Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Trishulam (1982)




చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణంరాజు, శ్రీదేవి, జయసుధ, రాధిక
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: యు. సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 22.12.1982



Songs List:



వెలుగుకు ఉదయం.. పాట సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా

వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా 

చరణం: 1 
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నీవు నేను మనమౌదాం.. నీవు నేను మనమౌదాం
మనమే మనకొక మతమౌదాం

వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా 

చరణం: 2
జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
జీవం పోసే రాగం కోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
నేను నేనను ఇద్దరము..  నేను నేనను ఇద్దరము
నిన్న రేపటి సంగమము 

వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా 




పెళ్ళంటె పందిళ్ళు.. పాట సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఆఆఆఆఆ.....
ఆఆఆఆఆఅ.....
ఆఆఆ.....
ఆఆఆఆఆఅ...
ఆఆఆఆ.....
ఆఆఆఆ.....
ఆఆఆఆ.....
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
పెళ్ళంటే...

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు
ఆ...ఆ...ఆ...ఆ.....

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

పెళ్ళైతే...

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు
ముగ్గులు.. ముత్తైదు భాగ్యాలూ....
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు..
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు..
ఆ...ఆ...ఆ...ఆ.....
పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు
ముత్తైదు భాగ్యాలూ....మ్మ్..మ్మ్..

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో
ఆ ఆ.. గోదారి ఒడ్డున..
గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ...
హృదయాలు పెదవుల్లో..
ఎరుపెక్కు ఏకాంత వేళల్లో
వలపు పులకింతలో..
వయసు గిలిగింతలో..
వింతైన సొగసుల వేడుకలో..
ఆ...ఆ...ఆ...ఆ.....
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ...
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు
ఆ...ఆ...ఆ...ఆ.....
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ..
ఆ.....ఆ.....

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో
ఆ... కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో


సిరిమువ్వ రవళుల మరిపించు
నీ నవ్వు సవ్వడిలో...

కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామగానాలము..
సరసరాగాలము
ప్రేమికులమన్న కులమున్న లోకంలో
ఆ...ఆ...ఆ...ఆ.....
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు
ఆ...ఆ...ఆ...ఆ.....
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ....
ఆ...ఆ...ఆ...ఆ.....
ఆ...ఆ...ఆ...ఆ.....
ఆ...ఆ...ఆ...ఆ.....
ఆ...ఆ...ఆ...ఆ.....



రాయిని ఆడది చేసిన రాముడివా పాట సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గాత్రం: యస్.పి.బాలు, పి.సుశీల

రాయిని ఆడది చేసిన రాముడివా 
గంగను తలపై మోసే శివుడివా 
రాయిని ఆడది చేసిన రాముడివా 
గంగను తలపై మోసే శివుడివా 
ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను

నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో నీవాడనుకో
తోడనుకో నీవాడనుకో

నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
అది కథే కదా
మన కథ నిజం కాదా
అది కథే కదా
మన కథ నిజం కాదా

రాయిని ఆడది చేసిన రాముడివా 
గంగను తలపై మోసే శివుడివా 
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో

ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్లు
నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు 
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు 
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
అది నువ్వే కదా
నేనూ నువ్వే కాదా
అది నువ్వే కదా
నేనూ నువ్వే కాదా

నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో





అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ పాట సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

పల్లవి:
అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ
ఏదో మత్తుందనీ మతే పోతుందనీ
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా
నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ
ఏదో మత్తుందనీ మతే పోతుందనీ
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా
అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ

చరణం: 1
ఒక్క క్షణంలో నాకే తెలియక ఏదో జరిగింది
సిగ్గు వచ్చి నా చెంప మీటితే ముద్దని తెలిసింది
ఒక్క క్షణంలో నాకే తెలియక ఏదో జరిగింది
సిగ్గు వచ్చి నా చెంప మీటితే ముద్దని తెలిసింది
నిన్ను చూసుకొని అనురాగానికి వేగం వచ్చింది
నిన్ను చూసుకొని అనురాగానికి వేగం వచ్చింది
కన్నె పెదవిపై ముద్ర వేసి అది హద్దును చెరిపింది
సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు
సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు
వలపుల తావులనీ వావీ వరసలనీ...

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ...

చరణం 2:
గాలి వీచితే పరవశమంది తీగే ఊగిందో
తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో...
గాలి వీచితే పరవశమంది తీగే ఊగిందో..ఓ..ఓ..
తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో
తేటి పాపకు ఆకు చాటునా పువ్వే విరిసిందో
తేటి పాపకు ఆకు చాటునా పువ్వే విరిసిందో
పువ్వు సొగసుకు తేటి గొంతులో పాటే పలికిందో
గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా...
గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా...
కలిసిన జంటలనీ... కలవక ఉండవనీ

నేను అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ
ఏదో మత్తుందనీ మతే పోతుందనీ
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా
నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ
ఏదో మత్తుందనీ మతే పోతుందనీ



అతడే వచ్చి (పద్యం) సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు


అతడే వచ్చి (పద్యం)



సుప్రభాతం సుప్రభాతం పాట సాహిత్యం

 
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

సుప్రభాతం సుప్రభాతం

Most Recent

Default