చిత్రం: పఠాన్ (2023)
సంగీతం: విశాల్-శేఖర్
నటీనటులు: షారుఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం
దర్శకత్వం: సిద్దర్ద్ ఆనంద్
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేది: 2023
Songs List:
నా నిజం రంగు పాట సాహిత్యం
చిత్రం: పఠాన్ (2023)
సంగీతం: విశాల్-శేఖర్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
Spanish Lyrics: Vishal Dadlani
గానం: Shilpa Rao, Caralisa Monteiro, Vishal and Sheykhar
నమ్మించి దోచిరయ్య మీరే
ప్రేమ మాయేలే
భరించుతూ ఉంటినయ్యా
అబలగా ఇంకా నాలోనే
నిషా కదా మేనిపై గీతం
తలొంచితే పోలే
నా నిజం రంగు జనాలింకా
చూడనే లేదే
నమ్మించి దోచిరయ్య మీరే
ప్రేమ మాయేలే
భరించుతూ ఉంటినయ్యా
అబలగా ఇంకా నాలోనే
నిషా కదా మేనిపై గీతం
తలొంచితే పోలే
నా నిజం రంగు
జనాలింకా చూడనే లేదే
మదిలో కొత్త మాటలే
నావి ఆకతాయి ఆటలే
మదిలో కొత్త మాటలే
నావి ఆకతాయి ఆటలే
ఏది సరిదాన్నొదిలెయ్ మరి
గమ్మత్తు బాలకే
ఇదిగో శుభ స్వాగతం
నిషా కదా మేనిపై గీతం
తలొంచితే పోలే
నా నిజం రంగు జనాలింకా
చూడనే లేదే
నమ్మించి దోచిరయ్య మీరే
ప్రేమ మాయేలే
భరించుతూ ఉంటినయ్యా
అబలగా ఇంకా నాలోనే
నమ్మించి దోచిరయ్య మీరే
ప్రేమ మాయేలే
చిత్రం: చాంగురే బంగారు రాజ (2023)
సంగీతం: SK.సౌరభ్
నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సి
దర్శకత్వం: సతీష్ వర్మ
నిర్మాత: రవితేజా
విడుదల తేది: 2023
Songs List:
ఛాంగురే బంగారు రాజా పాట సాహిత్యం
చిత్రం: చాంగురే బంగారు రాజ (2023)
సంగీతం: SK.సౌరభ్
సాహిత్యం: M C చేతన్
గానం: మయాంక్ కప్రి
బంగారు రాజా
మూవింగ్ లైక్ ఎ సోల్జర్
స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్
హి ఈజ్ ద బాప్ అండ్
యూ ఆర్ ద బేటా
ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
కోరస్: ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా
చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్
ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా
ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
భయంతో కాలాన్ని గడిపింది చాలు
టు స్టార్ట్ యువర్ వేటా
చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్
పుల్ అప్ యువర్ సాక్ అండ్
డోంట్ గివ్ అ డక్
కాస్ వీ గోయింగ్
హయ్యర్ హయ్యర్ హయ్యర్
ఛాంగురే బంగారు రాజా
ఛాంగురే బంగారు రాజా
యూ కెన్ చేంజ్ దిస్
లైక్ ఎ ఫైటర్
థిస్ కెన్ నెవర్ బి
యువర్ తలరాత
యు గాట్ ఆ మూవ్, గాట్ ఆ రిమూవ్
క్లియరింగ్ థింగ్స్ దట్ స్టేజ్డ్ ఆన్ యూ
యు గాట్ ఆ మూవ్, యు గాట్ ఆ గ్రూవ్
స్మాషింగ్ దెమ్ ఎనిమీస్ లైక్ కబూమ్
బంగారు రాజా
మూవింగ్ లైక్ ఎ సోల్జర్
స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్
హి ఈజ్ ద బాప్ అండ్
యూ ఆర్ ద బేటా
ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
కోరస్: ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా
చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్
ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా
సామిరంగా పాట సాహిత్యం
చిత్రం: చాంగురే బంగారు రాజ (2023)
సంగీతం: SK.సౌరభ్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్
సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగ
ఇంత కాలంగా కలిగెనే బెంగా
పోలీసుల్లో దొంగా
దాని పేరేమో మంగా
మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తెనే అంత కట్టింగా
మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తేనే అంత కట్టింగా
నమ్మనే వారాలు వర్జ్యాలనీ
నీ వెంటైతే పడతాననీ
దంచకే కారాల మిరియాలనీ
ఆ గారాల మారాలని
మాటేమో చేదుగుందే
చేతల్లో తీపి ఉందే
పిల్లేమో నచ్చుతుందే
నీతో ఇంకా చెప్పాలనుందే
బండేమో స్పీడుగుందే
బ్రేకేమో వెయ్యనందే
పిల్లేమో ముద్దుగుందే
వయసేమో నాటుగుందే
పడ్డాయే అందరి కళ్ళు
పిల్లే నవ్వితే ముత్యాలు
రాకాసి అందమంతా
రాసివ్వవే చాలు
సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా
ఊరిలో కొత్త వింత
వెలిగెనే చీకటంతా
నవ్వెనే రాతిరంతా
పగలుగా మారినంత
యెహే, తలుకేమో రంగు రాళ్లు
చెయ్యిస్తా ఉంగరాళ్ళు
పట్టాలే నీ వేలు
కట్టాలే మూడు ముల్లు
ఊరంతా డప్పే కొట్టి
వేస్తానే నే పందిళ్ళు
ఆపైనే ఉంటా నీతో
ఈ నిండు నూరేళ్ళు
సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా
మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తెనే అంత కట్టింగా
మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తేనే అంత కట్టింగా
నమ్మనే వారాలు వర్జ్యాలనీ
నీ వెంటైతే పడతాననీ
దంచకే కారాల మిరియాలనీ
ఆ గారాల మారాలని
సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: నీలకంఠ రావు
గానం: కాల భైరవ
తలపుల దాయిలి మీద
కంటీ కడవ పెట్టి
కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు
కోరస్: కాసుంచారా నీకు
గుండె గుండెకు రాసి
సెమటా నలుగు పెట్టి
తానాలు సేయిత్తా
తరలి రారా నువ్వు
కోరస్: తరలి రారా నువ్వు
మొక్కే లేని నేలల్లో
మొగ్గే ఉంటాదా
నువ్వే లేక నీ నీడ
నిలిసి ఉంటాదా
సినుకే పెను సిలయై
తల మీద పడ్డాదా
అణువే అనుఅస్త్రమై
నిను ఎంటా పడ్డాదా
సినుకే పెను సిలయై
తల మీద పడ్డాదా
అణువే అనుఅస్త్రమై
నిను ఎంటా పడ్డాదా
తలపుల దాయిలి మీద
కంటీ కడవ పెట్టి
కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు
కోరస్: కాసుంచారా నీకు
గుండె గుండెకు రాసి
సెమటా నలుగు పెట్టి
తానాలు సేయిత్తా
తరలి రారా నువ్వు
కోరస్: తరలి రారా నువ్వు
ఇంకాసేపు ఊపిరి ఉగ్గబెట్టా రా
నా ఊపిరినే నీకిచ్చి నిలుపుకుంటా రా
ఒడిలో పాపడిలా
నిను ఎత్తుకుంటా రా
మగడా కడవరకు నిను హత్తుకుంటా రా
ఒడిలో పాపడిలా
నిను ఎత్తుకుంటా రా
మగడా కడవరకు నిను హత్తుకుంటా రా
చిత్రం: బూట్కట్ బాలరాజు (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: స్వాతి ర్తెడ్డి
ఉండలేకపోతుందయ్యో
మనసు నా మనసు
వెళ్లలేకపోతుందయ్యో
ఆ సంగతి నాకు తెలుసు
ఇన్నినాళ్ళ సంది
సూడలేదు ఇంత రంది
సుట్టు ఉన్న మంది
సూపు నిన్నే ఎతుకుతాంది
నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో
నా గుండె గుంజుతుందయ్యో
సిత్తరంగ ఉందయ్యో
నా ఎదురంగా నువ్వుంటే
బుగ్గల్లో సిగ్గెందయ్యో
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు రా రా రా
నువ్ సిన్న నాటి నుండి
తిరిగేటి దోస్తైనా
ఇప్పుడున్నపాటుగా
ఇష్టాన్ని పెంచుకున్నా
రోజు పక్క పక్క సీటులోనే
కూసోని వెలుతున్నా
నేడు ఏలు తాకితేనే
చక్కిలిగింతల్లో మునుగుతున్న
ఇన్నేండ్లకు నీ కండ్లను
నే సూటిగా సూడ్లేకున్నా
సాటుగ దాగుడుమూతల ఆటరా
నీ సేతిల సెయ్యేసి మరీ
సెప్పాలని ఉన్నదిరా
లోపలేదో లొల్లి జరుగుతంది
వశపడతలే నీ వల్లనే
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు రా రా రా
నిన్ను సూసుకుంట
వంద ఏళ్ళైనా బతికేస్తా
నీ పేరు తల్సుకుంట
ఎన్నాళ్ళైనా ఉండిపోతా
నీ ఒక్కని కోసం
లోకాన్ని మొత్తం వదిలేస్తా
నువ్వు పక్కనుంటే సాలు
ఎక్కడికైనా కదిలొస్తా
ఏ గడియలో నువ్ నచ్చినవో
సచ్చిన నిను ఇడువను
ఈ పిచ్చిని ప్రేమంటావో ఏమంటావో
ఈ ఆశను అరిగోసను
ఓ నిమిషము నే సైసనురా
లగ్గమింక జేసుకొని
నీ పిల్లలకు తల్లినైపోతను
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు రా రా రా
చిత్రం: టక్కర్ (2023)
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద
పెదవులు వీడి మౌనం
మధువులు కోరె వైనం
తనువులు చేసె స్నేహం, నేడే
తొలకరి రేపే తాపం
అలజడి కోరె సాయం
తపనలు తీర్చు భారం, నీదే
పదములే కరువయే
తాకుతూ మాటాడనా నీతో
దూరమే మాయమై
ఊపిరే శ్రమించెనా మాతో
ఓ ఓ ఓ హో హో హో
హో హో హో
తమకములో… తడబడగా ఆ ఆ
విడివిడిగా ఆ ఆ… ఓ సుఖమిదిగా ఆ ఆ ఆ
వానల్లే అడిగాగా ఆకాశం
వదిలేసే జాబిల్లై వచ్చావే
నన్ను వెతుకుతూనే
నే కోరే వరమేగా
నీలాగ నిజమేగా
ఈ బంధం నిలిచేగా
మనని కలుపుతూ
నా నింగే సగమై దాగే కౌగిలిలో
సరదా రాతిరిలో గోవు పూలు విరిసే
ముగిశాక వర్షం… జారే చినుకల్లే
అలిసాక దేహం… వదలలేని తనమే
దరి నీవా… నది నేనా
కలిసాకా ప్రేమ తీరమే
తమకములో ఓ ఓ ఓ
తడబడగా ఆ ఆఆ ఆ
విడివిడిగా ఆ ఆఆ ఆ
ఒక సుఖమిదిగా ఆ ఆఆ ఆ ఆ
చిత్రం: రుద్రుడు (2023)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నువ్వుంటే చాలు
నువ్వు తోడై ఉంటే చాలు
ప్రేమోత్సవాలు బతుకంతా సంతోషాలు
నా పెదాల ఆమని
నీ పేరుగ విరబూయనీ
ప్రేయసీ..! నా ప్రపంచం నీవే
నా ప్రభాతం నీవే, నీవేలే
ప్రేయసీ నా ప్రయాణం నీవే
నాలో ప్రాణం నీవే, నీవేలే
నా దేహమే నీ కోవెల
నీ సవ్వడే నా లోపల
కాలలతో పని లేదుగా
ఒక పుట్టుక సరిపోదుగా
నా తల్లి మమకారాన్ని
మరల నేను నీలో చూసానే
కలలా ఉంది ఈ నిజమే
ఈ జన్మలో మరుజన్మంల
నీ ఒడిలో నే ఉయ్యాలలూగాలే
చెలియ నువ్వు నా వరమే
ప్రేయసీ నా ప్రపంచం నీవే
నా ప్రభాతం నీవే నీవేలే
ఏకాంతమే లేదు ఇక
నీ వెన్నెలే నా వేడుక
చలి గుండెపై నీరెండగా
కురిసావుగా మెరిసావుగా
నీ చెరగు అంచుల్లోనా
కొలువుందంట నే కోరే స్వర్గం
నిను నే వదిలిపోనే
నీ బరువు బాధ్యతలోనే
కదలాలంటా నే వెళ్ళే మార్గం
అడుగు వెలుగు నేనే
ప్రేయసీ..! నా ప్రపంచం నీవే
నా ప్రభాతం నీవే, నీవేలే
ప్రేయసీ నా ప్రయాణం నీవే
నాలో ప్రాణం నీవే, నీవేలే
చిత్రం: మామా మశ్చీంద్ర (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, నూతన్ మోహన్
గాలుల్లోనా కలలే వాలే
కనురెప్పే దాటే
కొత్తగా సరికొత్తగా నీలా మారే
మైకంలోన కనులే తేలే
అరె, నిన్నే చూసే
చుట్టిలా కనికట్టులా మాయే చేరే
ఏమైందో భూమే నేడిలా
ఆగాగి తిరిగెలే
నా కలలు పిలిచెగా
నిలిచి నా ముందే
ఏమైందో సాగే మేఘమే
తలను నిమిరేలే
నీ వలన కుదురుగా
మనసు లేకుందే
అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు
మారే తనువే
అద్దంలో నేనే వేరేలా ఉన్నా
అమ్మాయో మాయో
నీతో చేరే చనువే
గుండెల్లోనా మోగెలే
గాలుల్లోనా కలలే వాలే
కనురెప్పే దాటే
కొత్తగా సరికొత్తగా నీలా మారే
మైకంలోన కనులే తేలే
అరె, నిన్నే చూసే
చుట్టిలా కనికట్టులా మాయే చేరే
తెగదు కల నీదేలే నీదెలే ఈవేళే
పగలు ఒకటే గొడవ ఎలా
నడిపే నను నీవేలే నీవేలే నీవేలే
నీకేదిష్టం అయితే నే మెచ్చేస్తా చెలియా
నువ్వేసే ఓ అడుగే
రమ్మంటు నన్నడిగే
ఎందాకైనా వస్తా నీతో పాటే
తూఫాను నీ పరుగే
గల్లంతు నా గొడుగే
వదలనులే నిన్నే పదా
ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే
నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే
ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే
నీ వలన కుదురుగా మనసు లేకుందే
అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే
అద్దంలో నేనే వేరేలా ఉన్నా
అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే
గుండెల్లోనా మోగెలే దీంతనా
హఠాత్తుగా నా రాతలో
గ్రహాలు మలుపే తిరిగే
కనులు కనులు కలిసి చెలిమి పెరిగే
మరుగుపడని మధురక్షణమిదే
అదేమిటో నీ రాకతో
లయలూగిందే ఊపిరే
నీవైపే చూపే లాగే ఈ క్షణం
ఇలా నీతో పాటే అలా
అణువణువు మెరిసే మిలమిలా
ఆకాశమే ఈ వేళే నాకోసమే ఈ నేలే
తాకే తీరాలే ఆశే తీరేలా
ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే
నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే
ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే
నీ వలన కుదురుగా మనసు లేకుందే
అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే
అద్దంలో నేనే వేరేలా ఉన్నా
అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే
గుండెల్లోనా మోగెలే దీంతనా
పాట: వెళ్ళకే (2023)
సంగీతం: భరత్-సౌరభ్
నటీనటులు: అలేఖ్య హారిక, సుగి విజయ్
దర్శకత్వం: వినయ్ షణ్ముఖ్
నిర్మాణ సంస్థ - Sony Music Entertainment India Pvt. Ltd.
విడుదల తేది: 22.05.2023
వెళ్ళకే పాట సాహిత్యం
పాట: వెళ్ళకే (2023)
సంగీతం: భరత్-సౌరభ్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: యాజిన్ నిజార్
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే
వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే
అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తు
ఎదురయ్యేది మనమే
నీతోడు నేననీ
నా నీడ నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే
నీ చెంత ఏదనీ
నీ వెంట లేదని
గతమంతా అడిగితే
నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారిపోకలా
వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే
వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే
వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే
వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా
వెళ్ళకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా