Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swayamvaram (1982)




చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి నారాయణరావు, రాజశ్రీ
నటీనటులు: శోభన్ బాబు, దాసరి నారాయణరావు, జయప్రద
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: డి.రామరాజు, డి. విజయరామరాజు
విడుదల తేది: 19.07.1982



Songs List:



నేనిక్కడా నువ్వక్కడా పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

చరణం: 1
చూపులతో రాశాను నీకు ఉత్తరం
ఊపిరితో చేశాను ప్రేమ సంతకం
చిరుగాలికి అందించాను నీకు ఇమ్మని
కలలోకైనా ఒకసారి రమ్మని
చేశాను చదివాను నీ జాబు
ఈ చూపుల్లో చదువుకో నా జవాబు

ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

చరణం: 2
ఇవి కానే కావు కలం రాతలు
కలకాలం నిలిచేటి తీపి భాషలు
చిగురశాలు కురిపించె ప్రేమ పత్రము
నిలవాలి ఎదలోన జీవితాంతము
మాటాడి వేటాడి నీ నవ్వులు
నా మదిలోన కురవని తేనెజల్లులు

ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను





ముసుగేసిన మబ్బులలో పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ముసుగేసిన మబ్బులలో
మసకేసిన పరదాలలో
దాగి దాగిన జాబిల్లి
ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి

అహ హా ఆ... అహ హా ఆ...

చరణం: 1
ఏ హృదయం నిను మార్చిందో
మనసు మార్చుకున్నావు
ఏ విధి నాపై పగబట్టిందో
తెరలు తెంచుకున్నావు
అవధులు లేని అనురాగానికి
అనుమానం పొగ మంచుఅని
మంచు కరిగిన మరు నిమిషంలో
అనురాగం ఒక కోవెలని
తెలియక తొందర పడ్డావు...
తెలియక తొందర పడ్డావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు

ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి

చరణం: 2
ఏ రాహువు నిను మింగిందో
కను మరుగై పోయావు
ఏ గ్రహణం నిను పట్టిందో
నను దూరం చేశావు
వెన్నెల కురిసే ఆకాశంలో
అమావాస్య ఒక నల్లమబ్బని
మబ్బు తొలగిన మారునిమిషంలో
వెన్నెలదే అకాశమని
తెలియక తొందర పడ్డావు...
తెలియక తొందర పడ్డావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు

ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి




హరివిల్లు పొదరిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం
నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం

సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం
నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం

ఆ ఆ ఆ  - ఓ ఓ ఓ

చరణం: 1
కలిరాకులు మొగ్గలుగా చివురాకులు పువ్వులుగా
అవి నీ చిరునవ్వులుగా మరేను
నెలవంకే జాబిలిగా జాబిలి వెన్నెలగా
అది నీ కొనచూపులుగా తోచేను
నీ చూపులలో నా నవ్వులలో
మధురములే పెరిగేను

సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం
నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం

చరణం: 2
నీ అలకే సింధూరం నీ పలుకే సంగీతం
నీ సొగసే అందాల బృందావనం
నీ మాటే మకరందం నీ మనసే మందారం
నీ ఎదలో అణువణువూ నా సొంతం
తియ తియ్యనిది వసి వాడనిది
మన ఇద్దరి అనుబంధం

హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం
నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం

సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం
నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం

ఆ ఆ ఆ  - ఓ ఓ ఓ





ఆకాశం ఎందుకో పచ్చబడ్డది పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి
రా రమ్మని పిలిచే పైబడి...

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి
రా రమ్మని పిలిచే పైబడి...

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది

చరణం: 1
పసుపు పచ్చ లోగిలిలో పసుపు కొమ్మ కొట్టినట్టు
నీలిరంగు వాకిలిలో పసుపార బోసినట్టు
పాదాల పారాణి అద్దినట్టు
పాదాల పారాణి అద్దినట్టు
నుదుటిపై కుంకుమ దిద్దినట్టు

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది

చరణం: 2
పచ్చా పచ్చని పందిరంత తాంబూలమేసినట్టు
విరబోసిన తలనిండ కనకాంబర మెట్టినట్టు
ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు
ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు
కర్పూరం హారతి ఇచ్చినట్టు

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడి
సాగే గువ్వల అలజడి
రా రమ్మని పిలిచే పైబడి...



గాలి వానలో... వాన నీటీలో...పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: కే. జే. యేసుదాస్

పల్లవి:
గాలి వానలో... వాన నీటీలో...
గాలి వానలో వాన నీటీలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!

గాలి వానలో వాన నీటీలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...

చరణం: 1
ఇది హోరు గాలి అని తెలుసూ...
అటు వరద పొంగు అని తెలుసూ...
ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ
హోరు గాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసూ...

చరణం: 2
అది జోరు వాన అని తెలుసూ...
ఇది నీటి సుడులని తెలుసూ...
అది జోరు వాన అని తెలుసూ
ఇది నీటి సుడులని తెలుసూ
జోరు వానలో నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు...
ఐనా పడవ ప్రయాణం...
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలెయదు పాపం... తెలెయదు పాపం!!

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...




ఇక్కడ ఎక్కడ పాట సాహిత్యం

 
చిత్రం: స్వయంవరం (1982)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఇక్కడ ఎక్కడ 

Most Recent

Default