-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1954"



Movie Details



Songs List:



పండుగ దినమిదిరా పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: యం.యల్.వసంతకుమారి

పండుగ దినమిదిరా 
మన భారత స్వతంత్ర దిన మిదిరా
తెలిసీ తెలియని పరుల భాషలో 
చదివే చదువులు కనరావోయీ 
పాత పురాణపు కథలకు మారుగ 
వీర గాధలే వింటావోయ్! 
దేశ వీరుల మార్గం కంటావోయ్ 
కత్తులు దూసే కాలం పోయే 
జాతి మతాలా భేదం పోయే
పదుగురు ఒక టై బ్రతికే రోజుల 
భాగ్యం నోచావ్ నా తల్లీ 
భాగ్యం నీదే నా తల్లీ 

కరువు కాటకాల్ రానేరావిక
కలిమికి బలిమికి లోటేలేదక
దేశ దేశములు భరత దేశమే
తిండికి భిక్షా పెడుతుంది - 
రామ దండుకి శిక్షణ యిస్తుంది

॥పండుగ॥



చిట్టి పుట్టిన రోజండీ పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: పి.సుశీల అండ్ పార్టీ 

చిట్టి పుట్టిన రోజండీ ! 
చిన్నలు పెద్దలు లేవండీ ! 
దీవినలీయా రారండి !
వన్నెల చిన్నారి చిలుక
మేలిమి బంగరు బొమ్మండీ 
మాలతి పూవుల రెమ్మండి 
కొమ్మల నూగే కోకిల్లారా
జలి బిలి పలుకుల చిలకల్లారా

పున్నమి వెన్నెల పాలకడలిలో
స్నా నాలాడే చంద్రుని చూచి
కడుపులో మచ్చా కడిగిన పోదని
వెక్కిరించు మాచక్కని చుక్క




ఆపుకో జాలని పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: పి.లీల

సాకి: ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లే పాప 
ఏడ్వ లేకే కన్ను మూసే పాప

ఆపుకో జాలని
ఆకటి బాధ........
దారే లేదా ?
బ్రతికే దారే లేదా ?
పసి పాపల ఆకలి తీరే
మేలిమి బంగరు నగలడిగారా ?
మేడల మిద్దెల వసతడిగారా !
కాలే కడుపున కింత
గంజియే కావాలన్నా
కడుపు మంటతో ఏడ్చే పాపకు
కథలు చెప్పినా నిదుర పోవునా ? 
పాలకు బదులూ కన్నీళ్ళిస్తే
ఆకలి పోతుందా





కన్నీటి నీ గాధ కరిగెనా .. పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: ప్రసాదరావు

సాకి:
అహో !
కన్నీటి నీ గాధ కరిగెనా .. తల్లీ 
యింతేలే బ్రతుకింతేలే
పేదల జీవితమంతా... యింతేలే బ్రతుకింతేలే
దారి తెలియని పేదల బ్రతుకులు 
దారం తెగినా గాలిపడగలమ్మా 
అది నీటి బుడగలమ్మా !
పేదల జీవితమంతా... యింతేలే - బ్రతుకింతే..

చిదికిన బ్రతుకులతో
చెదిరిన ఆశలతో
చెడి చుట్టాలింటికి పోవ
చులకన సేయక
పలుకరింతురా !
వెలుపలి కంపక
నిలువ నితురా
ఆర్ధిక స్వతంత్య్రమే ఆడవారల కున్న
కరుణలేని ఈ కసాయిలోకం
కత్తుల బోనులో ఇరికిస్తుందా

కాళ్ళరాచి ఇటు నలి పేస్తుందా
ఇంతేలే
బ్రతుకింతేలే
పేదల జీవితమంతా .. ఇంతేలే



పగలు రేయనక పాటుపడి (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: యం. యల్. వసంతకుమారి

పద్యం:
పగలు రేయనక పాటుపడి
వారి వీరి ఆదరింపులకు
బెదిరింపు లొంగి
ఎంగిలి మెతుకు లాశించి
బ్రతుకుట కంటె 
స్వేచ్చగా - ఏ కుటీర పరిశ్రమో చేసుకొని 
బ్రతుకంగ రాదె జా నెడు పొట్టకింత బానిసత్వ మేలా !



కనీసం ప్రతిమనిషికి పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: యమ్.యస్.రామారావు

కనీసం ప్రతిమనిషికి
కూడు గుడ్డ నీడయినా వుండాలా ? 
కాని మిగలాలా ? మరీ బ్రతకాలా !
ఏ రాజును దించినా
ఏ రాజ్యం మారినా
ఏ యిజం వచ్చినా
ఏ యిజం నచ్చినా
ఏ రాష్ట్రం వచ్చినా ఏ పార్టీ యేలినా
ఏ భోగం పట్టినా
ఏ భాగ్యం గల్గినా
ఏ యేటిని నిల్పిన ఏ కోటలు గట్టినా 
ఏ పల్లెలు పండినా ఏ పట్నం వెలిగినా 
ఏ నాయకు డొచ్చినా ఆర్తుల జూచినా
ఏ పలుకులు పల్కినా ఏ చిలుకలు కుల్కి నా





నాటికి నేటికి పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: రేలంగి

నాటికి నేటికి బేధమూ చూడ 
నూటికి తొంభై పాళ్లురా చూడ 
నూటికి తొంబై చూడ నూటికి తొంబై చూడ
నూటికి తొంబై పాళ్లురా. ॥నాటికి ॥

మీసం తిప్పి రోషం చూపి
కత్తులు తిప్పిం దానాడు 
చూర కత్తులు తిప్పిం దానాడు 
మీసం లేక రోషం లేక
చిత్తయ్ పోయిందీనాడు 
వట్టి చెత్తయి పోయిందీ నాడు 
పాలూ వెన్నా మీగడ తింటూ 
కండలు పెంచా రానాడు - తెగ 
కండలు పెంచారానాడు
కాఫీలు తాగి ఫెషన్లు పెంచీ 
పీనుగులయ్యా రీ నాడు-చచ్చు 
ఫీనుగులయ్యా రీనాడు
ఆడది అంటే అదరక బెదరక 
పులిలాగున్నా రానాడు - పెద్ద 
పులిలాగున్నా రానాడు
ఆడది అంటే ఆదురుచు బెదురుచు
దాసులు అయ్యా రీనాడు - పాద 
దాసులు అయ్యారీనాడు. ॥నాటికి ॥




పెళ్ళి మాటొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: పెండ్యాల నాగేశ్వరరావు, అండ్ పి.సుశీల

గుఫ్ చీఫ్
పెళ్ళి మాటొద్దు 
పెళ్ళిళ్ళంటే మాటలా
దాగుడు మూతలాట
గుఫ్ చీఫ్
పెళ్ళి మాటొద్దు
పట్టూసీర కట్టి నీవు
బంతిపూలా  రవికను తొడిగి
టింగు రంగా యంటు పెళ్ళికి
అడ్డూ చెప్పక వుంటే
వడ్డాణం తెస్తానె
అడ్డాబాస తెస్తానె
టకుటక్కు నీ కాళ్ళకు మట్టెలూ తెస్తానె
ఏటి కావాలొ చెప్పవే తలుపులూ
ఏటి కావాలో చెప్పవే చుఫ్ గుఫ్ చుఫ్
పిల్లా పీచు కలిగితే
పెంచలేక సావాలి
ఇరుగు పొరుగు వాళ్ళకెల్ల
సులకనె పోవాలి

పెళ్ళిమాట ఎత్తకోయి మావ 
పెళ్ళిమాట ఒదురోయి

అయ్యోలమ్మి
అయ్యోలమ్మి
అయ్యోలమ్మి
ఆదుర్తా వేటే ?
ఓలమ్మీ
ఆదుర్తా వేటే ? 
పెళ్ళంటే బెదుర్తా వేటే ?
ఓ అమ్మి 
పెళ్లాడి నోళ్ళంతా పెద్ద మొగోళ్ళే నేనంటే 
పెద్ద మొనగాళ్లే నేంటే తింటానికి తిండిలేదు
ఉంటానికి ఇల్లులేదు కోతలు కోశావుగాని 

ఎల్లవోయి 
పెళ్ళంటూ 
వచ్చావోయి
నీకూ పెళ్లంటూ కావాలంటే 
ఇల్లంటూ ఉండాలయ్యా 
డబ్బెంతో ఉండాలయ్యా 
అందాక పెళ్ళాడ వద్దయ్యో చుప్ హుప్ 



చందమామ సోకుచూడ పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: ఎ. ఎమ్. రాజా అండ్ జిక్కి (పి.జి.కృష్ణవేణి)

చందమామ సోకుచూడ
అందాలా దీవులకు
కలసి పోదామా !
కలసి పోదామా !
కాటూకా కల్లకద్ది 
కడియాలా రవళితోటి 
కవ్వించ రానుపోవే
ఓ వయ్యారి భామా !
సయ్యాటకు రానుపోవే

జాబిల్లి అందాలూ;
జాజిపూలా చందాలూ;
ఎవరి కోసమురా ?
ఓ వయ్యారి బావా

వలపు తెలియని
వయసు ఫలమే మోయి
కలవపూవు చందురూడు
కౌగిలింతల కలుసుకొనగా
మధ్యనొచ్చే మబ్బుమా టేవే ? 
ఒయ్యారి భామా !
మన మధ్య నొచ్చే ఆత్తమాటేవే ? 

గాలి వీచిన తేలిపోయే
మబ్బుమాట ఎందుకోయి?
మన మనమామనసు కలసి పోతే
అత్తమాట లెందుకోయి
ఓ వయ్యారి బావా
అందాల దీవి కెడదావోయి
పోదామా
కలసి
పోదామా
పోదామా





చూచారా! ఈ సరసం పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: ఘంటసాల అండ్ పి.లీల

చూచారా! ఈ సరసం
విన్నారా! ఈ చోద్యం
మల్లెపూల తేనెలు తాగి
మత్తెక్కే తుమ్మెదల్లారా !
ఓ తుమ్మెదలారా !
వర్షానికి తడిశావని వడిలో నను చేర్చుకొని
తల నీకూ తుడవాలని
మనసారా జేరదీసె 
ఓ తుమ్మెదలారా !

గుడిలోపల కూర్చుంటే వడిలొ తన తన తల జేర్చ
పూలతావికి పొంగి నేను
పోనీయని దరి జేర్చ 
తప్పించుకు తానొచ్చి
తప్పులు నావంటుంది

చక్కదనాల్ చుక్క వని
చిక్కావిక చేతికని
నీవే నా రాణివని 
ఎంతో మురిపించాడే.




చిక్కేదానిని కానోయి పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

చిక్కేదానిని కానోయి
ఓ...... రాజా ! నా రాజా! 
చేతికి చిక్కేదానిని కానోయి

జాబిల్లి వెలుగుల్లోనా
చక్కదనం నేనేనోయి 
కోకిలమ్మ గానంలోనా 
కమ్మనీ శృతిని నేనేనోయి రాజా !
నా రాజా ! చేతికి చిక్కేదానిని కానోయి

వన్నెచిన్నెలా మురిపించేటి 
వలపుల రాణిని నేనేనోయి
తకిట తకిట తకదిమీ
ఝణుతక ఝణుతక ధిమితక
తక తకిట తకిట తక దిమిత దిమియని
నాట్యంచేస్తూ పోతానోయి రాజా!
నారాజా ! చేతికి

మత్తిల్లే కౌగిలిలోనా
మాటలు రాని దానను రాజా !
నీ దాసిని రాజా!
పోనీ న నేను
పోవా న నీవు
మరువలేని మమకారంతో
మరచి పోదిమీలోకం రాజా ! 
నా రాజా చేతికి



ఆనందం ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: మేనరికం (1954)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖర్ రావు
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

ఆనందం ఆనందం
ఆనందమె జీవిత పరమానం
ముసి ముసి నవ్వుల మోహన రాగం
కొసరే కోకిల వసంతగానం 
శరన్మల్లిక మధుర నికుంజం 
ప్రేమ దృగంచల బాల కురంగం
చల్లగాలిలో ......గగన విహారం 
సాగే ఊయల స్వైరవిహారం 
సెలఏటిలో స్వేచ్చాయానం 
కలసే మనసుల ప్రణయ కలాపం 
పున్నమి వెన్నెల పొంగే సంద్రం 
కన్నులు కన్నులు కలసే సమయం 
ఏ మున్నది జీవిత చరితార్ధం ? 
మదేవత కదే పరమార్థం 

Palli Balakrishna Friday, March 15, 2019


చిత్రం: సంఘం (1954)
సంగీతం: ఆర్.సుదర్శనం
సాహిత్యం: తోలేటి వెంకటరెడ్డి
గానం: సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, వైజయంతి మాల, అంజలీ దేవి
దర్శకత్వం: ఎమ్.వి.రామాన్
నిర్మాణం: ఎవిఎమ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 10.07.1954

పల్లవి :
ఆ...ఆఆ... ఆ... ఆఆ...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లాలల లాలల లా లల్లల్లా...

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే


చరణం: 1
స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
కర్షక సౌఖ్యం...
కర్షక సౌఖ్యం...  కార్మిక శ్రేయం..
కర్షక సౌఖ్యం.... కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆ...ఆ
కలిగే మార్గం చూపిస్తా...

చరణం: 2
రాణీ రుద్రమ... మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ..  నేనే
రాణీ రుద్రమ.. మల్లమదేవీ..  రెడ్డినాగమ్మ..  నేనే
రణ తిక్కన భార్యా...  సతి మాంచాల
తిక్కన భార్యా...  సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే..

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..

ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆ...ఆ...
ఆహో..ఆ... ఆ.. ...


******  ******  ******


చిత్రం:  సంఘం (1954)
సంగీతం:  ఆర్. సుదర్శనం
సాహిత్యం:  తోలేటి
గానం:  సుశీల, టి. ఎస్. భగవతి

పల్లవి:
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...

ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా....

చరణం: 1
నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా...
నను చూసి కనుసైగ చేసితివోయీ... రావేలా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....

ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ....
మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై రావేలా...

చరణం: 2
హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా...
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా
హృదయవీణ తీగలు మీటీ ఆవేళా....
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా

మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా....
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా..
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే...
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా...

Palli Balakrishna


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  సముద్రాల సీనియర్
గానం:  భానుమతి రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
సమర్పణ: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 10.12.1954

(పి.ఎస్.రామకృష్ణారావు గారు భానుమతి గారి భర్త)

పల్లవి:
విరహే.. ఏ.. ఏ.. ఏ.. ఏ.. తవ దీనా... ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా

చరణం: 1
నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేద మదీరం
వ్యాల నిలయ మిలనేన గరళమివ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వ్యాల నిలయ మిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా

చరణం: 2
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా

చరణం: 3
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ
నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం

సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
కృష్ణ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తావవిరహే తవ దీనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి :
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా

చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

చరణం: 1
పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు
మురువుగా పాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చె నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

చరణం: 2
దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి:
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా...
పాలించర రంగా..

చరణం: 1
మరువని తల్లివి... తండ్రివి నీవని...
మరువని తల్లివి... తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా...
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా... శ్రీరంగా
పాలించర రంగా...

చరణం: 2
మనసున నీ స్మృతి మాయకమునుపే ...
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ...రంగా
కనియద మనసారా...
పాలించరా రంగా ...పరిపాలించరా రంగా

చరణం: 3
కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా ...సురభోగాలను కోరనురా
దరి కనరానీ భవసాగరమును....
దాటించుమురా గరుడ తురంగా...

పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా..


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి:
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

బృందావనిలో నందకిషోరుడు...
బృందావనిలో నందకిషోరుడు... అందముగా దీపించే లీల
చూడు మదే చెలియా కనులా... చూడు మదే చెలియా

చరణం: 1
మురళీకృష్ణుని మోహనగీతికి...
మురళీ కృష్ణుని మోహనగీతికి...పరవశమైనవి లోకములే...ఏ..
పరవశమైనవి లోకములే... విరబూసినవి పొన్నలు.. పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు...
పరిమళం ఎగసెను మలయానిలమున తూలెను .. యమునా

చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

చరణం: 2
నారి నారి నడుమ మురారి...
నారి నారి నడుమ మురారి...
హరికి.. హరికి నడుమ వయ్యారి
హరికి.. హరికి నడుమ వయ్యారి...
తానొకడైనా ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ
తానొకడైనా ... తలకొక రూపై
తానొకడైనా... తలకొక రూపై...
మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా...

చూడు మదే చెలియ ...కనులా...చూడు మదే చెలియా


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  భానుమతి రామకృష్ణ

పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ....ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా....

చరణం: 1
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం...
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం...
నిన్నేలువాని లీలలేరా..
నిన్నేలువాని లీలలేరా..
కన్నార కనరా ఏలుకోరా..
కన్నార కనరా ఏలుకోరా...

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...

చరణం: 2
అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా..
పొందుకోరు చిన్నదాని పోందవేలా...
అందాలరాయా అందరారా...
అందాలరాయా అందరారా...
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా...ఓ..ఓ..ఓ..

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...




Palli Balakrishna



చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: సి. మోహన్ దాస్, టి.చలపతి రావు
సాహిత్యం: అనిసెట్టి సుబ్బారావు
గానం: గంటసాల, మాధవపెద్ది, పి.నాగేశ్వర రావు, పి.జి.కృష్ణ వేణి, లీలా, కోమలి, రాణి 
కథ, మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి 
నటీనటులు: సావిత్రి, యన్.టి.ఆర్, ఎ.యన్.ఆర్, సురభి బాలసరస్వతి 
దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు
నిర్మాత: చంద్ర దుర్గ వీరసింహ
విడుదల తేది: 01.09.1954

గమనిక: పినిశెట్టి శ్రీరామమూర్తి గారు రాసిన అన్న చెల్లెలు అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాకు పినిశెట్టి శ్రీరామమూర్తి గారే కథ మాటలు కూడా సమకూర్చారు.


Songs List:



రండోయ్ రండి ! పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి 
గానం: 

రండోయ్ రండి ! 
రండోయ్ రండి !
రండోయ్ రండి పిల్లలూ, 
చూడండోయ్ తమ్ములూ, 
రంగురంగుల బొమ్మలూ, 
రమ్యమైన బొమ్మలూ !
రమ్యమైన బొమ్మలూ !
చిట్టిబొమ్మలూ, చూడండీ
సీమబొమ్మలూ, చిలక బొమ్మలూ,

అ రంగురంగులా బొమ్మలూ,
రమ్యమైన బొమ్మలూ !
చూడు చూడు వేషమూ,
చేసేదంత మోసమూ,
వీని బ్రతుకె దోషమూ,
మాయలాడిరా బలే కిలాడిరా !
లోక మెంతో ఇది భలే బొమ్మల సంతరా !
రండోయ్ రండి! 

లాలల్లలా లాలల్లలారలాలల్లలా! 
ఈ పిల్లల చూడరా, జీవితమే డోలరా, 
చిరునవ్వుల మాలరా 
మాయమర్మ మెరుగని పనివారురా!
లోక మెంతో వింతరా
ఇది బలే బొమ్మల సంతరా ! 

రండోయ్ రండీ పిల్లలూ, 
చూడండోయీ తమ్ములూ
రంగురంగులా బొమ్మలూ 
రమ్యమైన బొమ్మలూ 
రమ్యమైన బొమ్మలూ ! 
చిట్టిబొమ్మలూ, చూడండీ 
సీమబొమ్మలూ, ఇవిగివిగో 
చిలక బొమ్మలూ, అరెరెరెరే

రంగురంగులా బొమ్మలూ
రమ్యమైన బొమ్మలూ !
రండోయ్ రండి ! రండోయ్ రండి !




ఆనందమోయీ ఆనందమూ పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి  
గానం: 

ఆనందమోయీ ఆనందమూ, హే ! 
ఆనందమోయీ ఆనందమూ ! 
సంతోషమైనా సయ్యాటలూ, 
కయ్యాలు నీ నెయ్యాలురా!

అనందమోయీ ఆనందమూ !

రావోయి నేస్తం ! మీ ఆట చూస్తాం ! 
చేస్తాం సవాలూ, మేమే గెలుస్తాం!
-హాచి దూచి చింతాకు దూచి........ 
-చెడుగుడు గుడు గుడు........
మీరెత్తు వేస్తే పైయెత్తు వేస్తాం, 
మీ జిత్తులన్నీ చిత్తు చిత్తు చేస్తాం !
-బలి బలిదారం బంతికి జగడం.
చెన్నాపట్నం చెడుగుడు చెడుగుడు....
కూతొదిలావ్, పాయింటు నాది! 
అహ, మాది !
కాదు మాది !
ఏమిటోయ్ నీ దబాయింపు
నీ దబాయిం పేమిటోయ్ ? ?
పొగరుబోతులే, మీవాడసలే
పోకిరి కుర్రాడు ! బలే బల్ 
తగవులు తెస్తాడు !
తక్కువవాడా, మీవాడసలే
టక్కరి కుర్రాడూ ! బలే బల్
తుంటరి కుర్రాడూ !
నువ్వెంత !
నీ బ్రతుకెంత ! 
ఏమన్నావ్ !!
నువ్వేనున్నావ్ !!
ఆ !....
ఆ !....
అగండయ్యా ఆగండి!
ఏలనయ్యా ఈ తగాదా మానరయ్యా 
తప్పుగాదా ! పిల్లలాడిన ఆటకై పెద్దలిటుల
తగవు పెంచుట న్యాయమా, తగునటయ్య!
చిన్న పిల్లలు చక్కని స్నేహరీతి చూసి 
ఇక నైన నీతులు నేర్చుకొనరే! 

పిల్లలబృంద గానం: 
ఆనంద మోయీ
ఆనందమూ, హే !
ఆనందమోయీ ఆనందమూ !



లోక మెంతో చిత్రమురా పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి  
గానం: 

నందారే!
లోక మెంతో చిత్రమురా, భళి !
నందారే!
జనులార ! వినరయ్య జరుగబోయే వింత ! 
తలకిందులౌతుంది
కలి కాలమంత ! .... నందా రే !
ఏకు మేకతుంది, ఆకు బాకాతుంది, 
బక్కచిక్కిన వాళ్లు దుక్కలౌతారయా, 
దుక్కలాంటి వారు చిక్కిపోతారయా, 
పెద్దలకు పిల్లలే బుద్ధి చెపుతారయా
ఆలికే మగడిక అణిగి మణగుంటాడు !

ఊరి మధ్యను మర్రి కూలిపోతుందయా, 
అసలు పెద్దల్లో నె ముసలమొస్తుందయా, 
సామాన్యులే లోకమాన్యు లౌతారయా 
హైడ్రొజక్ బాంబుతో అదరగొట్టేవారు |
తమ నీడకే తాము హడిలి చస్తారయ్య !

జనులార ! వినరయ్య కలికాల తత్వాలు ! 
బ్రతుక నేర్చిన వారి సులువైన సూత్రాలు !

రైలుబండిలో జనం క్రిక్కిరిసి పోయినా, 
దెబ్బలాడీ తాను ఎక్కి కూచుంటాడు, 
తానెక్కినంతనే తలుపు బిగిస్తాడు ! 
టిక్కెట్టు కొంటేనె ఇన్ని యిక్కట్లండి,
లేనివారికి సరాసరి కిటికీలోంచి దారి!
గర్వముంటే కళ్లు పొరలు గగమ్ముతాయి,
చాడీలు వింటేను చెవులు చెడిపోతాయి,
పరుల దూషించితే నోరు పడిపోతుంది, 
నడ మంత్రపు సిరికి మిడిసిపడబోకురా, 
లేవిడీ చేస్తుంది లేచిపోతుందిరా!

ప్రభువుల తత్వాలు పామరుల కెరుక 
బండ్ల వాళ్ల గోత్రాలు పోలీసుల కెరుక, 
వ్యాపారుల సూత్రాలు ఇన్కం టాక్స్ కెరుక 
పాలలో నీళ్లెన్నొ పరమాత్మ కెరుకరా !
సినిమా తీసేవాళ్ల గోత్రాలు చూసేవాళ్ళ కెరుక !

నందారే!

లోక మెంతో చిత్రమురా, భళి !
నందారే!




అవునంటారా ? కాదంటారా ? పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి  
గానం: 

అవునంటారా ? కాదంటారా ? 
ఏమంటారూ, మీ రేమంటారూ?
మా అన్న గారూ మహమంచి వారు, 
చదువంత కష్టించి సాధించినారు, 
చదువు లో ఫస్టు ! బడిలోన బెస్టు!

ఆ తెలివి అందరికీ లేదని నేనంటే
మీ రేమంటారూ ?
అవునంటారా ? కాదంటారా ? 
ఏమంటారూ, మీరేమంటారూ ?

అన్నయ్య చదువే అయిపోవగానే 
వస్తుంది అర్డర్ తానే కలెక్టర్! - తానే కలెక్టర్! 
అన్నయ్య కీర్తి ! అన్నయ్య శక్తి !
ఆ పేరూ అందరికీ రాదని నేనంటే
మీ రేమంటారూ ?
అవునంటారా ? కాదంటారా ? 
ఏమంటారూ, మీరేమంటారు ?




ఇంత చల్లని వేళా పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిసెట్టి సుబ్బారావు
గానం: జిక్కి

ఓహో హో !....
ఇంత చల్లని వేళా
వింత తలపు లివేలా !
ఇంత చల్లని వేళా!
ఝల్లని మనసే పులకరించె,
మనసున వల పే చిలకరించె!
ఇంత మోహ మిదేలా, ఇంత చల్లని వేళా !

ఈ ముద్దు గులాబీ పూల రేకలు 
ప్రేమ లేఖలేనా, ఇవి ప్రేమ లేఖలేనా ! 
నీ అందమే నే పొందనా అని
కల కల నవ్వేనా - ఓ కలకల నవ్వేనా!

ఇంత చల్లని వేళా
వింత తలపు లివేలా 

ఈ చల్ల గాలి సయ్యాటలన్నీ
చిలిపి సైగలేనా, ఇవి చిలిపి సైగలేనా !
నీ అందమే నా విందులే అని
వలపులు కురిసేనా ఓ- వలపులు కురిసేనా !

ఇంత చలని వేళా వింత తలపు లివేలా !
ఝల్లని తనువే పులకరించె,
మనసున వలపే చిలకరించె
ఇంత మోహమి దేలా !
ఇంత చలని వేళా !



ఆవేదనే బ్రతుకును ఆవరించేనా పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి 
గానం: 

ఆవేదనే బ్రతుకును ఆవరించేనా !
ఆశలన్నీ కడకు అంతరించేనా !
వెలుగు నీడల బాటరా, జీవితమె
కలిమి లేముల ఆటరా !
గడియకొక రీతిగా లోకమే మారురా,
వెలుగు నీడల బాటరా !

పరమాత్మ రూపాలు పసిపాపలే నేడు 
బ్రతుకంత భారమై పయన మాటేల !.....
మర్యాద ముసుగులో మాయలూ మోసాలు
పేరాశతో పరుల బలిచేయ నేలా !
నిలువ నీడేలేని నిరుపేద కైనా,
వెలుగు నీడల బాటరా

నిఖిల లోకము నేలు మహారాజుకైనా,
సుఖదుఃఖములు బ్రతుకు సంద్రాన కెరటాలు
ఏ నాటికేమౌనో ఎరుగలే మౌరా !
ఏనాటికేమానో ఎరుగలే మౌరా !



కలికాలం కలికాలం పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి  
గానం: 

కలికాలం!!
కలికాలం కలికాలం
ఇది ఆకలి కాలంరా భాయీ !
ఆకలి కాలంరా !
లోకం మాయా జాలంరా,
ఇది పేదల గుండెల గాలంరా !

కలికాలంరా కలికాలం

ఎవరిని చూసిన ఏదో దిగులు 
రాత్రింబగళ్లు రగులూ, 
ఏడ్వలేక నవుతుంటారోయ్, 
నవ్వు రాక ఏడుస్తారోయ్ !

కలికాలంరా కలికాలం

ఉన్నవారి నెదిరించేవారికి 
అసలుకు మోసం వచ్చునురా, 
అవునవునని తల ఆడించడమే . 
తారక మంత్రముగా, భాయీ ! 
తారక మంత్రమురా !

కలికాలంరా కలికాలం !

పదవుల వేటలో ప్రాకులాటలో
నాయకులకు పోటీలురా,
వినాయకులకు పోటీలురా!
మాటలు, మూటలు మోసే వారికి
మంచి మంచి వాటాలురా !
కోరినన్ని కోటాలురా
ఏం కాలం ?
కలికాలం !
కాదు, కాదు,
ఆకలి కాలం!
కలికాలంరా
కలికాలం
ఇది  ఆకలి కాలంరా భాయీ
ఆకలి కాలంరా !





రాజూ వెడలే చూడరే! పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి 
గానం: 

రాజూ వెడలే చూడరే! 
భూకంపములు లెగయగ
రాజు వెడలె చూడరే !
చిరకాలముగా చీట్ల పేకలో
చిందులు వేసిన గందరగోళపు

రాజూ వెడలే చూడరే !

చతుర్ముఖ రామాయణ చక్రవర్తీ, బహుపరాక్ !
సెహబాస్ !
మదాం మహారాణీ, బహుపరాక్ !
ప్రభూ !
హు!
ఓ రాజా ! ఇది కడు సంతోషపు రోజూ, 
నేడైనా నా మోజూ తీరదా ! 
ఓ రాణీ! నీ కోరికలన్నీ తీరూ, 
అవి యేవో నా కిపుడే తెల్పుమా ! 
ఆ రాజ భోగాలె లేవు, 
ఆ రాణీ వాసము లేదు, 
ఏ ఆభరణాలు లేవు ! 
ఓ రాణీ ! నీకే దిగులు, 
నీ కిస్తా వెన్నెల తోట, 
కట్టిస్తా బంగరు కోట, 
నీ కెన్నో కానుక లిస్తా !
మాట నమ్ము  మనసు నిమ్ము 
హస్తమిమ్ము రమ్ము రమ్ము !

ఓహోహో ! ఇది కడు సంతోషపు రోజూ
ఈ వేళా మన మోజూ తీరులే !
ఇది యొక లెఖ్ఖ ! కూలిపోయిన మహా 
సామ్రాజ్యంబును మరల లేవనెత్తెద ! 
ఈ సేవకాధముణ్ణి సైతము సేనాధిపతింజేసెద !

ఓ మహారాజ !
జరుగదు ! వొట్టి మాట !
సురిగిపోయిన రాజ్యాలు
తిరిగి వలదు వలదయ్య మాకు నీ కొలువు, 
నిన్ను నమ్మి చెడితిమి పోవుచున్నాము యిపుడె 
అందుకోవయ్య మా రాజినామ ఇదిగొ ! 
ఓరీ దురాత్మా
మా మాట నమ్మ వేమిరా
ఓరోరి ద్రోహి !
మా మాట నమ్మ వేమిరా 
సేవక నీవు !
మా మాటా !- హో - హీ -హో
మా మాట నమ్మ వేమిరా ! 
ప్రచండమగు నా పరాక్రమంతో 
జయించెదన్ ఈ ప్రపంచమంతా !
ఎవరు వచ్చినా ఎదురు చెప్పినా 
కత్తి నెత్తెదన్, శక్తి చూపెదన్
పట్టి, కట్టి, కొట్టి, మట్టి చేసెద ! 
మా మాట ! హు ఏరా ఒరే మా మాట 
మా మాట నమ్మ వేమిరా !
సేవక నీవు,

భలే మంచి రాజు వేనయా !
ఇక చాలు నీ ప్రతాపము, ఆపుము ! 
కాలమే గతించెనయ్య
భలే మంచి రాజు వేనయా !
భలే ! భలే ! భలే ! మంచి రాజువేనయా !
ఇక పోవోయ్, పో పోవోయ్ !
నీ బాజా వినమోయ్ రాజా !
ఓ మాజీ రాజా
పోవోయ్, పోవోయ్ !
నకలు రాజులకు రోజులు తీరెను ! 
అసలే లోకపు పోకడ మారెను !
మహారాజువా !
మరలుము ! తరలుము !
పోవోయ్, పోపోవోయ్
పో, పో, పో, పో!!



జననీ జన్మ భూమిశ్చ పాట సాహిత్యం

 
చిత్రం: పరివర్తన (1954)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: అనిశెట్టి 
గానం: 

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ !
అమ్మా ! అమ్మా ! అమ్మా ! అమ్మా 
అమ్మా, అమ్మా, అవనీమాతా ! 
అనంత చరితా ! అమృత మూర్తీ ! 
అమ్మా, అమ్మా
అభినందన మాలించుము తల్లీ ! 
ఆదరించి లాలించుము తల్లీ ! 
అమ్మా, అమ్మా ! 
అమ్మా అమ్మా అవనీమాతా ! 
అనంకి చరితా అమృత మూర్తీ ! 
అహరహరమూ ఆ సూర్య చంద్రులే 
అభిషేకించెద రమ్మా !
అనుదినమూ మా శ్రమ నర్పించి 
ఆరాధించెద మమ్మా!
అమ్మా ! అమ్మా
బంగరు పంటలు, పాల నదులు మా
సిరులన్నీ నీ కానుకలమ్మా
యోగులు, భోగులు, మహాత్యాగు లీ!
నరులంతా నీ శిశువులె నమ్మా 

అమ్మా ! అమ్మా ! అవనీమాతా ! 
అనంత చరితా ! అమృతమూర్తీ! 
ఆకలి, ద్వేషం, లోకపు శోకం అంతరించి నీవమ్మా !

శాంతి సౌఖ్యములు సౌభాగ్యాలే జగతి నిండనీవమ్మా, 
ప్రగతి సాగనీవమ్మా ! 

అమ్మా, అమ్మా, అవనీమాతా ! 
అనంత్ చరితా ! అమృత మూర్తీ ! 
అమ్మా, అమ్మా, అవనీమాతా ! 
అనంత చరితా ! అమృత మూర్తీ ! 
అమ్మా ! అమ్మా ! అమ్మా !


Palli Balakrishna Sunday, March 3, 2019

Most Recent

Default