Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanguva (2024)




చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు: సూర్య, బాబీ డియోల్, దిశ పటాని 
దర్శకత్వం: శివ
నిర్మాత: జ్ఞానవేల్ రాజ, వంశీ-ప్రమోద్
విడుదల తేది: 14.11.2024



Songs List:



ఆది జ్వాల పాట సాహిత్యం

 
చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీ మణి
గానం: అనురాగ్ కులకర్ణి మరియు దీప్తి సురేష్

ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా

ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా

ఈ మట్టి పుట్టే ముందే
ఇక్కడ పుట్టింది… (మేమే మేమే)
అంకెలు పుట్టకముందే
లెక్కలు కనిపెట్టింది… (మేమే మేమే)

కొండెక్కనీకుండా
ఈ నిప్పునే కాచామే
పెను ముప్పె ముందున్న
భయపడని తెగరా… మేమే, ఏ ఏ

రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట… రా రా
రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట రారా రారా

ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా

రా రా… రా రా
రా రా… రా రా

సుడిగాలులు వడగాలులు
విసిరెను విలయం
పిడుగాగని జడివానలు
జల్లేను ప్రళయం
ఆకాశం పాతాళం
మింగేలా చూస్తున్నా
వణికించి నిలబడినోళ్ళం…

బడబాగ్నుల ఒడిలో పడి
పెరిగిన వాళ్ళం
జటరాగ్నుల జడిలోపల
నలిగిన వాళ్ళం
పంచాగ్నుల కోరలతో
మన పంచ ప్రాణాలే
పోరాడి గెలిచిన వాళ్ళం…

ఎగిసి పడే అగ్గి జలం
మీద పడే కొండ బిలం
దాటగల గుండె బలం
మనకి ఓ వరం…

మొరటుతనం మొండి ఘటం
ఎరుగమంటా ఏ కపటం
నిప్పులతో చెలగాటం
మనకి సంబరం

అగ్గి సెఖ… వాయు సెఖ
నీటి సెఖ… రాతి సెఖ
ఒక్కటిగా ఎదురైనా
బెదురు ఎరుగమే…
అగ్నికణం వీరగుణం
అణువణువు బతుకు రణం
ఆయుధమై అనిచేసే ఆటకుతులమే

రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట… రా రా
రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట రారా రారా

ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా

రా రా రా రా
రా రా… రారా రారా





యోలో పాట సాహిత్యం

 
చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: కరాకెందు మౌళి
గానం: దేవిశ్రీ,  సాగర్,  శ్రద్ధాదాస్


హే చుపిన చుపిన చుపిన వే
హే చుపిన చుపిన వే
హే చుపిన చుపిన చుపిన వే… ||3||
(వామోస్ బ్రింకర్ బేబీ..!)

హాల్డ్ మీ, హగ్ మీ, కిస్ మీ, కిల్ మీ
లవ్వుతోనే జస్ట్ లాక్ మీ…

టేక్ మీ, ట్రై మీ, ట్రిప్ మీ, ట్రాప్ మీ
నవ్వుతోనే జస్ట్ రాక్ మీ…

సన్ రైజ్ బీచ్ లో… జంట నీడలవుదామా
మూన్ లైట్ క్రూస్లో… కోజి కోజిగుందామా…

మ్యాడ్ ఫన్ మూడులో… ఆడమ్ ఈవ్ అవుదామా
నెవర్ డన్ బిఫోర్… అనేది ఉండకుండా చేద్దామా?

యోలో… యు ఓన్లీ లివ్ వన్స్
యోలో… యు గాట్ టు డు టన్స్

కళ్ళు కళ్ళు కలుసుకుంటే
మాటలింకా ఎందుకంటా..?

శ్వాస శ్వాస తాకుతుంటే
కొత్త భాషే పుట్టేనంటా…

ఏ, ఎగిరెగిరిరెగిరిరెళదాం పదా…
అటు ఇటు ఎటు అని చూడకుండా
లెట్ అస్ ఫ్లై అవే…

చిన్ని చిన్ని ఆశలన్నీ చెవిలో ఇలా
వేల సింఫనీలా ఈల పాటలుగా పాడేస్తున్నావే

యోలో… యు ఓన్లీ లీవ్ వన్స్
యోలో… యు గాట్ టు డు టన్స్

బేబి నువ్వు… వైబ్ నేను
వైల్డ్ ఫైరై అంటుకుందాం…

ఓ స్వాగ్ నేను… తగ్ నువ్వు
అగ్గి హగ్గై మండిపోదాం

ఏ, నింగి నుంచి జారిపడ్డ ఏంజెల్ నువ్వా
మళ్ళి మళ్ళి నన్ను గిల్లుకునేటంత అందంగున్నావే

మాచో మాచోగున్న క్యూట్ టెడ్డి బడ్డీ నువ్వా
హార్ట్ మెల్ట్ చేసే గ్యాప్ లోన చీప్ త్రిల్లే ఇస్తావే

యోలో… యు ఓన్లీ లీవ్ వన్స్
యోలో… యు గాట్ టు డు టన్స్




నాయకా, మా నాయకా పాట సాహిత్యం

 
చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: కరాకెందు మౌళి
గానం: అరవింద్, దీపక్, అపర్ణ, శుస్మిత  నరసింహన్, ప్ర్తసాన్న ఆదిశేష ,  దీప్తి సురేష్, లతా కృష్ణ, పద్మజ శ్రీనివాసన్ 

నాయకా, మా నాయకా
నాయకా……..!!
వీర ధీర గగన దివారా
ధీర రారా అగ్గికుమార
గగనము కూలిన కోయా

ఘోరా ఘోరా రిపు సంహార క్రూర
సెత విధ వదముల సారా
నూరుగురు నివేరా…
భం భీకర ఘోరా
రం రం రుద్రస థిమిరా, జా
హం, హత హుంకార, జా
గం గర్జన సింగం ఉరుకై రా

నాయకా, మా నాయకా
నాయకా..!!
(నాయకా, మా నాయకా
నాయకా..!)

నేరీ బేరీ మన రణ బెంబే
బేరి మ్రోగగ వీరవరేణ్య
హత మార్చు అరణ్య…

జ్వాలే తోడు భీకర
కానే గూడు మద గజ
తొక్కిస తీరు
నువు చేసెడి పోరు…

సై సిగతరగ హనన
మృతివై భస్మము చెయ్ రా
కొయ్ కోత కఠోరా
అరి రుధిరం అరుపే నీ పేరా

నాయకా, మా నాయకా
నాయకా…!!
(నాయకా, మా నాయకా
నాయకా)




మన్నింపు లేదంటే పాట సాహిత్యం

 
చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
గానం: రఘు దీక్షిత్

తననే తొలిచే మనుషులకే
దాహం తీర్చు నేల గుణం
తననే విరిచే చేతులకే
నీడై కాచే చెట్టు గణం

తననే తుంచే గాలులకే
గంధం పూసే పూలవనం
తననే వోలిచే ఉలి దెబ్బలకే
శిల్పం ఇచ్చే రాయితనం

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

కారడవిని కాల్చే చిచ్చువు కావా
పగతో ఉంటె నిత్యం
ఆ వేడిని దాటి వెలుగువు కావా
మన్నిస్తే కొంచెం

పడి తడబడుతూనే పొరబడుతూనే
నేర్చే మనుషుల నైజం
ప్రతి తప్పును పగతో దండిస్తే
ఇక మిగిలేది శూన్యం

ఏ నేరం ఎరుగని ఆకులను
కన్నీరుగా రాల్చే కాలం
మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి
మాన్పేస్తుంది తను చేసిన గాయం

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

ఒక ఏనుగు కరిషం వేడిని చూసి
వెళ్ళిన దూరం చెబుతా
పులి వేసిన జాడల లోతును కొలిచి
బరువెంతో చెబుతా

ఒక్క నక్కే వేసే ఊలను వింటూ
ఆకలి ఎంతో చెబుతా
తూనీగలు ఎగిరే వేగంతో
వర్షం వైనం చెబుతా

ఒక చిన్న అలికిడితోనె
అడవంతా కనిపెడతానే
బిడ్డా నీ మనసును మాత్రం
అంతే చిక్కక వెతికేస్తున్నానే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే




కంగా కంగువ పాట సాహిత్యం

 
చిత్రం: కంగువ (2024)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి రాకేందు మౌళి 
గానం: హేమచంద్ర 

కంగా కంగువ 

No comments

Most Recent

Default