చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) (2025) సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ నటీనటులు: రష్మిక మందన్న , ధీక్షిత్ శెట్టి దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ నిర్మాతలు: విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని విడుదల తేది: 07.11.2025
Songs List:
నదివే పాట సాహిత్యం
చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: హేషామ్ అబ్దుల్ వహాబ్ వెలుగారునా.. నిశిపూసినా.. వెలివేసినా.. మది వీడునా.. గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన నిన్ను వదలకుమా వదలకుమా… బెదురెరుగని బలమా…. నదివే.. నువ్వు నదివే.. నీ మార్పే రానుంది వినవే.. నదివే.. నువ్వు నదివే.. నీకే నువ్వియ్యాలి విలువే.. సిలువ బరువేమోయకా సులువు భవి తెలీదుగా వెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా.. ఓహో హో.. తడువు గురుతులై ఇలా.. తరుము గతమునావనా.. ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా నటనిక చాలనే..ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం నువ్వు వదలకుమా వదలకుమా… సరికోరే నిజమా…. నదివే.. నువ్వు నదివే.. నీ మార్పే రానుంది వినవే.. నదివే.. నువ్వు నదివే.. నీకే నువ్వియ్యాలి విలువే.. మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా.. నదివే..
లాయి లే పాట సాహిత్యం
చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: కపిల్ కపిలన్ , హేషామ్ అబ్దుల్ వహాబ్ కురిసేవాన తడిపేయాలన్న భూమే ఏదో సరదా పడుతూ పురి విప్పేస్తూన్న నెమలే ఏదో ఓ నీలి మేఘం పెంచింది వేగం ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి కమ్మితే మైకం లాయి లాయి లాయిలే లాయి లే లాయిలే ఏమౌనో లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో నిజమేంటో లాయి లే లాయిలే లాయి లాయి లే లాయి లే ఏమౌనో లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో ఎదురెంటో లాయి లాయి లాయి లే లాయి లే లాయిలే ఏమౌనో లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో మలుపేంటో ఓ చేప… మరలా మరలా ఎరనే విసిరి కొరికే వరకు సహనం కొసరి వలలో పడక వదలడు జాలరి.. ఈసారి.. మరి మరి సవాలౌతున్నా పదే పదే సమీపిస్తున్నా ఆటో ఇటో ఎటో దారున్న ప్రతిసారి కథలన్నీ ఇంతేనా.. ఓ ఒరుగాలి ఇది కాదు లాలి ఆ చంటి పాపను చుట్టూ ముట్టి నింగికెత్తి గిరవాటేస్తావో లాయి లాయి లాయిలే లాయి లాయి లాయి లాయి లాయిలే లాయి లాయి లాయి లాయి లాయిలే లాయి లాయి
నీదే కథ పాట సాహిత్యం
చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: అనురాగ్ కులకర్ణి చిమ్మ చీకట్లు చీల్చే తేజంమై రా నీవు కోరేటి బాటుంది ముందరా జ్వాలై పొంగిన నీ శ్వాసతో గతాన్ని ఆపుమా వేదన వేద పాఠంమై నేర్పే ప్రయాణమా నీదే నీదే కదా నీదే నీదే కదా నీదే కదా… నేడే కదా… తెగిపోయెనే సంకెల నీకె నువ్ దొరికేంతలా నీదే కదా… నేడే కదా… సమాదైనా సహనం సమాధానం అడిగే సదా కధనమాయే మధన యెదని కథనమే విధ్యులు ధునిగా విస్ఫోటనముగా ఆవిష్కరించాలి వెలుగుల సేకమే బిడియం కూలే బెరుకే రాలే భయమే పేలే అడుగేయాలే తరముల చీకటి తెరలే తొలి కిరణం తొలిగించి తరుణోదయం అవుతున్నదా.. నీ లోకం.. నీదే నీదే కదా నీదే నీదే కదా నీదే కదా… నేడే కదా… నీదే నీదే కదా నీదే నీదే కదా నీదే కదా… నేడే కదా…

No comments
Post a Comment