-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema (1989) Telugu Songs Lyrics Album Cover

Prema (1989) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Prema (1989)
Banner : Suresh Productions
Music : Ilaiyaraaja
Director : Suresh Krissna
Producer : D. Suresh Babu
Actors : Venkatesh
Actresses : Revathi
Release Date : 12 January 1989

Priyatama Song Lyrics in Telugu – Prema (1989)

'Priyatama' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam. Lyrics are written by A. M. Rathnam.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : A. M. Rathnam
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై శృతిలయ లాగా జత చేరినావు నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా నీ పెదవి పైన వెలుగారనీకు నీకనులలోన తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నినుమింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా

Eenade Yedho Song Lyrics in Telugu – Prema (1989)

'Eenade Yedho' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర ఓ... ఓ... ఓ... ఓ... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాలా లోకం రమ్మంది ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ అదినా సొమ్మన్నదీ పరువాలు మీటి... న న న న న సెలయేటీ తోటి... న న న న న పాడాలి నేడు... న న న న న కావాలి తోడు... న న న న న న న న న న... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ ఎదలోని ఆశ... న న న న న ఎదగాలి బాసై... న న న న న కలవాలి నీవు... న న న న న కరగాలి నేను... న న న న న న న న న న... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాలా లోకం రమ్మంది ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది

You Are My Hero Song Lyrics in Telugu – Prema (1989)

'You Are My Hero' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Atreya.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Atreya
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ  గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర యూ ఆర్ మై హీరో

Ivvu Ivvu Oka Muddu Song Lyrics in Telugu – Prema (1989)

'Ivvu Ivvu Oka Muddu' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Atreya.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Atreya
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ  గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా  ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా  పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము మనసున పారే సెలయేరు ప్రేమ అలసట తీర్చే చిరుగాలి ప్రేమ హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా  ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా  పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటి పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు.... ఆహాహాహా...  ఒక్క ముద్దు... ఊహూహూ... ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను నీకు నేను సొంతము నాకు నీవు సర్వము నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను ప్రతిరేయీ నీ నెలవంక నేను జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే.. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా  ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా  పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు  ఇవ్వలేంది అడగవద్దు ఆ.. ఇవ్వు ఇవ్వు.. ఆహాహాహా..  ఒక్క ముద్దు.. ఊహూహూ..

Ekkada Ekkada Song Lyrics in Telugu – Prema (1989)

'Ekkada Ekkada' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Sailaja. Lyrics are written by Atreya.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Atreya
Singer : S. P. Sailaja
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ  గానం: ఎస్. పి. శైలజ ఎక్కడ ఎక్కడ

I Am Sorry Song Lyrics in Telugu – Prema (1989)

'I Am Sorry' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam. Lyrics are written by Atreya.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Atreya
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ  గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఐ యాం సారీ

Vantari Vaadini Nenu Song Lyrics in Telugu – Prema (1989)

'Vantari Vaadini Nenu' song from Prema (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam. Lyrics are written by Aatreya.

SONG INFORMATION
Movie : Prema (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Atreya
చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ  గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వంటరి వాడిని నేను

Most Recent

Default