Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rukshar Dhillon"
Spark - L.I.F.E (2023)



చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
నటీనటులు: విక్రంత్ రెడ్డి, మెహరీన్ ఫిర్జాద, రుక్షార్ దిల్షాద్
దర్శకత్వం: విక్రంత్
నిర్మాత: లీలా రెడ్డి 
విడుదల తేది: 2023



Songs List:



ఏమా అందం పాట సాహిత్యం

 
చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: సిద్ శ్రీరామ్ 

ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం
ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం

గ్రామాలలో ఏ నగరాలలో
ఈ మాదిరరందాన్నిలా
ఏ మానవుడు చూడనేలేదే
ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం

ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం


వన్నెల విల్లై
నీ తనువుందే
కన్నులపై అది
విరి బాణమైందే

వెన్నెల జల్లై
చిరు నగవుందే
పున్నమిలా నను చేరిందే

ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం

గ్రామాలలో ఏ నగరాలలో
ఈ మాదిరరందాన్నిలా
ఏ మానవుడు చూడనేలేదే
ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం




ఇది ఇది మాయా పాట సాహిత్యం

 
చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: శ్రేయా ఘోషల్, హేషం అబ్దుల్ వాహెబ్ 

అలపొద్దని పక్కకి వంచీ
నీవీ నింగిని నిలువున చించీ
మేఘమాలలో మెరుపులు తెంచీ

ధూళి గాలుల దురుసులు తెంచి
దూసుకొచ్చాను నీ ముందుకే
చెయ్యి అందించు చాటెందుకే

ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా


ఏమి తెచ్చావు చుక్కల తోటలనుంచి
రెండు తోకచుక్కలు కోసుకొనచ్చా
నీ చెవుల చివరిలో గవ్వలుగా గుచ్చా

ఏమి తెచ్చావు వేకువ అంచుల నుంచి
ఎర్ర రంగు వెలుగులు దువ్వుకొనొచ్చా
నీ చెంప ఛాయతో చాల్లేదని విడిచా

కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది దేనికనీ
దిష్టి చుక్కగా నీ బుగ్గమీద దిద్దాలనీ
ఊహలో హాయి ఉన్న ఫలంగా
కళ్ళముందుంటే నమ్మేదెలా చెప్పుమా


విశ్వాసముంటే విశ్వాన్ని కూడా
శాశించగలదే నీలో ప్రేమా

ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా



జ్ఞాపకాలు కొన్ని చాలు పాట సాహిత్యం

 
చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: కృష్ణ లాశ్య, హేషం అబ్దుల్ వాహెబ్ 

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

నీతో చెప్పే ఏ మాటైనా నాకో జ్ఞాపకమే
మౌనం కూడా ఇంకో జ్ఞాపకమేలే
తియ్యని జ్ఞాపకమే, ఇది తగువు
చల్లని జ్ఞాపకమే, ఇది నగవు
చేతులు చాచిన వయసుకి
కౌగిలి వెచ్చని జ్ఞాపకమే
నువ్వు మేఘానివై… తాకే చోటులో
ఒక్కో జ్ఞాపకం… ఒక్కో చినుకవుతోందే

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు

నీపై ఇష్టం పెంచే పయనం
నాకో జ్ఞాపకమే
ఆపై మజిలీ ఇంకో జ్ఞాపకమేలే
ఆశకి జ్ఞాపకమే, ప్రతి స్పర్శ
ధ్యాసకి జ్ఞాపకమే, ప్రతి వరసా
నీ పెదవంచుకి నా పెదవంచుల
లాలన జ్ఞాపకమే
నువ్వే నేనుగా తోచే వేళలో
ఒక్కో జ్ఞాపకం ఒక్కో గ్రంధమయ్యిందే

ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు




లేఖా లేఖా పాట సాహిత్యం

 
చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: అర్మాన్ మాలిక్ 

ఎందుకో నిను కలుసుకున్న
ఇందుకే అని తెలుసుకున్న
చిన్నగా చిన చిన్నగా
నే నీకు దగ్గరవుతున్న

ఒంటరై నీ పిలుపు విన్నా
జంటనై నే పలుకుతున్నా
మెల్లగా మెలమెల్లగా
నే నీకు సొంతమవుతున్నా

లేఖా లేఖా
నీతోనే చివరిదాక
లేఖా లేఖా
నీ కన్న ఎవరే ఇంకా

నిసాగరిసా సరి సరి సరి
నిసాగరిసా

నా నిన్నల్లో నీ నీడైనా లేదే
నా రేపు మాత్రం
నువ్వు లేకపోతే రాదే
నేననే తీరానికి
ఓ దారిలాగ నిలిచావే

లేఖా లేఖా
నీతోనే చివరిదాక
లేఖా లేఖా
నీ కన్న ఎవరే ఇంకా



రాధేశా పాట సాహిత్యం

 
చిత్రం: SPARK (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: శ్వేతా మోహన్ 

కనబడు కంటికి తొందరగా
కనుగొల లేను ఇక అంత ఇదిగా
కనబడు కంటికి తొందరగా

నిన్ను వెతికేదేట్టు నేరుగా
కనబడు కంటికి తొందరగా
వెనకేం దగవుగా

ఏ చిలిపి కోనలోన
కిమ్మనక ఉన్నావూ
ఏ వెదురు కాణాల్లో
ఎదురై వేణువూదేవూ

ఏ కోలను తీరంలో
కొమ్మలకు ఊగేవు
కూకలను దోచేస్తూ మరచితివా
దోచిన మనసుని

రాధేశ కనబడు రాధేశ
కందినది కన్నె చూపు
కునుకుండా నీదు కదా నీ ధ్యాస

రాధేశ కనబడు రాధేశ
కాలమిక లేదు అంటూ
తరిమేస్తూ ఉంది కదా నా శ్వాశ

రారా వేణు గోపాబాలా
రాజిత సద్గుణ జయశీలా
రారా వేణు గోపాబాలా
రాజిత సద్గుణ జయశీలా

సారా శాఖా నేరమేని
మరుబాధ ఒరవలేవురా
రారా వేణు గోపాబాలా
రాజిత సద్గుణ జయశీలా

రాధేశా జాతబడు రాధేశా
జన్మకొక స్వప్నముంది అది
సత్యమైంది కదా ప్రాణేశ

రాధేశా జాతబడు రాధేశా
జన్మ మరు జన్మ జన్మ
ప్రతి జన్మ నీకు ఈహా రాసేశా

Palli Balakrishna Friday, October 27, 2023
Ashoka Vanamlo Arjuna Kalyanam (2022)



చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
నటీనటులు: విశ్వక్ సేన్ , రుక్సర్ ధిల్లాన్ 
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
నిర్మాతలు: బాపినీడు, బి, సుదీర్ ఈదర 
విడుదల తేది: 2022



Songs List:



ఓ ఆడపిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రామ్ మిరియాల

మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా

వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా..?
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ ఆఆ ఆ

పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది
చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే

తిక్కో టెక్కో… చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో… గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా

బతిమాలడానికైనా
ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన

తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో… గొప్పో ముప్పో
తెలుపక, లొసుగులెడతావా..?
మంచో చెడ్డో… కచ్చో పిచ్చో
తెలియక, నసిగి నడిచేవా..?

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా..!!





ఓరోరి సిన్నవాడ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు  
గానం: అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటు పోటు
అంతా మాయరా

రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొత్తరా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటు పోటు
అంతా మాయరా

తలపులు మోసే కలవరమా
మనసుని మోసే కల నిజమా
వదలకు నన్నే ఆశవాదమా

ఆశ లేదు దోశ లేదు
ఏందిరా నీ సోది
బుర్ర దాకా పోనే పోదా
సెవిలో ఊదేది

చుప్ చాప్ గుంటూ సూస్తా ఉంటె
పోయేది ఏముంది
సరిసరి విషయమే
కురసగా చెప్పేసెయ్ ఓ సారి
అడుగులే తడబడే బతుకులో
భద్రం సంచారీ

రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొత్తరా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా




రంగు రంగు రాంచిలకా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: విజయ్ కుమార్ బల్లా, రవికిరణ్ కోలా
గానం: రవికిరణ్ కోలా

హ్మ్ ఉరికే నా సిలకా
నీ సక్కనైన పాట మెలిక

ఆ, గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి

గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి
కొండా దాటి… కోనా దాటి
కోసుకోస్లు దార్లు దాటి
సీమాసింతా నీడాకోచ్చానే


రంగు రంగు రాంచిలకా
సింగారాలా సోకులు చూసానే
రంగు రంగు రాంసిలకా
సింగారాలా సోకులు చూసానే

కళ్ళల్లోనా
కళ్ళల్లోనా వడ్డ అందం
గుండెల్లోనా సేరేలోగా
కళ్ళల్లోనా వడ్డ అందం
గుండెల్లోనా సేరేలోగా
రెక్కాలిప్పుకుని ఎగిరిపోయామే

రంగు రంగు రాంచిలకా
మనసునిరిచి మాయమయ్యావే
రంగు రంగు రాంసిలకా
మనసూనిరిసీ మాయమయ్యావే

తందర నానయ్యో… తందర నానయ్యో
పందిరి సందట్లో… అల్లరి ఏందయ్యో
తందర నానయ్యో… సుందరి ఏదయ్యో
గుండెల దాచావా బైటికి తీవయ్యో

తియ తియ్యని… తియ తియ్యని
తియ తియ్యని తేనెలూరు
లేతకెంపు పెదిమలు
వాలుకనులనెక్కుపెట్టి సంపేసిన సూపులు

సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
ఆకాశమెత్తు ఆశ పుట్టించి
రంగు రంగు రాంచిలకా
పాతాళంలో పాతిపెట్టావే
రంగు రంగు రాంసిలకా
పాతాళంలో పాతిపెట్టావే

నువులేక నే లేనని రాసావే రాతలు
బతుకంతా నాతోనే ఉంటానని కూతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు

మార్సు మీద మేడ సూపెట్టి
రంగు రంగు రాంచిలకా
మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగు రంగు రంగు
రంగు రంగురాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగురాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే, హేయ్య్




ఈ వేడుకా నీలో మనసా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: రెహ్మాన్
గానం: హరిప్రియ, జయ క్రిష్

ఊగే ఊయలూగే
ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే
ఓ గానమాయే

ఊగే ఊయలూగే
ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే
ఓ గానమాయే

ఈ వేడుకా నీలో మనసా
తేలేదెలా నీ వరసా

ఈ మాయేమిటో తరిమే హాయేమిటో
నాతో నేనిలా జరిపే పోరేమిటో
ఈ జోరేమిటో అసలీతీరేమిటో
నే నీకేమిటో తెలిపే దారేమిటో

నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా
కంచె తెంచలేని తెగువే కరువై
ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా
గీతే దాటలేని బిడియం బరువై

ఈ వేడుకా నీలో మనసా
తేలేదెలా నీ వరసా

ఎన్నో రంగులే పెను సందేహాలుగా
నా చుట్టూ ఇలా నిలిచేలా
అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా
కాలం గీసిన చిత్రాలే

Palli Balakrishna Thursday, April 21, 2022
ABCD (2019)


చిత్రం: ABCD (2019)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్, అదితి భావరాజు
నటీనటులు: అల్లూ శిరీష్ , రుక్షర్ ధిల్లోన్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: .మధురా శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 01.03.2019

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందే
చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదా రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందులేదే ఈ హాయి
సందడేమో అల్లుతూనే నీ వైపోయే
ప్రతీ క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూశానులే నీలా ఏదీ లేదంటే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

మెరిసే లోపలే మనసే
మురిసే నిన్నిలా కలిసే
నిమిషాలు రోజులై
నిలిచేను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే అల్లారేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

Palli Balakrishna Saturday, February 23, 2019

Most Recent

Default