Summa Masuriyaa Song Lyrics in Telugu – Chatrapathi (2005)
'Summa Masuriyaa' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta, Smita, Kalyani Malik and Niraj Pandit.
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: కె. ఎస్. చిత్ర
నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది
నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
చరణం: 1
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా
కడుపులో నిను మోయకున్నా
అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
చరణం: 2
తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడుతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
Mannela Tintivira Song Lyrics in Telugu – Chatrapathi (2005)
'Mannela Tintivira' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Tippu, Smita and Karate Kalyani.
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్
శ్రీ కనక మహాలక్ష్మి కి జై
శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై
శ్రీ అన్నారం సత్యన్నారాయణ స్వామికి జై
శ్రీ రాజ రాజేశ్వరి వరప్రసాద మహారాజ
శ్రీ పసలపూడి పంకజం గారికి
పర్వ కళ నాట్యమండలికి జై
అందుచేత ఆడియన్స్ లారా
రసిక సిఖామణులారా
వాసికెక్కిన వైజగు వాసులరా
మన్ను తిన్న కృష్ణయ్యను
మందలించిన యశోధమ్మతో
ఆ వెన్న దొంగ
నువ్వు తొక్కవయ్యా హార్మోని
పోలీస్ బాబు గారు చూస్తున్నారు
కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి
ఎలెస్ ఏటిరా ఈ ఎదవ గోల
నేను మన్నసలే తినలేదే తల్లి
ఏయ్ అబద్ధాలడతావు
మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా
నీకు వెన్నల్లేవా జున్నులేవా
అరిసెల్లేవా పోని అటుకుల్లేవా
నీకు నీకు...
ఎంటవుతుందిరా..?
నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా
నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
పొద్దుకాల తడిపిదూడా
పొదుగుపాలు తాగబోతే
ఆ తాగబోతే
లాగిపెట్టి తన్నిందే మట ్టిమూతి కంటిందే
అయ్యయ్యో
ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా
నీకు కాకినాడా కాజాలు లేవా
నీకు మైసూరు బొండాలు లేవా
నును బందారు లడ్డూలు లేవా
ఆహ ఆత్రిపురం పూతరేకులు లేవా
రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
ఏటిగట్టు తోటలోనా
మొక్కనాటి నీరు పెట్టి
ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి
చెక్కరకేలి గెలలు లేవా
పంపర పనస తొనలు లేవా
పూరిల్లేవా బూరెల్లేవా తేనెల్లో ముంచిన గారెల్లేవా
నీకు కాశ్మీరు యాపిల్సు లేవా
అరెరే పాలకొల్లు బత్తాయి లేదా
ఇటు వడ్లమూడి నారింజ లేదా
అయ్యో కాబోలి దానిమ్మలు లేవా
పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా
నువు మన్నేల తింటివిరా కృష్ణా
Gundusoodi Song Lyrics in Telugu – Chatrapathi (2005)
'Gundusoodi' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta and M. M. Keeravani.
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్సి గిఫ్ట్, కె. ఎస్. చిత్ర
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి
కుర్ కుర్ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసు లో ఏం దాగి వుందో
చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి
కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
పండు కోయగలవా దాని తొక్క తియ్యగలవా
తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా
పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే
పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే
వలుచుకో వాటేసి వయసు వరహ
అదరహొ అందాల ఆడతరహా
తమాయించుకోరా దరువేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి
పట్టి చూడగలవా ఎద గట్టు డాటగలవా
గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా
పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే
గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టి పట్టుగలనే
అందుకెవరున్నారు నేను మినహ
అందుకే విన్నాను లేడి సలహ
తమాయించుకోరా తలుపేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి
కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసు లో ఏం దాగి వుందో
చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
Baahubali: The Beginning (2015) Telugu Songs Lyrics
MOVIE DETAILS
Movie : Baahubali: The Beginning (2015) Banner : Arka Media Works Music : M. M. Keeravani Director : S. S. Rajamouli Story : V. Vijayendra Prasad Producers : Shobu Yarlagadda, Prasad Devineni Actors : Prabhas, Rana Daggubati Actresses : Anushka Shetty, Tamannaah Bhatia Supporting Cast : Sathyaraj, Nassar, Ramya Krishna, Sudeep Release Date : 10 July 2015
చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: సూర్య యామిని
మమతల తల్లి
ఒడి బాహుబలి
లాలన తేలి
శతధావఱలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలి
మాహిష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలి
వేచిందా ఖండించే ఖడ్గం
తోసిందా ఛేదించే బాణమ్
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
కల్ల తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే ఓ...ఓ...
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణరంగం ఇరణమ్
జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలి
Jeeva Nadhi Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)
'Jeeva Nadhi' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Geetha Madhuri.
Special Note :
Baahubali: The Beginning movie లోని Manohari పాటలో దర్శకుడు S. S. Rajamouli ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ పాటలో ఆయన cameo appearance ఇవ్వడం ఈ song కి ఒక ప్రత్యేక ఆకర్షణ.
చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: మోహన భోగరాజు, ఎల్. వి. రేవంత్
ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...
తొణక్క బెణక్క వయసు తెరల్ని తీయ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా చేయ్ రా
మనోహరి... మనోహరి...
తేనిలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్ని మత్తు గున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...
చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్నా
నాటు కోడవల్లాంటి నడుమే రాసిచ్చెయ్నా
నీ కండల కొండలపైన కైదండలు వేసేయన
నాపై యెద సంపదనే ఇక నీ శయ్యగ చేసేయన
సుఖించగా రా...
ఆఁ... మనోహరి... మనోహరి…
పువ్వులన్నీ చుట్టూ ముట్టి తేనేజల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మె దై
ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింత లేలా బాల
ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...
Nippule Swasaga Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)
'Nippule Swasaga' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున అత్మారాముడు
రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై
Isvakulaku Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)
'Isvakulaku' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేద వ్యాస
గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు
అల్లా...
శ్రీ రామా...
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగ
అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా... ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపప మపనిప మపనిప మపసనిప మపమ
శ్రీ రామ
పాపప మపనిని పనిసస రిరిసనిప మపని మపమ
కోదండ రామ
మపనిసరి సని పనిపమ
సీతా రామ
మపనిసరి సరి సరిమరిస నిపమ
ఆనంద రామ
మామా రిమ రిమరి సరిమ
రామ జయ రామ
సరిమ
రామ
సపమ
రామ
పా వననామ
ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదె మల్పులేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు
తాగరా...ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
Idhigidhigo Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)
'Idhigidhigo' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా
Paluke Bangaramayena Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)
'Paluke Bangaramayena' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: ట్ట్రెడిషనల్
గానం: ప్రణవి
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
ప్రియగుహ వినివేధితపద రామ
శబరీ దత్త ఫలాశన రామ
ప్రియగుహ వినివేధితపద రామ
శబరీ దత్త ఫలాశన రామ
హనుమత్సేవిత నిజపద రామ
సీతా ప్రాణాదారక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
Bhadra Shaila Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)
'Bhadra Shaila' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and M. M. Keeravani.
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: జె. కె. భారవి
గానం: సునీత ఉపద్రస్ట
తండ్రి మాటను నిలుపగా
రాముండు అడవులకు పైనమయ్యే
నేను మీ బాటలోనే వస్తాను అనుచూ సీతమ్మ కదిలే
ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు
నీడనే వదిలి పెట్టి మీరెలా వెళ్లగలరనెను సీతా
Dhasaradhi Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)
'Dhasaradhi' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, ఉన్ని కృష్ణన్
తెలుగింటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి కుబురులోని కుహుకుహూల రాగమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
నయాగరా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది
జూలియెట్టు రోమియెల జంటలేల మనది
నల దమయంతిలోని పంతమే ఇది
డ్రీం లాండు నేల మీద ప్రేమ కాండ మనది
యదుకుల వీధిలోని ప్రణయమే ఇది
దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే
కాలం మారినా కన్నెతనం ఒక్కటే
చనువే పెరిగినా తనువే మరిగినా
సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే
వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా
పడమరమ్మ నుదుటి పైన మెరిసే సింధూరమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం
మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా
సీమరాణి రామరాజు దగ్గరైన సమయం
మనువుకు ప్రేమ తాడు సిద్దమే సుమా
అథిదిగా వచ్చినా అమృతమే ఇవ్వనా
హృదయం అర్చన ఈ క్షణమే చెయ్యనా
కరగని కాంక్షతో వదలని దీక్షతో
వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన
విజయ నగర వీధుల్లో మెరిసే రవి కిరణమా
వాషింగ్టన్ డి సి లో కురిసే హిమ చైత్రమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత మోహన్, యం.యం.కీరవాణి
ఇండియా బ్యూటిఫుల్ ఇండియా
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగిన హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల..ఖజురహోల..
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కృష్ణవేణి శిల్ప రమణి నర్తనం
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం
మళ్ళీ మళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, యస్.పి.బాలు
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం
ఆషాడాలు అంతమై మూఢాలన్నీ మాయమై
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
నైరుతి ఋతుపవనం మన కౌగిళికొచ్చి వెచ్చగా మారింది
పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి హారతులిచ్చింది
చిలుక గువ్వ చెబుతున్నాయి శకునాలు
మెరుపు మబ్బు జరిపించాయి తిరునాళ్ళు
విరహాలు వేమల్లు జరజర జరజర జరజర జరజర పారిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
కన్యారాశి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించింది
తారాచంద్ర బలం మన తోడే ఉంటూ తొందర పడమంది
నెమలి హంస పరిచేశాయి దైతాలు
నిమ్మ పనస అందించాయి తలదిండ్లు
సరసాల సల్లాపాలు చకచక చకచక చకచక చకచక సాగిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం
చూశారా చూశారా పాట సాహిత్యం
చిత్రం: పరదేశి (1997)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాల్గాడి శుభ, యస్.పి.బాలు
చూశారా చూశారా చూశారా
నా పరదేశిని ప్రియహాసిని అనురాగ సీమలోని ప్రేమసుమాన్ని
చూశారా చూశారా చూశారా
నౌ నో మోర్ గేమ్స్ లెట్ మి టీచ్ యు తెలుగు ఒకే..ఒకే
నేను నేను నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను
దట్ మీన్స్ ఐ లవ్ యు ఓ
రోజు రోజు నిన్ను నిన్ను పూజిస్తున్నాను పూజిస్తున్నాను
చెయ్యి చెయ్యి కలవనీ చెయ్యి చెయ్యి కలవనీ
వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ
జతలో తుదిలేని జతలో తుదిలేని
కథలే మొదలవనీ కథలే మొదలవనీ
హాయి రెమ్మల్ కోయిలమ్మల కొంటె పలుకుల నా
పరదేశిని సహవాసిని హృదయాన్ని దొచుకున్న సౌందర్యాన్ని
చూశారా మీరైనా చూశారా
రాగం రాగం భావం భావం మనమే కావాలి
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్
నో నో నో నో
మనమే కావాలి మనమే కావాలి
లోకం లోకం మొత్తం మొత్తం
మనదై పోవాలి మనదై పోవాలి
అందని చుక్కల సాక్షిగా అందని చుక్కల సాక్షిగా
ఈ కందిన చెక్కిలి సాక్షిగా ఈ కందిన చెక్కిలి సాక్షిగా
చెరిసగమవ్వాలి చరితగ మిగలాలి
జన్మ జన్మకు జోడు నేనని జోల పాడిన నా
దృవతారవి యువరాణివి తొలిప్రేమలోని తీపి తెలిపిన చెలిమివి
అమ్మా నువ్వైనా చూశావా
మీరు..నువ్వు చూశావా ..మీరు చూశారా
డిడ్ ఎనీ బడీ సీ హర్ ప్లీజ్ హా
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాల్గాడి శుభ, మనో
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
కరుణించవా నవలామని వరమియ్యవా సౌధామిని
ఓ..పరదేశి ఓ..పరదేశి
వన్నెలు కావని కిన్నెరసాని అలలేమో అలివేణి
ఇఫ్ యు వాంట్ టు లవ్ మి గెట్ అప్ ఆండ్ బూగీ
ఆండ్ మేక్ ఇట్ వోర్త్ యువర్ వైల్
యు హావ్ చార్మ్ ఆండ్ ఐ హావ్ బ్యూటీ
ఆండ్ వి బోత్ హావ్ అవర్ స్టైల్
నీ పసిమోము చంద్రం పై ఎద పాల సంద్రం యువరాణి
భారత సొగసుల రమణిమణి భారత యువకుని మనసుకని
అడుగులని ఇటు పడనీ తరుణి
ఓ..పరదేశి ఓ..పరదేశి
శ్యామల మేఘం నీ సిగచేరే గగనంలో పని మాని
దేర్ ఆర్ టాయ్స్ ఆండ్ దేర్ హావ్ ట్రెజర్స్
బట్ దేర్ ఆర్ దోస్ దట్ మస్ట్ బి ప్లెజర్స్
ఐ వుడ్ లైక్ సమ్ వన్ టు కమ్
ఆండ్ షేర్ మై డ్రీమ్స్ ఆండ్ ఫాంటసిస్
నీ మెడ ఒంపు చూసి తన తల దింపుకోనీ శంఖాన్ని
అమెరికా చలి చలి చెలిమి కని
తమరిక నా తొలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాణి
ఓ..పరదేశి ఓ..పరదేశి
చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నటీనటులు: అశ్వని నచ్చప్ప , భాను చందర్
దర్శకత్వం: T. S. B. K. మౌళీ
నిర్మాతలు: అట్లూరి రామారావు, రామోజీ రావు
విడుదల తేది: 12.03.1991
చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర
సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు
సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
నా ఫుడ్డు మానేసినా ఈ గుడ్డు తెచ్చానులే
చపాతీ కుర్మాలగా చమటోడ్చీ తెచ్చానులే
బొజ్జనిండ ఆరగించు బుజ్జి అమ్మడు
కండ దండిగుంటె పండగా
పెట్టుకున్న ఆశలన్నీ తీర్చు అమ్మడు
తీర్చకుంటె తిండి దండగా
తారలందు నీవె ఫస్టులే ఆశ్వని
సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
త్యాగాలూ నీకోసమే చేసేటీ వారుండగా
ప్రాణాలే నీకోసమే పంచేటీ వారుండగా
బుద్దిలేని బద్దకాలు మాను అమ్మడూ
నిన్న మాట నిండు సున్నగా
ఆకసాన సంతకాలు చెయ్యి ఇప్పుడూ
నింగి దాక వేసి నిచ్చెనా
రామబాణమల్లె సాగవే ఆశ్వనీ
సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు
సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
చెయ్ జగము మరచి పాట సాహిత్యం
చిత్రం : అశ్విని (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు
చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం
చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
నిదురపోనేల నింగినీనేల
అలుపురానేల గెలుపునిన్నేల
ఒడలు వంచాలి ఓడి గెలవాలి
కదలి రావాలి కాలమాగాలి
కలలు పండాలి గగన మందాలి
నేడు నీకిది జీవన విధానం
బ్రతుకు నవ్విన నందనం
నీదొక ఆగని ప్రయాణం
అడుగు దాటును యోజనం
చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
ఉడుకు పుట్టాలి ఊపు రావాలి
చెమట పిండాలి శ్రమలు పండాలి
మట్టిలో పుట్టి మణివి కావాలి
జనము చూడాలి జాతి మెచ్చాలి
మెదడుకే నీవు పదును పెట్టాలి
నేడు నీదొక నూతన పురాణం
విజయ విప్లవ కేతనం
నీవొక జీవన ప్రమాణం
ప్రగతికే అది చేతనం
చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం