Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Ramulayya (1998)





చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: పరిటాల సునీత
విడుదల తేది: 28.09.1999



Songs List:



భూమికి పచ్చాని పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కలేకురి
గానం: కె.జె.యేసుదాస్, చిత్ర, వందేమాతరం శ్రీనివాస్

భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
అలీ పుస్తిలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వల వల వల ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవిడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికోస్తే పండుగచేద్దామురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతారో అమ్మలాలా
చేలుదున్ని సాళ్ళు దీర్సే బీద బిక్కి జాతారో అమ్మలాలా
ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

చెమట జల్లుచిలకరిస్తే నేల పులకరించురో అమ్మలాలా
వానోస్తే భూతల్లి సీమంతామాడురో అమ్మలాలా
తంగేళ్ళు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా
పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో
గజ్జల మెతల్లో పల్లె పరవసించెనో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

దిగువా పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో
నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా




రాజ్యహింస పెరుగుతున్నాదో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: వందేమాతరం శ్రీనివాస్

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

బీటవారిన బీడు భూమిలో ధుమ్ము రేపిన ఇసుక దుబ్బలు
ధారలై పారిన సెమటతో ధాన్య రాసుల శుద్ధిజేసిన
రైతు కూలి నాపై కక్ష కట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

లెక్కలేని పోలీసు మూకల మరతుపాకుల నిచ్చి పంపి
పచ్చని పల్లెల్లో పేదల బ్రతుకులో చితిమంట రేపుతు
చిత్రహింసలు పెట్టుతున్నారో
ఏమెరుగనోళ్ల ఎదలపై గన్నులు మోపిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భర్తలను గుంజలకు కట్టి భార్యలను సెరబట్టి చెరిసిరి
పచ్చి బాలింతలును కూడా పట్టితెచ్చి చెరలో బెట్టి
తల్లిఒడి కడబాపినారమ్మో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భన్జరూసి భాయిజామా బలిసినోళ్ల మిగులు భూములు
పంచమని పేదోళ్లు ఒకటై చండబాపి చాండుగడితే
అరె బ్రతుకు చూపని దొరల రాజ్యంలో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

ఇన్ని హింసలు పెట్టి రాజ్యం ఎలెటోడని తింగ చూస్తాం
ఎలెటోడని తింగ చూస్తాం
చెమట తీయని ఊరి దొరలను సేలకడుగు పెట్టనీయం
సేలకడుగు పెట్టనీయం
పెద్దరీకం చేసే కంతిరి గద్దలానిక తరిమి కొడతాం
గద్దలానిక తరిమి కొడతాం
ఆక్రమించిన దొరల భూమిలో
అరక కట్టి సాల్ దోళుతాం
అరక కట్టి సాల్ దోళుతాం
డొక్కలల్లో గుండ్లు దిగినా దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం




నను గన్న నా తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: యస్. పి. బాలు, చిత్ర

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

వానగాలికి సీమ తానమాడినపుడు
వజ్రాలు ఈ నేల వంటిపై తేలాడు
పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు ఘనులున్న కుంగదీ తల్లీ పొంగిపోదమ్మా

కలియుగంబున నరులు ఓర్వలేరని తెలిసి
నల్ల రాయై వెలసి ఎల్లలోకములేలు
వెంకటాచలము భువైకుంఠ స్థలమో వైకుంఠ స్థలము
దర్శించినా జన్మా ధాన్యమౌతాదో పుణ్యమౌతాదో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే
కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట
పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో  జీవగడ్డమ్మో
ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా ఇక పతనమేరా
పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ
ఆధి గురువుల తపము నాచరించెను బిలము
హటకేశ్వర శిఖరమవని కైలాసం అవని కైలాసం
తనుకుతా వెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు
సీమ ఊరూరున మారు మ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో
వీరబ్రహ్మం ముఠము సీమకే మఖుటం సీమకే మఖుటం
పాలబుగ్గల నోట వేణువు మీటితే
ఆలమందలు కంచె బీళ్లు పరవశించు
నింగిలో చంద్రుడు తొంగిచుసితే  తొంగిచుసితే
సీమలో కోలాటమే సిందుతొక్కు చిరుగజ్జలాడు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

ఎత్తు బండరాళ్లు ఎర్రని దుప్పులు
పనుగు రాళ్ళ గట్లు పరికి కంపపొదలు
నెర్రెడ్డు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు
ఆరు తడుపుకు పెరిగే వేరు సేనగమ్మో వేరు సేనగమ్మో
నల్లమల్లడవుల్లోతెల్లబారే పొద్దు
అంబకేలకి సీమ మీదగ్గి కురిపించు
సందేపూట నుండి కొండ నీడల్లో కొండ నీడల్లో
సల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు అలసి నిదురించు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
ఓహో... ఓ ఓ ఓ... ఆహా హా హా  ఓ హే హా ఓ






ఘడియ ఘడియల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె.జె.యేసుదాస్, చిత్ర

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై
ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ
నేనెందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్యా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

పట్టేడంత అన్నమైన తినిపించలేకుంటిని
నిమిషమైన నిదురకుడా లేదాయె ని కంటికి

ని భర్త కోసమే ఆరాటపడరాదు
రాగిసంకటిలేని జనము ఉన్నది చూడు
గుండె గొంతుకలోన కొట్లాడుతుంది
తిరుగుబాటే బ్రతుకు బాట అవుతుంది
నేనుందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్య

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

ఎవరికొరకు ఎందుకొరకు సాగించుపోరాటము
ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము

గుండెలో బాధలను దాచుకోవాలి
న పోరు బాటలో నీతోడు కావాలి
పల్లెనే ఇల్లుగా నువ్వు చూసుకోవాలి
పంచాది నిర్మలకు చెల్లేవనిపించాలి
ని మాట కాదందునా నీతోడు నేనుండానా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ
కన్నీరు నింపకమ్మ కష్టాలు కలకాలం ఉండవమ్మా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై




కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కాలెకూరి ప్రసాద్
గానం: కె.జె.యేసుదాస్

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా

పారానింకా ఆరనేలేదు
తోరణాల కల వాడనే లేదు
తోరణాల కల వాడనే లేదు
పెళ్లి పందిరి తీయనే లేదు
అప్పగింతలు అవ్వనే లేదు
ఆఆఆఆ

గల గల పారే ఓ సెలయేరా
గల గల పారే ఓ సెలయేరా
పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి
స్మశానానికి కాపురమెళ్ళావా
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా

రాక్షస విలువలు రాజ్యమేలెడి
నరక ప్రాయపు సంఘం లోన
నరక ప్రాయపు సంఘం లోన
మానవ ధర్మం మంటగలిసెనా
మారణ హోమం జరుగుతున్నదా
ఆఆఆఆ

కల కళలాడిన ఓ నవ వధువా
కల కళలాడిన ఓ నవ వధువా
కోకిల మేధం సాగుచున్నదా
జీవన రాగం ఆర్తనాదమాయే
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాందులకే భలి అయి పోయావా

పాలపిట్టలె పాడవయేన
పల్లె గుండెలే తల్లడిల్లేనా
పల్లె గుండెలే తల్లడిల్లేనా
కదిలే కాలం ఆగిపోయిన
పొడిచే పొద్దుకు గుండె పగిలేనా
ఆఆఆఆ

పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
కారు మేఘములు కమ్మేసాయ
కాల సర్పమే కోరలు సాచిందా
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా




జోహారులు జోహారులు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
మా గుండెల చిరుదివ్వెలు
మా కన్నుల చిరు కాంతులు 

లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

సమాజంలో మనుషులు అందరూ
సమానంగా ఉండాలని చెప్పి
భూమి కోసం భుక్తి కోసం
మాతృదేశం విముక్తి కోసం
సాయుధ పోరాటం పంథాయే
సరైన మార్గం అని నమ్మి
ఊఱ్ఱి కొయ్యల పై ఉఉయ్యాల ఊగినట్టి

వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదన పరిపరి దండాలు
వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
పాద పాదన పరిపరి దండాలు

అన్నలారా తమ్ములార
అక్కలారా చెల్లెలరా
అహ్హ్
శూరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

తెలంగాణ మాగాణంలో
ఎర్రమందారాలై పూసి
ఓహోఓ
నక్సషల్ బారి ఆకాశంలో వసంత
మేఘాలై గర్జించి
శ్రీకాకుళం కొండల్లో
విప్లవ శంకలై ప్రతిదధ్వనించి
నెత్తుటి వరదలో
ఎర్రజెండాలై ఎగ్గిరినట్టి

వీరుల మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు
వీరుల మీఎకు ఎర్రరేరా దండాలు
పాద పాదాన పరిపరి దండాలు

అమ్మలారా అయ్యలారా
బిడ్డలారా కొడుకులారా
అహ్హ్
శూరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

రాయలసీమ కొండల్లో లవ ల రగిలి
ఊహూ
భూస్వాముల ఫ్యాక్షనిసిస్ట్ ల గుండెల్లో
బర్నాల్ అయి పెళ్లి
ఆహా
తూటా మీద తూటా దూసుకువస్తుంటే
సవును సవాలు చేసి గుండెను ఎదురొట్టి నిలిచినెట్టి

పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు
నే పాద పాదాన పరిపరి దండాలు
పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు
పాద పాదాన పరిపరి దండాలు

అమరులారా అన్నలారా దేరులారా యోధులారా
అహ్హ్
వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
అహ్హ్
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం
అహ్హ్





విప్ప పూలు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: శివ సాగర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

విప్ప పూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములన్ని
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా 
లహార్ జ్వాలా దారిలోన దాచిన పళ్లెములన్ని
నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా
గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
అరె రూపాయి కొండలోన కోసిన సిపాయి పీక
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా

ఒడ్డపాడు అరె ఒడ్డపాడు అరె ఒడ్డపాడు
పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
ఆవిరి కొండల కోణాల పారిన వీరుల రక్తం
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
ఉదయాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి
నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా
అరె జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రావెల్లి అమరత్వం
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా

రాయలసీమ అరె రాయలసీమ అరె రాయలసీమ
రాళ్లలోని రతనాల మాలలల్లి
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
అరె రక్త వసంతలాడే దండా కారణ్యమంతా
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
పాణిగ్రాహి కత్తి పాట మల్లి పసి పాప నవ్వు
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
అరె కైలాసం కళ్ళ వెలుగు వెంపటాకు చురుకు చూపు
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా




పోరాటాల రాములు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
పోరాటాల రాములు...
అ అ అ అ అ ఆ ఆ ఆ ఆ

ఆకలికి అన్నం దొరికే దారి చూపిన వాడా!
నీ హత్యకు ఉడుకుతుంది ఊరూరు వాడ వాడా
అందుకనే పేద రైతూ ఊ ఊ ఊ...
అందుకనే పేద రైతులేత్తినారు కత్తులు
రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు
రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం

బీద బిక్కి బడుగోలను కూడ గట్టి నిలిపినావు
సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు
సివాయి జమ భూముల్లో ఓ ఓ ఓ ఓ...
సివాయి జమ భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ
ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ
ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
పోరాటాల రాములు...



Most Recent

Default