Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Raahu (2020)


చిత్రం: రాహు (2020)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: కృతి గార్గ్, అభిరాం వర్మ 
దర్శకత్వం: సుబ్బు వేదుల
నిర్మాత: A.V.R స్వామి, రాజ దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జి
విడుదల తేది: 28.02.2020

చరణం: 1
ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నటుగా 
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేటు లేదు నీచూపు ఆకట్తగా 
నా లోకి జారింది లే తేనె బొట్టు నమ్మేటుగా లేదుగా ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం: 2
నేనేనా ఈవేళ నేనేనా నా లోకి కళ్లారాచూస్తున్న
ఉండుంది ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని
విన్నట్టు వున్నావా బాగుందని తేలే దారేదని
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం: 3
ఏమైనా బాగుంది ఏమైనా... నా ప్రాణం చేరింది నీ లోన
ఈ చోటే కాలాన్ని ఆపాలని... నీ తోటి సమయ్యని గడపాలని...
నా జన్మే కోరింది నీ తోడుని... గుండె నీదేనని...
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

Palli Balakrishna Sunday, October 18, 2020
Jaanu (2020)
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
నటీనటులు: శర్వానంద్, సమంత
దర్శకత్వం: సి. ప్రవీణ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 07.02.2020Songs List:The Life of Ram పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా
త్రుటిలో కరిగే కలవే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై  నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగా...  అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా

గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా

యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా 
రాకూడదు ఇంకెవరైనా 

అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలి
ప్రాణం నా ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి, గౌతం భరద్వాజ్

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ

తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా

ప్రాణం నా ప్రాణం - నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ

మన బాల్యమే ఒక పౌర్ణమి ఒకే కథై అలా
మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా
మళ్ళి మళ్ళి జాబిలి వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల

తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలాఊహలే ఊహలే పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి, గోవింద్ వసంత

పియా బాలము మోరా
పియా మోరా బాలము

పియా ఘర్ ఆవో ఘర్ ఆ
పియా ఘర్ ఆ ఆ జీ
బాలమ మోరా
బాలము మోరా పియా
పియా హ బాలము మోరా మోరా

ఆ ఆ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో
కంట నీరు లేని రోజు కలిసెనే
ప్రాణములో ప్రాణ సడే

ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ
నా కలే కలై పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: బ్రింద

నా కలే కలై నన్నే వదిలే
నే నిలా ఎలా ఎలా నమ్మనీ 
నిజమే.. కుదురు చెదిరింది లే 
కలత తొలిసారిలా నాలోపలే అయ్యానులే శిలై 
ఎదురుపడవే నువ్వే మదికి వివరించవే నిజం ఇదేనని
బదులే నువ్వే నా జతగా నువ్వే లేక
తరగతి గది గతై మారేనే ఇలా
నీ మరుపే గురుతే రాక మది పదే పదే నిన్నే వెతికెనే వలలా 

అసలు ఇది ఎవరి నేరమా ఎలా అడగను
కనుల నది దాటు నీరునే ఎలా నిలుపను 
మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను 
సెలవికనే ఎంత సులువుగా ఎలా నమ్మను 
ఇంతేనా ఇంతేనా పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి

ఇంతేనా ఇంతేనా 
ఒక మాటైనా మాటాడవేదైనా
ఇంతేనా ఇక ఇంతేనా 
ఎన్ని ఆశలతో ఆలా నువ్వు నీ చెంతనా

కాలమే మారెనా దూరమే చేరినా
వసంతమెగిరే ఎడారి ఎదురైనా
ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే
ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే

సూటిగా చూపదే 
నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే
ఎలా చెప్పాలి? ఎలా అడగాలి?  
నాతోటి ఆటలాడేటి రాతల నువ్వే

పాఠాలు చదివిన కాలం నువ్వే
పాఠాలు నేర్పిన కాలం నువ్వే
అర్ధం అవ్వనీ పాఠమల్లే ప్రతి క్షణం నా నువ్వే

సంద్రాలు దాటెను నా రెక్కలే 
తీరాలు తాకేను నా పరుగులే
మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగెనే..

రేపటి ఊహలు నిన్నటి ఆశలే 
కన్నీటి పాటల నిన్ను దాటనులే
ఈరోజు కోసం వీచింది నా ప్రాణమే 
ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి, గోవింద్ వసంత

కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె 
పువ్వు కంట నీరే కురిసే
అమ్మ ఒడి వీడే పసిపాపలా 
వెక్కి వెక్కి మనసే తడిసే

చదివే బడికే వేసవి సెలవులా 
తిరిగి గుడికే రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమై మన కలలు ఇలా...
ముందరున్న కాలం గడిచేది ఎలా 
బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా

కన్ను వీడి చూపే వెళుతోందిలే 
కంట నీరు తుడిచేదెవరే

చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే 
నిను విడువని ఏ నన్నో వెతికేనులే
చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే 
మన ఊసులే జతలేక ఎడబాసెలే

నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా
వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే

మనం మనం చెరో సగం చెరో దిశల్లే మారినా
ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా
నువున్న వైపు తప్ప 
చూపు తప్పు దిశను చూపునా

అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచెనా
మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన
చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు
కవితలే రాసే నీకై మల్లీ రా

అనంతమే పాట సాహిత్యం

 
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: గోవింద్ వసంత, చిన్మయి శ్రీపద

కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటే  ఏమో కదా
యుగాల ప్రేమ జాగాలనేలుతోంది రాజు లాగ శపించు వరమా

పూసే పువ్వోటి చాలే లోకాన్ని గెలిచి చూపుతోందే
తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే
ఈ ప్రేమ కావ్యం రాసిందే ఎవ్వరంటే ఏమో
ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే వివరమేది లేదంది కాలం

కాదన్న ప్రేమ - నీడలాగా వస్తుందే
అవునన్న ప్రేమ - చేతికంది రాదే
ప్రేమల్లో పడితే - మాయలాగా ఉంటుందే
ప్రేమల్లో చెడితే ప్రాణమే నిశి

ఆగనంటూనే సాగదే సాగనంటూనే ఆగదే
అన్ని అంటూనే మూగదే ప్రేమకేది సాటిరాదే
ప్రాణమెంతున్న చాలదే జన్మలెన్నున్న మారదే
విశ్వమంతున్న ప్రేమదే గుప్పెడంత గుండే

ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే

ఓ ఓ చిన్ని మౌనములోన
ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం
ఊసు కలపదే ప్రేమలకే.. ఊపిరిదే

ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ...

ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే…
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే…

ఓ..ఓహో శ్రీకారమే ఆకారం
ఓంకారం ప్రేమే

ఓ..ఓహో అనంతమే
అనంతమే ఇదంత ప్రేమే

చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెబుతుంది  ప్రేమ! 
ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది, దాన్ని కౌగిలించు, కంటిరెప్పల్లో దాచు.

ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. 
ప్రేమ నవ్వుతుంది. ప్రేమ కవ్విస్తుంది, 
కవిత్వం రాస్తుంది. ప్రేమ ఏడుస్తుంది.
ప్రేమ కల్లోలంలో పడేస్తుంది. 
ప్రేమ కాస్తంత అర్థం అవుతుంది. 
ప్రేమ విరహాన్ని పెంచుతుంది. 
ప్రేమ విడిపోతుంది 

వెళ్లి రమ్మని ప్రేమకి తలుపు మూసినా చప్పుడవ్వని వీడుకోలు లేచి ఇవ్వు
ఒకవేళ ప్రేమ మల్లి వస్తే, దూరంగా ఆగి చూస్తే దగ్గరగా వెళ్ళు, ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు.
ప్రేమ నీ సొంతం. నీ హృదయం ప్రేమ సొంతం. 
మార్పులే ప్రశ్న మార్పులే సమాధానం

- ప్రేమ 

Palli Balakrishna Saturday, October 17, 2020
30 Rojullo Preminchadam Ela (2020)

చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత ఆయ్యర్
దర్శకత్వం: మున్నా ధూళి పూడి
నిర్మాత: ఎస్. వి. బాబు
విడుదల తేది: 29.01.2021Songs List:నీలి నీలి ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్, సునీత

అమ్మాయిగారు ఎక్కడికెలిపోతున్నరూ
కాసేపుండొచ్చు కదా
ఆహ కాసేపాగితే అబ్బయిగారేమిత్తారేంటి

పల్లవి:
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ
నీ నవ్వుకు సరిపోదంటున్నా

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

చరణం: 1
ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

చరణం: 2
ఓహొ అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ఇదేరా స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అర్మాన్ మాలిక్

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం

కనివిని ఎరగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం

నింగినీ నేలనీ 
వానచినుకై కలిపెను స్నేహం
తూర్పుకీ పడమరకీ 
కాంతి తోరణం అయ్యిందీ స్నేహం

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2)

కనివిని ఎరగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం 
ఇది హృదయం అడిగే స్నేహం

హో.. నీ మధ్యన ఉంటానంటూ 
బతిమాలింది చిరుగాలి
నీ పాదం తాకాలంటూ 
అలలైంది ఆ కడలి

తన మచ్చను నీ స్వచ్చతతో 
కడగాలంది జాబిల్లి
నీ భారం మోసేటందుకే 
పుట్టానంది  ఈ పుడమి

ఆశలు ఆకర్షణలు లేనిది 
నీ ఆడ మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే 
మీ ఇద్దరి స్నేహం

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2)

ఓ తన చూపులు నువు చూస్తుంటే
నీ కళలను తాను కంటోంది
తను మాటలు నువ్వుంటుంటే
నీ నవ్వులు తను నవ్వింది

తను అడుగులు వేస్తూ ఉంటే
గమ్యం నువ్వే చేరేవు
నీలో నువ్వు చేయని పనులే
నీలా తానే చేసేను

జన్మలే చాలక 
మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం
దేవుడే ప్రేక్షకుడై 
చూసి చూసి మురిసే మీ స్నేహం

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2)
మీకో దండం పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ధనుంజయ్, మోహన్ భోగరాజ్

మీకో దండం 
అమ్మ నన్ను మళ్ళి పెంచవ పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: అనూప్ రూబెన్స్, రిషాన్ రూబెన్స్

అమ్మ అమ్మ
నన్ను మళ్ళి పెంచవ
అమ్మ అమ్మ
మరల లాలించవా

పది నెలలు ప్రతీక్షణము
కడుపున పెంచావె
పది నెలలు ప్రతి నిముషం
ఒడిలో పెంచావే
భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ
నన్ను పెంచినావని తెలియలేదే అమ్మ

అమ్మ అమ్మ
నన్ను మళ్ళి పెంచవ
అమ్మ అమ్మ
మరల లాలించవా

లాలి పాడవా మరోసారి
లాల పోయావా మరోసారి
ఉయలుపవా మరోసారి

ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము
ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము
చేతిలో ప్రతీ ముద్దని చెంపపై ప్రతీ ముద్దుని
ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ

అమ్మ అమ్మ
నన్ను మళ్ళి పెంచవ
అమ్మ అమ్మ
మరల లాలించవా

లాలి పాడవా మరోసారి
లాల పోయావా మరోసారి
ఉయలుపవా మరోసారివాచ్ వహ్ వహ్ మేరె బావా పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్, ప్రదీప్ మాచరాజు
గానం: రాహుల్ సిప్లిగంజ్

వాచ్ వహ్ వహ్ మేరె బావాక్యాట్ బాడీ లోకి పాట సాహిత్యం

 
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మధుప్రియ

క్యాట్ బాడీ లోకి ఆ ర్యాట్ చేరిందంటే
ర్యాట్ బాడీ లోకి ఈ క్యాట్ దూరిందంటే
ఏమౌతుందే బాబు ఏమౌతుందే,
అరె ఏమౌతుందే సెప్పు ఏమౌతుందే

బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే,
లెఫ్ట్ రైటై... రైటే రాంగై
బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే

సిక్స్ ప్యాక్ తో తులసీ కోటను చుట్టేస్తుంటే
సాంబ్రాణి ధూపం సిగరెట్ స్మోకే అవుతుంటే,
పువ్వంటి పిల్లకు గడ్డం ముళ్ళే మొలిచేస్తే
పదునైన కత్తే మొత్తం మెత్తగా అవుతుంటే

తన బాధకు మూలం నువ్వని హ్యాపీగా అనిపిస్తే,
ఈ ఫీలింగ్ తనకూ ఉందని నీక్కూడా తెలిసొస్తే
ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే
ఏమవుతుందే బాబు ఏమవుతుందే

బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందేమైండు బ్లాక్ అవుతుందే,
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే

ఓఓ బాత్రూంలో బోంచేస్తున్నట్టుందే
బెడ్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుందే,
కాఫీలో కారం కలిపి ఇస్తున్నట్టుందే
కాక్లెయిల్ లో కాకరకాయ రసమే మిక్సయిందే,

ఎల్టీ టైం తనకే తాను ఎనిమిలా కనిపిస్తే
తను పీల్చే ఊపిరి వల్ల తన ఎనిమి బతికేస్తే
ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే...
ఏమవుతుందే బాబు ఏమవుతుందే 

బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే,
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే
తనలో ఉన్న నీ మైండు బ్లాక్ అవుతుందే
అట్టాగే నీలో ఉన్న తన మైండు బ్లాక్ అవుతుందే

Palli Balakrishna

Most Recent

Default