Bhakta Prahlada (1967) Telugu Songs Lyrics
Raara Priya Sundara Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Raara Priya Sundara' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: దాశరథి
గాయకులు: పి. సుశీల
రాజనర్తకి
రారా ! ప్రియా ! సుందరా !
కౌగిలిలో నిన్ను కరగింతురా (రారా)
వెన్నెలవేళ విలాసాలతేల
వేచితినీకై క్షణాలేయుగాలై
విరహముతో నేను వేగినదాన
సరగున నన్నేలరా (రారా)
Bhujashakthi Nathoda Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Bhujashakthi Nathoda' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యము: (భాగవతము లోనిది)
గాయకులు : మాధవపెద్ది సత్యం
హిరణ్యకశిపుడు
భుజశక్తి నాతోడ పోరాడ శంకించి
మున్నీట మునిగిన మునుగుగాక
అలయించి పెనగు నా అచల సంభ్రమమున
కెరగి వెన్నిచ్చిన విచ్చుగాక
జగడంబు సైపక సౌకర్య కాంక్షియై
యిలక్రింద నీగిన నీగుగాక
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున
హరిభంగి నడరిన నడరుగాక
వాని శోణితమున వాడి మెరసి
కఠిన హలధార కంఠంబు విదళించి
మత్స హూదరునకు మహా తర్పణము చేసి
మరలి వత్తు మీకు మేలుదెత్తు
Janani Varadayini Trilochani Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Janani Varadayini Trilochani' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by S. Janaki. Lyrics are written by Palagummi Padmaraju.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: పాలగుమ్మి పద్మరాజు
గాయకులు: ఎస్. జానకి
లీలావతి
జననీ జననీ,
జననీ వరదాయనీ త్రిలోచని
నీపద దాసిని కావగదే (జననీ)
పతి ఎడబాటే సైపగలేక,
పశుపతిలోన సగమైనావే
కాంతుని చూపే కరవైపోయె!
కాంతుని చూపే కరవైపోయిన
దీనను దయగన రాదా (జననీ)
నా పతి ఏగతి తాపసియై
ఘోరాటవిలో కృశియించేనో
తపమును వేగమె సఫలము జేయవె
తపమును వేగమె సఫలము జేసీ
విజయము ఈయవె దేవీ (జననీ)
Aadhi Anadhiyu Neeve Deva Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Aadhi Anadhiyu Neeve Deva' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by M. Balamuralikrishna. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: దాశరథి
గాయకులు: బాలమురళీకృష్ణ
నారదుడు
ఆది అనాదియు నీవే దేవా
నింగియు నేలయు నీవే కావా
అంతట నీవే ఉండెదవు
శాంతివై కాంతివై నిండెదవు
(ఆది అనాదియు)
దీనజనావన నారాయణా
మదమోహిత దానవ సంహరణ
మాయని జ్యోతివో, తీయని గీతివో
ఏమని వర్ణింతురా
తరుణ బిందువున, విరళ సింధువున
ఎచట చూచినను నీవేకదా
కనులలోన మనసులోన నీ రూపమే
(ఏమని వర్ణింతురా)
నారద సన్నుత నారాయణా
నరుడవో సురుడవో
శివుడవో లేక శ్రీసతి పతివో
నారద సన్నుత నారాయణా!
దానవ శోషణ మానవ పోషణ
శ్రీ చరణా భవ హరణా
కనకచేల భయశమనశీల
నిజ సుజనపాల హరి సనాతనా
క్షీర జలధిశయనా ! అరుణ కమలనయనా
గాన మోహనా! నారాయణా!
Sirisiri Lali Chinnari Lali Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Sirisiri Lali Chinnari Lali' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by S. Janaki and M. Balamuralikrishna. Lyrics are written by Arudhra.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: ఆరుద్ర
గాయకులు: ఎస్. జానకి, బాలమురళీకృష
లీలావతి, నారదుడు
సిరి సిరి లాలి చిన్నారి లాలి
నోముల పంటకు నూరేళ్ళ లాలీ
ఊగుమా! ఊయలా
పాలకడలిలో జాబిలిరీతి
వరలుము రతనాల గారాల బాల
ముద్దుల మూట మురిపాల తోట
ముసిముసి నవ్వుల ముత్యాలకోట
ఊగుమా! ఊయలా
పదునాల్గు లోకాల తరియింపజేయ
ప్రభవించి నావయ్య వరభక్త శీల
కలలెన్నో నీ కొరకు కాచుకొని పూచే
ఫలియింపజేయుమా అరుదైన బాల
ఊగుమా! ఊయలా
కులదీపమై వెలుగు కొమరుని జూచి
దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా
నీవారి ఆశలు వెత్తావులీని
నిరతము నీ కీర్తి వికసించునన్నా
ఊగుమా ! ఊయలా
Galira Kumbhini Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Galira Kumbhini' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: మాధవపెద్ది సత్యం
హీరణ్యకశిపుడు
గాలి, కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ దమ : ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ
వ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్ నమస్తాన
సౌళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే
Jayaho Jayaho Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Jayaho Jayaho' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela, S. Janaki and Soolamangalam Rajalakshmi. Lyrics are written by Samudrala Jr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల జూనియర్
గాయకులు: పి. సుశీల, ఎస్. జానకి, రాజ్యలక్ష్మి
రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ
జయ హో
నమస్త దానవ సామ్రాజ్య సంస్థాపన ధురీణా
జయ హో జయ హో జయ హో
అందని సురసీమ నీదేనోయీ
అందరు ఆశించు అందాల హాయి
అందించే నెరజాణలమోయి (అందని)
రంభ:
మంజులవల్లి నికుంజములోన
రంజిలగా మోవి అందీయనా
పాలవెన్నెలా జాలునా, వాలుకన్నులా ఏలనా
అందమందు చిందులందు,
దృఢ పరి రంభమందు నాకు సాటి నేనే
మేనక:
కోరికేమొ సెలవీర, సుకుమార ! రణధీర సోయగాల నడలా వాలి ఒడిలో సోలిపోయేనా,
లాలించి రాగ రసదోలా తేలింతు | ప్రేమభోగాలా,
మేన కానరాని వలపు తీరుల
మెలగి మేను మరువజేయు మేటిని
ఊర్వశి:
మై మరతువులేరా ! మగరాయా
వగదీర మనసార కౌగిలీర,
వయను తలపులూర వల పేరు పొంగు వార, మరుని కోర్కెతీర మన సేల ఊర్వశేరా
తిలోత్తమ:
వన్నెలా కడకన్నులా విన్యాసాలలోనా
సరి సరికేళీ విలాసాలలోన
ప్రేమసితార మతారాల తార
జాణ తిలోత్తమయే
Hiranyakashipuni Divya Charithamu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Hiranyakashipuni Divya Charithamu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam and Pithapuram Nageswara Rao. Lyrics are written by Kosaraju Raghavaiah.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు, మాధవపెది. పిఠాపురం నాగేశ్వరరావు
చండా మార్కులు
చండా: హిరణ్యకశిపుని దివ్య చరిత్రము
నవరస భరితమురా (హిర)
చండా: వినవిన నెంతో వీనుల విందై
వింత గొల్పుగదరా (హిర)
చండా: వెడలెను రాక్షసనాధుడు
విజయ దుందుభులు మొరయగ
చండా: బేలలగుచు దిక్పాలకులందరు
భీతి జెంది గొందులబడిపారగ
చండా: ఓరోరీ వరుణా రారా !
చర్మమొలిపించెదను చూడరా
నెల మూడు వానాలు
అమర్క: కురిపించుటలుమాని
అహ పైరు పచ్చల పెంపు
అమర్క : గావించుటలు మాని .
దేశదిమ్మరులగుచు తిరుగుచున్నారటర
ఓరోరి వరుకా రారా చర్మమొలిపించెదను చూడరా
Chettu Meedha Oka Chilakundhi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Chettu Meedha Oka Chilakundhi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Kosaraju Raghavaiah.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు: పి. సుశీల
చెట్టుమీదా ఒక్క చిలకుంది!
దాని పక్కగానే జామ పండుంది !
చూచి చూడకుండ చప్పరించకుండ
ఎగిరిపోతే లాభమేముంది ! అయ్య !
ఊర్వశితావచ్చి వొయ్యార మొలికింప
మొగము తిప్పుకొని వచ్చావు
రాజాధిరాజ హిరణ్య మహారాజు
వలపు జూపక మనసు దాచేవు అయ్యొ
మెత్తని నీ మనను దాచేవు
చందమామ వచ్చి ముందునిల్చిన ఏమొ
వెచ్చంగ వుందయ్యా దేహం అబ్బ
వెచ్చంగ వుందయ్య దేహం నా దేహం
చల్లని నీచేయి తగిలితేనే చాలు
తీరిపోతుందయ్య మోహం అహ
చల్లారిపోతుంది తాపం విరహతాపం
Karunaleni Manasu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Karunaleni Manasu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: దాశరథి
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
కరుణలేని మనసు కఠిన పాషాణంబు
జాలి గలుగువు సజ్జనుండు
సౌడు జంతువులను బాధింపవలదయ్య
ప్రాణి హింస ఘోర పాపమయ్య
Om Agnimeele Purohitham Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Om Agnimeele Purohitham' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Padma and Subramanya Sastry. The lyrics are adapted from the Rigveda.
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Rigveda
Special Note : Adapted from the Rigveda.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: వేదం
గాయకులు: సుబ్రహ్మణ్య శాస్త్రి, పద్మ
చండా మార్కులు, ప్రహ్లాదుడు
ఓం అగ్నిమీళే పురోహితం, యజ్ఞస్య దేవ
మృత్విజం, హెతారం రత్నధాతమం
ఓం ఇ షేత్వోర్టేత్వ వాయవస్థ పాయవస్థ
దేవోవత్సవితా ప్రార్పయతు
శ్రేష్ఠతమాయ కర్మణే !
ఓం అగ్న ఆయాహి వీతయే,
నో హవ్య దాతయే నిహతా నత్సీ బిషి
ఓం శవ్నో దేవి రభిషయ అపోభవంతు పీతయే
శంయో రభిస్రవంతున
Chadhivinchiri Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Chadhivinchiri' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
చదివించిరి ననుగురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ
Mandara Makaranda Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Mandara Makaranda' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
మహాదుడు
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు నోవునే మదనములకు
నిర్మల మందాకివీ వీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరగునే సాంద్రనీహారములకు
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపాన విశేషమత్త
చిత్త, మేరీతి నితరంబు జేర నేర్చు
వినుత గుణశీల మాటలు వేయువేల
Kanjakshunakugani Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Kanjakshunakugani' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
కునకుగాని కాయంబు ఆగమే
పవన కుంభిత చర్మ
వైకుంఠు డొగడని వక్తంబు వక్తమే,
ఢమఢమ ధ్వనితోడి థక్కగాక,
హరి పూజనములేని హస్తంబు హస్తనే
తరుశాఖ నిర్మిత దర్విగాక,
కమలేకు జూడని కన్నులు కన్నులే
తనుకుడ్య జాల రంధ్రములుగాక
ఆ. చక్రి చింతలేని జన్మంబు జన్మమే
తరళ నలిల బుద్బుదంబుగాక,
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక !
Patuthara Neethi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Patuthara Neethi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: మాధవ పెద్ది సత్యం
హిరణ్యకశిపుడు
చ: పటుతర నీతి శాస్త్ర చయ పారగు చేసెదనంచు బాలునీ
వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్
కుటిలత జెప్పినాడపు భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్
గట కట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండ వే
Varamosage Vanamali Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Varamosage Vanamali' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by M. Balamuralikrishna. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: బాలమురళీకృష్ణు
నారదుడు
వరమొనగే వనమాలీ!
నా వాంఛితమ్ము నెరవేరును గా
తామనవాదుల దర్పము తొలగీ
ధర్మపాలనా ధరణి వెలయగా
దాసుల.చీ శాంతినిలుపగా
వన్నగశయనుడు నరసిజనచునుడు
అవతరించుగా!
ఎందు వెదకిన కనరాక హేమక శివు
హృదయమున తిష్ఠ వేసి తబ్బిబ్బు జేసీ
విసుగు నుసికొల్పి ఆడించు నీదులీల
పరులకు గ్రహింప శక్యమా! గరుడగమనా!
Om Namo Narayanaya Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Om Namo Narayanaya' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and Chorus. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాలు
గాయకులు: పి. సుశీల, బృందం
ప్రహ్లాదుడు
ఓం! నమో ! నారాయణాయ !
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవ బంధాలు పారద్రోలి
పరము నొనంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
గాలిని బంధించి హఠించి గాసిన పని లేదు
జీవుల హింసించి క్రతువులా చేయగ పనిలేదు
మాధవా మధుసూదనా !
అని మననున తలచిన చాలుగా
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
తల్లియు తండ్రియు నారాయణుడే
గురువూ చదువూ నారాయణుడే!
యోగము యాగము నారాయణుడే!
ముక్తియు దాతయు నారాయణుడే !
భవ బంధాలూ పారద్రోలి
పరము నొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నాధ హరే! శ్రీనాధ హరే!
నాధ హరే! జగన్నాధ హరే!!
Balayuthulaku Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Balayuthulaku' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును
బలమెవ్వండు అట్టి విభుడు బలమ నురేంద్రాల
Kanulaku Veluguvu Neeve Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Kanulaku Veluguvu Neeve' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and S. Janaki. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు: పి. సుశీల, ఎస్. జానకి
ప్రహాదుడు
కనులకు వెలుగువు నీవే కావా
కనబడు చీకటి మాయే కాదా
నిను గనలేనీ ప్రాణీ బ్రతుకే
నిజముగ చీకటియౌగా దేవా
కనులకు వెలుగువు నీవే కావా
పేరుకు నేను తల్లిని గానీ , ఆదుకొనాలే నైతి
పాలను త్రాగి ఆకలిబాపే | భాగ్యమునైనా నోచని నాకూ
ఏల జనించితివయ్యా ! నా కేల జనించితివయ్యా!
అండగనుండా విధాతనీవూ | ఆకలిదప్పుల బాధే లేదు
నారాయణ నామామృత రసమే |
అన్నము పానముగావా దేవా !
కనులకు వెలుగువు నీవే కావా
Aadhukovayya O Ramesha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Aadhukovayya O Ramesha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and Chorus. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు: పి. సుశీల బృందం
ప్రహ్లాదుడు
ఆదుకోవయ్యా ! ఓ ! రమేశా
పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా !
భువవనాయక ముక్తి దాయక భక్తపాలక కేశవా !
సర్వలోక కారణా ! సకలశోక హారణా !
జన్మ జన్మ కారణా ! జన్మ బంధ మోచనా !
సుష్టగర్వ శిక్షణా ! శిష్ట శాంతి రక్షణ! శాంతి రక్షణ!
Panchabdambulavadu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Panchabdambulavadu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam and Chorus. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: మాధవ పెద్ది సత్యం, బృందం
హిరణ్యకశిపుడు
గా: పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంచు నిందించి | య
క్కించిద్భీతియులేక | విష్ణున్ నహితుం కీర్తించు చున్నాడు వ
లంచున్ చెప్పిన మానడు ! అంగమున పుత్రాకారతన్ వ్యాధి జు
న్మించెస్ ) దీని వధించి రండు దనుజుల్ మిమీ పటుత్వంబులన్
Jeevamu Neeve Kadha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Jeevamu Neeve Kadha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు: పి. సుశీల
జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
జనకుడు నీపై కినుక వహించి
నను వధియింపా మది నెంచే
చంపే దెవరూ సమసే దెవరూ
సర్వము నీవేకదా స్వామీ!
Ninnegani Parulaberumga Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Ninnegani Parulaberumga' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
నిన్నేగానీ పరుల నెరుంగా !
రావే! వరదా ! బ్రోవగ రావే! వరదా ! వరదా !
అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!
జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
Hey Prabho Hey Prabho Lakshmi Vallabha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Hey Prabho Hey Prabho Lakshmi Vallabha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
హే ! ప్రభో ! హే ! ప్రభో !
లక్ష్మీవల్లభ ! దీనశరణ్యా !
కరుణా భరణా ! కమలలోచనా
కన్నులవిందువు చేయగరావే!
ఆశ్రిత భవ బంధ నిర్మూలనా !
లక్ష్మీవల్లభ లక్ష్మీవల్లభ
Pamulollamayya Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Pamulollamayya' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Ghantasala. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, L. R. ఈశ్వరి
పాములవాళ్లు (సూరి, సింగి)
సూరి: పాములోళ్లమయ్యా | మా పెట్టె చూడరయ్య బల్లె
సూరి: ఈరిగాడి తమ్ముడు బంగారు గాడు ఉన్నడు
సుబ్బిగడి తమ్ముడు చిన్నబ్బి గాడు ఉన్నడు
సింగి: కంకణాల కాటిగాడు లంకణాల కోటిగాడు
సూరి: సింకికళ్ల పోతడు మా జాతికెల్ల మొనగాడు
సింగ్: గొర్రేనైన బర్రెనైవ గుటకేసే కొండపిలవ
మడిసిన్న మాకు నైన మట్టుబెట్టు మిన్నాగు
యినము గక్కు బొక్క బెరుడు తరిమికరను తాడిగిరి ఆహా"
సూరి: యీటిపాలబడ్డ వాడు బతికి బట్టగట్టలేడు
బొమ్మజెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది
తస్సదియ్య, దీని తస్సదియ్య చెయ్యి పెడితే కస్సుకన్సు మన్నది...
సింగి: కట్టుగట్టి పడితేను కదలకుండ ఉన్నదీ ఓ హెయ్ !
సూరి: ఒదిలి పెడితె పేణాలు గావుపడుతనన్నది
సింగి: పగబట్టినపుడు దీని పరవళ్ళు సూడాలి కాటే సేటపుడు దీని కవ్వింపు సూడాలి అబ్బో అబ్బో అబ్బో
సూరి: అచ్చమైన తాచు ధీని కచ్చె యెపుడు కానలేడు ఆహా ఓహో
పడిగే తిప్పి కొట్టెనంటె బెమ్మకూడ తిప్పలేడు
Ninne Nammi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Ninne Nammi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు: పి. సుశీల
నిన్నే నమ్మి నీ పదయుగళీ,
సన్నుతిజేసే భక్తావలికి
మిన్నాగుల గమ భయమదియేలా
పన్నగ శయన నారాయణ
జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
Madhilo Velilo Cheekati Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Madhilo Velilo Cheekati' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
మదిలో వెలిలో చీకటి సూపీ,
పధము జూపే పతితపావనా !
జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
Bhavajaladhinibadi Thelagaleni Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Bhavajaladhinibadi Thelagaleni' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
భవజలధినిబడి తేలగ లేని,
జీవులబ్రోచే పరమపురుషా !
నను కాపాడీ నీ బిరుదమునూ,
నిలుపుకొంటివా శ్రీతమందారా |
జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
Munchithi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Munchithi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: మాధవపెద్ది సత్యం
హిరణ్యకశిపుడు
ముంచితి వార్డులన్ గదలమొత్తితి,
శైల తటంబులందు ద్రోబ్బించితి |
శనరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంకి రొ
ప్పించితి |
ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్ను లందు త్రో
యించితి |
పెక్కు పాట్లు నలయించితి చావడు వేమి చిత్రమో |
Vishwamunindi Velige Neeve Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Vishwamunindi Velige Neeve' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
విశ్వమునిండీ వెలిగే నీవే, నాలోనుండి నన్ను కావగా
విషమును ద్రావా వేరువగనేలా, విషధర శయనా,
విశ్వపాలనా! 1జీవము నీవేకదా!
Kaladambodhi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Kaladambodhi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
కలడంభోధి గలండు గాలి గల డాకాశంబునం కుంభినిస్
కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్
కలదీశుండు కలండు తండ్రి ! వెదకంగా నేల యీ యాయెడన్ !
Indhugaladu Andhuledanu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Indhugaladu Andhuledanu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
ఇందుగలడు అందులేడని
సందేహమువలదు | చక్రి సర్వోపగతుం |
డెందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి, వింటే ||
Sri Manini Mandira Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Sri Manini Mandira' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: పి. సుశీల
శ్రీ మానిని మందిరా !
త్రైలోక్య సమ్మోహనాకారా ! ప్రేమావతారా !
జగన్నాధా ! లోకాధినాథా !
మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి,
వేదా? రక్షించి, దేవాసురుల్ క్షీర
వారాన్ని ధిన్ ద్రచ్చగా గోర, కూర్మావతారుండ వై
మందరంబెత్తి, శ్రీ మోహినీ వేష ముంబూని
పీయూష దానంబుగావించి, వారాహ రూపంబునన్
భంగ పాటొందు భూదేవి రక్షించి, ఈనాడు
నీ తత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్
సత్య దీపంబు చూపించి, మోహంబు వారించి
నీ విష్ణు భావంబు రూపించి, నీదాసకోటిన్ కటాక్షింపగా
ఈ విచిత్రా కృతింబూని వేంచేసినావా
పరంధామా ! వైకుంఠ ధామా !
నమో! నారసింహా!
నమో ! భక్తపాలా !
విధాతాదులే వెరగు చెందునీ
ఉగ్రరూపమూ ఉపశమింపుమా !
త్రిలోకాలకూ ప్రియంబైననీ
ప్రసన్నాకృతి ప్రసాదింపుమా !
Yella Sareera Dharulaku Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)
'Yella Sareera Dharulaku' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.
Movie : Bhakta Prahlada (1967)
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: పి. సుశీల
ప్రహ్లాదుడు
ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం
ద్రెళ్ళక నీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక నర్వమున్ అతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లము జేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి,
1 comment
Sir Ihave real me 5 using in this mobile copy and paste of lyrics not allowed
What can i do for copy lyrics
With regards
A Apparao
Post a Comment