Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vamshanikokkadu (1996)
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
నటీనటులు: బాలక్రిష్ణ, రమ్యకృష్ణ, ఆమని
దర్శకత్వం: శరత్
నిర్మాత: శ్రీమతి అనితా కృష్ణ
విడుదల తేది: 05.01.1996Songs List:సరదాగా సమయం గడుపు పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

హే.... హే...
సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు 
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో 
మనదేరా ప్రతి గెలుపు

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు 
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

ఈల వెయ్ గోల చెయ్ కాదనే దెవ్వరు
నీ హోరుకి నీ జోరుకి ఎదురు రారెవ్వరు
రాజులా రోజులే ఏలుదాం ఎప్పుడూ
డౌటెందుకోయ్ లేటెందుకోయ్
అదిరిపోనీ గురూ
తెగువ ఉంది మన గుండెల్లో
బిగువ ఉంది మన కండల్లో
చిటిక కొడితే ఇటు రమ్మంటే 
దిగి రాదా ఆ స్వర్గం హా

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు 
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

ఊర్వశి మేనకా ఊహాలో లేరురా
కావాలంటే క్యూలో వచ్చి హాజరవుతారురా
పూటకో పాటగా లైఫ్ సాగాలిరా
పగలు రేయి తేడాలేని పండగే చెయ్యరా
కులుకులొలుకుతూ సయ్యంటు
పడుచు పొగరు తక తయ్యంటే
ఎగసిపడిన శృంగారంతో ఉగాలిరా ఈ కైపు హేయ్

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు 
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో 
మనదేరా ప్రతి గెలుపు

దండాలో దండమండి పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

దండాలో దండమండి పాపల్లారో
దమ్ముంటే కాసుకొండె పైటల్లారో
అరె జబర్ధస్త్ గా ఖదం తొక్కుతా 
మజా చూడె పిల్లో
హుషారెక్కి నే శివాలెక్కితే 
బలాదూర్ బుల్లో
ఓరినాయనో గదేంది గట్ట నవ్వుతున్నడు
ఓరి దేవుడో గిదేంది గిట్ల గిచ్చుతున్నడు

దండాలో దండమండి పాపల్లారో
దమ్ముంటే కాసుకొండె పైటల్లారో

యమ యమ యమ యమ
దోమ కుడితే యమ పోతుపెడితే 
మనకొస్తుందోయ్ మలేరియా
ఓరయ్యో... సంభాలో
భామ కుడితే యమ ప్రేమపుడితే 
దాని పేరేమో లవ్వేరియా
ఓరబ్బా... అహ అహ అహ
నిదానిస్థి వంటే నిఖాఇస్తనయ్యో
పరిషాను చేస్తే ఫటఇస్తా బాయ్యో
గిర్రు గిర్రు మని బుర్రతిరిగి 
జర కిందబడితే అది కైపు
పడుచు వయసు తెగ
రెచ్చి రెచ్చి పడి చూపేదే ఊపు
గదేందిరో మీదపడ్డడు 
గిట్ల చేస్తే ఏమి చేస్తరయ్యో

దండాలో దండమండి పాపల్లారో
దమ్ముంటే కాసుకొండె పైటల్లారో

ఓయ్ గల్లిలంట పడి లొల్లి చేస్తే 
ఉకోడోయ్ సర్కారోడు
ఎవడాడు ఏడ్చాడు
జల్లగొట్టి ముంపల్లి బెడితే 
సమజౌతది నీకే చూడు
నరం నరం గుంటే గరం గరం జేస్తా
నఖరాలు పోతే చలో షరం తీస్త
ఏకులాగా నువు మెత్తగుంటివని
చేతి కిస్తిరో గ్లాసు
చాకు లాగ నీ చెంగు పట్టి
చూపిస్తనులే నా క్లాసు
గదేందిరో గట్ల గంటడు 
విడవకుంటే ఏమి చేస్త నయ్యో

దండాలో దండమండి పాపల్లారో
దమ్ముంటే కాసుకొండె పైటల్లారో
అరె జబర్ధస్త్ గా ఖదం తొక్కుతా 
మజా చూడె పిల్లో
హుషారెక్కి నే శివాలెక్కితే 
బలాదూర్ బుల్లో
ఓరినాయనో ఈ పోరగానికేమి జప్పను
ఓరి దేవుడో చెయ్ దొరకబడితే ఎట్ల చస్తను
వలచి వలచి వాత్సాయన పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

వలచి వలచి వాత్సాయన
నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
నడుము నడుమ నారాయణ
ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
అబ్బా మనసిస్తే మహోదయా
మనువైతే ఎలాగయ్య
సందిట్లో సడేమియా హొయ్

హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 
హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 

వలచి వలచి వాత్సాయన
నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
నడుము నడుమ నారాయణ
ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా

పొద్దువాలి వాలంగానే ముద్దమ్మత్త పేరంటం
వద్దుమీద ఒళ్లోకొచ్చే వలపమ్మత్త వయ్యారం
పుటకొక్క పువ్వే పెట్టి పుట్టించేదే శృంగారం
రోజుకొక్క కాజాకొట్టి కవ్వించేదే కళ్యాణం
పిట్టా కొట్టేలోగ రారా పట్టుతేనే లాగే వీర
కట్టు బొట్టు జారెలోగా ఒట్టు వేస్తా ఒడ్లో పాగా
పడుచు నిధి పడక గది కొసరి కొసరి చూస్తావా
అడగనది కడిగిమరి చిలకరిస్తావా

హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 
హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 

వలచి వలచి వాత్సాయన
నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
నడుము నడుమ నారాయణ
ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా

ఆకుమీద అందాలెట్టి ఆకళ్ళన్నో చూస్తావా
సోకులన్ని సోదాపట్టి ఆరాలన్ని తీస్తావా
కంటిమీద రెప్పే కొట్టి కౌగిళ్ళల్లో కొస్తావా
ఒంటిమీద ఒల్లే పెట్టి వాకిళ్లల్లో తీస్తావా
మొక్కజొన్న తోటల్లోన మొక్కుబడ్లు తీర్చుకోన
సన్నజాజి నీడల్లోనా చందమామలందుకోన
నడుము కసి విడమరిచి ఒడికి విడిది కొస్తావా
జడవిసిరి పెడనిమిరి పలకరిస్తావా

హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 
హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు

వలచి వలచి వాత్సాయన
నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
హోయ్ నడుము నడుమ నారాయణ
ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
అబ్బా మనసిస్తే మహోదయా
మనువైతే ఎలాగయ్య
సందిట్లో సడేమియా హొయ్

హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 
హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు 
అబ్బా దాని సోకు పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం
అమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం
చిలక పచ్చని చీరకు ముద్దు
అలక పెంచుకు పోతుంటే
కలవరింతల కంటికి ముద్దు
కౌగిలింతకు వస్తుంటే
జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం
ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం

పంపర పనసల పందిట్లో 
బంపర ఇరుకుల సందిట్లో
ఒంపులు వత్తిడి కుంపట్లో దాహం
గండర గండడి దుప్పట్లో
కండలు పిండిన కౌగిట్లో
గుండెలో దాగిన గుప్పెట్లో మొహం
గుస గుస పెరిగెను ఇప్పట్లో
సల సల ముదిరిన చప్పట్లో
మునుపసలెరుగని ముచ్చట్లో మైకం
తకదిమి తగునుడి తప్పెట్లో
ఎరుపుగ మారిన ఎన్నెట్లో
తేనెగ మారిన ఎంగిట్లో దాహం
నిన్ను నవిలేసి బుగ్గనెట్టు కోన
నిన్ను చిదిపేసి బొట్టుపెట్టు కోన
కన్నె గిలిగింత కంచెమేసి పోనా
కన్ను కలిపేసి గట్టుదాటి పోనా
జయహో - జతహో 
లయ హోరు పుడుతుంటే...

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం
ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం

చక చక లాడే చడుగుడులో 
నక నక లాడే నడుముల్లో
పక పక లాడే పడుచందాలు నీవే
మరదలు పిల్లా వరసల్లో
మగసిరి కొచ్చే వరదల్లో
కొలతలు రాని కోకందాలు నావే
పెర పెర ముద్దుగ పెదవుల్లో
గిర గిర లెక్కిన తనువుల్లో
తహ తహ లాడే తాంబూలాలే కాయం
మగసిరి పుట్టిన మంచుల్లో
సొగసరి వన్నెల అంచుల్లో
దులుక్కుపోయే దుడుకేనే ప్రాయం
కుర్ర ఈడంత కూడు పెట్టలేన
కన్నె సోకుల్లో గూడు కట్టలేన
మల్లె బజ్జిల ముద్దుపెట్టు కోన
గిల్లి కజ్జాల గీర లాడు కోన

జయహో - జతహో 
ప్రియ హోరు పుడుతుంటే...

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం
హో యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం
ఓయ్ చిలక పచ్చని చీరకు ముద్దు
అలక పెంచుకు పోతుంటే
కలవరింతల కంటికి ముద్దు
కౌగిలింతకు వస్తుంటే
జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా
ప్రియా మహాశయా లయా పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలో

ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా

తొలి తొలి బులబాటమేదో పులకరిస్తుంటే
అదే కదా కధ
ముఖా ముఖి మొగమాటమేదో ములకరిస్తుంటే
ఇదే పొద పదా
శృతి కలిసే జతై ఇలాగే మైమరిచే క్షణాలలో
ఎద సొదలె కధాకళీలై జతులడిగే జ్వరాలలో
చిలక ముద్దులకు అలక పాన్పులకు
జరిగిన రసమయ సమరంలో

చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
ప్రియా మహాశయా లయా చూపవేల దయా


మరీ మరీ మనువాడమంటు మనవి చేస్తుంటే
శుభం ప్రియం జయం
అదా ఇదా తొలి రేయి అంటూ అదుముకొస్తుంటే
అదో రకం సుఖం
చెరిసగమై మనం ఇలాగె పెదవడిగే మాజాలలో
రుచిమరిగే మరి ప్రియంగా కొసరడిగే నిషాలలో
ఒకరి హద్దులను ఒకరు వద్దు అను 
సరసపు చలి సరిహద్దులలో

ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలోయబ్బా నీ వాలు కల్లు పాట సాహిత్యం

 
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

హొయ్ యబ్బా నీ వాలు కల్లు హోయ్
జోడు పిస్తోలు గుళ్ళు
హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో 
తడితే నా గుండె ఝల్లు
అరె పాప సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక
ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక
అరె బుల్లో బులిపించుకొన
జిలో జిల్లో మురిపించుకొన

అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో 
తడితే నా గుండె ఝల్లు

హోయ్ దోరగుంది పండు 
అరె యమా యమా యమ్మా
సయ్యన్నదోయి దిండు
అరె యమా యమా యమ్మా
మెత్తగా మత్తుగా హత్తుకొరయ్యో 
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
ఆకు మీద ఒట్టు 
అరె యమా యమా యమ్మా
లోలాకు మీద ఒట్టు 
అరె యమా యమా యమ్మా
ఒద్దని అరిచినా వదలనే బుల్లో
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
దుడుకు దుడుకు పదును గురు చయ్యెద్దంటా
పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంటా
ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో
మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో
ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను హాల్లో అయ్యో

యబ్బా నీ వాలు కల్లు 
హొయ్ హొయ్ హొయ్ హొయ్
జోడు పిస్తోలు గుళ్ళు

హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మా
చెయ్యాలి ప్రేమ యాగం అరె యమా యమా యమ్మా
ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మా 
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
కొంటె కందిరీగ
అరె యమా యమా యమ్మా
కుట్టేక పుట్టే ప్రేమ
అరె యమా యమా యమ్మా
పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా

చురుకు చురుకు మెరుపు రధం లాగించనా
చిలిపి చిలిపి మధన జపం సాగించినా
మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో
వలపు తలుపు తెరిచి సరే అందామయ్యో
సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో

అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో 
తడితే నా గుండె ఝల్లు
అహ అహ యబ్బా నీ వాలు కల్లు హో
జోడు పిస్తోలు గుళ్ళు
వినమన్నా వినడంటా ఎట్టాగ చచ్చేదంటా
కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంటా
ఓమ్మో యమా రెచ్చినాడే
ఒయ్యో ఒళ్ళు నొచ్చినాడే
యబ్బా నీ వాలు కల్లు హో
జోడు పిస్తోలు గుళ్ళు
హ హ హ యబ్బా...


Most Recent

Default