Chennai Love Story (2026) Telugu Songs Lyrics
MOVIE DETAILS
Movie : Chennai Love Story (2026)
Banner : Mass Movie Makers, Amrutha Productions
Music : Mani Sharma
Director : Ravi Namburii
Producers : SKN, Sai Rajesh
Actors : Kiran Abbavaram
Actresses : Sri Gouri Priya
Release Date : 2026
SONGS LIST (3 SONGS)
Guruthunda Song Lyrics in Telugu – Chennai Love Story (2026)
'Guruthunda' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Haricharan and Shruthika Samudhrala.
SONG INFORMATION
Movie : Chennai Love Story (2026)
Music : Mani Sharma
Lyricist : Anantha Sriram
Singers : Haricharan, Shruthika Samudhrala
Special Note :
మణిశర్మ చాలా ఏళ్ల గ్యాప్ తరువాత ఈ సినిమా కి సంగీతం అందించడం జరిగింది. ఈ పాట మంచి మెలోడిగా ఉంటుంది. తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ అనే లైన్ చాలా క్యాచీ గా ఉంటుంది ఈ పాటకు విజయ్ పోలాకి కోరియోగ్రఫీ చేశారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరి చరణ్, శృతిక సముద్రాల
గురుతుందా.. గురుతుందా..
నువ్వు తడిచిన తొలి వర్షం
అది వెలిసిన తరువాతా.. ఆగిందా ఆకాశం
గురుతుందా.. గురుతుందా..
వెలిగించిన తొలి దీపం
అది ఆరిన తరువాతా.. మసకైందా ఈలోకం
జల్లులో హాయిని చూడాలంతే
వెలుగులో అందం చూడాలంతే
అది తొలిదా.. మలిదా.. నీకెందుకే
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
వెనకకి చూసుకుంటూ నీ పయనమలా
ముందుకైతే సాగలేదు దారి బాగున్నా
వెనకటి జ్ణాపకంతో నీ ప్రాణమిలా
కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా
పోవాలే పాత నీరూ తూలే కళ్లల్లో
పొంగాలే పాటలేరూ నీ గొంతుకలో
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
మనసును మార్చుకుంటే ఏం నేరమనీ
నేరుగానే నేడు నాకు ప్రశ్నవేశాడే
గతములు తవ్వుకుంటే ఏం లాభమనీ
రేపు వైపు చూపు నేర్పి ఆశలందించాడే
లోలోతుల్లోకి వెళ్లీ ఆలోచిస్తున్నా
నాలోంచి నన్ను మళ్లీ బయటకి తేనా
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
Vadhalane Song Lyrics in Telugu – Chennai Love Story (2026)
'Vadhalane' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Javed Ali.
SONG INFORMATION
Special Note :
అనంత శ్రీరామ్ కలం నుండి జాలువారిన వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే అనే పదాలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది మణిశర్మ గారి బాగా ఈ పాటకు బాణీలను సమకూర్చారు. జావేద్ అలీ గారు కూడా బాగానే పాడారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జావేద్ అలీ
నా బతుకే ఆకాశమైతే
దాని వేకువ ఇప్పుడే
నా మనసే ఓ కోకిలైతే
దాని కువకువ ఇప్పుడే
ఇప్పుడే ఇక్కడే
మాటిస్తా కదే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
సాగరాలే ఎడారులైనా
ఎండమావే సముద్రమైనా
వదలలేనే వదిలిపోలేనే
నిను వదలలేనే వదిలిపోలేనే
గోపురాలే పునాదులైనా
బండరాలే భవంతులైనా
వదలలేనే వదిలిపోలేనే
నిను వదలలేనే వదిలిపోలేనే
జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా
అసూయగా అసలెలా చూసినా
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
నాపై నాకే గురి కుదిరే మాట నువ్వు అన్నాక
నాలో నాకే భ్రమ కలిగే బాస నువ్వు చేసాక
వేరే ఆలోచనలేవీ రానే రావు నాదాకా
నీకే నీడై నడవడమే చాలు చాలు నాకింకా
సిరి తోరణాలు సన్నాయి డోలు
ఎలా వెలుగుల మెనాలెలా
చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు
మనకెదానేడా ఊగే వేళ
మన ఏడు అడుగులను ఏడు లోకముల
సరిహద్దులుగా మార్చేదాకా
వదలనే వదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే… నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
నిజము నిన్నే నిమిషమైనా వదలనే నిను వదలనే
భుజముపై ఏ బరువులున్నా వదలనే నిను వదలనే
నిదురనైనా నిందనైనా వదలనే నిను వదలనే
నిలువున నే కరుగుతున్నా వదలనే నిను వదలనే
పంచభూతాల సాక్షిగా వదలనే
పంచప్రాణాల సాక్షిగా వదలనే
నన్ను నేను వదిలినా
నిన్ను నేనెటు వదలనే
జన్మలో వదలనే
జన్మ జన్మకీ వదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదలనే వదలనే వదలనే
వదలనే వదలనే వదలనే వదలనే వదలనే
Jigithara Song Lyrics in Telugu – Chennai Love Story (2026)
'Jigithara' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Karthik.
SONG INFORMATION
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్
పల్లవి:
జిగితార జిగితార దిగినావా మనసారా
ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై
భూమి చేరినావు నా మౌన దేవతై
బతకాలనున్నదే ఇక నీకు బానిసై
ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై
జిగితార జిగితార దిగినావా అరె మనసారా
చరణం: 1
బావిలో ఈదే జీవిలా ఉండగా
పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా
రేవులే లేని నావలే నవ్వగా
తోవలో దీవిలా నన్ను చేరావుగా
పగలైనా చీకటే నా నిన్నకీ
నడిరేయి వేకువే ఈ నేటికీ
హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ
జిగితార జిగి జిగితార దిగినావా అరె మనసారా
చరణం: 2
రాత్రిలో రాజ పాటనై మోగుతా
తీయని లాలిలో హాయిగా సోలిపో
భారతీరాజా చిత్రమై చేరుతా
రంగున మాయలో రోజునే మర్చిపో
వడివేలై అందుతా నీ వేలుకీ
సరదాగా నవ్వుకో ఈ వేళకి
సినిమాని మించిన జీవితాన్ని చూపుతా
నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ
నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో
నీకు ఎంత పోదుమో అంత వాడుకో
కథలన్నీ కంచికే అని అందరందురే
కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే
2 comments
Nice song 2026
Nice
Post a Comment