చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (2024) సంగీతం: కార్తీక్ నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, రుక్మిణి వసంత్, దివ్యాన్ష కౌశిక్ దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాత: బి. వి.ఎస్.ఎన్. ప్రసాద్ విడుదల తేది: 08.11.2024
Songs List:
హే తారని తెలుసుకున్నా పాట సాహిత్యం
చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (2024) సంగీతం: కార్తీక్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: కార్తీక్, నిత్యశ్రీ హే, తారని తెలుసుకున్నా హే, తారని కలుసుకున్నా హమ్మో, తారని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో హే, తారని తెలుసుకున్నా హే, తారని కలుసుకున్నా హమ్మో, తారని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో అడుగులు నీతో తడబడిన విడి విడిగా నీతో లేనా పెదవే దాటని మాటలు వినపడవా కంటికి నిదురే శాపంలా తాకిన చూపులు తాపంలా తిరిగేస్తున్నానే… ముందే హే, తారని తెలుసుకున్నా హే, తారని కలుసుకున్నా హమ్మో, తారని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో నిలబడదే నా చూపు కాసేపే నా వైపు తెలియందా మరి నీకు రెప్పపాటు చూపులో విన్నానే మాటలు వేలల్లో ఊసులు నన్నే దాటనీ… నిన్నే చేరనీ చెలి గాలో… చిరు గాలో ఇక ముందే తెలియాలో కౌగిలిలో నలిగేనే నా పంచ ప్రాణాలే నీ కోసం కాదంటే నేనున్నా లేనట్టే నేనున్నదే… నీవల్లే హే, తారని తెలుసుకున్నా హే, తారని కలుసుకున్నా హమ్మో, తారని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో అడుగులు నీతో తడబడిన విడివిడిగా నీతో లేనా పెదవే దాటని మాటలు వినపడవా? కంటికి నిదురే శాపంలా తాకిన చూపులు తాపంలా తిరిగేస్తున్నానే… ముందే
నీతో ఇలా పాట సాహిత్యం
చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (2024) సంగీతం: కార్తీక్ సాహిత్యం: రాకెందు మౌళి గానం: కార్తీక్, నిత్యశ్రీ ఏదో కల… ఓ మాయలా నా చెంత చేరి మేలుకుందా? మెలమెల్లగా… ఈ నవ్వులే స్నేహాల దారే కోరుతోందా? మాటల్నే దాటుతున్న చోటులోన (ఏంటో అలాగ…) కోరికేదో ఊరుకోక (పెరిగే ఇలాగ…) దూరమైతే ఉండలేని తీరే ఇదేగా… హే నీతో ఇలా… నీతో ఇలా… నీతో ఇలా… ఆ ఆ ఆ ఆ ఆ ఆగే ఆగే కాలం నీతో ఊగే ఊగే లోకం నీతో సాగే సాగే హాయే నీతో ఆగే ఆగే కాలం నీతో ఊహించని ఈ లోకమే నాదైన వింతే చూస్తూ ఉన్న నీ కన్నుల లోలోతుల మైకాల హాయే తాగుతున్న మాటల్నే దాటుతున్న చోటులోన (ఏంటో అలాగ…) కోరికేదో ఊరుకోక (పెరిగే ఇలాగ…) దూరమైతే ఉండలేని తీరే ఇదేగా… నీతో ఇలా నీతో ఇలా నీ నీ నీ నీతో ఇలా ఆగే ఆగే కాలం నీతో ఊగే ఊగే లోకం నీతో సాగే సాగే హాయే నీతో ఆగే ఆగే కాలం నీతో ఇది ఏమిటో ఏమిటో ఇంతగా ఎందుకో చూపులే ఊపిరై జారేనే గుండెలో నను వీడని తోడుగా జీవితం పంచుకో… ఆ ఆ ఆ ఆ ఆ… ఆగే ఆగే కాలం నీతో ఊగే ఊగే లోకం నీతో సాగే సాగే హాయే నీతో ఆగే ఆగే కాలం నీతో కాలం నీతో లోకం నీతో ఆగే ఆగే కాలం నీతో
# పాట సాహిత్యం
చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (2024) సంగీతం: సన్నీ MR సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: మనీషా ఈరబత్తిని , కృష్ణ తేజస్వి, సన్నీ MR Kabhi Haa Kabhi Naa

No comments
Post a Comment