, స్వప్న 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యం.యస్.కోటా రెడ్డి
నిర్మాత: యస్. వెంకటరత్నం
విడుదల తేది: 06.02.1981



Songs List:



సదా సుధ మాయ పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి

సదా సుధ మాయ 



నాధ నిలయుడే శివుడు పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి

నాధ నిలయుడే శివుడు
ఆది మధ్యాంత లయుడు 
ప్రణవ నాథ నిలయుడే శివుడు




తొలి రోజులే చెలి మోజులే పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

తొలి రోజులే చెలి మోజులే




నా జీవ వీణపై పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి

నా జీవ వీణపై





భరతమాత పుత్రులం పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

భరతమాత పుత్రులం 




తళుకు చూసినా నీ బెళుకు చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, రమోలా

తళుకు చూసినా నీ బెళుకు చూసినా

Palli Balakrishna
Nyayam Kavali (1981)




Movie Details



Songs List:



బుడి బుడి బిడియంగా పాట సాహిత్యం

 
చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బుడి బుడి బిడియంగా



ఈ రోజే ఆదివారము... పాట సాహిత్యం

 
చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఈ రోజే ఆదివారము... అవునండి మాకు తెలుసు  
ఇద్దరము పడుచువారము... ఆ.. ఐతే 
ముద్దాడె మొదటీ వారము... ఏయ్.. ఇదిగో 
అందించు కాస్త అందము... ఆ.. అది మాత్రం కుదరదు 
అమ్మో శరణంటినే... నన్నూ కరుణించవే  

లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి
లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి

ఈ రోజే ఆదివారము...  సెర్ టేన్లీ మేడాం  
ఎంతైనా ఆడువారము... అఫ్ కోస్ అది నాకు బాగా తెలుసు 
పెళ్ళాడే ప్రేమవారము... అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి
అందాకా మనకు దూరము... అది మాత్రం కుదిరిచావదే
అయ్యో.. ప్రేమించకు... అపుడే.. శృతి మించకు

నో నో నో నో అందీ భారతి 
నో..నో..  నో నో నో నో అందీ భారతి

చరణం: 1
రుసరుసలోనే రుచి కలదానా
ముసిముసి నవ్వుల మధువుల వానా
రుసరుసలోనే రుచి కలదానా
ముసిముసి నవ్వుల మధువుల వానా

ముక్కు మీదనే కోపమున్నది
మక్కువైన నీ తాపమున్నది

నైసు నైసుగా పాడినా నే నైసుకానిక చూసుకో
పెళ్లైయ్యాకే ఆరాటాల పేరంటాలే చేసుకో
అందాక ఉపవాసం.. ఆపైనే సావాసం
వారం వర్ఝం అన్నీ చూసి వచ్చావంటే నేనే నీ సొంతం

లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి 
నో నో ... నో నో నో నో అందీ భారతి.. వై వై

చరణం: 2
మనసిచ్చిన ఆడది మారదని
నులి వెచ్చని నీ ఒడి వీడదని
మనసిచ్చిన ఆడది మారదని
నులి వెచ్చని నీ ఒడి వీడదని

పొద్దు వాలినా ముద్దు రాలినా పొందికైనదీ బంధమనీ
వాలు చూపుల వంతెనేసి.. కన్నె సొగసే కదలి వస్తే

కన్ను కన్ను కలిసే నాడె కాపురాలైపోతుంటే
కౌగిట్లో కల్యాణం... నీ కవ్వింతే నా కట్నం
మాటే మంత్రం.. మనసే మేళం..
మల్లెలో ఇల్లే సంసారం

లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి 
నో నో ... నో నో నో నో అందీ భారతి..అబ్బా

ఈ రోజే ఆదివారము... ఎంతైనా ఆడువారము
ముద్దాడె మొదటీ వారము... అందాకా మనకు దూరము
అమ్మో శరణంటినే... అపుడే.. శృతి మించకు  


లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతీ 
నో నో నో నో అందీ భారతి

ప్లీజ్.. లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతీ 
నో నో నో నో అందీ భారతి




అమ్మో నాకు భయం పాట సాహిత్యం

 
చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అమ్మో నాకు భయం 




న్యాయం కావాలి స్త్రీలకు పాట సాహిత్యం

 
చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి 



అబలను కాను పాట సాహిత్యం

 
చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అబలను కాను 

Palli Balakrishna
Srirasthu Subhamasthu (1981)




చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి (All)
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల, ఎస్.పి.శైలజ
నటీనటులు: చిరంజీవి, సరిత, కవిత, సువర్ణ, నూతన్ ప్రసాద్
మాటలు: వీటూరి
దర్శకత్వం: కాట్ర సుబ్బారావు
నిర్మాతలు: కె.నరసింహారావు, వై.వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
విడుదల తేది: 26.09.1981



Songs List:



చినుకంటి నడుంమీద పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ

చినుకంటి నడుంమీద




హే కృష్ణ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

హే కృష్ణ 




కోమలాంగి వచ్చిందిరో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు

పల్లవి:
కోమలాంగి వచ్చిందిరో 
మెచ్చిందిరో నచ్చిందిరో
కోమలాంగి వచ్చిందిరో 
మెచ్చిందిరో నచ్చిందిరో
చెయ్యనా వందనం 
చెల్లనా చందనం

కోమలాంగి వచ్చిందిరో 

చరణం: 1
గుమ్మ బాగుంది సోకు చూస్తే 
సొమ్ము చేసేసుకోనా
గుర్రు మీదుంది పిట్ట చూస్తే
గూడు నేనల్లుకోన 
ఈ దమయంతికి, పూబంతికి
లేత పులకింత పూలిచ్చుకోన
ఏమందిరో ప్రేమందిరో
మురిపాల ముద్దంత నీదందిరో

కోమలాంగి వచ్చిందిరో 
మెచ్చిందిరో నచ్చిందిరో
చెయ్యనా వందనం చెల్లనా చందనం

చరణం: 2
నీడలావచ్చి నీరజాక్షి 
తోడుగా ఉండిపోనా
వాయిదావద్దు వారిజాక్షి 
మూడు ముల్లేసుకోనా
నా తొలిచూపే విరితూపై
కొత్త గిలిగింత పండించుకోనా
అమ్మాయిలో ప్రేమ సన్నాయిరో
ఎల్లుండి ఏకాశి పెళ్ళందిరో

కోమలాంగి వచ్చిందిరో 
మెచ్చిందిరో నచ్చిందిరో





శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుండి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కళ్యాణం దాక

శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుండి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కళ్యాణం దాక

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం: 1
ప్రేమకు వచ్చే పెళ్లీడు 
పెద్దలు మెచ్చే మా జోడు
లగ్గం కుదిరేదెన్నటికో 
పగ్గాలెందుకు ముద్దాడు
మనసు మనసూ మనువాడే
మనకెందుకులే తెరచాటు
నీ అర ముద్దులకే విజయోస్తు
నీ అనురాగానికి దిగ్విజయోస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం: 2
కళ్లకి జరిగే పెళ్లిళ్లు 
కాముని ఇల్లే కౌగిల్లు
ఎదలే పువ్వుల పొదరిల్లు
ప్రేమకి చల్లని పందిళ్ళు
ముద్దు ముద్దు ముడిపడితే
మూడో నెలకే వేవిళ్ళు
సంసారానికి విజయోస్తు
మన సంతానానికి దీర్ఘాయురస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి




శ్రీరస్తు శుభమస్తు (Sad) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుండి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కళ్యాణం దాక

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం: 1
ప్రేమకు వచ్చే పెళ్లీడు 
పెద్దలు మెచ్చే మా జోడు
లగ్గం కుదిరేదెన్నటికో 
పగ్గాలెందుకు ముద్దాడు
మనసు మనసూ మనువాడే
మనకెందుకులే తెరచాటు
అర ముద్దులకే విజయోస్తు
నీ అనురాగానికి దిగ్విజయోస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం: 2
కళ్లకి జరిగే పెళ్లిళ్లు 
కాముని ఇల్లే కౌగిల్లు
ఎదలే పువ్వుల పొదరిల్లు
ప్రేమకి చల్లని పందిళ్ళు
ముద్దు ముద్దు ముడిపడితే
మూడో నెలకే వేవిళ్ళు
సంసారానికి విజయోస్తు
మన సంతానానికి దీర్ఘాయురస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుండి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కళ్యాణం దాక

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి




శ్రీదేవి నా దేవి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు

శ్రీదేవి నా దేవి

Palli Balakrishna
Chattaniki Kallu Levu (1981)



చిత్రం: చట్టానికి కళ్ళులేవు (1981)
సంగీతం: కృష్ణ-చక్ర
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: ఎస్.పి. బాలు
నటీనటులు: చిరంజీవి, మాధవి, లక్ష్మీ
దర్శకత్వం: ఎస్.ఎ. చంద్రశేఖర్
నిర్మాత: పంకినేని సత్యనారాయణ
విడుదల తేది: 30.10.1981

పల్లవి:
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

చరణం: 1
ఋజువయ్యిందే ఇక్కడ సత్యమట
వాదమాడి గెలిచిందే వేదమట
ఋజువయ్యిందే ఇక్కడ సత్యమట
వాదమాడి గెలిచిందే వేదమట

పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం
పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం
ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం..పెద్దల వాదం

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

చరణం  2
గుడిసెలోన దొరికిందా సానిదట
మేడలోని ఆట నాగరీకమట
గుడిసెలోన దొరికిందా సానిదట
మేడలోని ఆట నాగరీకమట
కూడులేక ఒప్పుకుంటే నేరమట
కూడులేక ఒప్పుకుంటే నేరమట

తప్పతాగి విప్పుకుంటే నాట్యమట..అది నాట్యమట

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

చరణం: 3
ఒకరు నమ్ముకున్న దారి రాదారి
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి
ఒకరు నమ్ముకున్న దారి రాదారి
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి

మార్గాలే వేరుగాని గమ్యం ఒకటే
మార్గాలే వేరుగాని గమ్యం ఒకటే
ఎవరు గెలిచినా గాని గెలుపు తల్లిదే..గెలుపు తల్లిదే

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు

ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు


*****  *****  *****


చిత్రం:  చట్టానికి కళ్ళు లేవు (1976)
సంగీతం:  కృష్ణ-చక్ర
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో

కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి

కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో

చరణం: 1
ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది
ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది

గాలికి కూడా చోటే ఈయని కౌగిలి ఒకటుంది
వలచిన వారికి వాకిలి తెరిచి స్వాగతమిస్తుంది.. స్వాగతమిస్తుంది

కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో

చరణం: 2
అరఘడియైనా విడవకు నన్ను దంణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను
అరఘడియైనా విడవకు నన్ను దంణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను

ఆశకు కూడా హద్దొకటుంది.. పొద్దూ ఒకటుంది
ఏ ముద్దైనా గుట్టుంటేనే ముద్దుగ ఉంటుంది... ముద్దుగ ఉంటుంది

కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో

కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి

కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో


Palli Balakrishna
Kirayi Rowdylu (1981)



చిత్రం : కిరాయి రౌడీలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చిరంజీవి, మోహన్ బాబు, రాధిక
కథ: పరుచూరి బ్రదర్స్
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల తేది: 1981

పల్లవి :
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో

ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ..

ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి

చరణం: 1
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...

కొండలెన్నో ఎక్కావా... కోనలెన్నో దాటావా
కోరుకొండా ఎక్కాను... గోలుకొండా కొట్టాను
ఎక్కలేకా పడ్డావా... దాటలేక జారావా
ఎన్ని తిప్పలు పడ్డానో... ఏమి చెప్పను బుల్లమ్మో

ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఆడదంటే అలుసా... కాదే కులాసా

ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి

డడడడడడ డడ్డడడా...
డడడడడడ డడ్డడడా...

చరణం: 2
రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా
హా.. కోరికంటి మనసుంది... కోరుకున్న కైపుంది

తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా
పాలు పొంగే ఈడుంది... పాలు పంచే పదునుంది

ఓ లేత వయసా... నేనటే మనసా
ఓ..హో..హో.. లేత వయసా... అ..అ..ఆ.. నేనంటే మనసా
అరెరెరే.. వరించాను తెలుసా... అదే నా బరోసా

ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి... ఈ..ఈ...


Palli Balakrishna
Idi Pellantara (1982)




చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: డి. విజయ భాస్కర్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 16.07.1982



Songs List:



హరినారాయణ హరినారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

హరినారాయణ హరినారాయణ 



వసంతం షరతు పాట సాహిత్యం

 
చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్.పి. శైలజ 

వసంతం షరతు 



అమ్మగా నాన్నగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

అమ్మగా నాన్నగా





నా ఊపిరికే పరిమళమాపాట సాహిత్యం

 
చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

నా ఊపిరికే పరిమళమా

Palli Balakrishna
Tingu Rangadu (1982)



చిత్రం: టింగు రంగడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: నందమూరి రాజ
నటీనటులు: చిరంజీవి, గీత
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.10.1982

పల్లవి:
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
అర్రెర్రె.. టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని

చరణం: 1
రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
హ..హా.. రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
జారి బోలపడ్డావే జాణ కూతురా.. అడ్డ రోడ్డు నవ్విందే అత్త కూతురా..
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..ఆ..ఆ
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..
అందమంత కందెనా.. ఆ మందు నీకు వేయనా
తేనటీగ తీపి కుట్టు నే కుట్టనా..
బుజ్జగించి బుగ్గ ముద్దు పెట్టెయ్యనా..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..

చరణం: 2
మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
హా.. మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
రెచ్చగొట్టి పోమాకు రేపు మాపులో..
రెప్ప కొట్టుకుంటాది కొత్త ఊపులో..
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..ఆ..ఆ
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..

సందమామ కొయ్యనా.. ఆ..సంతకాలు చెయ్యనా
కౌగిలింతలోన నిన్ను కట్టెయ్యనా.. ఆకలింక చూసి బువ్వ పెట్టెయ్యనా

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ..హా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆ..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

హొయ్.. హొయ్.. హా.. హొయ్.. హోయ్..
హా.. హా.. టుర్ర్.. టుర్ర్..



Palli Balakrishna

Most Recent

Default